ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు కాగా.. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగం డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, దర్శకనిర్మాతలు సంతాపం ప్రకటించారు.
కాగా.. గోపాలకృష్ణన్ భౌతికకాయానికి టుటికోరిన్ జిల్లాలోని వారి స్వగ్రామం కాచనవెల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు హరితో పాటు గోపాలకృష్ణన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2002 తమిళ చిత్రం 'తమిజ్'తో అరంగేట్రం చేసిన దర్శకుడు హరి.. తన 21 సంవత్సరాల సినీ జీవితంలో అనేక కమర్షియల్ హిట్‌లను అందించారు. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment