సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత! | Tamil actor Arulmani, best known for his role in Singam, dies at 65 - Sakshi
Sakshi News home page

Singam-2: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సింగం నటుడు మృతి!

Apr 12 2024 1:10 PM | Updated on Apr 12 2024 1:27 PM

Tamil  best known actor Arulmani for his role in Singam, dies at 65 - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్‌మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్‌మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

 అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన  అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్‌మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్‌లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్‌ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు.

కాగా.. అరుల్‌మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement