తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి | Brahmotsavam buzz in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి

Published Fri, Sep 15 2023 4:30 AM | Last Updated on Fri, Sep 15 2023 7:38 AM

Brahmotsavam buzz in Tirumala - Sakshi

తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమల జీఎన్‌సీ టోల్‌ గేట్‌ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని పార్కులు, ఆస్థాన మం­డపాలు, అన్నదాన సత్రా­లు, వైకుంఠం క్యూకాం­ప్లెక్స్‌లు, మాడవీధులు విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన సర్కిళ్లలో ఎటు చూసినా దేవతామూర్తుల భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

కల్యాణ వేదిక వద్ద భక్తులకు కనువిందు చేసేలా స్వామి­వారి పాదాలను ఏర్పా­టు చేశా­రు. అనంతపద్మనాభ స్వామి నమూ­నా ఆలయాన్ని కళ్లు చెదిరేలా ఏర్పాటు చే­శా­రు. ఇసుకతో స్వా­మివారి ముఖచిత్రాల­ను కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. 

గరుడ సేవ రోజున సంతృప్తికర దర్శనం: ఈవో ధర్మారెడ్డి
తిరుమలలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహన సేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి రెండు గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement