సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు.
కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment