
సినీనటుడు శ్రీనివాస్‌రెడ్డి సందడి
ఆత్మకూరు: కమెడియన్‌గా , హీరోగా రాణిస్తున్న సినీ నటుడు శ్రీనివాసరెడ్డి మండల పరిధిలోని పి, యాలేరులో శుక్రవారం సందడి చేశారు. నాలుగు కథలతో .. నలుగురు కొత్త డైరెక్టర్‌లతో సినిమాలు చేస్తున్నట్లు ఆయన తెలియచేశారు . ఇందులో భాగంగానే ఆత్మకూరు మండలంలో పి, యాలేరులో సినిమా షూటింగ్‌కు వచ్చినట్లు చెప్పారు. ఆయనను చూడగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.