Lokesh Kanagaraj: కూలీ ఆగలేదు | Coolie: Lokesh Kanagaraj dismisses rumors of Rajinikanth starrer being shelved | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: కూలీ ఆగలేదు

Published Thu, Jun 27 2024 4:30 AM | Last Updated on Thu, Jun 27 2024 4:30 AM

Coolie: Lokesh Kanagaraj dismisses rumors of Rajinikanth starrer being shelved

రజనీకాంత్‌ ‘కూలీ’ ఆగలేదు. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో ‘కూలీ’ చిత్రీకరణ జూన్‌ 10న ప్రారంభం కానున్నట్లు రజనీకాంత్‌ వెల్లడించారు. కానీ ఈ తేదీకి ‘కూలీ’ సెట్స్‌పైకి వెళ్లలేదు.

 ఆ తర్వాత దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ‘ఎక్స్‌’ బయోలో ‘కూలీ’ సినిమా పేరు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్‌ కనగరాజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన లుక్‌ టెస్ట్‌ జరుగుతోందని, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని లుక్‌ టెస్ట్‌ సెషన్‌లోని ఫొటోను షేర్‌ చేశారు లోకేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement