ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. –పుట్టపర్తి అర్బన్ (శ్రీసత్యసాయి జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment