rowdy sheeter
-
విశాఖ కేజీహెచ్ లో రౌడీ షీటర్ హల్ చల్
-
ప్రొద్దుటూరులో రౌడీషీటర్ దారుణ హత్య
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని ఓ లాడ్జీలో జరిగిన హత్య కలకలం రేపింది. రౌడీషీటర్ కొప్పుల రాఘవేంద్రకుమార్ అలియాస్ పప్పీ (30)ని మద్యం సీసాలతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. లాడ్జీలోని గదిలో రక్తపు మడుగులో పడి ఉండగా రూం బాయ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సాయికుటీర్ రోడ్డుకు చెందిన లోకేశ్వరరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతను శనివారం బీజీఆర్ లాడ్జీలో గది తీసుకున్నాడు. ఆ రోజు నుంచి పలువురితో కలిసి లాడ్జీలో మద్యం సేవించాడు. అతనికి సంజీవనగర్‌కు చెందిన పప్పీతో పరిచయం ఉంది. ఈ క్రమంలో రాఘవేంద్రతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ముక్తియార్ సోదరుడు ముజీబ్, రెడ్డివారివీధికి చెందిన సునీల్ ఆదివారం రాత్రి లాడ్జీకి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 సమయంలో వారి మధ్య గొడవ జరుగుతుండటంతో ముజీజ్ లాడ్జీలో నుంచి బయటికి వెళ్లాడు. వెళ్లేటప్పుడు రూంలో గొడవ జరుగుతోందని రిసెప్షన్లో చెప్పాడు. మద్యం మత్తులో గొడవ పడటం సహజమేనని భావించి రిసెప్షన్‌లోని లాడ్జీ సిబ్బంది అతని మాటలను పట్టించుకోలేదు. ముజీబ్ వెళ్లిన తర్వాత సోమవారం వేకువ జామున 1.30 సమయంలో లోకేశ్వరరెడ్డి, సునీల్‌లు లాడ్జీలో నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇదంతా లాడ్జీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సోమవారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు రూం బాయ్ వెంకటేష్ వెళ్లగా అప్పటికే పప్పీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం సీసాలతో కొట్టడం వల్ల అతను మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.రాఘవేంద్ర అలియాస్ పప్పీపై అనేక కేసులుపప్పీపై ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. టూ టౌన్, త్రీ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు అతనిపై నమోదయ్యాయి. 2013లో అతను పప్పీ గ్యాంగ్ పేరుతో పట్టణంలో హడలెత్తించాడు. పట్టణంలోని అనేక మంది యువకులను ప్రోగు చేసుకొని చిన్నాచితక దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడేవాడు. అతని ఆగడాలు శృతి మించడంతో పోలీసు ఉన్నతాధికారులు 2014లో అతన్ని పట్టణ బహిష్కరణ చేశారు. దీంతో అప్పటి నుంచి పప్పీ హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ వచ్చాడు. తర్వాత కువైట్‌కు వెళ్లి వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం రాఘవేంద్ర ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఏడాది క్రితం సొంత బంధువులను బెదిరించగా వారు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక యువకుడిని ఫోన్లో బెదిరించగా అతను టూ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు పప్పీని పిలిపించి మందలించారు.పోలీసుల విచారణ..పప్పీని హత్య చేసిన వ్యక్తులెవరనేది పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. హత్యకు గల కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. డీఎస్పీ భక్తవత్సలం, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. మద్యం మత్తులో జరిగిన హత్యనా లేక పాతగొడవలే కారణమా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పప్పీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. లాడ్జీ మేనేజర్ చంద్రఓబుళరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు.వివాహమై ఆరు నెలలైనా కాలేదు..ఆరు నెలల క్రితం పప్పీ సంజీవనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనూషను రెండో పెళ్లి చేసుకున్నాడు. లాడ్జీలో భర్త మృతదేహాన్ని చూసి అనూష విలపించసాగింది. వివాహమై కనీసం ఆరు నెలలైనా కాకముందే భర్త దుర్మరణం చెందాడని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు మృతి చెందాడనే సమాచారం తెలియడంతో తల్లి సరస్వతి ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరైంది.కొంత సేపటి వరకు మృతుడు ఎవరన్నది పోలీసులకు తెలియలేదు. ఆ తర్వాత హత్యకు గురైన వ్యక్తి పప్పీ అని పలువురు చెప్పడంతో అతని భార్య, తల్లిని పిలిపించి మృతదేహాన్ని చూపించారు. వారు చెప్పిన తర్వాత అతన్ని రాఘవేంద్రకుమార్ అలియాస్ పప్పీగా నిర్ధారించారు. రిసెప్షన్‌లోని రిజిష్టర్‌ను పరిశీలించిన పోలీసులు లోకేశ్వరరెడ్డి పేరుతో రూం బుక్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లాడ్జీలోని వారి గదికి ఎవరెవరు వచ్చారనే విషయాలు సీసీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. వారిలో లోకేశ్వరరెడ్డి, సునీల్ సెల్ నంబర్లకు ఫోన్ చేయగా ఫోన్లు పని చేయలేదు. వారిద్దరు పరారీలో ఉండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. లోకేశ్వరరెడ్డి, సునీల్‌లు పప్పీని హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వారితో కలిసి ఉన్న మరో వ్యక్తి ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీ రౌడీషీటర్ నవీన్ దారుణం.. యువతి బ్రెయిన్ డెడ్
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. మధిర సహాన తల్లిదండ్రులు
సాక్షి,అమరావతి : అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ ఓ గుండె కోతను మిగిల్చాడు. నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్ నవీన్..మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనలో నిందితుడు నవీన్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మధిర సహాన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా కుమార్తె మధిర సహానాను దారుణంగా కొట్టారు. ఒంటినిండా గాయాలు ఉన్నాయి. నిందితులు దాడి చేయడంతో మా కుమార్తెకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. వెంటిలేటర్ తీసేస్తే ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ దారుణానికి కారణమైన రౌడీషీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలి. నవీన్‌తో పాటు మరో ఇద్దరు ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి’ రోదిస్తున్నారు. -
హైదరాబాద్ రౌడీ షీటర్ కు ఈడీ షాక్
-
హైదరాబాద్ రౌడీ షీటర్ కు ఈడీ షాక్
-
రాత్రి అరెస్టు.. ఉదయాన్నే ఎన్కౌంటర్!
సాక్షి, చైన్నె: చైన్నె కమిషనరేట్ పరిధిలో రెండున్నర నెలలవ్యవధిలో మూడో ఎన్కౌంటర్ సోమవారం జరిగింది. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అరెస్టయిన చైన్నె తాంబరంకు చెందిన ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజా సోమవారం ఉదయాన్నే జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వివరాలు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో రౌడీల గుండెలకు పోలీసులు ముచ్చెమటలు పటిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని జల్లెడ పట్టి మరీ అరెస్టు చేస్తున్నారు. అదే సమయంలో చైన్నె పోలీసు కమిషనర్‌గా అరుణ్ బాధ్యతలు స్వీకరించగానే ఈ కేసులో నిందితుడైన తిరువెంగడంను ఎన్కౌంటర్లో హతమార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ కాకా తోపు బాలాజీని మట్టుబెట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ కేసులో నిందితుల వేట ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో 29వ నిందితుడిగా ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజాను ఆదివారం రాత్రి ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఓ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చి పారిశ్రామిక వేత్తకు బెదిరింపు ఇచ్చిన కేసు విచారణ నిమిత్తం వేళచ్చేరి స్టేషన్ పోలీసుకు అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయుధాలను దాచిపెట్టిన అక్కరై ప్రాంతానికి వేళచ్చేరి స్టేషన్ ఇన్స్పెక్టర్ విమల్ తన సిబ్బందితో సీ సింగ్ రాజాను తీసుకెళ్లారు. సీసింగ్ రాజాకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసిందే. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తాము కూడా ఆయన భార్యలంటూ తెరమీదకు వచ్చారు. వీరిలో ఎవరికి మృతదేహం అప్పగించాలో అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు.ఎదురుకాల్పుల్లో..ఆయుధాలను చూపిస్తానని పేర్కొని బకింగ్ హాం కాలువ తీరంలోని ఓ ప్రాంతానికి సీసింగ్ రాజ వెళ్లా డు. ఆయుధాలను చూపిస్తున్నట్టుగా పేర్కొంటూనే అక్కడున్న ఓ నాటు తుపాకీ ద్వారా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ విమల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పొట్ట, ఛాతి భాగంలో తూటాలు దిగడంతో ఘటనా స్థలంలో సీ సింగ్ రాజా కుప్పకూలాడు. ఎన్కౌంటర్ సమాచారంతో గ్రేటర్ చైన్నె దక్షిణ జోన్ అదనపు కమిషనర్ శిబిరాజ్ నేతృత్వంలోని అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే సీ సింగ్ రాజాను ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో తాము విచారించలేదని, పారిశ్రామిక వేత్తకు బెదిరింపులు ఇచ్చిన కేసులో ఆయుధాల కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని శిబిరాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు బయలుదేరాయి. రౌడీల ఎన్కౌంటర్ పర్వం కొనసాగుతుండటంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ సైతం అనుమానం వ్యక్తం చేశారు.వాహనాల సీజ్ నుంచి ఏ వన్ రౌడీగా..తాంబరం రామకృష్ణపురం సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన రాజ అలియాస్ సీసింగ్ రాజా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. తొలుత ఫైనాన్సియర్ ఒకరి వద్ద పనిచేశారు. ఎవరైనా కంతులు చెల్లించని పక్షంలో వారి వాహనాలను బలవంతంగా సీజ్ చేసి తీసుకెళ్లి ఫైనాన్సియర్‌కు అప్పగించే వాడు. మరమలై నగర్, ఇరుంగాట్టు కోట్టైలో రెండు పరిశ్రమల ఏర్పాటుతో తన దృష్టికి వాటి మీద పెట్టాడు. ఇక్కడి నుంచి వెలువడే ముడి ఇనుము, ఇతర పరికరాలను కొనుగో లు చేసి విక్రయించే క్రమంలో రౌడీ అవతారం ఎత్తాడు. అనుచరులను ఏకం చేసి, కిరాయి ముఠా నాయకుడిగా మారాడు. చైన్నెలో ప్రముఖ రౌడీలుగా ఉన్న ఆర్కాడు సురేష్ (ఇతడి హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగింది)కు అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో అజ్ఞాతంలో ఉన్న రౌడీ శంభో శంకర్‌కు మి త్రుడయ్యాడు. దీంతో ఏ వన్ రౌడీగా రాజ్య మేలు తూ వచ్చిన సీ సింగ్ రాజపై ఆరు హత్య కేసులతో పాటు 39 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో నాన్ బె యిల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇతడికి జానకీ, జాన్సీ అనే ఇద్దరు భార్యలు, ధనప్రియ, ధనుష్, యోగేష్ అనే కుమార్తె, కుమారులు ఉన్నారు. జాన్సీ ఆంధ్రాకు చెందిన మహిళ కావడంతో ఆర్మ్ స్ట్రాంగ్ హత్య అనంతరం కడపకు వెళ్లి తలదాచుకున్నాడు. చివరకు పోలీసులు అరెస్టు చేసి ఎన్కౌంటర్లో మట్టు బెట్టారు.మరో ఐదుగురు రౌడీల అరెస్టురౌడీల వేటలో భాగంగా చైన్నెలో సోమవారం నలుగురు, తిరుచ్చిలో ఓ ప్రముఖ రౌడీని అరెస్టు చేశారు. ఒట్టేరి, పులియాంతోపునకు చెందిన సుందర మూర్తి, కమల్, వెట్రి, భరత్ అనే ఈ నలుగురి రౌడీలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి మీద అనేక పాత కేసులు ఉన్నాయి. అలాగే తిరుచ్చిలో వృద్ధులను టార్గెట్‌చేసి, కంతు వడ్డి చెల్లించని వారిని గురి పెట్టి, ఆస్తుల పత్రాలు, ఆస్తులను కబ్జా చేస్తూ వచ్చిన రౌడీ, ఓ పార్టీకి చెందిన పట్టరై సురేష్‌ను అరెస్టుచేశారు. అతడి ఇంట్లో ఉన్న 60 మంది బాధితులకు సంబంధించిన దస్తావేజులు పోలీసులు సీజ్ చేశారు. అలాగే తిరుచ్చిలో పరారీలో ఉన్న రౌడీ జంబుకేశ్వరన్ను పోలీసులు పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. సాయంత్రం జరిగిన ఈ కాల్పులలో రౌడీ కాలికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. -
రౌడీషీటర్ జన్మదిన వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘అరాచకాలు సృష్టించడం.. రౌడీయిజం చేయడం.. దందాలకు పాల్పడటం లాంటివి చేస్తే ఎవరినైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ గత ఎన్నికల ప్రచారంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్‌కుమార్ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. లోకేశ్ చెప్పిన విధంగా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయో వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గత వారం గూడూరుకు చెందిన రౌడీషీటర్ కనుపూరు శ్రీహరి (జెమిని) పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పాల్గొన్నారు. అతడికి కేక్ తినిపించి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జెమిని పట్టణంలో దందాలు చేస్తూ రౌడీషీటర్‌గా ఉన్నాడు. అతడిపై ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మూడు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీషీటర్లను పెంచి పోషించేలా వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.మనవాళ్లే వదిలేయండి!గూడూరు నియోజకవర్గంలో అధికారం చేట్టిన రోజు నుంచి రౌడీలతోనే పాలన కొనసాగించేలా సంకేతాలు ఇస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ గ్రావెల్, మట్టి, ఇసుక తరలింపులను నేరుగా ప్రోత్సహిస్తూ కమీషన్ల రూపంలో రూ.లక్షలు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీషీటర్ల ద్వారా గంజాయి, పేకాట, జూదం (డైమండ్ డబ్బా) ఆటలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడైనా పట్టబడితే పోలీసులకు ‘మన వారే వదిలేయండి’ అని ఆదేశాలు ఇస్తున్నట్టు పబ్లిక్ టాక్. ఈ క్రమంలోనే పట్టణంలోని పాత నేరస్తులను చేరదీసి వారికి ఏరియాలను అప్పగించినట్టు సమాచారం. దీంతో వారు ఆడిన ఆటకు అటు పోలీసులు కూడా అడ్డు చెప్పడం లేదు.ఆ విషయం తెలియదుజెమినిపై ఉన్న కేసుల విషయమై పట్టణ ఎస్ఐ, సీఐలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. తాము వారం క్రితమే బదిలీల్లో భాగంగా వచ్చామని చెప్పారు. ఎవరిపై రౌడీషీట్లు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయనే విషయాలపై ఇంకా దృష్టి పెట్టలేదని సమాధానం దాటవేశారు. -
కారుతో ఢీకొట్టి.. తుపాకీతో కాల్చి..
పహాడీషరీఫ్: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్ అలియాస్ మెంటర్ రియాజ్ (45) లలితాబాగ్ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్ ఇంటికి వెళ్లగా, రియాజ్ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు. వచి్చన కారులోనే పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్ షెల్‌తో పాటు ఐరన్ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు. రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య
అమీర్‌పేట: పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్ మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన తరుణ్ (22) డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సోమవారం రాత్రి అతను బాపూనగర్‌లో దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీ షీటర్ షేక్ షరీఫ్, మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. తరుణ్ కూడా వారితో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత షరీఫ్ తరుణ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో షరీఫ్ వెంట ఉన్న వ్యక్తులు తరుణ్‌పై దాడి చేశారు. దీంతో బాపూనగర్‌కు వెళ్లిన తరుణ్ దాడి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్‌ను వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వచ్చాడు. తరుణ్ రాయితో షరీఫ్‌ను కొట్టడంతో అతను తరుణ్ కణతపై బలంగా కొట్టాడు. కిందపడి పోయిన తరుణ్‌పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అతడి అరుపులు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా షరీఫ్ అతడి అనుచరులు పారి పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్‌ను పోలీసులతో కలిసి అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవీస్, ఎసీపీ వెంకటేశ్వర్రావు, సీఐ రాంప్రపాదరావు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య: హత్యకు గురైన తరుణ్ ,రౌడీ షీటర్ షరీఫ్ మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో తరుణ్‌ను హత్య చేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం కూడా ఫరీష్ తరుణ్‌కు కొట్టి సెల్ ఫోన్ పగలకొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో తరుణ్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నీ అంతు చూస్తానంటూ షరీఫ్ తరుణ్‌ను తరుచూ బెదిరించేవాడని స్నేహితులు తెలిపా రు. ఇందులో భాగంగానే పథకం ప్రకారం దసరా పండుగ రోజున తరుణ్‌ను దాసారం బస్తీకి పిలిపించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య దారుణ హత్య
హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నందున పోలీసులకు లొంగిపోవాలని సూచించినందుకు ఓ రౌడీషీటర్‌ను మరో రౌడీషీటర్ కత్తులతో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన టార్గెట్‌లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన అనంతరం లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ డైరీఫామ్ ప్రాంతానికి చెందిన ఖూనీ గౌస్ రౌడీషీటర్. ఇతనిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీలు, భయబ్రాంతులకు గురి చేయడం తదితర కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన ఖూనీ గౌస్ గత నెలలో బయటికి వచ్చాడు. బయటికి వచి్చన అనంతరం తన గ్యాంగ్‌తో పాత సామ్రాజ్యాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి ఐదు రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డైరీఫామ్ వద్ద పాలను విక్రయించే ఓ వ్యక్తి దుకాణంపై దాడి చేశాడు. షాపును పట్టపగలే తగులబెట్టాడు. అడ్డొచ్చిన వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు..నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా..రాజేంద్రనగర్‌కు చెందిన మరో రౌడీషీటర్ సర్వర్ (30) ఇటీవల ఖూనీ గౌస్‌ను కలిసి గొడవలు వద్దని, పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. దీంతో ఖూనీ గౌస్ శుక్రవారం రాత్రి కలుద్దామంటూ సర్వర్‌కు తెలిపాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సర్వర్‌కు ఫోన్ చేసి జనప్రియ వెంచర్ ప్రాంతంలోని మొండి ఖత్వా ప్రాంతానికి రావాలని తెలిపాడు. సర్వర్ అక్కడికి వెళ్లగానే.. తననే పోలీసులకు లొంగిపోమంటావా...అంటూ కత్తులతో విక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సర్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడే ఉన్న ఇతర స్నేహితులతో ‘మరో ఇద్దరు తన టార్గెట్ అని..వారిని చంపిన అనంతరం పోలీసులకు లొంగిపోతానని’ తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పుడే అరెస్టు చేసి ఉంటే... ఐదు రోజుల క్రితం డైరీఫామ్ వద్ద జరిగిన దాడిలో నిందితుడైన ఖూనీ గౌస్‌ను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింద ని ఆరోపించారు. ఖూనీ గౌస్ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తాడని... గతంలో అత్తాపూర్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పీడీ యాక్ట్ అనంతరం జైలు నుంచి విడుదలైన ఖూనీ గౌస్‌పై నిఘా లేకపోవడంతో ఈ సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో వెంట నే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రాజేంద్రనగర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. డైరీ ఫామ్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో రౌడీ షీటర్ సర్వర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పథకం ప్రకారం సర్వర్‌ను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు.కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. పాతకక్షల నేపథ్యంలో సర్వర్‌ను దుండగులు చంపినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రౌడీల గ్యాంగ్‌వార్
అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని ఈదరపల్లి గ్రామానికి చెందిన రౌడీషీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ (24) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన అడపా సాయి లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈదరపల్లి శ్మశానంలో ఈ సంఘటన జరిగింది. అవివాహితుడైన హతుడు కిషోర్‌పై పట్టణ పోలీసు స్టేషన్లో పలు కేసులున్నాయి. ఇటీవల కొన్ని రౌడీ గ్యాంగ్‌లు తరచుగా ఆధిపత్య పోరుకు దిగుతున్నాయి. వీటిల్లో ఉన్న రౌడీలు పూటుగా తాగి, అప్పుడప్పుడు ఘర్షణలకు దిగుతున్నారు. ఇటువంటి ఘర్షణలోనే కిషోర్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారని పోలీసులు చెప్పారు. అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ కథనం ప్రకారం.. రౌడీ గ్యాంగ్‌లకు చెందిన కొంత మంది యువకులు తాగిన మైకంలో ఈదరపల్లి రంగా విగ్రహం వద్ద గురువారం రాత్రి ఘర్షణకు దిగారు. ఆ గొడవలు రాత్రి సద్దుమణిగాయి. శుక్రవారం ఉదయం వారు మళ్లీ అదే చోట ఘర్షణకు దిగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి, రంగా విగ్రహం వద్ద ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ఈలోగా ఈదరపల్లి శ్మశానం వద్ద రౌడీషీటర్ కిషోర్, అతడి స్నేహితుడు అడపా సాయిలక్ష్మణ్పై ప్రత్యర్థులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న కిషోర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తూండగా ప్రాణాలు వదిలాడు. గాయపడిన సాయి లక్ష్మణ్‌ను తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురి పేర్లు వెల్లడి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి లక్ష్మణ్‌ను డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి ఏరియా ఆస్పత్రిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేట్మెంట్ నమోదు చేశారు. ఈదరపల్లికి చెందిన సతీష్, ఇంద్ర, పట్టణంలోని కొంకాపల్లికి చెందిన రౌడీ షీటర్ ఇండిగుల ఆనంద్, అల్లవరం మండలం గూడాలకు చెందిన సుధీర్‌తో పాటు మరి కొంత మంది తమపై దాడి చేశారని లక్ష్మణ్ తెలిపాడు. వీరిలో ఇండిగుల ఆనంద్ టీడీపీ సానుభూతిపరుడు. టీడీపీ అమలాపురం నియోజకవర్గ నాయకుడు, మాజీ రౌడీ షీటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ హత్య తాగిన మైకంలో చెలరేగిన ఘర్షణల వల్లే జరిగిందని డీఎస్పీ అంబికా ప్రసాద్ చెప్పారు. సాయిలక్ష్మణ్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పోలీసు అధికారులు ఈదరపల్లి శ్మశానం వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. గాయపడిన సాయి లక్ష్మణ్ పరిస్థితిని జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా కూడా స్వయంగా పరిశీలించారు. రెండు పోలీసు బృందాలు సాయి లక్ష్మణ్ చెప్పిన ప్రత్యర్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇద్దరు ఎస్సైలతో కూడిన రెండు పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఎస్సై హరీష్‌కుమార్, ఎస్సై ప్రభాకర్‌ల ఆధ్వర్యాన రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టాయి. కాగా, ఈ సంఘటనలో హత్యకు గురైన రౌడీషీటర్ కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కిషోర్ అవాహితుడు. తరచూ వివాదాలకు దిగుతూంటాడని పోలీసులు చెప్పారు. హత్యకు నిరసనగా దుకాణం దహనం రౌడీ షీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ హత్యను నిరసిస్తూ అతడి వర్గానికి చెందిన కొందరు స్థానిక ఎర్ర వంతెన వద్ద ఉన్న ఓ దుకాణాన్ని శుక్రవారం రాత్రి దహనం చేశారు. సప్తగిరి అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న టీడీపీ నాయకుడు, మాజీ రౌడీ షీటర్ గంధం పల్లంరాజుకు చెందిన ఈ దుకాణాన్ని కిషోర్ వర్గీయులు దహనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దహనమవుతున్న దుకాణం వద్దకు డీఎస్పీ అంబికా ప్రసాద్ చేరుకుని స్థానికులను విచారించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి దుకాణానికి నిప్పు పెట్టినట్టు స్థానికులు చెప్పారు. షాపు దహనానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో పక్కనున్న దుకాణాలు కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. -
వరంగల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి, వరంగల్: వరంగల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శివనగర్‌కు చెందిన నజీర్‌ను రాడ్డు, రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి ఇంట్లో నిద్రిస్తున్న నజీర్పై పది మంది దాడి చేసి హత్య చేయడం కలకలం సృష్టిస్తుంది. నజీర్ పదిమంది వర్కర్లను పెట్టుకుని రైల్వేలో సమోసాలు, పల్లి పట్టీలు విక్రయించే క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల వర్క్ చేసే వారిలో ఒకరు స్వయంగా సమోసాలు చిరుతిండ్లు విక్రయిస్తుండడంతో వారితో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ కారణంగానే నజీర్ హత్య జరినట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది? -
రౌడీషీటర్ దారుణ హత్య
బనశంకరి: పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సిద్దాపుర మహేశ్ హత్యకు గురైన రౌడీషీటర్. మహేశ్ పలు నేరాలతో సంబంధం ఉన్న కారణంగా పరప్పన అగ్రహార జైలుకెళ్లాడు. శుక్రవారం జైలు నుంచి విడుదలైన మహేశ్ హొసరోడ్డు జంక్షన్ వద్ద కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో కారును అడ్డుకున్న ప్రత్యర్థులు మహేశ్‌పై మరణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి ఉడాయించారు. రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగ వ్యతిరేక గ్యాంగ్‌లో మహేశ్ లీడర్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి గ్యాంగ్ రౌడీషీటర్ విల్సన్‌గార్డెన్ నాగ. మోహన్ అలియాస్ డబల్ మీటర్ మోహన్, సునీల్ తదితరులపై కేసులు ఉన్నాయి. 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో హాసన ఫామ్‌హౌస్‌లో రౌడీషీటర్ లింగన్నను విల్సన్‌గార్డెన్ నాగన్న వర్గం హత్య చేసింది. మోహన్, నంజప్ప, కణ్ణన్, కుమార్, ప్రదీప్ గ్రీస్ వాల్టర్, సునీల్ తదితరులతో కలిపి 16 మంది బృందం లింగన్నను హత్య చేశారు. హత్యకు ప్రతీకారంగా లింగన్న గ్యాంగ్‌లో ఉన్న సిద్దాపుర మహేశ్, విల్సన్‌గార్డెన్ స్నేహితుడిగా ఉన్న మదన్‌ను హత్య చేశాడు.దీంతో నాగన్నపై ప్రతీకారం పెరిగింది. అదే కారణంతో శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలైన మహేశ్‌ను నాగన్న గ్రూపు కాపుగాచి హత్య చేసింది. ఘటనా స్థలాన్ని సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ శరణప్ప పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
రౌడీషీటర్ క్రాంతి దారుణ హత్య.. కొడుకుతో కలిసి హత్యలో పాల్గొన్న వ్యక్తే ?
విశాఖపట్నం: ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధి ఆదర్శనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రౌడీషీటర్ వాసుపల్లి లక్ష్మణరావు అలియాస్ క్రాంతి (50)ని దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనలో హత్యకు గురైన క్రాంతిపై గతంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. గత కొన్నాళ్లుగా అతడు వివాదాలకు దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రాంతి అనుపమ బార్ ప్రాంగణంలో మద్యం సేవించాడు. అనంతరం అక్కడ చీకులు అమ్ముతున్న వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడి సమీపంలో రోడ్డుకు అటువైపు ఉన్న మెడ్‌ప్లస్ మెడికల్ షాపు వద్ద మందులు కొనడానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మెడ్‌ప్లస్ షాపులోకి వెళుతున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. మెడ, నుదిటి భాగంలో తీవ్రంగా నరకడంతో క్రాంతి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కొడుకుతో కలిసి హత్యలో పాల్గొన్న వ్యక్తే ? 2022 ఆగస్టు 17న జరిగిన అదే ప్రాంతంలో జరిగిన ఓ హత్య ఘటనలో క్రాంతి కొడుకు శ్యామ్‌తో పాటు పాల్గొన్న ఎర్రయ్య అనే వ్యక్తే క్రాంతిని హతమార్చినట్లు సమాచారం. ఆ హత్య కేసులో క్రాంతి కొడుకు శ్యామ్ ఏ1 కాగా ఎర్రయ్య ఏ3 ముద్దాయిగా ఉన్నాడు. ఆ ఘటన అనంతరం క్రాంతి తన కొడుకు శ్యామ్ బెయిల్ కోసం, ఇతర అవసరాల కోసం తప్ప ఆ హత్యకు సహకరించిన తనని పట్టించుకోలేదనే కక్షతో కొన్నాళ్లుగా ఎర్రయ్య రగిలిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీరు ఇరువురు కొంతకాలంగా గొడవ పడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూసిన ఎర్రయ్య గురువారం మెడికల్ షాపునకు వచ్చిన క్రాంతిపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో అతనికి వేరే వ్యక్తులు కూడా సహకారం అందించినట్లు పలువురు చెబుతున్నారు. క్రాంతిపై గతంలో కేసులు.. హత్యకు గురైన క్రాంతిపై నగరంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. పీఎం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసును కోర్టు కొట్టేయగా.. 2014లో 3వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ ఘటన అనంతరం క్రాంతి భార్య విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తన భర్తను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం ఆయనే పలుమార్లు తనకు చెప్పాడన్నారు. ఇందుకు అవసరమైన డబ్బులు వేరే వ్యక్తులు సమకూరుస్తున్నారన్నారు. ఎవరు హత్య చేశారనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో క్రాంతి కొడుకుతో పాటు పలువురిని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
నిజామాబాద్: ఎడపల్లి మండల కేంద్ర శివారు నిజామాబాద్ రోడ్డులో రౌడీ షీటర్ ఆరిఫ్ డాన్‌ను ప్రత్యర్థులు పట్టపగలు హత్య చేశారు. ఆరిఫ్ డాన్ గురువారం ఓ దొంగతనం కేసులో బోధన్ కోర్టుకు పేషీపై వెళ్లాడు. కోర్టు వాయిదా పడటంతో తిరిగి నిజామాబాద్‌కు స్నేహితుడు బుల్లెట్ ఖాదర్, మరో ఇద్దరితో కలిసి రెండు బైక్‌లపై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరిఫ్ డాన్, బుల్లెట్ ఖాదర్ కలిసి వస్తున్న బుల్లెట్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడిపోయారు. లారీలోంచి ఎనిమిది మంది దిగి వీరిద్దరిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఆరిఫ్‌డాన్ రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే చనిపోయాడు. బుల్లెట్ ఖాదర్ కాలు విరిగింది. తలపై కత్తిపోట్టు పడ్డాయి. వీరివెంట మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు పారిపోయినట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని ఏసీపీ కిరణ్‌కుమార్, ఇద్దరు సీఐలు పరిశీలించారు. ఏసీపీ మాట్లాడుతూ ఆరిఫ్ ఓ దొంగతనం కేసులో బోధన్కోర్టుకు వెళ్లి వస్తుండగా ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 1న నగర శివారులోని సారంగపూర్ వద్ద జరిగిన ఒకరి పుట్టిన రోజు వేడుకలకు ఆరిఫ్, ఇబ్రహీంఛావూస్ అలియాస్ జంగిల్ ఇబ్బు హాజరయ్యారు. సాంగ్ వేసే విషయంలో గొడవ జరిగి ఇబ్రహీంఛావూస్ను ఆరిఫ్‌డాన్ అతని అనుచరులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ కేసులో మూడు నెలల క్రితమే ఆరీఫ్డాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆరిఫ్ హత్యలో సిద్దు, కరీంలాల, సమద్, ఇర్ఫాన్, సోహెల్, హద్దు, చోటసోహైల్ అనే వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇబ్రహీంఛావూస్, ఆరిఫ్‌డాన్ గతంలో కలిసి ఇల్లీగల్ దందా చేసేవారని తెలిసింది. పంపకాలలో వచ్చిన తేడాతోనే ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని ఇద్దరూ హతం అయ్యారు. దీని వెనుక పాత రౌడీషీటర్ల హస్తంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
గ్యాంగ్‌స్టర్ అతిక్ సన్నిహితుడు గుడ్డూ ముస్లిం ఎక్కడున్నాడు?
భువనేశ్వర్: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నాయకుడుగా ఎదిగి, హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు సన్నిహితుడు, కరుడుగట్టిన నేరస్తుడు గుడ్డూ ముస్లిం 12రోజులుగా రాష్ట్రంలో తల దాచుకున్నట్లు ప్రసారమైన వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితుడైన గుడ్డూ ముస్లింను ఉత్తరప్రదేశ్ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అదృశ్యమైన నిందితుడి ఆచూకీ చివరి ప్రదేశం రాష్ట్రంలో బర్‌గడ్‌గా ఖరారైనట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి. హత్యకు గురైన డాన్ అతీక్ అహ్మద్ అనుచరుడు గుడ్డూ ముస్లిం ఇటీవల కాలంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో తారస పడింది. తాజాగా బర్‌గడ్‌లో ఉన్నట్లు రాష్ట్రేతర పోలీసు వర్గాల సమాచారం. గుడ్డూ ముస్లిం ఈనెల 2 నుంచి 13వ వరకు ఒడిశాలో ఉన్నాడని పోలీసులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ జాతీయ వార్తా సంస్థ సమాచారం. దాదాపు 12 రోజుల పాటు రాష్ట్రంలో తలదాచుకున్న అతడు తన దుస్తులతో కూడిన బ్యాగ్‌ని వదిలి పారిపోయాడని ఈ సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గుడ్డూ ముస్లిం సహాయకుడు రాజా ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులకు దొరికిపోకుండా ఉండేందుకు గడ్డం పెంచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు ఈ సమాచారం తెలిపింది. పూరీ కటకక.. గుడ్డూ ముస్లిం మీరట్, అజ్మీర్, ఝాన్సీ, నాసిక్, పూణే, ప్రస్తుతం ఒడిశాలో బర్గడ్ వంటి ప్రాంతాలకు ప్రయాణించినట్లు బలమైన ఆధారాలు ఉన్నా యి. ప్రస్తుతం అతడు ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు, అతని చివరి మజిలీ కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 10 మందిలో గుడ్డూ ముస్లిం ఒకడు. వీరిలో అతీక్ అహ్మద్‌తో మరో 5 మంది చంపబడ్డారు. గుడ్డూ ముస్లిం ఇప్పటి వరకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ఆట పట్టిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్–రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేసిన నుంచి గుడ్డూ ముస్లిం ఆయన అనుచరునిగా పని చేస్తున్నాడు. గుడ్డూ ముస్లిం పేరుగాంచిన బాంబ్ స్పెషలిస్ట్‌గా పోలీసుల రికార్డుల్లో చోటు చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమేష్‌పాల్‌ను పట్ట పగలు హత్య చేసిన వీడియోలో మోటారు సైకిల్‌పై వెనుక కూర్చుని అవలీలగా నాటు బాంబులు రువ్వుతున్నట్లు రికార్డు అయింది. ఈ వీడియో రికార్డింగు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్లో అతని పేరు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ ఏర్పాటు.. ఐదుగురు సభ్యులతో కూడిన ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్కుఫోర్సు(ఎస్టీఎఫ్) బృందం ఈ నెల 18వ తేదీన బర్గడ్ సందఉ లిపారు.ఈ బృందం బర్‌గడ్‌లో 2 రోజులు డేరా వేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిలదీసింది. ఈ నేపథ్యంలో వారికి నిబంధనల ప్రకారం అన్ని విధాలా సహకారాన్ని అందించినట్లు బర్గడ్ ఎస్పీ వివరించారు. ఎవరినీ అరెస్టు చేయలేదని ఎస్పీ తెలిపారు. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ఇటీవల కాల్కుమార్ బన్సాల్ మీడియాకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు రాష్ట్ర పోలీసులకు ఎటువంటి సమాచారం అందజేయలేదని వివరించారు. గుడ్డూ ముస్లిం బర్‌గడ్‌లో ఉన్నాడని ఓ జాతీయ మీడియా వెబ్సైట్ పేర్కొందన్నారు. గత వారం, రాజా ఖాన్ ధ్రువీకరించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసు బృందం బర్గడ్ సందర్శించింది. రాష్ట్ర పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర ప్రదేశ్ పోలీసుల బృందం పూరీని సందర్శించిన దాఖలాలు లేవు. బర్‌గడ్‌లో రాజా ఖాన్ విచారణ చేపట్టారు. కానీ అతన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయలేదు. -
కరీంనగర్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. అరుణ్ జస్ట్ మిస్!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు రౌడీలు మరో రౌడీషీటర్‌పై తపంచాతో కాల్పులు జరిపారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాషబోయిన అరుణ్ అనే రౌడీషీటర్‌పై ఇద్దరు వ్యక్తులు అతని ఇంట్లోనే దాడికి పాల్పడ్డారు. అసలేం జరగుతుందో తెలుసునేలోపే తపంచాతో కాల్పులకు దిగారు. కొద్దిలో గురి తప్పడంతో అరుణ్ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ ఇద్దరు రౌడీలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. అరుణ్ ఎక్కడున్నాడో తెలపాలని కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు అరుణ్ కుటుంబ సభ్యులను కాపాడారు. ఇద్దరు రౌడీలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష్ మరొకరు మానుకొండూరుకు చెందిన బైరగోని మధు అని పోలీసుల విచారణలో తెలిసింది. -
ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ‘ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి..!, ఏం పీకుతారో చూస్తాను’అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడి అంతిమ యాత్రలో కత్తితో హల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాట్సప్‌లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నగరంలో వైరల్ అయింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న పూర్ణామార్కెట్ దరి గాజులవీధికి చెందిన నాయన తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్ వేడుకలు నిర్వహించుకున్నారు. 18న తెల్లవారుజామున అరకు వెళ్లారు. మంగళపాలెం వద్ద నాయన తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. తరుణ్ తండ్రి మాలవేసి ఉండడంతో 20న శవ పంచనామా చేసి సాయంత్రం అప్పగించారు. మార్చురీ నుంచి ఊరేగింపుగా శవయాత్ర నిర్వహిస్తూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కొబ్బరితోట వద్ద తరుణ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల వినయ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారు మద్యం మత్తులో తరుణ్‌కు జేజేలు పలికారు. ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం మాత్రం ఓ ఇద్దరి వ్యక్తుల భుజాలపై ఎక్కి మాంసం కత్తిని చేతితో చూపిస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. చదవండి: (తిరుమల: ఆన్లైన్లో ప్రత్యేక, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు) నిందితుల అరెస్ట్: కత్తులు, మారణాయుధాలతో హల్చల్ చేస్తూ నగర ప్రజలను భయాందోళనలకు గురి చేసిన 9 మందిని టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు కల్లుపాకలు, పండావీధి, కొబ్బరితోటకు చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు. కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారంతా పోలీసుల విధులకు అడ్డు తగిలారు. నిందితులపై నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. -
గ్యాంగ్ నుంచి వెళ్లిపోయాడని..కిడ్నాప్ చేసి బట్టలూడదీసి...
సాక్షి, రాజేంద్రనగర్: గ్యాంగ్ నుంచి వెళ్లిపోయి తమపైనే దుష్ప్రచారం చేస్తావా అంటూ ఓ రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బట్టలూడదీసి చితకబాదిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో రెండు సార్లు సదరు యువకుడిపై ఇదే గ్యాంగ్ దాడికి పాల్పడింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో వారు మరోసారి తెగబడ్డారు. రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు యువకుడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లలో పోస్టు చేసుకోవడం గమనార్హం. తమతో ఎవరైనా పెట్టుకుంటే తమను కాదంటే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను గతంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో సన్నిహితంగా ఉండే వాడు. అతడి గ్యాంగ్‌లో తిరుగుతూ గొడవలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు మహ్మద్ ఇర్ఫాన్‌ను మందలించి ట్యాక్సీ కోనుగోలు చేసి ఇచ్చారు. గత 8 నెలలుగా ట్యాక్సీ నడుపుకుంటున్న ఇర్ఫాన్ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రౌడీషీటర్ ఇర్ఫాన్ తన గ్యాంగ్ నుంచి వెళ్లిపోయినందుకు రూ.50 వేలు ఇవ్వాలని అతడికి ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. రెండు సార్లు ఇంటి వద్దకు వచ్చి గొడవపడి దాడి చేశాడు. రెండు నెలల క్రితం అతడిపై దాడి చేయడంతో బాధితుడి సోదరుడు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి మహ్మద్ ఇమ్రాన్ తన కారును లంగర్‌హౌజ్‌లో సరీ్వసింగ్‌కు ఇచ్చి ఇంటికి వచ్చేందుకు వేచి ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్ ఇర్ఫాన్ అతడి స్నేహితులు జహీర్, షహీన్‌షా, ముదస్సర్, ఫవాద్‌లు మహ్మద్ ఇర్ఫాన్‌ను మాట్లాడేది ఉందంటూ ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్ దర్గా సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతడి దుస్తులు విప్పించి బెల్టులు, కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహ్మద్ ఇర్ఫాన్‌పై దాడి చేసి అనంతరం సన్‌సిటిలోని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. రౌడీషీటర్ గ్యాంగ్ రికార్డు చేసిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లతో పాటు గ్రూప్‌లలో పోస్టులు చేశారు. తమతో విభేదించినా, తమతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని కామెంట్ చేశారు. ఈ క్లిప్పింగ్ చూసిన మహ్మద్ ఇర్ఫాన్ సోదరుడి స్నేహితుడు సమాచారం అందించడంతో అతను మహ్మద్ ఇర్ఫాన్‌ను నిలదీశాడు. అప్పటికే గాయాలతో బాధపడుతున్న మహ్మద్ ఇర్ఫాన్‌ను రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఉషామోహన్ ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే... గతంలో మహ్మద్ ఇర్ఫాన్‌పై రౌడీషీటర్ ఇర్ఫాన్ గ్యాంగ్ దాడి చేసి బెదిరించింది. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడి సోదరుడు ఆరోపించారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నాడు. ఇప్పటికైనా రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో పాటు అతడి గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. (చదవండి: మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...) -
రౌడీషీటర్‌తో బీజేపీ నేతల రక్తదాన కార్యక్రమం...పేలిన మాటల తుటాలు
కర్ణాట బీజీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన నేరస్తుడు సునీల్ దర్శనమిచ్చాడు. అతను బెంగుళూరులో అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్ కిల్లర్‌గా పరిగణించే సునీల్. ప్రస్తుతం అతను నేర కార్యకలపాలకు దూరంగా ఉంటున్నానని, సమాజ సేవ చేస్తున్నాని చెబుతుండటం విశేషం. ఆ నేరస్తుడు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, చిక్‌పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కనిపించాడు. దీంతో అతను బీజేపీలోకి చేరతాడంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కర్ణాట బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందిస్తూ... ఈ మిషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని అన్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలను ఆదేశించామని, అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారిని, నేర నేపథ్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోమని, ఇలాంటి వాటిని పార్టీ ఎప్పటికీ సహించదని నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శులు ఎక్కుపెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా..పోలీసుల దాడిలో దొరకని రౌడిషీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చారు. గతంలో బెట్టింగ్‌లకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీ పార్టీలో చేరి, మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య కూడా బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ శివకుమార్ ఒకప్పుడూ గ్యాంగ్‌స్టర్ కొత్వాల్ రామచంద్రకు అభిమాన శిష్యుడంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడూ కొత్వాల్ అభిమాన శిష్యుడు తీహార్ జైలు నుంచి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడని, ప్రస్తుతం అతను పార్టీ అద్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులను మరిచిపోయారా అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అండర్ వరల్డ్‌లో పెరిగిన శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హత్య నిందితులు వినయ్ కులకర్ణి, గూండాయిజంలో పేరుగాంచిన మహ్మద్ నలపాడ్‌లు కర్ణాటక కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారంటూ మొత్తం లిస్ట్ పేర్కొంది బీజేపీ. కాగా, ఇరు పార్టీ మాటల తుటాల దాడి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ...పాత రౌడీషీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో క్రైం బ్రాంచ్ కమిషనర్ ఎన్డీ శరణప్ప ఈ విషయమై వివరణ ఇచ్చారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ సునీల్‌పై ఎలాంటి పాత పెండింగ్ కేసులు లేవని స్పష్టం చేశారు. అంతేగాదు అతను విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేకపోవడంంతోనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రౌడీషీటర్ సునీల్‌ని అదుపులోకి తీసుకులేదని తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం) -
విశాఖ పోలీస్ సంచలన నిర్ణయం.. నగరంలో తొలిసారి..
సాక్షి, దొండపర్తి / మధురవాడ (భీమిలి): నగరంలో నేర నియంత్రణపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీస్ శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో తొలిసారిగా ఒక రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి నేరాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించింది. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గూండాయిజం చేస్తున్న రౌడీషీటర్ పెంటకోట కిరణ్(19)ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ బుధవారం నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన కిరణ్ ఇంటర్ వరకు చదివాడు. వ్యసనాలకు బానిసై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ప్రారంభించాడు. పీఎంపాలెం స్టేషన్ పరిధిలో రోబరీ, కిడ్నాప్, కొట్లాట ఇలా అనేక నేరాలకు కిరణ్ పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఐపీసీ 297, 324, 425, 364 – ఏ, 342, 323, 384, 120బి, 34తోపాటు 428, 392 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్, హిస్టరీ షీట్‌తోపాటు ఎన్నికేసులు ఉన్నప్పటికీ కిరణ్ నిత్యం నేరాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా గూండాయిజం చేస్తూ ప్రజలను బెదిరించడంతోపాటు దాడులకు పాల్పడుతున్నాడు. గత 6 నెలలుగా కిరణ్ కదలికలు, కార్యకపాలపై పోలీసులు నిఘా పెట్టారు. అతడి నుంచి ప్రజలకు, వారి ఆస్తులకు ప్రమాదముందని భావించారు. అతడిపై కేసులు పెట్టే వారితోపాటు, సాక్షులను బెదిరిస్తుండడంతో కిరణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ప్రజలు భయపడుతుండడాన్ని గుర్తించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెంటకోట కిరణ్‌ను షరతులతో అక్టోబర్ 31వ తేదీ నుంచి 6 నెలలపాటు విశాఖ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ నోటీసు అందించారు. రౌడీషీటర్లకు వెన్నులో వణుకు నగరంలో జరుగుతున్న నేరాలు, హత్యలతో పోలీసులు రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్న, సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అలాగే నిర్మాణుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం, ఇతర నేరాలకు పాల్పడుతున్న వారిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తొలిసారిగా రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. నగరంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ రౌడీషీటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు నగరంలో రౌడీయుజం, గూండాయుజం, నేరాలకు పాల్పడితే సహించేది లేదు. నగర ప్రశాంతతకు, భద్రతకు భంగం కలిగించే వారెవరైనా ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖలో నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
Hyderabad: రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘట న భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా ఇమామ్‌బడా ప్రాంతానికి చెందిన సయ్యద్ రజా ఖురేషి కుమారుడు సయ్యద్ మహమ్మద్ భక్తియార్ ఆఘా (25) రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నవాజ్ వ్యక్తి హత్య కేసులో నిందితుడు. సయ్యద్ మహమ్మద్ ఆఘాపై రెయిన్‌బజార్ పీఎస్‌లో రౌడీషీట్ కూడా నమోదై ఉంది. ఈ నెల 5న తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కుమ్మర్వాడీ ప్రాంతంలో సయ్యద్ మహమ్మద్ ఆఘాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పాతకక్షల నేపథ్యంలో సయ్యద్ మహ్మద్ ఆఘా హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఐ శేఖర్ రెడ్డి ఘటనా స్థలంలో వివరాలను సేకరించారు. చదవండి: (Hyderabad: రూ. 2410 కోట్ల లింక్ రోడ్ల పనులకు ప్రభుత్వం అనుమతులు) -
మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ.. పట్టపగలే దారుణం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మరో దారుణ హత్యతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. పెందుర్తి ప్రాంతంలో హల్చల్ సృష్టించిన సైకో కిల్లర్ ఉదంతం మరువకముందే ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధి ఆదర్శనగర్‌లోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట బుధవారం సాయంత్రం 4 గంటలకు మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది. చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు ఈ ఘటనలో బొడ్డు అనీల్‌కుమార్ (35) అనే రౌడీషీటర్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక ప్రణాళిక ప్రకారం హతమార్చినట్లు గుర్తించారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ద్వారకా జోన్ ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ (34) అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనీల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి నుంచీ నేర చరిత్రే... బొడ్డు అనీల్‌కుమార్ తన కుటుంబంతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్య ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనీల్‌కు తొలి నుంచి నేరచర్రిత ఉంది. దొంగతనాలు, పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. చాలా కాలం భార్యభర్తలు కాకినాడలో నివాసమున్నారు. ఆ సమయంలో అనీల్‌పై కాకినాడ పోలీసులు రౌడీషిట్ కూడా తెరిచారు. దీంతోపాటు అక్కడ పలు గొడవల్లో అనీల్ నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం క్రితం అనీల్ విశాఖకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బరంపురంలోని ఓ సంస్థలో ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చిన అనీల్‌కుమార్ బుధవారం హత్యకు గురవ్వడం పట్ల వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గతంలో హత్యాయత్నం అనీల్‌తోపాటు ఈ హత్య కేసులో నిందితుడైన బాక్సర్ శ్యామ్‌కూ (శ్యామ్ ప్రకాష్) తొలి నుంచి నేరచరిత్ర ఉంది. శ్యామ్‌పై కూడా రౌడీïÙట్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిర్ధారించ లేదు. అయితే వీళ్లు ఇద్దరికీ తొలి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. లోకల్ గ్యాంగ్ వార్‌తోపాటు ఒకరిపై ఒకరు హత్యా బెదిరింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఓసారి బాక్సర్ శ్యామ్ ఆదర్శనగర్ ప్రాంతంలోనే అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అనీల్ కళ్లల్లో కారం కొట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో అనీల్ ఎదురు దాడికి దిగడంతోపాటు స్థానిక యువకులు అడ్డుకోవడంతో అనీల్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్‌ను చంపేస్తానని పలుసార్లు అనీల్ బెదిరించేవాడు. దీంతో ఇరువురి మధ్య పరిస్థితి గ్యాంగ్ వార్‌గా మారడంతో స్థానిక యువకులు ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన వారి మధ్య గొడవలు ఎందుకని సర్ది చెప్పారు. దీంతో ఇద్దరూ అయిష్టంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దంటూ ఒప్పందం చేసుకున్నారు. హత్యకు పక్కా ప్రణాళిక ఇరువురి ఒప్పందం నేపథ్యంలో అనీల్, శ్యామ్ మధ్య కక్షలు కొన్ని రోజులుగా సద్దుమనిగాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూసిన బాక్సర్ శ్యామ్‌కు బుధవారం మధ్యాహ్నం అనీల్ ఆదర్శనగర్‌లో ఓ వేడుక సందర్భంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని భావించిన బాక్సర్ శ్యామ్ అతని దగ్గరుకు వెళ్లి ‘‘మామా... నాకు ఏమైనా ఉందా..’’ అని అడగడంతో ఇద్దరూ కొంతసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో శ్యామ్ కోసం అనీల్ బీరు కూడా తెప్పించాడు. ఆ బీరు తాగిన అనంతరం అనీల్ కోసం ఆఫ్ బాటిల్ మద్యం తెప్పిస్తానని చెప్పిన శ్యామ్... వేరే యువకుడికి డబ్బులు ఫోన్ పే చేసి బాటిల్ తెప్పించాడు. పథకం ప్రకారం అది కూడా పూర్తిగా అనీల్‌తో తాగించాడు. అది పూర్తయిన అనంతరం మళ్లీ ఇరువురు చేరో క్వార్టర్ మద్యం తాగుదామంటూ బాక్స్ర్ శ్యామ్æ కోరడంతో అనీల్ సరేనన్నాడు. దీంతో ఇరువురు దగ్గరలోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చారు. ఇద్దరూ చెరో క్వార్టర్ తాగి బయటకొచ్చారు. ఈ క్రమంలో అదును కోసం ఎదురుచూస్తున్న బాక్సర్ శ్యామ్ ఒక్కసారిగా అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. మద్యం మత్తలో ఉన్న అనీల్ తేరుకునే లోపే మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీంతో అనీల్ కుప్పకూలిపోగా శ్యామ్ అతడిపైకి ఎక్కి తనతోపాటు తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా చాతీతోపాటు పలు చోట్ల పొడిచాడు. దీంతో అనీల్ శరీరంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు పడ్డాయి. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. స్థానికులంతా భయాందోళనకు గురై పారిపోయారు. అనీల్ అక్కడికక్కడే మృతి చెందగా వెంటనే బాక్సర్ శ్యామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
మాదాపూర్ నీరూస్ సర్కిల్ వద్ద రౌడీషీటర్ల మధ్య ఘర్షణ
-
మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి
సాక్షి, హైదరాబాద్: ఆ ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఇద్దరికీ నేర చరిత్ర ఉంది.. కొన్ని భూముల లావాదేవీల విషయంగా వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఒకరు మాట్లాడుకుందాం రమ్మని మరో వ్యాపారిని పిలిచాడు. కలిసి టిఫిన్ చేద్దామన్నాడు. రోడ్డు పక్క నిలబడి ఇడ్లీ తింటుంటే.. అనుచరుడితో కాల్పించి చంపించాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని మాదాపూర్ నీరూస్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. ఇందులో ఒకరు అక్కడిక్కడే చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. వేగంగా విచారణ చేపట్టి.. సోమవారం రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జైల్లో పరిచయం.. భూముల దందాలు.. హైదరాబాద్‌లోని కాలాపత్తర్ పోలీసుస్టేషన్లో రౌడీ షీటర్‌గా నమోదై ఉన్న ఇస్మాయిల్ (39)పై వివిధ నేరాలకు సంబంధించి పదికిపైగా కేసులు ఉన్నాయి. దుండిగల్‌కు చెందిన ముజాహిద్ సైతం హత్య కేసులో జైలుకు వెళ్లాడు. జైలులోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. బయటికి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా జహీరాబాద్ సమీపంలోని రేంజల్ మండలం కేంద్రంగా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో భూదందాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. పరిష్కరించుకుందాం రమ్మని.. వివాదాలపై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆదివారం సాయంత్రం ముజాహిద్ నుంచి ఇస్మాయిల్‌కు ఫోన్ వచ్చింది. ఇస్మాయిల్ రాత్రి 11.30 గంటల సమయంలో బహదూర్‌పురాకు చెందిన అక్రం, గౌస్, జహంగీర్‌లతో కలిసి తన కారులో మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి వచ్చాడు. మరోవైపు ముజాహిద్ తన వద్ద పనిచేసే జిలానీ, ఫెరోజ్ లతో కలిసి అక్కడికి వచ్చాడు. మాసబ్ ట్యాంక్ వద్ద కాసేపు మాట్లాడుకున్నవారు.. అక్కడి నుంచి పెన్షన్ ఆఫీస్ జంక్షన్, పంజాగుట్ట ప్రాంతాల్లో కాసేపు ఆగి రాత్రి 2 గంటల ప్రాంతంలో మాదాపూర్ వద్దకు చేరుకున్నారు. ఇడ్లీ తింటుండగా కాల్చేసి.. మాదాపూర్‌లో ఇస్మాయిల్, ముజాహిద్ రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన బండి వద్ద ఇడ్లీ తింటున్నారు. అదే సమయంలో ముజాహిద్ అనుచరుడు జిలానీ వెనుక నుంచి వచ్చి ఇస్మాయిల్ తలపై పిస్టల్‌తో కాల్చాడు. అతి సమీపం నుంచి కాల్చడంతో ఇస్మాయిల్ తల ఛిద్రమై మెదడు బయటికి వచ్చింది. ఇది చూసిన జహంగీర్ ప్రతిఘటించడంతో అతడి తలపై పిస్టల్‌తో గట్టిగా కొట్టారు. వెంటనే ముజాహిద్, జిలానీ, ఫెరోజ్ తమ ఎర్తిగా కారులో పరారయ్యారు. మరోవైపు అక్రం, గౌస్ తాము వచ్చిన స్విఫ్ట్ కారులో ఇస్మాయిల్, జహంగీర్‌లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జహంగీర్‌కు గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు. ఇస్మాయిల్ హత్య విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలన చేపట్టారు. ప్లాన్ చేశారా.. ఆవేశంలో కాల్చారా? ఈ ఘటనలో ఇస్మాయిల్‌ను కాల్చిన జిలానీతోపాటు అతడికి సహకరించిన ఆరోపణలపై ఫెరోజ్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి ముజాహిద్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య పథకం ప్రకారం జరిగిందా? అప్పటికప్పుడు ఆవేశంలో జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదివారం రాత్రి 11.30 నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అంతా కలిసే ఉన్నారని.. ముందే ప్లాన్ చేసి ఉంటే అంతసేపు కాల్పులు జరపకుండా ఉండేవారు కాదన్న భావన వస్తోందని పోలీసులు అంటున్నారు. పంజాగుట్ట, మాదాపూర్ ప్రాంతాల్లో ఆగినప్పుడు ముజాహిద్ ఆదేశించడంతో.. ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా.. ఇస్మాయిల్‌ను నాటు పిస్టల్‌తో కాల్చినట్టు భావిస్తున్నామని మాదాపూర్ ఇన్చార్జి డీసీపీ గోనె సందీప్‌రావు తెలిపారు. అయితే క్షతగాత్రుడు జహంగీర్ మాత్రం రెండు తుపాకులతో ఇద్దరు వ్యక్తులు ఐదారు రౌండ్లు కాల్పులు జరిపారని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జిలానీ ఇంతకుముందు కూడా జావేద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై హత్యాయత్నం చేశాడని.. బెయిల్‌పై బయటికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి -
యువతితో రౌడీషీటర్ సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ చివరికి..
పాయకాపురం(విజయవాడ రూరల్): వాంబేకాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25) మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వాంబేకాలనీ హెచ్ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న శంకర్ ట్యాటూస్ వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరిరువురి మధ్య గొడవ జరిగింది. చదవండి: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్ దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటకు వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకొని చున్నీతో ఫ్యాన్‌రాడ్ కు ఉరివేసుకొన్నాడు. అర్ధరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపుతీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతుని తమ్ముడు రామకృష్ణకు ఫోనులో సమాచారం అందజేసింది. అతను కిటికీలో నుంచి చూడగా శంకర్ ఉరివేసుకొన్నట్టు గమనించి పగులకొట్టి లోపలికి వెళ్లాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇది మరీ ఘోరం! పెళ్లిలో భోజనం తినేటప్పుడు చూశారని..
సాక్షి,మదనపల్లె(చిత్తూరు): ఓ పెళ్లిలో భోజనం తినేటప్పుడు అదే పనిగా చూశారని రౌడీషీటర్‌తో పాటు అతని అనుచరులు మూకుమ్మడిగా జరిపిన దాడిలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..మదనపల్లె పట్టణానికి మధుకుమార్ 30, అసిఫ్ (25), వినోద్ (28), మంజునాథ్ (24)తో పాటు మరి కొంతమంది స్థానిక మిషన్ కాంపౌండ్ సీఎస్ఐ పెళ్లి మండలంలో జరిగిన మిత్రుడు వివాహానికి ఆదివారం హాజరయ్యారు. పెళ్లి అయిపోయాక ఇంటికి వెళ్లే సమయంలో దేవళం వీధికి చెందిన రౌడీషీటర్ సుల్తాన్ వర్గీయులు మధుకుమార్ వర్గీయులతో భోజనం తినే సమయంలో తమవైపు చూశారన్న కారణంతో గొడవకు దిగారు. పెళ్లిబృందం ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రాత్రి 10 గంటల సమయంలో స్థానిక మాలిక్ ఫంక్షన్‌హాల్ దగ్గర ఉన్న మధుకుమార్ వర్గీయులు ఉండగా సుల్తాన్, తన అనుచురులతో వెళ్లి వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేశారు. ఆస్పత్రికి తరలించగా దాడిలో తీవ్రంగా గాయపడిన మధుకుమార్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫ ర్ చేశారు. ఆసిఫ్, వినోద్, మంజునాథ్‌ను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వన్‌టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరసదాడులతో జనం బెంబేలు.. రౌడీషీటర్ సుల్తాన్ పట్టణంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలజడి సృష్టిస్తున్న అల్లరి మూకలపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా చోద్యం చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సుల్తాన్ దేవాలయ వీధికి చెందిన ఉదయ్‌కుమార్, కిరణ్, ప్రకాష్, వాసుపై దాడులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుల తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ హల్చల్
-
బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ హల్చల్.. రోగి మెడపై కత్తిపెట్టి బెదిరింపు
సాక్షి, బంజారాహిల్స్: దొంగిలించిన కారులో బంజారాహిల్స్‌లోని సయ్యద్‌నగర్‌కు వచ్చిన ఓ రౌడీషీటర్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దారిలో వస్తున్న స్కూటరిస్ట్‌ను కత్తితో బెదిరించి ఆ స్కూటర్‌పై పరారయ్యాడు. అయితే పోలీసులు ఛేదించి అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న ఖాజా ఫరీదుద్దీన్ ఖాద్రి(20) అలియాస్ మెంటల్ ఫరీద్ రెండు రోజుల క్రితం మలక్‌పేట్‌లో నివసించే తలీష్ ఫేస్బుక్లో పరిచయం కాగా ఆయన కారును మాయమాటలు చెప్పి దొంగిలించాడు. ఇదే కారులో బుధవారం అర్ధరాత్రి సయ్యద్‌నగర్‌కు వచ్చాడు. గతంలో అతని సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే తమ్ముడి మృతికి స్నేహితులే కారణమని వారిపై కక్షపెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడి స్నేహితులు సయ్యద్‌నగర్‌లో తారాసపడటంతో వారిని వెంబడించాడు. వేగంగా బండి నడిపి ఆ మార్గంలో వాహనాలను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఆయనను వెంబడించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే నిందితుడి కోసం గాలిస్తున్న గోల్కొండ పోలీసులకు సయ్యద్‌నగర్‌లో ఉన్నట్లు సమాచారం రాగా బంజారాహిల్స్ పోలీసులకు చెప్పారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పెట్రోకారును తన కారుతో ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బంజారాహిల్స్ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న స్థానికులు ఫరీద్‌ను అడ్డగించారు. కారు దిగి పారిపోతూ ఎదురుగా బైక్‌పై వస్తున్న షేక్ అల్ఫాస్ను కత్తితో బెదిరించి ఆ స్కూటర్‌పై పరారయ్యాడు. పోలీసులు వెంబడిస్తుండటంతో స్కూటర్‌తో సహా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దూరాడు. పోలీసులు ఆస్పత్రిలోకి వెళ్ళి మెంటల్ ఫరీద్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా తన వద్ద ఉన్న కత్తితో ఓ రోగి మెడపై కత్తి పెట్టి తనను పట్టుకుంటే మెడకట్ చేస్తానంటూ బెదిరించాడు. చాకచక్యంగా పోలీసులు ఫరీద్‌ను పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిపై హబీబ్‌నగర్, గోల్కొండ, మలక్‌పేట, నాంపల్లి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్ లో రౌడీషీటర్ హల్ చల్
-
బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..
విజయనగరం(కురుపాం): నూతన సంవత్సర శుభవేళ.. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాలికలపై ఓ రౌడీషీటర్ కన్నేశాడు. పోలీస్‌నంటూ బెదిరింపులకు దిగి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి యత్నానికి తెగబడిన విషాదకర ఘటన కురుపాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు.. తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం వెళ్లారు. తిరిగి కాలినడకన వసతిగృహానికి పయనమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి విద్యార్థినులు, వారి స్నేహితులను అడ్డగించాడు. తను పోలీసునంటూ బెదిరించాడు. చదవండి: (భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి వేటకొడవలితో..) చెప్పినట్టు వినకపోతే మీ ఫొటోలు సోషల్‌మీడియా, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇద్దరు విద్యార్థులను దూరంగా పంపించేసి... బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. ఘటన అనంతరం కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ వసతిగృహానికి చేరుకున్న విద్యార్థినులు విషయాన్ని వసతిగృహ సంక్షేమాధికారిణి మండంగి సీతమ్మకు తెలియజేశారు. ఆమె వెంటనే కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్ఐ బి.శివప్రసాద్‌లు వసతిగృహానికి చేరుకున్నారు. చదవండి: (యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని జాతి నుండి వెలివేశారు) బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే వసతిగృహానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు రాంబాబుపై ఇప్పటికే చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
రౌడీ షీటర్ల పై నెల్లూరు పోలీస్ సూపర్ స్కెచ్
-
నెల్లూరు: కుమారుడి ఆగడాలు భరించలేక.. తండ్రే చంపేశాడు
సాక్షి, నెల్లూరు జిల్లా: ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు. తీరు మార్చుకోమని చెప్పిన తండ్రిపై నిన్న రాత్రి దాడి చేయడంతో.. విసిగిపోయిన తండ్రి పెంచలయ్య.. మమకారాన్ని చంపుకొని కర్రతో కసిగా తలపై కొట్టి.. కుమారుడిని హతమార్చాడు. హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: భర్త ఫోన్‌కాల్: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా.. వివాహేతర సంబంధం: కలిసి ఉండలేమన్న బాధతో.. -
తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్
సాక్షి, హైదరాబాద్: మాజీ రౌడీషీటర్ అంబర్‌పేట శంకర్ పేరు సుదీర్ఘ కాలం తర్వాత తెరపైకి వచ్చింది. క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఇతడి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం విదితమే. ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు–శర్మకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి అంబర్‌పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టారు. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్యా రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అని, అయితే తాను అందులో విఫలమయ్యానని శంకర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై సండే సందడి నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు -
దుకాణం వద్దకు వచ్చిన యువతి పట్ల అసభ్య ప్రవర్తన..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): రౌడీషీటర్‌ను దుండగులు మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన దేవరజీవనహళ్లి (డీజే.హళ్లి) పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీజే.హళ్లి ఇందిరా క్యాంటీన్ రోడ్డు సమీపంలో రౌడీ మజర్ (45) నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం బయటకు వచ్చిన మజర్ ఓ దుకాణం వద్దకు వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ప్రతిఘటించింది. కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కొడవలితో మజర్పై దాడి చేసి ఉడాయించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మజర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డీజే హళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అతని ప్రత్యర్థులే పథకం పన్ని హత్యకు పాల్పడ్డారనే అనుమానం వ్యక్తమవుతోంది. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ముగ్గురిని చంపాడు.. చివరకు దోస్తుల చేతిలోనే హత్య
అనంతపురం క్రైం: నగరంలో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో స్నేహితులే అతన్ని మట్టుబెట్టారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు.... నగరంలోని రాజమ్మ కాలనీకి చెందిన గుజిరీ వ్యాపారి ఖాదర్‌బాషా, ఖైరూన్‌బీ దంపతుల కుమారుడు షేక్ సికిందర్ బాషా అలియాస్ సీకే (31) టైల్స్ పనిచేసేవాడు. మద్యానికి బానిసైన సికిందర్ బాషా వైఖరి నచ్చక ఐదేళ్ల క్రితం అతని నుంచి భార్య విడిపోయింది. ఈ క్రమంలోనే సికిందర్ బాషా మరింత జులాయిగా మారాడు. తాగుడు కోసం ఇతరులను బెదిరించి డబ్బు వసూలు చేసుకునేవాడు. ఇందులో భాగంగానే డబ్బు ఇవ్వలేదన్న కసితో 2011లో అనంతపురంలోని గుత్తి రోడ్డులో జిలాన్బాషాని, 2020లో కనకదాసు విగ్రహం ఐదు లైట్ల కూడలిలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఖాదర్బాషాని, ఈ ఏడాది రియల్ ఎస్టేట్ వ్యవహారంలో బెంగళూరులో మరో వ్యక్తిని హతమార్చాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సికిందర్ 20 రోజుల క్రితం విడుదలై అనంతపురానికి వచ్చాడు. అనాలోచితం.. అనివార్యం.. సికిందర్‌కు అనంతపురంలోని కృష్ణదేవరాయనగర్‌కు చెందిన షెక్షావలి అలియాస్ బ్రూస్లీ, లింగమయ్య కొట్టాలకు చెందిన కుక్కల జిలాన్, అన్సర్, భవానీ నగర్ నివాసి అడపాల చంద్రశేఖర్ ప్రాణస్నేహితులు. వీరంతా మద్యం, ఇతర వ్యసనాలకు బానిసలు. వీరిలో బ్రూస్లీపై రౌడీషీట్, అడపాల చంద్రశేఖర్‌పై సస్పెక్ట్ షీట్ ఉన్నాయి. ఈ నెల 1న రాత్రి వీరంతా కలిసి గుత్తి రోడ్డులోని ఓ బార్లో మద్యం సేవించారు. అనంతరం రెండు బైక్‌లపై ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో వాణి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే కుక్కల్ జిలాన్‌ను సికిందర్ తిట్టాడు. దీంతో అన్సర్ జోక్యం చేసుకుని ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించడంతో ఖాళీ బీరు బాటిల్‌తో అన్సర్ తలపై సికిందర్ కొట్టాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన స్నేహితులు అనాలోచితంగానే సికిందర్‌పై తిరుగుబాటు చేశారు. ఈ ఘటన మనసులో పెట్టుకుని తమపై ఎప్పటికైనా దాడి చేస్తాడని భావించారు. దీంతో రాయి, ఇటుక పెళ్లలతో సికిందర్‌పై దాడి చేశారు. ఓ పెద్ద బండరాయిని బ్రూస్లీ ఎత్తి సికిందర్‌పై వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, 2021లో ఉమాశంకర్ అనే వ్యక్తిని ఇదే తరహాలో బండరాయి వేసి హత్య చేసిన కేసులో బ్రూస్లీ నిందితుడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మొబైల్ ఇవ్వనందుకు దాడి.. కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు
సాక్షి, నాంపల్లి: హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. రౌడీషీటర్‌తో పాటు మరో పది మంది అనుచరులు కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు. దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుభాన్‌పుర ప్రాంతానికి చెందిన సమీర్ అనే రౌడీషీటర్ తన అనుచరుడిని ఏక్‌మినార్ మసీదు సమీపంలో ఉండే ఓ మొబైల్ షాపుకి పంపించారు. తన పేరును చెప్పి మొబైల్ తీసుకురమ్మని ఆదేశించారు. మొబైల్ షాపు యజమాని మహ్మద్ ఆసిఫ్ నిరాకరించడంతో ఆగ్రహించిన రౌడీషీటర్ అర్థరాత్రి తన అనుచరులతో దర్గా షాఖామూస్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆసిఫ్ ఇంటికి చేరువలో కాపుకాశారు. ఆదివారం రాత్రి మొబైల్ షాపు మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో రౌడీషీటర్, అతని అనుచరులు మహ్మద్ ఆసిఫ్‌ను అడ్డగించి నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు. దాడిని ఆపటానికి వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారి ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ సమీర్ పారిపోయాడు. దాడిలో సమీర్‌తో పాటు మరో రౌడీషీటర్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పారిపోయిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ నరేందర్ తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో రౌడీషీటర్ సమీర్ పీడీ యాక్టులో జైలుకు వెళ్లి వచ్చారు. దాడిలో మహ్మద్ ఆసిఫ్‌తో పాటుగా అంజద్‌ఖాన్, బాబు, వీరి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. -
‘ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త’
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌పై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన ఆసిఫ్ ఇక్బాల్ రెండు రోజుల క్రితం మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్‌ను దూషిస్తూ హెచ్చరించారు. మొఘల్‌పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌తో పాటు రౌడీషీటర్ ఆసిఫ్ ఇక్బాల్ ఫోన్లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్ ఇక్బాల్‌గా రౌడీషీటర్ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రెయిన్‌బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్‌పురా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్ ఇక్బాల్ యెమెన్ దేశంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. చదవండి: కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
రౌడీషీటర్ పండు అరెస్ట్
-
రౌడీషీటర్ పండు వీరంగం.. స్నేహితుడిపై కత్తులతో దాడి
సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు: సరిగ్గా ఏడాది కిందట నగరంలో గ్యాంగ్‌వార్‌తో రెచ్చిపోయిన కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు మరోసారి నగరంలో వీరంగం సృష్టించాడు. ఆదివారం కానూరు వంద అడుగుల రోడ్డులో పండు స్నేహితులతో మారణాయుధాలతో ప్రజల్ని భయాభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పండుతో పాటు ఆరుగురు గ్యాంగ్ సభ్యుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుచారు. గత ఏడాది మే నెల 30వ తేదీన పటమట పప్పులమిల్లు సెంటర్ సమీప మైదానంలో రౌడీషీటర్ తోటా సందీప్, కేటీఎం పండు స్నేహితుల మధ్య గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో తోటా సందీప్ గాయపడి మే 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 40 మందిపై పోలీసులు రౌడీషీటు తెరిచారు. సందీప్ మృతితో ప్రధాన నిందితుడు పండుతో పాటు మిగిలిన వారందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న పండు ఈ ఏడాది జనవరిలో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మూడు నెలలపాటు నగరంలో అడుగుపెట్టరాదని కోర్టు షరతు విధించడంతో పండు పామర్రులో మూడు నెలలు ఉన్నాడు. అనంతరం చికిత్స నిమిత్తం తనకు నగరంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించడంతో సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో ఉంటున్నాడు. ఈ సమయంలోనే అక్రమ సంపాదనకు తెరతీశాడు. 20 రోజుల క్రితం పండు, అతడి అనుచరులు విశాఖపట్నం వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. విజయవాడ శివారుతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. స్నేహితుడిపై కత్తులతో దాడి వీడియోతో.. గత బుధవారం రౌడీషీటర్ మణికంఠ స్నేహితుడు కోనేరు రాజా పుట్టిన రోజు కావడంతో పండు తన స్నేహితులతో కలిసి వేడుకల్లో మద్యంతోపాటు గంజాయి తీసుకున్నారు. అనంతరం కోనేరు రాజాను పండుతోపాటు ఇతరులు కలసి కత్తులతో, కర్రలతో కొడుతున్నట్లు ఓ వీడియో చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లౌడ్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అయింది. గతంలోనూ పండు తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అనేకసార్లు టిక్‌టాక్ వీడియోలతో హల్చల్ చేశాడు. మారణాయుధాలతో సంచరిస్తూ... ఆదివారం పండు తన స్నేహితులతో కలిసి మారణాయుధాలతో సంచరిస్తూ ఓ సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్న సమయంలో పెనమలూరు పోలీసులు పక్కా సమాచారంతో కానూరు వంద అడుగుల రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌కు చెందిన పండుతోపాటు కోనేరు రాజా, కవి ప్రవీణ్, తిరుమలశెట్టి నాగరాజు, సప్పా దర్గారావు, విజయవాడ ఫకీర్గూడెంకు చెందిన షేక్ గాలీబ్‌ల నుంచి రెండు పెద్ద కత్తులు, 8 చిన్నకత్తులు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. పండు నేర చరిత్ర ... కేటీఎం పండు నేర చరిత్ర పెద్దదే. పండుపై విజయవాడ నగరంలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. పటమట పీఎస్ పరిధిలో ఒక హత్య, ఒక హత్యాయత్నం కేసు, ఒక కొట్లాట కేసు, కృష్ణలంక పీఎస్‌లో ఒక కొట్లాట కేసు, పెనమలూరు పీఎస్ పరిధిలో రెండు కొట్లాట కేసులు, ఒక బైండోవర్ కేసు నమోదు అయ్యాయి. 2020లో అతనిపై రౌడీషీటు తెరిచారు. -
విజయవాడలో మరోసారి రెచ్చిపోయిన రౌడీ షీటర్ పండు
-
అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్
బనశంకరి: పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్‌పై చాకుతో గాయపరచడంతో పోలీసులు గన్‌కు పని బెట్టారు. నిందితుడిని అదుపులోకి చేసేందుకు పోలీసులు కాలిపై కాల్పులు జరపడంతో రౌడీ షీటర్ కిందపడిపోయాడు. కిందపడిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కర్నాటకలోని బనశంకరి ప్రాంతంలో జరిగింది. రామమూర్తినగరకు చెందిన సూర్య అలియాస్ జెట్టి రెండు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందాడు. ఇతడి ముఠా ఈ నెల 4వ తేదీన రఘురామ్ అనే వ్యక్తిపై దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతడు ఒకచోట ఉన్నాడని తెలుసుకుని వెళ్లగా పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ఏసీపీ పరమేశ్వర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి హెచ్బీఆర్ లేఔట్ రెండోక్రాస్లోని ఓ ఇంటిపై దాడి చేశాడు. అతడిని పట్టుకోబోగా చీకట్లో పారిపోయాడు. సమీపంలో కానిస్టేబుల్ హనుమేశ్, సూర్యలపై చాకుతో దాడి చేశాడు. దాడికి దిగడంతో విధిలేక ఏసీపీ పరమేశ్వర్ కాల్పులు జరిపాడు. జెట్టి కాలికి కాల్పులు చేయడంతో గాయమై కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు ఆ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రౌడీ షీటర్ చేతిలో గాయపడిన పోలీసులను కూడా ఆస్పత్రికి తరలించారు. చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
రౌడీ షీటర్‌ను చంపి, భార్య పుస్తెల తాడు లాక్కొని
సాక్షి, పెదపూడి(తూర్పు గోదావరి): జి.మామిడాడలో రౌడీషీటర్ హత్యకు గురైనట్టు కాకినాడ రూరల్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామంలో డీఆర్కే నగర్లో రౌడీషీటర్ మేడపాటి సూర్యనారాయణరెడ్డి(30) అలియాస్ యాసిడ్ సూరి అనే వ్యక్తి జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సూర్యనారాయణరెడ్డి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి గొంతుపై తీవ్రగాయలయ్యాయి. భర్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న భార్య శ్రావ్య చేతిపైనా గాయాలయ్యాయి. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని దుండగులు పరారయ్యారు. వెంటనే సూర్యనారాయణరెడ్డిని 108 వాహనంలో పెదపూడి సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావ్యకు చికిత్స అందించారు. శ్రావ్య ఫిర్యాదు పై స్థానిక ఎస్సై టి.క్రాంతికుమార్ కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కాకినాడ తరలించారు. మృతుడు గతేడాది మార్చిలో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ జి.మామిడాడలో హత్య జరిగిన స్థలాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ భీమారావు సందర్శించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులు, చుట్టు పక్కల వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో కరప, గొల్లపాలెం ఎస్సైలు డి.రామారావు, పవన్‌కుమార్ ఉన్నారు. పోలీసు పికెట్ కొనసాగుతుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: ఏమైంది తల్లీ...) గొంతు కోసుకొని.. బ్రిడ్జిపై నుంచి దూకి.. ఏం కష్టం వచ్చిందో తెలియదు.. జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పిఠాపురంలో మణికంఠ అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే.. అమలాపురం రూరల్ పరిధిలో బోడసకుర్రు బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వీరిద్దరినీ స్థానికులు సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ► జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం పిఠాపురం: ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మంగళవారం పిఠాపురం పక్షులమర్రి సెంటర్ వీధిలో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో తన కంఠాన్ని కోసుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని పట్టణ ఎస్సై శంకర్రావు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకున్న వ్యక్తి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం, అతడిని ఎవరూ గుర్తుపట్టక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వ్యక్తి తమవాడేనంటూ అతడి బంధవులు రావడంతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన చింతా మణికంఠగా పోలీసులు గుర్తించారు. బాధితుడు వడ్రంగి పని చేస్తుంటాడని, ఇటీవల రౌతులపూడిలో వడ్రంగి పనికి వెళ్లి అక్కడ పని చేస్తూ రెండు రోజుల క్రితం ఇంటి వచ్చేస్తున్నట్టు బంధువులకు సమాచారం ఇచ్చాడని, కానీ ఇంటికి వెళ్లలేదు. ఇంతలో మంగళవారం పిఠాపురంలో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం అంటు సోషల్ మీడియాలో కథనం రావడంతో గుర్తుపట్టిన బంధువులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. పట్టణ ఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని, అతడు అప్పుడప్పుడూ మానసికంగా బాధపడుతుంటాడని బంధువులు తెలిపారు. బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి దూకి.. అల్లవరం: అమలాపురం రూరల్ పరిధిలోని తాండవపల్లి గ్రామానికి చెందిన సత్తి శ్రీమన్నారాయణ బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి మంగళవారం సాయంత్రం వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ బ్రిడ్జిపై సైకిల్, చెప్పలు వదిలి పై నుంచి నదిలోకి దూకేశాడు. బ్రిడ్జి కింద చేపల వేట సాగిస్తున్న బొమ్మిడి ముత్యాలరావు ఇది గమనించి అతడిని కాపాడి తన బోటులో స్థానికుల సహకారంతో గట్టుకి చేర్చాడు. బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకడంతో శ్రీమన్నారాయణ నడుముకి దెబ్బ తగిలిందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై 108కి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానికుడు పరమేష్ తెలిపారు. అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక తన పేరు మాత్రమే చెప్పాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో చెప్పలేదని స్థానికులు తెలిపారు. -
దారుణం: మద్యం తాగించి కిరాతకంగా..
నెల్లూరు(క్రైమ్): పాతక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను కొందరు దారుణంగా హత్యచేసి పరారయ్యారు. ఈ ఘటన నగరంలోని సీఏఏం హైస్కూల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. సీఏఎం హైస్కూల్ సమీపంలో రౌడీషీటర్ బాషా (32) నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య నసీమా, పిల్లలు సమీర్, సనా ఉన్నారు. బాషా వంట పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు పలువురితో వివాదాలు ఉన్నాయి. పలు పోలీసు స్టేషన్లలో కేసులు సైతం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఓ మహిళ విషయంలో కోటమిట్ట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మొహిసీన్‌పై చేయిచేసుకున్నాడు. అప్పట్నుంచి ఇరువురి నడుమ తరచూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొహిసీన్ వారం రోజుల క్రితం ఇకపై గొడవలు వద్దని స్నేహంగా ఉందామని బాషాతో రాజీ చేసుకున్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన బాషా స్నేహంగా మెలగసాగాడు. ఈ క్రమంలో బాషా తన ఇంటి సమీపంలోని తన షెడ్లో మొహిసీన్, అతని స్నేహితులైన జాన్సన్, సమీర్, ఫరూఖ్, ప్రేమ్‌తో పాటు తన అనుచరుడైన కార్తీక్‌తో కలిసి గురువారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. కార్తీక్ సిగిరెట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లగా, బాషా ఇంటికి వచ్చి రెండు వాటర్ బాటిళ్లు తీసుకుని షెడ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే మొహిసీన్, అతని స్నేహితులు విచక్షణా రహితంగా కత్తులతో బాషా గొంతుకోయడంతో పాటు ముఖంపై బలంగా పొడిచారు. బాషా కేకలు విన్న భార్య, కుమారుడు సమీర్, అత్త షరీఫా, సోదరుడు మస్తాన్, మరికొందరు షెడ్‌వద్దకు వెళ్లేసరికి దుండగులు పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన బాషా అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. . పథకం ప్రకారమే హత్య నిందితులు పథకం ప్రకారమే బాషాను హత్యచేసినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల క్రితం బాషాతో మొహిసీన్ గొడవలు లేకుండా కలిసి ఉందామని రాజీ చేసుకున్నాడు. అçప్పట్నుంచి మొహిసీన్, అతని స్నేహితులు రోజూ బాషాను కలిసి అర్ధరాత్రి వరకు మాట్లాడి వెళ్లేవారు. మూడ్రోజులుగా అందరూ కలిసి బాషాకు చెందిన షెడ్లో అర్ధరాత్రి వరకు మద్యం సేవించేవారు. బాషా ప్రతి కదలికను నిందితులు నిశితంగా పరిశీలిస్తూ అనుమానం రాకుండా తుదముట్టించేందుకు అదనుకోసం వేచిచూడసాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి కార్తీక్ బయటకు వెళ్లడం, బాషా కుటుంబ సభ్యులు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండడంతో ఇదే అదనుగా భావించిన మొహిసీన్, అతని స్నేహితులు బాషాను కిరాతకంగా హత్యచేశారు. బాషా కేకలు విని కుటుంబ సభ్యులు, కార్తీక్ అక్కడికి చేరుకోవడంతో చేతిలోని కత్తి పడిపోయినా పట్టించుకోకుండా నిందితులు పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్లు బాషా హత్యపై సమాచారం అందుకున్న చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఎం మధుబాబు, సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్సై అలీసాహెబ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను మృతుడి భార్య నసీమాను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు మొహిసీన్, అతని స్నేహితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ మధుబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉండడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆనందంగా సచ్చిపోతా!
-
చీరాల: మందలించాడని మర్డర్ చేశాడు
-
దారుణం: మందలించాడని రిటైర్డ్ ఏఎస్ఐ మర్డర్
సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్ ఏఎస్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్ ఏఎస్ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్ షానూర్‌పై హత్యాయత్నం) -
గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విజయవాడలో రౌడీ షీటర్ నగర బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్‌పై నగర బహిష్కరణ వేటు పడింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం అతన్ని నగరం నుంచి ఆరునెలల పాటు బహిష్కష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూసఫ్ పఠాన్‌పై ఇదివరకే గన్నవరం పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. అతని నేరప్రవృత్తిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో పోలీసులు అతడిపై బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఇప్పటికే ఇద్దరు రౌడీ షీటర్లను విజయవాడ నుంచి బహిష్కరించారు. ఈ వరుస బహిష్కరణల పర్వం రౌడీ షీటర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. (విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు) చదవండి: (విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్..) -
రౌడీలకు చెక్
-
బాలుడిపై లైంగికదాడి.. పదేళ్ల జైలు
బహదూర్‌పురా: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఓ రౌడీషీటర్‌కు న్యాయస్థానం పదేళ్లజైలు శిక్షవిధించింది. బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపిన మేరకు.. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ మహ్మద్ మునీరుద్దీన్ (36) 2015లో బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో చార్జీషీట్ వేసి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధించారు. -
వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడయింది. పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా రెండో రోజు గురువారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా విచారించగా ఈ కీలక విషయం వెల్లడైనట్లు తెలిసింది. హత్యకు ఓ రౌడీషీటర్ సహకరించినట్లు సీపీకి వసంత తెలిపినట్లు తెలిసింది. మరోవైపు వసంత మరిది సంజయ్య ఫోన్లోని డేటా డిలీట్ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్ షాపు యజమానినీ పోలీసులు విచారించారు. అయితే తన షాపు వద్దకు వచ్చి ఫోన్లోని డేటా డిలీట్ చేయాలని సంజయ్య కోరగా... ఫోన్‌కు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పానని... అవి తీసుకొచ్చాకే డేటా డిలీట్ చేశానని... అంతకు మించి తనకే సంబంధం లేదని విచారణలో ఆ షాపు యజమాని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీపీ ఆర్కే మీనా వివిధ కోణాల్లో వసంత, గీతను విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. ఆరు రోజులు చిత్రహింసలు పెట్టి... అనంతరం సీపీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ దివ్య హత్య అత్యంత క్రూరమైనదని అన్నారు. దివ్యను ఆమె పిన్ని అమ్మేయడంతో ఇంటి పనికి తీసుకొచ్చిన వసంత వ్యభిచార ఊబిలోకి దింపిందని గుర్తు చేశారు. అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో తిండి పెట్టకుండా ఆరో రోజులపాటు చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. దివ్యని వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారని తెలిసిందని... ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నామని స్పష్టం చేశారు. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం పంపించామని తెలిపారు. ప్రస్తుతం వసంత, గీతను విచారిస్తున్నామని.., రిమాండ్‌లో ఉన్న మిగిలిన నలుగురినీ పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరగా... కోర్టు అనుమతించడంతో వారిని శుక్రవారం నుంచి విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు. విశాఖలో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్ పుట్టిన రోజు పార్టీకి సంబంధించి చేపట్టిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర ముఠా మోసగాడు జవహర్ బాలకుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాలకుమార్ చేతిలో అనేక మంది మహిళలు మోసపోయారని పేర్కొన్నారు. దివ్య హత్యకేసు విచారణలో ఈస్టు ఏసీపీ కులశేఖర్, సీఐ కోరాడ రామారావు, ఎస్ఐలు శ్రీనివాస్, గౌరి, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
చిట్టిమాము బర్త్‌డే సెలబ్రేషన్స్.. అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో నగరంలో హల్చల్ చేసిన రౌడీషీటర్ చిట్టిమాము గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టిమాము బర్త్‌డే సందర్భంగా శనివారం అర్ధరాత్రి అతడి సన్నిహితులు భారీ ఎత్తున వేడుకలు ఏర్పాటు చేశారు. సినీ ఫక్కీలో నగరంలోని రౌడీషీటర్లు, బౌన్సర్లు, మందు, విందుతో నానా హంగామా సృష్టించారు. అయితే ఈ బర్త్‌డే పార్టీ గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. చిట్టిమాముతో పాటు పార్టీకి హాజరైన వారిని, బౌన్సర్లను అదుపులోకి తీసుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలం నుంచి భారీగా మద్యం, గంజాయి, రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదు: డీఎస్పీ విశాఖలో రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ త్రినాథరావు పేర్కొన్నారు. నగరంలోని రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. చిట్టిమాము గ్యాంగ్ బర్త్‌డే వేడుకలకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరంలో గ్యాంగ్‌ల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు డీఎస్పీ త్రినాధరావు విజ్ఞప్తి చేశారు. ఇక రౌడీషీటర్ చిట్టిమాముపై పలు మర్డర్ కేసులు ఉన్న విషయం తెలిసిందే. (భార్యను హత్య చేసిన కానిస్టేబుల్) -
విశాఖలో రౌడీషీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్
-
రౌడీషీటర్ దారుణహత్య
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్‌ను హత్య చేసిన సంఘటన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్యాపురం, రెడ్డీలపేటకు చెందిన అద్దేపల్లి సతీష్ (42) ఆనంద్ నగర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద మరో మహిళ వద్ద ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న సతీష్‌కు అతని స్నేహితుడు కిషోర్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లిసతీష్‌ను మోటారు సైకిల్‌పై క్వారీ మార్కెట్ ప్రాంతం టీవీ రోడ్డు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడు వై.శ్రీను, మరికొంత మందితో కలసి తలపై కొట్టి హత్య చేశారు. మృతుడు ఆద్దేపల్లి సతీష్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఉంది. పాత రౌడీ షీటర్ యలమంచిలి శ్రీనుతో మృతుడు సతీష్‌కు పాత కక్షలతో, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉండడంతో వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సతీష్ సోదరుడికి ఫోన్ చేసి నీ తమ్ముడిని చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యలో బుధవారం తెల్లవారు జామున సతీష్‌ను హతమార్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని త్రీటౌన్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. -
సిద్దిపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి, సిద్దిపేట : గతకొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై గొడ్డలితో నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని స్వగ్రామం సిద్ధిపేట మండలం ఇమాంబాద్ అని పోలీసులు తెలిపారు. పాత కక్షనే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎల్లంగౌడ్ పలు కేసుల్లో ప్రధాని నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారం. అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాటు వేసి ఎల్లంగౌడ్‌ను హత్య చేశారు. -
ఇలా వచ్చి..అలా వెళ్లాడు..
మల్కాజిగిరి: ఏకంగా 48 కేసులు, రెండు సార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మార్చుకోకపోగా పదే పదే నేరాలకు పాల్పడుతున్న మౌలాలికి ముస్లింజంగ్కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ముక్రం అలియాస్ పప్పును ఆదివారం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. డీఐ జగదీశ్వర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముస్లీంగంజ్కు చెందిన రౌడీషీటర్ పప్పుపై మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. రెండుసార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చాడు. చివరగా గత నవంబర్ నెలలో హోటల్ యజమానిని కత్తితో బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల జైలునుంచి బయటికి వచ్చిన ముక్రం ఈ నెల 9న మౌలాలిలోని ఓ రెడీమేడ్ బట్టల దుకాణానికి వెళ్లి సేల్స్ బాయ్‌ని బెదిరించి రూ.2 వేల విలువైన దుస్తులు తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఏ1 హోటల్లో ఓ వ్యక్తిని బెదిరించి రూ.2500 నగదు లాక్కెళ్లాడు. బట్టల దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి ముక్రంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహితపై రౌడీ షీటర్ల లైంగిక దాడి
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో పాశవికమైన అకృత్యం చోటుచేసుకుంది. ఓ మహిళపై రౌడీ షీటర్లు, కొందరు యువకులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్‌కు ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు నగరంలోనే అంతర్భాగంగా ఉండే.. ఏలూరు గ్రామీణ పరిధిలోని నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత ఇటీవల జ్వరం బారినపడిన తన కుమారుడికి టాబ్లెట్లు తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్ షాపునకు కాలి నడకన వెళ్లింది. తిరిగి ఇంటికి బయలుదేరగా.. నాగేంద్ర కాలనీకే చెందిన యాకోబు అనే రౌడీషీటర్ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి తన బైక్ ఎక్కమన్నాడు. ఆమె నిరాకరించగా.. చలి గాలిలో ఒంటరిగా వెళ్లడం మంచిది కాదన్నాడు. ముఖపరిచయం గల వ్యక్తి కావడం, త్వరగా ఇంటికెళ్లి కుమారుడికి టాబ్లెట్లు వేయాలన్న ఆతృతతో ఆ మహిళ అతడి బైక్ ఎక్కింది. నాగేంద్ర కాలనీకి వెళ్లాక ఆ రౌడీ షీటర్ బైక్‌ను దారి మళ్లించి సమీపంలో ముళ్ల పొదలతో చిట్టడవిని తలపించే ఫోర్త్ పిచ్ (క్రికెట్ మైదానం) ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ముగ్గురు రౌడీ షీటర్లు, మరికొందరు యువకులు మాటు వేసి ఉన్నారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావంటూ ఆ మహిళ ప్రతిఘటించబోగా.. వారంతా కలిసి కొబ్బరి మట్టలతో ఆమెను తీవ్రంగా కొట్టి.. బలవంతంగా మద్యం తాగించి.. ఆమె ఒంటిపై దుస్తులన్నీ తొలగించి.. ఒకరి తరువాత ఒకరు రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. తెల్లవారుజామున ఆమె స్పృహలోకి రాగా.. అకృత్యానికి ఒడిగట్టిన వారంతా గంజాయి కాలుస్తూ.. మద్యం మత్తులో జోగుతూ కనిపించారు. లేవలేని స్థితిలోనే ఆ మహిళ ముళ్లపొదల మధ్య నుంచి పాకుతూ నగ్నంగానే రోడ్డుపైకి చేరుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వ్యక్తి ఒకరు ఆమె నిస్సహాయతను గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడలేకపోయింది. ఆ వ్యక్తి తాను ధరించిన స్వెటర్‌ను ఆమె ఒంటిపై కప్పి వెళ్లిపోయాడు. ఆ మహిళ నడవ లేని స్థితిలోనే ఇంటికి చేరుకుంది. భర్త ఊళ్లో లేకపోవడం.. మృగాళ్లు రౌడీ షీటర్లు కావడంతో.. ఇంటికి చేరిన బాధితురాలు తీవ్ర గాయాలతో నాలుగైదు రోజులపాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. భర్త ఉపాధి నిమిత్తం వేరే ఊళ్లో ఉండటం, ఇద్దరు బిడ్డలు చిన్నవాళ్లు కావడంతో ఆమెను పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. మరోవైపు నిందితులు రౌడీ షీటర్లు కావడం.. తనపై జరిగిన అకృత్యంపై ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమోనని బాధితురాలు భయపడింది. ఈ పరిస్థితుల్లో తరచూ యోగక్షేమాలు తెలుసుకునే బంధువు ఇంటికి రాగా.. బాధితురాలు జరిగిన దుర్మార్గాన్ని వివరించి బావురుమంది. రెండు రోజులుగా ఆ మృగాళ్లు రాత్రివేళ ఇంటికొచ్చి తలుపులు కొడుతున్నారని కూడా చెప్పింది. బంధువు ఆమెకు ధైర్యం చెప్పి.. చుట్టుపక్కల వారిని కూడగట్టి.. బాధితురాలిని మంగళవారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు సేకరించిన అనంతరం వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
తిరుపతిలో రౌడీషీటర్ హత్య
-
బాలికపై రౌడీషీటర్ లైంగికదాడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికపై ఓ రౌడీషీటర్ లైంగిక దాడి చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన బాలిక ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీసెంట్ రోడ్డుకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రోడ్డులోని రాజ్ టవర్స్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న గుణదలకు చెందిన రౌడీషీటర్ చిన్నిరాజా(వరుణ్‌కుమార్) బాలికను తన బైక్‌పై ఎక్కించుకు వెళ్లాడు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి స్నేహితులను ఆరా తీశాడు. బైక్‌పై వెళ్లిందని తెలుసుకుని వెతకడం ఆరంభించాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఆమె ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయన అక్కడకు వెళ్లడంతో బాలిక జరిగిన విషయం ఆమె తండ్రికి వివరించింది. బాలిక తండ్రి నేరుగా గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిపై మాచవరం పోలీసుస్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. -
రౌడీషీటర్‌తో లోకేష్ ములాఖత్
సాక్షి, నరసరావుపేట : సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించటం.. అల్లర్లకు ఉసిగొల్పటం వంటి చర్యలకు పాల్పడటంలో తెలుగుదేశం పార్టీది మొదటి నుంచి అందెవేసిన చెయ్యిగా చెప్పుకోవచ్చు. తొమ్మిది క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉండి రౌడీషీటర్‌గా చెలామణి అవుతూ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ములాఖత్ అవ్వటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తల సంఘీభావం ముసుగులో టీడీపీ గూండాలను అక్కున చేర్చుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గొడవలు సృష్టించేందుకు టీడీపీ పక్కా వ్యూహం రచించిందన్న ఆరోపణలు సర్వతార వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే.. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలేనికి చెందిన కుమ్మెత కోటిరెడ్డి తొమ్మిది క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనిపై రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో 2014 నుంచి ఏ ప్లస్ రౌడీషీట్ ఓపెన్ అయి ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోటిరెడ్డి తన గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్‌లు అపహరించాడు. ఆ సమయంలో పోలీసులు ఫైరింగ్ కూడా జరిపారు. 2013లోనే కోటిరెడ్డిపై హత్యాయత్నం, మహిళపై లైంగికదాడియత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు భూకబ్జాలు, బెదిరింపు వసూళ్లు, పలు దాడి కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాజనాల వెంకటరెడ్డిపై కోటిరెడ్డి, అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోటిరెడ్డిని వారం రోజుల క్రితం రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబులతోపాటు ఆ పార్టీ మాజీ మంత్రులు అతన్ని విడిచిపెట్టాలని పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులు వినకపోవటంతో స్టేషన్లో ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరతీశారు. అక్కడ నుంచి వైద్యశాలకు తరలించిన పోలీసులు ఎటువంటి హానీ లేదని వైద్యులు చెప్పిన సలహా మేరకు నిందితుడిని కోర్టులో హాజరు పరిచి సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారా లోకేష్ సబ్ జైల్లో ఉన్న రౌడీషీటర్ కోటిరెడ్డిని శుక్రవారం ములాఖత్ అయి ఏకాంతంగా మాట్లాడారు. రొంపిచర్ల మండలంలో గత కొన్నేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్న కోటిరెడ్డిని లోకేష్ పరామర్శించటం పలు ఆరోపణలకు తావిస్తోంది. సొంత పార్టీలో నాయకులే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో రౌడీషీటర్‌ను లోకేష్ పరామర్శించటాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
నేనో డాన్.. నన్ను చూసి బెదరాలి
పహాడీషరీఫ్: తానో డాన్‌నని, తన పేరు చెబితే అందరూ బెదిరిపోవాలని సామాన్యులపై దాడులకు తెగబడుతున్న ఓ రౌడీషీటర్‌ను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ ఠాణాలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, ఇన్స్పెక్టర్ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. షాహిన్నగర్కు చెందిన ముబారక్ బిన్ అబ్దుల్లా బిన్ సాల్మిన్ సిగర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచే తననొక డాన్‌గా ప్రకటించుకుని అందరూ తనను చూస్తే భయపడాలని భావించేవాడు. ఇందులో భాగంగా కత్తితో తిరుగుతూ పహాడీషరీఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట, చాంద్రాగుట్ట ప్రాంతాల్లో సామాన్యులపై దాడి చేసేవాడు. ఇతనిపై ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య, హత్యాయత్నం, దాడులు, దోపిడీ కేసులు ఉన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచారు. ఓ హత్యాయత్నం కేసులో 2018 మే నెలలో పహాడీషరీఫ్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటికి వచ్చిన ముబారక్ తన వైఖరి మార్చుకోకపోగా నాలుగు నెలల్లోనే ఇద్దరిపై దాడి, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మారణాయుధంతో తిరుగుతున్న అతడిని బాలాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అదనపు ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ, ఎస్సైలు జి.మధు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బావమరిది చేతిలో రౌడీషీటర్ హత్య!
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. బావమరిది చేతిలోనే హతమయ్యాడు. పెదవేగి మండలం భోగాపురం సమీపం ప్రకాష్‌నగర్‌లో రౌడీషీటర్ హనీష్ హత్య తీవ్ర కలకలం రేపింది. రామచంద్రపురానికి చెందిన వర్ధనపు హనీష్ నిన్న ఉదయం మేనత్త గ్రామమైన ప్రకాష్‌నగర్‌కు వచ్చాడు. మేనత్త సుజాతకుమారితో ఘర్షణకు దిగిన హనీష్ ఆమెపై దాడి చేసి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన హనీష్‌తో సుజాతకుమారి కొడుకు ప్రశాంత్.. నా తల్లిపైనే దాడి చేస్తావా అంటూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హనీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితుడు ప్రశాంత్‌ను ఏలూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
తల్వార్‌తో రౌడీషీటర్ వీరంగం
లంగర్‌హౌస్: బస్తీలో మద్యం తాగుతూ గొడవ చేయవద్దు అన్నందుకు ఓ రౌడీషీటర్ తల్వార్‌తో దాడి చేయడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గండిపేట మండలం, గంధంగుడ గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ బిట్టు రౌడీషీటర్. ఇతనిపై దారి దోపిడీ, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఆదివారం రాత్రి అతను నార్సింగికి చెందిన లక్ష్మణ్‌తో కలిసి లంగర్‌హౌస్ వచ్చారు. ఇద్దరు కలిసి అంబేద్కర్‌నగర్‌లోని ఓ కిరాణా దుకాణం ఎదుట ఉన్న ఆటోలో కూర్చొని మద్యం తాగారు. మద్యం మత్తులో కేకలు వేస్తుండటంతో దుకాణ యజమాని బయటికి వచ్చి వారిని నిలదీయగా అదే ప్రాంతానికి చెందిన సాయి స్నేహితులమని చెపాక్పరు. వెళ్లకపోతే పోలీసులను పిలుస్తా అని యజమాని ఫోన్ తీసుకోగా అతడిని చంపుతామని బెదిరించారు. దీంతో స్థానికులు అక్కడ గుమిగూడటంతో... వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లాల్‌దర్వాజ అమ్మవారి దర్శనం చేసుకొని స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్న సాయి వినయ్ స్థానికులను వివరాలు అడగ్గా ఇద్దరు వ్యక్తులు నీ పేరు చెప్పి తాగుతు గొడవ చేసినట్లు తెలిపారు. వారు బాపూఘాట్ వైపు వెళ్లినట్లు చెప్పడంతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన సాయికి ఆరాధన హోటల్ ఎదుట నాగరాజు లక్ష్మణ్ కనిపించారు. దీంతో అతను లక్ష్మణ్‌ను పక్కకు పిలిచి బస్తీకి వచ్చి తాగి గొడవ చేసి తమకు చెడ్డ పేరు తేవద్దని కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన నాగరాజు తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరణ్, సాయి వినయ్, లక్ష్మణ్, సునీల్‌కుమార్, సాయి కిరణ్‌లకు గాయాలయ్యాయి. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సుందర్, విజయ్‌కుమార్‌లపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ
చెన్నై(తమిళనాడు): తాను కూడా వీఐపీనేనని రౌడీషీటర్ వరిచియూర్ సెల్వం సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంచీపురంలో అత్తివరదర్ దర్శనం కోసం వెళ్లే సాధారణ భక్తులు స్వామిని దర్శనం చేసుకుని వచ్చేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇలాఉండగా, మదురైకి చెందిన పేరుమోసిన రౌడీ షీటర్ వరిచియూర్ సెల్వం, వీఐపీలు కోటాలో స్వామి ముందు కూర్చుని రాజమర్యాదలతో స్వామి దర్శనం చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆయన దర్శనం సమయంలో ఒంటి నిండా బంగారు గొలుసు ధరించుకుని, కుటుంబసభ్యులతో స్వామిని దర్శించుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలా ఉండగా వరిచియూర్ సెల్వం ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో అత్తివరదర్ దర్శనం గురించి పేర్కొన్నారు. తాను కూడా వీఐపీనే అని, అందులో పలు విషయాలను వెల్లడించారు. -
చెవి కత్తిరించిన రౌడీ షీటర్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ప్రేమను నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్షతో ఎయిర్‌హోస్టెస్ చెవి కత్తిరించిన రౌడీషీటర్‌ను యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న అజయ్ కుమార్ అలియాస్ జాకీని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (ప్రేమించలేదని ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు) మొదట చైన్ దోపిడీ గత నెలలో ఎయిర్‌హోస్టెస్, కుటుంబసభ్యులు యశవంతపుర పరిధిలో కారులో వెళుతుండగా రౌడీషీటర్ అజయ్‌కుమార్ అలియాస్ జాకీ అడ్డుకుని బెదిరించి దాడి చేశాడు. బంగారు చైన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనపై భాదితులు యశవంతపుర పోలీస్‌స్టేషన్‌లో అజయ్‌కుమార్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఈ నెల 12 తేదీ సాయంత్రం 4.30 సమయంలో ఎయిర్‌హోస్టెస్ విధులు ముగించుకుని ఇంటికి క్యాబ్‌లో బయలుదేరింది. హెబ్బాల లైప్ ఓవర్ సిగ్నల్ వద్ద క్యాబ్ నిలపడంతో పొంచి ఉన్న అజయ్‌కుమార్ లోనికి చొరబడి తనను ప్రేమించాలంటూ ఆమెతో గొడవకు దిగాడు. కత్తితో ఆమె చెవిని కట్ చేసి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కొడిగేహల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టి దుండగున్ని పట్టుకున్నారు. ప్రస్తుతం యశవంతపుర పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు బాధిత ఎయిర్‌హోస్టెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
బెంజిసర్కిల్‌లో రౌడీయిజం.. వ్యక్తి హత్య
సాక్షి, విజయవాడ : బెంజిసర్కిల్‌లో గల ఓ బార్లో రౌడీషీటర్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. మద్యం సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసి అతడి ప్రాణాలు బలిగొన్నారు. వివరాలు.. కృష్ణలంకకు చెందిన ఇమ్రాన్, సద్దాం అనే ఇద్దరు రౌడీషీటర్లు మద్యం సేవించేందుకు బెంజ్ సర్కిల్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ బార్లో మద్యం సేవిస్తుండగా కుర్చీ కోసం పక్క టేబుల్లో కూర్చున్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్ అనే వ్యక్తిపై మద్యం సీసాలతో దాడి చేశారు. అనంతరం అతడిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తీవ్రగాయాలపాలైన అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనలో ఇమ్రాన్, సద్దాంలతో పాటు మరో నలుగురు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. -
మారండి... మూసేస్తాం!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవరూ పుట్టుకతో నేరగాళ్లు కాదు. అవసరాలు, పరిస్థితుల ప్రభావంతోనే కొందరు అలా మారతారు’... ఈ విషయాన్ని విశ్వసిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్లకు ఓ గోల్డెన్ చాన్స్ ఇస్తున్నారు. ఎవరైనా తమ నడవడికను మార్చుకుంటే వారిపై ఉన్న షీట్లను మూసేస్తామంటూ నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం ప్రకటించారు. అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ‘పరివర్తన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన ఉత్తర, తూర్పు మండలాలకు చెందిన 180 మంది రౌడీషీటర్లు, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి బయటికి వచ్చిన వారిలో సమావేశమయ్యారు. అసాంఘికశక్తులుగా ముద్రపడిన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు నగరపోలీస్ విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గణేష్ ఉత్సవాలు, హనుమాన్ జయంతి, బోనాలు... ఇలా నగరంలో ఏ కీలక ఘట్టం జరిగినా పోలీసుల కన్ను ‘షీటర్ల’ పైనే ఉంటుంది. ఆయా సమయాల్లో వారిని స్థానిక ఠాణాలు, టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలకు పిలిచి కౌన్సిలింగ్ చేయడంతో పాటు మరో పక్క ఆయా ఘట్టాలు సజావుగా సాగేలా సహకరిస్తే షీట్లు ఎత్తివేస్తామని మాట ఇస్తుంటారు. ఏళ్లుగా ఈ రకంగా ‘షీటర్ల’ను వాడుకుంటున్నా... ఎత్తివేత మాత్రం జరగడం లేదు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ దిద్దుబాటు చర్యల ద్వారా రౌడీషీటర్లలో పూర్తి మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. అసాంఘికశక్తులను అదుపులో పెట్టడంతో పాటు నేరగాళ్లపై కన్నేసి ఉంచడానికి పోలీసు విభాగం వారిపై వివిధ రకాలైన షీట్లు తెరుస్తుంటారు. బెదిరింపులు, దాడులు తదితరాలు చేసే రౌడీలపై రౌడీషీట్, దొంగతనాలు చేసే చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలకు పాల్పడిన వారిపై కమ్యూనల్ షీట్, భూ కబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరుస్తుంటారు. వీటిని వారు నివసించే స్థానిక పోలీసుస్టేషన్లలో నిర్వహించే అధికారులు తరచు ఆయా నేరగాళ్లను పిలిచి కౌన్సిలింగ్ చేయడంతో పాటు సున్నిత సమయాల్లో అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచి పెడుతుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏ నేరం, ఘటన చోటు చేసుకున్నా పోలీసుల కన్ను ముందుగా వీరిపైనే పడుతుంది. ఇవే కాకుండా షీటర్లు తరచు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అటెండెన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. పోలీసు మాన్యువల్ ప్రకారం రౌడీషీట్లను తెరుస్తారు. నిర్ణీత కాలంలో రెండు అంతకంటే ఎక్కువ నేరాలు చేసిన, ఉదంతాల్లో పాల్గొన్న వారిపై వీటిని ఓపెన్ చేసే అధికారం వారికి ఉంటుంది. మాన్యువల్‌లోని నిబంధనల ప్రకారం ఏటా ఈ షీట్లను పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంటుంది. షీట్ తెరిచిన తరవాత ఏడాది పాటు మరో నేరానికి పాల్పడని వారిపై దానిని మూసేసే అవకాశమూ ఉంది. అయితే నగరంలో గడిచిన కొన్నేళ్లుగా ఈ సమీక్ష జరగట్లేదు. ఫలితంగా పరిస్థితుల ప్రభావం, అనుకోకుండా, క్షణికావేశంలో నేరాలు చేసి షీటర్లు మారిన వారిపై ఏళ్ల తరబడి ఇవి కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వారి వ్యక్తిగత, సామాజిక జీవితాలపై పడుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ రౌడీషీట్లపై సమీక్షించడమేగాక వారికి మారడానికి అవకాశం కల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో ‘పరివర్తన్ సమ్మేళన్’ పేరుతో వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్ తరుణ్ జోషి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్.చైతన్యకుమార్‌తో పాటు ఆయా జోన్ల ఏసీపీలు, ఠాణాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్లు ఎత్తివేస్తామని వారికి కొత్వాల్ హామీ ఇచ్చారు. కొందరు రౌడీషీటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓ వ్యక్తి 2002లో తాను చేసిన తప్పు కారణంగా రౌడీషీట్ తెరిచారని, ఇప్పటి వరకు మరో తప్పు చేయకున్నా అది అలానే ఉందని సీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ షీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమీక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
రోడ్డుపై వెంటాడి.. వేటాడి
వేలూరు: పట్టణ సమీపంలోని మేల్ విషారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వేలూరు రౌడీని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన çకలకలం రేపింది. వేలూరు సైదాపేట కన్నిఆలయం వీధికి చెందిన మదిఅయగన్ కుమారుడు తమిళరశన్(26). మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇతను రాత్రి పూర్తిగా ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మేల్‌విషారంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న సర్వీస్ రోడ్డులో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన డీఎస్పీ సెల్వం, రత్నగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా తమిళరశన్ చేతులు, కాళ్లు, గొంతు వద్ద కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా వెంటాడి చంపినట్లు ప్రాథమిక విచారణలో తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళరశన్ తన అనుచరులతో కలిసి గత కొద్ది నెలల క్రితం వేలూరు కాట్టుకార వీధికి చెందిన ప్రభాకరన్ తలపై బండరాయిని వేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రభాకరన్ అనుచరులు ఎవరైనా తమిళరశన్‌ను హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తమిళరశన్‌పై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
లేడీ రౌడీషీటర్ ఆగడాలు.. మహిళను ఎత్తుకెళ్లి..
బెంగళూరు : కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉన్న లేడీ రౌడీషీటర్ యశస్విని అమాయకులపై దౌర్జన్యాలను తిరిగి ప్రారంభించింది. ఆరు నెలల క్రితం చెన్నమ్మన కెరె అచ్చుకట్టు ప్రాంతంలో గ్యాంగు ఏర్పాటు చేసుకొని రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో సీకే అచ్చుకట్టు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దీంతో కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న యశస్విని ఉత్తర విభాగానికి మకాం మార్చింది. అయితే పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉత్తర విభాగంలోని పలు ప్రాంతాల్లో రౌడీయిజం చేస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బాగలకుంటె ప్రాంతానికి చెందిన లలిత అనే ఓ మహిళ యశస్వినిపై గంగమ్మనగుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో తుదివిచారణ జరుగనున్న నేపథ్యంలో లలితను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరో ఎనిమిది మంది మహిళా రౌడీలతో కలసి గురువారం ఇంటికి వెళుతున్న లలితను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రగాయాల పాలైన లలితను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లలిత ఫిర్యాదుతో యశస్వినిపై కేసు నమోదు చేసుకున్న గంగమ్మనగుడి పోలీసులు యశస్విని కోసం గాలిస్తున్నారు. యశస్వినిపై గంగమ్మనగుడితో పాటు బాగలకుంటె, ఆర్ఎంసీ యార్డు పోలీస్స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈమె ఆగడాలు శ్రుతి మించడంతో గూండాచట్టం అమలుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
రౌడీ షీటర్‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ
-
మరో వివాదంలో పరిటాల సునీత
సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్ నగర్లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది. రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. -
టార్గెట్ సెల్‌ఫోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్‌బజార్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్‌పురికి మకాం మార్చాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్ నదీమ్‌లతో పాటు గౌస్‌తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్‌గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది. ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్‌ఫోన్ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్‌ఫోన్ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్‌లోని 31 బస్టాప్ వద్ద గౌస్ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
ఆ పచ్చబొట్లేమిటి?
ఐటీ సిటీలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలకు అదుపు లేదు. వేధింపులు, అత్యాచారాల సంఘటనలు సరేసరి. ఇక భూ దందాలు, హత్యల్లోనూ దేశంలోనే టాప్‌లో ఉంటోందీ ఉద్యాననగరి. ఇలాగైతే కుదరదు, ఓ పట్టు పట్టాల్సిందేనని సీసీబీ పోలీసులు ఆపరేషన్‌ను షురూ చేశారు. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో నేర కార్యకలాపాలను అడ్డుకట్టవేయడానికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీస్ అధికారులు కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. నగరంలో రౌడీలు, గూండాలను వెంటాడుతున్న సీసీబీ పోలీసులు తమదైనశైలిలో పబ్‌లు, బార్లపై దాడులు ప్రారంభించారు. ఇక చెవులకు పోగులు, చేతులకు కడియం,విచిత్ర తరహాలో జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరిగే యువకులు, నిరంతరం బార్లలో గుంపులుగా కూర్చుని మందుకొట్టేవారిని అదుపులోకి తమదైనశైలిలో విచారిస్తున్నారు. సీసీబీ పోలీసుల కంటికి అనుమానాస్పదంగా కనబడినవారిని బార్లలో నుంచి నేరుగా ఆయా పోలీస్స్టేషన్లు, లేక సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమాయకులుగా తేలినవారిని వదిలేసి గతంలో ఏమాత్రం నేరచరిత ఉన్నా కౌన్సెలింగ్ ఆరంభిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచే ఇలాంటి దాడులకు సీసీబీ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజాజీనగర, మాగడిరోడ్డు, హనుమంతనగర, పోలీస్స్టేషన్లు పరిధిలోని పలుబార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు దాడులకు, కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దొరికినవారిలో 36 మంది రౌడీలు ఉండగా, వారి కార్యకలాపాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. రౌడీలు పట్టివేత హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్లూవిం గ్బార్ పై సీసీబీ పోలీసుల దాడిలో అశోక్‌కుమార్, ప్రదీప్, వసంతకుమార్, దేవరాజు, చేతన్‌కుమార్, కాంతరాజు, విజయ్, రాజశేఖర్, విజయ్‌కుమార్ అనే రౌడీలు దొరికారు. రాజాజీనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవరంగ్ బార్ లో సూర్యకుమార్, చంద్రకాంత్, శ్రీకాంత్, మదన్, ఆనంద్, సంజయ్ అనే ఏడుగురుని పట్టుకెళ్లారు. మాగడి కాల్టెల్ బార్లో మద్యం సేవిస్తున్న నవీన్, మంజునాథ్, భరత్, మహేంద్ర, మంజు, విజయ్‌కుమార్, గోపినాయక్, జగదీశ్, జాకీర్, మహీబ్జాన్ అనే 11 మందిని తరలించారు. ముమ్మరంగా నిఘా చర్యలు రౌడీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎక్కడెక్కడ గ్యాంగ్‌లు కడుతున్నారు అనే దాని పట్ల సీసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలు, ఖాళీ మైదానాలు, కట్టడాల టెర్రస్‌లపై రౌడీలు చేరుకుని మద్యపానం సేవిస్తూ పార్టీలు చేసుకుంటున్నారని తెలిసి నిఘా పెట్టారు. మునుముందు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆ పచ్చబొట్లేమిటి? ‘చేతులపై కాకి, గుడ్లగూబ, శునకం ఇలా రకరకాల పచ్చబొట్లు వేసుకుని పోజు కొడితే ఊరుకునేదిలేదు. శుభ్రంగా కటింగ్, షేవింగ్ చేసుకుని మనుషుల్లా కనబడాలి. డాక్టర్ రాజ్‌కుమార్ ట్యాటూ వేసుకుని హత్యలకు పాల్పడతారా’ అని అదనపు పోలీస్‌కమిషనర్ అలోక్‌కుమార్ రౌడీలను హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్బంగా మంగళవారం సీసీబీ కార్యాలయంలో సుమారు 500 మంది రౌడీలకు పరేడ్ నిర్వహించి తీవ్రంగామందలించారు. డిప్రెషన్లో ఉన్నాను సార్ అని ఒక రౌడీ చెప్పగా, నిన్ను ఎవరైనా అలా అంటారా? అని ఆగ్రహించారు. మళ్లీ ఏదైనా సెటిల్మెంట్లకు దిగితే గూండా చట్టం కింద జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైట్‌డ్రెస్ వేసుకుని సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అని మండిపడ్డారు. ఒక్కో రౌడీని ఆయన ప్రశ్నించి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. -
అర్ధరాత్రి హిజ్రాలు నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి..
బంజారాహిల్స్: నెలవారి మామూళ్లు ఇవ్వడం లేదంటూ అర్ధరాత్రి దౌర్జన్యంగా హిజ్రాలు నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అలమారాలో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారు నగలతో ఉడాయించిన రౌడీషీటర్ వెంకట్ యాదవ్‌తో పాటు సనత్‌నగర్ పహిల్వాన్ సాయిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనకాల ఇందిరానగర్‌లో యాస్మిన్(28) అనే హిజ్రా సహచర హిజ్రాలతో కలిసి నిద్రిస్తున్నది. ఈ నెల 27వ తేదీన రౌడీ షీటర్ వెంకట్‌యాదవ్, సనత్‌నగర్ పహిల్వాన్ సాయి ఇద్దరూ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ప్రతినెలా తమకు ఇచ్చే రూ.10 వేల మామూళ్ళు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తూనే ఆమెను తీవ్రంగా కొట్టారు. అక్కడే ఉన్న ఆమె 17 నెలల కూతురిని కూడా హత్య చేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా ఆమె దగ్గరి నుంచి అలమారా తాళంచెవులు తీసుకొని అందులో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారాన్ని తీసుకోవడమే కాకుండా ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరించారు. నిందితులు అక్కడి నుంచి పరారు కాగానే బాధితురాలు ఈ విషయాన్ని సహచర హిజ్రాలకు తెలియజేసింది. సమాచారం అందుకున్న వివిధ ప్రాంతాల హిజ్రా గ్రూపులు శనివారం రాత్రి 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ నెల27వ తేదీన తాము పిర్యాదు చేస్తే ఇప్పటిదాకా వెంకట్ యాదవ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ బాధితురాలు యాస్మిన్‌తో పాటు సనం, సోనా రాథోడ్, సనా, ప్రియా, లక్కీ, అలేఖ్య, లిప్సిక తదితరులు స్టేషన్ ముందు బైఠాయించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు పెద్దసంఖ్యలో హిజ్రాలు విచ్చేసి స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు. నిందితుల జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఆ రౌడీషీటర్‌కు నటి సహా ఆరుగురు భార్యలు!
సాక్షి, టీ.నగర్ (చెన్నై) : రౌడీషీటర్ బుల్లెట్ నాగరాజ్‌కు సినీ సహాయనటితోపాటు ఆరుగురు భార్యలు ఉన్నట్లు తాజాగా పోలీసు విచారణలో వెల్లడైంది. అలాగే, తేని జిల్లాకు చెందిన స్పెషల్ ఎస్ఐ బాలమురుగన్‌తో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తేలింది. తేని జిల్లా, పెరియకుళం సమీపం మేలమంగళానికి చెందిన ఈ రౌడీషీటర్‌ను సోమవారం తెన్‌కరై సమీపంలో మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని వద్ద ఉన్న కత్తులు, నాటు తుపాకులు, పాత, కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని పెరియకుళం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు విచారించగా.. విస్మయపరిచే విషయాలెన్నో వెలుగుచూశాయి. తేని ఎస్పీ భాస్కరన్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం అతన్ని మంగళవారం తెల్లవారుజామున పెరియకుళం మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ ముందు హాజరుపరిచారు. నాగరాజ్‌కు 15 రోజుల కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. పోలీసులు అతన్ని తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. వత్సలగుండులో తాను బసచేసిన లాడ్జిలో ఎస్ఎస్ఐ బాలమురుగన్ పేరుతో నమోదు చేసినట్లు విచారణలో నాగరాజ్ తెలిపాడు. ఎస్ఎస్ఐ బాలమురుగన్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. బాలమురుగన్‌పై శాఖాపరమైన చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆరుగురు భార్యలు: బుల్లెట్ నాగరాజ్ చోరీ చేసిన నగదుతో జల్సాగా గడిపేవాడు. ఓ సినీ సహాయ నటి సహా తనకు మొత్తం ఆరుగురు భార్యలు ఉన్నట్లు నాగరాజ్ పోలీసులకు వెల్లడించాడు. అలాగే నకిలీ నోట్లను మార్చి భారీగా నగదు కొల్లగొట్టినట్లు తెలిపాడు. -
విశాఖలో రౌడీ షీటర్ ఖాసీం మర్డర్
-
రౌడీ షీటర్‌పై కత్తులతో దాడి
సాక్షి, కాకినాడ: రద్దీగా ఉండే సుబ్బయ్య హోటల్ పరిసరాల వద్ద ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుకేసుల్లో నిందితుడు, రౌడీషీటర్ సతీష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సుబ్బయ్య హోటల్ వద్ద రౌడీషీటర్ సతీష్‌పై కొందరు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సతీష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిపై ప్రత్యర్థులే దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలో జరిగిన జంట హత్యల కేసులో సతీష్ ప్రధాన నిందుతుడు కావడంతో ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.