కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్‌ఎస్ శివాజీ(66) కన్నుమూశారు. కోలీవుడ్‌లో హాస్యనటుడు మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిసలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళంలో వందకుపైగా సినిమాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శివాజీ ప్రముఖ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు కాగా.. ఆయన సోదరుడు సంతాన భారతి కోలీవుడ్‌లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
1981లో వచ్చిన ‘పన్నీర్ పుష్పాలు’ సినిమాతో శివాజీ తెరంగేట్రం చేశారు. 'కోలమావు కోకిల', 'సూరరై పొట్రు', 'ధారల ప్రభు' 'గార్గి' లాంటి చిత్రాల్లో కనిపించారు. స్టార్ హీరో కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఎక్కువ చిత్రాల్లో పనిచేసినందుకు కోలీవుడ్‌లో గుర్తింపు పొందారు. కాగా.. శివాజీ చివరిసారిగా యోగి బాబు నటించిన 'లక్కీ మ్యాన్'లో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైంది.
(ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? )
కమల్‌హాసన్‌తో ప్రత్యేక అనుబంధం
కమల్‌హాసన్‌తో శివాజీకి చక్కటి అనుబంధమున్నట్లు తెలుస్తోంది. ఆ సాన్నిహిత్యంతోనే కమల్‌హాసన్ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో పాటు పలు సినిమాల్లో శివాజీ కమెడియన్‌గా నటించారు. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదమై శివాజీకి మంచి పేరుతెచ్చిపెట్టాయి.
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో కీలకపాత్ర
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్ఎస్ శివాజీ. మాలోకం అనే ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా తేజ డైరెక్షన్‌లో వచ్చిన 100 అబద్దాలు సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. వీటితో పాటు తెలుగులో గతేడాది సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన గార్గి సినిమాలో ఆమె తండ్రి పాత్రలో కనిపించిన శివాజీ ప్రశంసలు అందుకున్నారు. సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్‌లో శివాజీ కీలక పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! )
Comments
Please login to add a commentAdd a comment