Brahmotsavalu
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ (ఫొటోలు)
-
ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహోత్సవాలు
-
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు షెడ్యూల్ 2024
-
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
నృసింహస్వామి పెళ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు. ఉదయం ప్రధానాలయ మాడ వీధుల్లో శ్రీస్వామి వారు జగన్మోని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సాయంత్రం శ్రీస్వామి వారు అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయ మాడవీధిలో ఊరేగించారు. అనంతరం ఆచార్యులు, అధికారులు స్వామి వారి పక్షాన, అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు. శ్రీనృసింహస్వామికి లక్ష్మీ దేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి.. తిరుకల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8.45 గంటలకు గజవాహనంపై శ్రీస్వామి, ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ 9.15 గంటలకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను ఆచార్యులు, వేద పండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రారంభిస్తారు. తుల లగ్న ముహూర్తంలో రాత్రి 9.37 గంటలకు శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. ఇక ఉదయం శ్రీస్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై ఊరేగనున్నారు. యాదాద్రీశుడి కల్యాణానికి టీటీడీ పట్టువ్రస్తాలు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు. ఉదయం టీటీడీకి చెందిన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం మేల్చాట్ పట్టు వ్రస్తాలను తీసుకొని, ఆలయ మాడ వీధిలో ఊరేగింపుగా వచ్చారు.జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులకు అందజేశారు. -
మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. సప్తగిరులు భక్తసిరులతో నిండిపోతున్నాయి. తిరుమాడ వీధులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక సరాగాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుద్దీప కాంతులు మంత్రముగ్దులను చేస్తున్నాయి. విరబూసిన అందాలు భక్తులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దేవదేవుని దివ్య స్పర్శతో పునీతమవుతున్నాయి. పుష్పక విమానం తిరుమల: తిరుమలలో శుక్రవారం బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడింది. మలయప్ప మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హనుమంత వాహన సేవలో టీడీపీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి నేటి వాహన సేవలు ►ఉదయం సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ కనువిందు చేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. ►రాత్రి చంద్రప్రభ వాహనం:రాత్రి తెల్లటి వ్రస్తాలు, పుష్ప మాలలు ధరించి చల్లని వాతావరణంలో తిరువీధుల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. (చదవండి: తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?) -
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
-
చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శిమిచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు..!
-
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(మూకుళ్లు)–శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు.సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం మూడు వేల మంది, గరుడసేవ కోసం మరో 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శనివారం డీఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగ నాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవుతో తాడు ఉంటుంది. -
బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధం
-
బ్రహ్మోత్సవ నవ గోవింద..!
తిరుమల: తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దింది. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలనూ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8–10 గంటల వరకు, రాత్రి 7–9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. 17న అంకురార్పణ..18న ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. 18న సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వాహన సేవల వివరాలివీ.. 18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి వారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. 21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. 24న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 6:55 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు. 26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి
తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని పార్కులు, ఆస్థాన మండపాలు, అన్నదాన సత్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, మాడవీధులు విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన సర్కిళ్లలో ఎటు చూసినా దేవతామూర్తుల భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ వేదిక వద్ద భక్తులకు కనువిందు చేసేలా స్వామివారి పాదాలను ఏర్పాటు చేశారు. అనంతపద్మనాభ స్వామి నమూనా ఆలయాన్ని కళ్లు చెదిరేలా ఏర్పాటు చేశారు. ఇసుకతో స్వామివారి ముఖచిత్రాలను కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. గరుడ సేవ రోజున సంతృప్తికర దర్శనం: ఈవో ధర్మారెడ్డి తిరుమలలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహన సేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి రెండు గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని వివరించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
నేడు పెద్ద శేష వాహనంపై స్వామి వారి దర్శనం
-
బ్రహ్మండం..కాణిపాకం బ్రహ్మోత్సవం
సత్యప్రమాణాల దేవుడు శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సల ఏర్పాట్లకు దేవస్థానం రెండు నెలల ముందే శ్రీకారం చుట్టింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని మహా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీటవేస్తు, ఉభయదారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చిన్న పొరబాటు చోటు చేసుకోకుండా దర్శనం కల్పించేలా ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. కాణిపాకం(యాదమరి): కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు రెండు నెలల ముందే తగు ఏర్పాట్లుకు నడుం బిగించారు. గతంలో కంటే ప్రస్తుతం వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. నిత్యం భక్తులు 20 వేలకు పైగా విచ్చేస్తున్నారు. సెలవురోజుల్లో, పండుగ రోజుల్లో 50 వేలకు పైగా భక్తులు వస్తున్నారు. ఒక్కోసారి దర్శనానికి 6,7 గంటల సమయం కూడా పడుతోంది. బ్రహ్మోత్సల సమయంలో దర్శనం, ఉత్సవమూర్తుల ఊరేగింపు చూసేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తు పలు అంశాలను చర్చిస్తూ, ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గతంలో బ్రహ్మోత్సవాలకు ముందు హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. భక్తులకు ఈ సౌకర్యాలు సరిపోయేవి కావు. దీంతో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేక క్యూలు, నిత్య అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరా ప్రసాదాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి వసతి, వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ దర్శనాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో, ఊరేగింపులో స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు. భక్తులకు సంతృప్తి కలిగించేలా.. శ్రీవినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రాల నుంచి కూడా అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరి కాకుండా రెండు నెలలకు ముందు నుంచే మహా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని చర్చిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు చాలా బాగా దర్శనం చేసుకున్నాం అనే సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేస్తాం. –మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ భక్తులందరికీ నిత్య అన్న ప్రసాదం ప్రస్తుతం నిత్యాన్నదానంలో 7 వేల మందికి భోజనం పెడుతున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదం అందించాలని భావిస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలనే రెండు నెలలకు ముందే ముందస్తు చర్యలు ప్రారంభించాం. బ్రహ్మోత్సవాలకు వారం ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షిస్తూ సలహాలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులు, ఉభయదారులతో సమన్వయంగా పనిచేస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తాం –వెంకటేశు, ఆలయ ఈఓ ఆలయంలో భక్తుల రద్దీ కాణిపాకం(యాదమరి):కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచి భక్తులు తరలి రావడంతో కంపార్ట్మెంట్లు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. -
శ్రీకాళహస్తిస్వరుడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
Mahashivratri 2023: శ్రీగిరిలో బ్రహ్మోత్సవ వైభవం!
అదిగదిగో శ్రీశైలం.. భూలోకాన కైలాసం అంటూ భక్తజనం మల్లన్న ఎదుట ప్రణమిల్లుతోంది. శ్రీశైలవాసా.. శరణు మల్లన్న అంటూ నీరాజనం పడుతున్నారు. నల్లమల అభయారణ్యం మీదుగా పగలు, రేయి చిన్నాపెద్దా తేడా లేకుండా పాదయాత్రగా వచ్చే శివభక్త గణం ఎండలు మండుతున్నా.. చల్లని గాలులు వణికిస్తున్నా.. భక్తిభావం తొణకడం లేదు. అడుగులన్నీ శ్రీగిరి వైపు పడుతున్నాయి. కైలాస ద్వారం చేరుకుని మరింత ఉత్సాహంతో మల్లికార్జునుడి దర్శనానికి బారులుదీరుతున్నారు. బ్రహ్మోత్సవ సందడి అంబరాన్ని తాకుతుండగా.. భక్తజనం పులకించిపోతుంది. శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలంలో దేవదేవుళ్లు పూలపల్లకీపై వివహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ భక్తజనం ఆనంద పరవశులై స్వామిఅమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరవ రోజు గురువారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ సేవ దివ్య పరిమళభరితంగా సాగింది. ఆలయ తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుంగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. పల్లకీలో స్వామి ఊరేగుతున్నంత సేపు అశేష భక్తజనవాహిని కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్.కనకదుర్గ, అంబాల లక్ష్మీసావిత్రమ్మ, ఎం.విజయలక్ష్మి, మఠం విరుపాక్షయ్యస్వామి, ఓ.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం భక్తజన సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేకువజామున్నే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం మల్లన్న దర్శనానికి బారులుదీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులందరికీ స్వామి వారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో కూడా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో నాగలూటి, పెచ్చుర్వు, కైలాసద్వారం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొర్రప్రోలూరు శివస్వాములు 20 కి.మీ దూరంలోని ఆత్మకూరు డివిజన్లోని రోళ్ల పెంట చేరుకుని అక్కడ నుంచి నేరుగా పెచ్చెర్వుకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలక్షేత్రానికి నడకమార్గంలో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులకు ఏ లోటు రానీయొద్దు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానీయొద్దని దేవస్థానం అధికారులను ఈఓ లవన్న ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్ర పరిధిలో తాత్కాలిక వైద్యశాల, అన్న ప్రసాదవితరణ, దర్శన క్యూలైన్ల్లను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో వైద్య శిబిరాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాల కేంద్రాల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుసారంగా అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందించాలని సూచించారు. మేము.. మీకు సహాయ పడగలము! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలదేవస్థానం ఆధ్వర్యంలో నందికూడలి వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో కరపత్రాలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఏదేనీ సమాచారాన్ని అడిగిన వెంటనే మర్యాదపూర్వకంగా వారికి తెలియజేస్తున్నారు. రథశిఖర కలశానికి పూజలు ఆదివారం రథోత్సవం సందర్భంగా రథశిఖర కలశానికి గురువారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈఓ లవన్న ప్రత్యేక పూజల నిర్వహించి, రథశిఖర కలశాన్ని స్వయంగా మోసుకుంటూ ఆలయప్రదక్షిణ చేశారు. అనంతరం రథశిఖర కలశాన్ని సంప్రదాయబద్దంగా రథం వద్దకు చేర్చారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ, గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్ర చరిత్ర ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు. పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. అభివృద్ధి ఘనం భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇలా.. ► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. ► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం ► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం. ► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం. ► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం. ► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం. ► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం. ► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి . సేవలు రద్దు బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
భక్తుల కొంగు బంగారం ఇంద్ర వరదుడు
యాదమరి(చిత్తూరు జిల్లా): మండల కేంద్రమైన యాదమరిలోని త్రివేణి సంగమంలో పడమరవైపు ముఖద్వారంతో వెలసిన ఇంద్రవరదరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం అంకురార్పణ నిర్వహించనున్నారు. మేరకు ఆలయ కమిటీ సభ్యులు చలువ పందిళ్లతోపాటు భక్తులకు సౌకర్యాల కల్పన, స్వామివారి వాహన సేవలకు సర్వం సిద్ధం చేస్తోంది. మంగళవారం అంకురార్పణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం మూలస్థానంలో వున్న శ్రీదేవి, భూదేవి, సమేత వరదరాజలు స్వామికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చన నిర్వహించి పూజలు చేసి విష్వక్సేన ఉత్సవం, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో బ్రహ్మోత్సవాలను భారీగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. యాదపొద నుంచి యాదమరిగా పేరు మార్పు త్రివేణి సంగమంలో యాదపొద ఉన్న చోట ఇంద్రుడు స్వామి ఆలయాన్ని ప్రతిష్టించడంతో ఆ గ్రామానికి ఇంద్రపురి అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ పేరు క్రమేపీ యాదమరిగా మారింది. ఈ ఆలయాన్ని 2వ శతాబ్దంలో పల్లవరాజులు రాజగోపురం నిర్మించి నిత్య పూజలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయులు ఆలయానికి ప్రహరీ గోడ, వాహన మండపం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మూడు రాష్ట్రాల నుంచి భక్తులు ఇంద్రవరుదుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆంధ్రతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం, పుష్పపల్లకి ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఏడాదికి వెయ్యి పెళ్లిళ్ల నిర్వహణ ఇంద్రవరదుని ఆలయంలో సంవత్సరంలో వెయ్యి పెళ్లిళ్లకు పైగానే జరుగుతాయి. యాదమరి మండలం తమిళనాడు సరిహద్దులో ఉంది. తమిళనాడు వాసులు కూడా ఇక్కడకు వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే మొదటి సంతానం మగ బిడ్డ పుడతారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల వివరాలు జూన్ 1వ తేదీ : ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం జాన్ 02వ తేదీ : ఉదయం సప్రంలో ఉత్సవం, రాత్రి హంస వాహనం జాన్ 03న : ఉదయం సప్రంలో ఉత్సవం, రాత్రి యాళివాహనం జాన్ 04న: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి శేషవాహనం జూన్ 05న: ఉదయం గరుడ వాహనం, రాత్రి కల్పవక్ష వాహనం జూన్ 06న: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనం జూన్ 07న: ఉదయం రథోత్సవం, రాత్రి తోటోత్సవం జూన్ 08న: వెణ్ణత్తాయ్ కణ్ణన్, తిరుక్కోలం, రాత్రి అశ్వవాహనం జూన్ 09న: గురువారం సాయంత్రం తీర్థవారి, పుణ్యకోటి విమానం, రాత్రి ధ్వజావరోహనం జాన్ 10వ తేదీ: రాత్రి పుష్పపల్లకి సేవ జూన్ 11న : వడాయిత్సోవంతో బ్రహ్మోత్సవాల ముగింపు -
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం నిర్వహించారు. దీనికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కాయకర్పూర నీరాజనాలు అందించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్ధని అలంకారంలో రాములవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామి వారు విహరిస్తారు. -
శంభో..శివ శంభో!
శ్రీశైలం టెంపుల్: ఇలకైలాసమైన శ్రీశైలం శ్రీగిరిపై వేంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీగిరికి ప్రత్యేక స్థానం. ఇక్కడ మల్లన్నకు జరిగే విశిష్ట సేవలు మరెక్కడా జరగవు. వాటిలో మల్లన్న పాగాలంకరణ ఒకటి. మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో జరిగే ఈ సేవ అత్యంత విశిష్టమైనది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్నకు తలపాగాను తయారు చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు వెంకట సుబ్బారావు తండ్రికి సహకరిస్తున్నారు. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. అనంతరం రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ‘శంభో.. శివ శంభో’అని స్వామివారిని కీర్తిస్తూ శ్రీగిరి చేరుకుంటున్నారు. పలువురు శివమాలను ధరించి వస్తున్నారు. నల్లమల కొండల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది మంది శ్రీగిరికి చేరుకుంటున్నారు. గజ వాహనంపై మల్లన్న దరహాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించాడు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవానికి తరలించారు. కళాకారుల కోలాహలం నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తున్నాం. భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనాన్ని కల్పించాం. క్యూలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. – ఎస్.లవన్న, ఈవో, శ్రీశైల దేవస్థానం -
4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మార్చి 4 నుంచి 14 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీతారెడ్డి తెలి పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫాల్గుణ శుద్ధ విదియ 4న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమై ద్వాదశ 14న ఉదయం 10 గం.కు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గం.కు శృంగార డోలోత్సవంతో ముగుస్తాయన్నారు. ఎదుర్కోలు 10న, స్వామివారి తిరు కల్యాణోత్సవం 11న, దివ్య విమాన రథోత్సవాలు 12న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలాలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవే చివరివని, వచ్చే ఏడాది నుంచి ప్రధానాలయంలోనే వేడుకలు జరుగుతాయన్నారు. కొండ కింద నిర్వహించే స్వామి వారి కల్యాణం ఈసారి చేయట్లేదన్నారు. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
-
తిరుపతి : చిన్నశేషుడిపై చిద్విలాసం
-
15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం
సాక్షి, తిరుమల/తిరుపతి సెంట్రల్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో అప్పటినుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈనెల 14న ధనుర్మాసం పూర్తికానున్న నేపథ్యంలో.. 15వ తేదీ నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయి. కాగా, ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేది గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలో ఆయన సమీక్షించారు. శ్రీగిరిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన చేసి.. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చదవండి: 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు తిరుమలలో సినీ ప్రముఖులు -
గుహలో కొలువై.. భక్తుల ఆప్తుడై..
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర పాల్గుణ శుద్ధతదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7వ తేదీ పాల్గుణ శుద్ధత్రయోదశిన శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ స్వామివారి విశేష అలంకరణ పూజలు కొనసాగనున్నాయి. దీంట్లోభాగంగా ముఖ్య ఘట్టాలైన స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మార్చి 3న, తిరుకల్యాణం 4న, దివ్య విమాన రథోత్సవం 5న జరుగుతాయి. మార్చి 7న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో యాదాద్రి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. – యాదగిరిగుట్ట (ఆలేరు) సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : స్తంబోద్భవుడైన సర్వాంతర్యామి భూలోక వాసులకు అండగా ఉండేందుకు గుహల్లో కొలువై ఉంటాడు. నారసింహుడు రాతి గుహల్లో.. అటవీ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడతాడు. అందుకే ఆ స్వామిని ‘మృగ నరహరి’గా పిలుస్తారు. అహోబిలంలో హిరణ్యకశపుడిని వధించాక.. ఆ ఉగ్రుడు అడవుల్లో సంచరిస్తుండగా ఆయనను శాంతింపజేసేందుకు బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని వేడుకుంటారు. అమ్మ చెంచు లక్ష్మీగా ఈ ప్రాంతంలో అవతరించి నరహరిని శాంతింపజేసింది. యాదవ మహర్షి తపస్సుతో సింహరూపుడు పంచరూపాలతో సాక్షాత్కరించి స్వయంభువుగా వెలిశారని ఈ క్షేత్ర చరిత్ర చెబుతోంది. రుష్యారాధన క్షేత్రంగానూ యాదాద్రి విరాజిల్లుతోంది. చతుర్వేదాలు ఇక్కడే తిష్టవేసినట్లు ఉంటుంది. ప్రతి జలధార బ్రహ్మ కడిగిన పాదాల పవిత్ర తీర్థమే అన్నట్లు గోచరిస్తోంది. అభయ ప్రధాత నారసింహుడు భక్తులను వెన్నంటి ఉండే ఆపద్భాందవుడిగా భక్తులు కొలుస్తుంటారు. పిలిస్తే పలికే ఆప్తుడిగా జనుల గుండెల్లో కొలువై ఉన్న యాదగిరీశుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో కొలువైన క్షేత్రమిది. యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం, మనస్సు నవనీతం, ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ వాడి గోళ్ల చేతులు ఆది మహాలక్షి్మని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండనాయకుడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నరసింహుడిని దర్శించుకున్న సృష్టికర్త బ్రహ్మ “ఉగ్రం వీరం మహా విష్ణుం.. జల్వంతం సర్వతో ముఖం.. నృసింహం భీషణం భద్రం.. మృత్యు మృత్యుం సమామ్యహం’ అంటూ అర్చించాకే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని పండితులు చెబుతుంటారు. సింహరూపుడైన శ్రీహరి అంటే ఎంతో భక్తి కాబట్టే స్వహస్తాలతో బ్రహ్మోత్సవాలను ఆ చతుర్ముఖుడే స్వయంగా నిర్వహిస్తాడని క్షేత్ర చరిత్ర చెబుతోంది. పురాణాల పరంగా.. ఇతిహాసాలు రామాయణ మహాకావ్యంలోనూ యాదాద్రి ప్రాశస్త్యం గురించి ప్రస్తావన ఉంది. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు, అతడి పుత్రుడైన యాద మహర్షి తపోశక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందంటారు. యాదుడు బాల్యం నుంచి మహావిష్ణు భక్తుడు. ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కరం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఈ సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కారిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. దీర్ఘకాలిక తపస్సుతో ఫలించి స్తంబోద్భవుడు తొలుత జ్వాలా, గండబేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ సమేతుడిగా (పంచరూపాలతో) దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక ఫలితంగా సాక్షాత్కరించిన నారసింహుడు ఈ గుహలోనే కొలువై ఉన్నాడు. దీంతో ఈ క్షేత్రాన్ని పంచనారసింహ నిలయంగా పురణాలకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది. . బ్రహ్మోత్సవ వైభవం.. ఈ నారసింహ క్షేత్రంలో ప్రతి యేటా పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను తొలుత సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామి క్షేత్రం11 రోజులూ ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. పూర్వం శ్రీస్వామి సన్నిధిలో వేద మంత్ర ఘోషలు వినిపించేవట. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీణ నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. విశ్వక్సేన పూజతో మొదలై స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి అలంకార సంబరాలు జరుగుతాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రస్నానం జరుపుతారు. అనంతరం రథోత్సవం నిర్వహిస్తారు. రక్షణగా సుదర్శన చక్రం.. తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాలని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాలు, ఆపదలు కలగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తుల అపార విశ్వాసం. స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే పుట్టిందంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు, గ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తు నమ్మకం. ఎంతో కాలం మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడట. స్వామి కలలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యులు రాజామోతీలాల్ 1920లో ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజలు మొదలయ్యాయి. స్వస్తివాచనంతో ఆరంభం.. డోలోత్సవంతో ముగింపు యాదగిరిగుట్ట (ఆలేరు) : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. ఏకశిఖరవాసుడు.. పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి శ్రీ వికారినామ సంవత్సర పాల్గుణ శుద్ధ తదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 7 పాల్గుణ శుద్ధ త్రయోదశిన డోలోత్సవంతో ముగుస్తాయి. మార్చి 2 నుంచి 7 వరకు థార్మిక సాహిత్య సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 60 నుంచి 70మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు. స్వస్తివాచనంతో ప్రారంభమై.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, మార్చి 7న రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 28వ తేదీన అలంకార సేవలు, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఇక ప్రధాన ఘట్టాలు.. మార్చి 3న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం, 4న శ్రీస్వామి తిరుకల్యాణోత్సవం, 5న దివ్య విమాన రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. 11 రోజులు ఆర్జిత సేవలు బంద్.. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న బాలాలయంలో ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భక్తులచే నిర్వహించబడే అర్చనలు, బాలభోగాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. 6, 7తేదీల్లో అభిషేక, అర్చనలు రద్దు చేసినట్లు చెప్పారు. యాదాద్రిలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయం బాలాలయంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పట్టువస్త్రాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచి ఆరాధన, సహస్త్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు శ్రీసుదర్శన నారసింహహోమం, అష్టోత్తర పూజలు చేశారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజ.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణుపుష్కరిణి చెంతనున్న ఆంజనేయస్వావిుకి ఆచార్యులు విశేష పూజలు చేశారు. స్వామివారిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అలంకరించారు. శ్రీస్వామి భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రిని సందర్శించిన పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేషన్ చైర్మన్ దామోదర్‌కు మండపంలో ఆలయ ఆచార్యులు శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఇచ్చారు. ఆలయ అధికారులు లడ్డూప్రసాదం అందజేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయంతోపాటు ఆలయ వీధుల్లో, పట్టణంలో, ఘాట్ రోడ్డులో తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాం. బాలాలయాన్ని పుష్పాలంకరణతో తీర్చిదిద్దుతున్నాం. ఈసారి కూడా శ్రీస్వామి వారి కల్యాణం ఉద యం బాలాలయంలో, రాత్రి హైసూ్కల్ మైదానం, దివ్య విమాన రథోత్సవం రాత్రి 7గంటలకు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. 7.30గంటలకు వైకుంఠద్వారం నుంచి యాదగిరిగుట్ట పట్టణంలో ఊరేగింపు ఉంటుంది. – గీతారెడ్డి, యాదాద్రి దేవస్థాన ఈఓ యాదాద్రిలో ఇలా.. యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పూజా కార్యక్రమాల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుప్రభాతం రూ.100, అష్టోత్తరం రూ.100, సువర్ణ పుష్పార్చన రూ.516, స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం రూ.1250, అభిషేకం ఇద్దరికి రూ.500, సహస్త్ర నామార్చనలు ఒక్కరికి రూ. 216, శాశ్వత కల్యాణం రూ.6వేలు పది సంవత్సరాలు మాత్రమే, అమ్మవారి కుంకుమార్చన, సహస్త్ర నామార్చన రూ.216 ఒక్కరికి, శ్రీసుదర్శన నారసింహ హోమం రూ.1016, అన్నప్రాసన రూ.500, అండాల్ అమ్మవారి జోడు సేవ రూ.750 (ప్రతి శుక్రవారం), జోడు సేవ రూ.500 (ప్రతి రోజు), శతఘటాభిషేకం రూ.750 (స్వాతి నక్షత్రం రోజు), లక్ష పుష్పార్చన రూ.2016 (ప్రతి ఏకాదశి), శ్రీసత్యనారాయణస్వామి వ్రతం రూ.500, నిత్య బ్రహ్మోత్సవం రూ.2001, శాశ్వత బ్రహ్మోత్సవం రూ.10వేలు, శయనోత్సవం రూ.100 ఉంటుంది. లడ్డూ ప్రసాదం ప్రత్యేకం తిరుమల దేవస్థానం తర్వాత ఈ ఆలయంలో తయారు చేసే లడ్డూ, పులిహోరకు అంత ప్రాధాన్యత ఉంది. అభిషేకం లడ్డూ రూ.100, చిన్న లడ్డూ రూ.20, బెల్లం లడ్డూ రూ.25, పులిహోర రూ.15, వడ రూ.20, దద్దోజనం రూ.15లకు విక్రయిస్తారు. ఇలా చేరుకోవచ్చు యాదగిరిగుట్టకు బస్సు మార్గంలో చేరుకునే భక్తులు ఇలా రావొచ్చు. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, నల్ల గొండ నుంచి 90కిలోవీుటర్లు ఉంటుంది. నల్లగొండ జిల్లా నుంచి వచ్చే భక్తులు నల్ల గొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చే భక్తులకు మూడు మార్గాలు ఉన్నాయి. సిద్దిపేట, దుద్దెడ, కొమురవెల్లి, కొండపోచమ్మ, రాజపేట, యాదగిరిగుట్ట ఒక మార్గం. ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్టకు రెండవ మార్గం ఉంది. మూడవ మార్గం సిద్దిపేట, దుద్దెడ, చేర్యాల, కొలనుపాక, ఆలేరు, వంగపల్లి, మీదుగా యాదగిరిగుట్టకు రావచ్చు. ఇక సూర్యాపేట నుంచి వచ్చే భక్తులు తిరుమలగిరి, మోత్కూర్, ఆత్మకూర్, యాదగిరిగుట్టకు రావొచ్చు. వరంగల్ నుంచి వచ్చే భక్తులు మడికొండ, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, పెంబర్తి, ఆలేరు, వంగపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఇక కీసర నుంచి వచ్చే భక్తులు కీసర, బొమ్మలరామారం, తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. హైదరాబాద్– సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. అలాగే నిజామాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నారాయణఖేడ్, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, రాణీగంజ్, నల్లగొండ, మేడ్చల్, తాండూరు, పరిగి, వనపర్తి, విజయవాడ, కర్నూల్, శ్రీశైలం, నారాయణపేట, వేములవాడ, కొమురవెల్లి, తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. రైల్వే సౌకర్యం హైదరాబాద్, వరంగల్ మార్గాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు రైల్వే సౌకర్యం ఉంది. భువనగిరితో పాటు, మండలంలోని రాయిగిరిలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి రాయిగిరి రైల్వేస్టేషన్లో పుష్పుల్, కాకతీయ ప్యాసింజర్లు, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. రాయిగిరి రైల్వేస్టేషన్ నుంచి యాదగిరగుట్ట 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దిగిన భక్తులకు ఆటోలు, బస్సుల సౌకర్యం ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా వరంగల్ వెళ్లే మంచిర్యాల, కృష్ణా, ఇంటర్సిటీ, తెలంగాణ, ఈస్ట్‌కోస్ట్, పుష్పుల్, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, గౌతమి, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వేస్టేషన్లో ఆగుతాయి. వరంగల్ వైపు నుంచి భువనగిరి మీదుగా తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లన్నీ భువనగిరి స్టేషన్లో ఆగుతాయి. భువనగిరి నుంచి యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి బస్సు, ఆటోల సౌకర్యం ఉంటుంది. జట్కా సౌకర్యం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యం లేనప్పటి నుంచి నేటి వరకు జట్కాలు రవాణా సౌకర్యం ఉంది. హైదరాబాద్–వరంగల్ నగరాలకు మధ్యలో ఉన్న యాదగిరిగుట్ట ఆవిర్భవించిన నాటి నుంచి టాంగాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పట్నం వాసులు పాతగుట్టకు వెళ్లాలంటే తాము తీసుకువచ్చిన వాహనాలను పక్కనపెట్టి జట్కాల (గుర్రపు బండ్ల) పైనే ప్రయాణం చేస్తుంటారు. అంతే కాకుండా పాతగుట్టతో పాటు స్థానికంగానే ఉన్న సురేంద్రపురి, హాయగీవ్ర ఆలయాలకు వెళ్లాలన్న జట్కాలపైనే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు భోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది. సన్నిధి ఎమరాల్డ్ హోటల్. హోటల్‌కు వచ్చే భక్తులకు రూ.199తో బఫెట్ ఏర్పాటు చేశారు. ఈ భోజనం మధ్యాహ్నాం 12గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. బఫెట్లో 18రకాల రుచులను హోటల్ యాజమాన్యం అందిస్తుంది. ఇక్కడ ఉండవచ్చు కొండపైన విస్తరణ పనులు జరుగుతుండడంతో గదులను కూల్చివేశారు. దీంతో భక్తులకు కావలసిన గదులన్నీ తులసీ కాటేజీలో నిర్మాణం చేశారు. నృసింహ సదనంలో సుమారు 100 గదుల నిర్మాణం చేశా రు. ఇందులో ఒక్కో గది కేవలం రూ.300, ఉంటుంది. ఈ సదనం ప్రక్కనే లక్ష్మీ సదనం ఉంటుంది ఇందులో 100 గదులు ఉన్నాయి. ఇందులో రూ.500 ఒక్కో గదికి కిరాయిని ఏర్పాటు చేశారు. హాల్స్‌కు రూ. 1800 ఉంటాయి. యోగనంద నిలయంలో 58గదులు ఉంటాయి. బస్టాండ్ ముందు ఆండాల్ నిలయంలో 18గదులున్నా యి. వీటిలో కిరాయి రూ. 300 ఉంది. స్థాని కంగా ప ద్మశాలి అన్నదాన సత్రం, రెడ్డి సంక్షేమ సంఘ సత్రం, ఆర్యవైశ్య అన్నదాన సత్రం, గౌ డ సత్రం, కుమ్మరి సత్రం, కురు మ సత్రం, పట్కరి సత్రాలు ఉన్నాయి.. 41 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నా.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత 41 సంవత్సరాలుగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నా. గతంలో మాదిరిగానే ఈసారి కూడా శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అర్చక బృందం సిద్ధమవుతోంది. స్వస్తివాచనంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతాం. ప్రతిరోజు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే విధంగా ఈ ఉత్సవాలు జరిపిస్తాం. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ప్రధాన అర్చకులు -
శ్రీశైలం.. ఉత్సవ శోభితం
సాక్షి, శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం.. రావణ వాహనంపై శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహన ప్రత్యేక పూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఈఓ కేఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. విశేషపూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలను చేసి నారికేళం సమరి్పంచి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కనుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు రావణ వాహనా«దీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో దర్శించుకొని కర్పూర నీరాజనాలు అరి్పంచారు. రాత్రి 9.30 గంటలకు గ్రామోత్సవం ఆలయ ప్రాంగణం చేరుకుంది. మల్లన్నకు పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి బుగ్గన ఈ నెల 21వ తేదీన నిర్వహించే శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా ప్రధానాలయగోపురం ముందు ఏర్పాటు చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రి, ఈఓ తదితరులంతా పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను తలపై పెట్టుకుని ఆలయప్రవేశం చేశారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలను సమరి్పంచిన అనంతరం వారు రావణవాహనంపై అధిష్టింపజేసిన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆత్మకూరు–దోర్నాల ఘాట్ రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే శిల్పాతో చర్చించామని అటవీశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అధికారులు, ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. నేడు మల్లన్నకు పుష్పపల్లకీ సేవ.... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను పుష్పపల్లకీ అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందుగా ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను చేస్తారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పపల్లకీపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పుష్పపల్లకి మహోత్సవం రథశాల నుంచి నందిమండపం వద్దకు వెళ్లి తిరిగి రథశాల వద్దకు చేరుకుంటుంది. -
కీసరగుట్టలో ఆరు రోజుల వైభవం
కీసర: ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మార్చి 7 వరకు ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, కీసరగుట్ట పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తలుగా వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8గంటలకు స్వామివారిని నందివాహన సేవ ద్వారా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. మహాశివరాత్రి (సోమవారం) రోజున జాతరకు 8–10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 కమిటీలు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నేటి నుంచి పారిశుధ్య, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, వైద్యశాఖ, విద్యుత్ తదితర అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలను శనివారం ప్రారంభించనున్నారు. జాతర సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి క్రీడోత్సవాలు, ఎగ్జిబిషన్నుప్రారంభిస్తారు. పూజా కార్యక్రమాలివీ... తొలి రోజు (మార్చి 2): ఉదయం 11గంటలకు విఘ్నేశ్వర పూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అనంతరం పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం. రాత్రి 8గంటలకు స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. రెండో రోజు: ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం. రాత్రి 8గంటల నుంచి స్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేస్తారు. రాత్రి 10గంటలకు పూర్వాషాఢ నక్షత్రయుక్త కన్యలగ్నమందు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం. మూడో రోజు: మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12గంటల నుంచి లింగోద్భవ కాలంంలో శ్రీరామలింగేశ్వర స్వామికి సంతతదారాభిషేకం. నాలుగో రోజు: ఉదయం 5:30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కల్యాణ మండపంలో సాముహిక అభిషేకాలు, 9గంటలకు రుద్రస్వాహాకార హోమం, రాత్రి 7గంటల నుంచి ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమాన రథోత్సవం. ఐదో రోజు: ఉదయం 5:30గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం 8గంటలకు అన్నాభిషేకం, రాత్రి 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. ఆరో రోజు: మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10గంటలకు క్షేత్ర దిగ్బలి అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. పండగకు ప్రత్యేక బస్సులు సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసర, ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 2–7 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సుమారు 150 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, కోఠి, దిల్సుఖ్నగర్, జేబీఎస్, ఏంజీబీఎస్, నాంపల్లి, ఈసీఐఎల్, అల్వాల్, పటాన్చెరు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా... భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే లక్షన్నర లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచాం. – తటాకం నారాయణశర్మ, ఆలయ చైర్మన్ -
ఇల కైలాసం.. భక్తి పారవశ్యం
సాక్షి, సిటీబ్యూరో :ఇల కైలాసంగా అభివర్ణించే శ్రీశైల దివ్య క్షేత్రంలో మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజువారీ క్రతువులు, స్వామీ అమ్మవార్లకు నిత్యం వాహన సేవ, గ్రామోత్సవం కన్నులపండువగానిర్వహించనున్నారు. వాహన సేవలోపాల్గొనేందుకు గ్రేటర్ వాసులు ప్రత్యేక వాహనాల్లోనూ, కాలినడకనతరలివెళ్తుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులుతలెత్తకుండా అన్ని వసతులుకల్పించారు. ఇవీ వసతులు.. ♦ భక్తులు సేదతీరేందుకు వనాలు, పార్కులు, ఖాళీ స్థలాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ♦ లడ్డూ ప్రసాదాల విక్రయశాలల వద్ద క్యూలైన్, చలువ పందిళ్లు వేశారు ♦ శివ దీక్షా శిబిరాల వద్ద భక్తులకు చలువ పందిళ్లు, స్నానాలకు వాటర్ ట్యాప్‌లు, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు ♦ ఆలయ క్యూలైన్లలో, క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులకు ఉచితంగా పాలు, నీళ్లు, అల్పాహారం, మజ్జిగ అందిస్తారు ♦ పాతాళ గంగ వద్ద భక్తులకు తాగునీరు, షవర్‌బాత్‌లు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఏర్పాటు చేశారు. వాహన సేవలిలా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. 26న భృంగీ వాహనసేవ, 27న హంస వాహనసేవ, 28న మయూర వాహనసేవ, మార్చి 1న రావణ వాహనసేవ, 2న పుష్పపల్లకీ సేవ, 3న గజవాహన సేవ, 4న నందివాహన సేవ, 5న రథోత్సవం, 6న తెప్పోత్సవం, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. ఆర్జిత సేవల నిలిపివేత.. శ్రీశైల క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. పాదయాత్రికులకు సూచనలు ♦ భాగ్య నగరం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. మార్గంలో అక్కడక్కడా శిబిరాలను ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, అగ్గిపెట్టెలు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకెళ్లవద్దు ♦ కాలినడకన వెళ్లే భక్తులు అడవుల్లోని కుంటల్లో నీరు తాగకుండా వెంట శుద్ధ జలాలు తీసుకెళ్లడం మంచిది. ♦ నల్లమలలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వృద్ధులు, చిన్నారులు, వ్యాధిగ్రస్థుల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు శుద్ధ జలాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేకుంటే చక్కెర, ఉప్పు నీటిలో కలిపి సేవించినా సరిపోతుంది. -
జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ అమ్మవారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం నిజరూప దర్శనమిచ్చారు. ఆలయంలో సహస్ర ఘటాలకు పూజలు చేసిన భక్తులు వాటిని శిరస్సున ధరించి అమ్మవారిని అభిషేకించారు. వందమందికి పైగా కాళాకారులు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి నమూనా విగ్రహాన్ని ఊరేగిస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో కలశాలు శిరస్సున ధరించి భక్తిని చాటుకున్నారు. 5 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చండీ హోమాలకు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి మూల విరాట్‌ను పంచామతాలతో అభిషేకించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రి డీకే.అరుణ, సికింద్రాబాద్ కోర్టు జడ్జి సునీత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
పుష్పక విమానంపై సప్తగిరీశుని దివ్య దర్శనం
-
ఫిలింనగర్ దైవసన్నిదానంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు జేఈవో తెలిపారు. భక్తులు సౌకర్యార్థం గ్యాలరీలు విస్తరణ చేశామన్నారు. ఆగష్టు చివరికల్లా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఆగష్టు 26న పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడ సేవను బ్రహ్మోత్సవాల ట్రయల్‌గా నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం వాహన సేవలను 9 గంటలకు, రాత్రి వాహన సేవలును 8 గంటలకు, గరుడ సేవను రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు విష్వక్సేనుడికి ఆరాధన చేసి స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక సేవలో అధిష్టింపజేశారు. ఎదరుగా ప్రత్యేక పీఠంపై ప్రధాన కలశం ఏర్పాటు చేసి అందులో శుద్ధ గంగాజలం పోసి పూజలు చేశారు. గర్భాలయం, ఆలయ పరిసరాలను శుద్ధ జలంతో సంప్రోక్షణ చేశారు. స్వామి, అమ్మవార్ల బంగారు కవచాలకు, స్వయంభూ మూర్తులకు కంకణధారణ చేశారు. రాత్రి మృత్సంగ్రహణం (పుట్టమన్ను తేవడం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవస్థా«నం ఈఓ గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
మమ్మేలు మల్లన్న..
ఐనవోలు(వర్ధన్నపేట): డప్పు చప్పుళ్లు..శివసత్తుల పూనకాల తో మమ్మేలు మల్లన్న.. సల్లంగ చూడు మల్లన్న అంటూ భక్తుల మొక్కులు.. ఒగు ్గకళాకారుల డోలు మోతలతో ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవా లు ధ్వజారోహణంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతః కాలంన ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలి కారు. పూజారులు విఘేశ్వర పూజ చేసి ఉద యం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి స్వామి వారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు ధ్వజానికి కాషాయ çపతాకాన్ని ఏర్పాటు చేసి ఆ పతాకాన్ని చేత బూని వేద మంత్రాలతో ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో మూడు ప్రదక్షిణలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకం కలుగకుండా జరుగాలని అందరి దేవుళ్లను ఆవా హన జరిపి ఆ కాషాయ పతా కాన్ని ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. అనంతరం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి నీరాజ న మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఈఓ సదానందం, ప్రధాన అర్చకులు నందనం శివరాజయ్య, పాతర్లపాటి రవీందర్, శ్రీనివాస్, మధుకర్‌శర్మ, మధుశర్మ, దువగిరి భీమన్న, పాతర్లపాటి నరేష్‌శర్మలతో పాటు పాలకమండలి సభ్యులు తక్కళ్లపెల్లి చందర్రావు, కుల్ల సోమేశ్వర్, యాకూబ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకున్నారు. శివసత్తుల విన్యాసాలు, నృత్యాలు, బోనం నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించుకున్నారు. నేడు భోగి ఉత్సవాలు నేడు ఆదివారం భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మంద్ర పుష్పాల దర్శనాలుంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ పూజలు∙ ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామిని శనివారం ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయంలోకి వారిని మంగళవాయిద్యాలతో లోనికి తీసుకెళ్లారు. అనంతరం గోపాల్‌రావు దంపతులకు స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాన్ని అందించి వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న 133/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ తిరుపతి
-
వైభవంగా చక్రస్నానం
కడప కల్చరల్ : దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ రెండున్నర గంటలపాటు వేద మంత్ర యుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఏఈఓ శంకర్రాజు, డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యంల ఆధ్వర్యంలో తిరుమల వేద పండితులు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణమూర్తి తదితరులు పాలు, పెరుగు, తేనె, జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో మునకలు వేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. స్వామి ప్రత్యేక ప్రసాదంగా ఉత్సవ మూర్తులకు లేపనం చేసిన సుగంధం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
దేవిని గడప కడపలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా శ్రీవారి ధ్వజారోహణం
-
కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం
తిరుమల : తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో ధ్వజపటం ఊరేగించారు. నేటి నుంచి 9 రోజుల పాటు బ్రహోత్సవాలు జరుగుతాయి. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుండి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదేస్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. -
బ్రహ్మోత్సవ సంబరానికి టీటీడీ సన్నద్ధం
- అక్టోబరు 3 నుండి11వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ప్రత్యేక ఆకర్షణగా దశావతారాల సైకత శిల్పం - సీసీ కెమెరా నిఘాలో బ్రహ్మోత్సవాలు - అన్ని ఆర్జిత సేవలు రద్దు, 7 లక్షల లడ్డూలు సిద్ధం తిరుమల: తిరుమలలో అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిళ్ఆళ్వారు తిరుమంజనం వైదికంగా నిర్వహించారు. ఆలయం పరిమళంతో గుభాళిస్తోంది. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు పూర్తి చేశారు. గోపురాలకు వెల్లవేశారు. తిరువీధుల్లో రంగుల రంగవల్లులు అలంకరించారు. ఆలయానికి దేదీప్యమానంగా భారీ విద్యుత్ అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ఎల్ఈడీ బల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రత్యేక ఆకర్షణ కానున్న శ్రీవారి సైకత శిల్పం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తకోటికి సైకత శిల్పం కనువిందు చేయనుంది. ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పం దర్శనమివ్వనుంది. దశావతరాల్లోని మశ్చ లేదా నృశింహ అవతారంలో ఏదో ఒక సైకత శిల్పాన్ని నిర్మించాలని సంకల్పించారు. సుమారు ఏడు ట్రక్కుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించనున్నారు. వరుసగా రెండేళ్లుగా వీరు రూపొందించిన 'వైకుంఠం నుండి భువికి ఆనంద నిలయం తీసుకురావటం', 'లక్ష్మీ భూ వరాహస్వామి' సైకత శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీసీ కెమెరా నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి బ్రహ్మోత్సవాల్లో అన్ని విభాగాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ విషయంలో టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాలకు ఏపీ డీజీపీ సాంబశివరావు తిరుమల పర్యటన సందర్భంగా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ దిశగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆలయంతోపాటు నిత్యాన్నప్రసాదం, కల్యాణకట్ట, ఇతర ముఖ్య కూడలి ప్రాంతాల్లో 400 పైచిలుకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం అదనంగా మరో 150 కెమెరాలు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాత్రిసదన్-4 వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ కామాండెంట్ సెంటర్లో కంట్రోల్‌రూమ్ ద్వారా సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. సుమారు 3000 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1000 మందిని నియమించనున్నారు. 24 గంటలూ రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే 3 నుండి 11వ తేదీ వరకు తిరుపతి, తిరుమల మధ్య రెండు ఘాట్‌రోడ్లను తెరిచి ఉంచి వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. 7 లక్షల లడ్డూలు సిద్ధం చేయనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 03-10-2016 - ధ్వజారోహణం( సా:6గం) - పెద్ద శేషవాహనం 04-10-2016 - చిన్నశేషవాహనం - హంసవాహనం 05-10-2016 - సింహవాహనం - ముత్యపుపందిరి వాహనం 06-10-2016 - కల్పవృక్షవాహనం - సర్వభూపాల వాహనం 07-10-2016 - మోహినీ అవతారం- గరుడ వాహనం 08-10-2016 - హనుమంతవాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం - గజవాహనం 09-10-2016 - సూర్యప్రభ వాహనం- చంద్రప్రభ వాహనం 10-10-2016 - రథోత్సవం - అశ్వవాహనం 11-10-2016 - చక్రస్నానం - ధ్వజారోహణం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
- ఏపీ డీజీపీ సాంబశివరావు - ఆలయ వీధుల్లో భద్రత ఏర్పాట్ల తనిఖీ తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భద్రత పటిష్టం చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ వీధుల్లో సాగుతున్న బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ ఇనుప కంచె కారణంగా భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు ఉండే అవకాశం లేదన్నారు. టీటీడీ విజిలెన్స్, అర్బన్ జిల్లా పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతను కట్టుదిట్టం చేశాయన్నారు. తిరుమల ఆలయ ఆగమ శాస్రాల ప్రకారం డ్రోన్లు వినియోగించలేమన్నారు. ఈ సారి బందోబస్తుతోపాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు ప్రింట్స్‌తో అనుమానితులను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల సేవ కోసం ప్రత్యేంగా 150 మంది సిబ్బందితో 'పోలీస్ సేవాదళ్' ఏర్పాటు చేశామన్నారు. చైల్డ్ ట్రాకింగ్ పద్ధతి అమలు ద్వారా చిన్నారులు తప్పిపోయినా త్వరగా వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ యూనిట్ ప్రారంభించామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీవ్రంగా ఉందని, 8 మంది అదనపు డీజీలు, 25 మంది ఐజీలు మాత్రమే ఉన్నారన్నారు. అందువల్లే టీటీడీకి శాశ్వత సీవీఎస్వో పోస్టు నియమించలేదని, త్వరలోనే సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. తిరుమల భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. ఆయన వెంట ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ ప్రభాకర్‌రావు, టీటీడీ సీవీఎస్వో శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి జయలక్ష్మి ఉన్నారు. -
బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల : తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 3 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏరోజుకారోజు స్వామివారి దర్శనమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వాహన సేవలు నిర్దేశించిన సమయానికే ప్రారంభించి, తిరిగి పూర్తి చేసే ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం 24 గంటల పాటు రెండు ఘాట్ రోడ్లను తెరచి ఉంచుతామన్నారు. ఆర్టీసీ బస్సులు సాధారాణ రోజుల్లో 2 వేల ట్రిప్పులు, గరుడసేవ రోజు 3,500 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. ఘాట్ రోడ్లలో వాహనాలు మరమ్మతులకు గురైనపుడు వెంటనే స్పందించేందుకు వీలుగా క్రేన్లు, మెకానిక్ సిద్ధంగా ఉంచుతామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతామన్నారు. -
రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడ సేవ
-
రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడ సేవ
- అక్టోబరు 3 నుండి 11 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు - హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం - భక్తుల కోసం నిర్ణయం : టీటీడీ ఈవో సాంబశిరావు తిరుమల: భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈసారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. రాత్రి 7.30 నుండి 12.30 గంటల వరకు ఊరేగింపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనం ఉదయం 9 నుండి 11 గంటలు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవ వైభవ ప్రాశస్త్యం నేపథ్యంలో దశాబ్దకాలంగా రద్దీ అనూహ్యంగా పెరిగింది. అందులోనూ గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీన్ని గుర్తించిన టీటీడీ దశాబ్దకాలం గరుడ వాహనం మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తోంది. అయినా భక్తుల రద్దీ మాత్రం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గరుడ సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని అర్థగంటపాటు ముందుగా ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ఆగమ పండితులు, జీయర్లు, అర్చకులతో చర్చించి వారి అనుమతి కూడా పొందారు. ఈ మేరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 7వ తేది రాత్రి 7.30 గంటలకే వాహనం ఊరేగించాలని నిర్ణయించారు. తరలివచ్చే భక్తులందరికీ ఉత్సవమూర్తి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆ రోజు రద్దీని బట్టి రాత్రి 12 నుండి 12.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించారు. హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం గరుడ వాహనంలో హారతులు తీసుకొచ్చే భక్తుల సంఖ్యను ఈసారి పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కేవలం 2.2 లక్షల మంది మాత్రమే వేచి ఉండి ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం ఉంది. అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల వెలుపల వేచి ఉంటారు. అలాంటి భక్తుల్లో ఎక్కువ మందిని ఉత్సవమూర్తి దర్శనానికి అనుమతించి వారికి సంతృప్తి దర్శనం కల్పించాలని ఈవో భావిస్తున్నారు. అందుకునుగుణంగా రద్దీని క్రమబద్దీరించాలని అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చారు. రాత్రి 7.30 గంటలకే గరుడవాహనం: ఈవో సాంబశివరావు 'ప్రతిసారి రాత్రి 8 గంటలకే గరుడవాహనం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకోలేక ఆవేదనతో వెనుతిరుగుతున్నారు. వారందకీ దేవదేవుని దర్శనం కల్పించాలంటే అర్థగంట ముందే వాహనాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే రాత్రి అర్థగంట ఆలస్యమైనా భక్తులకు సంతృప్తి దర్శనం కల్పిస్తాం. ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకునే అవసరమైన చర్యలు చేపడతాం. దాంతోపాటు ఆగమ నిబంధణలు, ఆలయ సంప్రదాయాలు పాటిస్తాం' - దొండపాటి సాంబశివరావు, టీటీడీ ఈవో -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- తొలిరోజు రాత్రి హంసవాహనంపై విహరించిన గణనాథుడు - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి ఐరాల (చిత్తూరు జిల్లా) : కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏకదంతుడి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం గ్రామోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. అన్వేటి మండపంలో ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 గంటల నుంచి 8 గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగారు. కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీరికరుణీక వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. -
'బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం'
- టీటీడీ ఈవో సాంబశివరావు తిరుమల : అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ఆయన టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసారి ఉత్సవాలకు రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస, దర్శనం, అన్నప్రసాదం, భద్రత,ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 16వ తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలోనే నిర్వహించి లోటుపాట్లను పరిశీలిస్తామన్నారు. ఉత్సవాల్లో వాహన సేవను భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాలతోపాటు తిరుమల శనివారాల నేపథ్యంలో ఆలయంలోని మూలమూర్తి దర్శనం కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని, రోజుకు కనీసం 80 నుండి 90వేల పైబడి భక్తులకు సంతృప్తిక దర్శనం కల్పిస్తామన్నారు. -
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
-
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
–21 రోజుల పాటూ ప్రత్యేక కార్యక్రమాలు కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
5నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల వివరాలు...5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు పూర్ణచంద్రారావు చెప్పారు. -
వైభవంగా త్రిశూల, చక్రస్నానం
తాళ్లపాక(రాజంపేట) తాళ్లపాక గ్రామంలో శనివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి వసంతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ చెన్నకేశవస్వామికి అన్నమాచార్య ధ్యానమందిరం ఆవరణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై చక్రస్నానం నిర్వహించారు. అంతకముందుగా వసంతోత్సవం రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. శ్రీ సిద్దేశ్వర, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి జరిగే పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. టీటీడీ వేదపండితుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రికి పుష్పయాగం నిర్వహించనున్నారు. -
ఘనంగా రాజన్న బ్రహ్మోత్సవాలు
- రేపు పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం వేములవాడ (కరీంనగర్ జిల్లా) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మేళతాళాలతో స్వామివారల ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి కల్యాణ మంటపానికి తీసుకొచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులకు దేవస్థానం పక్షాన వర్ని-దీక్షా వస్త్రాలు అందజేశారు. అనంతరం 7.35 గంటలకు స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ సారథ్యంతో అర్చకులు కళ్యాణ మండపంలో భేరీపూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.40 గంటలకు అభిజిత్ లగ్న ముహూర్తమున పార్వతీరాజరాజేశ్వరస్వామి వారల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 8 గంటలకు పెద్దసేవపై ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని అర్చకులు తెలిపారు. స్థానిక నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్పర్సన్ నామాల ఉమ, కమిషనర్ శ్రీహరి శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. -
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఐదవ రోజు శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు మోహినీ రూపంలో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు. పట్టు పీతాంబరాలు ధరించిన మలయప్ప స్వామి ఈరోజు విశేష ఆభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, కాలి నడక భక్తులకు 10గంటల సమయం పడుతోంది. -
అనంత తేజోమయుడు
సూర్య,చంద్రప్రభలపై మెరిసిన దేవదేవుడు ఊంజల్‌సేవలో సేదతీరిన శ్రీవేంకటేశుడు నేడు తేరోత్సవం (రథోత్సవం) సాక్షి, తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో దేవదేవుడు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య భాస్కరునిపై తిరునామాల నల్లనయ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్ర వేళలో ఆలయంలో వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయలలూగుతూ దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనసేవలో మంగళధ్వనులు, పండితుల వేద ఘోష నడుమ చల్లనయ్య శ్వేతవర్ణ కలువపూల అలంకరణలో భక్తలోకానికి దివ్యమంగళ రూపంలో దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వాహన సేవలో రద్దీ కనిపించినా, రాత్రి వాహన సేవలో తక్కువగా కనిపించింది. బుధవారం తేరు సందర్భంగా ఆలయంలో నిర్వహించే కైంకర్య వేళల్లో మార్పులు చేశారు. వాహన సేవల్లో కళాకారులు, దాస సాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారుల అభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ వాహన సేవల్లో భద్రతా సిబ్బంది హడావిడి ఏమాత్రమూ తగ్గలేదు. శ్రీవారి రథోత్సవానికి సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి తేరు ఊరేగింపు (రథోత్సవం) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తేరును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో తొలుత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో తేరుచక్రాలను పరీక్షించి మరమ్మతులు పూర్తి చేశారు. తేరుకు నూతనంగా రంగులు అద్దారు. ద్వార పాలకులు, రాక్షసులు, గంధర్వులు, దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. వివిధ పుష్పాలతో విశేషాలంకరణ చేశారు. సుమారు 80 టన్నుల బరువు కలిగిన ఈ తేరు నాలుగు మాడ వీధుల్లో తిరిగేందుకు సౌకర్యంగా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తేరుపై స్వర్ణ ఛత్రస్థాపన బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం బంగారు గొడుగు ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. తేరోత్సవానికి నాయీ బ్రాహ్మణులు బంగారు గొడుగు సమర్పించడం ఆనవాయితీ. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును అనుసరిస్తున్నారు. 1952 కాలం వరకు రథంపై కొయ్య గొడుగు అమర్చేవారు. తర్వాత బంగారు గొడుగును అలంకరిస్తున్నారు. మంగళవారం స్థానిక కల్యాణకట్టలో నాయీ బ్రాహ్మణుడు పంతులుగారి రామనాథం ఆధ్వర్యంలో బంగారు గొడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సిరసనగండ్ల బ్రహ్మోత్సవాల్లో భక్తుడి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం జరిగింది. ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది భక్తులు సిరసనగండ్ల గుట్టపైకి చేరుకున్నారు. అయితే స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు గుండం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన గిరి(24) అనే వ్యక్తి భార్య మంజులతో కలసి గుట్టపై ఉన్న గుండంలో స్నానం చేసేందుకు దిగి, ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. ఎంతసేపటికీ భర్త కనిపించకపోయేసరికి భార్య మంజుల వెతకడం ప్రారంభించింది. మధ్యాహ్నం సమయానికి గిరి మృతదేహం గుండం నీటిపైకి తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు గిరికి వివాహం జరిగి నాలుగు నెలలే అయినట్లు తెలిసింది. -
బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ దూరం వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. కొద్దిసేపట్లో శ్రీవారు కల్పవృక్షవాహనంపై ఊరేగుతారు.