
సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.
గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు.