తిరుపతిలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యాడు. స్థానిక సుబ్బారెడ్డినగర్కు చెందిన శ్రీనివాసరెడ్డిని సోమవారం రాత్రి అత్యంత కిరాతకంగా హతమార్చారు.
తిరుపతి: తిరుపతిలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సుబ్బారెడ్డినగర్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి అదే ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో మంగళవారం ఉదయం విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రౌడీషీటర్ శ్రీనివాసులురెడ్డిగా గుర్తించారు. అతనిపై ముఖంపై యాసిడ్ పోసి, కొట్టి చంపిన ఆనవాళ్లున్నాయి. వివిధ నేరాలకు సంబంధించి పలు కేసులు అతనిపై ఉన్నాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.