TTD Chairman
-
‘లోకేష్ రెడ్‌బుక్‌లో స్వామీజీలు కూడా ఉన్నారా?’
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి నేతల రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. అలాగే, కక్షలు, కార్పణ్యాలతో చంద్రబాబు, లోకేష్ కళ్ళు మూసుకుపోయాయని మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. అసలు బోర్డు ఏర్పాటు రాజకీయ ప్రేరేపితంగా జరిగింది. టీడీపీకి వెట్టిచాకిరి చేశాడు కాబట్టే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీడీపీ ఏది చెబితే అది తన టీవీలో వేసి గందరగోళం సృష్టించి సర్వశక్తులు ఉపయోగించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు. దానికి ప్రతిఫలంగా, దక్షిణగా చంద్రబాబు.. బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు.తాజాగా బోర్డు రెండు నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయడం దారుణం. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. విచారణ జరిపించారు. కానీ విచారణలో ఏమీ జరగలేదని తేలింది. వైఎస్ జగన్ హయాంలోనే శ్రీవాణి ట్రస్ట్ రూపకల్పన జరిగింది కాబట్టి కక్ష కట్టి ట్రస్ట్‌ను రద్దు చేశారు. శారదా పీఠం స్వరూపానంద స్వామిపై చంద్రబాబు నాయుడు, లోకేష్ కక్ష కట్టారు. స్వరూపానంద స్వామి ధర్మ ప్రచారం చేసే వ్యక్తి.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండపైన స్వరూపానందకు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు రద్దు చేశారు. స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?. మీ రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా?. సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్న చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ పునరాలోచించుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
క్రిమినల్ కేసులున్నా.. టీటీడీ బోర్డులో చోటా!?
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను బోర్డులో నియమించారని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్లోనే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.ఎస్సీ, ఎస్టీలపై దాడులు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీలమైన రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడం, మైనార్టీలపై దాడులకు తెగబడటం.. ఇలా నిత్యం వివాదాలు, అరాచకాలతో ఎదిగిన మల్లెల రాజశేఖర్‌ను అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. రాజశేఖర్ వరుసగా నేరాలకు పాల్పడుతున్నారని, అతని వైఖరిలో మార్పులేనందున అతనిపై రౌడీషీటు తెరవాలని ఓర్వకల్లు ఎస్ఐ డీఎస్పీకి సిఫార్సు చేశారు. దీంతో గత ప్రభుత్వంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు.మల్లెల రాజశేఖర్‌పై ఉన్న ముఖ్యమైన కేసులు..1 హుస్సేనాపురంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో పాటు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ఓర్వకల్లు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.2 హుస్సేనాపురంలోనే గడివేముల బస్టాండ్ సమీపంలో 15–3–2014న రాళ్లు, కట్టెలతో కొందరిపై దాడిచేసి చంపేందుకు తెగబడ్డారు.3 2019 మార్చి 4వ తేది మహాశివరాత్రి అర్థరాత్రి సమయంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.4 2019 సార్వత్రిక ఎన్నికల వేళ మల్లెల రాజశేఖర్, అతని అనుచరులు స్థానిక సమస్యలను లేవనెత్తిన దళితుల ముఖంపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.5 గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో మల్లెల రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడిచేసి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. దీంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.బ్రాహ్మణులకు చోటులేకపోవడం అన్యాయంమల్లెల రాజశేఖర్‌పై మాత్రమే కాదు.. టీటీడీ బోర్డులోని సభ్యులలో చాలామందికి నేరచరిత్ర ఉంది. ప్రతీ ఆలయంలో ఇద్దరు బ్రాహ్మణులను బోర్డులో నియమిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, టీటీడీ బోర్డులో ఒక్క బ్రాహ్మణుడు లేకపోవడం అన్యాయం. ఇది బ్రాహ్మణులను కించపరచడమే. నేరస్తులను బోర్డులో నియమించడం హిందువులను అవమానించడమే. – మనోహర్‌రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్‌లో 17 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 68,146 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,667 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 5 గంటల్లో దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. నేడు టిటిడి నూతన చైర్మన్ గా భాద్యతలు చేపట్టనున్న బిఆర్ నాయుడుటిటిడి చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నవేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెస్ రాజు సాంబశివరావు జంగా కృష్ణమూర్తి దర్శన్ శాంతారాం రామమూర్తి జానకి దేవి మహేంద్ర రెడ్డి ఆనంద్ సాయి నరేష్ కుమార్ అదిథ్ దేశాయ్ సౌరబ్ బోరా నర్సిరెడ్డి రాజశేకర్ గౌడ్ -
ఓపక్క తీవ్ర అభ్యంతరాలు.. TTD పాలకమండలిలో మరొకరికి చోటు
అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈలోపే పాలకమండలి బోర్డులో మరొకరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. బీజేపీ నుంచి భాను ప్రకాష్ రెడ్డి 25వ సభ్యుడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ కొత్త బోర్డుపై మునుపెన్నడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు, ఆరోపణలు, వివాదాల్లో నిలిచినవాళ్లకే బోర్డులో చోటు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కోసం సభ్యులను 24 నుంచి 25కి పెంచారు. ఈ మేరకు బీఆర్ నాయుడు చైర్మన్‌గా.. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.అసలే టీటీడీ బోర్డులో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న బలమైన విమర్శ వినిపిస్తోంది. ఇది చాలదన్నట్లు నేర చరితులను టీటీడీ సభ్యులుగా నియమించింది బాబు సర్కారు. అత్యధికంగా కేసులు ఉన్న టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్, ఎం ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూలకు సభ్యులుగా నియమించడంపైనా దుమారం చెలరేగింది. మల్లెల రాజశేఖర్‌పై రౌడీషీట్‌తో పాటు కల్తీ మద్యం కేసు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఇక.. ఎంఎస్ రాజుపై ఏకంగా 23 క్రిమినల్ కేసులు ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.ఇదీ చదవండి: శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా: బీఆర్ నాయుడు