మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత | Ex Minister Yerneni Sita Devi Passed Away Latest Updates | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Published Mon, May 27 2024 9:22 AM | Last Updated on Mon, May 27 2024 9:22 AM

Ex Minister Yerneni Sita Devi Passed Away Latest Updates

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన యెర్నేని సీతాదేవి కన్నమూశారు.

హైదరాబాద్‌: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. 

సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్‌(చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు యెర్నేని రాజారామచందర్‌(దివంగత ) రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement