Selvam
-
‘మురసోలి’ సెల్వమ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు. కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. -
పుదుచ్చేరి స్పీకర్‌కు గుండెపోటు, ఆస్పత్రిలో చేరిక
సాక్షి, చెన్నై: గెండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్స అందిస్తున్నామని, ఆయన్ని చెన్నైకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా పుదుచ్చేరి స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం ఆర్ సెల్వం మంగళవారం గుండెపోటుకు గురవ్వగా ఆయను ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన ఈనంతరం గత నెల 26(ఆగస్టు) అసెంబ్లీలో బడ్జెట్ దాఖలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్పీకర్ ఎన్బలం సెల్వం నేతృత్వంలో సభా వ్యవహరాలు సాగుతూ వస్తున్నాయి. మంగళవారం ఇంటి నుంచి కారులో అసెంబ్లీకి స్పీకర్ సెల్వం బయలుదేరారు. కారు అసెంబ్లీ ఆవరణలోకి రాగానే సెల్వంకు శ్వాస సమస్య తలెత్తింది. డ్రైవర్, భద్రతా సిబ్బంది ఆయన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఈమేరకు వైద్యం చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమావేశాలకు ఆటంకం కల్గకుండా డిప్యూటీ స్పీకర్ రాజ వేలు సభను నడిపించారు. సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుని స్పీకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. చదవండి: అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్! అప్పడాలపై జీఎస్టీ ! ట్విట్టర్లో రచ్చ రచ్చ -
పుదుచ్చేరి స్పీకర్‌గా సెల్వం
సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బిజేపి బలం పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున ఆరు మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగ స్వామి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి రెండు మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని ఎన్ఆర్ కాంగ్రెస్ కేటాయించింది. ఇదిలా ఉండగా, స్పీకర్ ఏకగ్రీవ ఎంపికతో ఇక మంత్రివర్గం విస్తరణకు రంగ స్వామి చర్యలు తీసుకున్నారు. మంత్రులు ఎంపిక చేసిన వారి జాబితాను గురు లేదా శుక్రవారం ఎల్జీ తమిళి సై సౌందరరాజన్‌ను కలిసి సమర్పించనున్నారు. ఈనెల 21న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. చదవండి: ఆ.. ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత -
నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ
చెన్నై(తమిళనాడు): తాను కూడా వీఐపీనేనని రౌడీషీటర్ వరిచియూర్ సెల్వం సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంచీపురంలో అత్తివరదర్ దర్శనం కోసం వెళ్లే సాధారణ భక్తులు స్వామిని దర్శనం చేసుకుని వచ్చేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇలాఉండగా, మదురైకి చెందిన పేరుమోసిన రౌడీ షీటర్ వరిచియూర్ సెల్వం, వీఐపీలు కోటాలో స్వామి ముందు కూర్చుని రాజమర్యాదలతో స్వామి దర్శనం చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆయన దర్శనం సమయంలో ఒంటి నిండా బంగారు గొలుసు ధరించుకుని, కుటుంబసభ్యులతో స్వామిని దర్శించుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలా ఉండగా వరిచియూర్ సెల్వం ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో అత్తివరదర్ దర్శనం గురించి పేర్కొన్నారు. తాను కూడా వీఐపీనే అని, అందులో పలు విషయాలను వెల్లడించారు. -
జల్లికట్టు నేపథ్యంగా వీరతిరువిళా
తమిళసినిమా: తమిళుల వీరత్వానికి చిహ్నం జల్లికట్టు క్రీడ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం వీర తిరువిళా అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విజయ్ మురళీధరన్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇరైవన్ సినీక్రియేషన్స్ పతాకంపై సి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈయన నిర్మించిన ఒరు కణవుపోల చిత్రం త్వరలో విడుదల కానుంది. వీర తిరువిళా చిత్రంలో సత్య,సెల్వం, సెల్వ కథానాయకులుగా నటించగా నాయకిగా తేనిక నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో పొన్వన్నన్, సింధియా, నజీర్, కాదల్సుకుమార్ నటించారు. ఈఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది జల్లికట్టు ప్రజలు నివశించే ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. పూర్వం జల్లికట్టు అనేది క్రీడ కాదన్నారు. అది వీర పోరాటం అని తెలిపారు. ఐదుగురు యువకులు జల్లికట్టు పోరాటంలో గెలిచి వారి ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిన కథే వీర తిరువిళా అని చెప్పారు. ఇది జల్లికట్టు క్రీడ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి చిత్రం అని, ఆ తరువాత జల్లికట్టు క్రీడను నిషేధించడంతో ఈ చిత్ర విడుదలకు జాప్యం జరిగిందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, అమరావతి, పుదూర్, సీరావయల్, ఆకావయల్, నేమం, మేట్టూర్ పెరియతండా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయాలు
-
మేజర్ని.. విడాకులు మంజూరు చేయండి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సమాజం ఒప్పుకోదు విడాకులు కావాలన్న పవిత్రకు న్యాయమూర్తుల హితవు చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భార్యాభర్తల బంధం ఎంతో బాధ్యతతో కూడుకున్నది. మేజర్ అయినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వ్యవహరించి సమస్యలు సృష్టించే హక్కులేదు, న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు’. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు తమిళ్‌వాసన్, సెల్వం. న్యాయమూర్తుల నోటి వెంట ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు రావడానికి గల కారణాల్లోకి వెళితే... తమిళనాడు వేలూరు జిల్లా పల్లికొండ కుచ్చిపాళయానికి చెందిన పళని భార్య పవిత్ర అకస్మాత్తుగా అదృశ్యమైంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆంబూరుకు చెందిన షమీల్‌అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో షమీల్‌అహ్మద్ లాకప్‌డెత్‌కు గురయ్యాడు. ఆంబూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ఒక వర్గం పోరాటానికి దిగింది. పల్లికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ మార్టిన్ ప్రేమ్‌రాజ్ సమా ఏడుగురు పోలీసులు సస్పెండ్‌కు గురయ్యారు. విచారణలో షమీల్‌అహ్మద్‌తో పవిత్రకు సన్నిహత సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పవిత్ర ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తన భార్య పవిత్ర ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ పోలీసు ఫిర్యాదుతోపాటు మద్రాసు హైకోర్టులో భర్త పళని పిటిషన్ దాఖలు చేశాడు. పవిత్ర ఆచూకీ కోసం ఏర్పాటైన రెండు పోలీసు బృందాలు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నైలో దాక్కుని ఉన్నట్లు కనుగొని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం మద్రాసు హైకోర్టులో ప్రవేశపెట్టగా ‘నా భర్త పళనితో కాపురం చేయడం ఇష్టం లేదు, నా వయస్సు 25 ఏళ్లు, మేజర్ కాబట్టి విడాకులు మంజూరు చేయండి’ అంటూ పవిత్ర న్యాయమూర్తులను కోరింది. ఇందుకు న్యాయమూర్తులు బదులిస్తూ, ‘మేజర్‌వు కాబట్టి నీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కుంది, అయితే సభ్య సమాజం భార్యాభర్తలు కలిసి ఉండాలని చెబుతోంది. మీకు పిల్లలు ఉన్నారు, వారి బాగోగుల దృష్ట్యా కలిసి కాపురం చేయాలి. భర్తను వదిలి వెళ్లిపోయిన కారణంగా చేపట్టిన విచారణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆం బూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మీ వల్ల సమాజంలో కలవరం ఏర్పడింది. ఈ కలవరాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలను అనుమతించరాదు. విడాకులు కావాలంటే అందుకు వేరే కోర్టు ఉంది. మేము మంజూరు చేయలేము. కావాలనగానే పొందేందుకు విడాకులు అంగడిలో దొరికే వస్తువు కాదు. పవిత్ర తల్లిదండ్రులను కోర్టుకు పిలిపించి కుమార్తెకు బుద్దిచెప్పండి అంటూ ఆదేశించారు.