dharma reddy
-
తిరుమల ‘లడ్డూ’ కుట్ర.. చంద్రబాబు తప్పులు ఒక్కోక్కటిగా బట్టబయలు
సాక్షి, తిరుపతి: కోట్లాదిమంది మనోభావాలు దెబ్బతినేలా తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించిన నెయ్యి విషయంలో చంద్రబాబు తప్పులు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఈ అంశంలో చంద్రబాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు కనిపిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం ఆగమేఘాలపై చంద్రబాబు పరమపవిత్రంగా భావించి తెప్పించిన నందిని నెయ్యిని.. గతంలో అనేక మార్లు కలుషితమైందని చెబుతూ వెనక్కి పంపారు. అది కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే.. కానీ నేడు నందిని నెయ్యి నాణ్యమైందని.. ఇక శ్రీవారి లడ్డు స్వచ్ఛంగా వస్తుందని ప్రగల్భాలు పలుకుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దెబ్బతీసేలా టిడిపి కూటమీ ప్రభుత్వం దుష్ర్ఫచారం చేస్తోంది. ఎలాగైనా వైఎస్సార్సీపీని దెబ్బతీసేలా కుట్ర చేస్తోంది. అయితే ఈ అంశంలో చంద్రబాబు పూటకోమాట, రోజుకో కట్టుకథ చెప్పి అడ్డంగా దొరికిపోతున్నారు. దశాబ్దకాలంగా టీటీడీ సరఫరా చేసిన నందిని నెయ్యిని 2015లో మొదటిసారి పక్కకు తప్పించింది బాబు ప్రభుత్వమే. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తన బుర్రలో తోచిందే చెప్పి.. అదే వాస్తవం అంటు నమ్మిస్తున్నారు. తన వాళ్ళతో, పచ్చ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీపై బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం. అందు కోసం దేవుడినే రోడ్డున పెట్టాడు చంద్రబాబు. గతంలో విషం! ఇప్పుడేమో..కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ వేశారు. నందిని డెయిరీతో పాటు మరికొన్ని డెయిరీలు టెండర్లో పాల్గొన్నాయి. కానీ అప్పటీ తెలుగుదేశం ప్రభుత్వం నందినీ డెయిరీ కాదని, మహారాష్ర్టకు, కర్ణాటకకు చెందిన డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నందినీ డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరిగింది. అందుకే ఆ డెయిరీని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందన్నది టీటీడీ చిట్టాలో లిఖించారు.. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న మురళీమోహన్ అప్పటిలో ఓ ఛానల్ ప్రతినిధిగా ఉన్నారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలునందినీ నెయ్యి పై వచ్చిన వివాదంపై మాట్లాడుతూ.. నందినీ నెయ్యిలో కలుషితం అయిందని, టీటీడీ నందినీ నెయ్యి వినియోగించి పవిత్రను మంటగలిపిందని ఆయన ఆరోపించారు. కానీ నేడు ఇదే ఎమ్మెల్యే మురళీమోహన్ నందిని నెయ్యి టీటీడీ ఎందుకు టెండర్ ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో టీటీడీ నెయ్యి సరఫరాకి టెండర్ పిలిస్తే నందినీ డెయిరీ టెండర్ పాల్గొనలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అప్పుడే మీడియా సమావేశం నిర్వహించి చెప్పారు. మరి టెండర్ పాల్గొనకుండా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు. వాస్తవాలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే స్థానంలో ఉండి అసత్యాలను చెప్పడం ఎంత వరకు సబబు?.గతంలో చంద్రబాబు హయాంలో నందీనీ డెయిరీ కొడ్ చేసిన ధరకు టెండర్ ఇవ్వనందునే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ పాల్గొనడం లేదని నందిని డెయిరీ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంతో తక్కువ ధరకు కోడ్ చేసి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. ఇది వాస్తవం.. తిరుమల శ్రీవారి చెంత ఎవరు తప్పు చేసిన దొరకడం ఖాయం.. కాకుంటే కాస్త ఆలస్యం అవుతుందేమో అంతే... కానీ ఆ దేవదేవుడు ఇచ్చే శిక్ష మాత్రం మరింత దారుణంగా ఉంటుంది. దానీ నుంచి తప్పించుకొలేరు. -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
‘జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం’
సాక్షి, తిరుమల: తిరుమనలో జనవరి 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాటాట్లాడుతూ.. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని చెప్పారు. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల: 2023 డిసెంబర్ నెలలో లక్షలాది మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం, లడ్డులా విక్రయాలు, తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు.. దర్శనం: శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య.. 19.16 లక్షలు. హుండీ : హుండీ కానుకలు.. రూ.116.73 కోట్లు. లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య .. ఒక కోటి 46 వేలు. అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య .. 40.77 లక్షలు. కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.. 6.87 లక్షలు. చదవండి: రామాయపట్నం 'రెడీ' -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
తిరుపతిలో 2 వసతి సముదాయాలు
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం జీఎస్టీ కాకుండా రూ.419.30 కోట్లతో టెండర్లను టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి సత్రం (రెండోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం (మూడోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు.. ♦ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మొదటిదఫా డిసెంబరు 28న 3,518 మందికి, రెండోదఫా జనవరి మొదటి వారంలో 1,500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ. ♦ మూడోదఫా ఫిబ్రవరిలో 5 వేల మందికి లబ్ధి చేకూరేలా ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి సేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదన. ♦ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. æ శ్రీవారి పోటు కార్మికులకు వేతనం మరో రూ.10 వేలు పెంపు ♦ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపు. ♦ టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు. ♦ ఇప్పటికే స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500 , సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుంచి రూ.15 వేలకు పెంపు. ♦ కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం. ♦ ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు ♦ వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షల ఆర్థిక సహకారం పెంపు. భగవద్గీత, గోవింద కోటి పుస్తకాల ఆవిష్కరణ శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీత లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనున్నారు. -
10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 23 నుంచి జనవరి 1 (10 రోజులు) వరకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4,23,500 టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లి, జీవకోనలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకె¯న్లు ఇవ్వనున్నట్లు వివరించారు. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు, డిసెంబర్ 31, జనవరి 1న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9–11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారికి ఉదయం 4.30 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలో గదులు పొందిన భక్తులు కాష¯Œన్ డిపాజిట్ స్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్సైట్లో కాషన్న్డిపాజిట్ రీఫండ్ ట్రాకర్‌ను పొందుపరిచినట్లు చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ప్రధానికి సాదర వీడ్కోలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు. -
తిరుమలలో కార్తీక దీపోత్సవం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయ్యాక ఈ దీపోత్సవాన్ని కన్నుల పండువగా చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీయోగనరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లలో నేతి ఒత్తులతో దీపాలు వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు. ఈ కార్తీక దీపోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు
తిరుపతి తుడా/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు చేశారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా, ఏడు విజయవంతమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో 15 మంది వైద్య బృందం శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్ రేట్ సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందుకోవడం అందుకు నిదర్శనమన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. అనంతరం గుండె మార్పిడి చేసుకున్న గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్(39)ను డిశ్చార్జి చేశారు. కాగా, అలిపిరి నడకమార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న ఒక విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణులు నివేదిక సమర్పించారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మండపం నిర్మాణం విషయమై కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. -
భానుప్రకాష్ రెడ్డిపై టీటీడీ ఈవో ఫైర్..
-
10న ఆన్లైన్లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు
తిరుమల: డిసెంబర్ 23–జనవరి1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను (రోజుకు 2 వేల టికెట్లు) నవంబర్ 10న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చెప్పారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకుగాను 4.25 లక్షల టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వివరించారు. డిసెంబర్ 23–జనవరి 1 వరకు చంటి పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్ఐ కోటా దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలని, ఈ టికెట్లను పొందిన వారికి మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుంచి) ఉంటుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 10–18 వరకు నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని, 24న చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌లో 21.75 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ.108.65 కోట్లు లభించిందన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గది పొందిన వారికి అది ఖాళీ చేసిన గంటలోపు, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి 3–7 పని దినాల్లోపు కాషన్ డిపాజిట్‌ను జమ చేస్తామని చెప్పారు. స్వామి వారి సేవలో ప్రముఖులు శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అక్టోపస్ అడిషనల్ డీజీ (ఆపరేషన్) ఆర్కే మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. -
స్వర్ణరథంపై శ్రీనివాసుడి వైభవం
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. -
తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి తిరుమల: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక దర్శనాలు రద్దు.. ►నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ►అక్టోబరు 19న గరుడసేవ, ►20న పుష్పక విమానం, ►22న స్వర్ణరథం, ►అక్టోబర్ 23న చక్రస్నానం ►అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతి లేదు. ►3,500 మంది పోలీసులు, 1500 విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ►గడ్డ వాహనానికి అదనపు భద్రత ►భక్తులందరికి గరుడోత్సవం దర్శనానికి టీటీడీ ప్రత్యేక కార్యాచరణ ►రెండు లక్షలమంది గ్యాలరీలో వాహనా సేవలు వీక్షించేలా చర్యలు ►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటలు వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఊరేగింపు ►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రథోత్సవానికి బదులుగా బంగారు తేరు ►ధ్వజారోహణ ఉండదు సర్వ దర్శనానికి 8 గంటలు.. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 27,388. బుధవారం స్వామి వారి హుండీ అధాయం 3.74 కోట్లుగా ఉంది. -
అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవీ ముంబయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమలలోని సింఘానియా గ్రూప్‌తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమాండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈవో మాట్లాడుతూ.. ముంబయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిరి్మంచేందుకు ఓ దాత ముందుకొచ్చారని తెలిపారు. -
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల: అక్టోబర్ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ చేయనున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తేదీల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశామన్నారు. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని చెప్పారు. 29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి తిరిగి 29న తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తామని చెప్పారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి 29న ఉదయం 9 గంటలకు తెరుస్తామన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి ఖాళీ చేసిన గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతామని, అయితే ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3–7 పనిదినాలు పడుతుందన్నారు. సెపె్టంబర్లో శ్రీవారిని 21.01 లక్షలు మంది దర్శించుకున్నారని, హుండీలో రూ.111.65 కోట్లు వేశారని చెప్పారు. -
తిరుమల: అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. కుడి వైపు ఉన్న రాతి మండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన.. రాతి మండపాలను యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్ నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని అన్నారు. అటవి జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సి.సి కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు -
కొండంత భక్తి!
తిరుమల: తమిళనాడు వాసులకు పవిత్రమైన పెరటాసి మాసం ఓ వైపు, మరోవైపు అక్టోబర్ 2 వరకు వరుస సెలవులు రావడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద వర్సిటీ వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రోడ్డుకిరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తోన్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. క్యూల్లో ఉన్నవారికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 2,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందిస్తున్నారు. సెపె్టంబర్ 30 నాటికి శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఈ విషయమై పలు భాషల్లో ప్రకటనలు చేస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని టీటీడీ తెలిపింది. -
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. -
తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. ఇదీ చదవండి: ‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం -
చంద్రగిరిలో 1,060 భారీ వినాయక విగ్రహాల పంపిణీ
తిరుపతి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పేపర్, బంకమట్టితో తయారు చేసిన 1,060 భారీ వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని తిరుచానూరు మార్కెట్ యార్డులో శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లెలకు చెందిన యువకులు స్థానికులతో కలిసి వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సంకల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా విగ్రహాల కోసం 1,060 వినతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికొచ్చాయి. దాదాపు 25 వేల మంది యువత ఇందులో భాగస్వాములవుతున్నారు. పల్లెల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించాలని గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వినాయక విగ్రహాలను సొంత నిధులతో తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన నిపుణులైన 160 మంది కార్మికులు ఏడు నెలలుగా నిర్విరామంగా శ్రమించి వీటిని తయారు చేశారు. ప్రతి సచివాలయానికి పది చొప్పున పల్లెలకు పంపించేందుకు సిద్ధం చేసిన విగ్రహాలతో కూడిన వాహనాలను ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిని తీసుకెళ్లేందుకు నియోజకవర్గంవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది యువకులు విగ్రహాల పంపిణీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సాటి మరెవరూ లేరని కొనియాడారు. హిందూ ధర్మాన్ని పెంపొందించేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా, మట్టి విగ్రహాలను ఆదివారం నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. -
తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి
తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని పార్కులు, ఆస్థాన మండపాలు, అన్నదాన సత్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, మాడవీధులు విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన సర్కిళ్లలో ఎటు చూసినా దేవతామూర్తుల భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ వేదిక వద్ద భక్తులకు కనువిందు చేసేలా స్వామివారి పాదాలను ఏర్పాటు చేశారు. అనంతపద్మనాభ స్వామి నమూనా ఆలయాన్ని కళ్లు చెదిరేలా ఏర్పాటు చేశారు. ఇసుకతో స్వామివారి ముఖచిత్రాలను కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. గరుడ సేవ రోజున సంతృప్తికర దర్శనం: ఈవో ధర్మారెడ్డి తిరుమలలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహన సేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి రెండు గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని వివరించారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వాహనసేవ వీక్షణకు టీటీడీ చర్యలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు. ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ -
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అష్టవినాయక అతిథిగృహంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన టికెట్లు. అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. త్వరలో తిరుచానూరులో మహా వరుణయాగం ఉంటుంది. అష్ట వినాయక అతిథిగృహాంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తాం. వికాస్ నిలయంను ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి తెస్తాం. స్వామివారి అభిషేకానికి కావాల్సిన నెయ్యి తిరుపతి గోశాల నుంచే వస్తోంది. వచ్చే ఏడాదికి గోశాలలో నెయ్యి ప్లాంట్ సిద్ధం చేస్తాం. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 22.25 లక్షలు. ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.085కోట్లు. ఆగస్టు నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 9.07లక్షలు. ఆగస్టు నెలలో లడ్డూ విక్రయాలు 1.09కోట్లు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు 43.07లక్షలు అని తెలిపారు. ఇది కూడా చదవండి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 22న గరుడవాహనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో జరుగుతన్న మండపం పునఃనిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఆలయ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.#Tirupati #tirumalatirupati #tirumala #ttd #ttdchairman pic.twitter.com/9wEDI8BiSs — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) August 31, 2023 ఇదిలా ఉండగా.. రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్ భూమన -
వేగంగా, సులభంగా భక్తుల లగేజీ నిర్వహణ
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని, సెల్ఫోన్లను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు.. బాలాజీ బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో మంగళవారం సీవీఎస్వో నరసింహ కిశోర్‌తో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన విధానంలో లగేజీ, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులను డిపాజిట్ చేస్తే.. ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా సులభంగా పొందవచ్చన్నారు. భక్తులు కౌంటర్ వద్ద లగేజీ ఇవ్వగానే.. వారి వద్ద ఉన్న దర్శన టికెట్‌ను స్కాన్ చేసి వాటి వివరాలను ఎల్రక్టానిక్ డివైస్‌లో నిక్షిప్తం చేస్తామన్నారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్‌కు ఆర్‌ఎఫ్‌ఐడీతో కూడిన ట్యాగ్ జతపరిచి క్యూఆర్ కోడ్ రసీదు ఇస్తామని చెప్పారు. ఫోన్ డిపాజిట్ కోసం దర్శన టికెట్‌తో పాటు భక్తుల వివరాలు సేకరిస్తామని తెలిపారు. భక్తులకు వారి లగేజీ గురించిన సమాచారం మెసేజ్ రూపంలో అందుతుందన్నారు. భక్తుల రసీదును ఎల్రక్టానిక్ డివైస్‌తో స్కాన్ చేసిన వెంటనే వారి మొబైల్, లగేజీ భద్రపరిచిన ర్యాక్ నంబర్ తెలుస్తుందని.. తద్వారా సులభంగా లగేజీ తిరిగి పొందే అవకాశం లభించిందన్నారు. తిరుమలలో 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. నూతన విధానం కోసం చెన్నైకి చెందిన చార్లెస్ మార్టిన్ రూ.2 కోట్లు, బెంగళూరుకు చెందిన వేణుగోపాల్ రూ.కోటి, హైదరాబాద్‌కు చెందిన ట్రాక్ ఇట్ సంస్థ సీఈవో వేదాంతం సోమశేఖర్ రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారని నరసింహ కిశోర్ తెలిపారు. సమావేశంలో అధికారులు బాలిరెడ్డి, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల: ‘చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం: భూమన ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు. టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు: ధర్మారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘చిరుతలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి నిపుణుల బృందాన్ని తిరుమలకు పిలిపించాం. భక్తులకు కర్రలు ఇవ్వడంతో వారికి సహాయంగా ఉంటుంది. వందలాది మంది భక్తులు కర్రలతో పాదయాత్ర చేయడంతో జంతువులు దరిచేరవు. సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు’ అని అన్నారు. చిరుతల కోసం మరో ఆరు బోన్లు.. ఈ సందర్బంగా సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టుబడ్డ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుంది. చిరుతకు జూపార్క్‌లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాం. చిక్కిన చిరుతల్లో చిన్నారిపై దాడి చేసిన చిరుతను గుర్తించాలి. చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లో ఉంచుతాం. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు నూతన బోన్లు కొనుగోలు చేస్తున్నాం. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రతీరోజు పరిశీలిస్తున్నాం. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రదేశాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కదలికలు కూడా గుర్తించాం. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు! -
తిరుమలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
TTD: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన
సాక్షి, తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది టీటీడీ. తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు ముందువైపు, వెనుకవైపు రోప్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
అలిపిరి నడక మార్గంలో పటిష్ట బందోబస్తు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం అత్యవసర సమావేవేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చిరుత దాడి విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిన్నారిపై దాడి బాధాకరం: ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలిపిరి నడకమార్గం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేతపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నడక దారిలో ప్రతి 40 అడగులకు సెక్యూరిటీ ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు చిన్న పిల్లలతో వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిరుత దాటి ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించాని తెలిపారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలకు బైక్స్ నిలిపి వేయాలని సూచనలు వచ్చాయని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు. చదవండి: ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది? దాడి చేసింది చిరుతనా లేదా ఎలుగబంటినా? బాలికపై చిరుత దాడికి పాల్పడిన ఘటనా స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వర రావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్ పరిశీలించారు. దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు. దాడి చేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధిస్తామని చెప్పారు. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తామని తెలిపారు. 7వ మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తున్నామని అన్నారు. కాగా తిరుమలలోని అలిపిరి కాలి బాటలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చెందిన దినేష్ కుమార్, శశికళ కుమార్తె లక్షిత శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. చిరుత దాడిని గుర్తించని తల్లిదండ్రులు.. నడకదారిలో చిన్నారి కోసం వెతగ్గా దొరకలేదు. నిన్న రాత్రి పోలీసులకు లక్షిత తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చే పట్టారు. శనివారం ఉదయం నడక దారిలో లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి..ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన. ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన. పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు. -
ఆలయ నిర్వహణలో ప్రపంచానికే టీటీడీ దిక్సూచి
తిరుమల: ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించి అరగంట పాటు ధర్మారెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఆలయాలు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలని, భక్తులకు సులభంగా దర్శనం, చక్కటి వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను టీటీడీ పెద్దఎత్తున చేస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ ఉందన్నారు. పురాతన ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. భక్తులు దాదాపు రూ. 900 కోట్లు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు రూ. 330 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఏడాదిన్నర కిందట ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 1,600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. చిన్నపిల్లలకు కార్డియాలజీతో పాటు ఇతర విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. టీటీడీ విశిష్ట సేవలు టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్, అనాథ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయని ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవా విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. శ్రీవారికి నైవేద్యం కోసం గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నామని తెలిపారు. కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం, వేంకటేశ్వర వైభవోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమం, విషూచిక మహామంత్రంతో పారాయణాలు ప్రపంచ భక్తుల దృష్టిని ఏ విధంగా ఆకర్షించాయో వివరించారు. టీటీడీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్ సేవలపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని కొనియాడారు. టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఆయన ప్రస్తుతించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డిని సమ్మేళనం చైర్మన్ ప్రసాద్ మినేష్ లాడ్, టెంపుల్స్ కనెక్ట్ వ్యవస్థాపకులు గిరీష్ కులకర్ణి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని, ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
తల్లి చిరుత దొరికేవరకూ ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామన్న టీటీడీ
-
‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. ఈ ట్రస్టుకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటవుతుందన్నారు. ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టిక్కెట్‌కు వేర్వేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాదిమంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం అవాస్తవం శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీవిరజానందస్వామి, హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమత్‌పీఠం పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాదస్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు.. ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి.. వడ్డీ ఎంత వచ్చింది.. తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్లు పక్కాగా ఉన్నాయి హైదరాబాద్‌కు చెందిన సోలిస్ ఐకేర్ ఎండీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీధర్‌రావు, మురళి, దీపక్‌రెడ్డి, శ్రీనివాస్, సుబ్బన్న, సురేష్, కుమారస్వామి, టీటీడీ వీజీవో బాలిరెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దు సనాతన హిందూధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు మీడియా సమావేశంలో ప్రశంసించారు. విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దని కోరారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం.. ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మికసంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్కపైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. -
తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి
తిరుమల: తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తింపు. జరిగిన విషయం తెలియడంతో టిటిడి ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ధర్మారెడ్డి సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌కు చెందిన న్యూరో స్పెషలిస్ట్‌లు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
టీటీడీ ఈవో ధర్మరెడ్డి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్న భక్తులు
-
సీఎం వైఎస్ జగన్ కు కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో
-
తిరుమలలో శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
కరీంనగర్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.09 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 39.4 కోట్ల ముండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. 2022లో 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ. 1,450 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఈనెల 28న రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. వీఐపీలకు కేటాయించే 170 గదులకు మాత్రమే ధరలు పెంపుజరిగినట్లు తెలిపారు. త్వరలో కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. 10 ఎకరాల స్థలంలో నిర్మాణం జరగున్నట్లు పేర్కొన్నారు. -
Fact Check: టీటీడీ వసతి గదులకు సంబంధించిన వాస్తవాలు ఇవి
సాక్షి, తిరుమల: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు. భక్తులకు నిజాలు తెలియాలి అనే ఉద్ధేశ్యంతోనే వివరాలు తెలియజేస్తున్నామన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మొత్తం 7500 గదులు ఉన్నాయి. అందులో 5000 గదులు 50 రూపాయలు, 100 రూపాయలు టారిఫ్ తో భక్తులకు టీటీడీ వారు అందిస్తున్నారు. అంటే 75% సామాన్య భక్తులకు అందుబాటులోనే టీటీడీ వారు సౌకర్యవంతమైన వసతులను అందిస్తున్నారు. ఈ 5000 రూములను ప్రస్తుత ప్రభుత్వం మరియు ప్రస్తుత టీటీడీ ట్రస్ట్ బోర్డు 120 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ పనులను చేపట్టి, దిగ్విజయంగా పూర్తి చేసి, ఒక రూపాయి కూడా అదనంగా అద్దెను పెంచలేదు. అదేవిధంగా 1250 గదులు ₹1000 టారిఫ్ తో ఉండేటివి ఎవరైతే ఆన్లైన్ ద్వారా 300 రూపాయల ఎస్.ఈ.డి దర్శనాలు బుక్ చేసుకుంటారో వారికి అడ్వాన్స్ ఆన్లైన్ అకామిడేషన్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకునేందుకు గాను ఈ 1250 గదులను అందుబాటులో ఉంటాయి. మిగతా 1250 గదులు తిరుమలలోని పద్మావతి ఏరియాలో వివిఐపిల కేటాయింపుల కోసం ఉంచబడినవి. వివిఐపిలకు కేటాయించబడిన ఈ 1250 గదులలో 170 గదులకు మాత్రమే ఏర్ కండిషన్ (ఏసి) లాంటి వసతులు లేకపోవడం, వాటిని ఆధునికరించడంలో భాగంగా ఏసీలు, గీజర్లు, వుడెన్ కబోర్డ్స్, కాట్స్ లాంటివి సుమారు 8 లక్షలు ఒక్కొక్క గదికి వెచ్చించి పద్మావతి ఏరియాలో మిగతా రూముల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా ఉండేలా ఈ 170 గదులని కూడా ఆధునీకరించడం జరిగినది. అదేవిధంగా పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే మిగతా రూములకు ఏ విధంగా ధరలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఆధునికరించిన 170 గదులకు కూడా ధరలు నిర్ణయించడం జరిగినది. ఈ ఆధునికరించిన 170 గదులు ఆల్రెడీ వివిఐపీలకు కేటాయిస్తున్న రూములే తప్ప సామాన్యులకు కేటాయించే గదులు కావు. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కూడా ఉండదు. పై వాటితో పాటు 15,000 మంది సామాన్య భక్తులు ఉచితంగా ఉండేందుకు, వారికి లాకర్లతో పాటు తిరుమలలో యాత్రికుల సౌకర్యాల సముదాయం (పి.ఎ.సి) నాలుగు ఉన్నాయి. గత బోర్డులో ఇంకా 5000 మంది సామాన్య భక్తుల వసతి సౌకర్యం కల్పించడం కొరకు ఇంకో పి.ఏసి.ని నిర్మించుటకు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, నిర్మాణం కూడా మొదలుపెట్టింది టీటీడీ యాజమాన్యం. ఏదైతే సామాన్య భక్తుల కొరకు కేటాయించే 50 రూపాయలు, 100 రూపాయలు అద్దెలతో ఉన్న వసతి సముదాయాలనుకు ఎటువంటి అద్దెలు పెంచకపోగా 120 కోట్లు వెచ్చించి అధునీకరించారు. ఇంకో 100 కోట్లు అదనంగా వెచ్చించి సామాన్య భక్తులకు ఉచితంగా వసతిని అందించేందుకు గాను మరో పీఏసీ ని కూడా నిర్మిస్తున్న టిటిడి యాజమాన్యం. ప్రస్తుతం అద్దెలు పెంచింది పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే 170 ఆధునికరించిన గదులకు మాత్రమే పెంచారు తప్ప, సామాన్య భక్తులకు కేటాయించే గదులకు సంబంధించిన అద్దెలులో ఒక రూపాయి కూడా పెంచలేదు. దీనిని కొందరు రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి తిరుమల శ్రీవారి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. చదవండి: (సికింద్రాబాద్ టు విశాఖ.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలివే..) -
ధర్మారెడ్డికి వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, నంద్యాల(జూపాడుబంగ్లా): పుత్రశోకంతో బాధపడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. మంగళవారం ఆమె ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు చేరుకొన్నారు. ముందుగా ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలువేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ విజయమ్మ పారుమంచాలకు వస్తున్నారనే విషయం తెలిసి గ్రామస్తులు తండోపతండాలుగా ధర్మారెడ్డి ఇంటివద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే గ్రామస్తులు ఆనందంతో కేకలువేస్తూ అభివాదం చేశారు. చదవండి: (టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ) -
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, నంద్యాల: టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి కుమారుడు ఏవీ చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. చంద్రమౌళి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురికావడంతో.. ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. అయితే, చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లి.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు.. చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. -
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
-
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడి నేత్రదానం
సాక్షి, తిరుమల: తాను కన్నుమూసినా.. మరొకరికి చూపునివ్వాలన్న సంకల్పంతో టీటీడీ ఈఓ కుమారుడు నేత్రదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీటీ డీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి బుధవారం ఉదయం చెన్నై కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌తో కావేరి ఆస్పత్రిలో చికిత్సకోసం చేరారు. (టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి) క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆయన్ను కాపాడడానికి వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళిరెడ్డి గతంలోనే నేత్రదానానికి అంగీకారం తెలుపు తూ సంతకం చేసినందువల్ల అతని కోరిక మేరకు ఆయన కళ్లను వైద్యులు సేకరించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నంద్యాల జిల్లా, నందికొట్కూరు సమీపంలోని పారు మంచ గ్రామంలో చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చంద్రమౌళి రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చదవండి: (తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ) -
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం.. గవర్నర్, సీఎం సంతాపం
సాక్షి, చెన్నై/జూపాడుబంగ్లా/సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి పుత్రశోకం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్ శివ (28) చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు కన్నుమూశారు. ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. చెన్నైలో బీటెక్ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందిస్తున్నామని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు సోమవారం బులెటిన్ ద్వారా తెలిపాయి. ఈ సమాచారంతో పెద్దసంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖులు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు, అధికారులు, సన్నిహితులు కావేరి ఆస్పత్రికి చేరుకుని ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మూడురోజుల పాటు చంద్రమౌళికి వైద్యులు అత్యవసర వైద్యచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన బులెటిన్‌ను ఆస్పత్రివర్గాలు 11 గంటల సమయంలో విడుదల చేశాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, మాజీ మంత్రులు, పలువురు «ప్రముఖులు ధర్మారెడ్డిని ఓదార్చారు. చంద్రమౌళి కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. చంద్రమౌళి మృతితో పారుమంచాల గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం గ్రామంలోని వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్, సీఎం సంతాపం: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు. ధర్మారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: (Vijayawada: గల్ఫ్ సర్వీసులకు డిమాండ్ ఫుల్) -
కోర్టు ధిక్కార కేసులో.. టీటీడీ ఈఓకు జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టు నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారంపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 27లోపు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ధర్మారెడ్డిని ఆదేశించింది. అనంతరం ఆయన్ను జైలుకు పంపాలని రిజిస్ట్రార్‌కు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మంగళవారం తీర్పు వెలువరించారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011 జనవరిలో టీటీడీ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిని రద్దుచేయడంతో పాటు ప్రోగాం అసిస్టెంట్లుగా తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా టీటీడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 13న తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దుచేశారు. అలాగే, పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ టీటీడీ అధికారులను ఆదేశిస్తూ తీర్పుచెప్పారు. కానీ, ఈ తీర్పుపై టీటీడీ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలుచేయడంలేదని కొమ్ము బాబు తదితరులు ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. టీటీడీ అధికారులు కౌంటర్ దాఖలు చేస్తూ, సర్వీసు క్రమబద్ధీకరించాలన్న ఉత్తర్వులపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశామని, అందువల్ల ఆ ఉత్తర్వులను అమలుచేయలేకపోయామని చెప్పారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అప్పీల్ పేరుతో టీటీడీ అధికారులు ఆరు నెలల గడువు తీసుకున్నారని.. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్నారు. ఒకవేళ తమ ఉత్తర్వుల అమలుకు మరింత గడువు కావాలనుకుని ఉంటే, ఆ విషయంలో కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఉండొచ్చునన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు ధర్మారెడ్డిని బాధ్యుడిగా చేస్తూ అతనికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. జస్టిస్ మన్మథరావు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే మరోవైపు.. సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ ఏడాది ఏప్రిల్ 13న జస్టిస్ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లంచ్‌మోషన్ రూపంలో టీటీడీ అధికారుల అప్పీల్‌ను మంగళవారం ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. సత్యనారాయణ ప్రసాద్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. అలాగే, ఇదే కేసులో జైలుశిక్ష విధిస్తూ జస్టిస్ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ధర్మారెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ శేషసాయి ధర్మాసనం, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
వెంకన్న వద్ద 10,258.37 కిలోల బంగారం
సాక్షి, అమరావతి, తిరుమల: తిరుమల శ్రీవారి మిగులు బంగారం, నగదు డిపాజిట్లన్నీ ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో భద్రంగా దాచినట్లు టీటీడీ తెలిపింది. వెంకన్న ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తరచూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులో దాచిన బంగారం, బ్యాంకు డిపాజిట్లపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఏ బ్యాంకులో ఎంత బంగారం, డిపాజిట్లు ఉన్నాయన్న వివరాలను అందులో వెల్లడించారు. మూడేళ్లలో రూ.2,913.59 కోట్లు పెరిగిన డిపాజిట్లు ప్రస్తుతం 24 బ్యాంకుల్లో స్వామి వారి పేరిట రూ.15,938.68 కోట్లు డిపాజిట్లుగా ఉన్నట్లు టీడీపీ శ్వేతపత్రంలో వెల్లడించింది. 2019 జూన్ 30వతేదీ నాటికి రూ.13,025.09 కోట్లు ఉండగా కరోనా లాంటి అవాంతరాలు ఎదురైనా మూడేళ్లలో బ్యాంకుల్లో స్వామి వారి నగదు నిల్వ రూ.2,913.59 కోట్లు పెరగడం విశేషం. అత్యధికంగా రూ.5,358.11 కోట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో డిపాజిట్లున్నాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.50.77 కోట్లు స్వామి వారి నగదు బ్యాంకు డిపాజిట్లుగా ఉండగా ఇప్పుడు వాటిని ఇతర జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.1.30 కోట్లు మాత్రమే స్వామి వారి డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది. 95% మిగులు బంగారం ఎస్బీఐలోనే.. 2019 జూన్ 30 తర్వాత బ్యాంకుల్లో స్వామి వారి మిగులు బంగారం నిల్వలు 2,918.63 కిలోలు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. 2019 జూన్ 30 నాటికి 7,339.74 కిలోల బంగారం బ్యాంకుల్లో ఉండగా ఇప్పుడు 10,258.37 కిలోలకు పెరిగింది. భక్తులు స్వామి వారి హుండీలో సమర్పించే బంగారు కానుకలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మింట్‌లో కరిగించిన అనంతరం నిల్వలను 12 ఏళ్ల కాలానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో బ్యాంకుల్లో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారి మిగులు బంగారంలో 95 శాతం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో దాచినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు శ్రీవారి బంగారం, నగదు డిపాజిట్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్లుగా సాగిస్తున్న ప్రచారాన్ని భక్తులెవరూ విశ్వసించవద్దని టీటీడీ శ్వేతపత్రంలో విజ్ఞప్తి చేసింది. 2019 తర్వాత స్వామి ఆస్తులను భద్రపరచే అంశంపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు వివరించింది. కరోనా సమయాల్లోనూ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని స్వామివారి ఆదాయం పెరుగుదలకే చర్యలు చేపట్టిందని, మంచి పేరున్న జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఆస్తులను భద్రపరుస్తున్నట్లు తెలిపింది. జాతీయ బ్యాంకుల్లోనే.. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వదు. చైర్మన్, టీటీడీపై బురద చల్లేందుకు కొందరు హిందూ మత వ్యతిరేకులు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా రూ.15,900 కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇకపై కూడా వడ్డీ ఎక్కువ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో -
అంగరంగ వైభవంగా గరుడోత్సవం
తిరుమల: విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్టు పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలు (గొడుగులు) అలంకరించారు. గరుత్మంతుడితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి తరించిన లక్షలాది మంది భక్తులు ఆనంద పరవశులయ్యారు. గోవిందా.. గోవిందా ... నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ నరసింహ కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. భక్తజన సంద్రంలో తిరుమలకొండ.. ఇక గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధంచేసిన గ్యాలరీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకే భక్తులు కిక్కిరిసి కనిపించారు. భక్తులు మాడ వీధుల్లోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేయడంతో గందరగోళానికి గురయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు కూడా నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు మరోవైపు.. క్యూ కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,382 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీలో రూ.2.85 కోట్లు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం విశేషం. మోహిని అవతారంలో గోవిందుడు మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. రాజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నడూలేని విధంగా ‘గరుడ’ దర్శనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున ఎన్నడూ లేని విధంగా భక్తులను వాహనం వద్దకు తీసుకొచ్చి గరుడ వాహన దర్శనం చేయించారు. ఆయా గేట్ల వద్దనున్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామివారి వాహన సేవకు అనుమతించారు. ప్రతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించారు. అదేవిధంగా గ్యాలరీల్లో రెండు లక్షల మంది, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. గరుడ వాహన సేవలో సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆయనను లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. అలాగే, ఉదయం జగన్మోహిని వాహనాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజ మోశారు. దీనికి ముందు తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి భగవత్ కుబా, కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుల చైర్మన్ సతీష్‌రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నేడు స్వర్ణరథం ఊరేగింపు తిరుమలలో ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) నిర్వహిస్తారు. సుమారు రూ.30 కోట్లతో తయారుచేసిన ఈ స్వర్ణరథాన్ని 2013 నుంచి ఉత్సవాల్లో ఊరేగిస్తున్నారు. సా.4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు. -
రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దేవదేవుడిని మరోమారు దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. దర్శనానంతరం తిరుమలలోనే బసచేసిన సీఎం రెండవ రోజు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ (లడ్డు, చందనం) స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్.. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. అత్యాధునిక పరకామణి భవనం ప్రారంభం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం మాఢవీధుల్లో కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మీదుగా పరకామణి భవనం వద్దకు బయలు దేరారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో చేతులు ఊపుతూ కనిపించిన భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రూ.23 కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలాజీ నగర్ ప్రాంతంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సొంత నిధులతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ‘ముక్తిస్థావరం’ పుస్తకావిష్కరణ: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్ర విశిష్టత, భక్త కన్నప్ప చరిత్ర, స్వర్ణముఖి నది విశిష్టత, పాతాళ వినాయకుని వైభవం, రాహుకేతు శాంతి, గర్భగుడి రహస్యాలు, ఆలయ శిల్పం, వాస్తు, స్వామి అమ్మవార్ల పురాతన ఆభరణాల చరిత్ర, ఆలయ గోడలపై చిత్రలేఖనం, పురాతన శాసనాలు, అనుబంధ ఆలయాల సమాచారం.. తదితర వివరాలతో ముద్రించిన ‘ముక్తి స్థావరం’ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కొట్టు సత్యనారాయణ, రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి నెట్వర్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు. పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి వైభవాన్ని తెలియజేయగా జీయర్లు శేషవస్త్రంతో íసీఎంను సత్కరించారు. అనంతరం వకుళమాతను దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రదక్షిణగా ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారి ఆలయంలో బియ్యాన్ని తులాభారంగా సమర్పించారు. 2023 శ్రీవారి కేలండర్, డైరీ, టేబుల్ కేలండర్లను, అగ్గిపెట్టెలో పెట్టిన చీరను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తరువాత శ్రీవారి వాహన మండపానికి చేరుకున్న సీఎం.. పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. తిరుమలలో బియ్యాన్ని తులాభారంగా సమర్పిస్తున్న సీఎం జగన్. చిత్రంలో సుబ్బారెడ్డి, మంత్రి రోజా అభిమానం.. అభివాదం శ్రీవారి దర్శనాంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వాహన మండపానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వారికి అభివాదం చేశారు. కొందరు భక్తులు సీఎంను చూసిన ఆనందంలో సీఎం సార్, సీఎం సార్ అంటూ కేకలు వేశారు. వారందరికీ అదే అభిమానంతో రెండుచేతులతో నమస్కరిస్తూ ఆయన ముందుకు సాగారు. ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 400 ఏళ్ల ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా భావించే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న తర్వాతే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సంప్రదాయం 900 ఏళ్లుగా ఉన్నట్లు చరిత్ర ఉంది. కాలక్రమేణా 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కనుమరుగైంది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఘనచరిత్ర కలిగిన అమ్మవారి ఆలయ సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళుతూ ముందుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమతో కూడిన సారెను సమర్పించారు. దర్శనానంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సందర్శన పుస్తకంలో సీఎం సంతకం చేశారు. తిరుమలలో అర్చకుల ఆశీర్వాదాలు అందుకుంటున్న సీఎం జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం కొట్టు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం అనంతరం తిరుపతి–తిరుమల మధ్య నడిపే పది ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలిపిరిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు, చైర్మన్ మల్లికార్జునరెడ్డి సీఎంకు వివరించారు. ఒలెక్ట్రా కంపెనీ నుంచి వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. 50 బస్సులను తిరుపతి–తిరుమల, 14 బస్సులను రేణిగుంట–తిరుమల, 12 బస్సులను తిరుపతి–మదనపల్లి, 12 బస్సులను తిరుపతి–కడప, 12 బస్సులను తిరుపతి–నెల్లూరు మధ్య నడపనున్నట్టు చెప్పారు. తిరుపతి–తిరుమల మధ్య నడిపే ఎలక్ట్రికల్ బస్సులను అలిపిరిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు తిరుపతి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, అలిపిరి, తిరుమల పద్మావతి అతిథిగృహం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, లోక్‌సభ ప్యానల్ స్పీకర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, జెడ్పీ చైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, డీసీసీబీ చైర్మెన్ రెడ్డమ్మ, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మేడా మల్లికార్జునరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, ఆర్టీసి వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి, ఆర్టీసీ ఈడీలు గోపీనాథరెడ్డి, కృష్ణమోహన్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ అనుపమ అంజలి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ ఆస్తులపై ఏటా శ్వేతపత్రం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అన్నారు. ఇకపై ఇలా ప్రతియేటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే.. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, సనత్‌కుమార్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. సమావేశ నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాలకు ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ► శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20వేల వరకు టోకెన్లు జారీచేస్తాం. ► శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉ.10 గంటలకు మార్చాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. ► తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెడతాం. ► తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశాం. ► భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఏపీ మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలుకు అంగీకరించాం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించాం. ► తిరుమలలోని గోవర్థన సత్రాల వెనుక భాగంలో పీఏసీ–5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదించాం. తద్వారా మరింత మంది భక్తుల వసతికి అవకాశం కలుగుతుంది. ► వకుళమాత ఆలయం నుంచి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ► తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటు నిమిత్తం రూ.2.45 కోట్లు మంజూరు. ► తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్ల ఏర్పాటు. వీటి కోసం అదనపు లోడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం. ► నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టీటీడీ కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ► టీటీడీలోని క్లాస్–4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫాం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు నిర్ణయించాం. -
శివాజీ మహారాజ్ వివాదంపై స్పందించిన టీటీడీ
-
సిరికాంతుల శ్రీవారు.. దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు.. స్పెషల్ స్టోరీ
తిరుమల: కలియుగంలో అత్యంత సంపన్నుడెవరంటే అందరూ తిరుమల శ్రీవారు అని వెంటనే చెప్పేస్తారు. వడ్డికాసులవాడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామికి ఉన్న ఆస్తులు.. ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి.. భక్తులు సమర్పించిన ఆస్తుల విలువ.. ఆ ఆస్తుల సంరక్షణ వ్యవస్థ.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పదిటన్నుల బంగారం, రూ.8,500 కోట్ల నగదు బ్యాంకుల్లో.. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారికి భక్తులు తీర్చుకునే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి. హుండీలో నగదు సమర్పించేవారు కొందరైతే, బంగారం చెల్లించేవారు మరికొందరు. తమ బరువుకు సమానమైన పదార్థాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. స్వామి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించేవారు కొందరైతే.. ఇంకొందరు విలువైన భూములను శ్రీవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక టీటీడీ నిర్వహించే ట్రస్ట్‌లకు ఏటా రూ.300 కోట్లకు పైగానే విరాళాలుగా అందిస్తున్నారు. ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం 10 టన్నులకు పైగా టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ.8,500 కోట్ల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. స్వామి హుండీ ఆదాయం తరువాత టీటీడీకి ప్రధానమైన ఆదాయం బంగారం, నగదు డిపాజిట్ల మీద వచ్చేదే. మరోవైపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో శ్రీవారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు. నేపాల్లోనూ భక్తులు సమర్పించిన ఆస్తులున్నాయి. 7,636 ఎకరాల్లో ఆస్తులు టీటీడీ నిరర్ధక ఆస్తులు విక్రయించే అంశం గత ఏడాది వివాదాస్పదం కావడంతో.. ఇకపై టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాలకమండలిలో పెట్టి తీర్మానం చేశారు. అప్పటినుంచి టీటీడీ ఆస్తులు ఎక్కడున్నాయి, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, వాటిద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం ఎంత, అన్యాక్రాంతమైన భూములు, వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా, వాటిని టీటీడీ ఆదాయ వనరులుగా ఎలా ఉపయోగించుకోవాలి.. తదితర అంశాలను పరిశీలించడానికి టీటీడీ పాలకమండలి 4 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉన్నట్లు గుర్తించాయి. వీటిలో 2014కు పూర్వమే 173 ఆస్తులను రూ.114 కోట్ల రూపాయలకు టీటీడీ విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 75 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు 7,636 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు 1,226 ఎకరాలు. వ్యవసాయేతర భూములు 6,410 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. 535 ఆస్తులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో ఉన్నాయి. 159 ఆస్తులను టీటీడీ ఇతరులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.4.15 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇక టీటీడీ వినియోగంలోలేని 169 ఆస్తులను ఇతరులకు లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. అన్యాక్రాంతమైన 29 ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల విలువ రూ.23 కోట్లుగా టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. ఒక్క తిరుపతిలోనే ఐదు ప్రాంతాల్లో ఉన్న విలువైన టీటీడీ ఆస్తులను గుర్తించి వాటి అభివృద్ధిపై దృష్టి సారించారు. 12 ఆస్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు, ఆధారాలు లేవు. ఇటీవల తమిళనాడులోని తంజావురు జిల్లా కబిస్థలం అనే ప్రాంతంలో ఆరెకరాల టీటీడీ స్థలాన్ని కమిటీ గుర్తించింది. గతంలో వంద సంవత్సరాలకు ఈ స్థలాలను లీజుకు ఇవ్వడం, అప్పటికి టీటీడీ ఏర్పాటు కాకపోవడంతో వాటికి సంబంధించిన రికార్డులు లేవు. దీంతో వాటి గుర్తింపు టీటీడీకి ఇబ్బందికరంగా మారింది. మిగిలిన ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. కల్యాణ మండపాల ద్వారా ఆదాయం దేశవ్యాప్తంగా 307 ప్రాంతాల్లో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించింది. ఇందులో 166 కల్యాణ మండపాల నిర్వహణ బాధ్యతను ఇతరులకు అప్పగించింది. 29 కల్యాణ మండపాలను దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది. వీటిద్వారా టీటీడీకి ఏటా రూ.4.28 కోట్ల ఆదాయం లభిస్తోంది. స్వామి ఆస్తులకు ఆధునిక భద్రత ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల గుర్తింపును సులభతరం చేయడానికి జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్‌ను టీటీడీ ప్రారంభించింది. తద్వారా ఆస్తులను సులభతంగా గుర్తించవచ్చని, అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చునని టీటీడీ భావిస్తోంది. సంపూర్ణమైన భద్రత స్వామివారి ఆస్తులను సులభంగా గుర్తించడానికి జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేశాం. జియో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం. స్వామి పట్ల భక్తితో భక్తులు సమర్పించిన ఈ ఆస్తులను ఎప్పటికీ విక్రయించకూడదని పాలకమండలి కూడా తీర్మానించింది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి స్వామి ఆస్తులను నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా గుర్తించి భద్రత కల్పించాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో -
ఆగస్ట్ 1 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన
తిరుమల: కరోనా నేపథ్యంలో తిరుమలలో కొంతకాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్ట్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి చెప్పారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినట్లు చెప్పారు. అక్కడ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదిస్తే వారికి గోవులు, ఎద్దులను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూన్‌లో శ్రీవారిని 23.23 లక్షల మంది దర్శించుకుని, రూ.123.74 కోట్లను హుండీలో వేసినట్లు ఈవో చెప్పారు. 12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు ఈ నెల 17న ఆణివార అస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. -
వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్
-
అన్నదానం కాంప్లెక్స్‌లో మరో దాతల కౌంటర్
తిరుమల: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బుధవారం దాతల కోసం మరో కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ప్రారంభించారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. అయితే చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కౌంటర్ ఏర్పాటైంది. భక్తులు ఇక్కడ రూ.100 నుంచి విరాళాలు అందించవచ్చు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ప్రత్యేకాధికారి జి.ఎల్.ఎ.శాస్త్రి, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ శాస్త్రి, బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల రద్దీ హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని మంగళవారం 67,858 మంది దర్శించుకున్నారు. స్వామికి 28,536 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.15 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
భక్తుల రద్దీ.. స్లాట్ టోకెన్ల రద్దు
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం మంగళవారం తిరుపతిలో అనూహ్య రద్దీ ఏర్పడడంతో స్లాట్ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనూహ్య రద్దీ కారణంగా 2020కి పూర్వం ఉన్న విధానంలోనే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతించామని తెలిపారు. దీంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు. టోకెన్లు ఉన్న భక్తుల దర్శనం పూర్తయిన అనంతరం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి అనుమతిస్తామని, ఇందుకు రెండురోజుల వరకు సమయం పడుతుందని చెప్పారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం పాలు, నీళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. -
కబడ్డీ పోటీలకు ముస్తాబు అవుతున్న తిరుపతి
-
వైభవం.. రాఘవేంద్రుల ఆరాధనోత్సవం
మంత్రాలయం రూరల్/తిరుమల: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. స్వామి వారు బృందావన ప్రవేశం చేసిన శుభ దినాన వేదభూమి పులకించింది. నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రులు భక్తులకు కనువిందు చేశారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత శ్రీ రాఘవేంద్రస్వామి వారికి వెంకన్న పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా పట్టువస్త్రాలను గ్రామ దేవత మంచాలమ్మ సన్ని«ధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టువస్త్రాలను ఉంచి ఊంజల సేవ చేపట్టారు. వాటిని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అలంకరించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి టీటీడీ అదనపు ఈవో «ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతకు శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను ఇచ్చి ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 21న ప్రారంభమైన స్వామి వారి ఆరాధన మహోత్సవాలు 27తో ముగియనున్నాయి. -
కౌంటర్ల నిర్వహణలో అక్రమాలు జరగలేదు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుమల : కౌంటర్ల నిర్వహణలో అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు పారదర్శకంగా నిర్వహించడంతో గతంలో కంటే రూ.56 లక్షలు తగ్గించామన్నారు. ప్రస్తుతం కౌంటర్లు నిర్వహించే వారు రూ.40 వేలు చెల్లిస్తే స్పాన్సర్షిప్ పొందొచ్చని తెలిపారు. త్వరలోనే అన్ని కౌంటర్లకు స్పాన్సర్షిప్ వస్తుందని భావిస్తున్నామన్నారు. -
టీటీడీ: జవహర్‌రెడ్డి బాధ్యతలు అదనపు ఈవో ధర్మారెడ్డికి
సాక్షి,అమరావతి: స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌గా టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. తాజాగా ఆయన స్థానంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ రోజువారీ వ్యవహారాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్ మార్పు సాక్షి, అమరావతి: స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌గా నియమితులైన టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌ను తాత్కాలికంగా తిరుపతి నుంచి వెలగపూడి సచివాలయానికి మారుస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవో రోజువారీ వ్యవహారాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: సత్యసాయి మహా సమాధి దర్శనం రద్దు -
మిజోరాం లో జప్తు చేసిన తలనీలాలతో సంబంధం లేదు
-
కీసర ఆత్మహత్యలు: పెద్దల పేర్లు బయటికొస్తాయనే
సాక్షి, హైదరాబాద్: వరుస అరెస్టులు, ఆత్మహత్యలతో ‘కీసర వ్యవహారం’రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత పరిణామాలు.. ఈ ఆత్మహత్యల వెనక రాజ కీయ నేతల హస్తం ఉండి ఉంటుందన్న ఏసీబీ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూవివాదం, ధర్మారెడ్డి ఆత్మహత్యపై స్థానిక నాయకుడిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన సదరు నాయకుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంలో పెద్ద తలలున్నాయని చెప్పుకొచ్చాడు. మాజీ తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డివి ఆత్మహత్యలు కావని, వీరి మృతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేయడంతో వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. అన్నీ అనుమానాలే.. కీసర భూవివాదంలో ఏసీబీ అధికారులు అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ నుంచి రూ. కోటిపది లక్షలు స్వాధీనం చేసుకున్న సమయంలో తొలుత ఓ ఎంపీ పాత్రపై ఆరోపణలొచ్చాయి. సదరు నాయకుడి భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత దీనిపై రకరకాల ప్రచారాలు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. ఆయనకు దీనితో సంబంధం లేదని, ఏమైనా ఆధారాలు లభిస్తే విచారణకు పిలుస్తామని చెప్పారు. తరువాత చంచల్ౖగూడ జైలులో మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆయన భార్య మానవ హక్కుల సంఘం వరకు వెళ్లారు. అంతలోనే నకిలీ పాస్‌పుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ బలవన్మరణాలపై అనుమానాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు మరికొందరి రాజకీయ నేతల పేర్లు బయటికొస్తుండటం వీటికి బలం చేకూరుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే.. కీసర తహసీల్దార్ నాగరాజు సాయంతో కందాడి ధర్మారెడ్డి వివాదాస్పద 93 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడని, అందులో భాగంగానే తన కుటుంబసభ్యుల పేరిట 24 ఎకరాలకు అక్రమంగా పాస్‌బుక్ లు జారీ చేయించుకున్నాడనేది ఏసీబీ ఆరోపణ. కానీ, తామెక్కడా నిబంధనలు అతిక్రమించలేదని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదుచేసి ధర్మారెడ్డిని, అతని కుమారుడు మరికొందరిని అరె స్టు చేసింది. ఈ వివాదంలో స్థానికంగా ఉండే ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రచారం జరగడం తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పెద్దల పేర్లు బయటికొస్తాయనే..’ కీసర భూవివాదంపై సదరు మాజీ ఎమ్మెల్యే ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తనకు, ధర్మారెడ్డి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. నాగరాజు, ధర్మారెడ్డిలవి అనుమానాస్పద మరణాలని, వారిద్దరూ బతికుంటే పెద్దల పేర్లు బయటికి వస్తాయన్న భయంతోనే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 93 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఈనాటిది కాదని, 2015లోనే దీనికి బీజం పడిందని ఆరోపించారు. కొందరు పెద్దలు కేసును ప్రభావితం చేస్తున్నారని, మొత్తం వివాదంపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తానని బాంబు పేల్చారు. -
కీసర భూ వివాదం: ఆత్మహత్యలా? ప్రేరేపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం మరువక ముందే అక్రమ పాస్ పుస్తకాల కేసులో నాగరాజుతో కలిసి అరెస్టయిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్య వెలుగుచూడటం సంచలనం రేపుతోంది. వీరు కేసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నారా? లేక ఎవరైనా వీరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిందితుల భద్రతపై ఆందోళన భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఆగస్టు 14న నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.. కందాడి ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, మిగిలిన నిందితులంతా జైలులోనే ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో జైలులో ఉన్న మిగిలిన నిందితుల భద్రతపై వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు: వెంకటమ్మ) ఇదీ వివాదం.. ధర్మారెడ్డి అనేక నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాలు కాజేసేందుకు యత్నించిన దాఖలాలున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారు. కీసర మండలంలో 96.22 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారు కింద కాజేసేందుకు గతంలో కీసరలో పనిచేసిన ఓ తహసీల్దార్‌తో కలిసి ధర్మారెడ్డి నకిలీ టెనెంట్ పత్రాలు సృష్టించాడు. స్థాని కులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ధర్మారెడ్డికి ఆ భూమిపై ఎలాంటి హక్కుల్లేవని, అతని వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని అప్పటి తహసీల్ కార్యాలయ అధికారులు సైతం తేల్చారు. తరువాత కీసర మండలానికి నాగరాజు తహసీల్దార్‌గా వచ్చాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పి తాను కన్నేసిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు సాయంతో కాజేసే ప్రయత్నం చేశా డు. దీనిపై స్థానికులు అభ్యంతరాలు తెలిపినా.. నాగరాజు పట్టించుకోకుండా ధర్మారెడ్డి, అతని కుటుంబసభ్యులకు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేశాడు. దీంతో స్థానికులు ఆర్డీవో కార్యాలయంలో అప్పీల్‌తోపాటు, ఉన్నతాధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు రంగం లోకి దిగి.. నాగరాజు, ధర్మారెడ్డి కలిసి పాల్పడ్డ భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన మీదట ఏసీబీ నాగరాజు, ధర్మారెడ్డి, అతని కుమారుడు తదితరులను అరెస్ట్ చేసింది. వరుస ఆత్మహత్యలపై ఆరా నాగరాజు ఏసీబీ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కేసు ముగిసిపోదని, యథావిధిగా దర్యాప్తు సాగుతుందని, మిగిలిన నిందితులనూ విచారిస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అంతలోనే మరో కీలక నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ ఈ కేసులో ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వీరు నిజంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారా? ఎవరైనా అందుకు ప్రేరేపించారా? అనేది కూపీలాగేందుకు వీరి ములాఖత్, ఫోన్ రికార్డ్స్‌పై ఏసీబీ ఆరా తీస్తోందని తెలిసింది. రాజకీయ అండదండలున్న వ్యక్తులే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటారని అనుమానిస్తోంది. ఇవి ఆత్మహత్యలు కావని, రాజకీయ అండదండలున్న కొందరు వీరిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని కీసరవాసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
వేధింపులతోనే ఆత్మహత్య: ధర్మారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య) జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్ఆర్ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
-
నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాగా కోటి రూపాయల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీ వారి సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు
-
తిరుమల: సర్వదర్శన టికెట్ల కోసం భక్తుల నిరసన
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్థరాత్రి నుండే వేలాది మంది భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం గుమికూడారు. సర్వదర్శనం ప్రారంభించిన గంటలోనే 5 వేల టికెట్ల కోటా పూర్తి అయింది. ఇంకా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శన టికెట్లు కోసం భక్తులు నిరసనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని.. సమస్యను పరిష్కరించారు. సోమవారం వరకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 'భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం వేచి ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కొందరు వేసుకోవడం లేదు. ఇలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి టీటీడీ చైర్మన్‌తో చర్చించి.. సర్వదర్శనం టికెట్లపై నిర్ణయం తీసుకుంటాం' అని అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. -
140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను
సాక్షి, హైదరాబాద్: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. అనేక భూ సెటిల్మెంట్లు.. స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు. కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు
సాక్షి, తిరుమల: తిరుమలలో సూర్యజయంతిని రథసప్తమిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. రథసప్తమిపై టీటీడీ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న రథసప్తమిని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ వేడుక కోసం నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: శ్రీవారి భక్తులకు తీపి కబురు రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుక పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రోజు సుమారు 55, 689 ఉచిత లడ్డులను భక్తులకు అందించామని తెలిపారు. భక్తులు అదనంగా 1,59,814 లడ్డూలు విక్రయించారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. చదవండి: గదుల బుకింగ్‌లో కాషన్ డిపాజిట్ విధానం -
ఇదిగో బహుమతి..
పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థుల్లో ఉత్తీర్ణతశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే విద్యార్థులను ప్రతీ రోజు పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందశాతం ఉత్తీర్ణత ఉన్న విద్యార్థినులకు సైకిళ్లను బహూకరించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు నెలను హాజరు మాసంగా ప్రకటించారు. దీని ద్వారా వందశాతం హాజరు ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించడంతోపాటు ఎక్కువ మంది విద్యార్థినులను పాఠశాలకు వచ్చేలా ఉపయోగపడనుంది. సాక్షి, పాపన్నపేట: ఈనెల 2న వనపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థిని నందినికి ఊహించని బహుమతి లభించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఆ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినిని గుర్తించారు. వెంటనే ఆమెకు అక్కడికక్కడే ఒక సైకిల్ బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది హాజరు మాసోత్సవంలో భాగంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తీసుకున్న చర్య అని తెలిపారు.’ ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అదేబాటకు శ్రీకారం చుడుతున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.వీరిలో కొందరికి సైకిళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాఠశాలపై ఆసక్తి కలిగించేలా.. శతశాతం హాజరు సాధించే విద్యార్థి తరగతికి తగిన సామర్థ్యాలు సాధిస్తారన్నది కాదన లేని నిజం. పాఠశాల అంటే విద్యార్థికి ఆసక్తి కలిగించే దిశగా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. హాజరు శాతం పెంచేందుకు ఆగస్టు నెలను ‘హాజరు మాసంగా’ ప్రకటించారు.ఈ క్రమంలో పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఒక విద్యార్థినికి సైకిల్ బహుమతి ఇచ్చిన వార్త వైరల్ అయ్యింది. ఈ ప్రోత్సాహకం సత్ఫలితాన్ని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు అవకాశాలు వెతుకుతున్నారు. ట్రావెల్ అలవెన్స్ ఇచ్చే అవకాశం! గతంలో 1998లో అప్పటి ప్రభుత్వం చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది బాలికా విద్య పెరగడానికి కొంత వరకు దోహద పడింది. ప్రస్తుతం 3 నుంచి 5 కి.మీ దూరం నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.300 ట్రావెలింగ్ అలవెన్స్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. దాతల సహకారంతో.. హాజరు శాతం పెంచేందుకు సైకిళ్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు గాను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ రోజు ఒక్కో కంపెనీతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు.. 100 శాతం హాజరు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సైకిళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బడుల్లో నెలకొని ఉన్న మౌలిక సమస్యలు తీర్చేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వార సహాయం చేసే దాతలకు ఐటీ వెసులు బాటు ఉంటుందని అధకారులు స్పష్టం చేశారు. దీం తో ఇప్పటికే ఎల్ఐసీ, ఐకియా, సంప్రదింపులు జరిపి ఫలితాలు సాధించినట్లు సమాచారం. మెదక్ జిల్లాలో సైతం.. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థినుల వివరాలు సేకరించాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు సూచించనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 15న గాని అంతకు ముందు గాని శతశాతం హాజరు గల విద్యార్థినులకు సైకిళ్ళు అందజేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.మెదక్ జిల్లాలో మొత్తం 141 ఉన్నత,133 ప్రాథమికోన్నత,623 ప్రాథమిక పాఠశాలలు,15 కేజిబివిలు,7 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.అందులో సుమారు 40వేల మంది విద్యార్థినులున్నారు. -
టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి బాధ్యతలు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే జేఈఓగా, ప్రత్యేకాధికారిగా రెండు పర్యాయాలు పనిచేసిన ధర్మారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి 2004 జూలై 5 నుంచి 2006 సెప్టెంబర్ 6 వరకు తిరుమల జేఈవో విధులు నిర్వహించారు. రెండోసారి 2008 ఏప్రిల్ 8 నుంచి 2010 ఆగస్టు 10 వరకు ప్రత్యేకాధికారి హోదాలో పనిచేశారు. మరోసారి స్వామి సేవ చేసుకునే అవకాశం ఆయనకు లభించింది. ధర్మారెడ్డి చేపట్టిన సంస్కరణల్లో అతి ప్రధానమైనది మహాలఘు దర్శనం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. వచ్చిన రోజే స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతుండేవారు. రోజుల తరబడి క్యూల్లో వేచివుండే వారు. దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా శీఘ్ర దర్శనాన్ని కల్పించేందుకు 2009లో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు రోజుకు 60వేల నుంచి 70వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే మహాలఘు దర్శనం ద్వారా నిత్యం 90 లక్షల మందికి పైగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మొదట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చినా అటు తరువాత ప్రతి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండడడంతో ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వడమే కాక భక్తుల మన్ననలను పొందింది. లడ్డూల కొరత తీర్చేందుకు.. శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూల కొరతను తీర్చేందుకు ధర్మారెడ్డి కృషిచేశారు. లడ్డూ తయారీని ఆలయం వెలుపలకు మార్చే అవకాశం లేకపోవడంతో ఆగమ సలహాదారుల సూచనతో బూందీ తయారీని ఆలయం వెలుపలకు మార్చారు. బూందీని తిరిగి పోటులోకి తీసుకెళ్లి లడ్డూల తయారు చేయించారు. దీంతో లడ్డూల కొరత తగ్గింది. తిరువీధుల్లో గ్యాలరీలు శ్రీవారి ఆలయ మాడ వీధులు విసర్తణ అనంతరం భక్తులు స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు ప్రత్యేకంగా తిరువీధుల్లో గ్యాలరీలను నిర్మింపజేశారు. ప్రత్యేక పర్వదినాలైన ఏకదశి, ద్వాదశి సమయాల్లో వేల టికెట్లను జారీచేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. -
టీటీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి
సాక్షి, అమరావతి: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ (ఐడీఈఎస్) 1991 బ్యాచ్‌కు చెందిన ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ధర్మారెడ్డి అక్కడ రిలీవై బుధవారం రాష్ట్ర సచివాలయంలో రిపోర్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా పారుమంచల గ్రామానికి చెందిన ఏవీ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా తిరుమలలో టీటీడీ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. -
ఖర్చుపై ప్రత్యేక నిఘా
మెదక్ రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ధర్మారెడ్డి సహాయ వ్యయ పరిశీలకులకు సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సహాయ వ్యయ పరిశీలకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటి ఖర్చు చేసిన గ్రామ పంచాయతీలు లేవా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిమితి దాటినట్లు దృష్టికి రాకపోవడం ఏమిటని ఆయన అన్నారు. ఈసారి జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వ్యయ పరిమితిని పక్కాగా పరిశీలించాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు రూ. 4లక్షలు కాగా, ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు రూ.1.50లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ధారించిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సహాయ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చు విషయంలో పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు చేసే ప్రచారా ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పరిధి చిన్నగా ఉన్నందున అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ ఖర్చు చేసే వారి వివరాలను సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు పరశురాం, నోడల్ అధికారి రాజిరెడ్డి, పరిశ్రమ శాఖ జిల్లా మేనేజర్ రత్నాకర్‌తోపాటు సహాయ వ్యయ పరిశీలకులు ఉన్నారు.