ఆత్మకూరు: చలిగా ఉంది కదా వేడి నీళ్లతో స్నానం చేద్దామని హీటర్ పెట్టుకున్నాడు. అదే ఆ చిన్నారిపాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన శ్రవణ్(8) నీళ్లు కాచుకునేందుకు వాటర్ హీటర్‌ను ప్లగ్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలో ఎర్త్ అయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడని ఎస్.ఐ రాజు తెలిపారు. మృతుడు అదే గ్రామంలో 4వ తరగతి చదువుతున్నాడు. కాగా, గతేడాదే తండ్రి చనిపోయాడని తెలిసింది. దీంతో దేవరపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హీటర్ పెట్టుకోబోతే..
Dec 24 2017 8:09 PM | Updated on Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement