ప్రపంచంలోని గొప్ప బాడీబిల్డర్‌గా గుర్తింపు పొందిన ఇలియా 'గోలెం' యెఫిమ్‌చిక్ గుండెపోటు కారణంగా కన్నుమూశాడు. కండలు తిరిగిన దేహంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇలియా కేవలం 36 ఏళ్ల వయస్సులోనే కన్నుమూయడం, గుండెపోటు ముప్పుపై చర్చకు దారి తీసింది.
నిరంతరం జిమ్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకునే ఆరడుగుల ఆజానుభాహులు కూడా కూడా ఇటీవలి కాలంలో గుండెపోటుకు బలైపోతున్నారు. మీడియా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 6న ఇలియాకు గుండెపోటు రావడంతో, భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సీపీఆర్ చేస్తూనే ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 11న కన్నుమూశారు. కోలుకుంటాడనే ఆశతో ఎదురు చూశాను. తని గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినా,మెదడు పనిచేయడం ఆగిపోయిందని వైద్యులుచెప్పారని అతని భార్య అన్నా స్థానిక మీడియాతో పంచుకున్నారు.
వృత్తిపరమైన బాడీబిల్డింగ్ ఈవెంట్‌లలో ఎప్పుడూ పోటీపడనప్పటికీ, ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ వీడియోలను పంచుకునేవాడు. దీంతో ఫాలోవర్స్ బాగా పెరిగారు. 25-అంగుళాల కండపుష్టితో ‘మోస్ట్ మాన్‌స్ట్రస్ బాడీబిల్డర్,' రోజుకు 16,500 కేలరీలు భోంజేస్తాడు. 340 పౌండ్ల బరువు కారణంగా బాడీబిల్డింగ్ సర్కిల్‌లలో "ది మ్యూటాంట్" అనే మారుపేరు కూడా సంపాదించాడు. ఫిట్‌గా ఉండే ఇలియా అకాల మరణం అతని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
యువకులలో గుండె సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సాధారణగా మగవారికి 65, స్త్రీలలో 72ఏళ్ల తరువాత గుండెపోటు వస్తుందని భావించేవారు. కానీ ఇటీవలి పరిశోధనలో భాగంగా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గత దశాబ్దంలో 2శాతం పెరుగుదలతో 40 ఏళ్లలోపు వ్యక్తులు ఇప్పుడు తరచుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ కుమార్ ,సిద్ధార్థ్ శుక్లా మొదలు, ఇటీవల నటుడువికాస్ సేథి గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. (విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!)
గుండెపోటు కారణాలు
గుండెకు రక్తప్రసరణలో తీవ్ర అడ్డంకులు, లేదా నిలిచిపోయినపుడు గుండె స్పందన రేటు విపరీతంగా పెరిగి, గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటును మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (MI) అని కూడా పిలుస్తారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, వృత్తిపరమైన ,వ్యక్తిగత ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం వల్ల వస్తుంది.
కరోనరీ ఆర్టరీ వ్యాధి: ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుని గుండె కండరాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇది చాలా సాధారణ కారణమని వైద్యులు చెబుతున్నారు.
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్: ఇది ప్రాణాంతక పరిస్థితి. అతి వేగంగా గుండె కొట్టుకుంటుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కారణంగా గుండె లయ తప్పి, పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రాణాంతకం కావచ్చు.
ఒత్తిడి: ఒత్తిడి గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. తీవ్రమైన ఒత్తిడి గుండె పనితీరును దెబ్బతిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితమే గుండెకు రక్ష. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, తొందరగా మేల్కొని, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమైన మార్గం.
ఇదీ చదవండి: కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!
Comments
Please login to add a commentAdd a comment