Cooley
-
Lokesh Kanagaraj: కూలీ ఆగలేదు
రజనీకాంత్ ‘కూలీ’ ఆగలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో ‘కూలీ’ చిత్రీకరణ జూన్ 10న ప్రారంభం కానున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. కానీ ఈ తేదీకి ‘కూలీ’ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ బయోలో ‘కూలీ’ సినిమా పేరు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ జరుగుతోందని, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని లుక్ టెస్ట్ సెషన్‌లోని ఫొటోను షేర్ చేశారు లోకేశ్. -
సమస్యల ‘పని’ పట్టేలా!
వైరా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సరికొత్తగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఈ పనుల ద్వారా జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు దినసరి కూలి డబ్బులు గిట్టుబాటయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించి కొనసాగించారు. ఇకపై ఎంపిక చేసిన నిర్మాణాలు, అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయబోతున్నారు. తద్వారా..ఇటు కూలీలకు, అటు పల్లెలకు ఒకే విడతలో లబ్ధి, మేలు జరిగే సరికొత్త విధానం రూపుదాల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. పథకానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులను పుష్కలంగా విడుదల చేస్తుండడంతో జిల్లాలోని 20 మండలాల కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.52,278కోట్లతో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2,92,016 జాబ్ కార్డులు ఉండగా..50.89 లక్షల పని దినాలు కల్పించనున్నారు. తాజాగా..ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గొర్రెల కోసం షెడ్లు, చెరువుల్లో పూడికతీత, పారంఫాండ్స్, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, వంట గదులు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు చేపట్టవచ్చు. వీటిద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు దీని ద్వారా వచ్చే ఈజీఎస్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. నిధుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు, పాఠశాలల్లో ఒక్కో మరుగుదొడ్డికి రూ.50వేలు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.12వేల వరకు నిధులు అందుతాయి. వీటితోపాటు వర్మీ కంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవడానికి, ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇంకుడు గుంతలకు రూ.4వేలు, రైతులు తమ పొలాల్లో పారం పాండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50వేల వరకు లబ్ధి పొందవచ్చు. దీంతోపాటు గ్రామాల్లో ప్రస్తుతం గొర్రెల షెడ్లకు కూడా రూ.50వేల వరకు, పశువుల పాకకు రూ.80వేల వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయి. ఇంకా.. ఊరిలో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు అందుతాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వలసలను ఉపాధి పనులతో అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయాలపై నూతన సర్పంచ్‌లు అవగాహన పెంపొందించుకొని ప్రజల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా త్వరలో వీరికి ప్రభుత్వం శిక్షణ కూడా ఇవ్వనుంది. జాతీయ ఉపాధిహామీ పథకంతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులు, బీఆర్జీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక, సీడీఎఫ్ నిధులు, ఎమ్మెల్యే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఆయా ఫండ్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని..కావాల్సిన పనులను ఎంపిక చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటే..పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీసేలా చేయొచ్చని కొందరు అధికారులు భావిస్తున్నారు. సౌకర్యాలు కల్పించుకుంటాం.. ఉపాధిహామీ పనులను సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకుని, గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటాం. ఊరి అభివృద్ధికి విశేషంగా కృషి చేసేలా చూస్తా. ఉపాధిహామీతో గ్రామం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి..అధికారుల సూచనలతో చేయిస్తాం. – ఇటుకల మురళి, అష్ణగుర్తి సర్పంచ్, వైరా మండలం నిధులను సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ఈజీఎస్ ఫండ్స్‌తో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. కూలీలకు ఉపాధితోపాటు..పలు నిర్మాణాలు చేపట్టేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవి అందరూ తెలుసుకోవాలి. – బి.ఇందుమంతి, డీఆర్డీఓ -
పనులు చేసినా పైసల్లేవ్..!
కడప సిటీ: ఉపాధి కూలీలకు ఆరువారాలుగా కూలి డబ్బులు అందలేదు. పనులు చేసినా పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రోజుకు 1.7 లక్షల పనిదినాలు నమోదవుతున్నాయి.795 గ్రామ పంచాయితీల్లో పనులు జరుగుతున్నాయి.రోజుకు సగటున రూ.170–205వరకు కూలి ఇవ్వాలి. అయితే పని చేసినా సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4,88,939 మందికి..రూ.40.88 కోట్లు పెండింగ్ జిల్లాలో దాదాపు 4,88,939 మంది కూలీలకు రూ.40.88 కోట్లు రావాల్సి ఉంది. అంటే సగటున ఒక్కొక్కరికి రూ.8,000 రావాల్సి ఉంది. రెజెక్ట్ అయిన ఖాతాలకు సంబంధించి 10,914 మంది కూలీలకు గాను రూ.97.61 లక్షలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఖాతాల్లో డబ్బులు జమ కాని కూలీలు 13,079 మందికి 2.21 లక్షలు రావాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కూలీలు మండి పడుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం కూలీలకు సకా లంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.జూలై నెలకు సం బంధించి కొన్ని రోజుల వేతనం అందలేదని తెలిసింది.సమావేశం నిర్వహించి తగిన కారణాలను తెలుసుకుంటాం. కూలీలకు న్యాయం జరిగేలా చూస్తాం. – వై.హరిహరనాథ్, డ్వామా, పీడీ -
జల సమాధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/పెద్ద అడిశర్లపల్లి/దేవరకొండ : పొట్టచేత పట్టుకుని పొద్దున్నే కూలికి బయల్దేరిన తొమ్మిది మంది గిరిజన మహిళలు కానరాని లోకాలకు వెళ్లారు. ఇళ్ల నుంచి బయల్దేరిన ఐదు నిమిషాలకే మృత్యు వాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో జలసమాధి అయ్యారు. మరో పది మందికి గాయాల య్యాయి. ట్రాక్టర్లో పరిమితికి మించి కూలీలను ఎక్కించడం, సెల్‌ఫోన్ మాట్లాడు తూ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి (పీఏపల్లి) మండలం వద్ది పట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండా వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఎలా జరిగింది..? పడమటి తండా సమీపంలోని పులిచర్లలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో పని కోసం కూలీలు బయల్దేరారు. ఉదయం 6 గంటల సమయంలో సుమారు 25 మంది ట్రాక్టర్లో ఎక్కి కూర్చున్నారు. స్థలం సరిపో కపోవడంతో కొందరు మహిళల్ని ఇంజన్‌పై కూర్చోబెట్టారు. ఇంకొంత మంది వెనుక ఆటోలో బయల్దేరారు. ట్రాక్టర్ బయల్దేరి ఐదు నిమిషాల్లోపే తండాను ఆనుకొని ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లింక్ కాల్వలో బోల్తా కొట్టింది. పుట్టం గండి సిస్టర్న్ నుంచి అక్కపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు తీసుకువెళ్లే ఈ కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిని చేరుకోవడానికి ఈ కాల్వకట్టే ఆధారం. ప్రమాదం సమయంలో డ్రైవర్ బుచ్చిరెడ్డి ఫోన్ మాట్లాడుతున్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ట్రాక్టర్ కెనాల్లోకి దూసుకువెళ్తున్న సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఓ మహిళ బ్రేక్ వేసేందుకు యత్నించింది. డ్రైవర్ ట్రాక్టర్‌ను మళ్లీ రోడ్డుపైకి తెచ్చేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వారిలో మహిళలే ఎక్కువుండటం, వారికి ఈత రాకపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో రమావత్ సోనా(70), రమావత్ జీజా(65), జర్పుల ద్వాలీ(30), రమావత్ కేలి(50), రమావత్ కంసాలి(50), బానోతు ధరి(55), రమావత్ భారతి(35), రమావత్ సునీత(30) ఉన్నారు. రమావత్ బాజు(45) మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన 10 మందికి దేవరకొండ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన గురించి తెలియగానే సీఎం కేసీఆర్ తనతో మాట్లాడారని, బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి మంజూరు చేస్తామన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? 15 మందిని ఎక్కించాల్సిన ట్రాక్టర్లో ఏకంగా 25 మందిని ఎక్కించారు. అదీగాకుండా డ్రైవర్ 15 అడుగులున్న బీటీ రోడ్డుపై సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మృతుల బంధువులు చెబుతున్నారు. తాము చెబుతూనే ఉన్నా డ్రైవర్ పరిమితికి మించి ఎక్కించాడని వారు ఆరోపించారు. ఇదే ట్రాక్టర్లో కూలీకి వెళుతున్న హనుమ అనే యువకుడు ధైర్యం చేసి 12 మందిని కాపాడాడు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని ప్రమాదం నుంచి బయటపడినవారు తెలిపారు. శోకసంద్రంలో తండా పడమటి తండా వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే తండాకు చెందిన తొమ్మిది మంది చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న తండావాసులు, మృతుల బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో తండా శోకసంద్రంలో మునిగి పోయింది. మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. దేవుడైన పూజారి పడమటితండా బాలాజీ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న హనుమ కూలీల పట్ల దేవుడయ్యాడు. ఈయన గుడిలో పూజలు నిర్వహించడమే కాకుండా కూలి పనులకు వెళ్తుంటాడు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్లోనే హనుమ కూడా ఉన్నాడు. ట్రాక్టర్ పడిపోగానే కాల్వలోంచి ఆయన 12 మంది మహిళలను ఒడ్డుకు చేర్చాడు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 25 మందిలో ఒకరిద్దరే పురుషులున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కాల్వ నుంచి బయటపడి పారిపోయాడు. హనుమ ధైర్యసాహసాలను తెలుసుకున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ ఆయన్ను అభినందించారు. హనుమ పేరును రాష్ట్రపతి మెడల్‌కు సిఫారసు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
అదే నిజమైన క్రైస్తవం!
సువార్త ప్రత్యుపకారం చేసే స్తోమత లేని దీనులకు చేసే సాయమే విశ్వాసికి అత్యంత ఆశీర్వాదకరమని యేసు ఇలా బోధించాడు. ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. దాంతో నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన దాసుని పురమాయించగా, వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. రాజవీధుల్లోని భిక్షగాళ్లను, కంచెల్లో పని చేసే కూలీలను కూడా పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల జీవితాలు నిండాయి. ధనికుని హృదయమూ ఆనందంతో నిండిపోయింది (లూకా 14:12–24). గొప్ప వాళ్లంతా అహకారంతో తృణీకరించగా, ఆ అవకాశాన్నే అత్యానందంతో పేదలు, నిర్భాగ్యులు, అణగారిన వారికిచ్చిన దేవుని అద్భుతమైన ప్రేమను వర్ణించిన ఉపమానమిది. విందులో అగ్రస్థానాల్లో కూర్చుని ఆరగించవలసిన వాళ్లు తమ ఆధిక్యతను పోగొట్టుకుంటే, అదే విందులో చివర్న అంట్లు కడిగి, బల్లలు శుభ్రపరచి, అంతా ఊడ్చిపెట్టే అధములను హెచ్చించి, అవే అగ్రస్థానాల్లో కూర్చోబెట్టి విందు చేసిన దేవుని అసమానమైన ప్రేమను వర్ణించే మాటలే లేవు (యాకోబు 4:6). నేల మీద కూర్చోవలసిన వారు ధనికునితో సమానంగా కూర్చొని విందారగించే ఈ సన్నివేశం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం. సోషలిజం, కమ్యూనిజంలాంటి వ్యవస్థలు సిద్ధాంతాల్లో మాత్రమే ప్రతిపాదించిన సర్వసమానవత్వాన్ని కేవలం బోధించడమే కాదు, ఆచరించి చూపించిన నిజమైన సమానత్వవాది యేసుక్రీస్తు. దేవుడే మానవధారిౖయె యేసుక్రీస్తుగా దిగివచ్చి, తన పాదధూళితో సమానమైన మానవాళితో సహవసించడం, వారిని అక్కున చేర్చుకోవడం అనూహ్యమైన అంశం. అదే ప్రేమను ప్రతి విశ్వాసీ అలవరచుకోవాలి. విశ్వాసలు ప్రతి చర్యా, మాటల్లో అది ప్రతిబింబించాలి. గొప్ప వారికి గౌరవాన్నిచ్చి అగ్రహోదాలివ్వడం, పేదవారిని ఛీకొట్టడం లోక సంస్కృతి. దీనులు, పేదలు, అణగారిన వారిని అక్కున చేర్చుకోవడం దైవిక నియమం. సమాజంలో గొప్పవాళ్లకు సలాములు చేస్తూ, గులాములుగా బతికే నీచ సంస్కృతికి విశ్వాసులు, ముఖ్యంగా దైవసేవకులు ముందుగా స్వస్తి చెప్పాలి. దేవుని చిరునామాను నిరుపేదల్లో వెదికి, ఆయన గుండెచప్పుడును విలాసాల్లో తేలియాడే ధనికుల జీవితాల్లో గాక మురికివాడల్లో బతికే బడుగువాళ్ల జీవితాల్లో వినడం ప్రతి విశ్వాసీ అలవరచుకున్నప్పుడు ఈ లోకమే పరలోకమవుతుంది.ఈ లెంట్‌డేస్ (శ్రమదినాలు)లోమనం ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం పెడదాం, అభాగ్యుల ఆకలి తీర్చుదాం. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం, నిష్ఫలమైన కార్యం. నీళ్లు చెట్టుకు పోయాలి, చేనుకు తోడాలి, నీటితో దీనుల దాహం తీర్చాలి. అదే దేవుడు మెచ్చే నిజ క్రైస్తవం!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
అయ్యాగారికి దండం పెట్టు
ఉదయమే సన్నాయి వాయిద్యాల చప్పుళ్లు.. ఓ వ్యక్తి నోట్లో పీకలు పెట్టుకుని ఊదుతుండగా.. మరో వ్యక్తి డోలు వాయిస్తుంటారు. మరో ఇద్దరు ప్రాణాలను పణంగా పెట్టి ప్రదర్శన ఇస్తుంటారు. గంగిరెద్దు నోట్లో తలపెట్టి.. దాని కాళ్లు తమ దేహంపై ఆనించి.. ఇలా రకరకాలు విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొకరు పొట్టేలతో ఢీకొట్టే ఆటను ఆడుతారు. చూసేవారందరికీ ఇదంతా సంక్రాంతి సందడి. కానీ ఇది గంగిరెద్దుల వాళ్ల జీవితాల్లోని చీకటి జడి. అమ్మగారికి దణ్ణం పెట్టు.. అయ్యగారికి దణ్ణం పెట్టు అంటూ వారు చేసే ప్రదర్శనంతా గుప్పెడు బియ్యానికి.. ఓ ఐదు, పది రూపాయలకి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..బతుకుదెరువు కోసం కాళ్లకు పనిచెప్తున్న ఈ సంచార జీవులు ఈ సంక్రాంతిలోనే ఎక్కువగా కనిపిస్తారు. తర్వాత కూలీ పనులకు వెళ్తారు. గంగిరెద్దులతో సంక్రాంతికి కాంతిని తెచ్చే వారి జీవన చిత్రం. -
మద్యం దుకాణం వద్దే వద్దు
ఒంగోలు టౌన్ : ‘కూలీ నాలీ చేసుకొని జీవిస్త్తున్నాం. నాలుగు రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. అలా చేస్తే తమ ఇళ్లు గుల్లవుతాయి. మద్యం మత్తులో గొడవలు జరుగుతాయి. మా గ్రామానికి మద్యం దుకాణం వద్దు’ అని సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చెందిన పలువురు మహిళలు వేడుకున్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌ను కలిసి వారు సమస్యను విన్నవించారు. మైనంపాడు గ్రామంలో డైట్ కాలేజీ ఉందని, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తుంటారని, మందుబాబులు మద్యం మత్తులో వారిపై అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల కేంద్రమైన సంతనూతపాడులో మూడో మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని పలువురు కోరారు. ఇప్పటికే బస్టాండు సెంటర్లో రెండు దుకాణాలు ఉన్నాయని, తాజాగా మరొకటి ఏర్పాటుచేస్తే మద్యం మత్తులో ఎక్కువగా గొడవలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు. కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు ‘గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇర్లా రామకృష్ణతో నాకు వివాహమైంది. పెళ్లి సమయంలో ఇస్తామన్న కట్నాన్ని కొంచెం ఆలస్యంగా ఇచ్చాం. ఆ తరువాత అదనపు కట్నం కావాలంటూ నా భర్త, అత్తమామలు, బావ, మరిది, వారి కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు’ అని సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలేనికి చెందిన ఇర్లా అశ్వని వాపోయింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడని, ప్రస్తుతం తనకు ఒకటిన్నరేళ్ల వయస్సు కలిగిన పాప ఉందని వివరించింది. కుటుంబ సభ్యులు వేధింపులు ఎక్కువ కావడంతో తాను ఈ ఏడాది జూలై 23వ తేదీ సంతమాగులూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, తమ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదని వాపోయారు. ధర్మతోపు భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి 56సంవత్సరాల నుంచి శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్న ధర్మతోపు భూమికి అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఒంగోలు నగరపాలక సంస్థలోని ముక్తినూతలపాడు క్రిష్టియన్పాలెం, హరిజనవాడలకు చెందిన వారు కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్మశానవాటిక అభివృద్ధికి అధికారులు ముందుకొస్తే పులుసు ప్రకాశం అనే వ్యక్తి ఆ భూమి తాను కొనుగోలు చేశానని డాక్యుమెంట్లు చూపించారన్నారు. ధర్మతోపు స్థలానికి క్రయవిక్రయాలు జరపరాదని, ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. స్థలాలు ఇప్పించాలి జిల్లాలోని యానాదులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా యానాది యువజన సంఘం కార్యదర్శి యాకసిరి అంజిబాబు కోరారు. గిరిజన తెగకు చెందిన యానాదులు నికరంలేని వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఏళ్లు గడిచినా వారికి గూడు లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వేడుకున్నారు. అక్రమంగా వెలుస్తున్న గుడిసెలు ఒంగోలు నగరంలోని నేతాజీకాలనీలో అక్రమంగా గుడిసెలు వెలుస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఏడేళ్ల నుంచి తాము అక్కడ నివసిస్తుంటే కొంతమంది తిరగడానికి వీలులేకుండా రోడ్లపైనే గుడిసెలు వేస్తున్నారన్నారు. ఎస్కే మీరావలి, చిరంజీవి, మోహన్ అనే వ్యక్తులు గుడిసెలు వేయిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.15వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని గుడిసెలను తొలగించాలని కోరారు. చెరువుకట్టను బాగుచేయించాలి ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పెల్లూరు గ్రామ చెరువు కాలువ కట్టను బాగు చేయించాలని పలువురు రైతులు కోరారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పడమర కట్ట తెగిందని, దీంతో నీరు నిలవడం లేదని తెలిపారు. వరి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగించే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.