‘ఆధార్’ బాదరా
- నెలాఖరులోపు సీడింగ్ పూర్తిచేయాలని ఆదేశం
- లబ్ధిదారులకు, అధికారులకు తప్పని హైరానా
- అల్పాదాయ వర్గాల వారికి జిరాక్స్ ప్రతుల భారం
నెలాఖరులోపు రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయకుంటే వచ్చే నెల నుంచినిత్యావసర సరుకుల సరఫనా నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆధార్ కార్డు ఒక్క రేషన్ సరుకులకే పరిమితం కాకుండా అన్ని పథకాలకు విస్తరింపజేయడంతో జిరాక్స్ ప్రతుల తీయించేందుకే జిల్లాలో లబ్ధిదారులకు రూ.కోట్లలో చేతిచమురు వదులుతోంది!
నర్సీపట్నం రూరల్ : పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొంతమంది చేతుల్లో కి వెళుతున్నాయని ప్రభుత్వాల భావన. దీన్ని అధిగమించేందుకు ఆధార్ కార్డులను గత ప్ర భుత్వం తెరపైకి తెచ్చింది. అప్పట్లో కొన్ని మో డల్ జిల్లాలను గుర్తించి పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు చేయించి, రేషన్, గ్యాస్ పథకాలకు అ నుసంధానం చేశారు.
ఈ ప్రక్రియ వల్ల లబ్ధిదారులకు కొత్త ఇబ్బందులు తలెత్తడంతో దీన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ ప్రక్రియపై ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం సభ్యులు సైతం ఆధార్ అనుసంధానం వల్ల పే ద లబ్ధిదారులకు నష్టం వస్తుందంటూ ఆందోళ న చేశారు. దీనికి భిన్నంగా అధికారంలోకి వచ్చి న వెంటనే నాయకులు, మంత్రులు అన్ని పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలంటూ ఆ దేశాలు జారీచేశారు.
జిల్లాలో సుమారు 45 లక్ష ల వరకు జనాభా ఉన్నారు. వీరందరికీ రెండేళ్ల నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోం ది. అయినా ఇప్పటికీ పూర్తికాలేదు. ఇటీవల కాలంలో రేషన్ సరుకుల బట్వాడా, పింఛన్ల పంపిణీ, ఉపాధి హమీ పనులు, అంగన్‌వాడీ వ ర్కర్లకు, హాస్టల్ విద్యార్థులకు, గ్యాస్, ఫీజు రీ యింబర్స్‌మెంట్, విద్యుత్, డ్వాక్రా సంఘాల తో పాటు ఇతర అన్ని పథకాలకు ఆధార్‌ను వెం టనే అనుసంధానం చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఇందులో భాగంగా కిం దిస్థాయి అధికారులు ప్రతి పథకం లబ్ధిదారుడు ఆధార్ జిరాక్స్ ప్రతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైతే రెవెన్యూ అధికారులు సైతం లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లాలంటూ ఇప్పటికే కలెక్టరు ఆదేశాలు జారీచేసి పనులను వేగవం తం చేశారు. ఆధార్ జిరాక్స్ ప్రతుల పేరుతో ప్రతి కుటుంబంపై అదనపు భారం పడుతోం ది. వివిధ పథకాలకు ఒక్కో కుటుంబానికి 15 వరకు ఆధార్ జిరాక్స్ ప్రతులు అవసరమవుతున్నాయి. ఒక్కో జిరాక్స్ రూ. 2 చొప్పున లెక్కిస్తే 15 ప్రతులకు రూ. 30 వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది.
ఇలా జిల్లాలో ఉన్న సుమారుగా 13 లక్షల కుటుంబాలకు సుమారుగా రూ. 3.9 కోట్ల మేర ఖర్చవుతోంది. ఇది కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ వ్యయం మరింత ఎక్కువే ఉంటుందని అధికారులు అంటున్నారు. లక్షల్లో లబ్ధిదారులున్న ప్రభుత్వ పథకాలకు ఆధార్ నమోదు పుణ్యమాని చేతిచమురు వదులుతోందని పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అల్పాదాయ వర్గాల వారికి హైరానాకు తోడు ఆధార్ వల్ల ఆర్థిక భారం తప్పడం లేదు.
50 వేల జనాభాకు ఒక్కటే కేంద్రం
కొయ్యూరు: 50 వేలకు పైగా జనాభా ఉన్న కొయ్యూరు మండలంలో ఒక్కటంటే ఒక్కటే ఆధార్ కేంద్రం ఉండడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదు. దీంతో మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు మండల కేంద్రానికి వచ్చిన రెండు మూడురోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఈనెల చివర వరకే గడువు ఇవ్వడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
విద్యుత్ లేకపోవడంతో రాజేంద్రపాలెంలో జనరేటర్ సాయంతో ఆధార్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రేషన్ కార్దులకు సంబంధించి ఇప్పటి వరకు 25 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయిందని తహశీల్దారు ఉమామహేశ్వరరావు తెలిపారు. మరో కేంద్రం కావాలని ఇది వరకే ప్రతిపాదించామన్నారు. ఉపాధి హామీ సిబ్బంది చాలావరకు ఆధార్‌ను పూర్తి చేయడంతో వారి నుంచి ఆ వివరాలు తీసుకుని రేషన్ కార్డులపై సీడింగ్ చేస్తామన్నారు.
సకుటుంబంగా అవస్థలు
మాకవరపాలెం : ఆధార్ కార్డుల కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ కేంద్రాల్లో ఎప్పుడు నమోదు పూర్తవుతుందో తెలియక భోజనాలను సైతం వెంట తీసుకువస్తున్నారు. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రాజు తన భార్యాపిల్లలతో బుధవారం మాకవరపాలెంలోని ఆధార్ కేంద్రానికి వచ్చాడు. ఆధార్ నమోదుకు ఎంత సమయం పడుతుందోనని భోజనం తెచ్చుకుని తహశీల్దార్ కార్యాలయం కుటుంబ సభ్యులంతా తిన్నారు. నర్సీపట్నంలో ఉన్న కేంద్రంలో ఖాళీ లేకపోవడంతో ఇక్కడకు వచ్చామని వారు తెలిపారు.