శార్వరీ వాఘ్.. అందం, అభినయం కలబోసుకున్న నటి. సినిమా నేపథ్య కుటుంబం నుంచి రాలేదు. నటన మీదున్న ఆసక్తితో గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. టాలెంట్‌తో నిలదొక్కుకుంటోంది.
శార్వరీ పుట్టిపెరిగింది ముంబైలో. తండ్రి శైలేశ్ వాఘ్.. బిల్డర్. తల్లి నమ్రతా వాఘ్.. ఆర్కిటెక్ట్. దివంగత నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషీ.. శార్వరీకి స్వయాన తాత (నమ్రతా వాఘ్ తండ్రి).
శార్వరీ.. బీఎస్సీ గ్రాడ్యుయేట్. యాక్ట్రెస్ కావాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. అందుకే పదహారవ ఏట నుంచే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఇంట్లోవాళ్లూ అభ్యంతరపెట్టలేదు.
2013లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్’ పోటీలో పాల్గొంది. గెలిచింది కూడా! ఆ విజయమే శార్వరీని గ్లామర్ ఫీల్డ్‌కి పరిచయం చేసింది. టీవీ కమర్షియల్స్‌లో నటించే చాన్స్‌లను తెచ్చిపెట్టింది.
నటనను మరింత సీరియస్‌గా తీసుకుని జెఫ్ గోల్డ్ బర్గ్స్ స్టూడియోలో చేరింది నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి. అంతేకాదు మరిన్ని మెలకువల కోసం థియేటర్‌లోనూ జాయిన్ అయింది. ఎక్కడ థియేటర్ వర్క్‌షాప్ జరిగినా హాజరయ్యేది.
థియేటర్ వర్క్‌షాప్ ద్వారానే శార్వరీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ లవ్ రంజన్‌కి తెలిసింది. ఆమె స్కిల్స్‌కి అబ్బురడి తన ‘ప్యార్‌కా పంచ్ నామా 2’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశాన్నిచ్చాడు. శార్వరీ తొలి ప్రాధాన్యం నటనకే అయినా ఆఫ్ స్క్రీన్ వర్క్ కూడా నేర్చుకోవాలనే తపనతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే కాంప్లిమెంట్‌ని తీసుకుంది. ఆ విషయం సంజయ్ లీలా భన్సాలీకి చేరి అతనూ ఆమెకు ఆఫర్ పంపాడు తను తీయబోతున్న సినిమా (బాజీరావ్ మస్తానీ)కు అసిస్టెంట్ డెరెక్టర్‌గా చేరమని. దాన్నీ పని నేర్చుకోవడానికి మరో అవకాశంగానే భావించి భన్సాలీ దగ్గరా అసిస్టెంట్‌గా చేరింది. అలా మొత్తం మూడు (మూడోది.. సోనూ కే టీటూ కీ స్వీటీ) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.
శార్వరీ 2020లో తెరంగేట్రం చేసింది.. ‘ద ఫర్‌గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే’ అనే వెబ్‌సిరీస్‌తో. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అదే ఏడు సిల్వర్ స్క్రీన్ మీదా వెలిగింది.. ‘బంటీ ఔర్ బబ్లూ 2’తో!
తాజాగా ‘మహారాజా’ సినిమాతో మళ్లీ టాక్ ఆఫ్ ద బాలీవుడ్, ఫేవరెట్ ఆఫ్ ది ఆడియెన్స్‌గా మారింది శార్వరీ! మహారాజ్ లైబెల్ కేస్ ఆధారంగా తెరకెక్కిన ఈ నెట్‌ఫ్లిక్స్ సినిమాలో జైదీప్, జునైద్ ఖాన్‌లతోపాటు ఆమె నటనా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, నా రోల్.. వీటి గురించే ఆలోచిస్తాను తప్ప అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను. అసలు అవి మ్యాటరే కాదు! – శార్వరీ వాఘ్
Comments
Please login to add a commentAdd a comment