సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బిజేపి బలం పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున ఆరు మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది.
సీఎంగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత రంగ స్వామి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి రెండు మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని ఎన్‌ఆర్ కాంగ్రెస్ కేటాయించింది. ఇదిలా ఉండగా, స్పీకర్ ఏకగ్రీవ ఎంపికతో ఇక మంత్రివర్గం విస్తరణకు రంగ స్వామి చర్యలు తీసుకున్నారు. మంత్రులు ఎంపిక చేసిన వారి జాబితాను గురు లేదా శుక్రవారం ఎల్జీ తమిళి సై సౌందరరాజన్‌ను కలిసి సమర్పించనున్నారు. ఈనెల 21న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment