విద్యుదాఘాతానికి వృద్ధురాలు బలి | Women Died By Electric Shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి వృద్ధురాలు బలి

Published Tue, Aug 28 2018 2:11 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Women Died By Electric Shock  - Sakshi

లక్ష్మమ్మ మృతదేహం   

ఆత్మకూర్‌ (కొత్తకోట) : ఇంటి ఆవరణలో తెగిపడిన విద్యుత్‌ తీగను పక్కకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఆరేపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్‌ఐ బీచుపల్లి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది తెలుగు లక్ష్మమ్మ(62) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి ఆవరణలో నడస్తుండగా తన ఇంటికి ఉన్న సర్వీస్‌ వైరు తెగిపడటాన్ని గమనించింది.

ఆ తీగలు పక్కకు తీసేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమె భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడని, ఈమెకు ఎలాంటి సంతానం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement