srinivasreddy
-
‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి’
సాక్షి, యాదాద్రి భువనగిరి: హాజీపూర్ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారంతా ‘శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి’ అనే నినాదాలు చేస్తూ.. హాజీపూర్‌లో నిరసన చేపట్టారు. షాద్‌నగర్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ విద్యార్థులను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన చేసిన విషయం తెలిసిందే. షాద్‌నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్లో మట్టు బెట్టిన ప్రభుత్వం.. హాజీపూర్ ఘటనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దీంతో పాటు బొమ్మల రామారం పోలీసులను కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. సాక్షి, కొమురంభీం ఆసిఫాబాద్: చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జైనూర్లోని మార్కెట్లో కూడా బంద్‌ను నిర్వహించారు. -
నిర్మాతే నా హీరో
‘‘నేను గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ టచ్ ఉన్నవి. ‘రాగల 24 గంటల్లో..’ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో సినిమా చేశా. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌లో ప్రేక్షకుడు ఉంటాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► నేను, కృష్ణభగవాన్ రెండు స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. ► హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ► ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్’ రీమేక్ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. అది సెట్స్ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్గా. అదీ వర్కౌట్ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. ► శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టర్ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్ హెచ్డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. ► నేను ఫామ్‌లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ కానూరి ప్రొడక్షన్లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను. -
ధైర్యం ఉంటే ఓయూలో అడుగుపెట్టాలి
సాక్షి, జగిత్యాల: సీఎంకు ధైర్యం ఉంటే ఓయూలో అడుగుపెట్టి, విద్యార్థులతో మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం జిల్లాకేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీజేపీ సమీక్షబైటక్‌లో శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర రైతాంగానికి యూరియా అందించడంలో విఫలం అయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సిద్దిపేటలో రైతు చనిపోయినా చలనం లేదన్నారు. రైతు రుణమాఫీ హామీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లభిస్తోందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగంపేట శ్రీనివాస్, గుడాల రాజేశ్‌గౌడ్, ఆంకారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాలన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్లో చేరుతున్నట్టు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు వినోద్‌కుమార్, పొంగులేటి, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
అబ్బాయిగా నటించడం ఈజీ కాదు
‘‘మా నాన్న సింధీ. మా అమ్మ గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. మా అమ్మ హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. చిన్నప్పుడు అమ్మతో కలిసి సీరియల్ సెట్‌కి వెళ్లేదాన్ని. 17 ఏళ్లకు తొలిసారి నటించా. ఆ తర్వాత దేవాంక్ పటేల్‌తో గుజరాతీ సినిమా చేశా’’ అని సిద్ధి ఇద్నాని అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీ కృష్ణ(మను) దర్శకత్వంలో రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ– ‘‘ఓ వైపు సీరియల్స్, కమర్షియల్ యాడ్స్ చేస్తుండగా ఓ ఏజెన్సీ వాళ్లు ఫోన్ చేసి తెలుగు సినిమా ఉందని చెప్పారు. ఆడిషన్‌కి వెళ్లాను. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌కి రమ్మని పిలిచారు. మనుగారు, నిర్మాతలు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నా కళ్లు, నవ్వు చూసి నేను చేస్తానని వాళ్లు నమ్మి ‘జంబ లకిడి పంబ’ లో అవకాశం ఇచ్చారు. నేను ఫస్టాఫ్‌లో డిజైనర్‌గా కనిపిస్తాను. ఇంటర్వెల్ తర్వాత పాత్రలు మారతాయి. ఓ అమ్మాయి అబ్బాయిగా నటించడం అంత ఈజీ కాదు. నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భాష కన్నా భావాలు ఎక్కువగా మాట్లాడుతాయి. కామెడీ చేయడం చాలా కష్టం. భాష తెలియకపోతే మరీ ఇబ్బంది. అందుకే భాష నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలుగు తెలుసు. ప్రస్తుతం కథలు వింటున్నా. ‘జంబ లకిడి పంబ’ విడుదల తర్వాత కొత్త చిత్రాలకు సంతకం చేస్తా’’ అన్నారు. -
ఆ టైటిల్ పెట్టినప్పుడు తిట్టారు
‘‘మేడమీద అబ్బాయి’ సినిమా నుంచి మనూగారితో మంచి పరిచయం ఉంది. ‘జంబ లకిడి పంబ’ టైటిల్ పెట్టడంతో అందరూ తిట్టారని మను అన్నారు. గతంలో నా సినిమాకి ‘అహ నా పెళ్ళంట’ టైటిల్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని తిట్టారు. అయితే మేం హిట్ కొట్టాం. నాన్నగారి (ఈవీవీ) ‘జంబ లకిడి పంబ’ సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి. మురళీ కృష్ణ (మను) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. బీజేపీ ఎం.ఎల్.సి మాధవ్ ట్రైలర్ లాంచ్ చేయగా, బ్యానర్ లోగోను బీరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. జె.బి.మురళీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’ సినిమా పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు మాత్రం తీయం’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ఇది. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రవి. ‘‘మా సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. సిద్ధి ఇద్నాని, నిర్మాతలు జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్, సంగీత దర్శకుడు గోపీసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత కబడ్డీ జట్టు కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, సంగారెడ్డి: దుబాయ్‌లో జరుగనున్న ‘మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ’లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా సంగారెడ్డికి చెందిన ఎల్. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీనివాస్ రెడ్డిని భారత కోచ్‌గా నియమించినట్లు భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది. ఈనెల 22 నుంచి 30 వరకు దుబాయ్‌లోని అల్‌వసల్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇరాన్, అర్జెంటీనా జట్లు తలపడుతున్నాయి. భారత జట్టుకు అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సందర్భంగా భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్యకు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరుగనున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లోనూ శ్రీనివాస్ రెడ్డి జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. గతంలో తెలుగు టైటాన్స్, హరియాణా స్టీలర్స్ జట్టుకు ఆయన సహాయక కోచ్‌గా ఉన్నారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా పనిచేశారు. -
ఆ జంబలకిడిపంబలా...
‘జంబలకడిపంబ’ ఈ సినిమా చూసినవారు నవ్వు ఆపుకోలేరు. ఆ రేంజ్లో కామెడీ ఉంటుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాల్లో హీరోగా నటించిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి కథనాయకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో సిద్ది ఇద్నాని కథానాయిక. జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో, జోస్, శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను వీకే నరేశ్ రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా ఈవీవీ సత్యనారాయణగారు సృష్టించిన ‘జంబలకిడిపంబ’ తెలుగు సినిమాల్లో ఆణిముత్యం లాంటిది. ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీనివాసరెడ్డి చేస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌కు మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘జంబలకిడిపంబ’ టైటిల్‌ను మరలా పెట్టి సినిమా తీయడం సాహసమే. కానీ వీళ్లు చేస్తున్నారు. కథ చాలా కొత్తగా ఉంది. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘ఇది రొమాంటిక్ కామెడీ సినిమా’’ అన్నారు నిర్మాతలు. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ బాగా కుదిరింది. మా చిత్రకథకు కరెక్ట్‌గా సరిపోయే టైటిల్ ఇది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఆ ‘జంబలకిడిపంబ’ ఎంతో హిట్టయిందో ఈ సినిమా అంతే హిట్ సాధించాలి’’ అన్నారు అలీ. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్ -
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
-
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
సాక్షి, హైదరాబాద్ : ఆమరణ దీక్ష వైపుగా ముందుకెళుతున్న సంగీతను తొలి విజయం వరించింది. మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ఆమెను గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి నెల మెయింటెన్స్‌కు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. బోడుప్పల్‌కు చెందిన సంగీత తన భర్త శ్రీనివాసరెడ్డి వేధింపులపై గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ఈ కేసు విచారణలో భాగంగా మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సంగీతకు మెయింటెనెన్స్ ఖర్చులు నెలకు రూ.20 వేలు చెల్లించాలని, అలాగే, ఆమెను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీత తరుపున ఆమె సోదరుడు కోర్టుకు హాజరయ్యాడు. సంగీత మాత్రం ఇంకా దీక్షలోనే ఉన్నారు. రోడ్డున పడ్డాం, రాజీకి రావా..? -
మరో జంబలకిడి పంబ
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా ప్రేక్షకులకు ఎన్ని నవ్వులు పంచిందో.. ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పురుషులు మహిళల్లా.. మహిళలు పురుషుల్లా మారి తెగ నవ్వులు పూయించారు. తాజాగా శ్రీనివాసరెడ్డి హీరోగా ‘జంబలకిడి పంబ’ సినిమా తెరకెక్కుతోంది. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాల తర్వాత శ్రీనివాసరెడ్డి హీరోగా చేస్తోన్న మూడో చిత్రమిది. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. వైకుంఠ ఏకాదశి రోజున మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రకథకు చక్కగా సరిపోయే టైటిల్ ‘జంబలకిడి పంబ’. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అన్నారు మురళీకృష్ణ. సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్. -
హిందీలోనూ ఆనందో బ్రహ్మ... బట్!
బీటౌన్‌లో బ్రహ్మ దేవుడు ఎవరెవరి పేర్లు రాశాడో మరి!? ఎందుకంటే... ప్రతి మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసినట్టు, సినిమాలోని ప్రతి పాత్ర మీదా నటించబోయేవాళ్ల పేరు రాసి పెడుతుంటాడట బ్రహ్మ! ‘ఆనందో బ్రహ్మ’ హిందీ రీమేక్‌లో నటీనటులుగా ఎవరెవరి పేర్లు రాశాడో! ‘భయానికి నవ్వంటే భయం’.. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడితే? అనే కాన్సెప్టుతో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ తెలుగు ప్రేక్షకులందర్నీ నవ్వించి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చింది. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చిత్రదర్శకుడు మహి వి. రాఘవ్ అనుకుంటున్నారు. ‘గోల్మాల్’ తరహాలో మాంచి మల్టీస్టారర్ సిన్మాగా చేయాలనుకుంటున్నారట! తెలుగులో హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, హిందీలో వాళ్ల పాత్రల్లో నటించే హీరోలు ఎవరెవరో? తాప్సీ పాత్రలో ఎవరు నటిస్తారో? ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ఇటీవల వచ్చిన ‘గోల్మాల్ ఎగైన్’ కాన్సెప్ట్ హారరే. ఆల్రెడీ ఈ సినిమా వందకోట్లు కలెక్ట్ చేసింది. సో, హిందీ స్టార్స్ ‘ఆనందో బ్రహ్మ’ చేసే చాన్సులు ఎక్కువే. అయితే... హిందీ ‘ఆనందో బ్రహ్మ’ కంటే ముందు తెలుగు ఓ సినిమా చేయాలని మహి వి. రాఘవ్ అనుకుంటున్నారట. ప్రస్తుతం కొత్త కథపై ఆయన వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. -
సినీనటుడు శ్రీనివాస్‌రెడ్డి సందడి
ఆత్మకూరు: కమెడియన్‌గా , హీరోగా రాణిస్తున్న సినీ నటుడు శ్రీనివాసరెడ్డి మండల పరిధిలోని పి, యాలేరులో శుక్రవారం సందడి చేశారు. నాలుగు కథలతో .. నలుగురు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నట్లు ఆయన తెలియచేశారు . ఇందులో భాగంగానే ఆత్మకూరు మండలంలో పి, యాలేరులో సినిమా షూటింగ్‌కు వచ్చినట్లు చెప్పారు. ఆయనను చూడగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
తిరుపతిలో రౌడీ షీటర్ దారుణ హత్య
తిరుపతి: తిరుపతిలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సుబ్బారెడ్డినగర్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి అదే ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో మంగళవారం ఉదయం విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రౌడీషీటర్ శ్రీనివాసులురెడ్డిగా గుర్తించారు. అతనిపై ముఖంపై యాసిడ్ పోసి, కొట్టి చంపిన ఆనవాళ్లున్నాయి. వివిధ నేరాలకు సంబంధించి పలు కేసులు అతనిపై ఉన్నాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు
-
టవరెక్కి యువకుడి హల్చల్
పటాన్చెరు : తాగిన మైకంలో ఓ యువకుడు విద్యుత్ సరఫరా లేని టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానిక యువకులు చొరవ తీసుకుని అతణ్ణి కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రెండు గంటల హైడ్రామాకు తెరపడింది. ఈ ఘటన ఆదివారం పటాన్చెరు పట్టణంలో జరిగింది. వివరాలు... తాండూరులోని సాయిపూర్‌కు చెందిన వడ్ల శ్రీనివాస్‌రెడి ్డ గత మూడేళ్లుగా రామచంద్రాపురం బండ్లగూడలో తన సోదరి లక్ష్మి వద్ద ఉంటున్నాడు. తన బావతో గొడవపడి మద్యం తాగిన అతను ఆదివారం మధ్యాహ్నం పటాన్చెరు బస్టాండ్ సమీపంలోని విద్యుత్ సరఫరా లేని టవర్ ఎక్కాడు. దూకి చనిపోతానంటూ బెదిరించాడు. బస్టాండ్ ప్రాంతం కావడంతో ఘటన స్థలం వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. ఫైర్ సిబ్బంది తాళ్లతో పైకి ఎక్కేందుకు యత్నించారు. స్థానిక యువకులు కొందరు చొరవ తీసుకొని అతణ్ణి కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రెండు గంటలపాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది. పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా ఇంట్లో గొడవ పడిన శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరతీశాడని అతని సోదరి లక్ష్మి తెలిపారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. -
మన ఎలక్షన్స్ డాట్‌కామ్’ ప్రారంభం
రాజకీయ నేతలు, ప్రజలకు వారధిగా మన ఎలక్షన్స్ డాట్‌కామ్ వెబ్సైట్ పనిచేస్తుందని వెబ్సైట్ రూపకర్తలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఆర్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెబ్సైట్లో అన్ని పార్టీల, అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు, ఆయా పార్టీ అధినాయకత్వం వివరాలు, వారి జీవిత చరిత్రలు, ఎన్నికల మ్యానిఫెస్టో వివరాలు పొందుపర్చినట్లు వెల్లడించారు. అమెరికాలో ఒబామా గెలుపులో సోషల్ మీడియా విశిష్ట పాత్రను పోషించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 85 కోట్ల ఓటర్లు ఉంటే ఈసారి పది శాతం ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. ఈ పది శాతం మొత్తం యువకులేనని, యువత ఎక్కువగా ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో ఈ వెబ్‌సైట్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రవాసాంధ్రులు వారి నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, ఏ పనికి ఎంత మొత్తంలో నిధులు మంజూరయ్యాయి తదితర వివరాలు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
తెలంగాణపై కేంద్రం డ్రామాలు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌పై ఆప్షన్‌పెట్టి తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం జాప్యం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. హైద రాబాద్‌ను కిరికిరి పెట్టి కాలయాపనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణపై ఒక్కొక్కరు ఒక్కో ప్రకటనచేసి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటనచేసి రెండు నెలలు గడుస్తున్నా నేటివరకు ఇంకా నోట్ తయారుకాలేదని, కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుందన్నారు. సీఎం, బొత్సలు సీమాంధ్రుల ఉద్యమాన్ని ప్రోత్సాహిస్తూ తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌నేతలు సంబరాలు మాని సోనియా, పీఎంలను ఒప్పించేందుకు కృషిచేయాలన్నారు. చంద్రబాబు ఢిల్లీలో తెరచాటున ఉండి తెలంగాణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులతో బీజేపీ పోత్తుపెట్టుకోబోదని స్పష్టంచేశారు. సుష్మస్వరాజ్ ఈ నెల 28న పాలమూరులో జరిగే ప్రజాగర్జనలో తెలంగాణప్రజలకు భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. ఉద్యోగ, కార్మిక, ప్రజా, కులసంఘాల జేఏసీ నాయకులు సభకు లక్షలాదిగా తరలొ చ్చి సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు బాలరాజు, కృష్ణవర్ధన్‌రెడ్డి, మంతటి రాములు తదితరులు పాల్గొన్నారు. -
సుంకేసుల నీటి మళ్లింపునకు కుట్ర
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : సుంకేసుల జలాశయం నుంచి నీటిని మళ్లించుకునేందుకు పాలమూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ ఉద్యోగుల జేఏసీ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జలమండలి కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009 వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న జలాశయానికి ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టిందన్నారు. కరకట్టల ఎత్తు పెంచకపోవడంతో టీఎంసీకి మించి నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామన్నారు. మరోవైపు టీబీ డ్యాంలో పూడిక పేరుకుపోతుండడంతో ఆ మేరకు రాష్ట్రం వాటా తగ్గిపోతోందన్నారు. ఈ క్రమంలో మన ప్రాంత ఆయకట్టుకే సాగునీరు సరిపోక ఇబ్బందులు పడుతుంటే ఆర్డీఎస్ కింద పాలమూరు జిల్లాలోని చివరి ఆయకట్టుకు 0.2 టీఎంసీ నీటిని మళ్లించుకునేందుకు ఆ ప్రాంత నేతలు, రైతులు కుట్ర చేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, హైడ్రొలాజికల్ అనుమతి అనుమతితోపాటు కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారులతో నో అబ్జెక్షన్ పత్రాలు కూడా తీసుకున్నారన్నారు. ఈ మేరకు సీఈ, ఎస్ఈ గత మే 9న మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు లేఖ రాశారన్నారు. ఇదంతా జిల్లాకు చెందిన ఓ మంత్రి సిక్రెట్గా చేయించినట్లు తెలిసిందన్నారు. ఈ స్కీం వచ్చిందంటే కేసీ కెనాల్ ఆయకట్టు ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం తీవ్రతరం.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఆదివారం నుంచి గ్రామస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు ప్రచార కమిటీ కన్వీనర్‌గా వరప్రసాద్‌ను ఎంపిక చేశామని శ్రీనివాసరెడి ్డ తెలిపారు. ఈ కమిటీ వారం పాటు గ్రామాల్లో పర్యటించి రాష్ట్రం విడిపోతే ఏర్పడే సాగు, తాగునీటి సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఈనెల 23వ తేదీన జలమండలి ఎదుట ఇరిగేషన్ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు, 24న బంద్‌లు, రాస్తారోకోలు, 25న ఎండు గడ్డి తింటూ ఆర్ఎస్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన, 26వ తేదీన రాయలసీమ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల కన్వీనర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో సదస్సు ఉంటుందన్నారు. 29న నగరంలో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు బ్లాక్ టీషర్టులతో హాజరవుతామన్నారు.