మరో వివాదంలో పరిటాల సునీత | Paritala Sunitha In Another Controversy In Anantapur | Sakshi
Sakshi News home page

బయటపడ్డ టీడీపీ నాయకుల, రౌడీషీటర్ల మధ్య సంబంధాలు

Published Tue, Feb 5 2019 4:11 PM | Last Updated on Tue, Feb 5 2019 5:52 PM

Paritala Sunitha In Another Controversy In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి.  ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్‌ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది.  రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రసాద్‌ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్‌ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్‌ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్‌ కుమార్‌ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement