కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం | cm chandra babu fabrics to tirumala brahmotsavam | Sakshi
Sakshi News home page

కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం

Published Mon, Oct 3 2016 6:43 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం - Sakshi

కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం

తిరుమల : తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో ధ్వజపటం ఊరేగించారు. నేటి నుంచి 9 రోజుల పాటు బ్రహోత్సవాలు జరుగుతాయి. 

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement