
చెన్నై(తమిళనాడు): తాను కూడా వీఐపీనేనని రౌడీషీటర్ వరిచియూర్ సెల్వం సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంచీపురంలో అత్తివరదర్ దర్శనం కోసం వెళ్లే సాధారణ భక్తులు స్వామిని దర్శనం చేసుకుని వచ్చేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇలాఉండగా, మదురైకి చెందిన పేరుమోసిన రౌడీ షీటర్ వరిచియూర్ సెల్వం, వీఐపీలు కోటాలో స్వామి ముందు కూర్చుని రాజమర్యాదలతో స్వామి దర్శనం చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆయన దర్శనం సమయంలో ఒంటి నిండా బంగారు గొలుసు ధరించుకుని, కుటుంబసభ్యులతో స్వామిని దర్శించుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలా ఉండగా వరిచియూర్ సెల్వం ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో అత్తివరదర్ దర్శనం గురించి పేర్కొన్నారు. తాను కూడా వీఐపీనే అని, అందులో పలు విషయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment