DWCRA Group
-
కొలికపూడి కంపు.. డ్వాక్రా మహిళలు ఆగ్రహం
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి మాట్లాడేందుకు వెళ్లిన మహిళలతో ఎమ్మెల్యే కొలికిపూడి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో, మహిళలకు ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.తమను బూతులతో దూషించారని మహిళలు ఆరోపించారు. డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించి బుక్ కీపర్లుగా పాతవారినే కొనసాగించాలని ఎమ్మెల్యే కొలికిపూడి వద్దకు వెళ్లిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలను తీవ్ర పదజాలంతో దూషించిన కొలికపూడి. మిమ్మల్ని ఎవడు ఇక్కడికి పంపించాడు? అంటూ ఊగిపోయిన ఎమ్మెల్యే. మహిళలు అని కూడా వారిని బూతులు తిట్టాడని సదరు మహిళలు తెలిపారు. అనంతరం, పోలీసులను పిలిపించి మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి స్టేషన్లో తమకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. -
TS: డ్వాక్రా మహిళలకు శుభవార్త
సాక్షి, ఖమ్మం జిల్లా: డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. -
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
పొదుపు మహిళే బ్యాంకర్! సంఘాలే బ్యాంకులు
పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహిళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటున్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బులను అవసరమైన వారికి నామమాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయిలోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది. ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్ సీహెచ్ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొకరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు. సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్‌లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్‌లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి. 3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం. గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.386 కోట్లు, అక్టోబర్‌లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవస్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు. రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటిదాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్ ఖాతాలలో నిరుపయోగంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టోబర్‌లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండిపోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మహిళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బులతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్ఎల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
‘పొదుపు’ డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ!
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటివరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణ మొత్తంలో దాదాపు మూడో వంతుకు సమానమైన డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో పోగుపడినప్పటికీ.. ఆ మొత్తానికి నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు. కానీ, బ్యాంకుల నుంచి మాత్రం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. మహిళలు తమ పొదుపు సంఘాల ఖాతాల్లో దాచుకున్న డబ్బులను వాడుకోవడానికి బ్యాంకులు ఆంక్షలు పెడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.75 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, వాటిల్లో మహిళలు ప్రతినెలా దాచుకున్న డబ్బులే ఇప్పుడు రూ.11,196 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకొక్కరు గరిష్టంగా నెలకు రూ. 200 వరకూ దాచుకుంటుండడంతో పొదుపు డబ్బులు భారీగా పెరిగాయి. మరోపక్క.. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.30 వేల కోట్ల వరకూ ఉంటాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. అంటే మొత్తం పొదుపు సంఘాల రుణాల్లో మూడో వంతుకుపైగా పొదుపు సంఘాల మహిళలు దాచుకున్న డబ్బులు ఉన్నా, వాటిని వాళ్లు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సహజంగా పొదుపు ఖాతాలో ఉండే డబ్బులకు బ్యాంకులు నామమాత్రపు వడ్డీ ఇచ్చే పరిస్థితి ఉండగా, రుణాలపై వడ్డీ మాత్రం రెండు మూడింతల దాకా ఉంటోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధన 7.3.6 మేరకు సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొనప్పటికీ చాలా బ్యాంకులు ఆ నిబంధన పాటించడంలేదని సెర్ప్ కార్యాలయ దృష్టికి వచ్చింది. సీసీ విధానంలోనూ అదనపు భారంలేకుండా.. మహిళలు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి గత ఏడెనిమిది ఏళ్ల నుంచి సీసీ (క్యాష్ అండ్ క్రెడిట్ ) ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో రుణాలను గరిష్ట లోను మొత్తం మేరకు సీసీ ఖాతాలో అప్పుగా ఇచ్చినట్లు చూపి, ఆ మొత్తాన్ని సంఘం పొదుపు ఖాతాలో జమచేస్తున్నాయి. సీసీ విధానమంటే.. ఆ రుణ ఖాతాలోనే గరిష్ట లోను వరకు అవసరమైనప్పుడే డబ్బులు వినియోగించుకోవడం, ఆ వినియోగించుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, బ్యాంకర్లు కొన్నిచోట్ల మహిళలు లోను మొత్తం అవసరంలేని సమయంలో కూడా రుణ ఖాతాలో మొత్తం లోను డబ్బులను తీసుకున్నట్లుగా చూపి, వాటిని ఆ సంఘ పొదుపు ఖాతాలో ఉంచేస్తున్నారు. దీనివల్ల అవసరంలేని డబ్బులకూ వడ్డీ భారం పడుతోంది. వడ్డీ తగ్గించాలన్న సీఎం జగన్.. ఇక పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాల అంశంలో రుణాలిచ్చే సమయంలో మహిళలపై వివిధ రకాల అదనపు భారాలేవీ లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూణ్ణెళ్ల క్రితం బ్యాంకర్ల సమావేశంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కారణంగా మహిళల రుణాల చెల్లింపు ఇప్పుడు 99.5 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరుణంలో బ్యాంకర్లు వీలైనంత మేర పొదుపు సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు. రుణాలు తీసుకునే ముందు సంఘాలలో ఉండే తమ పొదుపు డబ్బులను మహిళలు వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు.. చాలాచోట్ల సీసీ విధానంవల్ల జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ప్రస్తావించి, పేద మహిళలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ఈ విషయాన్ని కేంద్రానికి సైతం లేఖలు రాయడంతో కేంద్రం సైతం కదిలింది. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర అధికారులు.. ఈ నేపథ్యంలో.. పొదుపు సంఘాల మహిళలు నష్టపోతున్న వైనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పొదుపు సంఘాల రుణ విభాగంలో పనిచేసే కీలక అధికారి రామ్బియాస్ గుప్తా రాష్ట్రానికి వచ్చారు. సెర్ప్ అధికారులతో కలిసి ఆయన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఈనెల 12న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్, రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఏజీఎం రాజాబాబుతో కలిసి ఆయన విజయవాడలో బ్యాంకర్ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ మొత్తం వివరాలను ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ విభాగానికి సెర్ప్ కార్యాలయం తెలిపింది. 0.5 శాతం మహిళలు కూడా నష్టపోకూడదనే.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘పొదుపు’ మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. సకాలంలో రుణ కిస్తీలు చెల్లించకుండా ఉంటున్న 0.5 శాతం మహిళలు సైతం నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశముందని వారు భావిస్తున్నారు. -
‘ఆసరా’ సంబరం.. ఊరూరా అంబరం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండవ విడత సొమ్ము డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో విజయవంతంగా జమ అవుతుండటాన్ని పురస్కరించుకుని అక్కచెల్లెమ్మలు ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల నాటికి వారి పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి శనివారం వరకు 6,10,262 పొదుపు సంఘాలకు రూ.4,923.33 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రెండో విడతగా జమ చేసింది. శనివారం 1,35,430 సంఘాలకు సంబంధించి రూ.1,108 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుగా ప్రకటించిన ప్రకారం.. సోమవారం మరో 1.45 లక్షల సంఘాలకు రూ.1,176 కోట్లు జమ చేసే అవకాశం ఉంది. దీంతో 12 జిల్లాల పరిధిలో లబ్ధిదారులందరికీ వైఎస్సార్ ఆసరా రెండో విడత డబ్బుల చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. బద్వేలు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్‌తో వైఎస్సార్ జిల్లాలో ఈ చెల్లింపులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. గతంలో చంద్రబాబులా మోసం చేయకుండా.. ఎన్నికల ముందు చెప్పినట్టు గత రెండేళ్లగా తమ పొదుపు సంఘాల అప్పు డబ్బును అందజేస్తున్న ముఖ్యమంత్రి పట్ల మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు చాటుకుంటున్నారు. ఈ సొమ్ము పంపిణీ ప్రారంభమైన 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులు సంబరాలు కొనసాగిస్తున్నారు. శనివారం 12 జిల్లాల పరిధిలో 70 చోట్ల లబ్ధిదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఊరూరా సంబరాలు ► తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, కొత్తపేట మండలం వానపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడ డైరీ ఫారం సెంటర్, తుని మండలం గెడ్లబీడు, శంఖవరం వద్ద జరిగిన కార్యక్రమాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత, అల్లవరంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. పలుచోట్ల సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. కొవ్వూరు మండలంలో మంత్రి తానేటి వనిత చెక్కులు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లా చోడవరంలో ఎంపీ బీవీ సత్యవతి, పెదబయలులో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడలోని విద్యాధరపురం లేబర్‌కాలనీలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ► అనంతపురం జిల్లా సోమందేపల్లిలో మంత్రి శంకరనారాయణ, చిలమత్తూరులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► చిత్తూరు జిల్లా మదనపల్లె, పీలేరులో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారుపాళెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. ► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో మంత్రి సీదిరి అప్పలరాజు స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. -
మహిళా మార్ట్.. సరుకులు భేష్
ఒక్క ఆలోచన వేలాది మందికి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందేలా చేసింది. అందరి చూపు ఆ మార్ట్‌పై నిలిచేలా పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఎవరిపైనా పెట్టుబడి భారం పడకుండా చిన్నపాటి మొత్తంతో డ్వాక్రా సభ్యులే అంతాతామై నిర్వహించేలా ఆవిర్భవించిన జగనన్న మహిళా మార్ట్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.పేద ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈ మార్ట్ ఏర్పాటైంది. సాక్షి, కడప: ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ద్వారా రూ.150 పెట్టుబడితో.. సుమారు రూ.12 లక్షల వ్యయంతో మహిళా మార్ట్ రూపుదిద్దుకుంది. బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరలకే సరుకులను అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు సభ్యులందరికీ అదనంగా 2 శాతం రాయితీతో సరుకులను అందిస్తుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన మహిళలందరికీ ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో సొమ్ము అందించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళిక రూపొందించింది. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా పాత బస్టాండు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఈ మార్ట్‌ను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా విజయవంతంగా నడుపుతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందజేయడం ద్వారా పేదలకు అనుకూలంగా ఉంటుందన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు తోడు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషితో ఈ మార్ట్ రూపుదిద్దుకుంది. ఏది కావాలన్నా హోల్ సేల్ ధరకే ప్రజల నిత్యావసరాలకు సంబంధించి ఏది కావాలన్న జగనన్న మహిళా మార్ట్‌లో లభిస్తుంది. డ్వాక్రా ఉత్పత్తులు, తిను బండారాలు (డ్వాక్రా మహిళలు తయారు చేసిన), ఒడియాలు, అప్పడాలు, డోర్ కర్టన్స్, నైటీలు, డోర్ మ్యాట్లు, చీపుర్లు అందుబాటులో ఉంచారు. పప్పుల దగ్గర నుంచి బెల్లం వరకు.. ఆవాల నుంచి అల్లం వరకు.. ప్రతి నిత్యావసర వస్తువు ఈ మార్ట్‌లో లభిస్తోంది. బయట మార్కెట్ కంటే ఇక్కడ ధర తక్కువ. హోల్‌సేల్ ధరకే సరుకులను అందించడంతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ప్రతినిత్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్‌లో కొనుగోలు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. 8 వేల మంది భాగస్వామ్యం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 8 వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద రూ.150 చొప్పున వసూలు చేసి, రూ.12 లక్షల పెట్టుబడి సొమ్ముతో మార్ట్‌ను నెలకొల్పారు. 2021 జనవరి 3వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా (పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత డ్వాక్రా గ్రూపులు పెరగడంతో మరో 5 వేల మంది సభ్యులు పెట్టుబడి సొమ్ము చెల్లించి భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చారు. లాభాల్లో 60 శాతాన్ని రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టిన ప్రతి మహిళకు ఏటా బోనస్ రూపంలో అందించనున్నారు. భారీగా వ్యాపారం ప్రస్తుతం ఈ మార్ట్‌లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. నెలలో ఐదారు రోజులు లక్ష రూపాయల వ్యాపారం సాగుతోంది. నెలకు సరాసరిన రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సమస్యల్లేకుండా దినదినాభివృద్ధి చెందుతోంది. డ్వాక్రా సభ్యులకు రాయితీ కార్డులు పులివెందులలోని డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మార్ట్ పేరుతో గుర్తింపు కార్డులను ఇచ్చారు. జగనన్న మార్ట్‌కు వచ్చి సరుకులు కొనుగోలు చేసిన వారికి సొమ్ము మొత్తమ్మీద 2 శాతం రాయితీ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.3 వేల సరుకులు కొనుగోలు చేస్తే.. బయటి మార్కెట్‌తో పోలిస్తే అందరికీ 20 శాతం చొప్పున రూ.600 ఆదా అవుతోంది. దీనికి తోడు డ్వాక్రా మహిళలకు 2 శాతం అంటే రూ.60 అదనంగా మిగులుతోంది. మార్ట్‌లో ఏడుగురు డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. సరుకుల గ్రేడింగ్ మొదలు.. ప్యాకింగ్, బిల్లు కౌంటర్ వరకు డ్వాక్రా మహిళలే అన్ని పనులు చూస్తున్నారు. సరుకులు బాగున్నాయి జగనన్న మహిళా మార్ట్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రధానంగా సరుకుల నాణ్యత చాలా బాగుంది. ఈ మార్ట్‌ను మహిళలే నిర్వహిస్తున్నారు కాబట్టి సరుకులు, వస్తువులను ఓపికగా అందిస్తున్నారు. ఏదీ కావాలన్న మార్ట్‌లో లభిస్తోంది. – ప్రియాంక (శ్రీసాయినగర్), పులివెందుల ఉపాధి లభించింది జగనన్న మహిళా మార్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడే పని చేస్తున్నా. సరుకుల గ్రేడింగ్ మొదలుకుని ప్యాకింగ్ వరకు అన్నీ చూసుకుంటాం. మెప్మా నుంచి ప్రతినెలా రూ.7,500 ఇస్తున్నారు. నాతోపాటు మరో ఆరుగురు ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. నిత్యం సరుకుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు. – పుష్పలత, డ్వాక్రా గ్రూపు సభ్యురాలు, పులివెందుల తూకం, నాణ్యతలో కచ్చితత్వం జగనన్న మహిళా మార్ట్‌లో సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటోంది. తూకం, నాణ్యతలోనూ కచ్చితత్వం ఉంటోంది. మార్ట్ ప్రారంభించినప్పటి నుంచి మేము ఇక్కడే సరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు కూడా రూ.3 వేలతో సరుకులను కొనుగోలు చేశాం. – బోనాల కళావతి, పులివెందుల సరసమైన ధరలకే సరుకులు ఈ ఏడాది జనవరిలో జగనన్న మహిళా మార్ట్‌ను స్థాపించాం. డ్వాక్రా మహిళలకు కార్డులిచ్చి రాయితీపై సరుకులు అందిస్తున్నాం. ఇతర ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు, సరుకులు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి భాగస్వామ్యంతోనే ఈ మార్ట్‌ను ముందుకు నడిపిస్తున్నాం. ఏడాదికొకసారి పెట్టుబడి పెట్టిన ప్రతి డ్వాక్రా మహిళకు బోనస్ రూపంలో ఆదాయం పెంచుతాం. – పి.అబ్బాస్ ఆలీఖాన్,సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, పులివెందుల -
‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఏ సంఘానికి ఎంత మొత్తం జీరో వడ్డీ కింద చెల్లిందన్న బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అక్కచెల్లెమ్మల ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించింది. ‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నేరుగా వారికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ సున్నా వడ్డీకి రుణాల విప్లవం తెస్తాం. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది’ అని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని ఏడాది తర్వాత నుంచి నాలుగు దఫాల్లో చెల్లించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. వైఎస్సార్ ఆసరా పథకం అమలయ్యే వరకు అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం ఉండకూడదని ఆ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలుత ఐదు నెలల డబ్బులను అక్టోబరు 2వ తేదీలోగా జమ చేయనుంది. ప్రతి నెలా వడ్డీ రూ.204 కోట్లు ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పులు ఉన్నట్టు బ్యాంకర్ల సంఘం నిర్ధారించింది. ఈ వివరాలతో సెర్ప్, మెప్మా అధికారులు రాష్ట్ర మంతటా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి, ఏ సంఘానికి ఎంత అప్పు ఉందో తీర్మానం చేయించి, దానిని బ్యాంకు అధికారుల ద్వారా సర్టిఫై చేయిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 99 శాతం సంఘాలతో సమావేశాలు నిర్వహించే ప్రక్రియ పూర్తయింది. సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో 6,01,132 సంఘాల పేరిట రూ.19,504 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,50,042 సంఘాల పేరిట రూ.4,587.71 కోట్లు అప్పు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంఘాల వారీగా ఉన్న అప్పుపై ప్రతి నెలా సుమారు రూ.204 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జీరోవడ్డీ పాస్ పుస్తకాలు సంఘం వారీగా ఉన్న అప్పు మొత్తం, దానిపై ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ వివరాలతో పాటు ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీగా బ్యాంకుకు చెల్లించిన రశీదు వివరాలు నమోదు చేయడానికి సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలను తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత ప్రభుత్వం తొలి విడతగా సుమారు రూ.1,020 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత వాటికి సంబంధించిన రశీదులు మహిళలకు అందజేసే సమయంలోనే ఈ పాస్‌పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా ప్రభుత్వం సంఘాల వారీగా బ్యాంకులకు చెల్లించిన జీరో వడ్డీ రశీదులను అందజేసి, సంఘాల వద్ద ఉండే ఆ పాస్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. -
పొదుపు భేష్.. ఆరోగ్యమూ జాగ్రత్త
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలకు పొదుపు చేయడమే నేర్పించిన ఐకేపీ అధికారులు ఇకపై వారికి ఆరోగ్య సూత్రాలను నేర్పించనున్నారు. తీసుకునే ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడో వారికి అవగాహన కల్పించనున్నారు. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం, సంతోషం ఉంటుందని చెప్పడానికి, సామాజిక పరివర్తనలో మా ర్పు తేవడానికి ఆరోగ్యం–పోషణ అనే కార్యక్రమాన్ని ఐకేపీ శాఖ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఒక గర్భిణీ తాను బిడ్డను ప్రసవించే వరకు, పుట్టిన బిడ్డ రెండు సంవత్సరాల వరకు పెరిగే వరకు మొత్తం వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తెలియజెప్పనున్నారు. మొత్తం ఐదు అంశాలపై డ్వాక్రా మహిళలకు ప్రతీ నెలా వారి రెండవ సమావేశంలో ఐకేపీ సిబ్బంది అవగాహన కల్పిస్తారు. అయితే ఈ నెల నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐకేపీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 11 మండలాలు ప్రాజెక్ట్‌గా.. జిల్లాలో 11 మండలాలను ప్రాజెక్టుగా తీసుకుని ఆ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య సూత్రాలను తెలుపనున్నారు. ఆ మండలాల్లో ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లి, మాక్లూర్, మెండోరా, నవీపేట్, నిజామాబాద్ రూరల్, వేల్పూర్, ఎడపల్లి ఉన్నా యి. అయితే 11 మండలాలు కలిపి 787 వీవోలుండగా, 11,074 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఈ మొత్తం గ్రూపుల్లో 1,13,216 మంది మహిళా సభ్యులున్నారు. అయితే ఐకేపీ అధికారులు ముందుగా జిల్లా స్థాయిలో ఏపీఎంలు, సీసీలకు శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో వీవోఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రతీ నెలా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వెయ్యి రోజుల ప్రాముఖ్యత మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండె సంవత్సరాలు నిండే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఆరు నెలలు నిండగానే తల్లిపాలతో పాటు తగినంత అనుబంధ పోషకాహారం అందించాలి. ఇను ము ఎక్కువగా ఉన్న ఆహారం, అయోడీన్ ఉప్పు, టీకాలు, శిశు సంరక్షణలో పరిశుభ్రతను వివరిస్తారు. పిల్లల పోషణకు పాటించే పద్ధతులు పిల్లల పోషణకై వారికి అందించే ఆహారం, టీకాలు, వయసుకు తగ్గ అందించే పోషకాల గురించి అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఆహారం ఎలా ఇవ్వాలి, పరిశుభ్రతను వివరిస్తారు. శిశువుకు సరైన పద్దతిలో ఆహారం ఇస్తున్న తల్లులకు ‘స్టార్’ అమ్మ పేరుతో కండువా కప్పి సత్కరిస్తారు. చేతుల పరిశుభ్రత అనేక రుగ్మతలకు అపరిశుభ్రమైన వాతావరణం, చేతు లు సరిగ్గా కడగకపోవడం కారణాలవుతున్నాయి. చేతు లు సరిగ్గా కడుక్కోకున్నా క్రీములు మానవ శరీరంలోకి వెళ్లి వ్యాదుల సంక్రమణకు దారి తీస్తాయి. ఇందుకు ప్రతీ రోజు అన్నం తినే ముందు, మలమూత్ర విసర్జన, ఆటలాడిన తరువాత సబ్బుతో లేదా బూడిదతో చే తులు కడుక్కోవాలని సూచనలు చేస్తారు. చేతులు కడగడం వల్ల అంటు రోగాల సంక్రమణ, అతిసారం, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గిస్తుంది. శుభ్రమైన సమతుల్యమైన ఆహారం.. రోజు వారీగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు, న్యూట్రిన్లు, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకునే విధానంపై మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కల్తీకి గురయ్యే ఆహారాలేంటీ ఇతర వివరాలను తెలియజేస్తారు. గుడ్లు, కోళ్లు, పప్పులు, పండ్లు, వెన్న, కూరగాయలు తీసుకోవడం వల కలిగే లాభాలను వివరిస్తారు. చెత్త నివారణ, పర్యావరణ పారిశుధ్యం అనేక సమస్యలకు మూల కారణం చెత్తే. ఈ చెత్తను నిర్మూలించడానికి, పర్యావరణ పారిశుధ్యం కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ్యులకు వివరిస్తారు. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం, తడి, పొడి చెత్తను వేరు వేరుగా వేయడంపై అవగాహన కల్పిస్తారు. -
వాస్తవాలు వెలుగులోకి
కొత్త ప్రభుత్వం వచ్చింది. సరికొత్త పథకాలు తీసుకువచ్చింది. ఎంతోమంది మహిళలకు ఆసరా కల్పించేందుకు తాజాగా పథకాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పథకం సత్ఫలితాలనివ్వాలి. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలి. అవినీతికి ఆస్కారం లేకుండా... పూర్తి పారదర్శకంగా... నిజమైన లబ్ధిదారులకే అవి చేరాలి. అందుకు పరిశీలన అవసరం. అందుకే ప్యూరిఫికేషన్ మొదలైంది. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అసలైన సభ్యుల వివరాలు ఈ నెల 20లోగా కంప్యూటరీకరించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. సాక్షి, కురుపాం(విజయనగరం) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం కావాలి. నిర్దేశించిన గడువులోగా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. తద్వారా సర్కారు లక్ష్యం నెరవేరాలి. దానికి తగ్గట్టుగా డ్వాక్రా సంఘాలు పారదర్శకంగా ఉండాలి. అందులో లబ్ధిదారులు యాక్టివ్‌గా ఉండాలి. కానీ మరణించినవారు... స్థానికంగా లేనివారు... ఇంకా సంఘాల్లో కొనసాగుతున్నట్టే రికార్డుల్లో ఉన్నాయి. దానివల్ల కొన్ని చోట్ల అక్రమాలు కూడా జరుగుతున్నాయి. లేనివారి పేర్లతో లబ్ధిపొందుతున్న వారూ ఉన్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ప్యూరిఫికేషన్ పేరుతో వాటిని చక్కదిద్దేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకోసం పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిపై పథకాలు రూపొందించారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, అమ్మ ఒడి, నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం కేటాయింపు వంటివాటిపై చర్యలు చేపట్టారు. ఇవన్నీ నిజమైన లబ్ధిదారులకు అందితేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది. ఇందులో భాగంగా 2009 నుంచి ప్రభుత్వ పథకాలను పొందుతున్న స్వయం సహాయక సంఘాల్లో వాస్తవాలు తేల్చేందుకు సెర్ఫ్ అధికారుల సూచనలతో వెలుగు అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టక పోవడం వల్ల పసుపు కుంకుమ వంటి విషయాల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్, సంఘాలకు చెందిన కొత్త తీర్మానం, రేషన్ కార్డులు, ఫోన్ నంబర్ వంటివి సేకరించి కంప్యూటరీకరణ చేస్తున్నారు. సంఘాల్లో సభ్యులు మృతి చెందినా, మరొక ప్రాంతానికి వెళ్లిపోయినా వారి వివరాలను తొలగిస్తున్నారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లో ఉన్న 12,600 సంఘాలకు చెందిన 99,602 మంది స్వయం సహాయక సంఘ సభ్యుల వివరాలను సేకరించేందుకు అన్ని వెలుగు కార్యాలయాల్లో వెలుగు ఏపీఎం, సీసీ, వీఓఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు నిమగ్నమయ్యారు. చురుగ్గా ప్యూరిఫికేషన్ సెర్ఫ్ సీఈఓ, ఐటీడీఏ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు చురుగ్గా స్వయం సహాయక సంఘా ల ప్యూరిఫికేషన్ చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 20వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది. ప్యూరిఫికేషన్ వల్ల ఇక సంఘాల్లో ఇప్పటికే మృతి చెందినవారు, వేరొక చోటకు వెళ్లిపోయిన వారిని తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాలు వెలుగు ద్వారా పొందే అవకాశం ఉంది. – రామకృష్ణ, వెలుగు ఏపీఎం, కురుపాం మండలం -
నారీలోకం.. నీరాజనం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : డ్వాక్రా మహిళలు మాకే ఓటేశారు. పసుపు–కుంకుమతో వారిని ఆకట్టుకున్నాం... జనవరి నుంచి ఏప్రిల్ లోపు రూ.20 వేలు ఇచ్చాం... మాకు అడ్డులేదు. ఆడపడచులే మమ్మల్ని గెలిపిస్తారు... ఇది చంద్రబాబే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ప్రచారం. ఇది వైఎస్సార్సీపీ నేతల్లో కొంత ఆందోళన కలిగించినా చివరకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే నారీలోకం మద్దతు పలికారు. çపసుపు–కుంకుమతో వారిని ఏమార్చాలని చేసిన యత్నాలను తిప్పికొట్టారు. కనీసం డ్వాక్రా సంఘాల మహిళలు 5.66 లక్షల మంది ఓట్లు వేసినా టీడీపీకి ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరిగేది. ఇదే జరిగితే లక్షల్లో పెరగాల్సిన ఓట్లు వేల సంఖ్యలో కూడా పెరగలేదు. ఆడపడుచులు చంద్రబాబు ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారు. వైఎస్ జగన్ ప్రకటించిన వరాలకు ఆకర్షితులయ్యారు. చంద్రబాబుకు పసుపు పూసి వైఎస్ జగన్‌ను కుంకుమతో ఆశీర్వదించారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి జైకొట్టిన మహిళలు జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం వెనుక మహిళమణులదే ప్రధాన భూమిక. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 20,56,660 ఉండగా అందులో పురుష ఓటర్లు 10,15,964, మహిళా ఓటర్లు 10,40,400, ఇతరులు 296 మంది ఉన్నారు. పురుషుల కంటే 24,436 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17,02,981 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 8,29,063, మహిళలు 8,73,843 ఓటేశారు. పురుషుల కంటే మహిళలు 44,780 మంది అధికంగా ఉన్నారు. పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీకి 10,18,141 మంది జై కొట్టగా టీడీపీకి 5,75,197 ఓట్లేశారు. పసుపు–కుంకుమతో మాయ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ తరుఫున డ్వాక్రా సంఘాలు 35,856, మెప్మా తరుఫున 12,561 వేల సంఘాలున్నాయి. ఇందులో 4,66,440 మంది సభ్యులున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ–2 పథకాన్ని ప్రకటించి ఒక్కోకరికి రూ.10 వేల రూపాయల పోస్ట్ డేటేడ్ చెక్కులిచ్చి హంగామా చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి గొప్పలు పోయారు. చంద్రబాబుకు అభినందనలంటూ మహిళలను బలవంతంగా విజయవాడ తీసుకెళ్లి నానా హింసలు పెట్టారు. మూడు చెక్కులను ఎన్నికలు సమీపించిన వేళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో నగదును ఖాతాల్లో వేసేలా ప్రణాళిక వేశారు. మూడో విడత చెక్కులు ఎన్నికలకు ఆరు రోజులముందు బ్యాంకులో జమ చేసినా నగదు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పుకోలేదు. దీంతో అధికారులతో ఒత్తిడి చేయించి నగదు జమ చేయించాలని చూశారు. కొంతమందికి నగదు అందినా అధికశాతం మందికి మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. బాబును నమ్మని మహిళలు 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచెయ్యి చూపారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. తిరిగి ఎన్నికలు సమీపించిన వేళ అధికారంలోకి వస్తే ఏటా పసుపు–కుంకుమ కింద రూ.10వేలు చొప్పున ఇస్తామని బూటకపుహామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సెల్ఫోన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళలే లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వాగ్ధానాలను వారు నమ్మలేదు. తలకిందులైన అంచనాలు టీడీపీ అంచనాలు తలకిందుల చేస్తూ ప్రలోభాలతో తమను మాయ చేయలేరని ఓటర్లు నిరూపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పారు. గడిచిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారు నగలు, పుస్తెలతాడు పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రచారంతో ఊదరగొట్టి గద్దెనెక్కాక హామీలను ఆటకెకికంచేసి వార్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. కనీసం వడ్డీలేని రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ సొమ్ములనే పసుపు–కుంకుమ రూపంలో పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూశారు. ఐదేళ్లలో పట్టించుకోకుండా ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన గిమ్మిక్కులను మహిళలు ఏ మాత్రం పట్టించుకోలేదు. మహిళల ఓట్లే అధికం పోలైన ఓట్లలో అధికశాతం డ్వాక్రా సభ్యులవే. పసుపు–కుంకుమ మాయలో మహిళల ఓట్లు పడిఉంటే టీడీపీకి అధికంగా ఓట్లు వచ్చేవి. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ, టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. డ్వాక్రా మహిళలే దాదాపు 4.66 లక్షలమంది ఉన్నారు. కానీ జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 5.76లక్షలు మాత్రమే. అదే సమయంలో వైఎస్సార్సీపీకి 10లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే పురుషులతో పాటు మహిళలు అధికసంఖ్యలో వైఎస్ జగన్‌ను నమ్మారని అర్థమవుతోంది. పనిచేయని చంద్రబాబు ఎత్తులు మహిళామణుల ముందర పసుపు–కుంకుమ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఎవరెన్ని చేసినా తాము అనుకున్నదే చేస్తామని నిరూపించారు. వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని అందించడంతో ముఖ్యపాత్ర పోషించారు. జిల్లా జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళలు గెలుపు ఓటమిల్లో తమదైన పాత్ర ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా మగువలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పట్టం కట్టారు. చంద్రబాబును నమ్మలేకపోయారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డ్వాక్రా మహిళలు చంద్రబాబును నమ్మలేకపోయారు. ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చినా వాటి పరిస్థితి అంతేనని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేశారు.– శారదమ్మ, జడ్పీటీసీ, పోరుమామిళ్ల -
పసుపు కుంకుమకు పైసల్లేవు..!
సాక్షి, అమరావతి/మైదుకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ఊదరగొట్టినా మూడో విడత పసుపు–కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళల చేతికి అందలేదు. అదిగో చెక్కు డబ్బులిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు, వారికి సహకరించే సెర్ప్ ఉన్నతాధికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టించారు. తీరా అక్కడకు చేరుకున్న మహిళలు చివరకు ఉసూరుమన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడేలా చేసి.. సాయంత్రానికి ఈ రోజు బ్యాంకులు చెక్కులే తీసుకుంటున్నాయి, డబ్బులు నాలుగైదు రోజుల్లో ఇస్తారని వెలుగు సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కోప్రోదిక్తులైన మహిళలు బ్యాంకుల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. దీని ద్వారా ఎన్నికల్లో ఎంతో లబ్ధిపొందుదామనుకున్న టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ, ఏప్రిల్ ఐదవ తేదీతో ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా బ్యాంకులో చెల్లుబాటు అవుతాయని డ్వాక్రా మహిళలకు నచ్చజెబుతున్నారు. చెక్కులు క్లియర్ అయితే డ్వాక్రా సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. అందుకనుగుణంగా సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ కూడా జిల్లాలో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, సంఘమిత్ర–యానిమేటర్లకు సెల్ ఫోçను మేసేజ్ ద్వారా మెసేజ్‌లు పంపారు. లేని పక్షంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. చెక్కులు వెనక్కి తీసుకున్న సిబ్బంది ఏకంగా సెర్ప్ సీఈవో పేరుతోనే ఆదేశాలు జారీ కావడంతో ఏప్రిల్ 8, 9 తేదీల్లో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను బ్యాంకుల వద్దకు రప్పించడానికి జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది వారికి పంపిణీ చేసిన చెక్కులను బలవంతంగా వెనక్కి తీసేసుకున్నారు. ‘మేమే బ్యాంకుల్లో చెక్కులను జమ చేస్తాం.. మీరందరూ బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకోండి’.. అని చెప్పారు. దీంతో సంఘాల్లో మహిళలు సోమవారం ఉ.10 గంటలకే బ్యాంకులకు క్యూకట్టారు. అక్కడ గంటల తరబడి పడిగాపులు పడ్డాక అధికారులు.. ‘ఇప్పుడు చెక్కులే తీసుకుంటాం.. డబ్బులు నాలుగు రోజులు ఆగాక ఇస్తాం’.. అని చెప్పడంతో మహిళలు తిట్టుకుంటూ వెనుతిరిగారు. ఎన్నికలయ్యాక మళ్లీ డబ్బులు ఇవ్వరేమోనని భయపడి తాము ఇంతమంది ఒకేసారి వచ్చామని విజయవాడ బందరు రోడ్డులోని టైమ్స్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకు వద్ద కూలైన్లో నిలుచున్న భారతి అనే డ్వాక్రా సంఘం లీడరు ‘సాక్షి’కి వివరించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో దాదాపు 420 డ్వాక్రా సంఘాల పేరిట ఇచ్చిన చెక్కులను యానిమేటర్లు వెనక్కి తీసుకున్నారు. సోమవారం వివిధ సంఘాలకు చెందిన 3.15 లక్షల చెక్కులను బ్యాంకుల్లో జమ అయ్యాయని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలిపారు. మైదుకూరులో ధర్నా పసుపు–కుంకుమ కింద ఇచ్చిన మూడో విడత చెక్కులు చెల్లకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మైదుకూరులోని భారతీయ స్టేట్ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బ్యాంకు ఎదుటే కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో చెక్కులు ఇవ్వడం శోచనీయమన్నారు. అయినా.. ఆ ఇచ్చేదేదో మూడు విడతల్లో ఇవ్వకుండా ఒకేసారి ఇచ్చి ఖాతాల్లో నేరుగా జమచేసి ఉంటే తమకు ఈ తిప్పలు ఉండేవి కావన్నారు. -
అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా
సాక్షి, విజయనగరం పూల్‌బాగ్: వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరికి రూ.50వేల మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తారు. వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఈ ప్రకటనపై నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయాం పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో బ్యాంక్‌లో రుణాలు కట్టలేదు. నేటికీ రుణాలు మాఫీ చేయలేదు. నెల నెలా వడ్డీలు కడుతున్నాం. బాబు మాటలు నమ్మి మోసపోయాం. ఐదేళ్ల పాలనలో మహిళలకు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు. జగనన్న ప్రకటించిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. – కాదులూరి లీలాత్రి, బూర్లి పేట, 38వవార్డు, విజయనగరం. బతుకులు బాగు పడతాయి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయి. రుణాలన్నీ మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పొదుపు రుణాలు మాఫీ అయితే కష్టాల నుంచి బయట పడినట్లు అవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. మహిళల కోసం జగన్ ప్రకటించిన పథకాలు బాగున్నాయి. – పండూరి మంగమ్మ, ఆబాద్‌వీధి, అశోక్‌నగర్ మహిళల జీవితాల్లో వెలుగు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మహిళల జీవితాల్లో వెలుగులు వస్తాయి. టీడీపీ మోసాలను మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. మా కష్టాలను తెలుసుకున్న జగనన్న అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందజేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం. వడ్డీ లేని రుణాలను అందించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – మహంతి లక్ష్మి, పూల్‌బాగ్‌కాలనీ, 3వవార్డు, విజయనగరం టీడీపీకి గుణపాఠం తప్పదు.. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంక్ రుణాలు కట్టకపోవడంతో వడ్డీలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు మా పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి చేసేదేమీ లేక వడ్డీతో సహా చెల్లిస్తున్నాం. హామీ నెరవేర్చలేనప్పుడు మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పడం ఎందుకు? ఇచ్చిన డబ్బులు వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోలేదు. టీడీపీకి ఈ సారి గుణపాఠం తప్పదు. – పి.శ్రీదేవి, అశోక్‌నగర్, విజయనగరం -
ఎన్నికల తాయిలాలు షురూ..
సాక్షి,తిరుపతి తుడా: తిరుపతి నగరంలో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి తాను అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో ప్రలోభాలకు తెరతీశారు. డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు, ఆయా గ్రూపుల్లో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చికవేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తమ మాట వినే ఒక్కో ఆర్పీకి, గ్రూప్ లీడర్లకు చీర, రవిక, స్వీట్ బాక్స్‌లను అందించారు. అలానే పార్టీ సానుభూతిపరులై ఆయా ప్రాంతాల్లో కీలకంగా ఉన్న మహిళలను గుర్తిం చారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి గిఫ్ట్‌బాక్స్‌లను అందిస్తున్నారు. సీఎం సభకు రావాలని ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు డ్వాక్రా మహిళలను బానిసల్లా చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా సభలకు, సమావేశాలకు రావాలని డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడంలేదా?, సభకు రాకుంటే పేరును బ్లాక్ సిస్ట్‌లో పెడతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మెప్మా సిబ్బందితోపాటు అధికార పార్టీ నాయకులు గ్రూపులు వారీగా ఫోన్ నెంబర్లను సేకరించి ఫోన్ చేస్తూ సోమవారం నిర్వహించే సీఎం సభకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. శివరాత్రి, సెలవు కావడంతో పిల్లలు ఇంట్లో ఉంటారు వచ్చేందుకు కుదరదని మహిళలు వేడుకుంటున్నా మెప్మా సిబ్బంది వేధిపులకు గురి చేస్తున్నారు. ‘మీ పేరు బ్లాక్ íలిస్ట్‌లో పెడతాం. చెక్ రాకుండా చేస్తాం’ అంటూ మహిళలకు వ్యక్తిగతంగా వేదిస్తున్నారు. గ్రూపుల వారీగా సీఎం సభకు వచ్చి ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు తీసుయించుకుని మెప్మా గ్రూప్‌లో పోస్టు చేయాలని హుకుం జారీ చేశారని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెల్లింపులేవి బాబూ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఆకివీడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరుగుతోంది. మహిళల కష్టార్జితానికి రెక్కలు వస్తున్నాయి. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన డబ్బులు దారి మళ్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు ఇసుక ర్యాంపులు అప్పగించి డబ్బులు కూడబెట్టుకునేలా చేశారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే డబ్బులను డ్వాక్రా సంఘాలకు ఇవ్వకుండా ప్రభుత్వమే వాడేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళల ఆధీనంలో నడుస్తున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం క్వింటాలుకు రూ.30 చొప్పున కమీషన్ రూపంలో కేంద్రాలకు చెల్లిస్తారు. నాలుగేళ్లుగా సుమారు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రకారంగా కేంద్రాలకు రూ.36 కోట్లు కమీషన్లుగా ఆయా డ్వాక్రా గ్రూపులకు మంజూరయ్యాయి. ఈ ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గత 2014–15, 15–16 సంవత్సరాల్లో రూ.16 కోట్లు కమీషన్ల రూపంలో సివిల్‌సప్లయిస్ శాఖ డీఆర్డీఏకు బదిలీ చేసింది. గ్రామ సంఘాల పరిధిలోని మహిళలు కమీషన్ సొమ్మును పంచుకోవలసి ఉంది. 2016–17, 17–18 సంవత్సరాలకు మరో రు.20 కోట్లు కమీషన్ల రూపంలో పౌరసరఫరాల శాఖ నుండి రావాల్సి ఉంది. వీటిని కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కలిపి భవనాల నిర్మాణాలకు మళ్లించేశారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లర్లకు సరఫరా చేసేందుకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను కూడా వారికి ఇవ్వడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా మహిళలకు కమీషన్ల రూపంలో ఒక్క పైసా చెల్లించిన దాఖలాలు లేవు. కేంద్రాల్లో పనిచేసే మహిళలకు మాత్రం ప్రతి రోజూ రూ.500 చొప్పున కూలి కేటాయించి చెల్లిస్తున్నారు. వీటితో పాటు ఆఫీసు మెయింటెనెన్స్, అద్దెలు తదితర వాటికి బిల్లులు చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం దారి మళ్లించి, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. ఒకొక్క గ్రామ సంఘ భవనానికి రూ. 6 లక్షలు, మరో రూ.6 లక్షలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు, మండల సమాఖ్య భవనానికి రూ.7 లక్షలు కమీషన్ సొమ్ముతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.13 లక్షలు కలిపి రూ.20 లక్షలతో మండల సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 700 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 184 గ్రామ సంఘ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. నిర్వహణ ఖర్చులపై ఆసక్తి ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకూ ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ, ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో మహిళలకు రూ.500 కూలి చెల్లిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే మహిళలు కనీసం కూలి డబ్బు అయినా వస్తుందని ఆశతో పని చేస్తున్నారు. నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లించడంతో ఆ సొమ్ముతో డ్వాక్రా మహిళల్లో విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. పర్మినెంట్ అవుతుందని ఆశ ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని కొంత మంది మహిళలు ఆశతో కేంద్ర నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ సమాఖ్యలోని సభ్యులు నిర్వహణా బాధ్యతల కోసం ఆరాటపడుతున్నారు. ఏటా నిర్వహణ బాధ్యతను కొత్త గ్రూపులకు ఇవ్వాల్సి ఉండగా, స్థానిక తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమైన గ్రూపులకు కేటాయించి కేంద్రాలపై అజమాయిషీ పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీలకు కేటాయింపు పంచాయతీల్లో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షల చొప్పున ఐకేపీ కమీషన్ల సొమ్మును దారి మళ్లించారు. పంచాయతీల పరిధిలో ఈపోస్, కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్ తదితర వాటిని కొనుగోలు చేశారు. ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పంచాయతీలకు చేరింది. ఇసుక అమ్మకాలపైనా ఇదే దందా! డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంపులు కేటాయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం భజన చేసింది. అయితే ఇసుక అమ్మకాలపై తెలుగు తమ్ముళ్లు మహిళా గ్రూపుల్లో తలదూర్చి వారిని పక్కనపెట్టి ఇసుక మాఫియాను ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ర్యాంపుల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. తదనంతరం మాఫియా గుప్పిట్లోకి ఇసుక ర్యాంపులు వెళ్లిపోయాయి. కమీషన్ సొమ్ము ఉచితంగా ఇవ్వరు గ్రామ సంఘాలకు వచ్చే కమీషన్ సొమ్మును వ్యక్తిగతంగా పంపిణీ చేయరు. ఆ సొమ్ము గ్రామ సంఘాల ఖాతాల్లో నిల్వ ఉంటుంది. వడ్డీలకు తీసుకుని సభ్యులు వినియోగించుకోవచ్చు. నాలుగున్నర ఏళ్లుగా కమీషన్ సొమ్ము ఎవరికీ పంచలేదు. గ్రామసంఘాల, మహిళా సమాఖ్య భవనాలకు రూ. 6 లక్షలు, పంచాయతీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.2 లక్షలు చొప్పున కేటాయించాం. – వడ్డి రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య, ఆకివీడు -
‘మహానాయకుడు’ ఇంతగా దిగజారిపోయిందా..?
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు కోసం ఉచిత షోలు వేస్తున్నారు. ఈనెల 25 ఉదయం, మ్యాట్నీ షోలతో పాటు, 26న నాలుగు షోలలో కూడా తమ పార్టీ నేతలకు, డ్వాక్రా మహిళలకు 50 శాతం టికెట్లు కేటాయించాలన్న టీడీపీ అదేశాలతో ఉషా పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని కౌన్సిలర్లతో పాటు టీడీపీ నాయకులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలకు సినిమా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమాను టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం తీయడంతోపాటు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తెరకెక్కించకపోవడంతో సినిమా డిజాస్టర్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ సినిమాను అందరికీ చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉచిత షోలు వేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలను టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు సాధికార మిత్రలుగా నియమించారు. ఇటీవల పోలవరం, అమరావతి చూసేందుకు బస్సుల్లో తరలించగా, ఇప్పుడు సినిమాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన పోస్ట్ పెయిడ్ చెక్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడతారోనని తప్పని పరిస్థితుల్లో వారి మాట వినాల్సి వస్తోందని డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డ్వాక్రా మహిళలపై మంత్రి పరిటాల వర్గీయులు దాడి
-
ఫోర్జరీ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు
సాక్షి, గన్నవరం: డ్వాక్రా గూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, ఆమె కుమార్తెపై కోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గన్నవరం మండలం దావాజిగూడెం ఉజ్వల గ్రామ సమాఖ్య సంఘంలోని రసూల్ స్వయం సహాయక సంఘంలో షేక్ రిజ్వానా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 2016, ఫిబ్రవరిలో మూడుసార్లు మొత్తం రూ.7.60 లక్షలు జమయ్యాయి. దీనిపై అప్పటి గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గొంది నాగరాజు(రాణి)ను ఆమె ప్రశ్నించగా.. . బ్యాంక్ ఖాతాలు లేని రైతుల ధాన్యం కొనుగోలు మొత్తాన్ని జమచేసేందుకు రిజ్వానా అకౌంట్ ఇచ్చినట్లు సమాధానమిచ్చింది. రిజ్వానా తన ఖాతాలోని నగదు డ్రా చేసి రాణికి, ఆమె కుమార్తె గొంది ప్రగతికి ఇచ్చింది. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తన పేరిట జరిగిన ధాన్యం విక్రయ పత్రాల్ని రిజ్వానా పరిశీలించగా.. ట్రాక్‌షీట్, రైతు కొనుగోలు ధ్రువపత్రం, రైతు చెల్లింపు తదితర పత్రాలపై ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై జిల్లా కలెక్టర్, వెలుగు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగు అధికారులు విచారణ జరిపి రిజ్వానా సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహరంపై గతేడాది నవంబర్ 16న ఆమె గన్నవరం సీఐ, విజయవాడ సీపీతో పాటు జిల్లా కలెక్టర్, డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గన్నవరంలోని 11వ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 200 కింద గొంది నాగరాజు(రాణి), ఆమె కుమారై గొంది ప్రగతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులను కోర్టు ఆదేశించింది. రెండు వారాల అనంతరం పోలీసులు సోమవారం వీరిద్దరిపై సెక్షన్ 420, 468, 471, 477, 506, 120(బి) రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. -
అప్పు ఇస్తూ ఎన్నికల డప్పు!
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మహిళలను మోసగించడానికి ఎత్తులు వేస్తున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తూ మరోసారి అధికారంలోకి రావడానికి పాచికలు విసురుతున్నారు. రుణాలు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే ‘మాఫీ’ చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిన తీరు చూసి అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళలు నిర్ఘాంతపోయారు. ఆయన మాటలు నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత.. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న సమయంలో మరోమారు మహిళలకు ఎన్ని‘కల’ తాయిలాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి రావాలని కొత్త ఎత్తుగడ సీఎం చంద్రబాబు తాజాగా ‘పసుపు – కుంకుమ’ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం అప్పుగా ఇస్తున్నప్పటికీ, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. రాష్ట్రంలోని 93.80 లక్షల మందికి రూ.9,380 కోట్లు ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో తొలిదఫాలో రూ.2,500, రెండో దఫాలో రూ.3,500, మూడో దఫాలో రూ.4 వేల చొప్పున మహిళల ఖాతాల్లో జమ అయ్యేలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బును మూడు దఫాల్లో ఇస్తామని చెబుతున్న చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని డ్వాక్రా సంఘాల మహిళలు చెబుతున్నారు. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే ఎన్నికల కమిషన్ దీన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు దీనిని ప్రకటించారని, నెపం ఎన్నికల కమిషన్‌పై వేసి లబ్ధి పొందాలని చూస్తారని ఓ అధికారి అన్నారు. అప్పుల ఊబిలో మహిళలు విలవిల 2014 ఎన్నికల ముందు చెప్పిన విధంగా డ్వాక్రా రుణ మాఫీ సాధ్యం కాదని అధికారం చేజిక్కించుకున్నాక చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పారు. మాఫీకి బదులు పెట్టుబడి నిధిగా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం కూడా రూ.3 వేలు, 3 వేలు, 2 వేలు, 2 వేలు ఇలా నాలుగు దఫాలుగా అందజేశారు. బాబు వాగ్దానాన్ని నమ్మిన మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు నోటీసులిచ్చారు. నగలు వేలం వేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా వడ్డీ రూపంలో జమ చేసుకున్నారు. దీంతో చాలా మంది మహిళలు తాము తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే తిరిగి అప్పులు చేయాల్సి వచ్చింది. వైఎస్సార్ చేయూత, ఆసరా వైపే మహిళలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తానంటున్న రూ.10 వేల కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వైపే మహిళలు మొగ్గు చూపుతున్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల రోజు వరకు డ్వాక్రా మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మేది లేదని, నమ్మి మోసపోయింది చాలని అంటున్నారు. మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఈ డబ్బులు పూర్తిగా ఇస్తారనే నమ్మకం మాకు లేదు. ఒకసారి మోసపోయాం. మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము. – కంచికచర్ల పద్మావతి, డ్వాక్రా మహిళ, పరిటాల, కృష్ణా జిల్లా నాటి హామీ ఏమైంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వస్తారు. నాడు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేసి తర్వాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు అంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.10 వేలను ఒకేసారి ఇవ్వాలి. – కృష్ణా వీరనారాయణమ్మ, డ్వాక్రా మహిళ, గండేపల్లి, కృష్ణా జిల్లా ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆ తర్వాత నిండా ముంచారు. నాలుగున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ పసుపు–కుంకుమ పేరుతో మా వద్దకు వస్తున్నారు. రూ.10 వేలు ఇవ్వాలనుకుంటే ఒకేసారి నగదుగా ఇవ్వొచ్చుగా? ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో డ్వాక్రా మహిళలు లేరు. – మూడెడ్ల ఉమా, డ్వాక్రా మహిళ, గుడివాడ, కృష్ణా జిల్లా జగన్ రూ.75 వేలు ఇస్తామంటున్నారు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాట తప్పే నాయకుడు కాదు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాం. ఇకపై మోసపోయే పరిస్థితి లేదు. రుణమాఫీని ఏమార్చి పసుపు–కుంకుమ అని ఎప్పుడో చెల్లేలా బాబు చెక్కులు ఇస్తే వాటిని ఏం చేసుకోవాలి? – మాదాసు వెంకటలక్ష్మి, గుడివాడ, కృష్ణా జిల్లా -
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహిళల ఓట్ల కోసం పదివేల పథకం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా ఇచ్చారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. పదివేలను ఒక్కసారిగా ఇవ్వమని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం మూడు విడతలుగా, అంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రజలను ప్రభావితం చేసేలాగా ఈ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కూడా ఎక్కడా నగదు చెల్లింపులు లేకుండా ఫిబ్రవరిలో డ్వాక్రామహిళలకు మూడు చెక్కులు ఇవ్వబోతున్నారు. వీటిలో ఒక చెక్కు ఫిబ్రవరికి సంబంధించి రూ. 2500, మార్చినెలకు సంబంధించి రూ.3500, ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 4000 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి నిధులు ఇస్తామనే సందర్భాలు ఎక్కడా ఉండవు. ప్రభుత్వ తీరుపై డ్వాక్రామహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఏపీలో వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేయడం లేదు. ఆగిపోయిన వడ్డీలేని రుణాలు రూ.2200 కోట్ల బకాయిలనే ఇవ్వకుండా వాటినే ఫిబ్రవరిలో చెక్కురూపంలో పసుపుకుంకుమ అనే పేరుతో కొత్త పథకంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. గతంలో కూడా రూ. 14200 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు డ్వాక్రా మహిళలకు మరో టోకరా
-
టీడీపీ సేవకు డ్వాక్రా!
సాక్షి, అమరావతి బ్యూరో: డ్వాక్రా సంఘాలను అధికార పార్టీ సానుభూతిపరులతో నింపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి బలవంతపు తీర్మానాల ద్వారా తప్పిస్తూ ఆ స్థానంలో తనకు అనుకూలమైన వారిని చేర్చుకునే కార్యక్రమానికి తెర తీసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల కుటుంబాలు, 3.60 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరందరినీ అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ప్రతి 100 మంది ఓటర్లకు ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఓ ఇన్చార్జిని నియమించారు. ఆ ఇన్చార్జి ఆధ్వర్యంలో పనిచేయాలంటూ డ్వాక్రా మహిళలపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు పలువురు మహిళలు నిరాకరిస్తున్నారు. దీంతో వీరిని తొలగించి తమవారిని నియమించుకునే ఎత్తుగడ వేశారు. దీన్ని అమలు చేయటంలో భాగంగా 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి తప్పించాలనే అంశాన్ని సర్కారు తెరపైకి తెచ్చింది. వీరి స్థానంలో తమకు అనుకూలమైనవారిని, టీడీపీ అనుబంధ సంఘాలకు చెందినవారిని, నేరుగా తమ మనుషులను సంఘాల్లో నియమించుకోవాలని సర్కారు ఎత్తుగడ వేసింది. కుప్పకూలుతున్న డ్వాక్రా వ్యవస్థ వయసు పైబడినా క్రియాశీలంగా ఉంటూ చిరు వ్యాపారాలతో తమ కాళ్ల మీద నిలబడుతున్న మహిళలను సైతం సంఘాల నుంచి సర్కారు తొలగిస్తోంది. ఇది వయో వృద్ధులైన 35 లక్షల మంది డ్వాక్రా మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్నో ఏళ్లుగా డ్వాక్రా వ్యవస్థకు ఆసరాగా నిలిచిన మహిళలను సంఘాల నుంచి బలవంతంగా తొలగిస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బ్యాంకులపై నెపం వేస్తూ రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళలను తొలగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. పొదుపు సంఘాల మహిళలతో సర్కారు ప్రచారం.. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అడ్డదారులు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 9.32 లక్షల డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 95 లక్షల మంది పొదుపు మహిళలతో అధికార పార్టీకి అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహిస్తోంది. వయోభారం తదితర కారణాలతో తమకు సహకరించని డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. సీఎం సభలు, టీడీపీ కార్యక్రమాలకు కచ్చితంగా రావాల్సిందే.. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) పర్యవేక్షణలో డ్వాక్రా మహిళల తొలగింపు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ వ్యూహాన్ని రచించింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్చార్జ్ని నియమించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ప్రణాళిక. ఆ ఇన్చార్జ్కు స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు సహకరించాలని అనధికారికంగా హుకుం జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే సభలకు తప్పనిసరిగా హాజరు కావడంతోపాటు ఇతర టీడీపీ కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేసింది. పరోక్షంగా వేటు.. టీడీపీకి అనుకూలంగా ఆర్టీజీఎస్ పర్యవేక్షణలో పనిచేసే ఇన్‌చార్జ్‌ల వెంట ఇంటింటికి తిరిగేందుకు పలువురు డ్వాక్రా మహిళలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. గంటల తరబడి జాప్యంతో జరిగే సీఎం చంద్రబాబు సమావేశాలకు హాజరుకావడం కూడా వారికి ఎంతో ఇబ్బందిగా పరిణమించింది. దీంతో తమకు అనుకూలంగా ఉండేలా విధివిధానాలను సర్కారు అనధికారికంగా రూపొందించింది. మొదట వయో వృద్ధులైన డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుంది. 60 ఏళ్లు దాటిన సభ్యులను డ్వాక్రా సంఘాల నుంచి వెంటనే తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారి స్థానాల్లో కొత్తగా టీడీపీకి చెందిన వారు, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసే వారిని సభ్యులుగా చేర్చాలని మౌఖిక ఆదేశాల ద్వారా స్పష్టం చేసింది. నేరుగా ప్రభుత్వం తొలగిస్తున్నట్టు కాకుండా ఇతర మార్గాల ద్వారా వారిపై వేటు వేయాలని ఆదేశించారు. బ్యాంకులపై నెపం మోపి బలవంతపు తీర్మానాలు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వృద్ధులైన డ్వాక్రా మహిళలను తొలగించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. బ్యాంకులపై నెపం మోపి 60 ఏళ్లు దాటిన మహిళలను డ్వాక్రా సంఘాల నుంచి తొలగించాలని ఎత్తుగడ వేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలు రుణాలను సక్రమంగా చెల్లించలేకపోతున్నారనే వాదనను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద వయసు మహిళలను తొలగించి వారిస్థానంలో కొత్త సభ్యులను చేర్చుకుంటున్నట్లు తీర్మానాలు చేయాలని సంఘాలకు సూచించారు. లేదంటే ఆ సంఘాలకు రుణాలు రావని తెగేసి చెప్పారు. జనవరి నుంచి డ్వాక్రా మహిళల ద్వారా విస్తృతంగా ప్రభుత్వ, పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రచారం చేయాలనేది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకే 60 ఏళ్లు దాటిన వారందర్నీ డిసెంబరు ఆఖరుకు తొలగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నా సరే... రాజకీయ కోణంలో టీడీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని దెబ్బతీస్తోంది. వారిని తొలగిస్తే కానీ రుణాలు ఇవ్వరాదని ప్రభుత్వం చెప్పడంపై డ్వాక్రా సంఘాలు విస్తుపోతున్నాయి. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 60 ఏళ్లు దాటిన మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. పాలవ్యాపారం, కిరాణా వ్యాపారం, చేతివృత్తులు, అప్పడాలు తయారీ వంటివాటితో ఉపాధి పొందుతున్నారు. సక్రమంగా బ్యాంకు రుణాలు కూడా తీరుస్తున్నారు. టీడీపీ సర్కారు తమవారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద వయసు మహిళలను సంఘాల నుంచి తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. విధిలేక వేటేస్తున్న సంఘాలు... విధిలేని పరిస్థితుల్లో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించే ప్రక్రియను డ్వాక్రా సంఘాలు చేపట్టాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9.30 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 7.31 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 95 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 60 ఏళ్లు దాటిన వారు ముగ్గురు నలుగురు సభ్యులున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన డ్వాక్రా సంఘాల సభ్యులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారందర్నీ డిసెంబర్ ఆఖరునాటికి తొలగింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఆసరా కోల్పోయి అల్లాడుతున్న మహిళలు.... ప్రభుత్వ అమానవీయ చర్యతో 35 లక్షలమంది డ్వాక్రా మహిళలు ఆసరా కోల్పోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న తాము డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారాలు, ఇతరత్రా వృత్తులతో ఉపాధి పొందుతున్నామని పేర్కొంటున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని తమను తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. తొలగించే నిబంధన ఏదీ లేదు నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటితే మహిళలకు డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం కల్పించవచ్చు. అయితే తొలగింపుపై నిర్దిష్ట వయో పరిమితి ఏదీ డ్వాక్రా నిబంధనల్లో లేదు. అయినప్పటికీ దీన్ని పట్టించుకోకుండా సర్కారు తన రాజకీయ అవసరాలకు ఉపయోగపడటం లేదనే అక్కసుతో 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల నుంచి తొలగిస్తుండటం గమనార్హం. తన చేతికి మట్టి అంటకుండా బలవంతంగా సంఘాలతో తీర్మానం చేయిస్తూ లక్షల మంది మహిళలను తొలగిస్తోంది. గత ఆరేడు నెలలుగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్కారు తీరుపై కొందరు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకున్నా పొదుపు మొత్తాలతో సంఘాల్లో సభ్యులుగా కొనసాగేలా అనుమతించాలని సూచిస్తున్నారు. బకాయిలు లేకుండా అప్పు తీర్చినా... నాకు 60 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా విస్సన్నపేట డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నా. కొద్ది నెలలుగా నేను సంఘం అప్పు గురించి అడుగుతుంటే లీడర్లు సమాధానం చెప్పడం లేదు. గట్టిగా అడిగితే అసలు విషయం చెప్పారు. నన్ను సంఘం నుంచి తొలగిస్తేనే రుణం ఇస్తామని అధికారులు చెప్పారట. నేను పొదుపు సక్రమంగా కడుతూ, బకాయిలు లేకుండా అప్పులు చెల్లించా. అయినా సరే నన్ను సంఘం నుంచి తొలగించారు. నా భర్త చనిపోయినందున వితంతు పెన్షను కోసం దరఖాస్తు చేస్తే అదీ మంజూరు కాలేదు. డ్వాక్రా గ్రూపు ఆసరా లేక, పెన్షను అందక వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మందులు కొనుక్కోడానికి కూడా డబ్బు లేక అవస్థ పడుతున్నా. – కందుల భారతి (విస్సన్నపేట, తిరువూరు మండలం, కృష్ణా జిల్లా) అన్యాయంగా తొలగించారు.. లక్ష్మీమాతా డ్వాక్రా సంఘంలో ఎన్నో ఏళ్లుగా సభ్యురాలిగా ఉన్నా. బ్యాంకు అప్పు ఎప్పటికప్పుడు తీరుస్తూనే ఉన్నా. ఇన్నేళ్లలో రుణం చెల్లించకపోవడం అన్నదే లేదు. ఇప్పుడు హఠాత్తుగా నన్ను సంఘం నుంచి తొలగించేశారు. 60 ఏళ్లు దాటినవారిని తొలగిస్తున్నాం అని చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉన్నా. చిరువ్యాపారం చేసుకుంటూ రుణాలు సక్రమంగా తీరుస్తున్నా అకారణంగా తొలగించారు. డ్వాక్రా రుణం ఇచ్చేముందు నన్ను తొలగించడం బాధేసింది. ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతున్న నేను ఉన్న ఆధారం కోల్పోయి ఇతరుల మీద ఆధార పడాల్సిన దుస్థితి వచ్చింది. – రాజులపాటి వెంకటేశ్వరమ్మ(మండవల్లి, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా) -
వీవోయేల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు
సాక్షి, అమరావతి : డ్వాక్రా యానిమేటర్ల(వీవోయేల) ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డ్వాక్రా యానిమేటర్లు (వీవోయే)లు సోమవారం నుంచి తలపెట్టిన ఆందోళనలు, చలో కలెక్టరేట్ కార్యక్రమాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం ప్రకటించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ ప్రకటనలో ‘‘వీవోయేలకు న్యాయబద్ధంగా జీతాలను చెల్లించకపోగా వారికి ఆర్థిక సహాయం అంటూ తాజాగా నెలకు రూ.3,000 సహాయం(సర్వీస్ ఛార్జ్) అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికలు నాలుగైదు నెలలు ఉన్నాయనగా జారీ చేసిన ఈ జీవోకు, ఇంతకు ముందు ప్రభుత్వం వీవోయేలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధం లేదు. ప్రమోషన్లు, ప్రమాద బీమా, సెర్ఫ్ నుంచి గుర్తింపు కార్డుల ప్రస్తావనే ఈ జీవోలో లేదు. ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో జూలై 15న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి డ్వాక్రా యానిమేటర్లు తమ గోడును వెళ్ళబోసుకున్న సందర్భంగా, వారికి తమ ప్రభుత్వం వచ్చాక రూ.10,000 వేతనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన తరవాత యానిమేటర్ల జీతాలను నిలిపివేయటం... ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న భయంతో రూ.3000, అదీ ఈ నవంబరు నుంచి ఏడాది కాలం మాత్రమే ఇస్తాం అంటూ జీవో జారీ చేయటం దుర్మార్గమన్న వీవోయేల వాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపరుస్తోంద’’ పేర్కొంది. వీవోయేల ఆందోళనలకు జిల్లాల వారీగా మద్దతు పలకాల్సిందిగా వైఎస్సార్ సీపీ తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. -
ఇచ్చేది అప్పు..చేసేది మోసం!
సాక్షి, అమరావతి: సొమ్మొకరిది సోకొకరిది! సొమ్ము ప్రజలది.. సోకు చంద్రబాబుది! పొదుపు సంఘాలకు పైసా కూడా రుణమాఫీ చేయకపోయినా డ్వాక్రా మహిళల ధన్యవాదాల పేరుతో రూ.15 కోట్ల ప్రజాధనాన్ని గోడల పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రికి పొదుపు సంఘాల మహిళలు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా రూపొందించిన ప్రచార స్టిక్కర్లను ఊరూరా, ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించాలని టీడీపీ సర్కారు ఆదేశించింది. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించినా... ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ సీఎం చంద్రబాబు ఫొటోతో స్టిక్కర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటిని నేడో రేపో టీడీపీ ఏజెంట్లు, సాధికార మిత్రలు ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించనున్నారు. మహిళల నుంచి కృతజ్ఞతలు చెప్పించుకోవటానికి నానా ఇబ్బందులు, తంటాలు పడినా ఆశించిన ఫలితం లేకపోవటంతో స్టిక్కర్ల రూపంలో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పు రూపంగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలోని ఓ భాగం, లబ్ధిదారుల ఇంటి వద్ద శనివారం (నేడు) లోగా ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లను అతికించాలంటూ సెర్ఫ్ సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు పసుపు కుంకుమ పేరుతో వంచన ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ అంటూ నట్టేట ముంచింది. వాస్తవానికి 2015లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. సర్కారు ఇప్పుడు డ్వాక్రా మహిళలతో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకుని పోస్టర్లను అతికిం చేందుకు సాధికార మిత్రలను టీడీపీ కూలీల మాదిరిగా వినియోగించుకోనుంది. ప్రజలంతా బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా రూపొం దించిన కోటిన్నర స్టిక్కర్ల కోసం రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం రూ. 15 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. పసుపు కుంకుమ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదంటూ గోడలకు అతికించడానికి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్లు ఒక్క మహిళకూ మాఫీ కాలేదని మంత్రే అంగీకరించారు డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర ఏళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. తమ ప్రభుత్వం ఏ ఒక్క డ్వాక్రా మహిళలకూ రుణమాఫీ చేయలేదని సంబంధిత శాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వాస్తవం ఇలా ఉండగా డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని పేర్కొంటూ, అందుకు ప్రజలంతా స్వచ్చందంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రచార స్టిక్కర్లలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడతారనే వ్యూహంతో రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన సాధికార మిత్రలకు ఈ ధన్యవాదాల ప్రచార స్టిక్కర్లను ఇంటింటికీ అతికించే బాధ్యత అప్పగించారు. శుక్ర, శనివారాల్లో కోటిన్నర ప్రచార స్టిక్కర్లను అన్ని ఇళ్లకు అతికించే బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా అధికారులకు అప్పగించారు. పచ్చని పల్లెల్లో స్టిక్కర్ల చిచ్చు..? సీఎం చంద్రబాబు సొంత ప్రచారం కోసం తెరపైకి తెచ్చిన డ్వాక్రా ధన్యవాదాల స్టిక్కర్లు పచ్చని పల్లెల్లో చిచ్చు రేపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ జరగక అప్పుల్లో కూరుకుపోయామని ఆగ్రహంతో ఉన్న డ్వాక్రా మహిళలు తిరగబడే అవకాశం ఉందని, అధికార బలంతో బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని సెర్ప్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నా తప్పని వడ్డీ భారం.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబు సర్కారు కనీసం పావలా వడ్డీ, సున్నా వడ్డీ కూడా దక్కకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రతి నెలా సకాలంలో వాయిదాలను చెల్లించే మహిళా సంఘాలకు సున్నా వడ్డీ వర్తింప చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ డబ్బులను 2016 సెప్టెంబర్ నుంచి బ్యాంకులకు చెల్లించడం లేదు. దీంతో సున్నా వడ్డీ బకాయిలు ఇప్పటి వరకు రూ.2275 కోట్ల మేర పేరుకుపోయాయి. మహిళా సంఘాలు సకాలంలో ప్రతి నెలా వాయిదాలను చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి సున్నా వడ్డీ నిధులను బ్యాంకులకు ఇవ్వకపోవడంతో వాయిదాలతోపాటు వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి అథ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనే వెల్లడైంది. రూ.14,205 కోట్ల నుంచి రూ.22,174 కోట్లకు పెరిగిన రుణభారం డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి రుణమాఫీ చేయబోనని, కేవలం పెట్టుబడి నిధి ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో ఎన్నికల నాటికి మహిళా సంఘాలు రుణాలు 14,205 కోట్ల రూపాయలుండగా ఇప్పుడు వారి పేరిట రుణ భారం 22,174 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల సున్నా వడ్డీకి కేవలం రూ.1,000 కోట్లనే కేటాయించారు. సున్నా వడ్డీ బకాయిలే రూ.2,275 కోట్లు ఉండగా ప్రస్తుత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ఏ మూలకు వస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బాబు హామీని అమలు చేయకపోవడం వల్ల సంఘాలకు ఎంత నష్టం? చంద్రబాబు హామీని అమలు చేసి ఉంటే 2014 నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ. 14,205 కోట్ల రుణాలన్ని మాఫీ అయ్యేవి. మళ్లీ ఆ సంఘాలకు రూ.14,205 కోట్లు లేదంటే అంతకంటే ఎక్కువగా 2014లోనే వాటి పేరిట బ్యాంకులు రుణాలిచ్చేవి. మాఫీ అయ్యే డబ్బులు, దానిపై వడ్డీ, కొత్తగా వచ్చే రుణం.. ఇలా మొత్తంగా ఈ నాలుగున్నర ఏళ్లలో 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు సరాసరిన ఒక్కొక్కొరు రూ.35,500 దాకా నష్టపోయి ఉంటారని అంచనా. పెట్టుబడి నిధి డబ్బులు బకాయిల కింద జమ ఒకపక్క రుణమాఫీ చేయకపోగా మరోపక్క సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా మహిళా సంఘాలను బాబు సర్కారు దారుణంగా మోసగించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి నిధి కింద ఇస్తున్న డబ్బులను బ్యాంకులు మహిళా సంఘాల రుణ బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. పెట్టుబడి నిధి కింద ఇచ్చిన డబ్బులను మహిళా సంఘాలు డ్రా చేసుకోవడానికి అనుమతించాలని కోరితే రుణ బకాయిలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బాబు బాకా కోసం రూ.100 కోట్లు.... ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనా ప్రభుత్వం నుంచి లబ్ది చేకూర్చాననే ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు ఊరూరా ప్రత్యేకంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)ను నియమించి రూ.100 కోట్ల దుర్వినియోగానికి తెరతీశారు. టీడీపీ సర్కారుకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీరిని నియమించారు. వీరికి రోజుకు రూ.850 చొప్పున పారితోషికం అందించనున్నారు. వీరు చేయాల్సిందిలా ఒక్కటే...జనంలోకి వెళ్లి చంద్రబాబును కీర్తించడమే. దీనికోసం రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని సర్కారు దుర్వినియోగం చేస్తోంది. 15 నుంచి సమ్మెబాటలో సెర్ప్ సిబ్బంది... సెర్ప్ సిబ్బందికి టీడీపీ 2014 ఎన్నికల సమయంలో పలు హామీలను ఇచ్చింది. జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా పట్టించుకోకపోవడంపై సెర్ప్ సీసీలు, ఏపీయంలు సమ్మెబాట పట్టనున్నారు. టీడీపీ సర్కారు మోసాలకు నిరసనగా ఈ నెల 15వతేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు సెర్ప్ సిబ్బంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బలవంతపు ధన్యవాదాలు... సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఓ సినిమాలో తనకు గుడ్‌మార్నింగ్ చెప్పించుకోవటానికి ఓ హాస్యనటుడు పడిన పాట్లు గుర్తుకొస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఉన్న హాస్య నటుడు తనకు వచ్చిపోయే విద్యార్థులు గుడ్‌మార్నింగ్ చెప్పేవరకు అదేపనిగా వారి చుట్టూ తచ్చాడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదంతా డబ్బు ఖర్చు లేని వ్యవహారం కాగా సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ఖర్చు చేసి మరీ ‘ధన్యవాదాల’ కార్యక్రమానికి తెరతీశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, 2004లో సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా వారెప్పుడూ ఇలా వ్యవహరించలేదని పేర్కొంటున్నారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎన్నికల హామీ.. ఆర్థికంగా చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. –టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టో (16వ పేజీ)లో చంద్రబాబు హామీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేసిందా? డ్వాక్రా మహిళలకు పైసా కూడా రుణమాఫీ చేయలేదు డ్వాక్రా సంఘాలపై అప్పుల పెనుభారం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి డ్వాక్రా సంఘాల పేరుతో రూ.14,205 కోట్లు బ్యాంకుల్లో అప్పులు ఉండగా ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 22,174 కోట్లకు చేరింది. సున్నా వడ్డీకి మంగళం టీడీపీ సర్కారు జీరో వడ్డీ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో 2016 సెప్టెంబరు నుంచి వడ్డీ రూపంలో రూ.2,275 కోట్లను డ్వాక్రా మహిళలే చెల్లించుకోవాల్సి వచ్చింది. పెట్టుబడి నిధి డబ్బులు అప్పు కిందే... 2015లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. మాట నిలబెట్టుకున్నట్లు సర్కారు ప్రచారం.. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకపోయినా ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ రూ.15 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేందుకు తాజాగా ప్రభుత్వం సిద్ధమైంది. -
మంత్రి సునీత ఇలాకలో డ్వాక్రా మహిళల ఇబ్బందులు!
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత ఇలాకలో డ్వాక్రా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదు కొందరు అధికారులు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్, సీసీ అన్నపూర్ణలు డబ్బు డ్రా చేయటానికి అనుమతించటం లేదు. దీంతో చిన్మయ్ నగర్‌కు చెందిన కొందరు డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ నేతలు తమ మద్దతు తెలిపారు. తొమ్మిది నెలలుగా సమస్య ఉన్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోవటంలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రుణ మాఫీ కాలేదు
-
డ్వాక్రా రుణాల మాఫీపై ఏపీ సర్కారు మోసం
-
డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు. డ్వాక్రా రుణమాఫీ కంటే పసుపు కుంకుమకే ఎక్కువ ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 2014 మార్చి 31కి ముందు రిజిస్టర్ అయిన గ్రూపులకు మాత్రమే ఇచ్చామని, కొత్త గ్రూపులకు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ప్రతిపక్షం మీ దగ్గరే ఉందికదా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ ప్రశ్న వేశారని టీడీపీ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. మంత్రి దీనిపై మరో రకంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వాస్తవానికి పసుపు కుంకుమ కింద అంతకంటే ఎక్కువే ఇచ్చామని, డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రస్తావించకూడదని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ.. 22 మంది ప్రతిపక్ష సభ్యులు మీదగ్గరే ఉన్నారు కదా అని అన్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం బయట ఉందని ఎలా అంటారని ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇరుకున పడ్డారు. వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కలుగజేసుకుని ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామని చెప్పి టాపిక్‌ను మార్చేప్రయత్నం చేశారు. మహిళలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమాల్లో ఊళ్లకు వెళ్లినపుడు మహిళలు డ్వాక్రా రుణాల మాఫీపై గట్టిగా ప్రశ్నిస్తున్నారని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆన్లైన్ ఇబ్బందులని, ఆధార్ ఎన్రోల్మెంటు లేదని, బ్యాంకు ఖాతాలు లేవని అధికారులు చెబుతున్నారని బోండా ఉమా, జోగేశ్వరరావు, వర్మ తదితరులు తెలిపారు. నాలుగేళ్లుగా డ్వాక్రా మాఫీపై అడుగుతూనే ఉన్నాం, మంత్రి చెబుతూనే ఉన్నారని, కానీ మాఫీ కాలేదని పేర్కొన్నారు. ఏ ఊరికి వెళ్లినా.. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కమిటీ ఎందుకు వేయడంలేదు రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్‌పై ఎందుకు కమిటీ వేసి నిగ్గుతేల్చలేక పోతున్నారని, దీనికి భయమెందుకని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పలు సిమెంటు కంపెనీలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై కమిటీ వేస్తే సాక్ష్యాలు చూపిస్తానని, కానీ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోందో అర్థం కాలేదని అన్నారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘చర్యలు తీసుకుంటాం’ అని క్లుప్తంగా సమాధానం చెప్పారు. డ్వాక్రా రుణాలపై ఎమ్మెల్యేలు ఏమన్నారు మృణాళిని: పెట్టుబడి నిధి రావట్లేదని మహిళలు చెబుతున్నారు. తాము డ్వాక్రా కమిటీలో సభ్యులమైనా ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తమ ఖాతాల్లో డబ్బులు వెయ్యడం లేదని చెబుతున్నారు. వర్మ: గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు మహిళలు దీనిపైనే గట్టిగా నిలదీస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రూపుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రిగారు దీనిపై చర్యలు తీసుకోవాలి. కూనరవికుమార్ గౌడ్: 2014 తర్వాత ఏర్పడిన గ్రూపులు ఏం కావాలి. పాత వారికి కూడా ఆన్లైన్లో సమస్యలని, ఆధార్ ఎన్‌రోల్‌లో సమస్యలని ఏదో ఒక కారణంతో పసుపు కుంకుమకు ఇచ్చే నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. జోగేశ్వరరావు: తమకు పసుపు కుంకుమ పథకం అందడంలేదని చాలా చోట్ల మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. -
చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసం చేశారు
-
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
కుల్కచర్ల: డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడుతాయని రాష్ట్ర సెర్ప్ సీఈఓ పౌసమిబసు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దఅంతారం గ్రామంలో డీఆర్డీఏ, సెర్ప్, తెలగాణ పల్లె ప్రగతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాడి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో శ్రీనిధి నిధులతో ఏర్పాటు చేసిన మేకల పెంపక కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో రూ. 9 లక్షలతో 18 మంది ఎస్సీ మహిళలకు మేకలు ఇప్పించి పెంపకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడారు. మేకల పెంపకంలో మంచి లాభాలు రావడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మేకలను నిత్యం షెడ్లలోనే ఉంచి మంచి పోషకాలున్న మేతను అందించాలన్నారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆమె డీఆర్డీఏ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పండించే పంటలు, మార్కెటింగ్‌పై ఆరా తీశారు. ఇప్పటికీ చాలామంది పాతపద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాని, దీంతో లాభాలు రావడం లేదన్నారు. పండించిన పంట దళారులు కొనుగోలు చేసి వాటి ద్వారా వారు మంచి లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. రాగులు, జొన్నలు, పెసర, బెబ్బర, మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన పద్ధతులు పాటించేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అభివృద్ధి చెందే పనులు చెప్పాలని సూచించారు. పింఛన్లు, రేషన్, బ్యాంక్ రుణాలు అందుతున్నాయా.. లేదా అని ఆరా తీశారు. అంతారంలో బ్యాంక్ రుణాలు తీసుకుని నిర్వహిస్తున్న చిరువ్యాపారాలను ఆమె పరిశీలించారు. అంతకుముందు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, అంతారం సర్పంచ్ పుష్పలత, ఎంపీడీఓ తారీక్ అన్వర్, సూపరింటెండెంట్ ఇంద్రసేనా, ఏపీఎం మల్లికార్జున్, ఎపీఓ శోభ, సెర్ప్ అధికారులు ఉన్నారు. -
వైభవం.. ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే ధ్వజారోహణంగా వ్యవహరిస్తారు. ఆలయంలో ఉదయం తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన చేశారు. కర్మణ, పుణ్యాహవచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన నిర్వహించారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్ని మథనం గావించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన జరిపి, హోమం చేశారు. గరుడాళ్వార్లకు ప్రత్యేక ఆహ్వానం.. ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవ మూర్తులైన శ్రీసీతారామ లక్ష్మణ స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షణ చేయించి ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జరిపి అర్చక, పరిచారక, వేద పండితులు తీసుకొని రాగా.. బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించగా, మంగళ వాయిద్య ఘోష నడుమ గరుడ పటాన్ని పైకి ఎగురవేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లేని వారికి గరుడ ముద్దలను అందజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దీంతో ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలక, దేవతాహ్వానం గావించారు. ఉత్సవ మూర్తులతో పాటు ఎనిమిది దిక్కులకు బలిహరణం వేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రబాకర శ్రీనివాస్ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇతర అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఎదుర్కోలు ఉత్సవం... స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎదుర్కోలు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం చతుఃస్థానార్చన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం గరుడ సేవ జరపనున్నారు. -
నేడు స్వామివారి ధ్వజారోహణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మాఘబహుళ నవమిని పురస్కరించుకుని స్వామివారి ధ్వజారోహణం జరుగనుంది. ఆలయంలో స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తం భం వద్ద మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ధ్వజా రోహణ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భక్త కన్నప్ప ధ్వ జారోహణం వైభవంగా జరిగింది. సా యంత్రం కైలాసగిరుల్లోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్ర హ్మో త్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగివచ్చి దీవించా లంటూ దేవతలను అర్చకులు శాస్త్రో క్తంగా ఆహ్వానించారు. భక్తుడైన భక్తకన్నప్ప ఉత్సవాల్లో ప్ర«థమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. సాయంత్రం 4.15గంటలకు ధ్వజారోహణ పూజలు ప్రారంభమయ్యాయి. గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయం నుంచి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.∙వేదమంత్రోచ్ఛారణల నడు మ శాస్త్రోక్తంగా దర్భతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని «ధ్వజస్తంభాని కి ఆరోహింపజేశారు. దీప,ధూçప, నైవే ద్యాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, మేళతాళాలు నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భ్రమరాంబ, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మున్సి పల్ చైర్మన్ ముత్యాల పార్థసార«థి, దేవస్థానం మాజీ చైర్మన్లు శాంతా రామ్ జే పవార్, పీఆర్ మోహన్, కోలా ఆనంద్, ప్రముఖులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణం.. అందనంత దూరం!
కోవెలకుంట్ల : అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ భేషరుతుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి గద్దెనెక్కిన సర్కార్ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. పొదుపు సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోకపోవడంతో సంఘాలపై వడ్డీభారం పడి కుదేలవుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 4,770 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజి,ఎస్ఎస్జీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘం నుంచి రుణాలు తీసుకొని, ఆ రుణాలతో చీరెల వ్యాపారం, కిరాణ, కొవ్వొత్తుల తయారీ, పాడిపరిశ్రమ, తదితర యూనిట్లు స్థాపించి జీవనంసాగిస్తున్నారు. పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా సక్రమంగా చెల్లించే గ్రూపులకు ప్రభుత్వం వడ్డీలేని రుణం వర్తింప చేయాల్సి ఉండగా అరకొరగా వర్తింపజేస్తుండడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు . ఐదవ విడత జన్మభూమిని పురస్కరించుకొని ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు మాత్రమేవర్తించడంతో మిగతా గ్రూపులు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016 జూన్ వరకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులకు ఈ రుణం విడుదల అయినట్లు చెబుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించినా కొన్నిగ్రూపుల్లోని సభ్యుల ఖాతాల్లో జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సకాలంలో వడ్డీతో సహా రుణాలు చెల్లించినా నాలుగు మండలాల్లో 1,884 గ్రూపులకుమాత్రమే వడ్డీలేని రుణాలు వర్తించగా మిగిలిన గ్రూపులకు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణం వర్తిస్తుందని పొదుపు మహిళలు అప్పులు చేసి నెలనెలా వడ్డీతో సహా రుణాలు చెల్లించినా రుణం వర్తించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పొదుపు గ్రూపులన్నింటికీ వడ్డీలేని రుణంవర్తింపజేయాలని సభ్యులు కోరుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించలేదు పొదుపు గ్రూపు ద్వారా రూ. 7 లక్షల రుణం తీసుకొని బర్రెలు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం కింద రూ. 6వేలు అందజేసింది. వడ్డీలేని రుణం ఇప్పటి వరకు వర్తించలేదు. వడ్డీలకు వడ్డీలు చెల్లించడం కష్టమవుతోంది. – లక్ష్మిదేవి, చందన గ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల ఇప్పటికైనా రుణం అందించాలి పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణం వర్తింపజేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలి. మా గ్రూపు ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకొని పశుపోషణతో జీవనంసాగిస్తున్నాం. అన్ని గ్రూపులకు వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలి. – వెంకటలక్ష్మి, రామలక్ష్మిగ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల జమ అవుతోంది పొదుపు గ్రూపు సభ్యుల ఖాతాల్లో వడ్డీలేని రుణం జమ అవుతోంది. 2017 మార్చి నెలాఖరు వరకు గ్రూపులకు వడ్డీలేని రుణం మంజూరైంది. విడతలవారీగా అన్ని గ్రూపులకు వర్తిస్తుంది. – బాబు, ఏపీఎం, కోవెలకుంట్ల -
భారత్ ‘ఎ’ పరాజయం
ప్రిటోరియా: బ్యాట్స్‌మెన్ వైఫ ల్యంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వెయిన్ ప్రెటోరియస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ప్రెటోరియస్... బ్యాటింగ్‌లో 54 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 34 పరుగులు సాధించి తమ జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 41.5 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మనీశ్ పాండే (95 బంతుల్లో 55; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరుకున్నారు. మీడియం పేసర్ ప్రెటోరియస్తోపాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఫాంగిసో (4/30), హెండ్రిక్స్ (2/15) భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు. 153 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. 71 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా జట్టును బెహర్దీన్ (62 బంతుల్లో 37 నాటౌట్), ప్రెటోరియస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ సహకారంతో బెహర్దీన్ దక్షిణాఫ్రికా విజయాన్ని ఖాయం చేశాడు. భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ (3/41), అక్షర్ పటేల్ (35) రాణించగా... మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, బాసిల్ థంపి ఒక్కో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. -
అలవిమాలిన నిర్లక్ష్యం
► డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాల్సిన విత్తనాలు నేలపాలు ► రెండేళ్లుగా మెప్మా భవనంలో హైబ్రీడ్ కూరగాయల విత్తనాలు నిల్వ ► ప్యాకెట్లను చిందర వందర చేసిన ఎలుకలు ► కాల పరిమితి తీరడంతో ప్రజాధనం వృథా ► పీడీ మెతక వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది ► మెప్మా అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో విధులు నిర్వరిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, ఇతర ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒంగోలు నగరంలో మెప్మా (పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ) పనితీరు కూడా ఇలానే ఉంది. ఒంగోలు అర్బన్ : డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు వారి చేరడం లేదు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యం ఫలితంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతోంది. నగరంలో డ్వాడ్రా మహిళల గ్రూపులకు సంబంధించి పర్యవేక్షించాల్సిన మెప్మా ( పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. విత్తన ప్యాకెట్లు నేలపాలు డ్వాక్రా మహిళలు కూరగాయలు పండించుకోవడంతో పాటు విక్రయించుకోవడానికి ప్రభుత్వం హైబ్రీడ్ కూరగాయల విత్తనాలను సరఫరా చేసింది. రెండ్లళ్ల క్రితం 2014–2015 సంవత్సరానికి గాను మహిళలకు ఈ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంది. మెప్మా అధికారులు, సిబ్బంది వాటిని ఇంత వరకు పంపిణీ చేయకుండా నగరపాలక కార్యాలయంలోని మెప్మా భవనంలో నిల్వ ఉంచారు. రెండేళ్లుగా వాటి గురించి పట్టించుకోక పోవడంతో ఎలుకలు చేరి ఆ విత్తనాల ప్యాకెట్లను చిందర వందర చేశాయి. దీనికి తోడు ఆ విత్తనాల కాలSపరిమితి తీరడంతో నిరుపయోగంగా మారాయి. టమోట, సొరకాయ, ఉల్లిపాయ, చిక్కుడు వంటి హైబ్రిడ్ విత్తనాల ప్యాకెట్లు వేల సంఖ్యలో కాలపరిమితి తీరిపోవడంతో సిబ్బంది వాటిని భవనం వెనుక కుప్ప పోశారు. డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎంతో వెచ్చించి సరఫరా చేసినా వీటిని ఇలా నేలపాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కొంత మెతక వైఖరి అవలంభించడం వలన మెప్మా అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగిపోయిందంటున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్‌కి అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రుణాల మంజూరులోనూ అవకతవకలే.. డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీలోనే మెప్మా సిబ్బంది ఇలా ఉండే డ్వాక్రా గ్రూపు, పలు కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల విషయంలో కూడా భారీస్థాయిలో అక్రమాలు, అవినీతికి సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుణాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాముళ్లు ఇచ్చే వారికి, తమకు అనుకూలంగా ఉన్న వారికే మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినా పట్ణంలో పేదరిక నిర్మూలనకు చెప్పుకోదగ్గ చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. అవినీతితో మెప్మా అధికారులు, సిబ్బంది మాత్రం పేదరికం పోగొట్టుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా విత్తనాలు పారేసిన భవనంలోనే దోమ తెరల పంపిణీ చేపట్టారు. అదే రోజు ఆ విత్తనాల ప్యాకెట్లను బయటపడేయడం గమనార్హం. -
వైభవంగా నృసింహుడి ధ్వజారోహణం
మంగళగిరి: నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఉత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతలను వాయు వేగంతో వెళ్లి ఆహ్వానించేందుకు భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించడం ఉత్సవ ప్రత్యేకత. రాత్రి పొద్దుపోయాక భక్తజన కోటి సమక్షంలో ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో మరో ప్రత్యేకత ఉంది. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దగా పిలుస్తారు. సంతానం లేని వారు ధ్వజారోహణ ఉత్సవంలో గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. గరుడముద్ద ప్రసాదం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవం అనంతరం ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టంపచేసి పురవీధులలో విహరింపచేశారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోషియన్ వారు వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలె వెంకటసాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాసరావు, మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, వెనిగళ్ళ ఉమాకాంతం, పంచుమరి ప్రసాద్, దీవి అనంతపద్మాచార్యులు పూజలు నిర్వహించగా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి మండెపూడి పానకాలరావు పర్యేక్షించారు. -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
సంఘాల బలోపేతానికి కృషి
కాకినాడ సిటీ : స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తాడి నాగదుర్గ తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలోని డ్వామా సమావేశ హాలులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాగదుర్గ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 92,641 స్వయం సహాయక సంఘాల్లో 9,05,086 మంది సభ్యులు ఉండగా 69 మండల సమాఖ్యలు, 3,488 గ్రామైక్య సంఘాలతో జిల్లా సమాఖ్య ఉందన్నారు. వెలుగు సిబ్బంది సహకారంతో సంఘాల లోటుపాట్లు, సమస్యలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పథకాల లబ్ధిని సభ్యులకు చేరేలా చూస్తామన్నారు. సంఘదర్శిని ఆరో విడత కార్యక్రమం ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని సీ, డీ గ్రేడులలో ఉన్న సంఘాలను బలోపేతం చేసి సక్రమంగా సమావేశాలు, పొదుపులు, అప్పుల నిర్వహణ, చెల్లింపులు, పుస్తక నిర్వహణపై అవగాహన పెంచుతామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదుకాని ఎస్సీ, ఎస్టీ సభ్యులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి పెరిగేలా కృషిచేస్తామన్నారు. ఇప్పటి వరకు మొబైల్ బుక్ కీపింగ్ లావాదేవీలు జరపని సంఘాలతో పాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ సభ్యులతో ఏర్పాటు చేయబోయే సంఘాల సభ్యులకు మొబైల్ బుక్ కీపింగ్‌లో శిక్షణ కల్పిస్తామన్నారు. సమాఖ్య కార్యదర్శి ఎస్.ముత్యాల లక్ష్మి, ఉపాధ్యక్షురాలు కె.కృష్ణవేణి, సంయుక్త కార్యదర్శి సీహెచ్ నళిని, కోశాధికారి ముప్పిడి మేరి పాల్గొన్నారు. -
మేసేస్తున్నారు
డ్వాక్రా మహిళల నుంచి బలవంతపు వసూళ్లు ప్రతి గ్రూప్ నుంచి రూ.1,300 చెల్లించాల్సిందే 65 వేల గ్రూపుల నుంచి రూ.8.45 కోట్లు లూటీ డ్వాక్రా మహిళలు అడుగడుగునా దగా పడుతున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు రిక్తహస్తం చూపించడంతో వడ్డీలు తడిసి మోపెడై మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో రుణమాఫీకి బదులుగా ఏటా రూ.3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది పెట్టుబడి నిధి పేరిట రూ.3 వేల చొప్పున జమ చేసినా.. ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాల నుంచి తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది పసుపు, కుంకుమ పేరిట రూ. 3 వేల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించగా.. ఆ సొమ్ము తీసుకోవాలంటే తమ చేతులు తడపాలని యానిమేటర్లు.. గ్రామ, మండల సమాఖ్యల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. అదేమని అడిగితే.. ఆ సొమ్ములన్నీ పై అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెబుతున్నారు. పాలకోడేరు : పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములో కమీషన్లు గుంజుతున్నారు. ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తేనే.. రూ.3 వేలను ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇలా ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 65 వేల గ్రూపులకు పసుపు, కుంకుమ నిధులు మంజూరు కాగా, ఒక్కొక్క గ్రూపు నుంచి రూ.130 చొప్పున రూ.8.45 కోట్లను మింగేసేందుకు జిల్లా స్థాయిలో పథకం రచించి.. వసూళ్ల కార్యక్రమాన్ని యానిమేటర్లతోపాటు గ్రామ, మండల సమాఖ్య అధ్యక్షులకు అప్పగించారు. వ్యక్తిగత ఖాతాల్లో జమకాని నిధులు పసుపు, కుంకుమ పేరిట ఇస్తున్న ఈ నిధులను డ్వాక్రా మహిళల వ్యక్తగత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ మొత్తాలను గ్రూపు లీడర్ల ఖాతాల్లో వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున వసూలు చేస్తున్నారు. కమీషన్ నగదు ముట్టచెప్పిన అనంతరమే పసుపు, కుంకుమ సొమ్మును ఆ గ్రూపు ఖాతాలో జమ చేయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డ్వాక్రా సంఘం అధ్యక్షులు తమ గ్రూపులోని ప్రతి సభ్యురాలి నుంచి రూ.130 చొప్పున వసూలు చేసి ఐకేపీ సిబ్బందికి సమర్పించుకుంటున్నారు. డబ్బులిస్తేనే సొమ్ములిస్తారంట : విప్పర్తి జూలియమ్మ, మోగల్లు రుణమాఫీ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున యానిమేటర్లు వసూలు చేశారు. ఎందుకని అడిగితే ఇలా సొమ్ములిస్తేనే పసుపు, కుంకుమ నిధులు ఇస్తామంటున్నారు. ఈ ఒక్క దానికే కాదు.. ప్రతి పనికీ వాళ్ల చేయి తడపాల్సి వస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు పెనుమాల మరియమ్మ , మోగల్లు వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మొదటి నుంచీ ఇలాగే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీల విషయాలు మాత్రం మాకు తెలియనివ్వడం లేదు. డబ్బులు తీసుకుంటారు.. రుణాలివ్వరు బి.మార్త, మోగల్లు ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు, పథకాల గురించి మాకు తెలియడం లేదు. డబ్బులు వసూళ్లకైతే ఇంటికొచ్చి వచ్చి మరీ అడుగుతారు. రాయితీలతో కూడిన రుణాలు మాత్రం మాకు ఇవ్వడం లేదు వసూళ్లకు ఆస్కారం ఉండదు డ్వాక్రా గ్రూపులకు మంజూరైన పసుపు, కుంకుమ నిధులు సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. అలాంటప్పుడు వసూళ్లకు ఆస్కారం ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగినా, తీసుకున్నా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. కె.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఏ -
డ్వాక్రాలపై అప్పు డప్పు
తక్షణమే రుణాలు చెల్లించాలంటూ మహిళా సంఘాలకు నోటీసులు లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు ఆర్డీవో చెంతకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలంటూ ఆదేశాలు రుణమాఫీ ఊసెత్తొదంటున్న అధికారులు ః డ్వాక్రా మహిళలపై అప్పు డప్పు మోగుతోంది. రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని.. గ్రామాల్లో టాం టాం వేయించి పరువు తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో అప్పులు పుట్టకుండా చేస్తామని.. వడ్డీ వ్యాపారులు కూడా ఆదుకోలేని స్థితి కల్పిస్తామని బెదిరిస్తున్నారు. ’అదేంటయ్యా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. చంద్రబాబు వీధివీధికీ వచ్చి మరీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆయన మాటవల్లే కదా బకాయి పడ్డాం. అసలు కంటే వడ్డీ భారం ఎక్కువైపోయింది. ఎలా కట్టమంటారు’ అని మహిళలు అడుగుతుంటే.. ’ఆ మాటలేం చెల్లవ్. రుణమాఫీ గురించి మాట్లాడొద్దు’ అంటూ అధికారులు హుకం జారీ చేస్తున్నారు. కొవ్వూరు : రుణాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై నిన్నటి వరకూ బ్యాంకులు విరుచుకుపడితే.. ఇప్పుడు ఆ బాధ్యతను అధికారులు తీసుకున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొవ్వూరులో సుమారు 400 మంది మహిళలకు బుధవారం ఇదే పరిస్థితి ఎదురైంది. మండలంలో 70 గ్రూపులకు చెందిన మహిళలకు ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే కోర్టుకెళ్లి ఆస్తులను జప్తు చేయిస్తామని అందులో పేర్కొన్నారు. గురువారంలోగా ఆర్డీవో ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుమారు 400 మంది మహిళలు బుధవారం ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యాలయ ఆవరణలోని నీట్లనీడన పడిగాపులు పడ్డారు. ఆస్తులు జప్తు చేయిస్తామని హెచ్చరిక డ్వాక్రా మహిళలతో భేటీ అయిన ఆర్డీవో బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ’బకాయిలు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం. గ్రామాల్లో టాం టాం వేయిస్తాం.అప్పుడు మీ గౌరవం పోతుంది. బ్యాంకులు నడవాలంటే సకాలంలో రుణాలు కట్టాలి. బకాయిలు చెల్లించకపోతే మీకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులే కాదు వడ్డీ వ్యాపారులు కూడా ముందుకు రారు. మీకు ఎక్కడా అప్పులు పుట్టవు’ అంటూ హెచ్చరించారు. ’అదేంటి సార్. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా. ఆయన మాటనమ్మి బాకీలు కట్టలేదు. ఇప్పుడేమో అసలు కంటే వడ్డీలు పెరిగిపోయాయ్. ఎలా కట్టగలం’ అని మహిళలు నిలదీశారు. ఆర్డీవో స్పందిస్తూ.. ’ఎవరు హామీ ఇచ్చారో వాళ్లను అడగండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి.. ఎవరికోసమో ఎదురుచూస్తూ రుణాలు చెల్లించడం మానేయవద్దు’ అన్నారు. ’బకాయిలు చెల్లించకపోతే ఆస్తులన్నీ వేలం వేస్తారు. మీకు ఇష్టమేనా’ అని ప్రశ్నించారు. బడికెళ్లే మీ పిల్లల్ని డ్వాక్రా బకాయిలు ఎగ్గొట్టారంటగా అని తోటి విద్యార్థులు అడిగితే వాళ్లు తలదించుకోవాల్సి వస్తుందని హితోపదేశం చేశారు. బ్యాంకు రుణాలను వాయిదాలు లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించాలని సూపించారు. నెల రోజుల తరువాత ఇలా మాట్లాడే అవకాశం తమకు ఉండదన్నారు. ’కాగితాలొస్తాయి. మా తహసీల్దార్లు వస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం బకాయిలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తారు’ అని హెచ్చరించారు. దీంతో అవాక్కవడం మహిళల వంతైంది. అధికారులకు లక్ష్యాలు డ్వాక్రా బకాయిలను రాబట్టుకునేందుకు మండల శాఖ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లు ఇచ్చింది. మార్చినెలాఖరు నాటికి నూరు శాతం బకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు పెరిగాయి. రంగంలోకి దిగిన అధికారులు సామదాన దండోపాయలను ప్రయోగిస్తున్నారు. బకాయిల వసూలు విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నంలో భాగంగా వేధింపులకు దిగుతున్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాల్లో 1.32 శాతం (సుమారు 20 కోట్లు) మాత్రమే బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి దీనిని సున్నాగా చూపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలోనే అత్యధికంగా రూ.3.50 కోట్ల మేర బకాయిలున్నాయి. పాత రుణాలు చెల్లిస్తే కొత్త రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మహిళలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హామీ ఇచ్చి నోటీసులు పంపుతారా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నాలుగేళ్ల కిత్రం బ్యాంకు నుంచి మా గ్రూపు సభ్యులు రూ.2 లక్షల రుణం తీసుకున్నాం. రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానన్నారు. ఇప్పుడు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయిస్తామని నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు సమజసం. చదలవాడ రూత్కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి హామీలు నమ్మి వీధిన పడ్డాం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఎన్నికల సమయంలో ఎంపీ మురళీమోహన్ ఇంటింటికీ మరీ ఈ విషయం చెప్పారు. ఇప్పుడు బకాయిలు మాఫీ చేయకపోవడంతో వీధిన పడ్డాం. నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఆర్డీవో వద్ద వివరణ ఇవ్వాలంటే కూలీ పనులు మానుకుని వచ్చాం. ముప్పిడి కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి మోసం చేశారు డ్వాక్రా రుణాలు కట్టొద్దన్నారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు .రుణం తీసుకుని మూడేళ్లయ్యింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే వాయిదాలు కట్టేసేవాళ్లం. ఇప్పుడు రుణాలపై వడ్డీలు పెరిగి తడిసిమోపెడయ్యాయి. ఇచ్చిన మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు. పేదలను మురిపించి ముంచేశారు. రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. ఇప్పుడు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. కాకులపాటి మల్లేశ్వరి, డ్వాక్రా మహిళ బకాయిలు చెల్లించాల్సిందే బకాయిల చెల్లింపుల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉంది. ఇంకా సుమారు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు పొందాలంటే సకాలంలో రుణాలు చెల్లించాలి. జీలుగుమిల్లి మండలంలో అత్యధికంగా రూ.3.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నాం. కె.శ్రీనివాసులు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ -
పసుపు.. కుంకుమ.. సొమ్మేదమ్మా!
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొహం చాటేసిన ప్రభుత్వం మహిళల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో అడపాదడపా కొద్దిపాటి సొమ్మును విదిలిస్తోంది. ఇందులో భాగంగానే రెండో విడతగా పసుపు.. కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేస్తున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సొమ్ములు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆ మొత్తాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని గ్రూపుల ఖాతాల్లో సొమ్ములు జమ కాగా, కొన్ని గ్రూపులకు అందటం లేదు. సొమ్ము వచ్చిందో లేదో తెలుసుకునేందుకు మహిళలు రెండు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో డ్వాక్రా మహిళలను లోనికి అనుమతించడం లేదు. దీంతో వారు గంటల తరబడి రోడ్లపైన.. బ్యాంకుల ఆవరణలోను వేచి ఉంటున్నారు. తమ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో స్పష్టంగా తెలియజెప్పాలని.. జమ అయిన సొమ్మును తీసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంగళవారం పెదవేగిలోని ఇండియన్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు పడిన అవస్థలకు అద్దం పట్టే చిత్రాలివి. పెదవేగి రూరల్ -
శ్రీమఠంలో ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో ధనుర్మాసం సందర్భంగా వేకువ జామునే పూజలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు, పట్టువస్త్ర సమర్పణ చేశారు. బృందావన ప్రతిమను బంగారుపల్లకీలో మాడా వీధుల్లో ఊరేగించారు. పీఠాధిపతి జయ, దిగ్విజయ, మూలరాముల పూజలో తరించారు. అన్నపూర్ణ భోజన శాలలో 8 గంటలకే భోజనాలు మొదలు పెట్టారు. భక్తులు వేలాదిమంది రావడంతో శ్రీమఠం, వ్యాపార దుకాణాలు కళకళలాడాయి. మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి!
ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగం ఒకటి. ఇది గుజరాత్‌లోని దారుకావనంలో ఉంది. నేటి దారుకావనాన్నే పురాణాలలో కామ్యకవనం అని, ద్వైతవనమనీ పేర్కొన్నారు. దీని గురించిన గాథలు చాలా ఉన్నాయి కానీ, ముఖ్యమైనవాటిని చూద్దాం.. పూర్వం ఒక సముద్రతీరాన గల ఒక వనంలో దారుకుడనే రాక్షసుడుండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం, మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్నవారినే కాదు, అటుగుండా వచ్చీపోయేవాళ్లని కూడా వదలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకుని, తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమిమీద ఉంటే, వారిలో హింసాప్రవృత్తి ఉంటే, వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారుకుడు సముద్రంలోకి వెళ్లి, అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని, అందులో ఉంటూ, సముద్ర ప్రయాణీకులను హింసించ డమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఒకసారి వాడలా సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి, వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కాసిని నీళ్లుపోసి, ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహామేరకు అతనితో కలసి ఉన్నవారందరూ కూడా మహా పవిత్రమైన, అత్యంత శక్తిమంతమైన శివపంచాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, ‘‘నీవు శివారాధన చేయరాదు. చేస్తే, మా రాజు, రాణి అయిన దారుకా దారుకిల ఆరాధన మాత్రమే చేయాలి. తక్షణం నీ శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తాం’’ అని బెదిరించారు. సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి, బెదిరించాడు. అయినా వినలేదు. ఇలా లాభం లేదని, కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు అక్కడే జ్యోతిర్లింగరూపంలో కొలువయ్యాడు. అన్ని కథల్లా ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడి భార్య దారుకి పార్వతీదేవికి ప్రియభక్తురాలు కావడంతో తనకు లభించిన కొన్ని శక్తుల వల్ల తన అనుచరుల సాయంతో ఆ అడవినంతటి నీ తీసుకుపోయి సముద్రం అడుగుకు చేర్చింది.దాంతోపాటు ఆ వనంలోకి అడుగుపెట్టిన వారినందరినీ తమ అధీనంలోకి తీసుకుని, వారిని బలవంతంగా తమ రాజ్యప్రజలుగా మార్చసాగింది. శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి పూజమానవలసిందిగా నిర్బంధిస్తూ, ఆమె, ఆ రాక్షసగణం సుప్రియుని చిత్రహింసల పాలు చేయడం మొదలు పెట్టారు. మరల శివుడు ప్రత్యక్షమై, సుప్రియుడికి ఒక శక్తిమంతమైన ఆయుధాన్నిచ్చాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు వారందరినీ జయించాడు. ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి, వారందరినీ ఏ దుష్టశక్తులూ ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువుతీరి, భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. ఆ రాక్షసగణాన్ని అక్కడినుంచి దూరంగా పంపించి, వారు జనావాసాలలోకి రాకుండా చేసింది జగన్మాత. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి, వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈమేరకు శివపార్వతులు నాగేశ్వరుడు, నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అతి ప్రాచీన గాథ: పూర్వం వాలఖిల్యులనే మునులు దారుకావనంలో శివుని గురించి సుదీర్ఘకాలంపాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువసన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువసన్యాసి వంటిమీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువసన్యాసిని చూసి, మునిపత్నులు మనసు పారేసుకుని, భర్తలను వదిలేసి, ఆ దివ్యసుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి, కోపం కట్టలు తెచ్చుకుంది ఆ మునులలో. ఆ యువసన్యాసి లింగం తెగిపోవాలని శపించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్తా జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణులు భూమి మీదకు వచ్చి, ఆ మునుల తప్పిదాన్ని మన్నించి, లింగాన్ని వెనక్కు తీసుకుని, లోకాలను కాపాడమని శివుని ప్రార్థించారు. శివుడు శాంతించి, భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి, మునులను అనుగ్రహించాడు. వంటిమీద పాములనే వస్త్రాలుగా చుట్టబెట్టుకుని వచ్చాడు కాబట్టి, నాగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా... పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది. మరోగాథ: తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో సతీవియోగాన్ని తట్టుకోలేక ఓ నదీతీరానికొచ్చి తాను కూడా దహించుకుపోయాడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా, కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి, ఆ నదీజలాలు వాటి పాలధారలతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్న భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉండి ఉంటుంది. నదిలో దేవతలో, తపస్సులో ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నదీజలాలను తోడేసే ప్రయత్నం చేసి, సాధ్యం కాకపోవడంతో కోపంతో నదిమీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలి పోయింది. నది మధ్యభాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపుచారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి, నీటి అడుగున నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. దారుకలు అంటే దేవదారు వృక్షాలు. ఇక్కడ దేవదారు వృక్షాలు విరివిగా ఉండటం వల్ల దారుకావనమనే పేరు వచ్చింది. ఈ వనంలో 20 మీటర్ల ఎత్తున్న శివుని విగ్రహం చూపరులను కన్నులు తిప్పుకోనివ్వదు. ఆలయం సుందరంగా ఉంటుంది. - డి.వి.ఆర్.భాస్కర్ -
అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా
పేదలకు చౌక ధరలకు ఔషధాలు అందించేందుకు నెలకొల్పిన అన్నసంజీవని పథకం నిర్వహణ గాడి తప్పింది. జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలను ఏర్పాటు చేసిన అధికారులు అరకొరగానే ఔషధాలను సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పడిపోవడంతో ఐకేపీ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు టార్గెట్లు పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆచంట : పేదలకు చౌక ధరలకే ఔషధాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నసంజీవని దుకాణాలు డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారాయి. ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో చిల్లరనోట్ల కోసం నానాఇబ్బం దులు పడుతుంటే.. మరోపక్క మందులు కొనాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచి అమ్మకాలు పెంచుకోవాల్సిందిపోయి అడ్డదారుల్లో అమ్మకాలకు ప్రభుత్వం వెంపర్లాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 38 దుకాణాల ఏర్పాటు జిల్లాలోని పట్టణాలు, వివిధ మండలాల్లో మొత్తం 38 అన్న సంజీవని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రులు, నరసాపురం, భీమవరం, నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలతోపాటు ఆచంట, పోలవరం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో ఈ దుకాణాలు ఏర్పాట య్యాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఐకేపీ అధికారులకు అప్పగించారు. షాపుల నిర్వహణ మొక్కుబడిగా సాగడం.. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు అది విస్మరించి డ్వాక్రా సంఘాలకు మందులు అంటగడుతున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో నెలకు రూ.2 లక్షల వరకూ అమ్మకాలు సాగించాలంటూ ఐకేపీ సిబ్బందికి లక్ష్యాలు విధించారు. ఏం చేయాలో పాలుపోని ఐకేపీ సిబ్బంది మందులు కొనుగోలు చేయాలంటూ గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులు రోగం లేకున్నా మందులు కొనాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఔషధాలు కొంటేనే రుణం ఒక్కో డ్వాక్రా సంఘంలో కనీసం పది మందికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.200 విలువైన మందులు కొనుగోలు చేయాలని ఐకేపీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉంటే కనీసం రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాలి. ఈ విధంగా రోజుకు ఒకటి లేదా రెండు గ్రూపుల చేత మందులు కొనుగోలు చేయిస్తూ కొంతకాలంగా టార్గెట్లు చేరుకుంటున్నారు. మందులు కొంటున్నారో లేదో తెలసుకునేందుకు మరో మెలిక పెడుతున్నారు. మందులు కొన్నట్టు సంబంధిత దుకాణం నుంచి రశీదులు తెచ్చి కార్యాలయాల్లో చూపించాలని షరతు పెడుతున్నారు. ఈ విధమైన బలవంతపు కొనుగోళ్ల వ్యవహారం జిల్లాలోని అన్ని మండలాల్లో చడీచప్పుడు కాకుండా కొంతకాలం నుంచి సాగిపోతోంది. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే.. పైఅధికారులు నెలవారీ టార్గెట్లు పెడుతున్నారని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. సబ్బులు.. పేస్టులు.. టానిక్లూ అధికారుల ఒత్తిడితో ఔషధ దుకాణం వద్దకు వెళుతున్న డ్వాక్రా సంఘాల మహిళలకు దిక్కుతోచడం లేదు. రోగం లేకుండా ఏం మందులు కొనాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళ్లి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెబితే.. మీకోసం ప్రత్యేకంగా మెడికేటెడ్ టూత్‌పేస్టులు, సబ్బులు, బలానికి టానిక్‌లు, మల్టీవిటమి¯ŒS టాబ్లెట్లు అందుబాటులో ఉంచామంటూ రూ.200కు సరిపడా సరుకులు అంటగడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెప్పుకుంటే వారికి రుణం నఇవ్వరేమోన భయపడిపోతున్నారు. ఒక పక్క డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టినిచ్చి వారి కాళ్లమీద వారిని నిలబెడతామని చెబుతున్న పాలకులు.. ప్రభుత్వ పథకాన్ని మనుగడలో ఉంచడం కోసం చిరుద్యోగుల చేతి చమురు వదిలిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతపు కొనుగోళ్ల వ్యవహారానికి స్వస్తి చెప్పాలని డ్వాక్రా మహిళలు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా టార్గెట్లు నిర్ణయించడం నిజమేననిన చెబుతూ.. తన పేరు మాత్రం రాయవద్దని కోరారు. -
‘రుణం’ తీర్చుకునేది ఇలాగేనా!
–రుణమాఫీ అని చెప్పి నోటీసులిస్తారా! –సర్కారుపై డ్వాక్రా మహిళల మండిపాటు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకుంటామని, రుణమాఫీ చేసి తీరతామని ప్రగల్భాలు పలికిన అధికారపార్టీ ఆ మాటను తప్పింది. ఫలితంగా తీసుకున్న రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో రుణం తీర్చుకునే తీరిదేనా అంటూ మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల నరసాపురం మండలం, జంగారెడ్డిగూడెంలలో డ్వాక్రా మహిళలకు నోటీసులుజారీ చేసిన బ్యాంకులు తాజాగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు వంద మందికి తాఖీదులు ఇచ్చాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. జంగారెడ్డిగూడెం రూరల్ : రైతుమిత్ర రుణాలు తీసుకున్న జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు 100 మందికి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలో 50 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ నాలుగేళ్ల క్రితం రైతుమిత్ర రుణాల కింద గ్రూపునకు రూ.3లక్షల చొప్పున లక్కవరం ఆంధ్రాబ్యాంకులో రుణాలు పొందాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ఈ గ్రూపులు రుణమాఫీ అవుతుందనే ఆశతో తిరిగి చెల్లించడం మానేశాయి. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం గ్రూపునకు రూ.ఐదులక్షలు చెల్లించాలని గ్రూపుల్లోని సభ్యులందరికీ నోటీసులు అందాయి. ఇలా సుమారు గ్రామంలో వందమందికి తాఖీదులు వచ్చాయి. ఇంకా చాలామందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు దేవులపల్లి వచ్చిన మంత్రి పీతల సుజాత దష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె దీనిని పరిశీలించాలని వ్యవసాయ శాఖ ఏడీఎ కమలాకర శర్మను ఆదేశించారు. ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడతానని ఏడీఏ చెప్పుకొచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునేది ఇలాగేనా అంటూ పెదవివిరుస్తున్నారు. న్యాయం చేయాలి తీసుకున్న రుణాలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రుణాలను చెల్లించాలంటూ నోటీసులు పంపారు. మాఫీ అవుతుందని ఎదురుచూశాం. మాకు నిరాశే ఎదురైంది. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి – షేక్ మస్తాన్‌బీ, దేవులపల్లి రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాము తీసుకున్న రైతుమిత్ర గ్రూపు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఒక పక్క రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొంది. – బల్లే రమాదేవి, దేవులపల్లి -
సంఘాలను పటిష్టం చేద్దాం
గుంటూరు వెస్ట్ : స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ (సంస్థాగత నిర్మాణం) ఉషారాణి చెప్పారు. సోమవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు పటిష్టం కావడం ద్వారానే స్త్రీనిధి నుంచి మరిన్ని రుణాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2200 మంది స్వయం సహాయక సభ్యుల ఆధార్ సీడింగ్‌ను తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంఘాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రిక్స్ తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం గొప్ప అవకాశమన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర అధికారులు రామకృష్ణ, మాధవీలత, డీఆర్డీఏ ఏపీడీ జి.నాగేశ్వరరావు, డీపీఎం అశోక్‌కుమార్, నారాయణ, శారదాంబ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.సౌభాగ్యం, ఏపీఎం సాంబశివరావు, జేడీఎం శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
డ్వాక్రా..టోకరా
డ్వాక్రా రుణ మంజూరు తీరు ఇలా... 2016–17 ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.1,346.24 కోట్లు అర్ధ సంవత్సరంలో ఇచ్చింది రూ.250 కోట్లే... ఇవ్వాల్సింది ఇంకా 1096 కోట్లు 2014–15లో రూ.1,240 కోట్లు లక్ష్యం ఆ ఏడాదిలో ఇచ్చింది రూ.367 కోట్లు సభ్యులకు చేరని సొమ్ము రూ.873 కోట్లు 2015–16లో రూ.1730 కోట్లు లక్ష్యం సభ్యులకు చేరిందీ రూ.1296 కోట్లు ఇవ్వగలిగారు... చేరని సొమ్ము...రూ.434 కోట్లు కాకినాడ సిటీ : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మంజూరు చేసే రుణ లక్ష్య ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 89,994 డ్వాక్రా సంఘాలుండగా, వీటి పరిధిలో 8,77,586 మంది సభ్యులుగా ఉన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 59,587 సంఘాలకు రూ.1,346.24 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13,353 సంఘాలకు రూ.250 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. రుణ మంజూరులో ఈ అర్ధ వార్షిక ప్రగతిని పరిశీలిస్తే..ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. లక్ష్య సాధనలో విఫలం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రుణాల కల్పనలో మొండిచేయి చూపించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి, కేవలం 11,326 సంఘాలకు రూ.367.25 కోట్ల మేరకు మాత్రమే రుణాలిచ్చింది. దీంతో లక్ష్యసాధనలో అధికారులు చతికిలపడ్డారు. అలాగే 2015–16లో 46,986 సంఘాలకు రూ.1,730.71 కోట్లు లక్ష్యం కాగా, 42,835 సంఘాలకు రూ.1,296.71 కోట్ల రుణాలు ఇవ్వగలిగారు. రుణాలు కల్పన లక్ష్యం మేరకు ప్రగతి సాధించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, రుణ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసింది. మ్యాచింగ్ గ్రాంటూ లేదు ఒక్క పైసా కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్కూ దిక్కులేకుండా పోయింది. చివరికి సంఘంలోని ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూల నిధిగా సంఘ ఖాతాలో జమచేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు మాయమాటలు నమ్మి æవాయిదాలు చెల్లించడం మానేసిన సంఘాలకు వడ్డీ లేని రుణం కాదు కదా, కనీసం పావలా వడ్డీ రాయితీ కూడా కోల్పోయారు. మరోపక్క బ్యాంకర్లు కొత్త రుణాల మంజూరు విషయంలో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. వడ్డీ వ్యాపారులే దిక్కు! గతంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల కోసం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐదు, పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. లక్ష్యం మేరకు రుణాల మంజూరు డ్వాక్రా సంఘాలకు నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తీసుకున్న రుణంతో ఆర్థికంగా సంఘాలు నిలదొక్కుకునేలా వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం. – శ్రీనివాస కుమార్, ఏపీడీ, డీఆర్డీఏ -
కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం
తిరుమల : తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో ధ్వజపటం ఊరేగించారు. నేటి నుంచి 9 రోజుల పాటు బ్రహోత్సవాలు జరుగుతాయి. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
ఆకట్టుకున్న డ్వాక్రా బజార్
సాక్షి, హైదరాబాద్: ‘డ్వాక్రా బజార్’ పేరుతో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద మంగళవారం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. స్టాల్స్‌లో ఉంచిన పలు వస్తువులు, గృహోపకరణాలు, గాజులు, చీరలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు. -
వసూల్‌రాజాలు!
డ్వాక్రా రుణాలపై 2 శాతం కమీషన్ గుంజుతున్న సీవోలు, ఆర్పీలు ప్రతి నెలా రూ.లక్షల్లో వసూళ్లు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులని మిన్నకుండిపోతున్న సభ్యులు సీవోలను ఆడిస్తున్న కార్పొరేటర్లు సాక్షి, రాజమహేంద్రవరం : డ్వాక్రా సంఘాలకు రుణాల మంజూరులో వసూల్‌రాజాలు చెలరేగుతున్నారు. కొంతమంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో), కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ) రెండు శాతం చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు చెప్పినంత కమీషన్ ఇవ్వకపోతే రుణాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న భయంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. వసూల్‌రాజాలు డిమాండ్ చేసినంతా ముట్టజెప్పుకొంటున్నారు. ఈవిధంగా ఒక్క రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ప్రతి నెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ‘రుణం మంజూరైన ప్రతిసారీ మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే రుణాలు ఇంకా మంజూరు కాలేదని నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదంతా మాకు మామూలే’ అని ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలు వాపోయింది. వారు చెప్పిందే వేదం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 5,536 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటికి రుణాల మంజూరు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించిన టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ (టీపీఆర్వో) ఈ ప్రక్రియనంతా పర్యవేక్షిస్తుంటారు. ఆయనకు సహాయంగా 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. వీరంతా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో ఉన్న 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్‌ను టీపీఆర్వో నియమించారు. వీరు సీవోలకు సహాయకులుగా చలామణీ అవుతూంటారు. ఆ సమాఖ్యపై పెత్తనం అంతా వారిదే. వారి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు. గత ఏడాది నగర పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకులు రూ.36 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.56 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. బ్యాంకు అధికారులు కూడా సీవోలు చెప్పనిదే రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో సీవోలు చెప్పిందే వేదంగా డ్వాక్రా సంఘాల సభ్యులు నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డివిజన్ కోసం నేతలకు ముడుపులు పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే డివిజన్లలో అధిక సంఖ్యలో డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ డివిజన్లలో పని చేయడానికి పలువురు సీవోలు అమితాసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సీవోలు సరిగా పని చేయడం లేదని మేయర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడే కథ మొదలవుతోంది. సీవోలు ఆయా కార్పొరేటర్ల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తారు. తమను ఆయా డివిజన్లలో ఉంచేందుకు అక్కడ ఉన్న ఆదాయాన్నిబట్టి ముడుపులు ముట్టజెబుతున్నారు. సీఆర్పీలుగా ఆయా గ్రూపుల్లోని సభ్యులనే నియమిస్తారు. వీరిలో కొంతమంది అధికార పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అధికార బలం ఉన్నవారు ఆయా సమాఖ్యల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొన్ని డ్వాక్రా గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శులతో కుమ్మక్కై గ్రూపులోని సభ్యులకు తెలియకుండా రుణాలు పంచుకుంటున్నారు. వాయిదాలు సరిగా కట్టనప్పుడే ఈ విషయం ఆయా గ్రూపు సభ్యులకు తెలుస్తూండడం గమనార్హం. ఆగిపోయిన కొన్ని గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు. దందా సాగుతోందిలా.. డ్వాక్రా రుణాల మంజూరు, పర్యవేక్షణకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ప్రత్యేకంగా ఓ విభాగం ఉంది. ఇందులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. నగరంలోని 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్‌ను నియమించారు. సీవోలకు సహాయకులుగా చలామణీ అయ్యే వీరి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు. -
ప్రాణం తీసిన డ్వాక్రా అప్పు
♦ రుణం తీసుకొని సంఘం సభ్యులు ఇద్దరు పరారీ ♦ డబ్బులు చెల్లించాలని అధికారులు, మిగతా సభ్యులునుంచి ఒత్తిడి ♦ మనస్తాపంతో మహిళ ఆత్మహత్యహత్యాత్నం ♦ చికిత్స పొందుతూ మృతి తాండూరు రూరల్: డ్వాక్రా సంఘంలో రుణం తీసుకున్న ఇద్దరు పరారీ అయ్యారు. వారి డబ్బులు చెల్లించాలని అధికారులు, సంఘం సభ్యులు ఒత్తిడి చేయడంతో సంఘం రెండో అధ్యక్షురాలు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్‌లో సోమవారం వెలుగు చూసింది. కరన్‌కోట్ ఎస్ఐ రేణుకారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఫాతిమాబేగం (40) కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. గ్రామంలోని హినా పొదుపు సంఘంలో ఆమె రెండో గ్రామ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండేది. ఈక్రమంలో కొంతకాలం క్రితం హినా పొదుపు సంఘం సభ్యులు మల్కాపూర్ ఎస్బీహెచ్లో బ్యాంక్ లీంకేజీ ద్వారా రూ.3 లక్షలు రుణం తీసుకున్నారు. పది మంది సభ్యులు కొన్ని వాయిదాలు చెల్లించారు. హినా సంఘం మరో అధ్యక్షురాలు మౌలన్బీతో పాటు సాలియాబీ చెప్పాపెట్టకుండా గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి వాయిదాలు చెల్లించాలని మిగతా సభ్యులు, బ్యాంకు అధికారులు ఫాతిమాబేగంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 24న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఫాతిమాబేగం మృతి చెందింది. ఆమె ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా న్యాయమూర్తి ఆమెనుంచి వాంగ్మూలం సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
కలెక్టరేట్లో డ్వాక్రా స్టాల్
కడప సెవెన్‌రోడ్స్ : కొత్త కలెక్టరేట్ ఆవరణంలో సోమవారం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్రా స్టాల్ ప్రారంభమైంది. బహిరంగ మార్కెట్లో లభించే వివిధ రకాల సరుకుల కంటే కొంత తక్కువ ధరలతో సరుకుల విక్రయాన్ని చేపట్టారు. మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్య ద్వారా సేకరించిన కందుల నుంచి కల్తీ లేని కందిపప్పును తయారు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పది వేల కిలోల కందిపప్పు విక్రయానికి సిద్ధంగా ఉంది. ఇకపై నెలకు 30 వేల కిలోల కందిపప్పును సిద్దం చేయాలని జిల్లా సమాఖ్య నిర్ణయించింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 130 కాగా, డ్వాక్రా బజారులో రూ. 110లకు విక్రయిస్తున్నారు. అలాగే పసుపు 200 గ్రాముల ప్యాకెట్ బయట రూ. 45 కాగా, ఇక్కడ రూ. 30, రాగిమాల్ట్ 200 గ్రాములు రూ. 50కి గాను రూ. 40, అరకిలో రాగిపిండి రూ. 45కుగాను రూ. 40, కొర్రబియ్యం కిలో రూ. 55కి గాను రూ. 50, జొన్న పిండి రూ. 45కుగాను రూ. 40లతో విక్రయాలు చేపట్టారు. కలెక్టరేట్ ఉద్యోగులతోపాటు వివిధ పనుల మీద వచ్చిన పలువురిని డ్వాక్రా స్టాల్ ఆకర్శిస్తోంది. -
15 రకాల వస్తువులతో ప్యాకింగ్
సిద్ధం చేస్తున్న డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద తక్కువ ధరకే విక్రయం హనుమాన్‌పాలెం(కొల్లిపర) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి అవసరమైన వస్తువులను మండలంలోని హనుమాన్‌పాలెం గ్రామంలో ప్యాకింగ్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను భక్తులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అవసరమైన వస్తువులను చక్కగా ప్యాకింగ్ చేసే బాధ్యతను అధికారులు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. క్రమంలో హనుమాన్‌పాలెం గ్రామానికి చెందిన ఆసంటి రత్నకుమారికి 20 వేల ప్యాకెట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న సుగాలీకాలనీకి చెందిన మహిళలతో ప్యాకింగ్ పని చేయిస్తున్నారు. మొత్తం 15 రకాల వస్తువులతో 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ 25 మంది మహిళలు మూడు రోజులుగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరికి కొందరు పురుషులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువుల ప్యాకింగ్‌ను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రత్నకుమారి చెప్పారు. ప్యాకెట్లో ఉండే వస్తువుల వివరాలు.. పసుపు, కంకుమ, హారతి కర్పూరం, సాంబ్రానీ కడ్డీలు, గంథం, ఇస్తరాకులు, బెల్లం, నూములు, బియ్యంపిండి, బియ్యం, వక్కలు, తమలపాకులు, అరటికాయ, అవునెయ్యి, అవుపాలు. వీటన్నింటిని విడివిడిగా ప్యాకింగ్ చేయడంతోపాటు అన్ని కలపి ఒక సంచిలో ప్యాకింగ్ చేస్తున్నారు. -
అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది. -
మహిళలను మోసం చేసిన కేసులో అరెస్ట్
ఖమ్మం : డ్వాక్రా మహిళలను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బీబీపాలెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలను మోసం చేసి సుమారు రూ. కోటి 80 లక్షల నగదును ఆగంతకులు అపహరించుకుని పోయారు. దీంతో సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆక్రమంలో మంగళవారం నిందితులను బీబీపాలెం గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సురేష్ కుమార్, సీఐ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నగదు దొంగతనం ఆరునెలల క్రితం చోటు చేసుకుంది. -
ఇన్నిమోసాలా..?
రుణమాఫీ హామీకి తిలోదకాలు ఇసుక రీచ్‌లను తప్పించే యత్నాలు ధాన్యం కొనుగోలు కమీషన్ ఇవ్వకుండా తాత్సారం ఆవేదనలో మహిళలు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని ఊరూరా తిరిగి గొంతు అరిగిపోయేలా చెప్పారు. అధికారం వచ్చాక సవాలక్ష మెలికలు పెట్టి ఆ హామీని మాఫీ చేశారు. ధాన్యం కొనుగోలును మహిళా సంఘాలకు అప్పగించారు. అంత కష్టపడి కొనుగోళ్లు చేస్తే కమీషన్ ఇవ్వకుండా ఏడిపించారు. ఇసుక రీచ్‌ల విషయంలోనూ ఇదే ధోరణి. రీచ్‌ల నిర్వహణ నుంచి మహిళా సంఘాలను తప్పించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడి నిర్వాకం. మాటివ్వడం ఆనక మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు అప్పగించి ఆఖరుకు తప్పులు తమపై నెట్టేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ. 550 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉండగా దాన్ని గాలికొదిలేసి పెట్టుబడి నిధి కింద రూ. 124 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లాలో మహిళలకు 50 ఇసుక రీచ్‌లను అప్పగించి, ఇప్పుడు సమస్యల నెపంతో వారిని రీచ్‌ల నిర్వహణ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామైక్య సంఘాలతో చాకిరీ చేయించుకున్న ప్రభుత్వం వాటికివ్వాల్సిన కమీషన్ రూ. ఆరు కోట్లకు గాను రూ.నాలుగు కోట్లు ఇచ్చి మిగతా సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఏదొక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నానికి ఒడిగగుతోంది. ఆదిలోనే రాజకీయం చేశారు. తమ పార్టీకి అనుకూలమైన సంఘాలతో మేక్ సొసైటీల్ని ఏర్పాటు చేసి, ఇసుక రీచ్‌లను అప్పగించారు. వాటి ముసుగులో అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు. రీచ్‌ల ద్వారా అధికారికంగా సుమారు రూ. 20కోట్లు ఆదాయం రాగా, అక్రమార్కులకు అంతకు రెండింతల ఆదాయం వచ్చింది. మరో 70 అనధికార రీచ్లైతే ఇసుకాసూరుల దందాకు అడ్డేలేకుండా పోయింది. దాదాపు రూ. 20కోట్ల ఇసుక ఈ రకంగా పక్కదారి పట్టిందన్న ఆరోపణలున్నాయి. తమ పార్టీనేతలే కావడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మేక్ సొసైటీలు చొరవ చూపలేకపోయాయి. ఇప్పుడా అక్రమార్కుల జోలికి వెళ్లకుండా సమస్యలున్నాయని చెప్పి స్వయం సహాయక సంఘాల నుంచి రీచ్‌లను తప్పించేందుకుప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లోపాలు సరిదిద్ది, సమస్యలను అధిగమించకుండా క్యూబిక్ మీటర్‌కు రూ. 25చొప్పున కమీషన్ పొందుతున్న మహిళా సంఘాలకు అన్యాయం చేసేందుకు సర్కార్ ప్రయత్నించడంపై మహిళా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఇసుక విక్రయాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. కోటీ 14లక్షల వరకు కమీషన్ వచ్చింది. కొత్త విధానంలో భాగంగా రీచ్‌ల నిర్వహణ తప్పిస్తే ఇసుక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాల కోల్పోవల్సి వస్తోంది. అదే మేక్ సొసైటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి ఉంటే అక్రమాలకు తావుండేది కాదు. ధాన్యం...దైన్యం ధాన్యం కొనుగోలు బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన క్వింటా ధాన్యానికి రూ. 31.25పైసలు కమీషన్, హమాలీ చార్జీ కింద రూ. 4.72పైసలు ఇస్తామని ప్రకటించింది. ఇంకేమంది మహిళలు రెట్టింపు ఉత్సాహంతో ధాన్యం కొనుగోలు చేపట్టారు. కమీషన్ కింద రూ. 5,25,75, 908, హమాలీ చార్జీల కింద రూ. 79,41,65 రావల్సి ఉంది. మొత్తంగా చూస్తే రూ. 6,05,16, 973 గ్రామైక్య సంఘాలకు రావల్సి ఉంది. కానీ దాంట్లో కేవలం రూ. 4కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇప్పుడా మొత్తంలో కంప్యూటర్లు, ప్రింటర్ అద్దె, రవాణా చార్జీలు, శిక్షణా ఖర్చులు, నెట్ కనెక్షన్, స్టేషనరీ, జెరాక్స్ ఇతరత్రా ఖర్చుల కింద అయ్యే సొమ్మును మినహాయించి మిగతాది జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పంపిణీ చేసుకోవాలని సూచన ప్రాయ సలహా ఇచ్చింది. దీంతో క్వింటాకు రూ. 31. 25పైసలు వస్తుందనుకున్న చోట రూ. 10.45పైసలు వచ్చింది. ఎందుకింత మోసమని మహిళలు ఆవేదన చెందుతున్నారు. హామీ మాఫీ... రుణమాఫీ మామీ అటకెక్కింది. పెట్టుబడి నిధి పేరుతో కొంత మొత్తాన్ని ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన హామీ ప్రకారం జిల్లాలోని 41,997డ్వాక్రా సంఘాలకు రూ. 550కోట్ల వరకు రుణాలున్నాయి. రుణమంతా మాఫీ చేస్తామని ప్రకటించడంతో బ్యాంకులకు పైసా కూడా చెల్లించనక్కర్లేదని మహిళలు భావించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాఫీ జాన్తానై అని ప్రకటించి పెట్టుబడి నిధి పేరుతో రూ. 136కోట్లు ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొన్నారు. మాఫీ చేయవలిసిన డ్వాక్రా రుణం : రూ.550 కోట్లు పెట్టుబడి నిధిపేరిట చెల్లించింది : రూ 124 కోట్లు గ్రామైక్య సంఘాలకు చెల్లించవలసిన ధాన్యం కమీషన్ : రూ 6 కోట్లు చెల్లించింది : రూ.4కోట్లు -
డ్వాక్రాపై పేలిన తూటా..
‘అప్పు తిరిగి కట్టొద్దు.. డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేసేస్తా..’ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఈ వాగ్దానాలే తమ ఆర్థిక స్వావలంబనకు తూట్లు పొడిచిన బాణాలయ్యూయని డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. సాఫీబాటలో సజావుగా నడుస్తున్న బండిని ముళ్లబాటకు మళ్లించాయని మొత్తుకుంటున్నారు. ఆయన మాట నమ్మి, ఎంతో కొంత భారం తగ్గుతుందని ఆశించడమే నేరమైందని, అందుకు శిక్షగా తమ పరపతి ఇగిరిపోరుుందని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నమ్మిన వారంతా ఇప్పుడు హతాశులవుతున్నారు. గ్రామాల్లో తమకు, బ్యాంకులకు ఆనవారుుతీగా వస్తున్న ‘రుణానుబంధాన్ని’ చావుదెబ్బ కొట్టింది బాబు రుణమాఫీ హామీయేనని రైతులు ఆక్రోశిస్తున్నారు. డ్వాక్రా మహిళలదీ అదే వ్యధ, అదే కథ. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించనందుకు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు కొత్త రుణాలు కూడా పుట్టడం లేదు. అన్ని అర్హతలుండి కూడా కొన్ని సంఘాలు రుణం పొందలేకపోతున్నాయి. ఇందుకు ఒకపక్క బ్యాంకుల సిబ్బంది, మరోవైపు అధికారులు ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఇచ్చిన రుణం చెల్లించకుంటే కొత్త రుణం ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు వాగ్దానం జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న రుణప్రణాళికను తీవ్రంగా దెబ్బతీసింది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డ్వాకా సంఘాలకు నిర్దేశించిన రుణ ప్రణాళికలు, వాస్తవంగా మహిళల చేతికి దక్కిన పరపతిని నిశితంగా పరిశీలిస్తే పై కారణాలన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. రుణాల కోసం డ్వాక్రా మహిళలు తిరగని బ్యాంకు అంటూ లేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా ‘రుణం ఎంత ఉంది. ఎంత చెల్లించా’రనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చివరకు పాత బకాయిలు చెల్లిస్తే కొత్త రుణాల సంగతి పరిశీలిస్తామంటూ బ్యాంకులు తప్పించేసుకుంటున్నాయి. లక్ష్యం.. రూ.1,730 కోట్లు.. ఇప్పటికి ఇచ్చింది.. రూ.66 కోట్లు జిల్లాలో 81,218 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 8,52,789 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,523 సంఘాలకు రూ.1,730.70 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 2,076 సంఘాలకు రూ.66.40 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ‘ఏడిచే పిల్లాడి చేతిలో బెల్లం ముక్క పెట్టిన’ మాదిరిగా కూడా లేదని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగున్నర నెలలు గడుస్తున్నా.. లక్ష్యంలో కనీసం 5 శాతం కూడా ఇవ్వలేకపోయారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ 11,326 సంఘాల పరిధిలోని మహిళలకు రూ.367.25 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. అంతకు ముందు సంవత్సరం 2013-14లో 26,363 డ్వాక్రా సంఘాలకు రుణ లక్ష్యం రూ.687.88కోట్లుగా నిర్దేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో అంతకు మించే రుణాలు ఇవ్వగలిగారు. ఆ ఆర్థిక సంవత్సరంలో 29,705 సంఘాలకు రూ.900.80 కోట్ల రుణాలు మంజూరు చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయూసంగా అధిగమించేశారు. అంటే రుణాల మంజూరులో ఆ ఏడాది 131 శాతం లక్ష్యాన్ని సాధించారు. తర్వాత సంవత్సరం చతికిలబడడానికి కారణం రుణాలు మాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత వాగ్దానమే. వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రరుుస్తున్న మహిళలు ‘ఒక్క పైసా కట్టొద్దు.. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలన్నీ మాఫీ చేస్తా’మన్న ‘బాబు’ ఎన్నికలప్పుడు భారీ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా రుణాలు మాఫీ కాదని చెప్పకుండానే కాదన్నారు. జిల్లాలోని 71 వేల సంఘాలు పరిధిలో 2015 ఫిబ్రవరి నాటికి డ్వాక్రా రుణాలు రూ.1,200 కోట్లు పై మాటేనంటున్నారు. రుణమాఫీని అటకెక్కించి ఒక్కొక్క సంఘానికి లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే సంఘంలో సభ్యుడికి రూ.10 వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అంటూ మూలనిధిని సంఘాల ఖాతాలకు జమచేశారు. కానీ అదే సమయంలో రుణమాఫీకి మంగళం పాడారని మహిళలు మండిపడుతున్నారు. 79 వేల డ్వాక్రా సంఘాలకు సర్కార్ మూలనిధి రూపంలో రూ.790 కోట్లు మంజూరు చేసింది. ఈ సొమ్మంతా బ్యాంకుల్లో తమ పేరున జమ అయిందే తప్ప చిల్లిగవ్వ ప్రయోజనం లేదని మహిళలు మథనపడుతున్నారు. కొత్తరుణాలు పుట్టక మహిళలు బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఇప్పటికైనా మేలుకొని రుణాలను వేగవంతం చేయాలని మహిళలు కోరుతున్నారు. -
ఖాతాలో డబ్బులు.. తీసుకునే వీలు లేదు
కృష్ణా(మైలవరం): డ్వాక్రా రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మండల కేంద్రంలో పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం తమ ఖాతాలో వేసిన రూ.3 వేలు కూడా తీసుకునే అవకాశం లేదంటూ వారు అధికారులను అడ్డుకున్నారు. ఏపీఎం, పీవో, ఎంపీడీవోలను డ్వాక్రా లబ్ధిదారులు అడ్డుకుని తమ సమస్యలు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. -
మా బ్యాంకు.. మా ఇష్టం
అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసుకున్న అధికారులు అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్వాకం ప్రశ్నించిన డ్వాక్రా మహిళలపై మేనేజర్ చిందులు పత్రికల్లో వార్తలొస్తే ఇబ్బంది పడతారంటూ హెచ్చరిక మీకు అనవసరం అంటూ విలేకరులపై ఆగ్రహం వైఎస్ఆర్ జిల్లా(ప్రొద్దుటూరు) : డ్వాక్రా సంఘం సభ్యుల అనుమతి లేకుండా వారి ఖాతా నుంచి బ్యాంకు అధికారులు ఇష్టానుసారం డబ్బు డ్రా చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సదరు బ్యాంకు మేనేజర్ చిందులు వేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విలేకరులనూ కేసు పెడతానంటూ బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వీరాంజనేయ స్వయం సహాయక సంఘానికి పట్టణంలోని అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది మే 18న రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారు. జూన్ 1న 10 మంది గ్రూపు సభ్యులు కలిసి తీసుకున్న రుణానికి రూ.25 వేలు కంతు కట్టాల్సి ఉంది. ఈ విషయంపై మహిళలు సమావేశం నిర్వహించగా.. రుణం పొంది 12 రోజులే అయింది.. నెల పూర్తయ్యాక జూలై నుంచి కంతులు చెల్లిస్తే సరిపోతుందని ఆరుగురు మహిళలు చెప్పారు. దీంతో సభ్యులు జూన్ కంతు చెల్లించలేదు. గ్రూపు అధ్యక్షురాలు ఖాతాలోని డబ్బు తీసుకునేందుకు జూలై 3వ తేదిన బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాల్లోంచి రూ.69 వేలు డ్రా చేసినట్లు ఆన్లైన్లో వెల్లడైంది. ఆందోళన చెందిన సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా మీకు బ్యాంక్ నిబంధనలు తెలియవని చెప్పారు. తమ గ్రూపు.. బ్యాంక్‌కు ఎలాంటి బాకీ లేదని, ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. రుణం తీసుకుని 10 రోజులే కావడంతో జూన్ కంతు కట్టలేదని సభ్యులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏ లెక్క ప్రకారం రూ.69 వేలు కట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. - కానపల్లె గ్రామానికి చెందిన మరో గ్రూపునకు సంబంధించి గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించిన మూలధనం రూ.30 వేలు ఏడీబీ అధికారులు డ్రా చేసుకున్నారు. ఖాతాలో మరోమారు కూడా డబ్బు డ్రా చేసుకున్నారని సభ్యులు తెలిపారు. - ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన షేక్షావల్లి డ్వాక్రా గ్రూపునకు సంబంధించి మూలధనం రూ.30 వేలతో పాటు కొత్తగా మంజూరు చేసిన రుణంలో రూ.69 వేలు డ్రా చేసుకున్నారు. అగ్రికల్చల్ డెవలప్మెంట్ బ్యాంక్ పరిధిలో సుమారు ఆరేడు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మున్సిపాలిటీతోపాటు రూరల్ పరిధిలోని గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఇష్టారాజ్యంగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసుకున్నారు. చాలా ఖాతాలదీ ఇదే పరిస్థితి. మాకో నిబంధన.. మీకో నిబంధనా? 'డ్వాక్రా గ్రూపు మహిళలు డబ్బు తీసుకోవాలంటే పది మంది సభ్యులు వచ్చి బ్యాంక్ అధికారులకు కనబడితేకానీ రుణం ఇవ్వడం లేదు. అలాంటపుడు మా సంతకాలు లేకుండా, మాకు తెలియకుండానే డబ్బులు ఎలా డ్రా చేసుకుంటార'ని పలువురు మహిళలు ఏడీబీ మేనేజర్ అనంతకుమార్‌ను ప్రశ్నించారు. ఖాతాల్లోంచి పెద్ద ఎత్తున డబ్బులు బ్యాంక్ అధికారులు డ్రా చేశారని తెలియడంతో మంగళవారం మహిళలంతా బ్యాంక్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలోకి వెళ్లారు. అంత డబ్బు ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించగా.. తమకు సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఏమైనా ఆస్తులు తనఖా పెట్టారా.. కేవలం మిమ్మల్ని చూసి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ తతంగం జరుగుతుండగా విలేకరులు మేనేజర్ చాంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నారు. అనుమతి లేకుండా లోపలకు వచ్చారని, కేసు పెడతానని మేనేజర్ బెదిరించారు. మీరే విలేకరులను తీసుకు వచ్చారని మహిళలపై మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే చాలా ఇబ్బందులు పడతారని వారినీ బెదిరించారు. కాసేపటి తర్వాత విలేకరులు మళ్లీ వెళ్లి ఆయన్ను సంప్రదించగా.. వాళ్లు (మహిళలు), మేము మాట్లాడుకున్నాం. ఈ సమస్య మీకు అనవసరం అని చెప్పారు. -
చెత్త ఫైటింగ్
కార్మికుల మధ్య తోపులాట నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పారిశుధ్య విధుల్లో డ్వాక్వా మహిళలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కార్మికుల మధ్య ‘చెత్త’ ఫైటింగ్ ఆరంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిపై విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలతో ఔట్సోర్సింగ్ సిబ్బంది వాదనకు దిగారు. మా పొట్టలు కొట్టొద్దంటూ విన్నపాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ససేమిరా అనడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి. కృష్ణలంక, లంబాడీపేట, కుమ్మరిపాలె ం, పాయకాపురం, పటమట ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మల్లికార్జునపేటలో కార్మికుల మధ్య వివాదం ముదరడంతో ప్రజారోగ్య శాఖాధికారులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్వాక్వా మహిళల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. ఫలిస్తున్న ప్రయత్నాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కమిషనర్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. డ్వాక్వా మహిళలు పారిశుధ్య విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్కిల్-1లో 102, 2-లో 130, 3-లో 60 మంది చొప్పున కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎన్సీసీ విద్యార్థులు వీధులను శుభ్రపరిచారు. కార్మిక సంఘాల అత్యవసర భేటీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు సాగించడంపై ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రెస్‌క్లబ్‌లో అత్యవసర భేటీ నిర్వహించారు. సమ్మె సెగను మరింత రగిలించాలని నిర్ణయించారు. గురువారం నుంచి నగరంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 17న సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటన్నారు. పోలీసు కేసులకు వెరచేది లేదని స్పష్టం చేశారు. -
ఇసుక ‘డ్వాక్రా’ది, తైలం ‘తమ్ముళ్ల’ది
ఇసుక దందాలో తెలుగుదేశం శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పతా కశీర్షికను సంపాదించుకున్నారు. ఎం దరో తెలుగు తమ్ముళ్లకూ ఇది దక్కాల్సింది, ఆయన ముందుగా దక్కించు కున్నారు. తనది దుందుడుకు స్వభా వమని తానే ప్రకటించుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే దుందుడుకుత నాన్ని ప్రజలు కొంతమేరకైనా ఆమో దిస్తారేమో కాని, అధికారపక్షంలో అధికార దుర్మదాంధతగా ఈసడించుకుంటారు. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా రెవెన్యూ అధికారిని దుర్భాషలాడి, మహిళలతో కొట్టించే దాష్టీకం పోలీసుల సమక్షంలో జరగడం కంటే ప్రజాస్వామ్యానికి దుర్ది నం మరొకటి ఉండదు. మానవహక్కుల కమిషన్ తన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకుంది. తనంతట తానుగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చింది. ఇతర ఉన్నతాధికార వ్యవస్థలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేవంతరెడ్డి, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత వైగైరా అస్మదీయుల జాబితా ఉంది. సుజాత కేసు విచారణ దశలోనే ఆగి ఉంది. ఇప్పుడు ప్రభాకర్ కేసుకు పోటీగా రెవిన్యూ అధికారిణి మీద ఎదురు కేసులు పెట్టి ఉంచారు. ఏమి జరుగుతుందో ఊహిం చుకోవచ్చు. అసలు కథలోకి వద్దాం. రాష్ర్టంలో ఇసుక దందాలో చింత మనేని ప్రభాకర్ ఉదంతం సముద్రంలో మంచు కొండలాంటిది. కొండ కొన మాత్రమే మనకి కనిపించింది. కుంభకోణం కొండ లోపలే తన పని చే సుకుపోతున్నది. 2014 ఆగస్ట్‌లో చంద్రబాబు కొత్త ఇసుక పాలసీని ప్రకటించారు. ఇసుక అమ్మ కాలలో దళారులను లేకుండా చేస్తున్నట్టు, డ్వాక్రా గ్రూపులకే ఇసుక రీచ్‌లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విని యోగదారులకు చౌకగా ఇసుక, డ్వాక్రా మహిళలకు లాభాలలో 25%శాతం వాటా దక్కుతాయని ప్రచారం చేశారు. అమలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ కొత్త ఇసుక పథకం అమలు కోసం రాష్ర్టంలో 353 ఇసుక రీచ్‌లను గుర్తించారు. వీటిని మహిళా సంఘాలకు కేటా యించడానికి జిల్లాస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసి 343 రీచ్ లను మహిళా గ్రూపులకు అప్పగించారు. 10 రీచ్‌లకు ఎవరూ రాక తవ్వకాలు జరగడం లేదు. డ్వాక్రా మహిళా సంఘాల సమన్వయ కర్తగా ఉన్న సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీకి అజమాయిషీ బాధ్యతలు అప్పగించారు. మొదటి అంశం. ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే మొత్తం ఇసుక మీద గుత్తాధిపత్యం ఈ మహిళా సంఘాలకే ఉంది. అలాంటప్పుడు వ్రైవేట్ మార్కెట్లో ఇసుక లభించకూడదు. కాని లభిస్త్తున్నది. ఇదెక్కడిది? ఈ 343 మహిళా సంఘాల రీచ్‌ల నుండి అక్రమంగా తరలించినదే కాని మరెక్కడ నుండో ఎగిరి వచ్చే అవకాశం లేదు. రెండవ అంశం. ఇసుక ధరలకు రెక్కలెందుకు వచ్చాయి? ప్రభుత్వం ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పెట్టాల్సిన ఖర్చులను వినియోగించే యంత్రాలు, కూలీలను బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 157 నుండి 177 లుగాను, పూర్తిగా కూలీలే తవ్వితే రూ.211 గాను నిర్ణయించింది. దీనిని ఒడ్డుకు చేర్చడానికి రవాణా ఛార్జీ అదనం అని ప్రకటించింది. కేవలం కూలీలతోనే తవ్వే రీచ్‌లు దాదాపుగా లేవు. రీచ్‌ల దగ్గరే అమ్మకాలు చేస్తు న్నందున కొనుగోలుదారే లోపలి నుండే ఎగుమతి చేసు కుంటారు. గనుక అక్కడ రవాణా ఛార్జీలు ఉండవు. అయినా ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650గా నిర్ణయిం చింది. ప్రతి లారీ మీద దాదాపు 4000 రూపాయలను ప్రభు త్వం దండుకొంటున్నది. ఇలా మధ్యతరగతి ప్రజల స్వంత ఇంటి కల మీద ప్రభుత్వమే ఇసుక పిడుగు వేసింది. మరో పక్క ప్రైవేటు ఇసుక దందా యథేచ్ఛగా సాగుతు న్నది. జిల్లాల పత్రికలు తిరగేస్తే అన్ని జిల్లాలలోను ఇసుక దందా వార్తలు ఏదో మూల దర్శన మిస్తూనే ఉన్నాయి. చాలా మంది శాసనసభ్యుల సారధ్యంలో, వారి అనుచరగణాల ఆధ్వ ర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం సాగిపోతున్నది. రీచ్‌లలో తాత్కాలికంగా తవ్వకాలు ఆపించి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు రాబడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్క రించి తవ్వకాలు సాగిస్త్తున్నారు. ఇసుక పధకం డ్వాక్రా మహి ళలకి -తైలం తెలుగు తమ్ముళ్లకి అన్న చందంగా కనిపిస్తున్నది. ఈ పధకం ఉద్దేశ్యమే అది అయినట్లు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు ఉంది. ఇక చింతమనేని కథ కంచికి చేరకుండా ఉం టుందా? (వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్‌సత్తా పార్టీ) మొబైల్: 98660 74023 - డీవీవీఎస్ వర్మ -
ఇది మోసకారి ప్రభుత్వం: జగన్
* రైతులు, డ్వాక్రా మహిళలు నష్టపోయారు * ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు * ప్రజల ఉసురు తగిలి ఇప్పటికే అల్లాడుతోంది * మంచి రోజులు త్వరలోనే వస్తాయి * పింఛన్ రాని వారి తరఫున న్యాయ పోరాటం సాక్షి, కడప: ‘గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏదీ చేయలేక చతికిలపడ్డారు. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. నిరుద్యోగభృతి ఊసే లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొల్పారు. ఇదంతా చూస్తుంటే ఇది మోసకారి ప్రభుత్వమని స్పష్టమైంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, లింగాల మండలం మురారిచింతల గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను చూడగానే డ్వాక్రా మహిళలు రుణాల గురించి, వృద్ధులు పింఛన్ల గురించి ఆయన దృష్టికి తెచ్చారు. డ్వాక్రా రుణానికి కంతులు కట్టలేకపోతున్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని జగన్.. వారందరికీ ధైర్యం చెప్పారు. ‘రుణాలు కట్టవద్దు.. అధికారంలోకి రాగానే అన్ని రుణాలు మాఫీ చేస్తామ’ని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించి.. ఖజానా ఖాళీ పేరుతో రూ.3 వేలకు దానిని పరిమితం చేశారన్నారు. అది కూడా పెట్టుబడి నిధి కింద జమ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అందరి తరఫున తాను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు త్వరలోనే వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. పింఛన్ రాని వారి తరఫున పోరాటం వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు వచ్చేవని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరుతో తొలగించడం అన్యాయమని వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు పండుటాకులన్న కనీస మానవత్వం లేకుండా ఇష్టానుసారం తొలగించారన్నారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో వృద్ధులు పింఛన్ తొలగించారని చెబుతుంటే చాలా బాధేస్తోందన్నారు. అర్హులుగా ఉండి పింఛన్ రాని పండుటాకుల తరఫున న్యాయపోరాటం చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు
అనంతపురం: డ్వాక్రా రుణాలు మఫీ చేయలేదని మహిళలు రొడ్డెక్కారు. అనంతపురం జిల్లా రొద్దం మండలకేంద్రంలో గురువారం పెద్ద ఎత్తున మహిళలు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్వ్రాక్రా రుణాల ఊసెత్తడంలేదని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిపేశారు. (రోద్దం) -
డ్వాక్వా సంఘాలు ఢమాల్
రుణ లక్ష్యం రూ.140కోట్లు అందించింది రూ.71 కోట్లు తిరోగమనంలో పొదుపు సంఘాలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో డ్వాక్వా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. రుణమాఫీ దెబ్బకు కొత్త రుణాల్లో కొర్రీ పడింది. స్వయం సహాయక సంఘాల ఖాతాల నుంచి బ్యాంకర్లు ఇప్పటికే పొదుపు సొమ్మును జమచేసుకున్నారు. బ్యాంకర్ల వేధింపుల నేపథ్యంలో మిగిలిన రుణాలను సభ్యులే స్వచ్ఛందంగా చెల్లించారు. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల మేర రుణమాఫీ ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా బడ్జెట్లో రివాల్వింగ్ ఫండ్‌ను తెరపైకి తెచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల గ్రూపులకు రూ.140 కోట్లు రుణాలుగా అందిచాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,875 గ్రూపులకు రూ.71 కోట్ల మేర మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో 50 శాతంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన ఆరు నెలల్లో 355 గ్రూపులు రద్దయ్యాయి. మరిన్ని సంఘాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ మాఫీ అధికారుల అలసత్వం కారణంగానే డ్వాక్వా సంఘాలు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ఏడాది నుంచి అధికారులు బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.130 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.101 కోట్లు పంపిణీ చేశారు. దీనిపై నాటి కమిషనర్ సి.హరికిరణ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పీవో ఎం.శకుంతల ఏమాత్రం దృష్టిసారించలేదు. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ హామీలను మాఫీ చేసి రుణాలను మిగిల్చింది. దీంతో బ్యాంకర్లు మహిళల పొదుపు ఖాతాల నుంచి బకాయిల్ని మినహాయించుకున్నారు. గతంలో 11,973 గ్రూపులు ఉండగా ప్రస్తుతం 11,618 పనిచేస్తున్నాయి. స్మార్ట్‌సిటీ, బ్యూటిఫికేషన్‌పై అధికారులు చూపుతున్న శ్రద్ధలో కనీసం పది శాతం డ్వాక్వా సంఘాలపై చూపడం లేదు. పీవో ఎం.శకుంతలను సరెండర్ చేసిన కమిషనర్ జి.వీరపాండియన్ ఇన్చార్జి బాధ్యతల్ని విజయలక్ష్మికి అప్పగించారు. నెల రోజుల క్రితమే ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరు లోపు రూ.69 కోట్ల రుణాలను అందించాల్సి ఉంది. నేను కొత్తగా వచ్చా నెల రోజుల క్రితమే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. సమీక్షలు, సమావేశాలతోనే టైం సరిపోతుంది. ఇప్పుడిప్పుడే సెక్షన్‌పై అవగాహన వస్తోంది. లక్ష్యసాధన దిశగా రుణాలు మంజూరు చేసేందుకు నావంతు కృషి చేస్తా. - విజయలక్ష్మి, యూసీడీ ఇన్చార్జి పీవో -
సర్కారు మెడలు వంచుదాం!
-
ఇది మోసపూరిత ప్రభుత్వం!: వైఎస్ జగన్
* ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారు * హామీలివ్వడం, విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య * ప్రతిపక్షంలో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం చేస్తాం * అందరూ చేయీ చేయీ కలిపి సర్కారు మెడలు వంచుదాం సాక్షి, కడప: డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు తీసుకున్న రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ప్రజలను వంచిస్తున్న మోసపూరిత సర్కార్ అని దుయ్యబట్టారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులతోపాటు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలువురు పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, రుణమాఫీ లిస్టులో పేర్లు లేని రైతులు, డ్వాక్రా మహిళలు ఆయనను కలిశారు. ఈ సర్కారు తమ జీవితాలను నాశనం చేసిందని వారు వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ప్రజలకు ఏవేవో చేస్తామని లెక్కలేనన్ని హామీలిచ్చి, ఈ రోజు చేతకాక ప్రజలను రోజుకొకమాటతో వంచనకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం తర్వాత విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని, అందుకే రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, పండుటాకుల పింఛన్లపై మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజలు కూడా తమ ఆందోళనల్లో పాలుపంచుకుని ప్రభుత్వం మెడలు వంచేందుకు చేయి కలపాలని ఆయన పిలుపునిచ్చారు. అండగా ఉంటా... అధైర్యపడొద్దు... వరుసగా ప్రజలు ఆదిరిస్తున్నారనే అసూయతో పొట్టనపెట్టుకున్నారయ్యా... ముందు సర్పంచ్ అయ్యాడు, మా వదినా సర్పంచ్ అయ్యింది... ఎంపీటీసీ గెల్చినాం... ఒకర్ని కూడ పల్లెత్తుమాట అనని నా తోడబుట్టినోన్ని తెలుగుదేశమోళ్లు చంపేశారయ్యా.. అంటూ గత జూలైలో హత్యకు గురైన మర్రిబోయిన ఓబులేసు సోదరి ఓబులమ్మ జగన్‌ను చూడగానే బోరుమన్నారు. నీతిగా ఉన్నందుకే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు సామీ... అంటూ వాపోయారు. వారి రోదనలకు జగన్ చలించిపోయారు. నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, అధైర్యపడొద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ అవసరం వచ్చినా, తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అండదండగా ఉంటారని చెప్పారు. అధైర్య పడకుండా ప్రజాసేవలో పాలు పంచుకోవాలని ఓబులేసు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అడుగడుగునా నీరాజనం... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రొద్దుటూరు వెళ్తున్నారని తెలుసుకున్న ప్రజలు పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకూ గ్రామగ్రామాన ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు, చిలంకూరు, నిడ్జివి, యర్రగుంట్ల జనం రోడ్డుపై బారులు తీరారు. ప్రొద్దుటూరులో యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికి కేరింతలు కొట్టింది. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జయరాములు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజాద్బాష, పి.రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
బాబూ.. డైలాగులొద్దు: రఘువీరారెడ్డి
గుడిబండ: డైలాగులు చెప్పడం మాని, పనితనాన్ని చేతల్లో చూపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు బేషరతుగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలు కొన్ని వందల సభల్లో చెప్పారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేస్తామని, పింఛన్లు పెంచుతామని, అన్ని గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి నీరు ఇస్తామని, బెల్టుషాపులు రద్దు చేస్తామని సంతకాలు చేశారన్నారు. అయితే నేడు రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు వేస్తూ.. ఎన్నెన్నో షరతులు పెట్టారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాకు పంటల బీమా కింద విడుదలైన రూ. 226 కోట్లు రుణాలకు జమ వేసుకోవడం ఆపేసి, రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీపై చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను (తన ఫోన్లో రికార్డు చేసిన వాయిస్‌ను) అక్కడే ఉన్న మహిళలకు వినిపించారు. -
ఆన్లైన్ ఇసుక రెడీ !
సాక్షి, చిత్తూరు: ఇసుకను మీ-సేవ, ఆన్లైన్ ల ద్వారా వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఒక టి రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లావ్యా ప్తంగా 25 ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు జిల్లా స్థాయి కమిటీ 37 ఇసుక రీచ్‌లను గుర్తించినా మొదటి విడతలో 25 రీచ్‌లను మాత్రమే ఆయా పంచాయతీల పరిధిలోని డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. వినియోగదారుడు ట్రాన్స్పోర్ట్ చార్జీల సహా ధరను మీ-సేవ ద్వారా చెల్లిస్తే ప్రభుత్వమే ఇసుకను అతడి ఇంటికి సరఫరా చేస్తుంది. వినియోగదారుడు 9 క్యూబిక్ మీటర్ల ఇసుక వరకూ మీ-సేవలో... ఆ పైన ఇసుక కావలసి వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను సరఫరా చేయనున్నారు. ఇసుక ధర :ఒక్క క్యూబిక్ మీటరు ఇసుక ధర *300లుకాగా, సీనరీస్ చార్జెస్ *40తో కలిపి మొత్తం 340 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ట్రాక్టర్ ఇసుక (3 క్యూబిక్ మీటర్లు) ధర 1,020 రూపాయలు. కొన్ని చెరువులు,కాలువలు,చెక్‌డ్యామ్‌లలో దొరికే నాసిరకం ఇసుకను(సిల్ట్) మాత్రం క్యూబిక్ మీటర్ *260 చొప్పున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఇక ట్రాన్స్పోర్ట్కు సంబంధించి 5 కిలోమీటర్లలోపు దూరంలో అయితే ట్రాక్టర్ ఇసుకకు *350 బాడుగగా నిర్ణయించారు. ఆ పైన 10 కిలోమీటర్లలోపు ఉంటే 550 రూపాయలు,10 కిలోమీటర్ల పైన ఉంటే మాత్రం ప్రతి కిలోమీటర్‌కు అదనంగా *28 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌లు : చిత్తూరు,జీడీ నెల్లూరు మండలాల్లో గయారాంపల్లి,నందనూరు, అంగళ్లు, బీఎన్నార్పేట తదితర ప్రాం తాల పరిధిలో ఉన్న నీవా నదిలో 7 ఇసుక రీచ్‌లను గుర్తించగా, చిత్తూరు, పూతలపట్టు మండలాల పరిధిలో మరో 4 రీచ్‌లు, తొట్టంబేడు మండల పరిధిలో స్వర్ణముఖి నదిలో 3 రీచ్‌లు,బీఎన్ కండ్రిగ మండలం కాళంగి నదిలో 3 రీచ్‌లు, కలికిరి మండలంలో 6 రీచ్‌లు చొప్పున మొత్తం 37 రీచ్‌లను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు. తెలిపారు. తొలుత 25 రీచ్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నేడో రేపే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఇసుక రీచ్‌లను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
డ్వాక్రా మహిళల ముసుగులో టీడీపీ నేతల దందా!
-
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్‌ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్‌ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలుకు చర్యలు పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
పోలవరం ఎమ్మెల్యేకు చేదు అనుభవం
పోలవరం: పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల వద్ద ఇసుక ర్యాంపును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను డ్వాక్రా మహిళలు అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మహిళలతో టీడీపీ కార్యకర్తలు వాగ్వదానికి దిగారు. మహిళలను పక్కకు తోసేశారు. తర్వాత ఎమ్మెల్యేతో ఇసుక ర్యాంపును ప్రారంభింపజేశారు. తమపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా మహిళలు అక్కడే బైఠాయించారు. -
రుణం చెల్లించాల్సిందే
సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. పాత బకాయి చెల్లిస్తేనే... పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. బాబువి మాయమాటలేనా? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. -
ఇసుక పెత్తనం తమ్ముళ్లకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డ్వాక్రా రుణాలు మాఫీ అటకెక్కించడంతో.. మహిళలను సంతృప్తి పరచడానికి టీడీపీ ప్రభుత్వం ఇసుక రీచ్‌ల డ్రామా తెరపైకి తెచ్చింది. పోనీ మహిళలకే కట్టబెట్టారనుకుంటే పొరపాటే. మహిళల పేరు చెప్పి ఇసుక రీచ్‌లపై తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. పెపైచ్చు తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలతో డ్వాక్రా మహిళలకు కన్నీళ్లు మిగిలాయి. అలాగే యథాతథంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కొత్తదే అయినా.. జిల్లాలో మాత్రం పాత పద్ధతిలోనే ఇసుక రవాణా కొనసాగుతోంది. జిల్లాలో 72 ఇసుక రీచ్‌లను గుర్తించారు. అందులో ప్రస్తుతం 25 రీచ్‌లకు అనుమతులు వచ్చాయి. వీటిలో కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల తమ్ముళ్ల బినామీలు అడ్డుతగులు తుండటంతో ప్రారంభం కాలేదు. కోవూరు నియోజక వర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని జొన్నవాడ, మినగల్లు, విడవలూరు మండలం ముదివర్తి, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ఇసుక రీచ్‌లు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం. ‘అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయాలని చూస్తే మీ అంతుచూస్తాం’ అని బెదిరిస్తున్నట్టు తెలిసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకులతోట ఇసుక రీచ్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ తమ్ముళ్ల బినామీలు అడ్డుతగిలి దౌర్జన్యం చేశారు. ఇసుక రీచ్‌ను తమకే ఇవ్వాలంటూ ప్రారంభాన్ని అడ్డుకున్నారు. షామియానాను పడదోసి మహిళలపై దౌర్జన్యం చేశారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత సద్దు మణిగింది. అయితే ‘రీచ్‌లో ఎవరైనా అడుగుపెడితే.. ఇసుకలోనే తొక్కేస్తాం’ అని బెదిరిస్తున్నట్టు మహిళలు భయపడుతున్నారు. దీంతో ఇక్కడ ఇసుక తవ్వకాలు ప్రారంభించలేదు. అదే విధంగా కోడూరుపాడు, ఎన్వీ గార్డెన్, పొట్టేపాళెం, గొల్లకందుకూరు, సజ్జీపురం, ముల్లుముడి తదితర ప్రాంతాల వద్ద స్థానికులు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. బిల్లొకటే.. అనుమతి మూడింటికి కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వే బిల్లును చూపి మూడు ట్రాక్టర్ల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నాయుడుపేట పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి పగలు నిబంధనల ప్రకారం తరలిస్తున్నా.. రాత్రి పూట మాత్రం ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా సూళ్లూరుపేట పరిధిలోనూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
దూరం.. భారం
ఇసుక బంగారమే! సాక్షి, కర్నూలు: ఇసుక ధర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఫలితంగా ఇసుక చౌక ధరకు లభించే అవకాశం ఏర్పడినా.. దూర ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చు తడిసి మోపెడు కానుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక వ్యాపారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్న డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు తీర్మానించారు. ఆ మేరకు ఇప్పటికే పలు సంఘాలకు బాధ్యతలు కట్టబెట్టారు. జిల్లాలోని జి.సింగవరం-ఎదురూరు, నిడ్జూరు-బావాపురం, మంత్రాలయం పరిధిలో ఇసుక తవ్వకాలకు మూడు రీచ్‌లను ఎంపిక చేశారు. త్వరలోనే సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తరహాలో ఇక్కడా అదే పాలసీని అమలు చేసేందుకు జిల్లా నుంచి ఓ టీం అధ్యయనం చేసి వచ్చింది. పర్యావరణ అనుమతులు కూడా పూర్తి కావడంతో ఇక తవ్వకాలకు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతి లభించింది. జి.సింగవరం-ఎదురూరు రీచ్, నిడ్జూరు-బావాపురం రీచ్‌లలో 50వేల క్యూబిక్ మీటర్లు చొప్పున.. మంత్రాలయం రీచ్‌లో 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునే వీలుంది. ఇసుక ధర నిర్ణయంపై కసరత్తు జరుగుతోంది. అయితే అధికార వర్గాల సమాచారం మేరకు క్యూబిక్ మీటరు ఇసుకను రూ.650లకు విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ లెక్కన యూనిట్ ఇసుక ధర రూ.2వేలు పలకనుంది. ఒక లారీలో రెండు యూనిట్ల ఇసుక తరలిస్తే రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇదేమీ భారం కాకపోయినా.. రవాణా చార్జీ కాస్త ఇబ్బంది కానుంది. జిల్లా అధికారులు కిలోమీటరుకు రూ.65 చొప్పున ధర నిర్ణయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు రెండు యూనిట్లకు రూ.2వేలు అధనంగా భరించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు నిడ్జూరు-బావాపురం రీచ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆయా ప్రాంతాల ప్రజలు రవాణా చార్జీలే రూ.6500 పైగా భరించాల్సిన పరిస్థితి. ఈ మొత్తానికి ఇసుక ధర కలిపితే రెండు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.10,500 వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఇదిలాఉంటే మంత్రాలయంలో రీచ్‌ను నిర్ణయించినా ఆ ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నిర్మించిన పథకం ఉండటంతో ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు తవ్వకాలకు అనుమతి అసాధ్యమని తెలుస్తోంది. అదే జరిగితే ఆదోని డివిజన్లోని ప్రజలకూ ఇసుక బంగారం కానుంది. ప్రభుత్వ తాజా విధానం పరిశీలిస్తే.. ఇసుక అవసరమైన వినియోగదారులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే, మహిళా సంఘాలు రవాణా చార్జీలు కలుపుకొని ఇసుక సరఫరా చేయనున్నాయి. ఆన్లైన్ బుకింగ్ కావడంతో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వెలసుబాటు ఉంది. ఇసుక రవాణాకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వీటికి ప్రభుత్వ స్టిక్కర్లు అతికిస్తామని.. భవిష్యత్‌లో జీపీఎస్‌కు అనుసంధానం చేయనుండటంతో ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రవాణా చార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే దూర ప్రాంత వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవాల్సిందే. -
వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయూలి
వల్లూరు: ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నింటినీ తక్షణం మాఫీ చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పీ.రవీంధ్రనాధ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మండల పరిషత్ సభాభవనంలో ఎంపీపీ పొన్నోలు పిచ్చమ్మ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం నేటికీ ప్రజలను మభ్యపెడుతూనే ఉందని విమర్శించారు. కనీసం వడ్డీలో కొంత భాగానికి కూడా సరిపోని విధంగా కేవలం 5 వేల కోట్లను విడుదల చేయడం దారుణమన్నారు. వారి అబద్దపు హామీతో నేడు రైతులు పంట రుణాలను పొందడానికి వీలు లేకుండా పోయిందని విమర్శించారు. దీని వలన ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ పంటల బీమా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఎవరైనా స్వార్థంతో ఇతరులకు హాని చేయరాదన్నారు. మంచి పనులు చేసి ప్రజాదరణ పొందడానికి కృషి చేయాలన్నారు. సమాజంలో మంచితనం, మార్పు అవసరమని పేర్కొన్నారు. కక్షలు ,కార్పణ్యాలకు దూరంగా ఉండి ప్రజాదరణ పొందడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి మాట్లాడుతూ వ ల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మాణాలను చేపట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మొగిలిచెండు సురేష్, తహశీల్దార్ వెంకటేష్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు , ఎంపీపీ తనయుడు శివకుమార్‌రెడ్డి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలకూ టోపీ..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) కింద 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చి 31 నాటికి 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నారు. చంద్రబాబు హామీ మేరకు ఆ రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. కానీ.. సీఎంగా బాధ్యతలు స్వీకరిం చగానే మాట మార్చారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని ఏకంగా చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున ప్రోత్సాహకంగా మూలధనాన్ని అందిస్తామని సెలవిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలకు రూ.617.11 కోట్లను ప్రోత్సాహకం రూపంలో మూలధనంగా అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూలధనం రూపంలో అందించే రూ.లక్షను ఎప్పటిలోగా సంఘాలకు విడుదల చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు. మంగళవారం విజయవాడలో రైతు సాధికార సంస్థ ప్రారంభోత్సవం సమయంలో డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకం అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పంట రుణాలను చెల్లించినట్లుగానే ఏటా 20 శాతం వంతున డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహక మూలధనాన్ని అందించాలని నిర్ణయించారు. అంటే.. ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వంతున ఇచ్చే మూలధనంలో ఏటా రూ.20 వేల వంతున ఐదేళ్లపాటూ సంఘాల ఖాతాల్లో జమ చేస్తారన్న మాట. ఒక్కో సంఘంలో కనిష్టంగా పది నుంచి గరిష్టంగా 15 మంది వరకూ సభ్యులుగా ఉంటారు. సగటున ఒక్కో సంఘానికి పది మంది సభ్యులుగా ఉంటారని పరిగణించినా.. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.రెండు వేలకు మించి దక్కదన్నది స్పష్టమవుతోంది. మండిపడుతున్న మహిళలు.. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద జిల్లాలోని 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలకు బ్యాంకర్లు రూ.1611.03 కోట్లను రుణాలుగా అందించారు. ఆ రుణాలు మాఫీ అవుతాయనుకున్న మహిళల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. సాధారణంగా మహిళా సంఘాలకు బ్యాంకులు ఏడు శాతం వడ్డీపై రుణాలు ఇస్తాయి. కంతులను మహిళలు సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. కానీ.. రుణమాఫీ అవుతుందని భావించిన మహిళలు కంతులు చెల్లించకపోవడంతో 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. మోయలేని రీతిలో వడ్డీ భారం పడటంతో మహిళలు లబోదిబోమంటున్నారు. అప్పు కట్టకపోతే సీఐఎఫ్‌లో కట్.. డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో బ్యాంకర్లు వసూళ్లకు శ్రీకారం చుట్టారు. రుణాలను చెల్లించకపోతే సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి నిధి), పొదుపు మొత్తం నుంచి నిధులను కంతులకు మళ్లిస్తామని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. సీఐఎఫ్, పొదుపు నిధుల్లో ఒక్క రూపాయిని డ్రా చేయాలన్నా గ్రామైక్య సంఘం, ఆయా మహిళా సంఘాల అనుమతి తప్పనిసరి. కానీ.. బ్యాంకర్లు నిబంధనలను తుంగలోతొక్కి సీఐఎఫ్, పొదుపు నిధులను యథేచ్ఛగా అప్పుల కింద జమ చేసుకుంటున్నారు. జిల్లాలో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.95 కోట్లకు తగ్గిపోయినట్లు సమాచారం. -
తప్పు వారిది.. శిక్ష మాకా..!
* బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదంటున్న డ్వాక్రా మహిళలు * సంఘాల నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు * తామేమీ చేయలేమంటున్న బ్యాంకర్లు జమ్మలమడుగు: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లించాం.. ప్రతి నెలా పొదుపు కూడా కట్టేసుకుంటున్నాం.. తిరిగి తమకు రుణాలు ఇవ్వాలని అడిగితే బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.. రుణాలను కట్టని వారిని చూపిస్తూ వారితో కట్టిస్తేరుణాలు ఇస్తామంటున్నారని.. ఇదేమి న్యాయమని డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక మెప్మా కార్యాలయంలో మహిళ సంఘాల సర్వ సభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాతిరెడ్డి తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వక బ్యాంకుల చుట్టూ తమను తిప్పించుకుంటున్నారన్నారు. శ్రీనిధి నుంచి కూడా డబ్బులు తీసుకోనీయడం లేదన్నారు. రుణాలు ఏడాది దాటుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగైతే సంఘాలనుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. మెప్మా జిల్లా స్పెషలిస్ట్ రమణ మాట్లాడుతూ సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సక్రమంగా చెల్లించని వారిని సక్రమంగా చెల్లించేవారిని ఒకేవిధంగా చూడటం సరైంది కాదన్నారు. మానవతాదృక్పధంతో ఆదుకోవాలి... సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి మానవతాదృక్పధంతో తిరిగి రుణాలు ఇవ్వలని చైర్పర్సన్ తాతిరెడ్డితులసి కోరారు. సమావేశంలో శ్రీనిధి ఏరియా కోఆర్డినేటర్ శశిధర్‌రెడ్డి, మెప్మా పీఆర్పీ భవాని పాల్గొన్నారు. -
ఇసుక రీచ్‌ల రాబడి స్థానిక సంస్థలకే కేటాయించాలి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిడతాపోలూరు(ముత్తుకూరు): ఇసుక రీచ్‌ల ఆదాయంలో డ్వాక్రా మహిళా సంఘాలకు పోను మిగిలిన మొత్తం స్థానిక సంస్థలకు కేటాయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్మభూమిలో భాగంగా శనివారం బ్రహ్మదేవి, పిడతాపోలూరులో జరిగిన గ్రామసభలో కాకాణి మాట్లాడారు. గతంలో ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఇసుక రీచ్‌ల రాబడి ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా స్థానిక సంస్థల బలోపేతానికి కేటాయించాలన్నారు. ఇప్పటికే గ్రావెల్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వం జమ చేసుకుంటోందన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర సీఎంలు ప్రకటించిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రలు గ్రామాల్లో అమలు కావాలన్నా, పారిశుధ్యం మెరుగుపడాలన్నా నిధులు, సిబ్బంది కొరత అవరోధంగా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ అంటూ ప్రచారం చేయడంతో ప్రయోజనం లేదన్నారు. జిల్లాలో మొత్తం 2.16 లక్షల పింఛన్లలో 54,000 పింఛన్లకు కోత పెట్టారని విచారం వెలిబుచ్చారు. పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ గ్రామసభల్లో కాకాణి పేదలకు పింఛన్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎంపీడీఓ సుజాత, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, సర్పంచ్‌లు కట్టా సుబ్రహ్మణ్యం, తిరకాల ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు కె.రమేష్, దీనయ్య, కోటేశ్వరావు, వైఎస్సార్సీపీ మండల క న్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?
ఏది న్యాయం? ► రుణమాఫీ, పింఛన్లపై నిరసనలు పట్టని టీడీపీ ►భూములు అమ్మేసిన రైతుల్ని రెచ్చగొట్టి ఆందోళనలు ►హెరిటేజ్, ‘రామోజీ’ భూముల్ని వెనక్కిచ్చేస్తారా? ►విపక్ష నేతనే టార్గెట్ చేసుకుని కదులుతున్న తీరు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు మొదలెట్టింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబీకులకు చెందిన ‘సరస్వతీ సిమెంట్స్’ను వేధిస్తోంది. ఆరేడేళ్ల కిందట ఈ సిమెంట్స్‌కు భూములు విక్రయించిన రైతుల్ని రెచ్చగొట్టి, సంస్థ ఇప్పటిదాకా ప్లాంటు పెట్టలేదు కాబట్టి ఆ భూముల్ని తిరిగి రైతులకిచ్చేయాలంటూ ఆందోళనలు చేయిస్తోంది. సంస్థకు 2009లో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజును కూడా రద్దు చేసింది. అసలు ప్లాంటు పెట్టాలంటే అనుమతులుండాలి కదా? వాటి కోసం ఐదేళ్ల కిందట చేసిన దరఖాస్తుల్ని ఇప్పటికీ పరిష్కరించకుండా, నీటి వసతి కోసం పెట్టిన దరఖాస్తును నేరుగా సీఎం కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని... మరోవైపు ప్లాంటు పెట్టలేదు కాబట్టి లీజు రద్దు చేశామనటాన్ని ఏమనుకోవాలి? ప్లాంటు రాలేదు కనుక కొనుగోలు చేసిన భూముల్ని రైతులకిచ్చేయాలని చేస్తున్న డిమాండ్లను ఏమనుకోవాలి? ఫిలిం సిటీ కోసం రామోజీరావు ఎకరాకు లక్షకు మించి ఎక్కడా వెచ్చించలేదు. మరిపుడు ఆయన భవనాలు నిర్మించిన ఐదారు ఎకరాల్ని వదిలేసి మిగిలిన 1900 పైచిలుకు ఎకరాలనూ తిరిగి రైతులకిచ్చేయాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయటం లేదు? తన హెరిటేజ్ సంస్థ కోసం కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు ఎందుకు అప్పగించటం లేదు? సిమెంట్ కంపెనీ కోసమని కొనుగోలు చేసి నిరుపయోగంగా వదిలిపెట్టిన టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి భూములపై ఎందుకు రాద్ధాంతం చేయటం లేదు?సరస్వతీ సిమెంట్స్ సమీపంలోనే సంఘీ సంస్థ సేకరించిన 2000 పైచిలుకు ఎకరాల్లో గానీ, గుజరాత్ అంబుజా, ఆంధ్రా సిమెంట్స్ సంస్థలు సేకరించిన భూముల్లో ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టలేదే! వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఎందుకు ధర్నాలు చేయించటం లేదు? లీజుల్ని ఎందుకు రద్దు చేయలేదు? మరీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒకవైపు రుణమాఫీ చేయనందుకు రైతులకు మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న బాబు... రైతులకు న్యాయం చేస్తామంటూ తమ వర్గానికి చెందిన కొందరిని జగన్‌మోహన్‌రెడ్డిపైకి రెచ్చగొడుతుండటాన్ని ఏమనుకోవాలి? కొనుగోలు చేసిందీ అధిక ధరకే... నిజానికి 2008. 2009లో సరస్వతీ సిమెంట్స్ రైతుల నుంచి భూములు కొన్నపుడు గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ధర ఎకరాకు రకాన్ని బట్టి రూ.1-3 లక్షల మధ్య ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సరస్వతీ సంస్థ ఎకరాకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.8.5 ల క్షలు చెల్లించింది. అందుకేఒక్క రైతు కూడా తనకు అన్యాయం జరిగిందనలేదు. ఇపుడు టీడీపీకి చెందిన వారిని రెచ్చగొట్టి ఆ భూముల్లో ఘర్షణలకు దిగుతూ... అడ్డుకున్న సరస్వతీ సంస్థ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ప్రభుత్వ పెద్దలే పెట్టిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు? -
‘అభయహస్తం’పై రాజకీయ క్రీనీడ
పలమనేరు: అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది. కమిటీ పరిధిలో లేని ఈ పథకంలోనూ రాజకీయం ప్రదర్శించారు. ఒక సంతకంతో అన్ని పింఛన్లనూ రద్దు చేసేశారు. జన్మభూమి గ్రామసభల్లో అధికారులను మహిళలు నిలదీస్తుండడంతో పొరపాటు జరిగిందని తిరిగి ఆ పింఛన్లు ఇస్తామంటూ మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం పలమనేరు పురపాలకసంఘ పరిధి లో 151 మందికి వైఎస్ఆర్ అభయహస్తం ద్వారా ప్రతినెలా రూ.500 పింఛన్ ఇచ్చేవారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు బీమా చేసుకుని, 60 ఏళ్లు నిండాక అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా గ్రూ పుల నిర్వహణలో సభ్యుల డబ్బుతో జరిగే కార్యక్రమం. ఇదేమీ పట్టించుకోని పింఛన్ల పరిశీలన కమిటీ సభ్యు లు మున్సిపాలిటీలోని అభయహస్తం లబ్ధిదారులందరినీ జాబితా నుంచి తొలగించేశారు. ఈ పథకం ద్వారా పలమనేరులో 151 మంది రూ. 3,650 ప్రీమియంగా చెల్లించారు. వీరి కి అప్పటి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసింది. దీంతో వీరు ప్రతి నెలా రూ.500 పింఛన్ తీసుకుంటున్నారు. ఇప్పుడేం జరిగిందంటే అభయహస్తం పింఛన్లపై అవగాహన లేని ఈ కమిటీ సభ్యులు ఏకపక్షంగా లబ్ధిదారులకు 65 ఏళ్లు నిండలేదనే సాకుతో జాబితా నుంచి తొలగించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. మండలాల్లో దాదాపు 9 వేల మంది అభయహస్తం పింఛన్దార్లలో ఏడు వేల మందిని తొలగించినట్టు సమాచారం. పొరపాటు జరిగిందంటున్న అధికారులు అభయహస్తం పింఛన్ల జోలికి వెళ్లొద్ద ని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించా రు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం లో ఎంపికైన వారంతా వైఎస్ఆర్సీపీ కి చెందిన వారని తొలగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలమనేరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్ను వివరణ కోరగా మాకు కూడా తెలియకుం డానే జాబితాలో అభయహస్తం పింఛన్లన్నీ తొలగించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఏ పీడీతో సంప్రదించామని తెలిపారు. వారందరికీ తిరిగి పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు. -
డ్వాక్రా రుణాలను రద్దు చేయండి
కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా మచిలీపట్నం : ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ విమర్శించారు. డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నమ్మిన డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో రుణాలను చెల్లించలేదన్నారు. పొదుపు సొమ్మును వడ్డీ కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వీవోఏల సమస్యలు పరిష్కరించండి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యాన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ) సంఘం ప్రతినిధులు, సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీవోఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమకు సెర్ఫ్ నుంచి 15 నెలల వేతన బకాయిలు రావాల్సి ఉందన్నారు. వెంటనే బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. రాజకీయ నాయకుల వేధింపులు, అక్రమ తొలగింపులు, బెదిరింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీవోఏల సంఘ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి బి.సౌజన్య, ఎన్డీ భవానీ, పలువురు వీవోఏలు పాల్గొన్నారు. -
మద్యం మానితే వారి పిల్లలకు నజరానా
మద్యపాన నిషేధంపై మహిళలకు అవగాహన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ మాకవరపాలెం : మద్యపాన నిషేధంపై డ్వాక్రా మహిళలతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఉన్న నాలుగు లక్షల కుటుంబాల్లో 65 శాతం మంది మగవారు మద్యం సేవిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని తెలిపారు. వీరిని మద్యం మాన్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 350 మందితో మద్యం మాన్పించామని, వచ్చే మూడేళ్లలో 10 వేల మందిని మద్యానికి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక్కో డ్వాక్రా సభ్యురాలి నుంచి ఏడాదికి రూ.10ల చొప్పున వసూలు చేసి జిల్లా సమాఖ్యలో ఉంచుతామని, ఇందులో మద్యం మానేసిన వారి పిల్లల పేరున రూ.10 వేలు జమ చేస్తామని వివరించారు. రూ.650 కోట్ల రుణాలు: జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా మహిళలకు రూ.650 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. గతేడాది రూ.380 కోట్లు లక్ష్యం కాగా రూ.443 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 44 వేల డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు రూ.100 కోట్లు స్త్రీ నిధి రుణాలు కూడా ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళల పిల్లలు 54 వేల మంది విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.1200ల చొప్పున రూ.5.66 కోట్ల స్కాలర్‌షిప్‌లుగా అందజేస్తున్నామని తెలిపారు. -
డ్వాక్రాలకు బాబు టోకరా
కానరాని రుణమాఫీ రూ.లక్ష సంఘనిధి పేరిట తాజా ఉత్తర్వులు కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులు వెనుకంజ ఆందోళనలో మహిళలు పాడేరు : ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష రుణమాఫీ లేదని, 2013-14 సంవత్సరానికి రుణాలు పొందిన సంఘాలకు మాత్రం రూ.లక్ష చొప్పున సంఘ నిధి పేరిట జమ చేస్తామని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో డ్వాక్రా మహిళల్లో మరింత ఆందోళన ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని వెంటనే కొత్తరుణాలు కూడా పంపిణీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. కానీ అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు డ్వాక్రా రుణాల రద్దుపై తాత్సారం చేస్తుండడంతో ఏజెన్సీ డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందే రుణమాఫీ ప్రచారం జరగడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను గత ఏడాది డిసెంబరు నుంచి చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయాయి. తాత్సారంతో గందరగోళం ఏజెన్సీలోని11 మండలాల పరిధిలో 9,900 డ్వాక్రా సంఘాలు ఉండగా 5,200 సంఘాలకు చెందిన మహిళలు రుణబాధితుల్లో ఉన్నారు. నాలుగేళ్ల నుంచి మొండి బకాయిలు రూ. 28 కోట్లు ఉండగా 2013-14 సంవత్సరానికి రూ.19 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.47 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. కానీ మొండి బకాయిలు రూ.28 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల రుణాలు పొందిన రూ.19 కోట్లకు సంబంధించి రుణమాఫీ చేయకపోగా సంఘ నిధి పేరిట వారి సంఘాలలో రూ. లక్ష జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ నిబంధనలతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడింది. అయితే ఐకేపీ అధికారులు సెర్ప్ సంస్థకు ఇటీవల ఒక నివేదికను సమర్పించారు. సంఘ నిధి పేరిట జమ చేసే రూ.లక్షను నాలుగేళ్ల నుంచి రుణాలు పొందిన మొత్తం 5,200 సంఘాలకు అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ నగదును రుణ బకాయిలకు జమ చేయవచ్చని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా సంఘాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టేసింది. కొత్త రుణాలకు బ్యాంకులు వెనుకంజ పాడేరు డివిజన్లో 800 కొత్త సంఘాలకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు ఐకేపీ ఏర్పాట్లు చేసినా అన్ని బ్యాంకుల అధికారులు ముందుకు రాకపోవడంతో మహిళలు రుణాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీపై ప్రభుత్వ తాత్సారం చేయడంతో ఈ కొత్త సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా అధికారులు వెనుకంజ వేస్తున్నారు. -
100 రోజులూ.. నిండా మోసమే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ‘ఓటు’ దాటాక తగలేసిన చంద్రబాబు.. పూటకో మాట.. రోజుకో విధానం తో ప్రజలను ఏమార్చుతున్నారు. వంద రో జులుగా ఇదే కథ. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలుచేయని చంద్రబాబు.. ఈనెల 4న జిల్లాపై వరాల వర్షం కురిపించడం గమనార్హం. చంద్రబాబు వంద రోజుల పాలనను ఒక్కసారి విశ్లేషిస్తే.. 2004, 2009 ఎన్నికల్లో ఓటమితో చిక్కిశల్యమైన టీడీపీని అధికారంలోకి తేవడం కోసం బాబు హామీల వర్షం కురిపించారు. అధికారమే లక్ష్యంగా అక్టోబరు 2, 2012న హిందూపురం నుంచి చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ హామీలపై హామీలు ఇచ్చేశారు. పంట రుణాల మాఫీ,డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలనెలా నిరుద్యోగులకు రూ.2 వేల భృతి, వృద్ధాప్య పెన్షన్ రూ.వెయ్యికి పెంపు, సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్లకు 24 గంటల విద్యుత్ సరఫరా వంటి హామీలు ప్రధానమైనవి. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలును విస్మరించారు. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడమే అందుకు తార్కాణం. టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టిన పంట, డ్వాక్రా రుణాల మాఫీని చంద్రబాబు నీరుగార్చారు. జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.11,180.25 కోట్లపే బకాయిపడ్డారు. 61,711 స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 6.45 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పంట రుణాలు, డ్వాక్రా రుణాల రూపంలో ఒక్క మన జిల్లాలోనే రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. ఇందుకు చంద్రబాబు షరతులు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ పదిన ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 31)ను జారీచేశారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తేల్చిచెబుతూ ఈనెల 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 164)ను జారీచేశారు. ఆ తర్వాత రుణ మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని.. సంఘానికి రూ.లక్ష ప్రోత్సాహం ఇస్తామని మాట మార్చారు. కానీ.. ఆ మేరకు కూడా రుణ మాఫీని వర్తింపజేయకపోవడం గమనార్హం. ఇంటికో ఉద్యోగం.. రూ.రెండు వేల నిరుద్యోగ భృతి హామీలపై అతీగతీ లేదు. సేద్యానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వగలమని తేల్చిచెప్పారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వంద రోజుల పాలనలో చంద్రబాబు అమలుచేయలేకపోయారు. పాత హామీలను పక్కన పెట్టి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగకుండా రోజుకో కొత్త హామీని ఇస్తూ చంద్రబాబు ఏమార్చేయత్నం చేస్తున్నారు. జూన్ 16న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఈనెల 4న శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) చైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. ఈనెల 4న చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వాటికే నిధుల్లేవంటూ.. పాత హామీల అమలుకే నిధుల్లేవని చెబుతోన్న చంద్రబాబు.. ఈ నెల 4న శాసనసభలో ఇచ్చిన హామీల అమలుకు నిధులెక్కడి నుంచి తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేయాలంటే కనీసం రూ.4,500 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. కుప్పంలో విమానాశ్రయం ఏ ర్పాటుకు కనిష్టంగా రూ.300 కోట్ల అవసరమని ఐఐఏ అధికారు లు స్పష్టీకరిస్తున్నారు. తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి కనీసం రూ.ఐదు వేల కోట్లు.. మెట్రో రైలుకు రూ.1,200 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాల అంచనా. తిరుపతి సమీపంలో ఐఐటీ ఏర్పాటుకు రూ.500 కోట్లు అవసరం. ఈ నిధులను కేంద్రం ఇస్తుంది. ఏర్పేడు మండలంలో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు రూ.450 కోట్లు అవసరం అవుతాయి. ఆ నిధులను కూడా కేంద్రమే మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఏర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్(ఎన్ఐఎమ్జెడ్) ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.వెయ్యి కోట్లకుపైగా వెచ్చించాల్సి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీల అమలుకు రూ.250 కోట్లు, హార్టికల్చర్ జోన్ ఏర్పాటుకు రూ.వంద కోట్లు, ఫుడ్ పార్క్‌కు రూ.వంద కోట్లు, తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి రూ.వంద కోట్లు అవసరం అవుతాయి. ఈ హామీల అమలుకు కనిష్టంగా రూ.13,500 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ నిధులను ఎక్కడి నుంచి తెస్తారన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై వంద రోజుల్లో చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. -
ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ‘మాయ’ చేశారు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఎన్నికల ముందు తెలుగు తమ్ముళ్లు డాబుసరిగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని సుమారు 900 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధంచేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయలేదు. పేదలకు అండగా ఉంటానని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ఆధార్ అనుసంధానం పేరుతో నిరుపేదలకు ఆసరాగా ఉన్న రేషన్‌కార్డులను తొలగిస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పటికే మొదలుపెట్టిన ఇళ్లకు బిల్లులు నిలిపివేశారు. బందరుపోర్టు నిర్మాణం.. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి.. ఇలా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆయన అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా అమలుకు నోచుకోలేదు. కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. దీంతో బాబు వంద రోజుల పాలనలో జిల్లాకు ఒరిగింది శూన్యమని ప్రజలు పెదవివిరుస్తున్నారు. రుణమాఫీ బూటకమే.. ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ముఖ్యకారణమైన రుణమాఫీ ప్రహసనంగా మారింది. ఎప్పటికి రుణాలు రద్దవుతాయో తెలియని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలో 6,29,086 మంది రైతులు రూ.9,137 కోట్ల మేర పంట రుణాలు బకాయి ఉన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించలేదు. కొంతకాలం రుణాలు రీషెడ్యూల్ చేస్తామని, అనంతరం రుణమాఫీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 1,89,587 మంది రైతులు రూ.2,352 కోట్ల వివిధ రుణాలు, 2,60,737 మంది రైతులు రూ.3,276 కోట్ల పంట రుణాలు, 45,914 మంది రైతులు రూ.650 కోట్ల షార్ట్‌టర్మ్ రుణాలు, 1,30,534 మంది రైతులు రూ.277 కోట్ల మధ్యంతర రుణాలు, 2,314 మంది రైతులు రూ.86కోట్ల ఇతర రుణాలు తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు చెందిన రైతులకు ఎంత మొత్తాన్ని రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితి. రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు, ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల మేర రుణమాఫీ జరుగుతుందని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉండగా, రూ.938 కోట్లుబకాయిలు ఉన్నాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు అందజేస్తామని చెబుతూ ఈ నగదు రివాల్వింగ్ ఫండ్‌గానే జమ అవుతుందని చెప్పటం గమనార్హం. ఖరీఫ్.. ఉఫ్.. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. ఎగువన సాగునీటి ప్రాజెక్టులు నిండినా ముందుచూపులేని ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులకు సాగునీటిని విడుదల చేయటంలో తీవ్ర జాప్యం చేసింది. కాలువ శివారున ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి తదితర మండలాల్లో సెప్టెంబరులోనూ నారుమడులు పోసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. సెప్టెంబరులో వరినాట్లు పూర్తిచేస్తే పంటచేతికి వచ్చే నాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడులు తగ్గుతాని, రెండో పంట వేసుకునేందుకు సమయం చాలదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. 2002, 2003, 2004 వరుసగా సాగునీటి కొరతను ఎదుర్కొన్నామని, మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆందోళనలో ఉన్నారు. నత్తనడకన డెల్టా ఆధునికీకరణ కృష్ణాడెల్టాకు సాగునీరు సరఫరా చేసేందుకు 150 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలకులు తవ్విన కాలువల ద్వారానే నేటికీ సాగునీరు సరఫరా జరుగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులను రూ.4,573 కోట్లతో ప్రారంభించారు. ఈ పనులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తే వరికోతలు పూర్తయిన తరువాత పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు ప్రారంభించాలి. రేషన్.. పరేషాన్.. జిల్లాలో 11,23,944 తెలుపురంగు రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు 31,37,710 మందికి ఆధార్ కార్డుల సీడింగ్ పూర్తిచేసి 5,36,102మందిని అనర్హులుగా గుర్తించారు. ఈనెలాఖరుకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరికొంతమందిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు ఆధార్ సీడింగ్ పేరుతో రేషన్‌లో కోత విధిస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్‌ను నామమాత్రంగా ఇస్తున్నారు. మూడు నెలల్లో పోర్టు పనయ్యేనా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బందరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే వందరోజుల పాలన పూర్తయ్యింది. ఈ వ్యవధిలో బందరు పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గతంలోనే జీవో నంబరు 11 ద్వారా నిర్ధారించారు. రెండువేల ఎకరాలైనా కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతుండగా, ఇంతవరకు ఆ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకపోవటం గమనించదగ్గ అంశం. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆరు నెలల వ్యవధిలో మూడు నెలలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో మూడు నెలల వ్యవధిలోలప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, సాగదీత ధోరణితో వ్యవహరిస్తుందా.. అన్నది వేచి చూడాల్సిందే. విల‘పింఛన్’లు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో ఒకటో తేదీన పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్టోబరు 2 నుంచి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వికలాంగులకు రూ.1,500కు పెంచుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, 80 శాతం కన్నా మించి వైకల్యం ఉంటేనే నెలకు రూ.1,500 పెన్షన్‌కు అర్హులని మెలిక పెట్టారు. దీంతో ఎంతమంది వికలాంగులకు రూ.1,500 ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పింఛనుదారులకు ఆధార్ సీడింగ్ పేరుతో కొన్ని పేర్లను తొలగిస్తున్నారు. అక్టోబరు నుంచి ఎంతమందికి పింఛన్లు నిలిచిపోతాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 3,32,836 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైంది..? జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 8,609 మంది విద్యార్థులకు రూ.2.13 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా 4,564 మంది విద్యార్థులకు రూ.11.34 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు 6,559 మందికి రూ.19.42 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 31,029 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో రూ.46.07 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా రూ.37.70 కోట్లు గత ఏడాది ఖర్చు చేశారు. ఈ ఏడాది స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల జరుగుతుందా, లేదా అన్న అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయానికి కరెంట్ షాక్ జిల్లావ్యాప్తంగా దాదాపు 70వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చినా అమలు జరగట్లేదు. 5 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా జరగట్లేదు. దీంతో అర్థరాత్రి, అపరాత్రి విద్యుత్ సరఫరా చేస్తుండటంతో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాలను విద్యుత్ మోటార్ల ద్వారా సాగు చేస్తూ రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇటీవల వరకు గృహ విద్యుత్‌తో పాటు వ్యవసాయానికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన పాలకులు ఈ హామీ నుంచి వ్యవసాయ విద్యుత్‌ను మినహాయించినట్లు ప్రకటించటం గమనార్హం. -
రుణమాఫీ ఎప్పుడు బాబూ
రుణమాఫీ కోరుతూ రోడ్డెక్కిన డ్వాక్రా మహిళలు - జిల్లాలో పలు చోట్ల తహసిల్దార్ కార్యాలయాల ముట్టడి - తక్షణం డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటూ ధర్నాలు కొవ్వూరు రూరల్ : ‘రుణాలు, వడ్డీలు చెల్లించకండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం మాఫీ చేస్తానంటూ.. మమ్మల్ని నమ్మించి మా ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు నట్టేట ముంచుతారా’ అంటూ డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. రేవును దాటి తెప్పను తలగేసిన చందంగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు పూటకో మాట చెబుతూ ఎంతకాలం మభ్యపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మహిళలు రోడ్డెక్కి దర్నాలకు దిగారు. కొవ్వూరు, చాగల్లు, లింగపాలెం, బుట్టాయగూడెం, వీరవాసరం తదితరచోట్ల తహసిల్దార్ కొవ్వూరు మండలంలో 16 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది డ్వాక్రా మహిళలు సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. షరతులు లేని డ్వాక్రా రుణమాఫీని అమలు చేయాలని, ఎన్నికల హామీని నిలబెట్టుకుని మహిళల బంగారు ఆభరణాలపై ఉన్న అప్పులను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. సీఐటీయూ కొవ్వూరు డివిజన్ కార్యదర్శి పడాల గంగాధరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రుణాలు రద్దు చేయకపోవడంతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన సొమ్ముల నుంచి బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. వాగ్ధానాలు ఇచ్చి నేడు డబ్బులు లేవంటూ తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబునాయుడిని మహిళంతా సంఘటితంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ముదునూరి నాగరాజు ధర్నాకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు దగ్గు రాధాకృష్ణ, దగ్గు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాగల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చాగల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డ్వాక్రా సంఘాల మొత్తం రుణాన్ని మాఫీ చేయాలని, షరతులు విధించవద్దని కోరుతూ నినాదాలు చేస్తూ వినతిపత్రాలు అందజేశారు. సీఐటీయూ నాయకులు కె.కనకదుర్గారావు, కౌలు రైతు సంఘం నాయకులు జుజ్జవరపు శ్రీనివాస్, కంకటాల బుద్ధుడు తదితరులు పాల్గొన్నారు. లింగపాలెంలో.. లింగపాలెం : డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ సోమవారం లింగపాలెం తహసిల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ, డ్వాక్రా మహిళల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగారు. డ్వాక్రా రుణాలను తక్షణమే షరతులు లేకుండా మాఫీ చేయాలని, బ్యాంక్‌ల ద్వారా కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్త్రీనిధిపై వడ్డీ వసూలును విరమించాలని, డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెట్ పరపతి సౌకర్యం కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్యామలారాణి, జిల్లా అన్నపూర్ణ, ఎం.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సారా విక్రయిస్తున్న వ్యాపారికి దేహశుద్ధి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అరకులో డ్వాక్రా మహిళలు మంగళవారం కదం తొక్కారు. పాఠశాల విద్యార్థులకు గంజాయి, సారా విక్రయిస్తున్న సారా వ్యాపారి కొండలరావు నివాసంపై దాడి చేశారు. అతడి నివాసంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం అతడి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 కేజీల గంజాయితోపాటు భారీగా సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సారా వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. దాంతో కొండలరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రుణమాఫీపై మాట తప్పుతారా..?
ఏపీ ప్రభుత్వంపై డ్వాక్రా మహిళల ఆగ్రహం గుత్తి/బుక్కపట్నం: షరతులు లేని రుణ మాఫీ కోసం డ్వాక్రా మహిళలు సోమవారం ‘అనంత’లో ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహా యక సంఘాల (డ్వాక్రా) మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును ముట్టడించారు. అనంతరం గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీ గా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. మహిళలు మాట్లాడుతూ రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదన్నారు. ఇప్పుడేమో బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలి మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. వీరిలో టీడీపీ వారు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. -
చంద్రబాబు వల్ల డ్వాక్రా వ్యవస్థ చిన్నాభిన్నం
కొత్త రుణాలు పుట్టక మహిళలకు తప్పని అవస్థలు ఐద్వా జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి నర్సీపట్నం టౌన్: సక్రమంగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి విమర్శించారు. అధికారం కోసం ఎన్నికల ముందు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేయడమే అన్నారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 14వ మహాసభ నిర్వహించారు. ఐద్వా జెండాను జిల్లా అధ్యక్షురాలు కె.వి.సూర్యప్రభ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబీధ్ సెంటర్ వరకు మహిళలు ఐద్వా జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలను మేలు కొలుపుతూ గీతాలు ఆలపించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత కారణంగా తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక డ్వాక్రా మహిళలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హమీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. మహిళలపై పెరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన చర్య లు తీసుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశా రు. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. వంట కార్మికులు, ఆశా వర్క ర్లు, అవుట్సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడానికి చూస్తున్నారన్నారు. బెల్టుషాపులు ఎత్తివేశామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రభావతి, గ్రేటర్ విశాఖ ప్రధాన కార్యదర్శి రమా, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.గౌరీ, జిల్లా నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు. -
బాబూ.. ‘డ్వాక్రా’ ఛిన్నాభిన్నం
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి గన్నవరం : గ్రామాల్లో సజావుగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి విమర్శించారు. కేవలం అధికారం కోసం ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు.. ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 18వ మహాసభల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. స్వరూపరాణి మాట్లాడుతూ...ప్రభుత్వ అసమర్థత కారణంగా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు రుణాలివ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దుచేయాలని కోరారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మహిళలపై హింస విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడనే రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో మహిళల సంరక్షణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో విధి విధానాలతో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నీ కుంటుపడుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, చికాగో చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీలు, ఆశా వర్కర్లు తదితర అవుట్ సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడం దారుణమన్నారు. బెల్టుషాపులు ఎత్తి వేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలపై హింసను నియంత్రించాలని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని తీర్మానాలు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె. సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీదేవి, పిన్నమనేని విజయ, ఉపాధ్యక్షురాలు వై. జోయ, జి. నాగమణి, మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలను చంపడం ఆటవిక చర్య
రుణమాఫీపై పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారు రూ.5 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గం పీలేరు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను చంపడం ఆటవిక చర్య అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీపై రాష్ట్ర మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన పీలేరులో పర్యటించారు. మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఓట్లకోసం అమలుకు వీలుకాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు విస్మరించి జీవోలతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపిం చారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.11 లక్షల కోట్లు ప్రవేశపెట్టి అందులో రుణమాఫీకి కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే దమ్ములేక ఆర్బీఐపై సాకులు చెప్పడం టీడీపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఎటువంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను టీడీపీ నాయకులు టార్గెట్ చేసి హత్యలకు పురమాయిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా రా ష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని తెలిపారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ములేక ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వ చ్చినపుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ మండలాధ్యక్షుడు నారే వెంకట్రమణారెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు కడప గిరిధర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యు డు ఎస్.హబీబ్‌బాషా, స్టాంప్‌ల మస్తాన్, పార్టీ నాయకులు కే.ఆనంద్, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట్రమణ, అల్లాబక్షు, గౌస్‌బాషా, రంగన్న, జయపాల్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, బాబ్జిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, నవాజ్, మునికృష్ణ, రాజేష్, హరిరాయల్, ఆనంద్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. -
బాబు హామీల పాపం..డ్వాక్రా సంఘాలకు శాపం
పలమనేరు: డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ బాబు ఇచ్చిన హామీ గ్రూపుల్లో మహిళల పాలిట శాపంలా మారింది. ఇన్నాళ్లు రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో తీసుకున్న అప్పులను గ్రూపులు బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో అసలు, వడ్డీ పెరిగి వీరికి మరింత భారంగా తయారైంది. నాలుగు నెలల వడ్డీ ఒక్కసారి కట్టాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకర్లు సైతం మొత్తం కంతులు కట్టాల్సిందేనంటూ గట్టిగానే చెబుతున్నారు. దీనికితోడు సంఘమిత్రలు గ్రూపు లీడర్లపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు. 4 నెలల వడ్డీ భారం రూ.25 కోట్లు చిత్తూరు జిల్లాలో 55,602 స్వయం సహాయక సంఘాలు రూ.1611.03 కోట్లు (మార్చి 31 నాటికి) బ్యాంకులకు బకాయిపడ్డాయి. మే నుంచి ఆగస్టు వరకు ఈ సంఘాలు బ్యాంకులకు కం తులు చెల్లించలేదు. 4నెలల వడ్డీతోపాటు అసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి సంబంధిత బ్యాంకులు 13.5 శాతం వడ్డీతో అంటే నూటికి రూ.1.27 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 5.7 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలలకు కలిపి సుమారు రూ.25 కోట్లకు పైగా గ్రూపులు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నె లకొంది. ఇక మహిళా గ్రూపులు ఔట్‌స్టాండింగ్‌గా సుమారు రూ.150 కోట్లు దాకా చెల్లించాల్సి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. మరోవైపు అసలు, వడ్డీ చెల్లించలేని గ్రూపులను నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ ద్వారా బ్లాక్ లిస్టులోకి చేర్చే కార్యక్రమం కూడా ఇప్పటికే జరిగిందని తెలుస్తోంది. జిల్లాలో 8 వేల సంఘాలు ఓవర్ డ్యూ కారణంగా కొత్త రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. వీరు ఇన్డేట్కు మొత్తం కంతులు చెల్లిస్తే గానీ వీరి ఖాతా రెగ్యులర్ అకౌంట్‌గా మారి ఫోర్స్‌లోకి రావు. అసలు, వడ్డీ కలిపి కట్టాల్సిందే.. రాష్ర్ట ప్రభుత్వం నుంచి డ్వాక్రా రుణాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, జీవో సంతృప్తి కరంగా లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు ప్ర భుత్వం అందిస్తున్న రూ.లక్ష రుణమాఫీనే కాదని, గ్రూపుల బలోపేతానికి ప్రోత్సాహకమేనని ఇండియ న్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. అసలు, వడ్డీ కలిపి కడితేగానీ ఖాతాలా వాదేవీలు ఫోర్స్‌లోకి రావంటూ గట్టిగానే చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్తరుణాలు పొందాలంటే కచ్చితంగా కంతులు చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. గ్రూపుల్లోని పొదుపు ఖాతాలపై బ్యాంకర్ల కన్ను రుణమాఫీ సంగతి పక్కనుంచి సంబంధిత గ్రూపుల్లో ని పొదుపు ఖాతాలకు మాత్రం పొదుపును జమ చే యాల్సిందేనని అటు ఐకేపీ, ఇటు మెప్మా అధికారు లు, బ్యాంకర్లు మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా రు. 60 శాతం సంఘాలు ప్రతినెలా సేవింగ్స్ ఖాతా లో పొదుపును జమ చేస్తూనే వస్తున్నాయి. ప్రతి గ్రూపునకూ నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకుల కు రూ.60 లక్షలకు పైగా జమ అవుతోంది. ఆ లెక్కన 4 నెలలుగా రూ.2.04 కోట్లు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. ఈ డబ్బును సైతం అప్పుల్లోకి జమ వేసుకోవడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు, వడ్డీ కట్టాలని సంఘమిత్రల హుకుం.. ఒక వైపు బ్యాంకర్లు ఒత్తిడి తెస్తుంటే మరో వైపు సంఘమిత్రలు అసలు, వడ్డీ మొత్తం కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే రూ.లక్ష వచ్చాక మిగిలిన అప్పు చెల్లిస్తామని గ్రూపు లీడర్లు చెబుతున్నా పట్టించుకోకుండా వేధిస్తున్నట్లు పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మొత్తం మీద చంద్రబాబు హామీ కారణంగా తాము అప్పుల పాలయ్యామని చాలా మంది మహిళలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. -
ప్రమాదంలో ‘డ్వాక్రా’..!
- రుణమాఫీ కాక, కొత్త అప్పు పుట్టక తిప్పలు ►బాబు హామీ నమ్మి రుణాలు చెల్లించని మహిళలు ►తీసుకున్న అప్పు కట్టితీరాలంటున్న బ్యాంకర్లు ►కొత్త రుణాల మంజూరులోనూ కోతలు.. చెరుకుపల్లి : డ్వాక్రా మహిళలను నిరాశ నిసృ్పహలు చుట్టుముడుతున్నాయి. నామమాత్రంగా రుణాలు మంజూరు చేయడం పట్ల నిర్వేదం చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పాత రుణాలను రద్దు చేయని పక్షంలో సంఘాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. ►కొత్త ప్రభుత్వం వచ్చిన తరవాత గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ►గతంలో ఒక్కో గ్రూపునకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించ గా ప్రస్తుతం రుణాలు మంజూరు చేయటం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►చెరుకుపల్లి మండలంలోని డ్వాక్రా గ్రూపు మహిళలు వివిధ బ్యాంక్‌ల్లో పొదుపు చేస్తున్నారు. గతంలో ఈ గ్రూపులన్నిటికీ కలిపి సుమారు రూ.50 కోట్లకు పైగా రుణాలను ఆయా బ్యాంక్‌లు అందించగా,ప్రస్తుతం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.10.5 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ►ఎన్నికలకు ముందు వడ్డీలేని డ్వాక్రా రుణాలను గ్రూపునకు రూ.10లక్షలకు వరకు అందజేస్తామని నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయంటున్నారు. ►గతంలో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ కొత్తరు ణాలు మంజూరు చేయకపోవటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ►ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడం తో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ►ఆయన మాటలు నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాల చెల్లింపును నిలిపివేసి మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నట్టు మహిళలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ► చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ‘ఇంటి కూటికి బంతికూటికి చెడ్డ’ చందంగా తయారైందని వాపోతున్నారు. ►పాత రుణాలు చెల్లించలేక, కొత్తరుణాలు పొందలేక సంఘాలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని,తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సంఘాలను బతికించాలని కోరుతున్నారు. -
మోసకారి బ్యాంక్‌మిత్ర అరెస్టు
పెరుగుతున్న బాధిత గ్రూపులు రూ.10నుంచి 12 లక్షలు స్వాహా నూజివీడు రూరల్ : డ్వాక్రా మహిళల సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసిన బ్యాంక్మిత్రను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పల్లెర్లమూడి పంచాయతీ శివారు రాట్నాలగూడెంకు చెందిన పోలుకొండ ఇందిరా అలియాస్ షేక్ మస్తాన్‌బీ ఐదేళ్లుగా పల్లెర్లమూడి సిండికేట్ బ్యాంక్‌లో బ్యాంక్‌మిత్రగా పనిచేస్తుంది. గ్రామంలోని 10 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తీసుకున్న రుణాల సొమ్మును బ్యాంక్‌లో జమ చేసేందుకు 2012 నుంచి డబ్బు వసూలు చేస్తుంది. అయితే డ్వాక్రా మహిళల నుంచి తీసుకున్న నగదును పూర్తిగా బ్యాంకులో జమచేయకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇందిరమ్మ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ అవసరాల నిమిత్తం తమ సంఘం లావాదేవీలను తెలపాలని 13వతేదీన బ్యాంకు అధికారులను కోరారు. దీంతో బ్యాంకు సిబ్బంది వారి లావాదేవీలను పరిశీలించి రూ.3.50లక్షలు రుణం చెల్లించాల్సి ఉందని తెలుపుతూ బ్యాంకు స్టేట్మెంట్లను అందించారు. దీంతో ఖంగుతిన్న సంఘం సభ్యులు తమ చెల్లింపు వివరాలను పరిశీలించుకున్నారు. 2012 జనవరిలో రూ.3.30 లక్షల రుణాన్ని పొంది నెలకు రూ.12,600 చొప్పున 23నెలలకుగానూ రూ.2,89,800 చెల్లించగా బ్యాంకు ఖాతాలో మాత్రం ఆ మొత్తం జమ కాలేదని సంఘం అధ్యక్షురాలు నత్తా అన్నామణి, సభ్యులు గుర్తించారు. బ్యాంకుమిత్ర తమను మోసం చేసిందని గమనించిన సంఘం సభ్యులు 16వతేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రూ. 1.85 లక్షలు బ్యాంక్‌మిత్ర కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన రూరల్ ఎస్ఐ శుక్రవారం ఆమెను అరెస్టు చేశారు. ఇందిరమ్మ స్వయం సహాయక సంఘంతో పాటు మరికొన్ని గ్రూపుల సభ్యులు సైతం ఫిర్యాదు చేశారని, అయితే విచారణ చేయాల్సి ఉందన్నారు. తీసుకున్న రుణంలో కొంతసొమ్ము మాఫీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి నుంచి డ్వాక్రా మహిళలు రుణాన్ని చెల్లించకపోయినప్పటికీ వాటితో కలిపి ఫిర్యాదు చేస్తున్నారని తమ విచారణలో గుర్తించామని చెప్పారు. గ్రామంలోని మిగిలిన సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకుమిత్ర సుమారు రూ.10 నుంచి 12లక్షల వరకు స్వాహాచేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
డ్వాక్రాకూ టోకరా...
బడ్జెట్లో స్పష్టత లేదు రూ.లక్ష మాఫీకి జీవో లేదు ఒత్తిడి పెంచుతున్న బ్యాంకర్లు ఆందోళనలో మహిళలు డ్వాక్రా, డ్వాక్వా మహిళలకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా అంకెల గారడీతో బడ్జెట్లో బాబు బురిడీ కొట్టించారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ రుణాలు రద్దవుతాయని రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్న మహిళల ఆశల్ని ఆవిరి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బకాయిల వసూళ్ల కోసం పొదుపు సంఘాలపై బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతున్నారు. విజయవాడ : స్వయం సహాయక సంఘాల మహిళల్ని సర్కార్ ఊరించి ఉసూరుమనిపించింది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీలతో పాటు విజయవాడ నగరంలో సుమారు రూ.250 కోట్ల రుణాలు రద్దు కావాల్సి ఉంది. రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో రుణాల వసూళ్లకు గ్రూపులపై ఒత్తిడి పెంచాలనే యోచనలో బ్యాంకర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల నేపథ్యంలో 80 శాతం గ్రూపులు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశాయి. పాత రుణాలు చెల్లించకుండా కొత్త అప్పులు ఇవ్వబోమని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో డ్వాక్రా గ్రూపుల వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. రుణాలు కట్టాల్సిందే... రుణమాఫీతో తమకు సంబంధం లేదని, రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు పొదుపు సంఘాల మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. నెలవారీ రుణాలు చెల్లించని సంఘాల నుంచి పొదుపు సొమ్మును మినహాయించుకుంటున్నారు. పొదుపు మొత్తాలు జమ వేసినా ఇంకా బకాయిలు చెల్లించాల్సిన దుస్థితి మహిళల్ని వెంటాడుతోంది. డ్వాక్రా గ్రూపు మహిళలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత రుణం చెల్లిస్తే అంతే మొత్తంలో కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తాజాగా ఆఫర్లు ఇస్తున్నారు. కానరాని జీవో... స్వయం సహాయక మహిళలకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని నెల రోజుల క్రితం సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి జీవో విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. జీవో వస్తే కానీ రుణాల వివరాలతో కూడిన లబ్ధిదారుల జాబితాను తయారు చేయలేమని వారు పేర్కొంటున్నారు. జిల్లాలో రూ.87 కోట్లు జిల్లాలో 2,781 డ్వాక్రా సంఘాల్లోని 27,810 మంది సభ్యులకు 2013-14 సంవత్సరానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు. మచిలీపట్నంలో రూ.29 కోట్లు, గుడివాడలో రూ.24 కోట్లు, పెడనలో రూ.5కోట్లు, నూజివీడులో రూ.9 కోట్లు, జగ్గయ్యపేటలో రూ.8కోట్లు, నందిగామలో రూ.3కోట్లు, ఉయ్యూరులో రూ.5.5కోట్లు, తిరువూరులో రూ.3.5 కోట్లు చొప్పున రుణాలందించారు. రుణమాఫీ ఆశతో 70 శాతం గ్రూపులు తీసుకున్న రుణాలు చెల్లించలేదు. దీంతో కొత్త రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. పొదుపు సొమ్ము నుంచి బ్యాంకర్లు నగదు మినహాయించుకోవడంతో మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.. రుణమాఫీ కోసం నిత్యం మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. కొందరు మహిళలు డ్వాక్రా సంఘాలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. రుణాలు మాఫీ చేయాల్సిందే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. రుణం మొత్తం మాఫీ చేయకుంటే మహిళలను మోసం చేసినట్లే. - పి.సామ్రాజ్యం, బందరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి. - లక్ష్మీనాంచారమ్మ, బందరు మహిళలను మోసం చేస్తారా ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలే మాఫీ చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నమ్మి రుణాలు చెల్లించటం నిలిపివేశాం. దీంతో మహిళల ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. - పోలగాని లక్ష్మి, బందరు -
నమ్మించి గొంతుకోశారు..
డ్వాక్రాకు రుణమాఫీ లేదన్న బ్యాంకు అధికారి మండిపడ్డ మహిళలు కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ వర్తించదని ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజరు రవికుమార్ స్పష్టం చేయడంతో వారంతా అవాక్కయ్యారు. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచ్చి మండుటెండలో ఎదురు చూస్తే చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. గుడ్లవల్లేరు : ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే బ్యాంకు ప్రాంగణంలో రుణమాఫీపై బుధవారం విజయవాడ జోనల్ చీఫ్ మేనేజర్ పి.వి.రవికుమార్ రైతులు, డ్వాక్రా మహిళలకు స్థానిక బ్రాంచి మేనేజరు కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సులో రవికుమార్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వర్తించదని, ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ కింద కేటాయిస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ విషయమై ప్రభుత్వం మరిన్ని విధివిధానాల్ని త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. పంట రుణమాఫీకి షరతులు వర్తిస్తాయ్... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను జీవో నంబరు 174 ప్రకారం నిర్వర్తించనున్నట్లు రవికుమార్ తెలియజేశారు. రైతులు బ్యాంకులో 2013 డిసెంబరు 31వ తేదీ నాటికి తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలతో పాటు గతంలో దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన పంట రుణాలు, వ్యవసాయ నిమిత్తం బంగారంపై తీసుకున్న పంట రుణాల మొత్తానికి మాఫీ వర్తిస్తుందన్నారు. ఈ రుణాలు 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన మొత్తానికి నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల పరిమితి వరకూ మాత్రమే రుణమాఫీ వర్తించనున్నట్లు పేర్కొన్నారు. 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన రుణాల్ని రైతులు ఆ తేదీ తర్వాత చెల్లించిన వాటికి కూడా నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందన్నారు. చంద్రబాబు మోసం చేశాడంటూ మహిళల ఆరోపణ... చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తారని పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచాచమని అయితే అధికారులు చెప్పిన మాటలను బట్టి తమను చంద్రబాబు మోసం చేశారని అర్థమైందని వాపోయారు. తమ పద్ధతిలో తాము పొదుపు చేసుకుంటూ రుణాల్ని సవ్యంగా చెల్లిస్తున్న సమయంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ వలన రుణాల చెల్లింపే గాక పొదుపు చేయడం మానేశామన్నారు. ఓట్లు వేయించుకున్న బాబు తమకు బాగానే బుద్ధి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. గ్రామ సర్పంచులు పామర్తి హనుమంతరావు, పడమటి సుజాత, భూషణం, రైతులు జగన్మోహనరావు, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రుణమాఫీ అంటూ రైతులకు నోటీసులా? రుణమాఫీ చేస్తామన్న బాబు బ్యాంకర్లతో రైతులకు నోటీసులు ఇప్పించడం అన్యాయమని రైతులు బాడిగ భాస్కరరావు, చిన పాములు అన్నారు. రుణమాఫీ చేయాలంటే ఒక్క మహానేత వైఎస్‌కే సాధ్యమైందన్నారు. అర్ధం లేని నిబంధనల పేరిట రుణమాఫీలోనూ బాబు రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కౌలుదారులకు రుణమాఫీ వర్తించదా? రుణమాఫీ కౌలుదారులకు ఎందుకు వర్తింపజేయరని వెణుతురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంటి కౌలుదారులే ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అలాంటి వారికి రుణమాఫీ లేకుండా సాగు చేయనివారికి రుణమాఫీ చేయటం అన్యాయమని తెలిపారు. -
‘ఆధార్’ బాదరా
నెలాఖరులోపు సీడింగ్ పూర్తిచేయాలని ఆదేశం లబ్ధిదారులకు, అధికారులకు తప్పని హైరానా అల్పాదాయ వర్గాల వారికి జిరాక్స్ ప్రతుల భారం నెలాఖరులోపు రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయకుంటే వచ్చే నెల నుంచినిత్యావసర సరుకుల సరఫనా నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆధార్ కార్డు ఒక్క రేషన్ సరుకులకే పరిమితం కాకుండా అన్ని పథకాలకు విస్తరింపజేయడంతో జిరాక్స్ ప్రతుల తీయించేందుకే జిల్లాలో లబ్ధిదారులకు రూ.కోట్లలో చేతిచమురు వదులుతోంది! నర్సీపట్నం రూరల్ : పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొంతమంది చేతుల్లో కి వెళుతున్నాయని ప్రభుత్వాల భావన. దీన్ని అధిగమించేందుకు ఆధార్ కార్డులను గత ప్ర భుత్వం తెరపైకి తెచ్చింది. అప్పట్లో కొన్ని మో డల్ జిల్లాలను గుర్తించి పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు చేయించి, రేషన్, గ్యాస్ పథకాలకు అ నుసంధానం చేశారు. ఈ ప్రక్రియ వల్ల లబ్ధిదారులకు కొత్త ఇబ్బందులు తలెత్తడంతో దీన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ ప్రక్రియపై ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం సభ్యులు సైతం ఆధార్ అనుసంధానం వల్ల పే ద లబ్ధిదారులకు నష్టం వస్తుందంటూ ఆందోళ న చేశారు. దీనికి భిన్నంగా అధికారంలోకి వచ్చి న వెంటనే నాయకులు, మంత్రులు అన్ని పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలంటూ ఆ దేశాలు జారీచేశారు. జిల్లాలో సుమారు 45 లక్ష ల వరకు జనాభా ఉన్నారు. వీరందరికీ రెండేళ్ల నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోం ది. అయినా ఇప్పటికీ పూర్తికాలేదు. ఇటీవల కాలంలో రేషన్ సరుకుల బట్వాడా, పింఛన్ల పంపిణీ, ఉపాధి హమీ పనులు, అంగన్వాడీ వ ర్కర్లకు, హాస్టల్ విద్యార్థులకు, గ్యాస్, ఫీజు రీ యింబర్స్‌మెంట్, విద్యుత్, డ్వాక్రా సంఘాల తో పాటు ఇతర అన్ని పథకాలకు ఆధార్‌ను వెం టనే అనుసంధానం చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా కిం దిస్థాయి అధికారులు ప్రతి పథకం లబ్ధిదారుడు ఆధార్ జిరాక్స్ ప్రతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైతే రెవెన్యూ అధికారులు సైతం లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లాలంటూ ఇప్పటికే కలెక్టరు ఆదేశాలు జారీచేసి పనులను వేగవం తం చేశారు. ఆధార్ జిరాక్స్ ప్రతుల పేరుతో ప్రతి కుటుంబంపై అదనపు భారం పడుతోం ది. వివిధ పథకాలకు ఒక్కో కుటుంబానికి 15 వరకు ఆధార్ జిరాక్స్ ప్రతులు అవసరమవుతున్నాయి. ఒక్కో జిరాక్స్ రూ. 2 చొప్పున లెక్కిస్తే 15 ప్రతులకు రూ. 30 వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇలా జిల్లాలో ఉన్న సుమారుగా 13 లక్షల కుటుంబాలకు సుమారుగా రూ. 3.9 కోట్ల మేర ఖర్చవుతోంది. ఇది కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ వ్యయం మరింత ఎక్కువే ఉంటుందని అధికారులు అంటున్నారు. లక్షల్లో లబ్ధిదారులున్న ప్రభుత్వ పథకాలకు ఆధార్ నమోదు పుణ్యమాని చేతిచమురు వదులుతోందని పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అల్పాదాయ వర్గాల వారికి హైరానాకు తోడు ఆధార్ వల్ల ఆర్థిక భారం తప్పడం లేదు. 50 వేల జనాభాకు ఒక్కటే కేంద్రం కొయ్యూరు: 50 వేలకు పైగా జనాభా ఉన్న కొయ్యూరు మండలంలో ఒక్కటంటే ఒక్కటే ఆధార్ కేంద్రం ఉండడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదు. దీంతో మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు మండల కేంద్రానికి వచ్చిన రెండు మూడురోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఈనెల చివర వరకే గడువు ఇవ్వడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్ లేకపోవడంతో రాజేంద్రపాలెంలో జనరేటర్ సాయంతో ఆధార్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రేషన్ కార్దులకు సంబంధించి ఇప్పటి వరకు 25 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయిందని తహశీల్దారు ఉమామహేశ్వరరావు తెలిపారు. మరో కేంద్రం కావాలని ఇది వరకే ప్రతిపాదించామన్నారు. ఉపాధి హామీ సిబ్బంది చాలావరకు ఆధార్‌ను పూర్తి చేయడంతో వారి నుంచి ఆ వివరాలు తీసుకుని రేషన్ కార్డులపై సీడింగ్ చేస్తామన్నారు. సకుటుంబంగా అవస్థలు మాకవరపాలెం : ఆధార్ కార్డుల కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ కేంద్రాల్లో ఎప్పుడు నమోదు పూర్తవుతుందో తెలియక భోజనాలను సైతం వెంట తీసుకువస్తున్నారు. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రాజు తన భార్యాపిల్లలతో బుధవారం మాకవరపాలెంలోని ఆధార్ కేంద్రానికి వచ్చాడు. ఆధార్ నమోదుకు ఎంత సమయం పడుతుందోనని భోజనం తెచ్చుకుని తహశీల్దార్ కార్యాలయం కుటుంబ సభ్యులంతా తిన్నారు. నర్సీపట్నంలో ఉన్న కేంద్రంలో ఖాళీ లేకపోవడంతో ఇక్కడకు వచ్చామని వారు తెలిపారు. -
పొదుపును నిర్వీర్యం చేశారు : సారథి
నందిగామ : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీని అమలు చేయకపోవడంతో పొదుపు వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మాట తప్పిన ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటతప్పడంతో మహిళలు కొత్త రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు రూ.200 కోట్ల రుణాలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. టీడీపీ ఎన్నికల హామీ మేరకు వ్యవసాయ అనుబంధ రుణాలన్నీ రద్దు చేయాలని సారథి డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో కార్యాలయ ఇన్చార్జి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎన్.శివనాగేశ్వరరావు, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
రుణమాఫీ జాప్యాన్ని సహించం
కడప సెవెన్‌రోడ్స్: రైతులు, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని, సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామని ప్రజల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీకి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రైతులకు రూ. 1.50 లక్షలు, డ్వాక్రాసంఘాలకు రూ. లక్ష మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, జీఓ నెం. 174 ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఒక్క బ్యాంకులో కూడా ఇంతవరకు రుణాలు మాఫీ కాలేదన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసి రుణాలు ఇప్పించాలని కోరారు. మాఫీ వర్తించని కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. డ్వాక్రాసంఘాలపై ఒత్తిడి చేస్తే బ్యాంకుల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు. డ్వాక్రా సంఘాలు కోరకుండానే మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష రివాల్వింగ్ ఫండ్‌గా ఇస్తామనడం సమంజసం కాదన్నారు. ఎన్నికల హామీ మేరకు మాఫీ చేయాలన్నారు. ప్రతి జిల్లా అభివృద్ధికి ఎన్నో వరాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కడప పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామంటేనే రైతులు నమ్మి టీడీపీకి ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగా లేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఓవైపు రుణాలు చెల్లించాలంటూ రైతులపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 884 అడుగులకు నీటిమట్టం చేరినప్పటికీ జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం రాష్ట్రానికి 11 జాతీయ సంస్థలను మంజూరుచేసినా జిల్లాకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర, నాయకులు కేసీ బాదుల్లా, టి.రామసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, జి.వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి, డబ్ల్యు రాము, బోగాది శెట్టి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
కుప్పం: ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిగా డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారం కోసం హామీ ఇచ్చి ప్రస్తుతం సీఎం కుర్చీ అందగానే మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. బ్యాంకులకు వేలకు వేలు వడ్డీలు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొన్న వానగుట్టపల్లి, నిన్న శెట్టిపల్లివాసులు ఆందోళనలు చేపట్టగా శనివారం కుప్పం పట్టణం పాతపేటలో డ్వాక్రా సంఘాల వుహిళలు జాతీయు రహదారిపై బైఠాయించారు. వారు వూట్లాడుతూ తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రతినెలా చెల్లిస్తూ వచ్చావున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో ఆపేశామని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి కేవలం రూ.లక్ష వూత్రమే వూఫీ చేస్తావుని చెబితే మిగతా అప్పులకు తాము వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. కొన్ని బ్యాంకుల్లో వీవో లీడర్లను సంప్రదించకుండానే బ్యాంకర్లు పొదుపు ఖాతాల్లోంచి నగదును రుణాలకు జవు చేసుకుంటున్నారని, ఇది భావ్యం కాదని అన్నారు. కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు మొత్తం వూఫీ చేయూల్సిందే ఎన్నికల సవుయుంలో ప్రకటించిన విధంగా డ్వాక్రా రుణాలు పూర్తిగా వూఫీ చేయూల్సిందే. ఐదు నెలలకు సంబంధించి అసలు, వడ్డీ ఒకేసారి కట్టవుంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. వుహిళలు పొదుపు కడితే ఆ డబ్బును కూడా అప్పులకు జవు చేసుకోవడం దారుణం. రుణాలు తోసేస్తావుని చెప్పి మాట మార్చడం సరికాదు. -వుహేశ్వరి, డ్వాక్రా వుహిళ, కుప్పం రుణాలడిగితే తిప్పికొట్టవున్నారు.. వుహిళల రుణాలన్నీ వూఫీ చేస్తావున్నారు. ఎవరైనా రుణాలు కట్టవుని అడిగితే తిప్పికొట్టవున్నారు. పేపర్లలో కూడా ఈ విషయుం వచ్చింది. ఇప్పుడేమో కేవలం రూ.లక్ష వూఫీ అంటున్నారు. కూలి పనులు చేసుకునే వుహిళలు ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు కట్టాలి. ఈ వడ్డీలకు బయుట కూడా రుణాలు తీసుకోవచ్చు. ఇకపై పొదుపు కూడా కట్టేది లేదు. -నిర్మల, డ్వాక్రా వుహిళ, కుప్పం వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలి వడ్డీలేని రుణాలు ఇచ్చి ఇప్పుడేమో ఐదు నెలలకు కలిపి వడ్డీ, అసలు కట్టవుంటున్నారు. ఇది చాలా దారుణం. వేలకు వేలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది. వూ పొదుపుల్లో ఉన్న డబ్బును కూడా అప్పుకు జవు చేసుకుంటున్నారు. డ్వాక్రా వుహిళలకు ఇదివరకు చెప్పిన విధంగానే రుణాలు మొత్తం వూఫీ చేసి తీరాలి. -కృష్ణవేణి, డ్వాక్రా వుహిళ, కుప్పం -
బాబూ.. ఇదేనా ప్రేమ..!
సాక్షి, ఏలూరు: ‘మీరు ఆలోచించారు. ఓట్లు వేసి టీడీపీని గెలిపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు దక్కించుకోవడానికి ప్రధాన కారకులు మీరే. మహిళలూ.. మీ రుణం తీర్చుకోలేనిది. మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా. మీరంతా ఆర్థిక స్వావలంబన సాధిం చేలా చేయూతనిస్తా’ అంటూ కొయ్యలగూడెంలో గతనెలలో నిర్వహించిన మహిళల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిపై అమిత ప్రేమ కురిపించారు. తాను అధికారంలోకి రావడానికి కారకులైన ఈ జిల్లా ఆడపడుచులపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని ముఖ్యమంత్రి ఆరోజు చెబుతుంటే నిజమనుకున్నమహిళలు ప్రభుత్వ తాజా చర్యల్ని చూసి ఘొల్లుమంటున్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒకరు చొప్పున మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉంటారు. వీరిలో కొందరు జిల్లాస్థాయి అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరిస్తుంటారు. ఈ విధంగా జిల్లాలో 46 మండలాలకు 46 మంది మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు. నాలుగేళ్లుగా వీరంతా ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక సంఘాలకు చేరవేస్తున్నారు. ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు సమాఖ్యల తరఫున రూ.62 లక్షలను రాజధాని నిర్మాణానికి విరాళంగా మహిళా సంఘాల ప్రతినిధులు అందజేశారు. అయితే వీరిని తొలగించాలని ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇది తెలిసిన మహిళలు మాపై ప్రేమ చూపించడమంటే ఇదేనా బాబూ? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విధి నిర్వహణలో ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని మహిళలకు సేవచేసేందుకే పనిచేస్తున్నామంటున్నారు. వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నా, వృత్తి పరంగా ఎవరు అధికారంలో ఉంటే వారికే అనుకూలంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని, తమను తొలగించడం అన్యాయమని వేడుకుంటున్నారు. 2015 వరకు తాము అధ్యక్షులుగా కొనసాగేందుకు మండల, గ్రామ సమాఖ్యల్లో తీర్మానం చేశామని, అంతవరకు రద్దు యోచనను విరమించుకోవాలని సీఎంను కోరుతున్నారు. కాదని రద్దుచేస్తే న్యాయం కోసం పోరాటం చేయడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదంటున్నారు. తొలగిస్తే పోరాటమే ఎన్నో కష్టాలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నాం. అధికారులు కూడా మాకు అన్యాయం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆర్థికంగానూ ఆసరా అవుతున్నాం. అయినా మమ్మల్ని ఏడాది ముందే తొలగించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పోరాటం చేస్తాం. - కె.ధనలక్ష్మి, పశ్చిమగోదావరి జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఎన్నో అవమానాలు మహిళా సమాఖ్యలు ఇటీవల కాలంలో ఎన్నో అవమానాలకు గురవుతున్నాయి. ఈ సమాఖ్య వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని అనడం భావ్యం కాదు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహాయపడతాం కాని పార్టీలను చూసి పనిచేయం. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని కోరుతున్నాం. - బలే మరియమ్మ, ఉండి మండల సమాఖ్య అధ్యక్షురాలు న్యాయం చేయాలి మహిళను లక్షాధికారులు చేస్తామంటున్న చంద్రబాబు నాయుడు సమాఖ్యలను రద్దు చేయడం అన్యాయం. సీఎం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి. మావల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాం. ఆరోపణలు ఉన్న వారిని తొలగిస్తే అభ్యంతరం లేదు. కానీ అందరినీ తీసేయడం భావ్యం కాదు. - కారే పార్వతి, పశ్చిమగోదావరి జిల్లా సమాఖ్య కోశాధికారి -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
దేవరపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. దేవరపల్లి స్టేట్ బ్యాంకు ద్వారా డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాల మంజూరు పత్రాలను బుధవారం ఆయన మహిళలకు అందజేశారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బ్రాంచి చీఫ్ మేనేజర్ బి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 2019 నాటికి జిల్లాలోని ప్రతి డ్వాక్రా సంఘం కనీసం రూ.10 లక్షలు రుణం తీసుకోవాలని, దీనిద్వారా ప్రతి సంఘం రూ.లక్ష ఆదాయం పొందాలన్నారు. జిల్లాలోని ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వనున్నట్టు కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్రాంచిని జిల్లాలోని ఇతర బ్యాంకులు నాందిగా తీసుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,100 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రతి సంఘానికి రూ.లక్ష పొదుపు ఖాతాలో జమచేస్తుందన్నారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కె.సుధారాణి. సర్పంచ్ సుంకర యామినినిసన్మానించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హేనా నళిని, చీఫ్ మేనేజర్ బి.వంకరరావు, ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, తహసిల్దార్ ఎండీ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
పచ్చిమోసం!
రుణమాఫీ...రీషెడ్యూల్...ఒట్టిమాటలే అని తేలిన వైనం కొత్త రుణం కావాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిందే జిల్లాలో వ్యవసాయ రుణాలే రూ.5810.84కోట్లు మండిపడుతున్న రైతులు సాక్షి, చిత్తూరు: ‘‘అంతన్నాడింతన్నాడే...గంగరాజు...ముంతమామిడి పప్పన్నాడే గంగరాజు’’ అన్నట్లు...అంతా అనుకున్నదే జరిగింది. సీఎం కుర్చీ ఇవ్వండి...రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసి మీ జీవితాలను ఆనందమయం చేస్తామని ఆచరణసాధ్యం కానీ హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు...ఇప్పుడు ఉసూరుమనిపించారు. రుణమాఫీ నుంచి రీషెడ్యూల్ వరకూ రైతులకు అర్థం కాని మాటలను వల్లెవేసి, వారిని అయోమయానికి గురిచేసిన చంద్రబాబు చివరగా చేతులెత్తేశారు. రుణమాఫీ నుంచి బకాయిలు చెల్లించేదాకా: రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు రైతులను తప్పుదోవ పట్టిం చేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిం చింది. అధికారంలోకి రాగానే రైతుల్ని రుణవిముక్తుల్ని చేస్తామని బీరాలు పలికారు. అధికారపీఠం దక్కిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బం దులున్నాయి... అయినా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. అందుకు ఎర్రచందనాన్ని కూడా విక్రయించి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామన్నారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రుణమాఫీ అమలుపై వారికి సందేహం మొదలైంది. ఆపై రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని రైతులకు 1.5లక్షలు, బంగారంపై 50వేలు, డ్వాక్రా సంఘాల్లో ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా కుటుంబానికి ఏదేని ఒక రుణం మాత్రమేనని లింకు పెట్టారు. దీంతో రైతులు మోసపోతున్నామని గ్రహించారు. ఆపై ఇప్పట్లో సాధ్యం కాదని, రీషెడ్యూల్ చేసేలా చూస్తామని చెప్పారు. రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదని రీషెడ్యూల్‌తో సర్దుకుందామని రైతులకు తెలుగుతమ్ముళ్లు ఉద్బోధ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రీషెడ్యూల్ కూడా కుదరదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని మండలాలకు మాత్రమే రీషెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొంది. చిత్తూరు జిల్లాలో 33 కరువు మండలాలు ఉన్నప్పటికీ రీషెడ్యూల్కు తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కొత్త రుణాలు కావాలంటే పాత బకాయిలు చెల్లించాలని, భవిష్యత్తులో తిరిగి రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. దీంతో రైతులంతా మోసపోయామని గ్రహించారు. రుణమాఫీకి ఎలాగూ దిక్కులేదు... కనీసం రీషెడ్యూల్ చేయించే స్తోమత కూడా లేనప్పుడు హామీ ఎందుకిచ్చారని మండిపడుతున్నారు. జిల్లాలో బకాయిల పరిస్థితి ఇదీ.. 2014 మార్చి ఆఖరుకు రాష్ట్రంలో 87,612కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో 5,810.84 కోట్ల రూపాయల పంటరుణాలను 7,55,270 మంది రైతులు తీసుకున్నారు. అలాగే పట్టాదారు పాసుపుస్తకంపై బంగారునగలు తాకట్టుపెట్టి 3,486.50 కోట్ల రూపాయలను 68,671మంది తీసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్ప కాలిక (టర్ము) రుణాల కింద 45,780 మంది రైతులకు రూ.1129.75 కోట్లు ఇచ్చారు. అలాగే వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రూ.753.16 కోట్లు రుణాలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్క రుణాన్నీ మాఫీ చేసే పరిస్థితి లేదు. అన్ని బకాయిలు చెల్లించి, కొత్త రుణాలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే వడ్డీబాదుడూ తప్పదు.. ప్రస్తుతం పంటరుణాల బకాయిలు చెల్లిస్తే 4శాతం వడ్డీని వసూలు చేస్తారు. కాస్త ఆలస్యమైతే 11 శాతం అదనపు వడ్డీని చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ ప్రకటనలతో రైతులంతా బోరుమంటున్నారు. ఏదో జీవితాలు బాగు చేస్తామంటే ఆశపడి ఓటేసి చంద్రబాబును సీఎంను చేస్తే రుణమాఫీ... 1.5 లక్షలు... రీషెడ్యూలు అన్నీ పోయి... ఎవరి బకాయిలు వారు చెల్లించే పరిస్థితి వచ్చిందేంటని వేదనపడుతున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు రీషెడ్యూలుకు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేనివారికి కొత్త రుణాలు ఇస్తాం. రైతులు పాత బకాయిలు చెల్లిస్తే వారికీ కొత్త రుణాలు ఇస్తాం. -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్. -
'డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు'
శ్రీకాకుళం: డ్వాక్రా మహిళలను మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేయడానికి సిద్దమవుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. రుణాల మాఫీపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇసుక అమ్మకాలు, సోలార్ ప్రాజెక్టులంటూ డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో ఇసుక అమ్మకాలను టీడీపీ కార్యకర్తలకు అప్పగించాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ అని తమ్మినేని సీతారాం విమర్శించారు. -
బూటకపు హామీలతో మోసపోయాం
కురబలకోట: చంద్రబాబు బూటకపు హా మీలతో మోసపోయామని మండలంలోని వివిధ గ్రామాల వీవోల లీడర్లు నిరసన గళం విన్పించారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయాలని, అంతవరకు ఎత్తిన చేతు లు దించేది లేదన్నారు. శనివారం వారు మొలకవారిపల్లెలో వీవో(గ్రామ సమైఖ్య) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డ్వాక్రా లీడర్లు కాదర్బీ, భూలక్ష్మి, మహబూబ్‌బీ, రెడ్డెమ్మ తదితరులు మాట్లాడు తూ చంద్రబాబు రుణమాఫీ ఒట్టి బూటకమన్నారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రుణాలు మాఫీ సాధ్యమేనన్నారు. ఇప్పుడు గ్రూపుకు లక్ష మాత్ర మే మాఫీ చేస్తానని మాట మార్చడం తగదన్నారు. రైతుల, డ్వాక్రా రుణమాఫీకి గతి లేకున్నా సింగ పూర్ తరహా రాజధాని కట్టిస్తాననడం ప్రజల్ని మభ్య పెట్టడమేనన్నారు. మంత్రులు కూడా తానా.. అంటే తం దానా అంటున్నారని ధ్వజమెత్తారు. కాగా మండలంలో 882 డ్వాక్రా గ్రూపులు ఉన్నా యి. వీటిలో 540 గ్రూపులు బ్యాంకు రుణా లు తీసుకున్నాయి. ఈ రుణాలు రూ. 21 కోట్లు దాకా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన రూ.లక్ష మేరకైతే రూ.5 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయి. చంద్రబాబు నట్టేట ముంచారని మహిళలు వాపోయారు. -
మాఫీ కోరుతూ మహిళల పోరు
డ్వాక్రా రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు. వారంతా రేలంగి గ్రామం నుంచి పాదయూత్రగా ఎమ్మెల్యే స్వగ్రామం వేల్పూరుకు చేరుకున్నారు.ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థారుులో మాఫీని వర్తింప చేయూలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం, ఒక్క పైసా చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు.ఎండలో సుమారు గంటన్నరపాటు మహిళలంతా ఎమ్మెల్యే ఇంటిముందు బైఠారుుంచారు. - ఇరగవరం/తణుకు రూరల్ -
కదం తొక్కిన మహిళలు
సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక సీఎం చంద్రబాబు తమనుమోసగించారని ధ్వజం వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇల్లు ముట్టడి దువ్వలో ఎంపీపీ అనంతలక్ష్మి ఘెరావ్ ఇరగవరం/తణుకు రూరల్ : రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళలు కదం తొక్కారు. పూటకో మాట చెబుతున్న సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలను తక్షణమే పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని ముట్టడించారు. రేలంగి నుంచి పాదయూత్రగా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చేరుకున్నారు. వేల్పూరులో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తక్షణమే రుణాల్ని మాఫీ చేయూలని, ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో మాఫీని వర్తింపచేయూలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని, ఒక్క పైసా కూడా చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి రుణమాఫీని రూ.లక్షకు కుదిస్తామనడం సరికాదని, దీనిపై స్పష్టత ఇవ్వకుండా కాలయూపన చేస్తున్న ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మహిళల్ని నమ్మించి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ విషయంపై స్పష్టత ఇచ్చేంతవరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. మండుతున్న ఎండలో సుమారు గంటన్నరపాటు మహిళలంతా ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించారు. ఒక దశలో మహిళలు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, తణుకు రూరల్ ఎస్సై కె.గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తణుకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వల్లూరి వెంకటరామ్మోహన్, రేలంగి గ్రామానికి చెందిన ఇరగవరం మండల జెడ్పీటీసీ సభ్యుడు చుక్కా సాయిబాబు, టీడీపీ నాయకుడు బిరదా వీరబాపన్న మహిళలతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే అందుబాటులో లేరని, ఆదివారం రేలంగి గ్రామానికి నేరుగా వచ్చి డ్వాక్రా మహిళల్ని కలుస్తారని సర్దిచెప్పడంతో వెనుతిరిగారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. మోసగించడం దారుణం రుణమాఫీ అంటూ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నో ఆశలు చూపించి చివరకు మోసం చేయడం దారుణం. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిచాక మాట దాట వేస్తున్నారు. -ఎ.రత్నమాల, రత్న గ్రూప్ అప్పులు ఎలా తీర్చేది రుణమాఫీ ఆశ పెట్టకపోతే బ్యాంకోళ్లకు సక్రమంగా డబ్బు చెల్లించేవాళ్లం. పూర్తి రుణమాఫీ అనడంతో డబ్బు కట్టడం మానేశాం. ఇప్పుడు పూర్తిగా రుణమాఫీ చేయకపోతే పేరుకుపోయిన అప్పుల్ని ఎలా తీర్చేది. తక్షణమే పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి. -దిర్శిపో అచ్చమ్మ, కరుణ గ్రూప్ హామీలు గుర్తు లేవా ఎన్నికల్లో మాట ఇవ్వబట్టే కదా నమ్మి ఓట్లు వేశాం. ఇంటింటికీ వచ్చి మీరు ఇచ్చిన హామీలు గుర్తు లేవా. వెంటనే ఇచ్చిన హామీ అమలు చేయండి. పేరుకుపోయిన రుణాలు చెల్లించాలంటే మా కుంటుంబాలపై తీవ్ర భారం పడుతుంది. ఆర్థికంగా నష్టపోతున్నాం. - పాములపర్తి వరలక్ష్మి, గ్రేసమ్మ గ్రూప్ మాట నిలబెట్టు కోవాలి వడ్డీతో కలిపి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఒక్కొ క్క సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామంటున్నారు. ఆ డబ్బు వడ్డీకైనా సరిపోతుందా. రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసి మాట నిలబెట్టుకోవాలి - సోడదాసి సరోజని, రక్షణ గ్రూప్ -
ఇదేనా రుణమాఫీ!
అప్పుల ఊబిలో అన్నదాతలు రోజు రోజుకూ పెరుగుతున్న వడ్డీ భారం రీషెడ్యూల్ విషయంలో మభ్యపెడుతున్న ప్రభుత్వం ప్రజల ఆగ్రహం తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్టుంది ప్రభుత్వం పరిస్థితి. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేసి చేతులు దులుపు కుంది. ప్రకటనొచ్చి నెల రోజులు గడిచినా ఏ ఒక్కరి రుణమూ మాఫీ కాలేదు. కొత్త రుణాలకు అన్నదాతలు నోచుకోకపోగా వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి పెంచారు. నోటీసుల జారీతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు జిల్లాకు వస్తున్న సీఎంను నిలదీసేందుకు రైతులు, మహిళలు సిద్ధమవుతున్నారు. విశాఖ రూరల్/ చోడవరం: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోగా రోజుకో తప్పుడు ప్రకటనతో రైతులను వంచించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ మాటలు నమ్మిన రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ కూడా జరగలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు చేసి ఖరీఫ్ పంటలకు మదుపులు పెడుతున్నారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. అనేక అనుమానాలు జిల్లాలో గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి రూ.1040 కోట్లు మేరకు రుణాలు ఇచ్చారు. గత ఖరీఫ్‌లో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు అందజేశారు. రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లలు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. అలాగే లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణా మాఫీ మొత్తంగా రూ.1040 కోట్లు కూడా రద్దవుతాయని రైతులు భావించారు. కాని మాఫీ కాకపోగా వాటిపై వడ్డీ భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. డ్వాక్రా రుణాల పరిస్థితి అంతే జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఇందులో లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా కేవలం లక్షలోపు రుణం తీసుకున్న సంఘానికే రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన సంఘాలు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పాత రుణాలు చెల్లించేంత వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి జూలై నెలాఖరు నాటికే రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.30 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. సీఎం స్పష్టత ఇవ్వాలి నాది బుచ్చెయ్యపేట మండలం. 2011లో భార్య నగలు తాకట్టు పెట్టి రాజాం బ్యాం కులో రూ. 35వేలు రుణం తీసుకున్నాను. లోన్ నంబరు 15938 4200 9672తో అసలు, వడ్డీ రూ.44, 356 కట్టాలని నోటీసు పంపారు. రుణాలు మా ఫీ చేశామని సీఎం చెబుతున్నప్పటికీ బ్యాం కులు నోటీసులు ఇవ్వడం ఏమిటో. - పోతి లక్ష్మణరావు అంతా అయోమయం నాది బుచ్చెయ్యపేట మండలం రాజాం. మూడు ఎకరాల పొలం ఉంది. 2013లో రాజాం కెనరా బ్యాంకులో రూ.50 వేలు అప్పు తీసుకున్నాను. లోన్ కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపారు. ఎన్నికలు ముందు నుంచి రుణాలు చెల్లించద్దని టీడీపీవారు చెప్పడంతో రుణం చెల్లించలేదు. -కంఠంరెడ్డి శ్రీను -
రుణమాఫీ చేసి తీరుతాం
కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు ఐటీ రంగంలో రూ 40 వేల కోట్ల టర్నోవరే లక్ష్యం టీడీపీ మైనారిటీ విభాగం సర్వసభ్య సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి చిత్తూరు(సిటీ): కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర పౌర సంబంధాలు, ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన చిత్తూరులో టీడీపీ జిల్లా కార్యాల యంలో జరిగిన పార్టీ మైనారిటీ విభాగం కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మసీదు స్థలా లు, వక్ఫ్ భూములు, మైనారిటీల శ్మశాన స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. దీనిపై తాను ఇప్పటికే విచారణకు ఆదేశించానని, విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా 1,20,000 మంది రైతులకు చెందిన రూ.37వేల కోట్ల రుణ బకాయిలు, మరో 7,500 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై తెలంగాణ సీఎం కేసీఆర్ రాద్ధాంతం చేయడం తగదన్నారు. చిత్తూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు సత్యప్రభ, శంకర్ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్,రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గ మాట్లాడారు. అనంతరం ముస్లింలు మంత్రికి సన్మానం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పీలేరు నియోజకవర్గ నేత ఇక్బాల్ అహ్మద్, మైనారిటీ నేతలు షబ్బీర్, రఫీ, జహంగీర్‌ఖాన్, నౌషద్, జహంగీర్‌ఖాన్, పర్వీన్‌తాజ్, నగర మేయర్ కఠారి అనురాధ, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, మహిళా నేతలు వైవీ.రాజేశ్వరి, ఇందిర పాల్గొన్నారు. -
నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు
ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళల ఆగ్రహం పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ తంబళ్లపల్లెలో నిరసన ర్యాలీ, ధర్నా తంబళ్లపల్లె: ఎన్నికల ముందు ప్రజలు అడగక మునుపే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మాట నిలుపుకోకుంటే మనుగడ ఉండదని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. డ్వాక్రా రుణాల మాఫీపై రోజుకో విధంగా ప్రకటనలు చేస్తూ కాలయాపన చేయడంపై తంబపల్లెలో నిరసనకు దిగారు. సోమవారం తంబళ్లపల్లెలో డ్వాక్రా మహిళలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహశీల్దార్ కార్యాల యం వరకు ర్యాలీ చేశారు. హరిత సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డ్వా క్రా మహిళలు మాట్లాడుతూ మహిళలను న మ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణమాఫీపై రోజుకో నిర్ణయాన్ని తీసుకుంటూ మహిళలను తికమక పెట్టడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను పూర్తిగా అధోగతిపాలు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిపోతారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవ్వరూ రుణాలు చెల్లించవద్దని చెప్పి ఇప్పుడు మాట మార్చడం నీచమన్నారు. దీనిపై మహిళలంతా ఉద్యమించి ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధమవుతామే గానీ రుణాలు చెల్లించేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయకుంటే ఓట్లు అడిగిన వారిని నిలదీస్తామన్నారు. ఎమ్మెల్యేలను సైతం గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అనంతరం డెప్యూటీ తహశీల్దార్ షంషీర్ఖాన్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
వాడివేడిగా బందరు కౌన్సిల్
రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష సభ్యుల సంవాదం సమస్యలపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల ఏకరువు కమిషనర్ కారు అద్దె అంశంపై ఖంగుతిన్న అధికారులు ఆక్రమణల తొలగింపునకు కౌన్సిల్ నిర్ణయం మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం మునిసిపాలిటీ నూతన పాలకవర్గ కౌన్సిల్ తొలి సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మధ్య పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, కమిషనర్ కారు అద్దె అంశం, రియల్ ‘దోపిడీ’, కూరగాయల మార్కెట్లో అనుమతులు లేకుండా దుకాణాలను నిర్మించటం, డంపర్బిన్లు, ఆటో రిక్షాలు, ట్యూబ్ లైట్ల సెట్ల కొనుగోలు, పాత ఇనుము అమ్మకం తదితర అంశాలు సభను కుదిపేశాయి. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షేక్ అచ్చేబా, కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబులు సంధించిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో పేర్కొన్న 23 అంశాలపై చర్చించారు. నాలుగో అంశంపై టీడీపీ సభ్యుడు నారాగాని ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతు, డ్వాక్రా రుణాల మాఫీకి తొలి సంతకం చేశారని, దీంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ సభ్యుడు అచ్చేబా స్పందిస్తూ.. రుణమాఫీ అని ప్రకటించారేకాని అమలు జరగలేదన్నారు. మాఫీ అంతా బూటకమేనని విమర్శించారు. సభను పక్కదోవ పట్టించవద్దని చైర్మన్ పేర్కొనటంతో తాము అజెండా అంశంపై మాట్లాడుతుంటే అంజనేయప్రసాదే పక్కదోవ పట్టించాడని, వైస్ పాలనలో పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాల మాదిరిగా ఇచ్చేవారని, ఇప్పుడు ఆలస్యంగా ఇస్తున్నారని చెప్పలేదుగా అని బదులిచ్చారు. చేపల మార్కెట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్ సీపీ సభ్యుడు మేకల సుబ్బన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 3 సీట్ల మరుగుదొడ్లు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలన్నారు. కౌన్సిల్ అనుమతి లేకుండా మార్కెట్లోని మధ్యగోడను ఎలా తొలగించారని అధికారులను ప్రశ్నించారు. మంత్రి మార్కెట్లో పర్యటించినప్పుడు వార్డు కౌన్సిలర్‌గా ఉన్న తనను ఎందుకు ఆహ్వానించకుండా వివక్ష చూపారనిని చైర్మన్‌ను ప్రశ్నించారు. కౌన్సిల్ విప్ కాగిత జవహర్లాల్ మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ఇంకా డీఏ బకాయిలు చెల్లించాలో చెప్పాలని కోరారు. కమిషనర్ ఉపయోగించిన కారుకు 2014 మార్చి నుంచి జూలై నెల వరకూ ఐదు నెలల అద్దె రూ. 24 వేలను సాధారణ నిధులనుంచి చెల్లించేందుకు కౌన్సిల్ అనుమతికోసం ప్రతిపాదించడంపై మేకల సుబ్బన్న అభ్యంతరం తెలిపారు. గత 12 నెలల అద్దెను చెల్లించేందుకు రూ. 2.97 లక్షలతో పెట్టిన బిల్లు ప్రియాంబుల్పై గత పిబ్రవరి 20నే ప్రత్యేక అధికారి సంతకం చేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు నెలల బిల్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. పిబ్రవరిలో ప్రత్యేక అధికారి సంతకం పెట్టిన ప్రియాంబుల్ కాపీ నకళ్లనుమ సుబ్బన్న తీసి చూపటంతో కమిషనర్, ఎంఈలు ఖంగుతిని తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు కమిషనర్ మారుదీ దివాకర్ దీనిపై స్పందిస్తూ.. తన కారుకు చార్జి చెల్లించాలని అజెండాలో తప్పుగా పేర్కొన్నామని, వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆర్డీవో సాయిబాబు కారును ఉపయోగించారని దానికి అయిన ఖర్చు చెల్లించాలని ప్రతిపాదించామని వివరణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు ప్రతేృ క నిధులు వస్తాయని, సాధారణ నిధుల్లోంచి ఎందుకు చెల్లించాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు కమిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు. విజయవాడ రోడ్‌లోని వేసిన లే అవుట్‌కు మునిసిపాలిటీ అనుమతులు ఇవ్వగా దాదాపు 2 వేల గజాలకు పైగా స్ధలాన్ని మునిసిపిల్ పార్కుకు అప్పగించారని, ఆ తర్వాత ఈ స్థలాన్ని కొంత మంది తమపేరున రిజిస్టర్ చేసుకుని ప్రహరీ గోడ కట్టారని సుబ్బన్న పేర్కొన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ ఏ చర్యా తీసుకోలేదన్నారు. రియల్దోపిడీపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం క్లిప్పింగ్‌ను చూపించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆక్రమణలకు గురైన మునిసిపల్ స్థలాలు, పార్కులను కౌన్సిల్ సభ్యులందరం కలిసి గుర్తించి, చర్యలు తీసుకుందామని రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అచ్చేబా మాట్లాడుతూ టౌన్‌ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జీ, వైస్ చైైర్మన్ పి.కాశీవిశ్వనాథం, టీడీపీ కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాసు, కొట్టె అంకా వెంకట్రావ్ తదితరులు మాట్లాడారు. -
మోసపూరిత హామీలు చంద్రబాబుకే చెల్లు
గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలా తానూ మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో శుక్రవారం ఉంగుటూ రు, చింతలపూడి నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మునిసిపల్ కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అయినప్పటికీ టీడీపీకి, వైఎస్సార్ సీపీకి మధ్య 5. 60 లక్షల ఓట్లు మాత్రమే తేడా వచ్చిం దన్న విషయాన్ని గుర్తు చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే అందులో 2లక్షల 80వేల ఓట్లు వైఎస్సార్ సీపీకి లభించి ఉండేవని, తామే అధికారంలోకి వచ్చి ఉండేవారమని అన్నారు. నిజమైన రాజకీయాలు చేసి ఒక మంచి నాయకుడిగా సుపరి పాలన సాగించి, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు. తద్వారా 30 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించి అన్నివర్గాల ప్రజలను అభివృద్ధిపథంలో నడపాలన్నదే తన లక్ష్యమని వివరించారు. అందుకే తప్పుడు హామీలను ఇవ్వలేకపోయాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదిం చారని, ఆయనలాగే తాను సైతం ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదిం చుకునేందుకు పాటుపడతానని చెప్పారు. చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇది అన్యాయం బాబూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రతి డ్వాక్రా చెల్లెమ్మ ఖాతాలో నుంచి వారికి ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారన్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్న చంద్రబాబ వాటిపై పడుతున్న వడ్డీలను ఏంచేస్తారని ప్రశ్నించారు. పలువురు రైతులు రుణాలు చెల్లించినప్పటికీ బ్యాంకు అధికారులు బంగారం ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రతి కార్యకర్త వారి మనోభావాలను పార్టీ అధినేత ఎదుట వ్యక్తం చేశారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ బాగా పనిచేయటం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని పలువురు కార్యకర్తలు తెలిపారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసుల విషయంలో పోరాటాలకు సన్నద్ధం కావాలని కోరారు. పార్టీలో కొంతమంది నేతలు స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే వారి చిట్టాలను బయటపెడ తామని తెలిపారు. పార్టీ అధినేత పిలుపును సైతం లెక్క చేయకుండా నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యకర్తలు చెప్పిన వివరాలను రాసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళి, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నాయకులు జానకిరెడ్డి, శరత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, నరసింహారెడ్డి, తోట కుమార్, తోట లక్ష్మణరావు, బాబ్జీ, రాజానాయక్, సుబ్బారావు, సునీత, దేవమణి, చరణ్‌కుమార్, కీర్తి, పి.నాని, చౌదరిబాబు, ఎం.వెంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాట..ముళ్లబాట
‘నేను గద్దెనెక్కాక రద్దు చేసేస్తా.. రుణాలు కట్టకండి’ టీడీపీఅధినేత చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళల చెవినిల్లు కట్టుకుని ఊదరగొట్టిన వాగ్దానమిది. తొలి సంతకమే రుణమాఫీపై అని ప్రగల్భించిన ఆయన.. అధికారం చేపట్టి రెండునెలలు దాటినా..ఇచ్చిన మాటను ఇచ్చినట్టు అమలు చేయకుండా అయోమయాన్ని సృష్టించి, సాగదీశారు. ఇంతలో.. రుణాలపై వడ్డీ రాయితీ గడువు గురువారంతో ముగిసిపోయింది. ‘మబ్బును చూసి ముంతలో నీరు ఒలకబోసుకున్న’ వారి చందమైంది ఇప్పుడు అన్నదాతలు, ఆడపడుచుల పరిస్థితి. సాక్షి, కాకినాడ :టీడీపీ అధినేత చంద్రబాబు మాటను పట్టుకుని రుణాలు చెల్లించకపోవడం ఇప్పుడు తమ పుట్టి ముంచిందని అన్నదాతలు, డ్వాక్రా మహిళలు గగ్గోలు పెడుతున్నారు. రుణ విముక్తులమవుతామన్న వారి ఆశలు ఆవిరైపోగా ఇప్పుడు.. వడ్డీ రాయితీ కోల్పోవడంతో భారం తడిసిమోపెడవుతోందని వాపోతున్నారు. మాఫీని నమ్మిన పాపానికి జిల్లాలో 2 లక్షల మంది రైతులతో పాటు 74 వేల డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ ఏడాది వడ్డీ రాయితీని కోల్పోవడమే కాక బకాయి పడ్డ రుణాలను 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితిలో చిక్కుకున్నారు.ఏదైనా పంటకాలంలో తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లిస్తే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణంగా పొందవచ్చు. ఆ తర్వాత మరో రెండు లక్షల వరకు పావలా వడ్డీ వర్తిస్తుంది. వీటిని ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీ రాయితీని తిరిగి పొందవచ్చు. అంటే గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతు గరిష్టంగా రూ.50 వేల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. స్వల్పకాలిక పంటరుణాలుగా నిర్దేశించిన లక్ష్యంలో 60 శాతం రుణాలను ఖరీఫ్‌లో, 40 శాతం రుణాలను రబీలో మంజూరు చేస్తుంటారు. జిల్లాలో 2013 ఖరీఫ్‌లో రూ.2,850 కోట్లు, రబీలో రూ.1,950కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఖరీఫ్‌లో 2.90 లక్షల మంది రైతులకు రూ.2,950 కోట్లు, రబీలో 2.50 లక్షల మందికి రూ.2,055 కోట్ల రుణాలందజేశారు. చివరికిలా ముంచేశారు.. ఖరీఫ్ లక్ష్యంలో 85 శాతానికి (సుమారు రూ.2400 కోట్లు) పైగా రుణాలను గతేడాది జూన్/జూలై నెలల్లోనే మంజూరు చేశారు. ఈ రుణాలను 2014 జూన్/జూలై నెలాఖరులోగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. సాధారణంగా 80 శాతం మంది రైతులు నిర్ణీత గడువులోగానే రుణాలు చెల్లిస్తుంటారు. అయితే చంద్రబాబు రుణమాఫీ వాగ్దానంతో రైతులు, మహిళలు గత ఆరేడు నెలలుగా రుణబకాయిలు చెల్లించడం మానేశారు. కానీ గద్దెనెక్కాక నైజాన్ని బయటపెట్టుకున్న చంద్రబాబు మాఫీపై గందరగోళం నెలకొనేలా చేశారు. కొత్త రుణాలు కావాలన్నా, వడ్డీ రాయితీ పొందాలన్నా.. జూలై 31లోగా పాత రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఒకేసారి బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సి రావడంతో రైతులు దిక్కులు చూశారు. అయినా గత వారం రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురిచేసి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి రూ.200 కోట్లకు పైగా ముక్కుపిండి వసూలు చేశారు. గత ఖరీఫ్‌లో జూలై నెలాఖరులోగా తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాల్లో వసూలైన మొత్తం మినహాయిస్తే ఇంకా సుమారు రూ.2,200 కోట్ల వరకు బకాయి ఉంది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడం వలన వడ్డీ లేని రుణంగా పొందాల్సిన రూ.150 కోట్లు, పావలా వడ్డీ కింద మరో రూ.150 కోట్ల రాయితీని రైతులు కోల్పోతున్నారు. అంతే కాక ఆ రుణాల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉండడంతో మరో రూ.280 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇక జిల్లాలో 74 వేల డ్వాక్రా సంఘాలకు రూ.1343 కోట్ల బకాయిలుంటే వాటిలో గతేడాది మంజూరు చేసిన రుణాలు రూ.958 కోట్ల వరకు ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా నెలవారీ వాయిదాలు నిలిచిపోవడంతో ఆ మేరకు ప్రతి నెలా రావలసిన రూ.9 కోట్ల మేర వడ్డీ రాయితీ నిలిచిపోయింది. అంటే రూ.60 కోట్లకు పైగా వడ్డీ రాయితీని ఆయా సంఘాలు కోల్పోయాయి. అదే రీతిలో 14 శాతం వడ్డీ చొప్పున మరో వంద కోట్ల వరకు భారం మోయాల్సి వస్తోంది. మొత్తం మీద బాబు మాట.. రైతులను, డ్వాక్రా మహిళలను ‘ముళ్లబాట’లోకి నెట్టింది. ఈ భారం బాబు పుణ్యమే.. ఎన్నికల ముందు రుణాలు కట్టొద్దన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వడ్డీరాయితీ కోల్పోవడానికి నూరు శాతం చంద్రబాబే కారణం. ఆయన నాన్పుడుతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. - జలగం కుమారస్వామి, బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతులు ఏమైనా అయితే బాధ్యత బాబుదే.. బాబు మాటను నమ్మినందుకు వడ్డీ రాయితీని కోల్పోవడమే కాక 14 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. మాఫీ వర్తించినా ఈ భారం రైతులు భరించలేనిది. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాధ్యత చంద్రబాబుదే. - ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘ జిల్లా నాయకుడు, బండార్లంక ఇదెక్కడి అన్యాయం? మా సంఘం రూ.5 లక్షల రుణం తీసుకుంది. ఇంకా రూ.2.75 లక్షలు చెల్లించాలి. మాఫీ ఆశతో నాలుగు నెలలుగా చెల్లించలేదు. జూలై నెలాఖరులోగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుందని మభ్యపెట్టినా చెల్లించలేకపోయాం. ఇప్పుడు రాయితీ వర్తించదంటున్నారు. ఇదేం అన్యాయం? - ఆర్వీ లక్ష్మి, శ్రీనివాస్ స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలు, పెదపూడి -
రుణమాఫీ కోసం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఇంటి వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన కాకినాడ: రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై డ్వాక్రా మహిళలు తిరగబడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కాకినాడలో బుధవారం దాదాపు 200 మంది డ్వాక్రా సంఘాల మహిళలు స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఇంటింటికీ వచ్చి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము రుణాలు రద్దయితే ఆర్థికంగా చేయూత లభిస్తుందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టామని, సీఎం చంద్రబాబుఆ మాటే మరిచారని చెప్పారు. ఇప్పుడు రుణాలు ఎవరు చెల్లిస్తారని గట్టిగా ప్రశ్నించారు. ‘‘మీరు రుణ మాఫీ చేయకపోవటం వల్ల తీసుకున్న రుణానికి 13 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. లక్ష రూపాయల అప్పున్న గ్రూపు అదనంగా 13 వేలు కట్టాల్సి వస్తోంది. ఈ వడ్డీ ఇంకా పెరుగుతుంది. దీన్నెవరు కడతారు?’’ అని వారు ప్రశ్నించారు. కొందరి సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును రుణాల కింద జమ చేసుకుంటున్నారన్నారు. టీడీపీ మోసంతో తమ కష్టార్జితాన్ని కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేఇంట్లో లేకపోవడంతో ఆయన సోదరుడు సత్యనారాయణ వారిని సముదాయించి పంపారు. -
ప్రజలకు అండగా నిలవాలి
పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు హైదరాబాద్: రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల వారికి అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని, అలాంటి విషయాల్లో పార్టీ నేతలు నిత్యం ప్రజల వెన్నంటి ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ వాగ్దానాన్ని నెరవేర్చనందుకు నిరసనగా.. ‘నరకాసుర వధ’ పేరుతో ఇటీవల మూడురోజుల పాటు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, పార్టీ అంతర్గత విషయాలపై బుధవారం జగన్ సమీక్ష నిర్వహించారు. 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. నరకాసుర వధ కార్యక్రమంలో రైతులు, మహిళలు స్వచ్చందంగా పెద్దయెత్తున పాల్గొన్నారని వారు వివరించారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులను జగన్ అభినందించారు. గ్రామాల్లో రైతులు, మహిళలు రుణాల మాఫీపై తీవ్ర ఆందోళనతో ఉన్న విషయాన్ని పలు జిల్లాల అధ్యక్షులు పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంలో వారికి అండగా నిలిచి పోరాటాలు చేయాలని జగన్ సూచించారు. రుణ మాఫీ చేయకుండా రైతులు నష్టపోయేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయూన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలో సంస్థాగతంగా చేయనున్న మార్పు చేర్పులను ఆయన వివరించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తరచూ సమీక్షించేందుకు పార్టీ తరఫున ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. నేటినుంచి గుంటూరులో సమీక్షలు: ఇటీవలి సాధారణ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించడానికి గురువారం నుంచి మూడురోజుల పాటు గుంటూరు జిల్లా సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గుంటూరులో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. -
రుణమాఫీకి ఆధార్ గండం
రైతులు, డ్వాక్రా మహిళల ఉరుకులు, పరుగులు కిటకిటలాడుతున్న బ్యాంకులు జాడలేని ఆధార్ కేంద్రాలు మీ-సేవా కేంద్రాల్లో ఆధార్ అదృశ్యం విజయవాడ : రుణమాఫీ వర్తింపజేయాలంటే తప్పనిసరిగా ఆధార్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల్సిందేనన్న నిబంధన విధించడంతో రైతులు, డ్వాక్రాగ్రూపు సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ నంబర్లు సమర్పించకుంటే మాఫీ, రీ షెడ్యూలు చేసే సమస్యే లేదని బ్యాంకర్లు చెబుతుండడంతో చేసేదేమీ లేక రైతులు, డ్వాక్రా మహిళలు ఆధార్ కార్డుల కోసం ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అప్పులు తీసుకున్న రైతులు, మహిళలు బ్యాం కుల వద్ద బారులు తీరి ఆధార్ నంబర్లు సమర్పిస్తున్నారు. ఆధార్ లేని వారు నానా అగచాట్లు పడుతున్నారు. గతంలో ఆధార్ తీయించుకున్న వారిలో కొందరికి ఇంకా కార్డులు రాలేదు. దీంతో వారు ఏమి చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారు విజయవాడ లబ్బీపేటలో కార్వే ఆధార్ కే్రందం వద్దకు వెళ్లి గత కొద్ది నె లలుగా ఫొటోలు తీయించుకుంటున్నారు. అక్కడి సిబ్బంది వారంలోనే ఆధార్ కార్డు వస్తుందని చెప్పి పంపిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కార్డు రావటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. కార్డుల కోసం మీ-సేవ కేంద్రాలను సంప్రదించాలని పౌరసరఫరాల అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆధార్ కార్డులు, లేదా దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని ప్రజలు వాపోతున్నారు. రుణమాఫీకి బ్యాంకర్ల కసరత్తు జిల్లాలో 425 సహకార సంఘాలు, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి గత మార్చి వరకు రూ.5,628 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిలో బంగారం తాకట్టు పెట్టి 2,60,737 ఖాతాల ద్వారా రూ.3,276కోట్లు, 1,89,587ఖాతాల ద్వారా రూ.2,3 52కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.1.50 లక్షలు చొప్పున లెక్కిస్తే రూ.700 కోట్ల రుణమాఫీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాలకు గ్రూపునకు రూ.లక్ష చొప్పన దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ వస్తుందని భావిస్తుస్తున్నారు. లక్షమందికిపైగా అవస్థలు జిల్లాలో 45,17,398 మంది జనాభా ఉన్నారు. వీరిలో 43,83,120 మంది ఆధార్ తీయించుకున్నారు. ఇంకా 1,34,278 మంది ఆధార్ ఫొటోలు దిగాల్సి ఉంది. గత జనవరి నుంచి ఆధార్ కేంద్రాలు మూత పడ్డాయి. మళ్లీ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయినా కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చే సుకుని ఆధార్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పాలన దారిలోకి తెస్తున్నాం
మంత్రి అయ్యన్నపాత్రుడు చోడవరం టౌన్: గడచిన పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, దాన్ని గాడిలో పెడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం చోడవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. లక్షన్నర మాఫీతో 86 శాతం మంది లబ్ధిపొందనున్నారని చెప్పారు. రాష్ట్రం లో 13 వేల పంచాయతీలకుగాను 3 వేల పంచాయతీల్లో స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని సరఫరా చేస్తున్నాయని, మిగలిన వాటిలో 5 వేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రా రంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మండలానికి ఐదు పంచాయతీలు ఎంపిక చేస్తామని, విశాఖ జిల్లాలో మాత్రం పది పంచాయతీలు చొ ప్పున ఎంపిక చేయన్నుట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ప్రోగ్రాం వివరించారు. 30న చోడవరంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతులతో సమావేశం, అనంతరం అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. 31న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశాలుంటాయన్నారు. ఆ తర్వాత కశింకోటలో జరిగే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాళ్లపాలెంలో ప్రజాసదస్సు, తర్వాత యలమంచిలిలో రోడ్‌షో, మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం ఉంటుందన్నారు. 3 గంటలకు నక్కపల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం, 5 గంటలకు ఉపమాక వేంకటేశుని దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణమవుతారని చెప్పారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం పరిశీలించారు. చోడవరం హైస్కూల్ ఆవరణను పరిశీలించాక కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల వెంట ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలాగోవింద, కె.ఎస్.ఎన్.రాజు, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు ఉన్నారు. -
బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం
పూర్తిగా మాఫీ చేయకుంటే మా ఉసురు తగులుతుంది గట్టులో మహిళల రాస్తారోకో బి.కొత్తకోట: ‘‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా.. ఎన్నికల ప్రచారంలో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు రూ.లక్ష మాత్రమేనని మోసం చేస్తారా.. చంద్రబాబు రాజీనామా చేస్తే అప్పుడు మేం రుణాలు చెల్లిస్తాం.’’ అంటూ మహిళా సంఘాల సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని, ఏం చేస్తారో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలవారీ సమావేశాల్లో భాగం గా సీసీ హనుమంతప్ప శనివారం బి.కొత్తకోట మం డలం గట్టు గ్రామంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. తొలుత అజెండా అంశాలు, కొత్త గ్రామ సమాఖ్యల ఎన్నిక తదితర అంశాలపై చర్చించారు. సమావేశం చివరిలో సంఘాలన్నీ రుణాలు చెల్లించాలని సీసీ కోరారు. ప్రభుత్వం ఒక్కో సంఘానికి రూ.లక్ష జమ చేస్తుందని, ఆ సొమ్ము 4 నెలులుగా చెల్లించని బకాయిలకు సరిపోతుందని, మిగిలిన రుణాలను వడ్డీతో కలిపి చెల్లించాలన్నారు. దీంతో అక్కడున్న 400 మంది మహిళలు రగిలిపోయారు. సీసీని నిలదీశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేసారని, ఇప్పుడు డబ్బులు కట్టమంటే ఎలా అని ప్రశ్నించారు. పైసా కూడా చెల్లించే ది లేదన్నారు. ప్రతినెలా రుణాలు చెల్లిస్తున్నామని, 4 నెలలుగా చెల్లించకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. మా ఓట్లతో గెలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమనండి.. అప్పు డు రుణాలు చెల్లిస్తామంటూ తేల్చిచెప్పారు. మాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందని శాపనార్దాలు పెట్టారు. దీంతో సీసీ, సమావేశ నిర్వాహకులు సమావేశాన్ని ముగించారు. సీసీ సరైన సమాధానం చెప్పకపోవడంతో మహిళలు గట్టు వైఎస్ఆర్ విగ్రహం ఎదుట రహదారిపై రాస్తారోకో చేసారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆందోళనను విరమించారు. డీఫాల్టర్ చేస్తారా ప్రతినెలా రుణాలు చెల్లించే తమను డీఫాల్టర్లుగా చూడటం అన్యాయం. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామంటేనే చెల్లించలేదు. ఇప్పుడు రుణాలు కట్టమంటే అది మోసం చేయడం కాదా. మా ఓట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదని చెప్పమనండి. లక్ష మాఫీ చేస్తే సంఘాలకు ఒరిగేదేమీలేదు. - ఎస్.మల్లిక, గట్టు ముందు రాజీనామా చేయండి మహిళల ఓట్లతో గెలిచన చంద్రబాబు రుణాలను పూర్తిగా మాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆయన గద్దె దిగితే మా రుణాలు చెల్లించేస్తాం. ఎందుకంటే మా ఓట్లతో గెలిచిన ఆయన రుణాలు మాఫీ చేస్తారని ఆశించాం. ఇప్పుడు కాదంటే మళ్లీ ఎవరికైనా ఓట్లేసి గెలిపించుకుంటాం. - సాలమ్మ, గట్టు ఇంతకంటే మోసమా మహిళలకు చంద్రబాబు చేసిన మోసం ఇంతకన్నా లేదు. లక్ష మాఫీని గొప్పగా చెప్పుకొంటున్నారు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి, ఎంత మందికి ఉంటుందో చెప్పాలి. మహిళలను అన్యాయంగా చూస్తున్నారు. రుణాలను మేం చెల్లించం. చంద్రబాబు ఏం చేస్తారో చూస్తాం. - డీ.లక్ష్మీదేవి, గట్టు -
ప్రజలను మోసం చేశారు..
నరసన్నపేట: రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మండి పడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రైతులు, డ్వాక్రా మహిళల తరఫున చేపట్టే ఆందోళనల్లో భాగంగా శనివారం సాయంత్రం నరసన్నపేటలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజలను మోసగించి కేవలం రెండుశాతం ఓట్లతో గెలిచిన విషయూన్ని గుర్తించుకోవాలన్నారు. తక్షణమే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయూలని డిమాండ్ చేశారు. అవగాహన లోపంతో అసెంబ్లీలో కూడా మంత్రుల మాటతీరు అధ్వానంగా ఉందన్నారు. పదే పదే జగన్ అవినీతి కోసం ప్రస్తావిస్తున్న నాయకులు వాస్తవాన్ని గ్రహించడం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై గతంలో జగన్‌ను అకారణంగా జైల్లో పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్ష సభ్యులుగా సంపూర్ణ సహకారం అందిస్తామని, అధికారం మాదే అని దూకుడుగా వ్యవహరిస్తే ప్రతిపక్షనేతలుగా సహించేది లేదని హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కష్టమన్నారు. రుణ మాఫీ మాదిరిగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు సగంసగం అమలుచేస్తే ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడతారని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి నర్తు రామారావు, జిల్లా నాయకులు పైడి ఉమామహేశ్వరరావు, రొక్కం మాధవరావు, స్థానిక పార్టీ నాయకులు చింతు రామారావు, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పి.దాలినాయుడు, కణితి కృష్ణారావు, కణుసు సీతారాం, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీ, మొజ్జాడ శ్యామలరావు, మెండ రాంబాబు, కోరాడ చంద్రభూషణగుప్త, తంగుడు జోగారావు,రాజాపు అప్పన్న, రఘుపాత్రుని శ్రీధర్, పి.గిరీశ్వరరావు సతివాడ రామినాయుడు, మూకల్ల కృష్ణారావు, ధర్మాన జగన్మోహనరావు, ముద్దాడ బాలభూపాల్నాయుడు, ఇట్రాజు రామారావు, ఇట్రాజు చంద్రభూషణ, దండి జయప్రకాష్, పంగ రామారావు, మార్పు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి తగ్గించండి రుణమాఫీ చేసేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుకు అభినందనలు చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నా అసలు రుణాలు ఎప్పుడు మాఫీ చెస్తారో చెప్పండి? ఓ వైపు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారుు. పాత రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారుు. ఈ పరిస్థితి నుంచి ముందు గట్టెక్కించకుండా సంబరాలా? -పొట్నూరు అప్పలనాయుడు, రైతు, భాసూరు, పాలకొండ మండలం స్పష్టత ఏదీ? రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు... ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కేబి నెట్ తీర్మానం చేశామన్నారు. సంబరాలు జరుపుకొన్నారు. 96 శాతం మేర రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. ఇంతవరకూ స్పష్టత లేదు. ఇదంతా రైతులను మభ్యపెట్టేందుకేనా? -భూపతి వెంకటరమణ, రైతు, రంగారాయపురం, సంతకవిటి మండలం ఆచరణ సాధ్యమేనా? రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఎన్నికైన తర్వాత కమిటీ వేశారు. అనంతరం కుటుం బానికి రూ.లక్షా యూభైవేలే వర్తింపజేస్తామన్నారు.. ఇప్పుడు ఎర్ర చందనం అమ్ముతామంటున్నారు. ఇసుక రేవుల నుంచి సెస్ వసూలు చేస్తామంటున్నారు.. అసలు రుణాలను మాఫీ చేస్తారా.. లేదా..? - కంచరాపు వెంకటరమణ, రైతు, మేడమర్తి, సంతకవిటి మండలం -
రూ.6 కోట్ల వడ్డీ వెనక్కి ఇవ్వరా..?
పలమనేరు: డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్న ఈ ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. దీనికి తోడు గతంలో సక్రమంగా రుణా లు చెల్లించిన గ్రూపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ ఇంతవరకు వారి ఖాతాల్లో జమ కాలే దు. సుమారు 6 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వడ్డీలేని రుణాలు తీసుకుని బ్యాంకులకు సక్రమంగా చెల్లించినప్పటికీ ఇంతవరకు వడ్డీ జమ కాలేదని, ఎప్పుడు అందుతుం దని గ్రూపు సభ్యులు పలుసార్లు ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం తమకు ఇంకా డీఆర్డీఏ, సెర్ఫ్ నుంచి నిధులు అందలేదని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. జిల్లాలో అర్బన్, రూరల్‌లో కలిపి మొత్తం 61వేల 711 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 5.65 లక్షల మంది గ్రూపు సభ్యులు ఉన్నారు. వీరు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ. 1611.03 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా పొందారు. వీరిలో 40 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పావలా వడ్డీని అమలు చేసింది. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి పావలా వడ్డీని సైతం వెనక్కిచ్చింది. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి మరో కొత్త పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. తాము గ్రూపు మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని చెప్పారు. 2013 జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గ్రూపుల్లోని మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తే వారి వడ్డీని ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి సంబంధిత బ్యాంకు ల్లో వడ్డీ వెనక్కి తీసుకునేందుకు అర్హులైన లబ్దిదారుల జాబితాను బ్యాంకర్లు ప్రభుత్వానికి అందజేశారు. ఆ మేరకు ఐకేపీకి సంబంధించి డీఆర్డీఏ నుంచి మెప్మాకు సంబంధించి సెర్ఫ్ నుంచి ఈ నిధులు గ్రూపులకు అందాల్సి ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తామెందుకు అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితం గా జిల్లాలోని మహిళలకు అందాల్సిన రూ.6 కోట్లు ఇంతవరకు అందలేదు. అధికారులను అడిగినా సమాధానం లేదు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాము సక్రమంగా రుణాలు చెల్లించినా వడ్డీ ఎందుకు రాలేదని గ్రూపు సభ్యులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని పలువురు గ్రూపు సభ్యులు చెబుతున్నారు. బ్యాంకర్లకు విన్నవిస్తే ప్రభుత్వం నుం చి నిధులు అందితే గానీ అర్హులైన వారికి వడ్డీని వెనక్కి ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని మహిళా గ్రూ పులు కోరుతున్నాయి. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన వైఎస్సార్సీపీ
-
దా'రుణం'
స్పష్టం చేస్తున్న బ్యాంకర్లు ఖరీఫ్‌కు రుణాలు కష్టమే రీషెడ్యూల్ అయితే 12 శాతం వడ్డీ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన టీడీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. హామీని నమ్ముకొని కట్టాల్సిన రుణం చెల్లించకుండా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వేలాది మంది కర్షకుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. పూర్తిగా రద్దు చేస్తాం ... రుణాలు కట్టవద్దంటూ పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. నెల తిరక్కుండానే మాట మార్చి కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంట రుణం అయినా, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలైనా లక్షన్నర దాటితే మిగిలిన మొత్తం రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చేయడంతో వడ్డీ భారం తలచుకొని రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: రైతు రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి లీడ్‌బ్యాంక్‌కు ఇప్పటి వరకూ ఆదేశాలు రాలేదు. ఎప్పుడు వస్తాయన్న అంశంపై తమకు స్పష్టత లేదని చెబుతున్నారు. రుణమాఫీ, రీషెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అప్పటి వరకూ కొత్త రుణాలు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదంటున్నారు. లక్షన్నర రుణం మాఫీకి సంబంధించి ఇప్పటి వరకూ రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకర్లకు సమాచారం లేదు. రుణాలు చెల్లించాల్సిన కాలపరిమితి దాటిపోతే 12.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం రాలేదు. లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ అవుతుందని చెబుతున్నారు. దీనిపై కూడా స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అయోమయం... జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా... ఇందులో కౌలురైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటరుణాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రకాశం జిల్లాలో రైతులకు 5,800 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు. బ్యాంకులలో వ్యవసాయ రుణాలురూ. 6,900 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో రుణమాఫీ కింద ఎంత వరకు మాఫీ అవుతాయి, ఇంకా ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పెదవి విరుపు డ్వాక్రా సంఘాల రుణాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకుంది. డ్వాక్రా రుణాలు కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రుణాలుగానే తీసుకున్నారు. లక్ష రూపాయలు, 50 వేల రూపాయల రుణం తీసుకున్న గ్రూపులకు ఈ నిర్ణయం ఊరట కలిగించినా, లక్షకు మించి రుణం తీసుకున్న గ్రూపులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సక్రమంగా రుణాలు చెల్లిస్తూ రావడం వల్లే తమకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ రుణం తీసుకునే అవకాశం వచ్చిందని ఆయా గ్రూపులు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కచ్చితంగా చెల్లిస్తూ వచ్చిన తమకు ఈ నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పునరాలోచించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
రైతుకు అండగా... నేడు, రేపు నిరసనలు
► వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సమాయత్తం ►షరతలు లేని రుణ మాఫీ చేయాలంటూ అన్ని మండలాల్లో ఆందోళనలు ► సీఎం చంద్రబాబు మోసంపై భగ్గుమంటున్న సీమాంధ్ర ప్రజలు ►విలేకరులతో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన రైతులకు అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. షరతులు లేని రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో శుక్ర,శనివారాల్లో రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేయనున్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరు దాటాకా తెప్ప తగలేసిన చందంగా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చి.. ఇప్పుడు షరతులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం మోసం కాదా.. అని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని బాలాజీ స్పష్టం చేశారు. రుణాలు బేషరతుగా మాఫీ చేయాలి: ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఎటువంటి షరతులు లేకుండా చంద్రబాబు బేషరతుగా అమలు చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రైతులకు కేవలం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు, డ్వాక్రా గ్రూపుకు లక్ష రూపాయలు చొప్పున రుణ మాఫీ చేస్తామని ప్రకటించి ఏదో సాధించినట్లు టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజే రుణమాఫీపై కమిటీ వేసి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఆందోళనల్లో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే సురేష్ పిలుపునిచ్చారు. అవి బూటకపు హామీలు చంద్రబాబువి బూటకపు హామీలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా క న్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బూటకపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులను పట్టించుకోవడం లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై మహిళల రణభేరి
స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి నిరసన ధర్నా, రాస్తారోకోతో ఉద్రిక్తత మహిళలకు వైఎస్సార్సీపీ మద్దతు మదనపల్లె: డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటూ మదనపల్లెలో మహిళలు రోడ్లపైకొచ్చి రణభేరి సాగిం చారు. వేలాది మంది మహిళలు పార్టీలకు, రాజకీయాలకు ఆతీతంగా స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి సీఎం చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం లో డ్వాక్రా మహిళలతో సమావేశం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సమాచారం ఇచ్చారు. మహిళలు హాజరయ్యూరు. అరుుతే రుణాలు మాఫీ అయ్యాయని సంబరాల్లో భాగంగా వైస్ చైర్మన్ కేక్ కట్‌చేశారు. దీనిపై మహిళలు ఆగ్రహించారు. ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. చర్చిముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్లో బైఠాయిం చారు. దాదాపు గంటన్నరసేపు మహిళలు ఆందోళన నిర్వహించడంతో సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డులో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐలు మల్లికార్జున, దస్తగిరిలు ఆందోళనకారులతో చర్చించారు. ఓ దశలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని నమ్మించి ఇప్పుడు ఒక్కో మహిళకు పదివేలు మాఫీ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. నాలుగు నెలలుగా తామెవ్వరూ రుణాలను చెల్లించలేదని ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే మహిళా లోకం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేట్టేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పునరాలోచించి రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు వైఎస్సార్సీపీ మద్దతు మహిళల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూ ర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నాయకులు ఆందోళనకారులకు మద్దతు ప లికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మొత్తం *22 వేల కోట్లు అరుుతే *7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం గర్హనీయమన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉ ద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, నాయకులు దేశాయ్ జయదేవ్ రెడ్డి, రఫీ, హర్షవర్ధన్ రెడ్డి, కోటూరి ఈశ్వర్, పూజారి రమేష్, బాస్ నాయకులు శ్రీచందు పాల్గొన్నారు. -
ఆగ్రహ జ్వాలలు
ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబుపై కన్నెర్ర చేశారు. చేస్తున్న మోసంపై పిడికిలి బిగించారు. రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని మాట తప్పిన చంద్రబాబు వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రైతులు, మహిళలు ఆయన దిష్టి బొమ్మలు దహనం చేశారు. ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై ‘తమ్ముళ్లు’ తెగబడే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. సాక్షి, చిత్తూరు: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా మాట తప్పడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద మహిళలు, రైతులు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటీగా నిరసనకు దిగారు. నరకాసురవధ పేరుతో చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా పార్టీ శ్రేణులు చంద్రగిరి వీధుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా వైఎస్సార్సీపీ శ్రేణులను అనుసరించాయి. చూసేవాళ్లకు ఇద్దరూ కలిసి ఆందోళనలు చేస్తున్నారా? అనిపించింది. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకోవాలని కోరుతూ తహశీల్దార్ కిరణ్‌కుమార్‌కు చెవిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు నినాదాలు చేసి, అనుచితంగా ప్రవర్తించారు. వారి తోపులాటలో తహశీల్దార్ కిందపడిపోయారు. వారిపై తహశీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ మురళిని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారా రవినాయుడు అడ్డుకున్నారు. సీఐ చొక్కా కాలర్ పట్టుకుని ‘ఏయ్..నన్నెవరనుకున్నావ్..’ అంటూ విచక్షణారహితంగా ప్రవర్తించారు. చంద్రగిరి సీఐ నాగభూషణం సర్దిచెప్పారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో నాలుగు కాళ్ల మంటపం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు పోటీ ఆందోళనకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో మండిపేటకోటూరు గ్రామంలో రైతులు, డ్వాక్రా మహిళలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని బార్లపల్లె వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అలాగే టౌన్‌బ్యాంక్ సర్కిల్లో డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు. వీరికి ఎమ్మెల్యే తిప్పారెడ్డి సంఘీభావం తెలిపారు. నగరిలో ఉయ్యాలకాలువ వద్ద మహిళలు ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు. పాలసముద్రం, జీడీనెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడుకండ్రిగ, నారాయణవనంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పుంగనూరులో లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు. నేడు, రేపు కొనసాగనున్న ఆందోళనలు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడురోజుల పాటు ప్రతి పల్లె సీమలోనూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు శుక్ర, శనివారాలు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగనున్నాయి. టీడీపీది గోబెల్స్ ప్రచారం గంగాధరనెల్లూరు: తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ తన అనుకూల మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేయిస్తుందే తప్ప ఏ ఒక్క పనీ సక్రమంగా చేయడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణ స్వామి విమర్శించారు. గంగాధరనెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపారు. రైతులకు రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష మాఫీ చేస్తామని చెప్పినా అందులో ఎలాంటి స్పష్టతా లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ప్రకటన మేరకు సంఘంలోని ప్రతి మహిళకూ కేవలం రూ.5 వేలు మాత్రమే మాఫీ అవుతుందని చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే టీడీపీ నాయకులు స్వీట్లు పంచుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. లేకపోతే రెండుమూడు నెలల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. నేడు పల్లెపల్లెలో ఆందోళనలు రుణమాఫీ అమలులో ఆంక్షలను నిరసిస్తూ శుక్రవారం పల్లెపల్లెలో అందోళన కార్యక్రమాలు చేపట్టాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. -
నారాపై రైతుల కన్నెర
సాక్షి ప్రతినిధి, విజయనగరం :గద్దెనెక్కించిన మాఫీ నాటకం ‘రుణ’రంగంగా మారుతోంది. మీ రుణాలను తీర్చేస్తానని, మిమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కించేస్తాననీ చెప్పి ఓట్లేయించుకున్న చంద్రబాబు తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని విస్మరించి కల్లబొల్లి మాటలు, కమిటీల కబుర్లు చెప్పడంతో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, రైతులు గురువారం ఆందోళనలు చేశారు. పలుచోట్ల ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో హొరెత్తించారు. రుణాల మాఫీని వెంటనే అమ లు చేయాలని నినదించారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును నిరసి స్తూ జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి, కురుపాం, జియ్యమ్మవలస, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వాహనాలను నిలివేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు, డ్వాక్రా మహిళలు ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే పి రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ అధికారం కట్టబెడితే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తానన్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా రుణాలు మాఫీ చేయకుంటే రైతులపై పడే 12 శాతం వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాం మండలం కేంద్రంలో నిర్వహించిన నరకాసుర వధ-దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రుణమాఫీని రూ. లక్ష కోట్ల నుంచి రూ. 35 వేల కోట్లకు కుదించారన్నారు. డ్వాక్రా రుణాలపై కూడా స్పష్టమైన ప్రకట న చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసిన ఇప్పుడు మహిళలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రుణాలు మొత్తం మాఫీ అని చెప్పి పరిమితులా? రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని, అసలు ఎప్పుడు మాఫీ చేస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు విమర్శించారు. జియ్యమ్మవల మండలంలో ని పెదమేరంగి కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా శత్రుచర్ల మాట్లాడు తూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకూ పోరాటం ఆపే ది లేదన్నారు. మూడు రోజులపాటు ఆందోళనలు చేస్తామన్నారు. నయవంచకుడు చంద్రబాబు ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు నయవంచకుడని చీపురుపల్లి ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం కప్పదాటుడు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. మండలంలోని జి ములగాంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మోసాన్ని రైతులకు,డ్వాక్రా మహిళలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. పార్వతీపురం ఎమ్మార్ నగర్లో... చంద్రబాబు జిమ్మిక్కు లు నమ్మి ప్రజలు ఆయనకు పట్టం కట్టారని పార్వతీపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ అన్నా రు. నరకాసుర వధ కా ర్యక్రమంలో భాగంగా మండలంలోని ఎమ్మార్ నగర్లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన వైఎస్సార్సీపీ
►పూర్తి స్థాయిలో అమలుకు రైతులు, డ్వాక్రా మహిళల డిమాండ్ ►చంద్రబాబు నిర్ణయాలకు నిరసనగా దిష్టిబొమ్మల దహనం ►ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసుల ఓవరాక్షన్ ►తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు : రుణమాఫీపై రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బాబు వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఈ ఆందోళనలు నిలిపివేసేందుకు అటు పోలీసులు, ఇటు టీడీపీ కార్యకర్తలు విఫలయత్నాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ప్రతిపక్ష పార్టీ గొంతునొక్కే ప్రయత్నాలను అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామ కృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు తమ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, ఆయన హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా నిలిచి ఆందోళనను విఫలం చేసేందుకు తమ వంతు సహకారం అందించారు. రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గంలో క్రిస్టినాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించగా, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ నాయకుడు చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. -
రుణంపై మహిళల రణం
►బ్యాంకు అధికారుల తీరుకు నిరసనగా ప్రత్తిపాడులో రాస్తారోకో ►మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు: రుణమాఫీ కోసం మహిళలు రోడ్డెక్కారు. ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాల మాఫీ అని హామీ ఇచ్చి, ఇపుడు కేవలం గ్రూపునకు రూ.లక్ష మాత్రమే అని ప్రకటించడం ఏంటని ఆగ్రహంతో రగిలిపోయారు. ఆంధ్రాబ్యాంకు అధికారుల మాటలతో మరింత ఆందోళనకు గురైన మహిళలు రాస్తారోకో చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం పిడపర్తి మల్లారెడ్డి ఫంక్షన్‌హాలులో గురువారం సాయంత్రం ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు అధికారులు సీబీఆర్‌ఎం(కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజమ్) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఏరియా కోఆర్డినేటర్ పి శివకుమార్, ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ దేవదాసు, ఫీల్డ్ ఆఫీసర్ చందన, మండల సమాఖ్య అధ్యక్షురాలు రత్నకుమారి, ఐకేపీ ఏపీఎం ఫణిబాబులతో పాటు వివిధ గ్రూపులకు చెందిన డ్వాక్రా లీడర్లు, గ్రామ సంఘాల అధ్యక్షులు వందల సంఖ్యలో హాజరయ్యారు. ►బ్యాంకు మేనేజర్ దేవదాసు మాట్లాడుతూ ప్రభుత్వ రుణ హామీ వల్ల మూడు, నాలుగు నెలలుగా బకాయిలు సక్రమంగా చెల్లించలేదని, అందువల్ల పొదుపు మొత్తాలను రుణ బకాయిలుగా జమ చేసుకున్నామని చెప్పారు. దీనిపై మహిళలు ఆగ్రహంవ్యక్తం చేశారు. ►ఓ గ్రూపు లీడర్ తాము రూ.లక్ష లోపు రుణం తీసుకున్నామనీ, రూ. 70వేలు చెల్లించేశామనీ, మిగిలిన సొమ్ము చెల్లించాలా అని ప్రశ్నించగా, అదీ చెల్లించాలనీ, మాఫీ వర్తిస్తే ఇచ్చేస్తామని మేనేజర్ స్పష్టం చేశారు. అలా కట్టకుంటే అదనపు వడ్డీ పడుతుందని చెప్పడంతో డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. ►లక్షలోపు రుణాలు మాఫీ అంటుంటే ఇప్పుడు మీరు కచ్చితంగా కట్టాలనడమేంటని నిలదీశారు. ►స్పందించిన ఫీల్డ్ ఆఫీసర్ చందన అవన్నీ రాజకీయాలని, తీసుకున్న రుణాలను కట్టాల్సిందేననీ,మాఫీ గురించి మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదని తేల్చిచెప్పడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెండున్నర గంటలపాటు రాస్తారోకో ►డ్వాక్రా మహిళలు ప్రత్తిపాడు- పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు బాపతు వెంకటరమణతో పాటు మండల సమాఖ్య అధ్యక్షురాలు రత్నకుమారి, గ్రామ సంఘం అసిస్టెంట్లు, పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికారు. ►ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ రాస్తారోకోను విరమించాలని కోరినప్పటికీ ఫలితం లేకుండాపొయింది. ►బ్యాంకు మేనేజర్ దేవదాసు వచ్చి రుణం కింద జమ చేసుకున్న పొదుపు సొమ్మును వెంటనే తిరిగి ఖాతాలోనికి జమచేస్తామని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చేవరకు ఒత్తిడి చేయబోమని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు. -
డ్వాక్రా మహిళలకు బాబు ఢోకా
సాక్షి, కాకినాడ :రుణమాఫీ అంటూ ఆశపెట్టి, చివరికి శఠగోపం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై డ్వాక్రా మహిళలు మండి పడుతున్నారు. రైతు రుణాలతో పోలిస్తే తమ రుణాలు చిన్నమొత్తాలు కావడంతో కచ్చితంగా మొత్తం మాఫీ చేస్తారని గంపెడాశలు పెట్టుకున్న డ్వాక్రా మహిళలు ఆరేడు నెలల నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. చివరికి రైతులకు కుటుంబం యూనిట్‌గా లక్షన్నర రుణమాఫీతో సరిపెట్టినట్టే డ్వాక్రా సంఘాలకుకూడా లక్ష వరకు మ్యాచింగ్గ్రాంట్ అదీ గరిష్టంగా ఇస్తామని ప్రకటించిన బాబు సర్కార్ మహిళలను హతాశులను చేసింది. రూ.లక్ష లోపు ఎంత రుణముంటే ఆ మేరకే ఆ గ్రాంట్ ఉంటుందని, తామిచ్చేది గ్రాంటే తప్ప రుణమాఫీ కాదని తేల్చేసింది. దీంతో ఈ మొత్తం సంఘాల పొదుపు ఖాతాకే తప్ప రుణఖాతాలకు జమ కాదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్టేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో పలు ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చాయంటున్నారు.జిల్లాలో 74 వేల సంఘాలకు రూ.1343 కోట్ల రుణబకాయిలున్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ప్రకటించడంతో లక్షలోపు రుణాలున్న సంఘాలకే మే లు జరుగుతుందని తేలిపోయింది. ఆ సంఘాలకు కూడా గ్రాంట్‌లో కనీసం 20 నుంచి 30 శాతం వడ్డీకే సరిపోతుందని అంచనా. ఇక లక్షకు పైబడి రుణాలున్న సంఘాల పరిస్థితి మరీ దయనీయం కానుంది. బాబు మాటలు నమ్మి ఆరేడు నెలలుగా వాయిదాలు చెల్లించక ఓపక్క వడ్డీ రాయితీని కోల్పోగా, మరోపక్క వడ్డీతో చెల్లించాల్సిన వాయిదాల మొత్తం తడిసి మోపెడవనుంది. లక్షలోపు రుణాలున్న సంఘాలు 21,970 ఉంటే లక్షకు పైబడినవి 55 వేలకు పైగా ఉన్నాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు రుణాలున్నవి ఐదారు వేలుంటే, రూ.75 వేల వరకు ఉన్నవి మరో నాలుగైదు వేలు. రూ.2 లక్షల వరకు రుణాలున్నవి 12 వేల వరకు, రూ.3 లక్షల వరకు రుణాలున్నవి 10 వేల వరకు, రూ.4 లక్షల వరకు రుణాలున్నవి ఐదువేల వరకు, ఐదులక్షల వరకు రు ణాలున్నవి 30 వేల వరకు ఉన్నాయి. 74 వేల సంఘాలకు కనీసం రూ.740 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెపుతు న్నా.. ఇందులోనూ మెలిక ఉందని, లక్ష లోపు బకాయి ఉన్న సంఘాలకు ఆ బకాయి మొత్తం మాత్రమే గ్రాంట్‌గా ఇస్తారని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సంఘాలకున్న రుణాల్ని బట్టి చూస్తే చేకూరే లబ్ధి రుణంలో సగం కూడా ఉండదంటున్నారు. ఒక్కొక్కరికీ ఒరిగేది అత్యల్పమే.. ఐదులక్షల రుణం తీసుకున్న సంఘం క్రమం తప్పకుండా 14 శాతం వడ్డీతో వాయిదాలు చెల్లిస్తే వడ్డీరాయితీగా వచ్చేది రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. రూ.5 లక్షలు తీసుకున్న సంఘాల్లో పెక్కింటికి ఇంకా రూ.3 లక్ష ల వర కు అప్పు ఉంది. ఈ మొత్తానికి గత ఆరేడు నెలలకు రూ.60 వేలకు పైగా వడ్డీఅవుతుంది. రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్‌లో సగానికిపైగా ఈవడ్డీకే సరిపోతుంది. ఇక సంఘానికి మిగి లేది రూ.40 వేలలోపే. అంటే 10 నుంచి 12 వరకు ఉండే సంఘసభ్యుల్లో ఒక్కొక్కరికీ రూ.4 వేలు కూడా దక్కదన్న మాట. రుణాల కోసం బ్యాంకర్ల ఒత్తిడి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ మెలిక పెట్టడంతో వెంటనే బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని అప్పుడే బ్యాంకులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి. ఆ గ్రాంట్ ఎప్పుడు, ఎలా వేస్తారో స్పష్టత లేనందున ఆ లస్యం చేయకుండా వాయిదాలు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వడ్డీతో సహా వాయిదాల మొ త్తం ఏ విధంగా చెల్లించాలో తెలియక డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతున్నారు. బాబును నమ్మి నిలువునా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు. -
హామీ మేరకే రుణాలు మాఫీ
మంత్రి కొల్లు రవీంద్ర కోనేరుసెంటర్ (సుల్తానగరం) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుల్తానగరంలో రైతులు, డ్వాక్రా మహిళలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి రూ. 1లక్షా50వేలతో పాటు డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల రుణాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నూతన రాజధాని విషయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. 216 జాతీయ రహదారి నాలుగు లైన్లు అభివృద్ధి, మచిలీపట్నం - రేపల్లె రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పోర్టును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రంథాలయ మాజీచైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, గ్రామ సర్పంచి మట్టా వెంకటదాసు, ఎంపీటీసీ మురాల దేవి, మండల పార్టీ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పాల్గొన్నారు. మోడల్‌గా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్... గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు. కోల్డు స్టోరేజి తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం మత్స్యశాఖ, పోర్టు అధికారులు, బోటు యజమానులు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం మత్స్యరంగంలోనే లభిస్తుందన్నారు. హార్బర్లో ఎంపెడా ఆధ్వర్యంలో రూ. 60 లక్షల నిధులతో ఐస్‌ప్లాంట్ ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపెడా అధికారి హనుమంతరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం,బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, మత్స్యశాఖ ఏడి సురేష్, మునిసిపల్‌చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.... డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇవ్వటంతో తాము రుణాలు చెల్లించలేదని అయితే డ్వాక్రాగ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో తమపై అదనపు భారం పడుతోందని పలువురు డ్వాక్రా మహిళలు మంత్రి కొల్లు రవీంద్ర వద్ద వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోకున్నా డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణం రద్దయ్యేలా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు. -
సవాలక్షసందేహాలు
స్పష్టత లేని రుణమాఫీ ప్రకటన రూ.లక్షన్నర మాఫీకి ఆధార్ లింకు అర్హులైన రైతులెవరో తెలియని అధికారులు అయోమయంలో డ్వాక్రా సంఘాలు రుణమాఫీపై ఎట్టకేలకు ప్రభుత్వం నోరు మెదిపింది. రైతుకు రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. రైతులు, డ్వాక్రా సంఘాల్లో మరింత గందరగోళం నెలకొంది. సవా‘లక్ష’ సందేహాలను సృష్టిస్తోంది. త్వరగా మాఫీ చేయకపోతే సీజన్ ముగిసిపోతుంది. కొత్త రుణాలకు దారి మూసుకుపోతుంది. ఇవేవీ స్పష్టం చేయకపోవడమే చంద్రబాబు చాణక్యం. ప్రభుత్వంపై మండిపడుతోంది రైతాంగం. విశాఖ రూరల్: తాంబూలాలిచ్చేసాం.. తన్నుకు చావండన్నట్టుంది ప్రభుత్వ తీరు. రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేసి చేతులు దులిపేసుకుం ది. అందుకు అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాలు విషయాన్ని విస్మరించింది. నిధుల సమీకరిం చా క రుణ మాఫీ జరుగుతుందని చె ప్పిన ప్రభుత్వం ఎప్పట్లోగా అమలవుతుందో చెప్పలేదు. రుణ మాఫీ జరిగితే తప్ప ఖరీఫ్‌కు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాల్లేవు. ఈలోగా సీజన్ ముగిసి పోతుంది. దీనివల్ల రైతు లు మేలు జరగకపోగా మరింత నష్టం జరుగుతుంది. రుణ మాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మినహా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు, విధివిధానాలు రా లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రూ.లక్షన్నరలోపు రుణాలు ఎంతమంది పొందారన్న సమాచారం అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. రుణమాఫీ వల్ల ఎందరికి లబ్ధి చేకూరుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాష్ర్ట స్థాయిలో బ్యాంకర్ల నుంచి తీసుకున్న సమాచారాన్ని కూడా జిల్లా అధికారులకు అందించడం లేదు. దీంతో రుణమాఫీపై వారు నోరు మెదపడం లేదు. అనేక అనుమానాలు రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణాలు, ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో స్పష్టత లేకపోవడంతో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఒకరికా లేదా కుటుంబం మొత్తం మీద రూ.లక్షన్నర వరకు మాఫీ జరుగుతుందా అన్న గందరగోళం నెలకొంది. జిల్లాలో గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి రూ.1040 కోట్ల రుణాలు అందించారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్ల రుణాలు అందజేశారు. గత రబీ సీజన్లో రూ.200 కోట్ల లక్ష్యానికి 14,548 మంది రైతులకు రూ.104 కోట్ల రుణాలు మంజూరు చేశారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్ల వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్ల వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణా మాఫీ మొత్తంగా రూ.1040 కోట్లు కూడా రద్దవుతాయని రైతులు భావించారు. {పస్తుతం రూ.లక్షన్నర అని మెలిక పెట్టి, ఇందుకు ఆధార్ లింక్ పెట్టాలన్న నిర్ణయం ఇబ్బందికరంగా మారే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఎప్పటికి చేస్తారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈలోగా కొత్త రుణాల మాటేమిటో కూడా చెప్పలేదు. ఎర్రచందనం అమ్మకాలు, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు సమీకరించుకొనేలాగా ఖరీఫ్ పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈలోగా కొత్త రుణాలు అందించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. డ్వాక్రా రుణాల పరిస్థితి అంతే జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లున్నాయి. జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు బ్యాంకులకు రూ.593 కోట్లు బకాయి పడ్డాయి. ఇందులో రూ.లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలు రుణాలు చెల్లించలేదు. తాజాగా కేవలం రూ.లక్షలోపు రుణం తీసుకున్న సంఘానికే రుణాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో మిగిలిన సంఘాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రుణాలు చెల్లించని సంఘాలకు నోటీసులు జారీ చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. పాత రుణాలు చెల్లించేంత వరకు కొత్తవి మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాస్తవానికి జూన్ నెలాఖరు నాటికే రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 3 వేల సంఘాలకు రూ.24 కోట్ల రుణాలు అందించారు. రుణాల మాఫీ ఎంత ఆలస్యమైతే మహిళలకు కొత్త రుణాల మంజూరుకు కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. హామీలిచ్చేముందు తెలీదా బకాయిలు చెల్లించి కొత్తరుణాలు తీసుకోవాలని మం త్రులు చెప్పడం విడ్డూరం. పుస్తెలతాడు తాకట్టు పెట్టి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాం. అప్పుల గురించి తెలుసుకోకుండానే చంద్రబాబు హామీ ఇచ్చారా? - రేవడి రాజు, మార్టూరు, అచ్యుతాపురం వైఎస్ చేసి చూపించారు రుణమాఫీ కొత్త విధానమేమీ కాదు. గతంలో వైఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. చంద్రబాబు అన్నమాట ప్రకారం మాఫీ చేయాలి. అంతేతప్ప అప్పు తీర్చేసి కొత్త అప్పులు తీసుకోమనడం సమంజసం కాదు. -ఏడిద మూదయ్య, మార్టూరు, అచ్యుతాపురం -
రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి
శ్రీకాకుళం అర్బన్: రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి తెలపాలని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక దీనిపై పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు సంబంధించి ఒక కుటుంబానికి పంట, బంగారం రుణాలను రూ. లక్షన్నర వరకు, డ్వాక్రా మహిళలకు రూ. లక్ష వరకే రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు షరతులు విధించడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు తమ్మినేని వెంకట చిరంజీవినాగ్, కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ!
డ్వాక్రా రుణాల మాఫీలో మాట తప్పిన చంద్రబాబు మొత్తం రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇప్పుడేమో ఒక్కో సంఘానికి రూ.లక్ష అంటూ షరతు సంఘాలు రూ.1611.03 కోట్ల మేర బ్యాంకులకు బకాయి చంద్రబాబు షరతు వల్ల రూ.310 కోట్లే మాఫీ అవుతాయని అంచనా ఇదో పచ్చిమోసానికి ప్రత్యక్ష సాక్ష్యం..! చంద్రబాబు ‘మార్కు’ మోసానికి నిలువెత్తు నిదర్శనం..! డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేసి, మహిళలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తానంటూ ఎన్నికల్లో ఊరూవాడ చంద్రబాబు ఊదరగొట్టారు. ఆయన మాటలు నమ్మి మహిళలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. సీఎంగా గద్దెనెక్కాక చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు బయటపెట్టారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తానంటూ మెలిక పెట్టారు. దీనివల్ల జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగాను రూ.310 కోట్లకు మించి మాఫీ కావు. ఆ మాఫీ కూడా ఎప్పుడు చేస్తానన్నది స్పష్టం చేయకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడంలో తనను మించిన వాళ్లు లేరని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మరోసారి నిరూపించుకున్నారు. రుణాల మాఫీ కాదు.. ఆడపడుచుల నెత్తిన టోపీ పెట్టారు. ‘డ్వాక్రా మహిళలు కష్టాల్లో ఉన్నారు. ఏ ఒక్కరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు.. నేను సీఎంగా అధికారం చేపట్టగానే మీ రుణాలను మొత్తం మాఫీ చేస్తా’ అంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత సోమవారం చంద్రబాబు ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆ రూ.లక్ష కూడా మాఫీ చేసేందుకు నిధుల సమీకరణకు ఓ కమిటీ వేస్తానని చెప్పడంపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ.ఐదు లక్షల వరకూ రుణాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆర్థిక చేకూర్పు కింద ఒక్కో సంఘం రూ.ఐదు లక్షల చొప్పున 60 శాతం మహిళా సంఘాలు, రూ.4 లక్షల వంతున పది శాతం సంఘాలు, రూ.మూడు లక్షల చొప్పున 12 శాతం సంఘాలు, రూ.రెండు లక్షల చొప్పున ఎనిమిది శాతం సంఘాలు, రూ.లక్ష చొప్పున ఐదు శాతం సంఘాలు, రూ.50 వేల చొప్పున ఐదు శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి. అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. అక్టోబరు 2, 2012న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ‘మీకోసం వస్తున్నా’ పేరుతో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలను మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు ఇదే హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి మహిళలు టీడీపీకి ఓట్లేసి.. అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే నీరుగార్చేలా వ్యవహరించారు. ఒక్క సంతకంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ రుణాల మాఫీ విధి విధానాలను రూపొందించడం కోసం కమిటీ ఏర్పాటుచేసేందుకు సంతకం పెట్టారు. దీనిపై కమిటీ నివేదిక ఏమిచ్చిందన్నది చంద్రబాబుకే ఎరుక. కానీ.. చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు ప్రదర్శించారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామని సోమవారం ప్రకటించారు. ఆ రుణమాఫీకి అయ్యే నిధుల సమీకరణ కోసం మరో కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అంటే.. ఆ రూ.లక్ష కూడా ఎప్పుడు మాఫీ చేస్తారన్నది స్పష్టంగా చెప్పలేదు. పొదుపు మొత్తం నుంచి జమ! ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచే సభ్యులకు తెలియకుండానే బ్యాంకర్లు కంతుల కింద జమ చేసుకుంటున్నారు. గుర్రంకొండ, వి.కోట, శాంతిపురం, పాలసముద్రం, ఏర్పేడు తదితర మండలాల్లో అధికశాతం బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను అధికారులు వసూలు చేశారు. చాప కింద నీరులా బ్యాంకర్లు రుణాల వసూళ్లకు దిగడంతో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు తగ్గిపోయింది. సీఐఎఫ్ నిధి నుంచి బ్యాంకర్లు అప్పుగా మినహాయించుకున్న రూ.96 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న అంశంపై చంద్రబాబు స్పందించకపోవడం కొసమెరుపు. మాఫీ అయ్యేదిరూ.310 కోట్లే.. ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామన్న చంద్రబాబు ప్రకటన మేరకు జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.310 కోట్లకు మించి మాఫీ కావని ఇందిరాక్రాంతిపథం(ఐకేపీ) అధికారులే స్పష్టీకరిస్తున్నారు. తక్కిన రుణం ఆ మహిళా సంఘం సభ్యులు చెల్లించాల్సిందే. రూ.లక్షలోపు రుణం తీసుకున్న సంఘాలకు మాత్రమే పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తిస్తుందన్నమాట..! గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టడంతో మహిళలు మండిపడుతున్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. బయటపడిన బాబు నైజం చంద్రబాబు ఏనాడు కూడా రైతులు మేలు చేసిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ఎంత రుణం ఉన్నా మాఫీ చేస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. గెలిచాక మాటమార్చి కుటుంబానికి ఒకటిన్నర లక్ష మాత్రమే రుణమాఫీ అని చేతులెత్తేశారు. మిగిలిన అప్పులు ఎవరు తీరుస్తారు. రైతు నోట్లో మట్టి కొట్టారు. అసలే కరువు కోరల్లో ఉన్నాం. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలి. లేదంటే చంద్రబాబు చరిత్ర హీనుడే. -ఎస్ గంగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం జనం చెవిలో పువ్వు పెట్టాడు సీఎం స్థానంలో ఉన్న వారు ఇలా మాటతప్పడం సరికాదు. రుణాలు మాఫీ చేస్తున్నాం..పండగ చేసుకోవచ్చని కోతలు కోశారు. సీఎం కుర్చీ కోసం రుణమాఫీ డ్రామా ఆడారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని అందరి చెవిలో పువ్వు పెట్టారు. రుణమాఫీ చేస్తానని దగా చేసిన బాబు క్షమాపణలు చెప్పాలి. సీఎంగా వెంటనే తప్పుకోవాలి. లేదంటే అణాపైసలతో సహా రుణమాఫీ చేయాలి. -ఎం నాతాను రెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం సీఎంగా పనికిరాడు డ్యాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చని చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఆడోళ్ల ఉసురు తగులుతుం ది. గ్రూపునకు లక్ష మాత్రమే ఎలా మాఫీ చేస్తారు. ఓట్లు వేసిన వారిని నట్టేట ముంచారు. ప్రతి గ్రూపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పులున్నాయి. లక్ష చేస్తే ఏమూలకు సరిపోతుంది. చంద్రబాబు నిర్వాకంతో డ్వాక్రా గ్రూపు సభ్యుల ఆశలు నీరుగారాయి. అన్ని డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పారు. చేతకానప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలి. - చంద్రకళ , వసంత గ్రూపు లీడర్, కురబలకోట మండలం ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి ఎన్నికల సమయంలో ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే రైతులను మోసం చేశారు. రెతుకు రుణమాఫీ రూ. 1.50 లక్షలు మాత్రమే చేస్తానని ప్రకటించారు. మొత్తం రుణమాఫీ చేస్తాడని ఆశపడిన రైతులకు మొండిచెయ్యి చూపారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో మొత్తం రుణమాఫీ చేస్తానని ప్రకటించారని తేలిపోయింది. -వెంకటమల్లయ్య, చెరువుకిందపల్లె, పెద్దమండ్యం మండలం మాఫీ పేరుతో మోసం అధికారంలోకి రాగానే మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారు. మాది మాషాఅల్లా స్వయం సహాయక సంఘం. సంఘంలో 9 మంది సభ్యులున్నాం. రుణం రూ. 2.35 లక్షలు తీసుకున్నాం. రుణ బాధ తీరిపోతుందని అనుకుంటే ఇపుడు ప్రతి సంఘానికి కేవలం రూ.లక్ష వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం మోసమే. -సంతోషి, మాషా అల్లా సంఘం సభ్యురాలు, పెద్దమండ్యం మహిళలే తిరగబడతారు చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలు ఇప్పటి నుంచే కట్టవద్దని ప్రచార సభల్లో చెప్పారు. ఆయన మాటలు నమ్మి మహిళలందరూ ఆశతో ఓట్లు వేశారు. ఇప్పడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తానంటున్నారు. పూర్తిగా మాఫీ చేయకుంటే మహిళలు టీడీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయి. -రాజకుమారి,కార్తికేయపురం, పెనుమూరు మండలం -
రుణాలెప్పుడు రద్దుచేస్తారు..?
నెల్లూరులో సీఎం చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు నెల్లూరు: డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని తెలుగింటి ఆడపడుచులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీశారు. ముఖ్యమంత్రిగా తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతుండగా డ్వాక్రా మహిళలు అడ్డుకుని, రుణాలను ఎప్పుడు రద్దుచేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సమాధానం దాటవేశారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రంలో జరిగింది. నెల్లూరులో శనివారం సాయంత్రం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబునాయుడు ప్రారంభించగా, ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని మహిళలు నిలదీశారు. తప్పకుండా తల్లీ ఆలోచిస్తున్నా.. తొందరలో నిర్ణయం తీసుకుంటానంటూ సీఎం సమాధానం చెప్పారు. వెంకయ్యా అంతా నీదే భారం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులను తీసుకు ని వచ్చే బాధ్యత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై పెట్టా రు. విభజన తర్వాత రావాల్సిన నిధులు, అభివృద్ధికి నిధులు, హడ్కో నిధులు అన్నీ వెంకయ్య తీసుకుని రావాలన్నారు. -
‘గాలి’ నాటకం!
సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు గాలి ముద్దుకృష్ణమ ఎత్తుగడ డ్వాక్రా మహిళలను ప్రసన్నం చేసుకునే యత్నం మభ్య పెడుతున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు పుత్తూరులో మహిళా సమాఖ్య సమావేశాలు పుత్తూరు : డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న పొంతనలేని ప్రకటనలపై వ్యతిరేకత వస్తుందనే ముందస్తు ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీ పక్షాలు కొత్త నాటకానికి తెరలేపాయి. అధికార పక్షం ఉన్న మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్నఫలంగా డ్వాక్రాగ్రూపు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరినీ ఒకే వేదికపైకి రప్పిస్తే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించి సమాఖ్యల వారీగా ఆయా ప్రాంతాల్లోనే సమావేశపరుస్తున్నారు. పెపైచ్చు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు అతి తెలివిని ప్రదర్శిస్తూ మాయ మాటలతో రుణ మాఫీ విషయాన్ని మభ్య పెట్టే పనిని కార్యక్రమంగా చేపట్టారు. సమావేశాలకు హాజరుకాకపోతే మున్ముందు సమాఖ్య ప్రతినిధులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని గ్రహించి వెళ్లాల్సి వస్తోందని పలువురు మహిళల వాదన. నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచనలతో పుత్తూరు మున్సిపల్ పరిధిలో డ్వాక్రా గ్రూపుల సమావేశాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిలో ఉందనే వాదన వినిపిస్తోంది. దీనిని అధిగమించి సీఎం దృష్టిని ఆకర్షించే యత్నంలో ఆయన వేసిన ఎత్తుగడలో భాగమే డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశాల నిర్వహణ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుత్తూరు మున్సిపల్ పరిధిలో 862 డ్వాక్రా గ్రూపుల్లో 8620 మంది సభ్యులు ఉన్నారు. 24 వార్డులకు 42 సమాఖ్యలు కాగా ఒక్కొక్క సమాఖ్య నేతృత్వంలో 15 నుంచి 20 గ్రూపులు ఉన్నాయి. వీరికి 2013-14 ఆర్థిక సంవత్సానికి బ్యాంకు లింకేజి కింద రూ.11 కోట్ల రుణాలు అందించారు. ఒక్కొక్క గ్రూపునకు 1 నుంచి 5 లక్షల మేరకు రుణ మంజూరు చేశారు. అయితే ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని హామీతో బ్యాంకులకు నెలసరి కంతులు కట్టడం మానేశారు. ప్రస్తుతం రుణమాఫీపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మహిళల్లో వ్యతిరేకత రాకుండా చేసేందుకు నేరుగా మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే శుక్రవారం పుత్తూరు మున్సిపల్ పరిధిలోని 13, 14, 24 వార్డుల్లో మహిళా సమాఖ్య సమావేశాలు నిర్వహించారు. కాగా 14 వార్డులో నిర్వహించిన సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధి తనయుడు హాజరయ్యారు. రుణమాఫీ త్వరలో చేస్తారని ముందుగా రైతురుణ మాఫీకి ప్రాధాన్యత ఇస్తున్నారని తరువాత డ్వాక్రా మహిళలకు అంటున్న దశలో ఓ మహిళ ప్రశ్నిస్తూ ‘ఎప్పుడనేది తేదీ చెప్పకుండా తరువాతంటూ ఎప్పటికయ్యా..? ఇప్పటికే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది’ అని నిలదీయడంతో ఆమెకు సర్దిచెప్పారు. నిబంధనల మేరకు సమాఖ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు కావాలి. అయితే మాజీ ప్రజా ప్రతినిధి తనయుడిని ఏ హోదాలో ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
‘అప్పు’డలా... ఇప్పుడిలా
రుణమాఫీపై చంద్రబాబు రోజుకోమాట బ్యాంకు నోటీసులతో రైతుల ఆందోళన కొత్త రుణాలివ్వకపోతే ఖరీఫ్ పెట్టుబడులెలా ఉద్యమ బాటలో రైతు, డ్వాక్రా సంఘాలు చోడవరం: ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’... అన్నట్టుంది తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి. ఎన్నికల ముందు అధికారం కోసం అమలు కాని హామీలు ప్రకటించింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ బకాయిలు చెల్లించవద్దని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. అప్పును సజావుగా చెల్లించే రైతులు ఏడాదిగా రుణాలు చెల్లించడం మానేశారు. డ్వాక్రా సభ్యులు రుణవాయిదాల చెల్లింపును నిలిపివేశారు. తీరా అధికారంలోకి వచ్చాక టీడీపీ రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతోంది. రైతులు, డ్వాక్రా మహిళల్లో అయోమయం నెలకొంది. కాలయాపన చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉద్యమాలతో నిరసన గళం వినిపిస్తున్నారు. బ్యాంకు ఒత్తిడి చేస్తోంది వ్యవసాయ పెట్టుబడుల కోసం తుమ్మపాల యూనియన్ బ్యాం క్లో రూ.లక్ష రుణం తెచ్చాను. పంట సరిగ్గా పండక చాలా ఇబ్బందులు పడ్డాను. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమీ మాట్లాడటం లేదు. అప్పు తీర్చమని బ్యాంక్ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. - గొంప దేముడునాయుడు, రామచంద్రపురం, కె.కోటపాడు చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి చంద్రబాబు మాటలు విని అప్పు చెల్లించలేదు. నాకు ఎకరన్నర పొలం ఉంది. వరి, చెరకు పంటలు వేస్తున్నాను. వ్యవసాయ పెట్టుబడుల కోసం తుమ్మపాల యూని యన్ బ్యాంక్‌లో రూ.50 వేల రుణం తీసుకున్నాను. అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసిచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. - కిల్లి సోమినాయుడు, సింగన్నదొరపాలెం, కె.కోటపాడు వ్యవసాయం కష్టంగా ఉంది వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారింది. రెండేళ్లుగా కరువు వస్తుండటంతో పెట్టుబడులు రావడం లేదు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏమీ చెప్పడం లేదు. హామీ మేరకు అన్ని వ్యవసాయ రుణాలు మాఫీచేయాలి. - పెదిరెడ్ల మల్లునాయుడు, కొండపాలెం, బుచ్చెయ్యపేట మాఫీ చేయకపోతే ఆందోళన చేస్తాం వ్యవసాయ పెట్టుబడుల కోసం గత ఏడాది బుచ్చెయ్యపేట ఐఓబి బ్యాంక్‌లో బంగారంపై రూ.20 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే ఆందోళన దిగుతాం. - గరికి అర్జున, పెదమదీన, బుచ్చెయ్యపేట మాఫీ చేస్తారని రుణం చెల్లించలేదు రెండేళ్ల కిందట మా డ్వాక్రా సంఘం తరపున రూ.3 లక్షలు బుచ్చెయ్యపేట ఐఓబి బ్యాంక్‌లో డ్వాక్రా రుణం తీసుకున్నాం. చంద్రబాబు హామీతో మూడు నెలలుగా అప్పు వాయిదాలు కట్టడం మానేశాం. - కోనపల్లి రాజు, డ్వాక్రాగ్రూపు అధ్యక్షురాలు, కొండపాలెం, బుచ్చెయ్యపేట రుణం ఎలా తీర్చాలో తెలియడం లేదు తెలుగుతల్లి డ్వాక్రా సంఘం పేరున 2013 డిసెంబరులో యూనియన్ బ్యాంక్‌లో రూ.3 లక్షల రుణం తీసుకున్నాం. వాయిదాలు చెల్లించాలని బ్యాంక్ ఒత్తిడి తెస్తోంది. - వంటాకు సుశీల, డ్వాక్రా మహిళ, లక్కవరం బ్యాంకు నోటీసులిచ్చింది నాకు ఎకరన్నర భూమి ఉంది. గత ఏడాది జన్నవరం సహకార బ్యాంక్‌లో రూ.20 వేలు, విజయరామరాజుపేట గ్రామీణ బ్యాంకులో రూ.20 వేలు రుణం తీసుకున్నాను. అప్పు తీర్చమని గ్రామీణ బ్యాంక్ నోటీసు ఇచ్చింది. - మంగ అప్పలనాయుడు, గౌరీపట్నం, చోడవరం ఖరీఫ్ పెట్టుబడికి డబ్బుల్లేవు వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం నాన్చడం వల్ల చా లా ఇబ్బంది పడుతున్నాం. ఏడాది కిందట లక్కవరం సహకార బ్యాంక్‌లో రూ.50 వేల రుణం తీసుకున్నాం. ఖరీఫ్ పెట్టుబడులకు డబ్బుల్లేవు. వెంటనే మాఫీ చే యాలి. - జెర్రిపోతుల అప్పారావు, లక్కవరం, చోడవరం -
కంగుతిన్న చంద్రబాబు
ఏలూరు: బెల్ట్ షాపులు మూయించడని పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఈ రోజు జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలు విజ్ఞప్తి చేశారు. బెల్ట్ షాపులు ఉన్నాయా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఉన్నాయని మహిళలు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఎక్సైజ్‌శాఖ పనితీరు బాగాలేదని ఆగ్రహిం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలమాఫీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. డబ్బులు కట్టినా, కట్టకపోయినా న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీపై మాట తప్పేది లేదని చెప్పారు. టిడిపి అధికారంలోకి రావడానికి మహిళా చైతన్యమే కారణం అన్నారు. విభజన ద్యారా వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. నూతన రాజధాని నిర్మాణానికి డ్వాక్రా సంఘాల మహిళలు 62 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. -
జంగారెడ్డిగూడెంలో చంద్రబాబుకు చేదు అనుభవం!
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం-కొయ్యలగూడెం రోడ్‌షోలో చోటు చేసుకుంది. రైతు రుణమాఫీ వ్యవహారంపై సీఎం చంద్రబాబును రైతులు నిలదీశారు. రైతుల ప్రశ్నలకు కంగుతిన్న చంద్రబాబు పలు సమాధానాలతో దాట వేసేందుకు ప్రయత్నించారు. కేవలం రైతుల నుంచే కాకుండా డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు చంద్రబాబును నిలదీశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు తీరుపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో చర్చిస్తాం
బూర్గంపాడు: డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో చర్చిస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గం పాడు ఐకేపీ కార్యాలయంలో గురువారం బ్యాంక్ లింకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... మహిళా సంఘాల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, రుణ మాఫీ కోసం ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అమలుచేసిన పావలా వడ్డీ రుణాలు, అభయ హస్తం తదితర పథకాలు ఎంతో మేలు చేశాయని అన్నారు. వైఎస్ హయాంలో ఆర్థికంగా బలోపేతమైన మహిళా సంఘాలు.. ఆ తరువాత వచ్చిన పాలకుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు లేకపోవటంతో మహిళలు రుణాలు చెల్లించలేకపోతున్నారని అన్నారు. రైతులతోపాటు డ్వాక్రా రుణాల మాఫీకి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిలా పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. అనంతరం, 50 మహిళా సంఘాలకు 1.70 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీని అందజేశారు. నిరుపేద మహిళల ఉన్నతి కోసం వ్యక్తిగత రుణాల చెక్కులను కూడా ఇచ్చారు. సుస్థిర వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు వ్యవసాయ యాంత్రీకరణ సామాగ్రి అందజేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఐకేపీ కార్యాలయానికి వచ్చిన పాయం వెంకటేశ్వర్లుకు మహిళాసంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహాశీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీఓ లెనినా, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, ఏపీఎం వినోద్ క్రాంతి, ఎస్బీహెచ్ మేనేజర్ సంజీవ్‌కుమార్ నాయక్‌పాల్గొన్నారు. -
సాక్షి కార్టూన్ (11-07-2014)
...రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని అత్యాశకు పోకండి -
కదంతొక్కిన మహిళా లోకం..
డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి - మద్య నిషేధం విధించి, మహిళలకు రక్షణ కల్పించాలి - రుణ మాఫీపై ఖానాపూర్‌లో కదంతొక్కిన మహిళలు ఖానాపూర్ : వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పుడు అధిక వడ్డీ వేసి రుణాలు బలవంతంగా వసూలు చేస్తున్నారని, డ్వాక్రా రుణాలు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మహిళలు కదంతొక్కారు. భారీ ఎత్తున ఆందోళన శనివారం మండల కేంద్రంలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ తీశారు. తదుపరి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళా గ్రూప్‌కు రూ.10 లక్షల రుణాలు ఇవ్వాల్సింది పోయి.. 2012 నుంచి వడ్డీ మాఫీ అని చెప్పి ఇప్పుడు వాటిపై వడ్డీ వేసి నోటీసులు ఇస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేసి.. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అనేక గ్రూపులకు స్థానిక ఎస్బీహెచ్, ఎస్బీఐ అధికారులు నోటీసులు పంపారని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళ రుణాన్ని కూడా మాఫీ చేయాలని కోరారు. రుణాల వసూళ్ల పేరిట ఒత్తిడి చేస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో మద్య నిషేధం విధించి.. రక్షణ కల్పించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రాజేశ్వరికి అందించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మి, ఎం.జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఎ.మంగ, కోశాధికారి నంది సమత, సహాయ కార్యదర్శి ఎం.హరిత, నాయకులు జక్కుల గంగామణి, నర్ర ఎంకుబాయి, రాజవ్వ, పద్మ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న, నారాయణ, ఎల్ఆర్ ఉపాలి, విజయ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు మాఫీ చేయాలి
డ్వాక్రా సంఘాల సభ్యుల రాస్తారోకో రెబ్బెన : తాము గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డ్వాక్రా సంఘాల మహిళలంతా మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి ఆందోళనలో పాల్గొని సభ్యులనుద్దేశించి మాట్లాడారు. రైతుల పంటరుణాల మాఫీ నేపథ్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న డ్వాక్రా సంఘాల సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో రైతులతోపాటు మహిళలు సైతం ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితి పెంచే బదులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తే సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే మహిళలందరూ రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, డ్వాక్రా సంఘాల సభ్యులు అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కోటయ్య నేతృత్వంలో ‘రుణమాఫీ’ కమిటీ
కన్వీనర్‌గా ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీపై విధివిధానాలు రూపొందించడానికి నాబార్డు మాజీ చైర్మన్ పి.కోటయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం సిద్ధమైన జీవో గురువారం బయటకొచ్చింది. ఖరీఫ్ రుణాల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నియామకమైన తేదీ నుంచి రెండు వారాల్లో ఈ కమిటీ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. తుది నివేదికను 45 రోజుల్లో సమర్పించాలి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఎస్ రావు, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎ.ఎల్ నాగేశ్వరరావు, ఆర్థికరంగ విశ్లేషకుడు సి.కుటుంబరావు, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్) దీనికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ పంట రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితర రుణాల మాఫీపై ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కమిటీ విధివిధానాలను కూడా అందులో స్పష్టం చేశారు. ఇవీ విధివిధానాలు - పంట రుణాలు, డ్వాక్రా రుణాల రద్దుకు సంబంధించి సరైన ప్రతిపాదనలివ్వాలి. - మహిళలు పంటల సాగుకోసం బంగారం కుదవ పెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయో తెలపాలి. - అర్హులైన వారికి ఈ రుణమాఫీని అమలు చేయడానికి అవసరమైన విధానాలు సూచించాలి - ఈ ప్రతిపాదనల అమలుకు అవసరమైన నిధులు ఎలా సమీకరించాలో సూచించాలి. - కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వడ్డీ మాఫీ పథకం రుణమాఫీ పథకానికి ఎలా ఉపకరిస్తుందో అధ్యయనం చేయాలి - నివేదిక తయారీకి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదించాలి. -
టీడీపీ డొల్ల.. నాయకులకు వల
గ్రామస్థారుు నేతలకు వెల కడుతున్న పచ్చపార్టీ డ్వాక్రా గ్రూపులకూ నోట్ల ఎర ఓట్ల కోసం నీచ రాజకీయాలు సాక్షి, ఏలూరు: గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి నేతల వరకూ ప్రతి ఒక్కరినీ ప్రలోభాలకు గురి చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఓటర్లు తమను పట్టించుకోకపోవడంతో బేజారెత్తిపోతున్న ఆ పార్టీ అభ్యర్థులు గ్రామీణ నేతలకు వెలకడుతున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేటు నిర్ణయించి మరీ సాగిస్తున్న కొనుగోళ్ల పర్వం ప్రజాస్వామ్య వ్యవస్థపై టీడీపీకి గల గౌరవానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పచ్చ పార్టీ నీచ రాజకీయాలను, ఆ పార్టీకి అమ్ముడుపోతున్న నాయకులను జనం అసహ్యించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం రోజురోజుకు అధికమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ వైపు రౌడీయిజం చేస్తూనే.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరోవైపు సొమ్ములు వెదజల్లి ఓట్లు కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది చాలదన్నట్టు ద్వితీయ శ్రేణి నాయకులకు గాలమేస్తున్నారు. గరిష్టంగా ఒక్కొక్క నాయకుడికి రూ.2 లక్షల వరకూ చెల్లించి తమవైపు తిప్పుకుంటున్నారు. అలా వచ్చిన వారితో పోలింగ్ బూత్‌స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీలు తమ ప్రాంతంలోని వారికి రోజంతా తాగినంత మద్యం, ఉదయం అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ తిన్నంత తిండి వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం డబ్బు, మద్యం, బిర్యానీతోనే ఓట్లు రాలతాయనే పిచ్చి భ్రమలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ముందే మొదలు పోలింగ్ ముందురోజు రాత్రి డబ్బులు పంచడం అనేది గతం నుంచీ వస్తున్న ఆనవాయితీ. ఈ ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని కొంచెం సడలించారు. అధికారుల నిఘా ఎక్కువగా ఉండటంతో పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగు రోజులు ముందునుంచే పంపిణీలు ప్రారంభించారు. సాధారణ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పది రోజులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. తొలివిడతగా డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు సొమ్ములు ఆశ చూపిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికంటూ పిలిపించి గ్రూపునకు ఇంత అంటూ సొమ్ము ముట్టజెబుతోంది. రెండురోజుల క్రితం ఏలూరు నియోజకవర్గంలో ఈ తంతు నడిచింది. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో ప్రలోభాలు నడుస్తున్నారుు. వీటిని అదుపు చేయడానికి అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా టీడీపీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అయి తే, చక్రాలూడిన ‘సైకిల్’ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలదని, తాత్కాలిక ప్రలోభాల కంటే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే నేతకే ఓటేస్తామని జనం చెబుతున్నారు. -
బాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్ జగన్
* ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదు: వైఎస్ జగన్ సొంతమామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం కొత్తేంకాదు. ఇంతవరకు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ చాలా హామీలిస్తున్నారు. చంద్రబాబు హామీలను చూసి చాలామంది నన్నుకూడా హామీలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. కానీ నేను బాబులా అబద్ధాలు ఆడలేను. అన్యాయమైన రాజకీయాలు చేయలేను. ఆయన వయసు 65 ఏళ్లు. ఆయనకివే చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. నేను ఆయనకంటే పాతికేళ్లు చిన్నవాడిని. విశ్వసనీయత అనే పదానికి నేను ఆయనలా పాతర వేయలేను. మహానేత వైఎస్ నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేదైనా ఉంది అంటే అది విశ్వసనీయతే. మాట కోసం ఎందాకైనా వెళతా. - వైఎస్ జగన్ సాక్షి, నర్సీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదని, ఆయన ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని, కొత్తగా ఆల్ ఫ్రీ అంటూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా అంటున్నారు. కానీ బాబు ఈ మాట అంటుంటే ఇంతకన్నా అన్యాయం లేదనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే ఒకపక్క అన్యాయం అని అంటూనే, ఇంకోపక్క రాష్ట్రాన్ని విడగొట్టడానికి పార్లమెంట్లో ఎంపీలతో ఓట్లు వేయించారు. ఒకవైపు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి, ఇంకోవైపు విభజనలో భాగస్వాములయ్యారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామంటున్నారు. బాబు తీరు ఎలా ఉందంటే ఒక వ్యక్తిని తానే చంపి తిరిగి చనిపోయిన వ్యక్తికి నేనే దండవేస్తానని పరిగెత్తినట్టుంది. ఒకమనిషిని చంపి దండ వేయడమనేది ఆయనకు కొత్తేం కాదు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయన ఫొటో బయటకు తీసి దానికి దండేస్తుంటారు’’ అని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తునిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం విశాఖ జిల్లా నర్సీపట్నంలో సభలో పాల్గొన్నారు. సభకు హాజరైన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనకాపల్లి లోక్‌సభకు పార్టీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్, నర్శీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేశ్ పోటీ చేస్తారని ప్రకటించారు. సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. పట్టపగలే మోసం చేస్తున్నారు.. ఇవాళ రైతులకు రుణమాఫీ అంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దుచేస్తామంటున్నారు. ఉచితంగా సెల్ఫోన్లు, టీవీలు.. ఇలా అన్నీ ఆల్‌ఫ్రీ అంటున్నారు. ఇవాళ నేను ఒకటి చెబుతున్నా.. రైతులకు రుణ మాఫీ చేయాలంటే రూ.1.27 లక్షల కోట్లు అవసరం. డ్వాక్రా రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు కావాలి. ఈ రెండు కలిపితే రూ.1.47 లక్షల కోట్లు. కానీ ఇవాళ బడ్జెట్లో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు. కానీ బడ్జెట్‌ను మించిపోయి రూ.1.47 లక్షల కోట్ల రుణాలను బాబు ఎలా మాఫీ చేస్తారు? 2008లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది. వీటిని 28 రాష్ట్రాలకు పంచితే మన రాష్ట్రానికి వచ్చేసరికి రూ.12వేల కోట్లు మాఫీ అయింది. మనకంటే పదిరెట్లు ఎక్కువ ఆదాయం ఉన్న కేంద్రప్రభుత్వమే రాష్ట్రానికి రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తే చంద్రబాబు ఏకంగా అధికారంలోకి వస్తే రూ.1.47 లక్షల కోట్లు మాఫీ చేస్తారని పట్టపగలు మోసం చేస్తున్నారు. ఐదేళ్లలో అన్ని కోట్ల ఉద్యోగాలెలా ఇస్తారు? ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడతారు. ఆయనలో ఏ మార్పులేదు. నోటికి ఏ హామీ వస్తే అది గుడ్డిగా ఇచ్చేస్తారు. ఆయన ప్రజలను ఎంతగా వంచన చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో బాబు ఇంకో హామీ ఇచ్చారు. ఇంటింటికీఉద్యోగం ఇస్తానంటున్నారు. ఇవాళ చంద్రబాబును అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అలాంటప్పుడు ఇంటికొక ఉద్యోగం ఎలా ఇస్తారు? 60ఏళ్ల స్వాతంత్య్రంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 20లక్షల ఉద్యోగాలిస్తే ఐదేళ్లలో 3 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలకు ఉద్యోగాలెలా ఇస్తారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉండగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి 21వేల మంది ఉద్యోగులను బజారులో నిలబెట్టారు. ఏడాదికి 10 లక్షల ఇళ్లు నిర్మిస్తా.. నేను ముఖ్యమంత్రి అయ్యాక అయిదు సంతకాలు చేస్తా. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయి. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతాను. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తా. విద్యావంతులను చేస్తా. అంతేకాదు.. ప్రతి స్కూల్లో ఇంగ్లీషుమీడియం పెట్టిస్తా. రెండోసంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తా. మూడో సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. నాలుగో సంతకంగా.. అక్కా చెల్లెళ్లకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలను కిందామీదాపడి ఏదోలా మాఫీచేస్తాను. రేషన్ కార్డుల కోసం సామాన్య ప్రజలు కాళ్లరిగేలా తిరగనక్కర్లేకుండా మీ గ్రామం, మీ వార్డులోనే ఆఫీసు తెరుస్తా. 24 గంటల్లో ఏ కార్డు అయినా సరే ఇచ్చేందుకు ఐదో సంతకం చేస్తాను. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తా. అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తా. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈరోజు రాష్ట్రంలో వ్యాధులకు ఆపరేషన్ చేయించుకోవాలంటే హైదరాబాద్ తప్ప వేరే దిక్కులేని పరిస్థితి. ఈ పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తా. హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని అభివృద్ధి చేస్తా. అక్కడే 17 నుంచి 20వరకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం. ఆ తర్వాత సంతకం విద్యుత్ సమస్యలు తీర్చడానికి చేస్తా. 2019నాటికి రాష్ట్రంలో కరెంటు కోతలే లేకుండా చేస్తా. పగలు ఏడు గంటలు కచ్చితంగా వ్యవసాయానికి విద్యుత్ అందిస్తా. అధికారంలోకి వచ్చాక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ తీర్చిదిద్దుతాం. ఇందులో అనేక కంపెనీలు ఏర్పాటుచేస్తాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా చేస్తాను. నాలుగేళ్లుగా ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడ్డా. నా పిల్లాడిగా మీ పిల్లల అభివృద్ధికి కష్టపడతా.’’ తూర్పులో.. 9 రోజులు 375 కిలోమీటర్లు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మునిసిపాలిటీలు, మూడు నగరపంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ నెల 17 నుంచి మంగళవారం వరకు 9 రోజుల్లో సుమారు 375 కిలోమీటర్ల మేర పర్యటించారు. రోడ్ షో నిర్వహిస్తూ వాడవాడలా ప్రజలను కలిశారు. -
పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మండల, గ్రామ స్థాయి అధికారులపై ఉందని గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ఫ్) సీఈఓ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా షెడ్యూల్డు కులాలు, సహకార సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. అధికారుల లోపంతో కొన్ని స్కీంలు పెదవారికి సక్రమం గా అందడం లేదన్నారు. రాష్ట్రంలో 1.17 కోట్ల మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉండగా, వారికి రూ.60వేల కోట్లు రుణాలుగా ఇచ్చామని, ఎలాం టి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా ఇస్తు న్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని సూచించా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకుంటే పేదరిక నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. పెద్దముప్పారంలో ఐకే పీ సిబ్బంది పనితీరు బాగోలేదని, సంఘాల తో ప్రతీవారం సమావేశం ఎర్పాటు చేసి సక్రమంగా రుణాలు జమచేసి, డి-గ్రేడ్‌లో ఉన్న సంఘాలను ఎ-గ్రేడ్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ద్వారానే మహిళలకు సమాజంలో గుర్తింపు వచ్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ ఎండీ బి.జయరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి, క్రమశిక్షణ, తపన, కృషి, పట్టుదల ఉంటే మహిళలు అన్ని రంగాలలో రాణించవచ్చని పేర్కొన్నారు. గ్రా మంలో ఎస్బీఐతోపాటు స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులు సెర్ఫ్ సీఈఓను కొరారు. అడిషనల్ జేసీ సం జీవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ కిషన్, డీఆర్డీఏ పీడీ విజయగొపాల్, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆర్డీఓ మధుసూదన్నాయ క్, తహసీల్దార్ బత్తుల సుమతి, ఎంపీడీఓ అశోక్‌కుమార్, సీడీపీఓ ధనమ్మ, గ్రామ సర్పంచ్ వెలుగు ఉపేందర్, ఉప సర్పంచ్ నుగునూతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకంలో స్వామి వారికి ధ్వజారోహణం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ధ్వజారోహాణం కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు హంస వాహనంపై గ్రామ పుర వీధుల్లో ఉరేగనున్నారు. కాణిపాకం వరసిద్ధ వినాయకుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాణిపాకం చేరుకున్నారు. భక్తుల కోసం కాణిపాకం ఆలయ ఉన్నతాధికారులు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లు స్వాహా
ఖమ్మం: డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లను స్వాహా చేసిన ఘటన జిల్లాలోని మణుగురు, పినపాక మండలాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. తమకు రావాల్సిన స్కాలర్షిప్లను కాజేసారని కొందరు మహిళలు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సిబ్బంది చేతివాటం ప్రదర్శించి స్కాలర్షిప్లను స్వాహా చేసారని మహిళలు ఆరోపిస్తున్నారు. మణుగూరు, పినపాక మండలాల్లో డ్వాక్రా పథకం కింద మహిళలు రావాల్సిన స్కాలర్షిప్లు రాకపోవడంతో ఆరాతీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సిబ్బందే కాజేసినట్లు ఆధారాలు లభించడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. . -
డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
నాతవరం, న్యూస్‌లైన్ : డ్వాక్రా సభ్యులను మోసగించి వారి సొత్తును ఓ ఉద్యోగి స్వాహా చేసిన ఉదంతం అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమను నమ్మించి రూ.లక్షలు స్వాహా చేసిన సీఏ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని శ్రీనందేశ్వర గ్రామైక్య సంఘం సభ్యులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఏ స్వాహా చేసిన సొమ్ముపై విచారణ జరపాలని వారం రోజుల క్రితం డ్వాక్రా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మూడు రోజులుగా సీసీ నాగ్వేరరావు విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏపీఎం శివప్రసాద్ సోమవారం గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండలంలో గన్నవరం పంచాయతీ శివారు వై.బి.పట్నంలో 29 డ్వాక్రా సంఘాలున్నాయి. ఇక్కడ సీఏగా పనిచేస్తున్న టి.అప్పారావు ఓబీలు, డ్వాక్రా సంఘాల సభ్యులను తప్పుదోవ పట్టించి స్త్రీనిధి పథకం ద్వారా సభ్యులకు మంజూరైన మొత్తం సొమ్ములో సుమారు రూ. 2 లక్షలు స్వాహా చేశారని ఏపీఎం శివప్రసాద్, సీసీ నాగేశ్వరరావుకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామంలో స్త్రీనిధి పథకం ద్వారా వివిధ గ్రూపులకు నిధులు విడుదల చేసినట్టు రికార్డుల్లో ఉన్న విషయాన్ని వారు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవంగా రికార్డుల్లో ఉన్నదానికి, సభ్యులకు ఇచ్చిన దానికి పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఈ సభ్యులకు మే నెలలో సుమారు రూ.7.75 లక్షల రుణాలు ఇచ్చినట్టు చూపించి సభ్యులకు ఆ మొత్తాన్ని ఇవ్వకుండా స్వాహా చేసినట్టు వారు ఆరోపించారు. కొం దరి పేరున రుణాలు మంజూరు చేసి వారికి పూర్తిగా ఇవ్వకుండా సగం సొమ్ము స్వాహా చేశారని తెలిపారు. రుణాలు ఇవ్వాలంటే ప్రతి గ్రూపూ లంచాలు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. తాము రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నా సీఏ ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా కాజేశారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఏపీఎం మాట్లాడుతూ సీఏ అప్పారావు నిబంధనలు ఉల్లంఘించి పనిచేసిసట్టు తమ దృష్టికి వచ్చిందని, అతనిని విధుల నుంచి తప్పించి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.