కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఘటన
ఘటనా స్థలిని సందర్శించిన వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్
పోలీసుల అదుపులో నిందితులు?
మహబూబ్‌నగర్: బిహార్ తాపీ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యను చూస్తున్నాడనే కారణంతో భర్త.. ఓ యువకుడిపై దాడికి పాల్పడి మరో యువకుడిని ఐరన్‌రాడ్‌తో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈఘటన మంగళవారం అర్ధరాత్రి వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి సోదరుడి కథనం ప్రకారం.. బిహార్‌లోని ఖగారీయా జిల్లా పస్రహ తా నా మండలం జంజారా గ్రామానికి చెందిన ముని దూల్‌చంద్రకుమార్ రెండేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చారు. ఇక్కడ అద్దెకుంటూతాపీ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం చంద్రకుమార్ తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్(16), మరో యువకుడు పవన్ కూడా వరంగల్ రాగా ముగ్గురు కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.
పనిచేసే చోట వీరికి ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో అద్దెకుంటున్న బానోత్ నగేశ్ పరిచయమయ్యాడు. ఇటీవల నగేశ్ అత్తామామలు చంద్రకుమార్ ఉండే ఇంట్లో ఓ రూమ్‌లో అద్దెకు దిగారు. నగేశ్ భార్య తన పిల్లలను తీసుకుని తరచూ పుట్టింటికి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల నగేశ్ తన భార్యను చూస్తున్నారని అనుమానంతో చంద్రకుమార్, దిల్‌ఖుషికుమార్ వద్దకు వచ్చి ‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి దిల్‌ఖుషి కుమార్ రూమ్‌కు వెళ్లగా చంద్రకుమార్ తన స్నేహితులు గుల్షాన్, బాదిల్‌తో కలిసి చిన్న బ్రిడ్జి ఏరియాలోని మేఘనా బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నగేశ్, అతడి బావమరుదులు అశోక్, బన్నీ ద్విచక్రవాహనంపై అక్కడి చేరుకుని చంద్రకుమార్‌ను చితకబాది చంపేందుకు యత్నిస్తుండగా తప్పించుకున్నాడు. రాత్రి 12గంటలకు వరకు బయటే ఉండి అనంతరం భయపడుకుంటూ రూమ్‌కు వెళ్లగా తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్ రక్తమడుగులో చనిపోయి ఉన్నాడు.
దీంతో నగేశ్ తన భార్యపై అనుమానంతో తనను చంపడానికి యత్నించగా తప్పించుకున్నానని, తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్‌ను కిరాయికి ఉన్న ఇంట్లోనే హత్య చేశాడని చంద్రకుమార్ మిల్స్‌కాలనీ పీఎస్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీపీ నంది రామ్‌నాయక్.. ఇన్‌స్పెక్టర్ వెంకట రత్నం, సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీ లించి హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. మృతుడి సోదరుడు చంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు.
నేరస్తుల కోసం గాలింపు: ఏసీపీ
భార్యపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నామని ఏసీపీ నందిరామ్‌నాయక్ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నారని చెబుతుండడం గమనార్హం.
ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment