ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఎవరంటే? | Tollywood Young Tiger Jr NTR Gets Name In Asian Weekly Magazine Top 50 | Sakshi
Sakshi News home page

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత.. మొదటిస్థానంలో ఆ హీరో!

Published Fri, Dec 22 2023 7:08 PM | Last Updated on Fri, Dec 22 2023 7:24 PM

Tollywood Young Tiger Jr NTR Gets Name In Asian Weekly Magazine Top 50 - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

(ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు..!)

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్‌ వీక్లీ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్‌ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్‌ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం.

అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్‌ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్‌ కపూర్‌ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement