ఇటీవల సరైన సక్సెస్‌లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్‌కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.
ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్‌లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు.
అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్‌కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment