cheque
-
కేరళకు మెగాస్టార్.. సీఎంకు కోటి రూపాయల చెక్!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా చెక్‌ను అందజేశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్ కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. #TFNReels: Megastar @KChiruTweets lands in Trivendra, Kerala to handover ₹1 cr cheque to Kerala CM. ❤#Chiranjeevi #RamCharan #WayanadLanslide #TeluguFilmNagar pic.twitter.com/tP0S4TBEOQ— Telugu FilmNagar (@telugufilmnagar) August 8, 2024 -
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం
-
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
TS: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి తమ వివరాలు కనుక్కుని మరీ సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఇదీచదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
60 పైసల చెక్ ఇచ్చిన బ్యాంకు.. ఇదా అసలు విషయం!
నంగునూరు (సిద్దిపేట): ‘చారాణా కోడికి బారాణా మసాల’ అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంక్ చెక్కును చూసి ముక్కున వేలు వేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్‌కు రెండు రోజుల కిందట స్పీడ్‌పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ బ్రాంచ్ నుంచి అకౌంట్‌పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్ అవాక్కయ్యాడు. చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో.. తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజులపాటు కష్టపడి విచారిస్తే గతంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ క్లియరెన్స్ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలగా చెక్కు పంపారని తెలుసుకున్నాడు. రాజశేఖర్‌కు చెల్లించే డబ్బులకంటే చెక్కు ఓచర్, స్పీడ్ పోస్ట్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువైనా న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్ ఇచ్చిన కంపెనీ వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్ డైలమాలో పడిపోయారు. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్‌ను షేర్హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని ఎల్ఐసీ ప్రకటన పేర్కొంది. -
జైలర్ డైరెక్టర్‌కు జాక్‌పాట్.. చెక్, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. (ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !) కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. భారీ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) Mr.Kalanithi Maran congratulated @Nelsondilpkumar and handed over a cheque to him, celebrating the Mega Blockbuster #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/b6TGnGaFd6 — Sun Pictures (@sunpictures) September 1, 2023 -
70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!
ముంబై: మన దేశంలో రైతుల అప్పులు, వ్యవసాయం సాగించేందుకు వారు పడే తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా ఎరువులు, పురుగులు మందు, కూలి ఖర్చులు, కావాల్సిన ఇతర సామాగ్రి ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుకు గిట్టు ధర తప్ప మిగతావన్నీ పైపైకి పోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో మార్పు రావడం లేదని చివరికి మిగిలేది అప్పులు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. మరీ రూ.2 ఇచ్చాడు తాజాగా ఓ రైతు ఎన్నో కష్టాలు, ఖర్చులు పెట్టి పండించిన పంటకు అన్నీ పోనూ చివరికి రూ. 2 మిగిలింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం రైతుల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. షోలాపూర్ జిల్లా బార్షి జిల్లాకు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చాడు. ఉల్లి ధరలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రైతులకు క్వింటాల్‌కు రూ.100 ధర లభించింది. రైతు తెచ్చిన ఉల్లిపాయలను అమ్మగా వచ్చిన మొత్తం బిల్లు 512 రూపాయలు. అందులో రవాణా, తూకం, వాహన ఛార్జీల కింద రూ. 509.51 పోయాయి. చివరికి రూ.2.49 మిగిలింది. దీంతో వ్యాపారి రౌండాఫ్ ఫిగర్ చేసి 2 రూపాయలు చెక్కును రైతుకు ఇచ్చాడు. చెక్కుపై తేదీ మార్చి 8, 2023 అని కూడా పేర్కొనడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులు శ్రమించి, ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పంట పండిస్తే తనకు మిగిలేది రెండు రూపాయలా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ఇచ్చిన రశీదు, చెక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
-
కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న ఉండనుంది. ఫలితాలు 6న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల -
వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు
మదనపల్లె సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషాల సమక్షంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్‌అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్‌ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్‌రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మృతుని కుటుంబానికి రూ.21లక్షల చెక్కు అందజేత
విజయనగరం: పూసపాటిరేగ పారిశ్రామిక వాడలో ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబానికి సదరు కంపెనీ తరఫున ఆర్ధిక సాయం సోమవారం అందజేశారు. నగరంలోని ప్రదీప్‌నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో గుర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన మహంతి సంతోషిణికి రూ.21 లక్షల చెక్కును పంపిణీ చేశారు. పూసపాటిరేగ మండలం కందివలస హెచ్‌బిల్ కంపెనీలో గుర్ల మండలం రాగోలుకు చెందిన మహంతి వెంకటరమణ గతంలో పని చేసేవారు. ఏప్రిల్ 11న ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో ఉన్న సమయంలో చనిపోవటంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మజ్జి శ్రీనివాసరావు ఆ మేరకు బాధిత కుటుంభానికి న్యాయం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, గుర్ల మండలం మాజీ ఎంపీపీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు గిడిజాల అప్పలనాయుడు, కొండపల్లి సూర్యారావు పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..
సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు చేసిన పాపాలతోనే నేటికీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ భరోసా పథకం క్రింద రూ. 7 లక్షల చెక్కును మృతుడి భార్య సూర్యకాంతం, పిల్లలు రమాదేవి, లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ మీ అప్పులు మా బాధ్యత అని చెప్పీ 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పీఠం ఎక్కాక రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు. రాంబాబు మృతి సంఘటన తెలుసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ భరోసా సాయాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కోటనందూరు, తుని మండల కన్వీనర్లు గొర్లి రామచంద్రరావు, పోతల రమణ, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నేతలు లాలం బాబ్జీ, నల్లమిల్లి గోవిందు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, దొడ్డి బాబ్జీ, బొంగు గోపాలకృష్ణ, జిగటాల వీరబాబు, చింతకాయల చినబాబు, రుత్తల జోగిరాజు, కుంచే అచ్చిరాజు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, ఎంపీడీఒ శర్మ, డీటీ కిరణ్‌కుమార్, ఏడీఎ సుంకర బుల్లిబాబు, ఏఒ వాణీ తదితరులు పాల్గొన్నారు. -
రౌడీ షీటర్‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ
-
మరో వివాదంలో పరిటాల సునీత
సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్ నగర్లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది. రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. -
రైతుబంధు సాయం వద్దట
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 వేల చెక్కుల చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది. పంట పెట్టుబడికి ప్రోత్సాహకంగా రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్న ‘రైతుబంధు’ చెక్కుల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చెక్కుల గడువు పొడగింపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వీటిని నగదుగా ఉపసంహరించుకోవడానికి మరికొన్ని నెలల గడువు ఇచ్చే అంశంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది. రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ.8 వేలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండు నెలల క్రితం చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా 2,87,307 మంది రైతులకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యవసాయశాఖ.. ఇందులోభాగంగా ఇప్పటివరకు 2,48,104 మందికి చెక్కులను జారీ చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్యకు అనుగుణంగా చెక్కులను ముద్రించింది. ఈమేరకు వీటిని పంపిణీ చేయాలని భావించినప్పటికీ 39,203 మంది చెక్కులను స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఇందులో అధికశాతం ప్రవాస భారతీయులేనని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. విదేశాల్లో స్థిరపడినవారి సంఖ్య గణనీయంగా ఉండడం.. సంపన్న వర్గాలు, ఇతర సెలబ్రిటీలకు జిల్లా పరిధిలో భారీగా వ్యవసాయ భూములుండడంతో రైతుబంధు కింద సాయం తీసుకునేందుకు ఆయా వర్గాలు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐలు మాత్రం అందబాటులో లేకపోవడం.. పాస్ పుస్తకాలను ఎప్పుడైనా తీసుకోవచ్చనే ధీమాలో చెక్కులను అంతగా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటి కోసమే స్వగ్రామాలకు రావాలనే ఆలోచన లేకపోవడంతో ఇవి వ్యవసాయ శాఖ అధికారుల వద్దే మూలుగుతున్నాయి. ఏప్రిల్ 19, మే 1, 10, 15వ తేదీల్లో చెక్కులను ప్రింట్ చేసిన ప్రభుత్వం వాటి చెల్లుబాటు గడువు మూడు నెలలు అంటే.. జూలై 19, ఆగస్టు 1, 10, 15వ తేదీతో ముగియనుంది. ఈనేపథ్యంలో వ్యవధి ముగుస్తున్న చెక్కుల పరిస్థితి ఏంటనే ప్రశ్న అధికారుల మదిని తొలుస్తోంది. రూ.31.05 కోట్లు పెండింగ్! గురువారం నాటికీ 2.81 లక్షల చెక్కుల పంపిణీ చేసిన యంత్రాంగం.. దాదాపు రూ.252 కోట్ల మేర సాయాన్ని రైతుబంధు కింద అన్నదాతకు అందజేసింది. మరో 39,203 చెక్కులు పెండింగ్‌లో ఉండడంతో రూ.31.05 కోట్ల సొమ్ము బ్యాంకులో భద్రంగా ఉంది. ప్రవాస భారతీయలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చెక్కులు తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంతో మగ్గుతున్న చెక్కుల విషయంలో ముందడుగు వేసే అంశంపై ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. విత్‌డ్రా గడువు ముగిసిన తర్వాత చెక్కులను రిటర్న్ చేయాలని ఇదివరకే స్పష్టం చేసినందున.. ఈ అంశంపై స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చెక్కుల వినియోగంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. చెక్కులను మళ్లీ ముద్రించడం.. వాటిలో తప్పొప్పులను పరిశీలించడం పెద్ద ప్రహసనం కావడంతో ఇవే చెల్లుబాటు అయ్యే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా చెక్కుల కాలం ఆధారపడి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా 10,456 పాస్ పుస్తకాలు వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టిన పాస్ పుస్తకాల జారీకి రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా కొత్తగా 10,456 పట్టాదారు పాస్ బుక్కులను త్వరలోనే రైతులకు పంపిణీ చేయనుంది. ఈమేరకు ఈ రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించేందుకు చెక్కుల ముద్రణ చేపట్టడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ తయారు చేస్తోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదలాయింపు(సక్సేసన్) తదితర కేటగిరీల కింద 10,456 పాస్ పుస్తకాలను ఇవ్వాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు ఈ పాస్‌పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణం లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది. -
రెతుబంధు చెక్కును తిరిగి ఇచ్చిన తనికెళ్ల భరణి
షాబాద్(చేవెళ్ల) : సిటీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కను తిరిగి అధికారులకు అందజేశారు. షాబాద్ మండలంలోని చిన్నసోలిపేట్ గ్రామంలో ఆయనకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి రైతుబంధు పథకం ద్వారా రూ.10 వేల చెక్కు వచ్చింది. ఆ చెక్కును బుధవారం తహసీల్ధార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి అందజేశారు. ఆ చెక్కను తనికెళ్ల భరణి తిరిగి అధికారులకు అందజేశారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర రైతునిధికి జమచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్ధిక వెసులుబాటు కలిగిన వారందరు ఉదారంగా సాగుపెట్టుబడి చెక్కులను తిరిగి రాష్ట్ర రైతుసంఘం నిధికి ఇవ్వాలని కోరారు. -
‘స్పెషల్’ డ్రైవ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : భూరికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భూప్రక్షాళన, పాసుబుక్కులు, చెక్కుల్లో చోటు చేసుకున్న తప్పులతో పంపిణీలో జాప్యం జరుగుతున్న విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు దిశానిర్దేశనం కూడా చేశారు. ఇందుకోసం నాలుగు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు స్మితాసబర్వాల్, పెద్దపల్లికి శ్రీధర్, రాజన్న సిరిసిల్లకు సునీల్‌శర్మ, జగిత్యాలకు సందీప్‌కుమార్ సుల్తానియాలను నియమించారు. జూన్ 20 వరకు పూర్తయ్యేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో అధికారులు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పాసుబక్కులు, చెక్కుల పంపిణీ వేగవంతం.. జిల్లా అధికారులతో సమీక్షలు.. శుక్రవారం నుంచి వచ్చే నెల 20 వరకు ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదేపని మీద ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రజాప్రతినిధులు సైతం పల్లెబాట పడుతున్నారు. భూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సరిగా వ్యవహరించేలా చూడటంతోపాటు విదేశాలలో ఉన్న ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానంపైనా కసరత్తు చేస్తున్నారు. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక అధికారులు శుక్రవారం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు ఎన్ని పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంతమందికి చెక్కులిచ్చారు? మిగతావారికి ఏ కారణంతో పంపిణీ చేయలేదు? తదితరాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతోపాటు మంత్రులు స్వీకరించాలన్న ఆదేశంతో శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఏయే జిల్లాలో ఏ మేరకు పంపిణీ.. పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రైతుబంధు చెక్కుల పంపిణీని ఈనెల 10 సీఎం కేసీఆర్ హుజూరాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్లలో ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రాగా.. ఇప్పటివరకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో చెక్కుల సంఖ్య 1,46,027, చెక్కుల విలువ రూ.124,58,85,100. ఇప్పటివరకు 98,275 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.89,07,77,740 కాగా 54,735 చెక్కులను డ్రా చేసుకోగా రూ.53,99,06,050 నగదును పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 1,04,636, చెక్కుల సంఖ్య 1,05,357, చెక్కుల విలువ రూ.97,43,95,470. ఇప్పటివరకు 81,648 మంది రైతులకు 82,111 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.79,99,34,900 కాగా 44,766 మంది రైతులు 45,028 చెక్కులను డ్రా చేసుకున్నారు. రూ.44,68,32,850 నగదును పొందారు. జగిత్యాల జిల్లాలో రైతుల సంఖ్య 2,05,555. చెక్కుల సంఖ్య 2,06,639, చెక్కుల విలువ రూ. 168,72,52,240. ఇప్పటివరకు 1,51,288 మంది రైతులకు 1,51,964 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 133,96,89,250 కాగా 92,568 మంది రైతులు 93,119 చెక్కులు డ్రా చేసుకోగా రూ.88,12,40,790 నగదు పొందారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 67,328, చెక్కుల సంఖ్య 67,556, చెక్కు ల విలువ రూ.54,94,000,00. ఇప్పటివరకు 51,024 మంది రైతులకు 51,127 చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.43,74,000,00 కాగా 16,429 మం ది రైతులు 16,467 చెక్కులు డ్రా చేసుకున్నారు. రూ.15,75,000,00 నగదు పొందారు. -
రైతుబంధు చెక్కులివ్వలేదని రైతుల ఆత్మహత్యాయత్నం
-
12 ఎకరాలకు మించితే 2 చెక్కులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి 12 ఎకరాలకు మించి ఉన్న రైతులకు పెట్టుబడి పథకం కింద రెండు చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం రూ.50 వేలకు మించిన సమయంలో ఒకే చెక్కు ఇవ్వడం వల్ల తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. దీంతో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ ప్రకారం రూ.49,999 వరకు రైతుకు ఒకే చెక్కు ఇవ్వొచ్చు. అంతకుమించి నగదు ఇవ్వాల్సి వస్తే రెండో చెక్కు ఇవ్వాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం 12 ఎకరాలున్న రైతుకు రూ.4 వేల చొప్పున రూ.48 వేలు ఇవ్వాలి. 13 ఎకరాలున్న రైతుకు రూ.52 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రూ.52 వేలకు రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెద్ద రైతులకు సాయం రూ.లక్షకు మించితే మూడు చెక్కులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉన్న రైతులు దాదాపు 2 లక్షల మంది ఉంటారని అంచనా. ఆ ప్రకారం వారిలో చాలామందికి రెండు లేదా మూడు చెక్కులు కూడా ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం బ్యాంకులు అదనంగా చెక్కులను ముద్రిస్తాయి. రైతుల సంఖ్యకు మించి చెక్కులు అధికం కానున్నాయి. పెట్టుబడి పథకానికి పేరు రైతు పెట్టుబడి పథకానికి ఏదో ఒక పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు పేర్లు సూచించి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పంపాలని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పేరుపై అనేక మందితో అధికారులు సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ‘రైతు లక్ష్మి’ వంటి పేర్లనూ ప్రచారంలో పెట్టారు. అయితే పథకాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా పేరుండాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే వైద్య ఆరోగ్య శాఖ పథకానికి పెట్టిన ‘కేసీఆర్ కిట్’లా సీఎం పేరు వచ్చేలా ఉంటే బాగుంటుందని అలాంటి పేరుపైనా కసరత్తు చేస్తున్నారు. -
చెక్కులు లేదా బ్యాంకులో జమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించాలనుకుంటున్న ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని చెక్కుల పంపిణీ లేదా బ్యాంకులో నగదు జమ ద్వారా అందించాలని మెజారిటీ జిల్లాల రైతులు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలుపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం మేరకు మంగళవారం వ్యవసాయశాఖ జిల్లాకో గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇదే విషయాన్ని వారు వెల్లడించారు. ప్రభుత్వం తమకు చెక్కులు ఇవ్వాలని 13 జిల్లాల రైతులు కోరగా మరో 10 జిల్లాల రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకో 7 జిల్లాల రైతులు నేరుగా తమకే డబ్బు ఇవ్వాలని విన్నవించారు. గ్రామసభల్లో ఐదారు అంశా లపై వ్యవసాయశాఖ రైతుల అభిప్రాయాలు సేకరించింది. చెక్కులు ఇవ్వడం, బ్యాంకు ఖాతాల్లో వేయడం, నేరుగా డబ్బులు ఇవ్వడం, పోస్టాఫీసుల ద్వారా అందజే యడం, టీ వ్యాలెట్ ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయడంపై గ్రామ సభల్లో రైతులను సర్వే చేసింది. నేరుగా డబ్బులిస్తే గందరగోళం ఏర్పడుతుందని 23 జిల్లాల రైతులు నిక్కచ్చిగా తేల్చిచెప్పారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పోస్టాఫీసుల ద్వారా అందించే విషయంపై రైతులు పెద్దగా స్పందించలేదన్నారు. టీ వ్యాలెట్ పద్ధతి తమకు తెలియదన్నారు. రైతుల అభిప్రా యాల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీలో రైతుల అభిప్రాయాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ అందించనుంది. పెట్టుబడి సాయం పథకం కింద రైతులకు చెక్కులు జారీ చేస్తే వారి అప్పుల కింద ఆ డబ్బును జమ చేసుకోబోమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సర్కారుకు హామీ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు మంగళ వారం ఎస్ఎల్బీసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ వివరాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు. -
ఎస్బీఐ కార్డుకి చెక్కుతో చెల్లిస్తే బాదుడే
రూ. 2,000 దాకా చిన్న మొత్తాల చెల్లింపులపై రూ. 100 చార్జీ బెంగళూరు: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్బీఐ కార్డు.. చిన్న మొత్తాలను చెక్కుతో క్లియర్ చేసే కస్టమర్లపై భారీగా వడ్డించడం ప్రారంభించింది. రూ. 2,000 దాకా స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లించిన పక్షంలో రూ. 100 చార్జీ వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఫీజులు అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ కార్డ్ వెల్ల డించింది. అయితే, రూ. 2,000కు మించిన మొత్తాలను చెక్కులతో చెల్లించినా ఎటువంటి చార్జీలు ఉండవని తెలిపింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ కార్డు పేర్కొంది. దాదాపు 90 శాతం మంది కస్టమర్లు చెక్ కాకుండా ఇతర విధానాల ద్వారానే చెల్లింపులు జరుపుతుంటారని సంస్థ సీఈవో విజయ్ జసూజా చెప్పారు. అయితే, స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లిస్తున్న సందర్భాల్లోనే వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఇది ఇటు సంస్థకు, అటు ఖాతాదారులకూ సమస్యాత్మకంగానే ఉంటోందని తెలిపారు. తొలిసారి క్రెడిట్ కార్డును ఉపయోగించే వారికోసం ఉద్దేశించిన ‘ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ హోల్డ ర్లకు మాత్రం చెక్కు పేమెంట్లపై ఎటువంటి చార్జీలు ఉండబోవని జసూజా తెలిపారు. ఎస్బీఐ కార్డ్‌కు 40 లక్షల పైగా ఖాతాదారులు ఉన్నారు. -
నోట్ల రద్దు: కేంద్రం మరో కీలక నిర్ణయం
ఇక చెక్కులు లేదా బ్యాంకుల ద్వారానే జీతాల చెల్లింపు కీలక ఆర్డినెన్స్ జారీచేసిన కేంద్రం న్యూఢిల్లీ: నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు బ్యాంకులు లేదా చెక్కుల ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీచేసింది. పలు పరిశ్రమలు తమ ఉద్యోగులకు జీతాలు నేరుగా బ్యాంకులు లేదా, చెక్కుల ద్వారా చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు -2016ను ఈ నెల 15న లోక్‌సభలో ప్రవేశపెట్టిందని, వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ రెండు నెలలు ఆగడం వల్ల ఉద్యోగులకు జీతాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వం అత్యవసర విషయాల్లో ఆర్డినెన్స్‌లు జారీచేసి.. వాటిని ఆరునెలల్లోపు పార్లమెంటులో ఆమోదింపజేసే విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా ఉద్యోగుల ఖాతాలకు జీతాలు బదిలీ చేయడం లేదా చెక్కు ద్వారా జీతాలు అందించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టంలోని సెక్షన్ 6లో ప్రభుత్వం సవరణలు తీసుకువస్తున్నది.