Singam -2
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్‌లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు. కాగా.. అరుల్మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి బాటలో తేజస్విని
కోలీవుడ్ దివంగత ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబంలో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు పెళ్లి చెన్నైలోని తన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. 2021 ఏప్రిల్‌లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం,రఘువరన్ బీటెక్ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని ఏడు అడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం వద్ద పద్మావతి నగర్లో ఉన్న వివేక్ నివాసంలోనే తేజస్విని వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగింది. తండ్రి బాటలో తేజస్విని వివేక్‌కు మొక్కలంటే చాలా ఇష్టం.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న వివేక్.. చెన్నై నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కల నాటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యక్రమాన్ని ఇప్పుడు తేజస్విని కూడా కొనసాగిస్తుంది. తన తండ్రి కోరికను నిలబెడుతూ.. తన వంతుగా ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అందులో భాగంగా వారి వివాహానికి హాజరైన అతిథిలకు తేజస్విని దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజస్విని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం!!
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు కాగా.. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగం డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, దర్శకనిర్మాతలు సంతాపం ప్రకటించారు. కాగా.. గోపాలకృష్ణన్ భౌతికకాయానికి టుటికోరిన్ జిల్లాలోని వారి స్వగ్రామం కాచనవెల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు హరితో పాటు గోపాలకృష్ణన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2002 తమిళ చిత్రం 'తమిజ్'తో అరంగేట్రం చేసిన దర్శకుడు హరి.. తన 21 సంవత్సరాల సినీ జీవితంలో అనేక కమర్షియల్ హిట్లను అందించారు. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. -
ముందు తమ్ముడి తో చిత్రం చెయ్యండి
ముందు తమ్ముడితో చిత్రం చెయ్యండి అని నటుడు సూర్య అంటున్నారు. సూర్య హీరోగా చిత్రం చేయాలనుకునే దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. వారికి ముందు తమ్ముడు కార్తీతో చిత్రం చేయండి అంటూ సిఫార్సు చేస్తున్నారట. అలా సూర్యతో చిత్రం చేయాలని ఆశించిన దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. మంగాత్తా విజయం సాధించిన నేపథ్యంలో వెంకట్‌ప్రభు సూర్య కోసం కథ తయారు చేసి ఆయనకు వినిపించారట. కథ విన్న సూర్య మనం తర్వాత చిత్రం చేద్దాం. ఈ కథను కార్తీ హీరోగా తెరకెక్కించండని రెకమెండ్ చేశారట. అలా వెంకట్ ప్రభు కార్తీతో చేసిన చిత్రమే బిరియాని. అదే విధంగా దర్శకుడు ఎం.రాజేష్ తన వద్ద మంచి హాస్యభరిత కథ ఉంది దాన్ని సూర్యతో చేయాలనుందనే కోరికను ఒక ఆడియో కార్యక్రమంలో సూర్య సమక్షంలోనే వెల్లడించారు. రాజేష్ కథ విన్న సూర్య షరా మామూలుగానే కార్తీకి సిఫార్సు చేశారట. ఆ చిత్రమే అళగురాజా. తాజాగా సూర్యతో సింగం-2 తీసి హిట్ కొట్టిన దర్శకుడు హరి మరోసారి ఆయన కోసమే కథ సిద్ధం చేశారట. ఈ కథను కూడా సూర్య కార్తీ హీరోగా రూపొందించమని హరికి చెప్పారట. దీంతో ఆయన కార్తీతో చెయ్యాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడ్డట్టు కోలీవుడ్ టాక్. దీంతో ఇప్పుడు సూర్యకు కథలు వినిపించడానికి కొందరు దర్శకులు సంశయిస్తున్నారట.