cheques issued
-
మనసున్న మారాజు సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. –పుట్టపర్తి అర్బన్ (శ్రీసత్యసాయి జిల్లా) -
జనవరి 1నుంచి చెక్కు చెల్లింపులకు కొత్త రూల్స్
ముంబై, సాక్షి: వచ్చే(2021) జనవరి 1నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సానుకూల చెల్లింపుల(పాజిటివ్ పే) విధానం పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనలలో భాగంగా ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను మరోసారి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా.. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) అవకతవకలకు చెక్ పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ విధానం రూ. 50,000.. అంతకుమించిన పెద్ద మొత్తాల చెక్కులకు మాత్రమే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్) పలు విధాలుగా చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు. ఈ సమాచారాన్ని జమ చేసిన చెక్కు వివరాలతో చెక్ క్లియరింగ్ సిస్టమ్స్(సీటీఎస్) పోల్చి చూసుకునేందుకు వీలుంటుంది. ఎప్పుడైనా సమాచారం సరిపోలకుంటే డ్రాయీ బ్యాంకు, ప్రెజంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ తెలియపరుస్తుంది. తద్వారా చెక్కుల పరిష్కారానికి బ్యాంకులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్పీఎస్ ద్వారా సీటీఎస్‌లలో పాజిటివ్ పే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. వెరసి ఈ వ్యవస్థను బ్యాంకులు ఖాతాదారులందరికీ అమలు చేయవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ నిపుణులు పేర్కొన్నారు. రూ. 50,000, అంతకుమించి విలువగల చెక్కులకు ఈ వ్యవస్థ అమలుకానుంది. అయితే ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
రౌడీ షీటర్‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ
-
మరో వివాదంలో పరిటాల సునీత
సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్ నగర్లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది. రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. -
పార్ట్–బీ.. పెట్టుబడి ఏది..?
సాక్షి, ఆదిలాబాద్ అర్బన్: ఈ యేడాది ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం రైతులందరికీ భరోసా ఇవ్వలేకపోతోంది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఆశించిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు భూ రికార్డుల ప్రక్షాళన సర్వే జరిగిన విషయం తెలిసిందే. ఆ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు భూములను రెండు భాగాలుగా చేసి తప్పులు లేని భూములను పార్ట్–ఏలో, తప్పులు, వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చేర్చారు. పార్ట్–ఏ భూములకు రైతుబంధు పథకం వర్తింపజేయగా, పార్ట్–బీ భూముల లెక్కలు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. తప్పులు, వివాదాలు ఉన్నట్లుగా తేలిన భూములను పార్ట్–బీలో చేర్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఆ లెక్కలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పార్ట్–బీ భూములకు ఈ యేడాది మేలో ప్రారంభమైన పెట్టుబడి పథకం దూరమైందని చెప్పవచ్చు. జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, తప్పులు, వివాదాల్లో ఉన్నాయి. ఈ భూములను అధికారులు పార్ట్–బీలో చేర్చడంతో ప్రభుత్వం నుంచి ప్రతీ సీజన్‌కు రావాల్సిన రూ.15.20 కోట్లు ఆగిపోతున్నాయి. కాగా, పార్ట్–బీ భూములను ప్రభుత్వం, రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడంతో రైతుబంధు సొమ్ము తమకు దక్కడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పనుల్లో జిల్లా యంత్రాంగం బీజీగా ఉండడంతో పార్ట్–బీ భూముల యాజమానులు ఎన్నికల తర్వాత కొలువుదీరే సర్కారుపైనే ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. జిల్లాలో భూ స్వరూపం ఇలా.. జిల్లాలో 18 మండలాలు, వాటి పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో వ్యవసాయ భూములతోపాటు అటవీ, సీలింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ భూములున్నాయి. జిల్లా భౌగోళిక ప్రాంతం 9,01,467 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అన్ని రకాల భూములు 8,46,952 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 3,71,636 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, 1,88,485 ఎకరాల్లో అటవీ భూమి ఉందని గతేడాది జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో వెల్లడైంది. 3,71,636 ఎకరాలు ఉన్న వ్యవసాయ భూములను పరిశీలిస్తే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న భూమి 3,33,636 ఎకరాలు ఉండగా, వివాదాలు, తప్పులు, సమస్యలు ఉన్న భూములు 38 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములనే పార్ట్–బీలో చేర్చారు. జిల్లాలో మొత్తం 2,01,980 సర్వే నంబర్లు ఉండగా, ఇందులో సుమారు 30,108 సర్వే నంబర్లలోని భూములు తప్పులుగా ఉన్నాయని సర్వేలో గుర్తించారు. సర్వే అనంతరం ఎలాంటి సమస్యలను లేని భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు తప్పులు లేని వ్యవసాయ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ లెక్క ప్రకారం జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల మంది పట్టాదారులకు పెట్టుబడి సొమ్ము అందజేశారు. ఈ రబీ సీజన్లో కూడా ఆ భూములకే పెట్టుబడి సొమ్ము వస్తోందని చెప్పవచ్చు. పార్ట్–బీ భూములకు యేడాదికి రూ.30.40 కోట్లు భూ రికార్డుల ప్రక్షాళన సర్వే ముగిసి దాదాపు పది నెలలు గడుస్తున్నా పార్ట్–బీలో చేర్చిన భూములను రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. ఈ భూములపై ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించకపోవడంతో ఆ లెక్కలు అలాగే ఉన్నాయి. రెవెన్యూ కోర్టు కేసులు, సివిల్ కేసులు, సరిహద్దు గుర్తింపు, శివాయ్ జమేధార్ సమస్యలు, థర్డ్‌పార్టీ సమస్యలు ఉన్న భూములు ఇప్పటికీ వివాదాల నుంచి బయటపడడం లేదు. పార్ట్–బీలో చేర్చిన సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, కేసులు, వివాదాల్లో ఉండడంతో రైతుబంధుకు దూరమవుతున్నాయి. పార్ట్–బీలో చేర్చిన 38 వేల ఎకరాలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున లెక్కేసుకున్న ఒక సీజన్‌కు రూ.15.20 కోట్లు జిల్లాకు వచ్చే ఆస్కారం ఉండేది. యేడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.30.40 కోట్లు వస్తుండేది. కానీ ఆ భూముల సమస్యలకు పరిష్కారం ఇంత వరకు దొరకకపోవడంతో ఆ సొమ్ము జిల్లాకు రావడం లేదు. ఇప్పుడున్న భూములకు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సొమ్ము మరింత అదనంగా జిల్లాకు రైతులకు దక్కాలంటే పార్ట్–బీ భూముల పరిష్కారంపై ఆధారపడి ఉందనే చెప్పవచ్చు. -
‘రైతుబంధు’కు షరతులతో ఓకే
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగ దును ట్రాన్స్ఫర్ చేయాలని, చెక్కుల పంపిణీ జరపరాదని తేల్చి చెప్పింది. ముందు గుర్తిం చిన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఐదు ప్రధాన షరతులతో అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ఎస్కే రుడోలా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలకు కొత్త లబ్ధిదారుల పేర్లను జత చేయరాదని ఈ లేఖలో ఈసీఐ కోరింది. కార్యక్రమానికి సంబంధించి ప్రచారాన్ని నిర్వహించరాదని స్పష్టం చేసింది. కిట్స్/సామగ్రి, ఇతరాత్ర వస్తువుల పంపిణీకి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని, పెట్టుబడి సహాయం పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలు పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. రైతుబంధు కార్యక్రమానికి సంబంధించి ఈసీఐ నుంచి వచ్చిన మార్గదర్శకాలను సీఈవో కార్యాలయం వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖకు తెలియజేసింది. ఖాతాలను పరిశీలించండి... తక్షణమే రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించాలని, ఇప్పటికే తమ వద్ద ఉన్న లక్షలాది మంది ఖాతాలను మరోసారి పరిశీలించి సరిచూసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు కింద ఖరీఫ్‌లో ఎంతమంది సొమ్ము తీసుకున్నారో వారి ఖాతాలను సేకరించి తిరిగి 10 నుంచి 15 రోజుల్లో సొమ్ము జమ చేయాలని నిర్ణయించింది. రబీ రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం 11 జిల్లాల్లో అక్కడక్కడా ప్రారంభమైంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్‌న్ చెక్కుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో శనివారం నుంచి చెక్కుల పంపిణీని నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు ముద్రించిన 30 లక్షల చెక్కులు వృథా కానున్నాయి. 2 లక్షల మంది కొత్తవారికి నిలిపివేత ఖరీఫ్‌లో పెట్టుబడి సొమ్ము తీసుకున్న రైతులకే రబీ సొమ్ము ఇవ్వాలని, కొత్త రైతులకు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో కొత్త రైతుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 52 లక్షల మందికి రబీలో రైతుబంధు సొమ్ము ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈసారి ధరణి వెబ్సైట్ ద్వారా కొత్తగా మరో 2 లక్షల మంది వరకు రైతులు లబ్ధి పొందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వారందరికీ పెట్టుబడి సొమ్ము దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అయ్యాక వారికి ఇచ్చే అవకాశముంది. కొత్త వారు ఎవరనేది తెలుసుకోవడం కష్టంగా మారిందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. నేడు అత్యవసర సమావేశం రైతుబంధుపై ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రైతుకు రొక్కం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి శివారు ఇందిరానగర్ వేదికపై ఉదయం 11 గంటలకు ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం రాత్రే కరీంనగర్ చేరుకున్న సీఎం.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్‌షో ద్వారా ఇందిరానగర్ వేదిక వద్దకు చేరుకుంటారు. ధర్మరాజుపల్లె గ్రామానికి చెందిన 10 మంది రైతులకు వేదికపై పాస్‌బుక్కులు, పెట్టుబడి సాయం చెక్కులను అందజేస్తారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. గురువారం నుంచి వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తంగా 1.43 కోట్ల ఎకరాలకు చెందిన 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయనున్నారు. హరితహారం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన సీఎం.. రైతు బంధు పథకాన్ని కూడా ఇక్కడ్నుంచే మొదలు పెడుతుండటం గమనార్హం. సభకు భారీగా ఏర్పాట్లు సీఎం కేసీఆర్ గురు, శుక్రవారాల్లో కరీంనగర్ జిల్లాలోనే పర్యటించనున్నందున అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ నాలుగు రోజులుగా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అటు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి కూడా ఏర్పాట్లపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కరీంనగర్‌లోనే మకాం వేసి సభ ఏర్పాట్లపై సమీక్షించారు. సభకు భారీ సంఖ్యలో రైతులను తరలించేందుకు కసరత్తు పూర్తి చేశారు. అసాధారణ భద్రత! సీఎంకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల తాజా హెచ్చరికల నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అసాధారణ భద్రత చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను మోహరించారు. ఈ మేరకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. కరీంనగర్ నుంచి ఇందిరానగర్ వరకు సీఎం బస్సులోనే వెళ్లనున్న నేపథ్యంలో.. దారిపొడవునా కల్వర్టులు, వంతెనల సమీపంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కేసీఆర్ బస చేసే తెలంగాణ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలపై నిషేధాజ్ఞలు విధించారు. సభావేదికపైకి కూడా ప్రజాప్రతినిధులను పరిమితంగానే అనుమతించే అవకాశం ఉంది. ఆధార్ లేకున్నా చెక్కులు రైతులు పాటించాల్సిన సూచనలను వివరిస్తూ వ్యవసాయ శాఖ ఓ కరపత్రం రూపొందించింది. అందులో సూచనలివీ.. – 17వ తేదీ వరకు గ్రామాలవారీగా షెడ్యూల్ ప్రకారం చెక్కులిస్తారు. ఉదయం 7–11 గంటలు, సాయంత్రం 5–7 గంటల మధ్య పంపిణీ ఉంటుంది – టోకెన్‌తో పాటు ఆధార్ కార్డు, అది లేకుంటే మరేదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి – ఆధార్ కార్డు నంబరు ఇవ్వని వారికి ఫోటో సరిగా దిగని వారికి పాస్‌బుక్కులు రాకుండా కేవలం చెక్కులు మాత్రమే వచ్చాయి. ఆ రైతులు చెక్కు తీసుకొని వారి ఆధార్ కార్డు జిరాక్స్‌ను అధికారులకు ఇవ్వాలి. త్వరలో ఆ రైతులకు పాస్ బుక్కులు కూడా ఇస్తారు – చెక్కులను గ్రామసభల్లో రైతులే నేరుగా తీసుకోవాలి. వారి తరపున మరొకరు తీసుకోవడానికి వీలులేదు – అనారోగ్యంతో రాలేని రైతులకు ఇంటికి వచ్చి చెక్కు అందజేస్తారు – టోకెన్‌లో సూచించిన కౌంటర్ల వద్దకు వెళ్లి పాసు పుస్తకం, చెక్కు తీసుకోవాలి. అనంతరం అక్కడి రిజిస్టర్లో సంతకం చేయాలి – బ్యాంకులో నగదు తీసుకునేప్పుడు పాసు పుస్తకం విధిగా తీసుకెళ్లాలి. పుస్తకం మొదటి పేజీ జిరాక్సును సమర్పించాలి – 300 మంది రైతులకు ఒకటి చొప్పున అధికార బృందాలను ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలోనే చెక్కుల పంపిణీ జరుగుతుంది – రైతులకు ఫిర్యాదులుంటే గ్రామసభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వాటిని నమోదు చేయవచ్చు – గ్రామసభలో చెక్కులు తీసుకోలేని రైతులు నెలలోపు మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్ల నుంచి పొందవచ్చు – రైతుబంధు సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటే ‘గివ్ ఇట్ అప్’ఫారంలో వివరాలు నింపి గ్రామసభలో అధికారులకివ్వాలి – రైతులకు ఆర్డర్ చెక్కులిస్తారు. ఇందుకు మండలానికో బ్యాంకును నిర్దేశించారు. అందులో చెక్కును నగదు చేసుకోవచ్చు. లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా అదే బ్యాంకు తాలూకు వేరే శాఖలోనూ తీసుకోవచ్చు – చెక్కుపై ముద్రించిన తేదీ నుంచి మూడు నెలల్లోపే నగదు చేసుకోవాలి – రైతులు తమ బ్యాంకు ఖాతాలోనూ చెక్కులను జమ చేసుకోవచ్చు – పాసు పుస్తకం లేకుండా చెక్కు పొందిన రైతులు బ్యాంకులో నగదుగా మార్చుకోవాలంటే ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఉపాధి హామీ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. జిరాక్సు కాపీ ఇవ్వాలి నగదు కష్టాలు తప్పవా? రైతుబంధు పథకానికి నగదు కష్టాలు తప్పేలా లేవు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ.5,730 కోట్లు విలువ చేసే చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే చెక్కులను నగదుగా మార్చి రైతులకు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద తగిన మొత్తంలో కరెన్సీ లేదు. మరోవైపు డబ్బుల్లేవంటూ రైతులను వెనక్కు పంపొద్దని సర్కారు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నగదు కొరత ఉన్నా తర్వాత రమ్మని మాత్రమే చెప్పాలని, డబ్బుల్లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వొద్దని స్పష్టంచేసింది. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నగదు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. పది వేలు కావాలంటే పది ఏటీఎం కేంద్రాలకు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుబంధు కోసం నగదు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు విన్నవించినా.. ఇప్పటివరకు నగదు నిల్వలు రాష్ట్రానికి రాలేదని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. గురు లేదా శుక్రవారం వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. వారం వ్యవధిలో బ్యాంకులు రూ. 5,730 కోట్ల సొమ్మును ఇవ్వాల్సి ఉంది. అంటే రోజుకు సరాసరి రూ.818 కోట్లు. అందరూ ఒకేరోజు తీసుకోరని అనుకున్నా ఆయా రోజుల్లో సరాసరి రూ.500 కోట్లు బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. ఈ సొమ్ముతోపాటు రోజువారీ కస్టమర్లకు కూడా సొమ్ము అందుబాటులో ఉంచాలి. రైతులంతా ఒకేసారి వస్తే అంత సొమ్ము ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రిజర్వు బ్యాంకు నుంచి రైతుబంధుకు ప్రత్యేకంగా డబ్బు సమకూర్చామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి వెల్లడించారు. బుధవారం ఆయన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. -
పట్టాదార్లకే పెట్టుబడి చెక్కులు
ఆదిలాబాద్‌అర్బన్ : రైతుబంధు పథకం కింద పెట్టుబడి చెక్కులను పట్టాదారులకే అందించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను గ్రామాల వారీగా భూములు కలిగిన పట్టాదారు రైతులకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి కదలలేని స్థితిలో ఉన్న పట్టాదారుని ఇంటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టాదారుల చెక్కులను సరి చేసుకోవాలని, వాటిని భద్రంగా పోలీస్‌స్టేషన్, పోస్టాఫీసు స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచాలని తెలిపారు. చెక్కుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని, ఇంగ్లిష్ అక్షర క్రమంలో తయారు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. గ్రామాల్లోని వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం చెక్కుల పంపిణీకి ఒక రోజు ముందే గ్రామాల్లో ఠాంఠాం విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. చెక్కుల పంపిణీ తీరును వీడియో చిత్రీకరణ చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా ఆ గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను తహసీల్దార్లు ఇవ్వాలని, రైతులు, సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రైతు నుంచి రోజుకు 2 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని రైతులకు వివరించాలని తెలిపారు. ఇచ్చోడ, బేల కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్డీవోలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌హెచ్‌వో నర్సింగ్‌దాస్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పుల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలి ఆదిలాబాద్‌అర్బన్: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం కలెక్టర్‌తన క్యాంప్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలను రిమ్స్, ఉట్నూర్‌లలో ఉన్న పౌష్టికాహార కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. గ్రామాల్లోని పిల్లలను పోషకాహార పునరావాస కేంద్రాలకు ఎక్కువ మందిని పంపించే ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకం అందించాలని పేర్కొన్నారు. ఆశలకు రూ.300 చొప్పున, అంగన్వాడీలకు రూ.100 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమమే లక్ష్యం
మిర్యాలగూడ రూరల్ : రైతు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాద్రిపాలెం, జప్తివీరప్పగూడెం, తుంగపహాడ్, బాదలాపురం, ఆలగడప, రాయినిపాలెం, గూడూరు, రుద్రారం, కొత్తగూడెం, ఉట్లపల్లి, తక్కెళ్లపహాడ్, తడకమళ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 359 మందికి రూ.1,83,09,000 కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఆడపిల్ల భారం కాకూడదని వారి పెళ్లికి రూ.75,016 అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. మార్చిలో రైతుకు నూతన పాస్ పుస్తకాలు జారీ, మేలో రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఒగ్గు జానయ్య, వైస్‌ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మీసైదులు యాదవ్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంజులవెంకటేశ్వర్లు, శశికళ శ్రీనివాసరెడ్డి, వీరమ్మ, ఎంపీటీసీ లలిత, చిట్టిబాబు, చౌగాని భిక్షంగౌడ్, యదగిరి, సైదులు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 26 కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.