![Tamil Actor, Comedian Siva Narayan Murthy Passed Away at 68 - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/siva-narayan-murthi1.jpg.webp?itok=oZvWfiPL)
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ నారాయణమూర్తి కన్నుమూశారు. కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్ విషాదం నెలకొంది. ఆయన మృతికి తమిళ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
కాగా ప్రస్తుతం శివ నారాయణమూర్తి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం తమిళనాడులోని పట్టుకోట్టై జిల్లాలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (డిసెంబర్ 8) సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. శివ నారాయణమూర్తికి భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు లోకేష్, రామ్‌కుమార్, ఒక కుమార్తె శ్రీదేవి ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలోకి మురళి హీరోగా నటించిన ‘పూంతోట్టం’ మూవీతో ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో శివ నారాయణమూర్తి 200లకుపైగా చిత్రాల్లో నటించారు.
చదవండి:
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
Comments
Please login to add a commentAdd a comment