‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్‌లో మాట్లాడాలి’ | Unknown Man Video Calls Woman | Sakshi
Sakshi News home page

‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్‌లో మాట్లాడాలి’

Feb 10 2026 1:40 PM | Updated on Feb 10 2026 1:46 PM

Unknown Man Video Calls Woman

 శివమొగ్గ(కర్ణాటక ): గుర్తు తెలియని వ్యక్తి తనకు వీడియో కాల్‌ చేసి ప్రైవేట్‌ భాగాలు చూపించాడని ఓ మహిళ శివమొగ్గలోని ఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. శివమొగ్గకు చెందిన ఒక మహిళ మొబైల్‌ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో çవీడియో కాల్‌ చేశాడు. ‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్‌లో మాట్లాడాలి’ అని చెప్పాడు. మహిళ కాల్‌ లిఫ్ట్‌ చేయగా.. ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్‌ భాగాలు చూపిస్తూ వేధించాడు. మహిళ వెంటనే స్క్రీన్‌ రికార్డింగ్‌ ద్వారా వీడియోను రికార్డు చేసుకుంది. అనంతరం శివమొగ్గలోని ఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వీడియోలను చూపించి ఫిర్యాదు చేసింది.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement