సాక్షి, చెన్నై: గెండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్స అందిస్తున్నామని, ఆయన్ని చెన్నైకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా పుదుచ్చేరి స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం ఆర్ సెల్వం మంగళవారం గుండెపోటుకు గురవ్వగా ఆయను ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన ఈనంతరం గత నెల 26(ఆగస్టు) అసెంబ్లీలో బడ్జెట్ దాఖలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్పీకర్ ఎన్బలం సెల్వం నేతృత్వంలో సభా వ్యవహరాలు సాగుతూ వస్తున్నాయి.
మంగళవారం ఇంటి నుంచి కారులో అసెంబ్లీకి స్పీకర్ సెల్వం బయలుదేరారు. కారు అసెంబ్లీ ఆవరణలోకి రాగానే సెల్వంకు శ్వాస సమస్య తలెత్తింది. డ్రైవర్, భద్రతా సిబ్బంది ఆయన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఈమేరకు వైద్యం చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమావేశాలకు ఆటంకం కల్గకుండా డిప్యూటీ స్పీకర్ రాజ వేలు సభను నడిపించారు. సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుని స్పీకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
చదవండి: అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్!
అప్పడాలపై జీఎస్టీ ! ట్విట్టర్‌లో రచ్చ రచ్చ
Comments
Please login to add a commentAdd a comment