సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహిళల ఓట్ల కోసం పదివేల పథకం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా ఇచ్చారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.
పదివేలను ఒక్కసారిగా ఇవ్వమని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం మూడు విడతలుగా, అంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రజలను ప్రభావితం చేసేలాగా ఈ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కూడా ఎక్కడా నగదు చెల్లింపులు లేకుండా ఫిబ్రవరిలో డ్వాక్రామహిళలకు మూడు చెక్కులు ఇవ్వబోతున్నారు. వీటిలో ఒక చెక్కు ఫిబ్రవరికి సంబంధించి రూ. 2500, మార్చినెలకు సంబంధించి రూ.3500, ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 4000 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి నిధులు ఇస్తామనే సందర్భాలు ఎక్కడా ఉండవు. ప్రభుత్వ తీరుపై డ్వాక్రామహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఏపీలో వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేయడం లేదు. ఆగిపోయిన వడ్డీలేని రుణాలు రూ.2200 కోట్ల బకాయిలనే ఇవ్వకుండా వాటినే ఫిబ్రవరిలో చెక్కురూపంలో పసుపుకుంకుమ అనే పేరుతో కొత్త పథకంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. గతంలో కూడా రూ. 14200 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment