
మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల: సీఎంకు ధైర్యం ఉంటే ఓయూలో అడుగుపెట్టి, విద్యార్థులతో మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం జిల్లాకేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీజేపీ సమీక్షబైటక్‌లో శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర రైతాంగానికి యూరియా అందించడంలో విఫలం అయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సిద్దిపేటలో రైతు చనిపోయినా చలనం లేదన్నారు. రైతు రుణమాఫీ హామీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లభిస్తోందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగంపేట శ్రీనివాస్, గుడాల రాజేశ్‌గౌడ్, ఆంకారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment