జైలర్‌ డైరెక్టర్‌కు జాక్‌పాట్‌.. చెక్‌, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు! | Jailer Director Nelson Dilipkumar Gets Gift From Sun Pictures - Sakshi
Sakshi News home page

Nelson Dilip Kumar: తలైవాకు రూ.100 కోట్లు.. డైరెక్టర్‌కు నిర్మాత భారీ గిఫ్ట్‌!

Sep 1 2023 9:21 PM | Updated on Sep 2 2023 9:10 AM

Jailor Director Nelson Dilip Kumar Gets Gifts From Sun Pictures Makers - Sakshi

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్‌ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది.  తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది.

(ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !)

కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్‌ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది.  ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్‌ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. 

భారీ  హిట్ కావడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్‌ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు.  నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్‌ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు.  కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు.

(ఇది చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నిర్మాత!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement