2023
-
ఒక్క ఏడాదిలో 30 లక్షల మందికి కుక్కకాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. -
రూ.10 లక్షల కోట్లు! స్వదేశానికి మనోళ్లు పంపించిన నిధులివి..
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్‌లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చిచూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్ డాలర్ల రెమెటెన్స్‌లు వెళ్లాయి.భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి. సీమాంతర చెల్లింపులకు దీర్హామ్–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్‌లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్‌కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు రావచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.భారత్ తన యూపీఐని యూఏఈ, సింగపూర్‌తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్‌లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్‌లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్ డైరెక్టర్ ఇఫత్ షరీఫ్ పేర్కొన్నారు. -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్‌ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ
2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం. ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది. 2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం. ఇందులో అర్బన్, రూరల్ బ్యాంకులు రెండూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులు కాలంలో కలిసిపోతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో ఆర్బీఐ.. బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం ఉత్తమం! ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే, అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే.. ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది. -
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్ పీఎస్ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే. స్టేషన్లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్ పరిధిలో నమోదైన క్రైం రేట్.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలియజేశారు. -
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్‌షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
అది మరచిపోలేని జ్ఞాపకం.. తెలుగు యంగ్ హీరోయిన్ కామెంట్స్
‘‘నేను ఎప్పట్నుంచో స్కై డైవింగ్ చేయాలనుకుంటున్నాను. అది 2023లో నెరవేరింది. దుబాయ్‌లో అక్క(శివాని, నేను రెండు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశాం. 2023 అనే కాదు.. నా జీవి తంలోనే నేను మరచిపోలేని జ్ఞాపకంగా ఈ స్కై డైవింగ్ అడ్వెంచరస్‌ను గుర్తు పెట్టుకుంటాను’’ అని హీరోయిన్ శివాత్మిక అన్నారు. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతున్న శివాత్మిక రాజశేఖర్ పంచుకున్న విశేషాలు... ► మీ జీవితంలో 2023 ఎలా గడిచింది? చెప్పాలంటే... 2023 నాకు గొప్పగా గడిచింది. చాలా విధాలుగా కలిసొచ్చింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యాననే భావన కలిగింది. ఎప్పట్నుంచో నేను చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరచుకోవడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నాను. కుటుంబం పరంగా కూడా బాగా గడిచింది. దేవుడి దయవల్ల, అదృష్టంగా 2023 నా జీవితంలో సంతోషంగా ముగిసింది. ► ఈ ఏడాది మీ జీవితంలో జరిగిన చెడు ఘటనలు ఏవైనా ఉన్నాయా? మంచి జరిగినట్లే... ప్రతి ఏడాది చెడు కూడా ఉంటుంది. అయితే కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టబోయే ఈ తరుణంలో వాటిని నేను గుర్తుతెచ్చుకోవాలనుకోవడం లేదు. ► కొత్త ఏడాది కోసం మీరు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటి? నా మనసును ఎక్కువగా ఫాలో అవుతూ వర్క్స్ చేస్తాను. ప్రతి అంశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తాను. ఇలా గత ఏడాదిలో ప్రయత్నించి సంతోషంగా జీవనం సాగించాను. ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ► 2024 మీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఫ్లోను బట్టి ముందుకెళ్తాను. అయితే అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నాను. ► కొత్త ఏడాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? కొత్త ఏడాది ఎప్పటిలానే అమ్మానాన్న(జీవిత, రాజశేఖర్), అక్క శివానీలతో హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను కలుస్తాను. -
2023 సుభిక్షం.. సంతోషం
మరపురాని సంవత్సరమిది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా మరో మెట్టు పైకి ఎక్కిన ఏడాదిది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. తదితర రంగాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన విత్తనం మొలిచి.. మొక్కై ఎదిగి.. వృక్షంగా మారి ఫలాలిచ్చింది. సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు తమ సొంత కాళ్లపై నిలిచి కుటుంబాలను ముందుకు నడుపుతుండటం ఊరూరా.. ఇంటింటా కనిపిస్తోంది. ప్రతి పల్లెలోనూ ప్రగతి వికసిస్తోంది. కొత్త పరిశ్రమలు, పచ్చటి పంటలతో శివారు ప్రాంతాలు కళకళలాడటం సాక్షాత్కరిస్తోంది. నాడు–నేడుతో రూపు మార్చుకున్న పాఠశాలలు, నిమిషాల వ్యవధిలో వైద్యం అందించే విలేజ్ క్లినిక్‌లు, రైతన్నను చేయి పట్టుకుని వడివడిగా నడిపిస్తున్న ఆర్బీకేలు.. ప్రజల జీవన స్థితిగతుల్లో కీలక మార్పులు తేవడం గ్రామ గ్రామాన ఆవిష్కృతమైంది. పిల్లలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కావడం సంతోషాన్నిస్తోంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన అక్కచెల్లెమ్మల్లో 22 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోవడంలో నిమగ్నమవడం కళ్లకు కడుతోంది. ఇందులో లక్షలాది మంది గృహ ప్రవేశాలతో సందడి చేయడం ఊరూరా కనిపించింది. పేద ప్రజలు అనారోగ్యం బారినపడితే నేనున్నానంటూ రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించడానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం ప్రధానంగా అమితానందాన్నిస్తోంది. ‘హౌస్’ఫుల్ హ్యాపీ ► రాష్ట్రంలోని లక్షలాది మంది పేదింటి అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది సొంతింటి కల నెరవేరింది. ► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.75 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు విలువ చేసే భూముల్లో పక్కా లే అవుట్లు సిద్ధం చేసి 30.7 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మల పేరిట నివేశన స్థలాలను పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ► ఆ లే అవుట్లలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరుచేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. ► ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,85,829 సాధారణ ఇళ్లు, 1,57,566 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. అక్టోబర్ 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా పేదింటి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ► కేవలం 2023 సంవత్సరంలోనే 4.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ► నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ చకచకా విద్యుత్, కుళాయి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇస్తోంది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీ ‘రక్ష’ 2023లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో పలు విప్లవాత్మక కీలక పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచి.. ఆ మేరకు డిసెంబర్ 18వ తేదీనుంచి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ ► గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. మంచానికి పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు ► రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) అమలు ► కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు పెద్ద ఊరటను కల్పిస్తూ..రూ.85 కోట్లతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన ఆస్పత్రి నిర్మాణం. డిసెంబర్ 14న రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ప్రారంభం. ► ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఆ శాఖలోని నియామకాల కోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు ► 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య శాఖలో 53 వేలకుపైగా పోస్టులు భర్తీ.. ప్రభుత్వ వైద్యశాఖలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభం. నవరత్నాలతో నవోదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి డైరెక్టు బెటిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) అందించిన సంక్షేమ సాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ తమకు అందిçస్తున్న సంక్షేమ పథకాలు వల్లే తాము ఆనందంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న నవరత్నాలు ద్వారా నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ.2,47,564.36కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.1,67,530.95కోట్లు అందించారు. మొత్తంగా రూ.4,15,095.31కోట్లు లబ్ధిని చేకూర్చడం ఒక రికార్డు. సం‘క్షేమం’గా అన్నదాత ► 2023–24 సీజన్లో 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ ఏడాది సాయంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.13 కోట్ల పెట్టుబడి సాయం చేశారు. ► గతేడాది రబీ సీజన్లో విరుచుకుపడ్డ మాండూస్ తుపాన్‌తో పాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 1.54 లక్షల మందికి ఈ ఏడాది రూ.142 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మందికి రూ.1976.45 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించినట్టయింది. ► ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మంది రైతులకు రూ.1117.21 కోట్ల పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7802.05 కోట్ల మేర బీమా పరిహారం అందజేశారు. ► ఆర్బీకేలకు అనుసంధానంగా నూరు శాతం వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో ఈ ఏడాది కొత్తగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి కోసం ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాలకు రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేశారు. ► 28,112 మంది రైతుల నుంచి 337 టన్నుల శనగలు, 9027 మంది రైతుల నుంచి 71,445 టన్నుల మొక్కజొన్న, 312 మంది రైతుల నుంచి 413 టన్నుల పసుపు కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ► ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 80.76 లక్షల మందికి రూ.1.70 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు. 8.28 లక్షల మంది కౌలుదారుల్లో 5.32 లక్షల మందికి రూ.1592.79 కోట్ల రుణాలు మంజూరు చేశారు. నాలుగున్నరేళ్లలో రూ.1.75 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరింది. సస్యశ్యామలం... ► హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూల్, నంద్యాల జిల్లాల్లోని పశి్చమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. ► గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. ► వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ.ల పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లలో ఇప్పటికే 7.506 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ► 2013–14 ధరలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని.. తాజా ధరల మేరకు నిధులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ► తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. – సాక్షి, అమరావతి కరువు తీరేలా కరెంట్ ► నాణ్యమైన, నిరంతర విద్యుత్ పంపిణీకి ప్రభుత్వం విశేష కృషి. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి 14 రకాల విద్యుత్ సేవలు. అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీల రూపంలో రూ.304.2 కోట్ల ఆదాయం. స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ. ► ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులు. విద్యుత్ ఉత్పత్తిలో దేశీయ యావరేజి కన్నా రాష్ట్రం ఎక్కువ నమోదు. గతేడాదితో పోల్చుకుంటే విద్యుత్‌శాఖకు తక్కువ నష్టాలు. ► డి్రస్టిబ్యూషన్ సెక్టార్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 12 సబ్స్టేషన్లు పూర్తి. కృష్ణ పట్నం యూనిట్లో 800 మెగావాట్లు, డాక్టర్ ఎనీ్టటీపీఎస్ యూనిట్లో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం. దీంతో అందుబాటులోకి 40 మిలియన్ యూనిట్లు. ► నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్లతో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు. వీటి ద్వారా 5300 మందికి ఉద్యోగాలు. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లతో మరో రెండు వేలమందికి ఉద్యోగాలు. ► మార్చిలో వైజాగ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్(జీఐఎస్)లో ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 ఎంఓయూలు. వీటి విలువ రూ.9.57 లక్షల కోట్లు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలకు అవకాశం. కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు. ► రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు. రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి దివంగత కారి్మక నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేరు. తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో వైఎస్సార్సీపీకి ఈఏడాది ప్రజల్లో భారీగా మద్దతు పెరుగుతోంది. దీంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ► రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ గెలిచి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ► శాసనమండలిలో ఖాళీ అయిన 21 స్థానాలకు (ఎమ్మెల్యే కోటా 7, స్థానిక సంస్థల కోటా 9, పట్టభద్రులు 3, ఉపాధ్యాయులు 2) మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 17 స్థానాలను చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది. మండలిలో వైఎస్సార్సీపీ బలం 46కు పెరిగింది. ► ప్రతిపక్షాల దు్రష్ఫచారాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఏప్రిల్ 7 నుంచి 29 వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చేసిన మేలును వివరించడానికి అక్టోబర్ 25న వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్ర జన నీరాజనాల మధ్య కొనసాగుతోంది. ► మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడం కోసం నవంబర్ 9 నుంచి చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ప్రతి ఇంటా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రభుత్వ చదువులకు అందలం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇచి్చన ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.దాదాపు 43 లక్షల మంది చదువుకుంటున్న 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు మనబడి నాడు–నేడు పథకం కింద ప్రభుత్వం సమూల మార్పులు తెచి్చంది. ► 2022–23 విద్యా సంవత్సరంలో ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన చేపట్టడంతో పాటు, చదువులో రాణించిన ఉత్తమ విద్యార్థులను సత్కరించి ఏపీ ఆదర్శంగా నిలిచింది. ► ఇంటర్, టెన్త్ల్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించి వారికి ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్ బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేసింది. ► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10 మంది విద్యార్థులను అమెరికా పర్యటనకు పంపించారు. వారు ఐక్యరాజ్యసమితి ఎస్డీజీ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు, కొలంబియా యూనివర్సిటీలను సందర్శించి వచ్చారు. ► ఈ ఏడాది 1,000 ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు అనుమతి లభించింది. బాలికల చదువు కోసం ప్రభుత్వం ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీని అందుబాటులోకి తెచ్చింది. ► 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టోఫెల్ ప్రైమరరీ, టోఫెల్ జూనియర్ సరి్టఫికేషన్ కోర్సులను ప్రారంభించింది. ► దీక్ష, ఏపీఈ–పాఠశాల డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ఆన్లైన్ పాఠాలు సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పునర్నిర్మించి...పూర్వ వైభవం తెచ్చి..! 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని నాటి టీడీపీ ప్రభుత్వం కూలి్చవేసిన ఆలయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునఃనిర్మించింది. ఈ ఆలయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునర్నిర్మించి, 2023 డిసెంబరు 7న ప్రారంభించింది. పునఃనిర్మించిన ఆలయాల్లో 1) దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం 2) సీతమ్మవారి పాదాలు 3) శ్రీసీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం 4) వీరబాబు ఆలయం 5) విజయవాడ గో సంరక్షణ సంఘం 6) బొడ్డు బొమ్మ 7) ఆంజనేయస్వామి, వినాయకస్వామి వార్ల ఆలయాల తొలిమొట్టు 8)శ్రీ శనైశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. వీటికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2021 జనవరి 8న శంకుస్థాపన చేసి మూడేళ్ల లోపే రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేసింది. పారిశ్రామిక నామ సంవత్సరం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సువర్ణ అక్షరాలతో నిలిపి భవిష్యత్ తరాలకు కొండంత అండను అందించింది.. 2023వ సంవత్సరం. వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక దిగ్గజాలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ► మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి, మషాహిరో యమాగుచి, ‘టెస్లా’ మార్టిన్ ఎబర్‌హార్డ్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. ► ఈ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. తద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభించనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టులు నిర్మాణ పనులు ప్రారంభించాయి. ► ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బీఈఎల్, రాడ్స్టాండ్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ► బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, టీసీఎల్, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ∙బద్వేల్లో ‘సెంచురీ ప్యానల్స్’ ఉత్పత్తిని ప్రారంభించింది. తద్వారా స్థానికంగా 2,500 మందికి ఉపాధి, 20,000 మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తోంది. ► శ్రీసిటీలో కొత్తగా ఆరు కంపెనీలు నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. 18 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. పలు ప్రముఖ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. -
కొత్త ఏడాదీ కోతలేనా?
ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన.. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు మరోవైపు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏఐ వైపు మొగ్గు.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కొత్త సంవత్సరంలోనూ ఐటీ రంగానికి గడ్డు పరిస్థితేనా? ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2023లో దాదాపు 2.40 లక్షల మంది లే ఆఫ్‌ల పేరుతో, తొలగింపు పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక వచ్చే సంవత్సరంలోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదని, ఆర్థిక మాంద్యం ప్రభా వం ఈ రంగంపై ఎక్కువగా కనిపిస్తుందని, కోతలు తప్ప వని అంటున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం ఎక్కువ ఉద్యోగా లను కల్పిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాల తొలగింపునకు కారణం అవుతుందా అన్నది కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. తాజాగా మ్యూజిక్ స్పాటిఫై ఏకంగా 1,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఏఐని ఉపయోగించనుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయా లను సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఉద్యో గాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్ప నకు మొగ్గు చూపకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు కన్పించడం లేదు. గతంలో ప్రతి యేటా 40 నుంచి 80 శాతం వరకు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి సంస్థలు ముందుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. వివిధ కంపెనీల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ, 4.1 బిలియన్ డాలర్ల విలువగల డేటామిర్ సంస్థ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తన సంస్థలోని 20 శాతం ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. సంఖ్యాపరంగా పెద్దగా కనిపించక పోయినా పలు స్టార్టప్ కంపెనీలు క్యాష్‌ఫ్లో ఇబ్బందులను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో.. మానవ వనరుల తగ్గింపునకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. క్లార్నా సీఈవో సెబాస్టియన్ సిమి యాకోవిస్కీ.. ‘డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించుకునే కంటే ఒక ఏఐతో పని కానియ్యొచ్చు’ అన్నారంటే దాని ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లార్నా సంస్థ ‘పర్సనల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్’ కార్యకలాపాలను అందిస్తోంది. తాజాగా వచ్చిన ‘రాన్‌స్టడ్ రైజ్స్మార్ట్ గ్లోబల్ సెవరెన్స్’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో 96 శాతం సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తగ్గించే కార్యక్రమాలు చేట్టాయి. ఏఐతో నిర్వహణప్రమాణాలు పెరిగా యని, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతున్నదని నివేదిక వెల్లడించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారి ఉద్యోగాలకు ఢోకా ఉండదని తేల్చి చెప్పింది. 2023లో ఉద్యోగాలకు కోత పడగా, అదే సమయంలో ఏఐపై పెట్టుబడులు పెరిగాయని తెలిపింది. ‘ఐటీ కంపెనీలు ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై, రుణాలపై ఆధారపడి ఉంటాయి. తెచ్చుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే భారం పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ స్టాక్ పడిపోయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. తద్వారా లే ఆఫ్‌లు అనివార్యం అవుతున్నాయి..’ అని రోమి గ్రూప్ ఎల్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ నిక్ గౌస్లింగ్ చెబుతున్నారు. భారతీయ కంపెనీలకు పురోగమనావకాశాలు ప్రస్తుతం ఐటీ రంగంలో ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వారు పెట్టుబడులు పెట్టే ముందు ప్రధానంగా టెక్నాలజీ కొనడమో, అప్‌గ్రేడ్ చేయడమో చేస్తుంటారు. యూఎస్, ఐరోపాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్‌ను పరిశీలిస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సుయిజ్ బ్యాంక్ వంటివి క్షీణతకు గురయ్యాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేసింది. ఐతే పెట్టుబడు లకు తగ్గట్టుగా ఈ కంపెనీల నుంచి రిటర్న్‌లు రాకపోవడంతో సంస్థ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సెకండ్, థర్డ్ స్టేజ్ పెట్టుబడులు ఆగిపోయి స్టార్టప్‌లపై తీవ్ర ప్రభావం పడింది. తదుపరి కార్యాచరణలు, ముందుకెళ్లడాలు నిలిచిపోయాయి. ఫండింగ్ నెమ్మదించి ఆయా స్టార్టప్‌లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఔట్‌సోర్సింగ్‌లో సపోర్టింగ్ ఉన్న యూఎస్‌లోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలపై కూడా ప్రభావం పడింది. ఇక ఏఐ, చాట్ జీపీటీ వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ కంపెనీలు రాబోయే మూడు, నాలుగు నెలల్లో పరిస్థితులు మారి పురోగమనం వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) ద్వారా టార్గెటెడ్ టెక్నాలజీ వైపు మొగ్గు పెరుగుతోంది. వీటి విషయానికొస్తే మన దేశంలోని నగరాలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈ సెంటర్లకు హబ్‌గా మారనుంది. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కోఫోర్జ్ ఏడాది చివర్లో స్లో డౌన్ సహజం ఏడాది చివర్లో ఐటీ రంగం కొంత స్లోడౌన్ కావడం సహజమే. వచ్చే ఏడాది కూడా ఐటీ పరిశ్రమ ఔట్ సోర్సింగ్‌పైనే అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం అనే కంటే.. మారుతున్న అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమనేదే సమస్య. జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ల ద్వారా వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలను మార్చు కునేలా చేయగలగడం ఐటీ సంస్థలకు పెద్దసవాల్. వీటి ద్వారా సంస్థలకు ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్‌పై, ఏఐ వంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌పై, ఐటీ సర్వీసెస్‌పై పెట్టుబడులు పెరుగుతాయి. 2024లో ఐటీ మార్కెట్ వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం, భారత్‌లో 10 శాతం ఉంటుందని ప్రతిష్టాత్మక గార్ట్నర్ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్‌బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్‌వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్‌షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
Celebrities Christmas Celebrations Photos: క్రిస్మస్ రోజు రెడ్ అండ్ హాట్‌గా మెరిసిన తారలు..
-
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!
Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం.. హోండా యాక్టివా జి6 (Honda Activa G6) దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది. టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డియో (Honda Dio) అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest) మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఈ ఏటి మేటి మహిళలు వీరే!
కొద్దిరోజుల్లో 2023 ముగియబోతోంది. డిసెంబరులో సగభాగం ఇప్పటికే గడిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చర్చలలోకి వచ్చిన మహిళలు కొందరు ఉన్నారు. అత్యధిక సంపాదనతో.. టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్‌గా మారారు. టేలర్ స్విఫ్ట్ పేరొందిన సింగర్. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం.. కమలా హారిస్ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021, జనవరి 20న కమలా హారిస్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా.. క్రిస్టీన్ లగార్డ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు. అత్యంత శక్తివంతమైన మహిళగా.. ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
10 అనూహ్య ఘటనలు.. ‘రివైండ్- 2023’
2023 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి, చైనాను వెనక్కి నెట్టివేసింది. అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2023లో ప్రపంచంలో చోటుచేసుకున్న పది అనూహ్య ఘటనలివే.. టర్కీ-సిరియా భూకంపం: ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. 7.8 తీవ్రతతో సంభవించిన సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 వేల మందికి పైగా జనం మరణించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ : 2023లో చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. భారతదేశ జనాభా అంచనా 1.43 బిలియన్లు (ఒక బిలియన్ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెడ్డీ తుపాను: చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుపాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 వందలమందికిపైగా ప్రజలను బలిగొంది. జీ 20కి ఆతిథ్యం: సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 43 మంది వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. కాప్-28 సమ్మిట్: వాతావరణ మార్పులపై కాప్-28 సమ్మిట్ దుబాయ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా ఈ సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అమెరికాలో ఎగిరిన చైనా బెలూన్లు: జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు, చైనా బెలూన్లు అమెరికా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ఈ బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను పంపి బెలూన్లను ధ్వంసం చేసింది. ఈ ఘటన చైనా-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్‌గా మారిన ట్విట్టర్: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఆయన ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో నాలుగు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 9 వేల మందికి పైగా జనం గాయపడ్డారు. 13 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం -
2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన సంవత్సరం
2023.. భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన సంవత్సరంగా చిరకాలం గుర్తుండిపోనుంది. భారీ అంచనాల నడుమ స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడి అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి అభిమానులకు తీవ్ర గుండెకోతను మిగిల్చింది. లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల నడుమ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది. ఈసారి కప్ మనదే అని ధీమాగా ఉండిన భారతీయులు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. టోర్నీ గడిచి దాదాపు నెల రోజులు అవుతున్నా అభిమానులు, ఆటగాళ్లు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ చేదు అనుభూతి మినహాయిస్తే భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 2023కు ఘన స్వాగతం పలికింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆతర్వాత న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ (3-0), వన్డే సిరీస్‌లు (2-1) నెగ్గి, కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో (టెస్ట్‌లు) నెగ్గిన భారత్.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయి 2023లో తొలి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఏప్రిల్, మే మసాల్లో టీమిండియా ఆటగాళ్లు సహా ప్రపంచ క్రికెట్ మొత్తం ఐపీఎల్‌తో బిజీగా ఉండింది. జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షమైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. దీని తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత స్వదేశంలో ఆసీస్‌తో 3 వన్డేలు ఆడిన భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం అదే ఆసీస్‌తో స్వదేశంలోనే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన భారత్ 4-1 తేడాతో జగజ్జేతను ఓడించింది. దీని తర్వాత భారత్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. వన్డే, టెస్ట్ సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఏడాదంతా భారత క్రికెట్ జట్టుకు సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పాలి. -
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్‌లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్‌జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ వైపు యూఎస్ సెనేట్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్‌మాన్‌ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!
మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్ యూనివర్స్' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m — Miss Universe (@MissUniverse) November 19, 2023 -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
-
APL 2023: బెజవాడ టైగర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం(ఫొటోలు)
-
2023 భారతదేశంలో టాప్ 10 బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్
-
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది. ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం. -
పాక్ ప్రధానికి వినబడేలా.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు.. యావత్ ప్రపంచ శాంతికి ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించడానికి కూటమి వెనుకాడకూడదు.. అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సందేశం ఇచ్చారు. మంగళవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో(వర్చువల్)కి భారత్ అధ్యక్షత వహించింది. మన దేశం తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కజకస్థాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్(కొత్త సభ్యదేశంగా చేరింది) ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఎస్సీవో సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. నిర్ణయాత్మకమైన చర్యల ద్వారా ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని పిలుపు ఇచ్చారాయన. పరస్సర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని సభ్య దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారాయన. ఉగ్రవాదంపై సమిష్టింగా మనమంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రం సరికాదంటూ దాయాది దేశం పాక్‌కు చురకలంటించారాయన. ఇక ఇదే వేదిక నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలు.. సమస్యలపైనా ప్రధాని మోదీ చర్చించారు. 1996లో చైనా, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ల పంచ దేశాల కూటమితో షాంగై ఫైవ్ ఆవిర్భవించింది. దానికి కొససాగింపుగా ఏర్పడిందే SCO. ప్రస్తుతం ఇందులో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి. 2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పరిశీలన దేశంగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే.. 2017లో ఆస్తానాలో జరిగిన సదస్సు ద్వారా పూర్తి సభ్యత్వ దేశంగా భారత్ మారింది. ఇదీ చదవండి: ఒకే ఫొటో.. అంత మందికి ఎలాగబ్బా? -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్‌యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్‌ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్‌సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్‌మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్‌అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
2023లో టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఫాల్లోవర్స్
-
మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు. అప్పుడెప్పుడో 1996లో.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా. ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్‌లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
చెన్నైVS గుజరాత్
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!
బాలావుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే బుట్టబొమ్మ పూజా హేగ్డేతో కలిసి కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ అంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్ హీరోకు ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఊహించని ప్రశ్నతో సర్ప్రైజ్ ఇచ్చింది. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ సల్మాన్‌ఖాన్‌కు ప్రపోజ్ చేసింది ఓ అభిమాని. 'సల్మాన్ ఖాన్ నిన్ను ఇష్టపడుతున్నా. ఈ విషయం చెప్పేందుకే హాలీవుడ్ నుంచి ఇక్కడి దాకా వచ్చా. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డా' అంటూ తన ప్రేమను వెల్లడించింది. దీనికి సల్మాన్ ఖాన్ చమత్కారంగా సమాధానమిచ్చారు. మీరు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా? అంటూ జోక్ చేశారు. (ఇది చదవండి: సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?) లేదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటారా? అని మరోసారి అడగ్గా.. మీరు 20 ఏళ్ల నన్ను కలిసి ఉండాల్సిందని సరదాగా బదులిచ్చారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌కు గతంలో పలు బ్రేకప్ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్‌పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్‌లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం.. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు జూన్ 4: ఆదివారం జూన్ 10: రెండో శనివారం జూన్ 11: ఆదివారం జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు జూన్ 18: ఆదివారం జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్‌లో సెలవు జూన్ 24: చివరి, నాలుగో శనివారం జూన్ 25: ఆదివారం జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు. ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్ -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
ఐపీల్ లో ప్లే ఆఫ్ కు చేరుకునేది ఎవరు?
-
ఇండియా - పాక్ మెగా ఫైట్‌కి స్పాట్ ఫిక్స్
-
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
-
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
ఆ తిట్లతో రాస్తే పుస్తకాలు నిండుతాయి
-
టీమిండియాలోకి యశస్వి జైస్వాల్ ఎంట్రీ..?
-
మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్!
2023 మే నెల బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. శని, ఆదివారాలతో సహా పండుగలు, ఇతర సందర్భాల కారణంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ బ్యాంకు సెలవుల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. సెలవుల జాబితా ఇలా.. మే 1న మహారాష్ట్ర డే/ మేడే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులకు సెలవు. మే 5న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా , శ్రీనగర్‌లో బ్యాంకుల బంద్. మే 7న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు. మే 13న రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు. మే 14న ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు. మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్టంలో బ్యాంకుల మూత. మే 21న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు మే 22న మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో సిమ్లాలో బ్యాంకుల బంద్. మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు. మే 27న నాల్గవ శనివారం సాధారణ సెలవు. మే 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు రోజు సెలవు రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు సెలవు దినాల్లో, బ్యాంకులు మూతపడినప్పుడు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. డబ్బును బదిలీ చేయడానికి UPIని కూడా ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు. ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్.. -
5 ఏళ్ళ తరువాత భారత పర్యటనకు ఆఫ్గనిస్తాన్...!
-
డేవిడ్ వార్నర్ నువ్వు ఐపీఎల్ కి వేస్ట్
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
బెట్టింగ్ బాబులు.. జాగ్రత్త..!
ఐపీఎల్ 16వ ఎడిషన్ రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతుండడంతో కొందరు బెట్టింగ్‌కు తెర లేపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్లపై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్‌కు బెట్టింగ్ జరుగుతోంది. ఆన్లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ భూతం మరింతగా విజృంభిస్తోంది. వందల నుంచి ప్రారంభమై రూ.వేలు, లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ పెడుతూ నిండా మునుగుతున్నారు. పలమనేరు: ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి లక్షాధికారులు కావాలనే ఆశతో కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో యువకులు, విద్యార్థులు బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. తీరా నష్టపోయి అప్పులపాలై బికారీలుగా మారుతున్నారు. బెట్టింగుల కారణంగా యువత జీవితా లు నాశనమై ఆ కుటుంబాల్లో పెద్దలకు మనోవ్యధను కలిగిస్తోంది. చాలామంది యువకులు బైక్‌లను, ఒంటిపై ఉన్న చైన్లు, ఉంగరాలను అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలామందికి బెట్టింగులు వ్యసనంలా మారుతోంది. ప్రస్తుతం బెట్టింగులు మూడు రకాలుగా ఉన్నాయి. 1. కొంతమంది కలసి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు. 2. ఇంకొందరు రహస్యప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ బెట్టింగ్‌లు చేస్తున్నారు. 3. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను వాడుతున్నారు. ప్రస్తుతం ఎలెవన్ బెట్, డ్రీమ్–11, ట్వంటీఫోర్క్లబ్, బీక్రిక్, మోస్ట్‌బెట్, ఐవిన్, మెల్‌బెట్, బెట్ 365, పారీమ్యాచ్, ఫెయిర్‌ప్లే లాంటి యాప్‌లను ఎక్కువ మంది బెట్టింగుల కోసం వాడుతున్నారు. పడమటి మండలాలను ఆనుకుని ఉన్న కర్ణాటక పరిధిలోని ముళబాగిలు, శ్రీనివాసపురం, కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన క్రికెట్ బుకీలకు చెందిన ముఠాలు జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచినా కీలక వ్యక్తుల జాడ తెలియడం లేదని తెలుస్తోంది. టాస్ నుంచే.. ఐపీఎల్ మే 18 తేదీ వరకు జరుగుతుంది. రోజూ మధ్యాహ్నం మొదటి మ్యాచ్ 3.30, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్‌కు ముందుగానే టాస్ వేస్తారు. టాస్ ఎవరుగెలుస్తార నే దాంతో బెట్టింగులు మొదలవుతున్నాయి. ఆపై బాల్బై బాల్, ఓవర్ టు ఓవర్, ఎక్కువ వికె ట్లు, ఎక్కువ పరుగులు, సిక్స్‌లు, ఫోర్లతో పాటు మ్యా చ్ గెలుపు వరకు పందేలు సాగుతున్నాయి. మ్యాచ్ కు ముందుగా అయితే 1కి 2, ఓడిపోతే టీమ్‌పై 1కి 5 రెట్లు ఎక్కువగా బెట్టింగులు ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండాలి పట్టణంలోని ఆవాస ప్రాంతాల్లో యువకు లు సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడుతున్నారు. ము ఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం బెట్టింగ్‌లకు అలవాటుపడ్డారు. మద్యం సేవించడం, గంజాలాగడాలు అన్నీ బెట్టింగులు జరిగే చోట సాధారణంగా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. – పుష్పరాజ్, ఎస్సీ టీచర్స్ సంఘ నాయకులు, పలమనేరు ప్రత్యేక నిఘా ఉంచాం ఐపీఎల్ మొదలైయ్యాక సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులు రహస్యంగా సాగుతున్న విషయం తమ దృష్టిలో ఉంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. కేవలం స్మార్ట్ఫోన్లలో సాగే బెట్టింగ్ వ్యవహారాలను కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకొని ముఠాలను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. – సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, పలమనేరు ● బైరెడ్డిపల్లె మండలానికి చెందిన యువకుడు క్రికెట్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరుకు చెందిన ఓ యువకుడు బెట్టింగుల కారణంగా వ్యాపారాన్ని వదులుకుని బెంగళూరుకు వెళ్లాడు. ● పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌ల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● మదనపల్లెకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి పలమనేరులోఉంటూ ఆన్లైన్ బెట్టింగుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరు మండలం సముద్రపల్లెకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగుల కారణంగా బైక్‌ను తనఖా పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో పదుల సంఖ్యలో జరిగాయి. కానీ వెలగుచూడని విషయాలు వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. -
నిరుద్యోగులను ఆదుకునేవి ఇవే.. నియామకాల సన్నాహాల్లో స్టార్టప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ దశ స్టార్టప్స్‌లో అత్యధికం ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్లు, పెట్టుబడిదారుల నుండి సేకరించిన అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలు ఇందుకు కారణమని ఫిక్కీ–రాండ్‌స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వే పేర్కొంది. నియామకాల తీరుపై చేపట్టిన ఈ సర్వేలో 300లకుపైగా స్టార్టప్స్ పాలుపంచుకున్నాయి. ‘2023లో కొత్త నియామకాలకు 80.5 శాతం కంపెనీలు సమ్మతి తెలిపాయి. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) ఈ కంపెనీలు సిరీస్–ఏ, సిరీస్–బి నిధులను అందుకున్నాయి. కావాల్సిన మూలధనాన్ని కలిగి ఉన్నాయి. కొత్త ప్రతిభను పొందేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొనసాగిస్తామని 15.78 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొత్త వారిని చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన కంపెనీల్లో ఆరోగ్య సేవలు 13 శాతం, ఐటీ, ఐటీఈఎస్ 10, వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత 8, ఏఐ, ఎంఎల్, డీప్‌టెక్ 7, ఫిన్‌టెక్ 7, తయారీ సంస్థలు 7 శాతం ఉన్నాయి’ అని నివేదిక తెలిపింది. అట్రిషన్‌కు ఇవీ కారణాలు.. స్టార్టప్స్‌లో క్రియాశీలక పని వాతావరణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన శిక్షణా వేదికను అందిస్తోంది. వారు తమ సొంత స్టార్టప్స్‌ను రూపొందించడానికి అడుగు వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పరిశ్రమలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించే మెరుగైన పే ప్యాకేజీలు, అలాగే ఈ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, కెరీర్ పురోగతి, విశ్వసనీయత గురించి స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అధిక అట్రిషన్ రేటుకు కారణమని 54.38 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. అవసరమైన నైపుణ్యాలలో లోటు, జీతం అంచనాలలో అసమతుల్యత, ముప్పు ఉండొచ్చనే ఆందోళనల కారణంగా స్టార్టప్స్‌లో చేరడానికి విముఖత చూపుతున్నారు’ అని నివేదిక వివరించింది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
ఈవీల జోరు.. అమ్మకాల హుషారు!
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) జోరందుకుంటుండగా.. అమ్మకాలు సైతం హుషారెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం తక్కువ అవుతుండటంతో యువత ఈవీల వైపు చూస్తున్నారు. ఫలితంగా.. ఆరు నెలలుగా వీటి అమ్మకాల జోరు పెరుగుతోంది. దేశంలో తొలిసారిగా ఒక ఆర్థిక ఏడాదిలో 10 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలతో ఎలక్ట్రిక్ వాహన రంగం సరికొత్త రికార్డును సృష్టించింది. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) 2022–23లో దేశవ్యాప్తంగా 11,71,944 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు వాహన్ డేటా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021–22లో అమ్ముడైన 4,58,746 యూనిట్లతో పోలిస్తే అమ్మకాల్లో 155 శాతం వృద్ధి నమోదైంది. గడచిన ఆరు నెలలుగా ప్రతినెలా లక్షకు పైగా వాహనాలు అమ్ముడవుతున్నాయంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తు్తతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 22,67,042కు చేరింది. రాష్ట్రంలో ఈవీల సంఖ్య 54,918కు చేరింది. టూ.. త్రీ వీలర్స్‌కే డిమాండ్ అధికం ప్రస్తుతం అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటానే అత్యధికంగా ఉంటోంది. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు 61.5 శాతం ఉంటే, త్రిచక్ర వాహనాల వాటా 34 శాతంగా ఉంది. ద్విచక్ర వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశంతో ఒక్కసారిగా అమ్మకాలు భారీగా పెరిగాయి. 2021–22తో పోలిస్తే 185 శాతం వృద్ధితో 7,20,733 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. (ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?) ఇందులో ఒక్క ఓలా ఎలక్ట్రిక్ 1,54,344 వాహనాలు అమ్మడం ద్వారా 21 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఓకినావా ఆటో టెక్ 94,133, హీరో ఎలక్ట్రిక్ 89,165 నిలిచాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలకు వస్తే 2022–23లో మొత్తం 3,99,540 యూనిట్లు సేల్ అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 39,544 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరిగితే.. అందులో 31,203 కేవలం టాటా మోటర్స్ నుంచే జరగ్గా, 4,412 యూనిట్లు ఎంజీ మోటార్స్ నుంచి జరిగాయి. రాష్ట్రంలోని కియా మోటర్స్ 311 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. (ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..) -
Unseasonal rains: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కారు మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది. ఇక విశాఖ వర్షం నేపథ్యంలో.. రేపటి(ఆదివారం) మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇదీ చదవండి: వివక్ష లేదు.. మంత్రి వేణు ప్రకటన -
ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్!
భారత బ్యాంకింగ్ రంగంలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే మహిళ అధినేత్రిగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని ఇతర బ్యాంకుల్లో డైరెక్టర్, మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకైక మహిళా సీఈవో, ఎండీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం మణిమేఖలై సీఈవో, ఎండీగా ఉన్నారు. చురుకైన నిర్ణయాలతో బ్యాంకును విజయవంతంగా నడిపిస్తున్నారు. 1988లో విజయా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం అయిన తర్వాత ప్రభుత్వం ఆమెను కెనరా బ్యాంక్‌లో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇందులో ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, క్రెడిట్ సంబంధిత అంశాలు, తనిఖీ, మార్కెటింగ్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూషన్, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ బాధ్యతలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనంలో కీలక పాత్ర పోషించారు. కాన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్, కాన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్, కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆమెకు విశేష అనుభవం ఉంది. అలాగే కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరించారు. మణిమేఖలై బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్) పట్టా పొందారు. ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశారు. ఇతర బ్యాంకుల్లో.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి మరికొన్ని బ్యాంకుల్లో డైరెక్టరియల్, మేనేజ్మెంట్ వంటి కీలక స్థానాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బిజినెస్ ఫైనాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ హెడ్‌గా అషిమా భట్ సేవలు అందిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా శాంతి ఏకాంబరం ఉన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్లలో బృందా జాగీర్దార్ ఒకరు. గతంలోనూ అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, పద్మజ చుండూరు, శిఖా శర్మ, చందా కొచర్ వంటి వారు పలు బ్యాంకులకు నాయకత్వం వహించారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! -
2023 ఆటోకార్ అవార్డ్స్: సత్తా చాటిన కార్లు, బైకులు.. ఇవే!
ఇటీవల ఆటోకార్ అవార్డ్స్ 2023లో కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా సొంతం చేసుకోగా, బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 'జాజ్ పల్సర్ ఎన్160' దక్కించుకుంది. మొత్తం 22 అవార్డులలో ఏ వాహనం ఏ అవార్డ్ దక్కించుకుందో ఇక్కడ చూడవచ్చు. మారుతి గ్రాండ్ విటారా అగ్ర గౌరవం అందుకోవడం మాత్రమే కాకుండా.. మిడ్‌సైజ్ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాయి. లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్, ఎగ్జ్క్యూటివ్ ఇయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా హ్యుందాయ్ టక్సన్, ఎంపివి ఆఫ్ ది ఇయర్‌గా ఇన్నోవా హైక్రాస్, లగ్జరీ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ విన్నర్‌గా ఆడి క్యూ3, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ టాటా టియాగో ఈవి, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ విన్నర్ సుజుకి కటన, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని టాటా మోటార్స్ సొంతం చేసుకున్నాయి. ఆటోకార్ అవార్డ్స్ 2023లో కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భగా మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కూడా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమకు సంబంధించి, 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ సొంతం చేసుకున్నారు -
2023 March Bank holidays: 12 రోజులు సెలవు, లిస్ట్ ఇదిగో!
సాక్షి, ముంబై: 2023 మార్చికి నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండు నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వివిధ పండుగలు, రెండు, నాల్గవ శనివారాలు,నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా మార్చి నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి ప్లాన్ చేసుకుంటే ఉత్తమం. ఇవి మన ప్రాంతానికి వర్తిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితా మార్చి 3 శుక్రవారం: చాప్చార్ కుట్ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు మార్చి 5 - ఆదివారం మార్చి 7 -హోలీ (2వ రోజు) మార్చి 8 - ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ 2వ రోజు మార్చి 9 -హోలీ మార్చి 11 - నెలలో రెండవ శనివారం మార్చి 12 - ఆదివారం మార్చి 19 - ఆదివారం మార్చి 22 - ఉగాది మార్చి 25 - నాలుగో శనివారం మార్చి 26 - ఆదివారం మార్చి 30 - శ్రీరామ నవమి -
వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం: తలసాని
-
కొత్త ఏడాది.. 18 లక్షల కొత్త వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జనవరిలో అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 18,26,669 వాహనాలు అమ్ముడయ్యాయి. 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 14 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 22 శాతం అధికమై 3,40,220 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 10 శాతం ఎగసి 12,65,069 యూనిట్లుగా ఉంది. త్రీవీలర్లు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 16 శాతం వృద్ధి చెంది 82,428, ట్రాక్టర్లు 8 శాతం దూసుకెళ్లి 73,853 యూనిట్లకు చేరుకున్నాయి. 2020 జనవరితో పోలిస్తే గత నెల విక్రయాలు 8 శాతం తక్కువ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, యాజమాన్య ఖర్చు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. పునర్వినియోగపరచదగిన ఆదాయం అదే నిష్పత్తిలో పెరగలేదని చెప్పారు. పాత వాహనాల భర్తీ, సరకు రవాణా పెరుగుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నుంచి స్థిర మద్ధతు కారణంగా.. మార్కెట్లో డిమాండ్ కొనసాగి వాణిజ్య వాహనాల విభాగం కోవిడ్ ముందస్తు కంటే పెరగడానికి సహాయపడింది అని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!) -
తెలంగాణలో కొత్తగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అందుకు దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులు కేటాయించాలని నివేదించినట్లు సమాచారం. బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాపై దృష్టిసారించింది. బెంగాల్ తరహాలో...: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే రాష్ట్రంలోనూ బీమా పథకాన్ని అమలు చేసే అవకాశముంది. దీనిపై సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో ప్రకటన చేశారు. బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన పేరుతో సొంత పథకం తీసుకొచి్చంది. నాలుగేళ్లుగా దీన్ని అమలు చేస్తోంది. బెంగాల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. అంతేగాక రైతు యూనిట్‌గా బీమా పథకాన్ని తీసుకురావాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు బీమా కంపెనీల దోపిడీ... పంటల బీమా విషయంలో బీమా కంపెనీలు ఇప్పటివరకు లాభాలను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. లాభాలు గణనీయంగా ఉన్నా ఏటా ప్రీమియం రేట్లను భారీగా పెంచేవి. 2013–14లో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ. 137.60 కోట్ల మేర చెల్లిస్తే రైతులకు క్లెయిమ్స్ కింద అందింది కేవలం రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.18 లక్షల మంది రైతులే లబ్ధి పొందారు. 2012–13 వ్యవసాయ సీజన్లో 10 లక్షల మంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.80 లక్షల మంది రైతులకు రూ. 78.86 కోట్ల మేర పరిహారం లభించింది. 2015–16లో మాత్రం 7.73 లక్షల మంది రైతులు రూ. 145.71 కోట్లు ప్రీమియం చెల్లిస్తే బీమా సంస్థలు రూ. 441.79 కోట్లను పరిహారంగా ఇచ్చాయని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17లో మళ్లీ బీమా కంపెనీలకే లాభాలు సమకూరాయి. ఆ ఏడాది 9.75 లక్షల మంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే 2.35 లక్షల మంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం లభించింది. కేంద్ర పథకంతో లాభం లేదని... బీమా కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా ప్రీమియం ధరలు ఎందుకు పెంచుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్లుగా అమలైంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రైవేటు బీమా కంపెనీలకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి మరింత దిగజారింది. పీఎంఎఫ్‌బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం రైతు ప్రీమియం కట్టాలి. జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుంటాయి. అలాగే కేంద్ర పథకంలో గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది. వడగళ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలు చేయకపోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్నుంచి బయటకు వచ్చింది. -
పరీక్షా పే చర్చకు భారీ ఎత్తున సన్నాహాలు
సాక్షి, ఢిల్లీ: ఈసారి భారీ ఎత్తున పరీక్షా పే చర్చా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రతీ ఏడాది వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చా కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొంటూ వస్తున్నారు. తద్వారా పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రధాని మోదీ.. విద్యార్థులకు మార్గనిర్దేశన చేస్తున్నారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని బీజేపీ యోచిస్తోంది. అందుకే భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అప్డేటెడ్ వెర్షన్ పుస్తకాలను పంపిణీ చేసింది. దేశం మొత్తం మీద 13 భాషలలో అందుబాటులోకి(జనవరి 19వ తేదీనే) వచ్చింది ఈ పుస్తకం. విద్యార్థులు ఒత్తిడి దూరం చేసుకునేందుకు.. చిట్కాలతో కూడిన పుస్తకం ఇది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు హెల్తీ బేబీ షో లు నిర్వహిస్తున్నారు నేతలు. Updated edition of #ExamWarriors book by PM @narendramodi, with new mantras for both students and parents, is now available in 𝟭𝟯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗹𝗮𝗻𝗴𝘂𝗮𝗴𝗲𝘀. Hindi, English, Tamil, Telugu, Malayalam, Kannada, Odia, Assamese, Gujarati, Marathi, Punjabi, Urdu & Bengali. pic.twitter.com/VafWDl67xW — Exam Warriors (@examwarriors) January 19, 2023 ఇక.. తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్‌లో విద్యార్థులు వీక్షించే విధంగా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది. బీజేపీ సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది. కార్యక్రమంలో.. ఎంపికైన విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ పాల్గొంటారు. -
'చాట్‌జీపీటీ' తో డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి!
గూగుల్‌కు గుబులు పుట్టిస్తున్న చాట్‌జీపీటీని యూజర్లు చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు ఎలా సంపాదించవచ్చు’ అని ప్రశ్నిస్తున్నారు. చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా చాట్‌జీపీటీని అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో 2023లో చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు సంపాదించడం ఎలా? అని ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఇక యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాట్‌జీపీటీని ఉపయోగించి 7 మార్గాల్లో డబ్బులు సంపాదించవచ్చని ఏఐ మోడల్ సమాధానం ఇచ్చింది. 1. చాట్‌జీపీటీ ఉపయోగించి చాట్‌బాట్ తయారు చేసి వాటికి లైసెన్స్ పొందవచ్చు. అనంతరం వ్యాపార సంస్థలకు లేదంటే వ్యక్తులకు అమ్ముకోవచ్చు. డబ్బులు సంపాదించవచ్చు. ఈ చాట్‌బాట్ సాయంతో కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెన్స్ లేదా ఇతర పనులకు ఉపయోగించవచ్చు. 2. చాట్‌జీపీని సొంతం ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేట్ చేయొచ్చు. కన్సల్టింగ్, డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించవచ్చు. 3. ఏఐ ఆధారిత చాట్‌బోట్ సాయంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లు, లేదా ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డేటాను తయారు చేసి.. కోర్సుల పేరుతో ఆ డేటాను అమ్ముకోవచ్చు. 4. చాట్‌జీపీటీ అందించే యూనిక్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ సాయంతో సోషల్ మీడియా, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను రన్ చేయొచ్చు. తద్వారా యాడ్స్, ప్రమోషనల్ యాడ్స్‌ను డిస్ప్లే చేసి ఆదాయాన్ని గడించవచ్చు. 5.మీకు స్టాక్ మార్కెట్‌పై పట్టుంటే చాట్‌జీపీని ఉపయోగించి ఆటోమెటెడ్ ట్రేడింగ్‌ను స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు. ట్రేడింగ్, లేదంటే కన్సల్టింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అప్లయి చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. 6. అంతేకాదు చాట్‌జీపీటీ బేస్డ్ చాట్‌బోట్‌ను తయారు చేసి కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో సబ్స్క్రిప్షన్ మోడల్‌తో డబ్బులు సంపాదించవ్చు. 7. చాట్ జీపీటీతో లాంగ్వేజెస్‌ను ఉపయోగించే సంబంధింత బిజినెస్‌లలో కొన్ని పనులు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, టెక్ట్స్ సమరైజేషన్ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు. చదవండి👉 ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
కర్నాటకలో ఖతర్నాక్ పోటీ.. ఆసక్తికరంగా ట్రాకర్ పోల్ సర్వే
కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్ ఫస్ట్’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ సంస్థ - ‘సిస్రో’తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా.. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తం మీద హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్ పోల్‌లో తెలిసింది. పీపుల్స్‌పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్ పోల్ 2022 డిసెంబర్ 22-31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్ ధనుంజయ్ జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించారు. ఎన్నికలలోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరుగనుంది. మరో రెండు మార్లు ట్రాక్ పోల్స్ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు. కర్నాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలై, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ధీమాతో ఉన్నాయి. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్/మైనస్ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్/మైనస్ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడీ(ఎస్)29 (ప్లస్/మైనస్ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడీ(ఎస్) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్) కీలకం కానుంది. ట్రాకర్‌పోల్ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థల సర్వే ప్రకారం, జేడీ(ఎస్) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేర్‌తో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడీ(ఎస్) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడీ(ఎస్) నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి. కర్నాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా కీలకంగా మారనున్నాయని సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బీజేపీ వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. జేడీ(ఎస్) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌లో తేలింది. 2013-2018 మధ్య కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుండి ఎక్కువ మద్దతు లభిస్తోంది. పీపుల్స్ పల్స్- సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం బీజేపీ, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తున్నది. కర్నాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు.. 38 శాతం కాంగ్రెస్, 36 శాతం బీజేపీ, 18 శాతం జేడీ(ఎస్)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్నాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు.. 38 శాతం మంది కాంగ్రెస్ అని, 37 శాతం మంది బీజేపీ అని తెలిపారు. బీజేపీకి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం అనుకూలమని తెలిపారు. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్నాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సర్వే చేపట్టిన విధానం.. ‘సౌత్ ఫస్ట్’న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు ఈ సర్వేను 56 అసెంబ్లీ స్థానాల్లో 224 పోలింగ్ బూత్‌లను ఎంపిక చేసుకొని మొత్తం 4584 శాంపిల్స్ (ఓటర్ల) నుండి సమాచారం సేకరించాము. జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకొని, సామాజిక వర్గాల ఆధారంగా ర్యాండమ్ పద్దతిలో ఎంపిక ద్వారా ఈ శాస్త్రీయ సర్వే జరిగింది. డిసెంబర్ 22 నుండి 31 వరకు ఈ ట్రాకర్‌పోల్ సర్వే ప్రక్రియ సాగింది. మార్చి 2023లో ఒకసారి, ఎన్నికల ముందు మరోమారు సర్వేను నిర్వహించనున్నాము. ప్రతీ పోలింగ్ స్టేషన్ నుండి 35 మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించాము. ఈ సర్వేలో సీఏపీఐ (కంప్యూటర్ అసిస్టెడ్ ఇంటర్‌పర్సనల్ ఇంటర్వీయింగ్) పద్దతిన డేటా సేకరణ జరిపి, ఓటర్లను ముఖాముఖి కలుసుకుని, ఈ సర్వేలో అవసరమైన ప్రశ్నలు వేస్తూ డమ్మీ ఈవీఎమ్ ద్వారా రహస్య ఓటింగ్ నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల్లో 1-2 (+/-) వ్యత్యాసాలకు ఆస్కారం ఉంది. (క్లిక్ చేయండి: రాజకీయాలకు ఎస్ఎం కృష్ణ గుడ్‌బై) -
డుకాటీ బైక్ రూ.72 లక్షలు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్‌కు స్ట్రీట్‌ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్‌పీ పవర్‌తో 1,103 సీసీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. డుకాటీ క్విక్ షిఫ్ట్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు ఉంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్‌లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్‌లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది. -
మన సంగతి సరే.. విదేశాల్లో ఇలా కూడా చేస్తారా?
అందరూ న్యూఇయర్‌కు వెల్కం చెప్పేశాం.. ఒక్కొక్కరూ ఒక్కో టైపులో... చాలామందికి కొత్త సంవత్సరం తొలిరోజున ఫలానా పని చేస్తే.. ఆ ఏడాదంతా కలిసి వస్తుందని నమ్మకాలు ఉంటాయి. అందులో భాగంగానే చాలామంది ఆలయాలకు వెళ్తుంటారు. మన సంగతి సరే.. మరి విదేశాల్లోని సంగతేంటి? వాళ్ల సంప్రదాయాలు ఏంటి? సెంటిమెంట్లు ఏంటి? తెలుసుకుందామా.. ఆ 12 ద్రాక్షలు.. ‘నోచె వీజా’.. అంటే స్పానిష్ భాషలో పాత రాత్రి అని అర్థం. స్పెయిన్‌లో ఏటా న్యూఇయర్ సందర్భంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే కొత్త ఏడాది తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని కాంక్షిస్తూ 12 ద్రాక్షపండ్లను తినడం ఆనవాయితీ. లక్‌ను తెచ్చే లోదుస్తులు.. బ్రెజిల్ పౌరులది మరీ విచిత్రమైన సంప్రదాయం.. కొత్త సంవత్సరం తమకు అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ ప్రజలు రంగురంగుల లోదుస్తులు ధరించారు. ఒక్కో లోదుస్తుల రంగు ప్రేమ, వాత్సల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి చిహ్నంగా నిలుస్తాయని వారి నమ్మకం. ఆలూ ఏం చెబుతోంది.. కొలంబియన్లు కొత్త ఏడాది సందర్భంగా తమ దిండ్ల కింద పూర్తిగా చెక్కు తీసిన, సగం చెక్కు తీసిన, చెక్కు తీయని మూడు ఆలుగడ్డలను పెట్టుకున్నారు. ఒక్కో ఆలుగడ్డను ఆర్థిక సమస్యలు, సమృద్ధి, శ్రేయస్సు–నిరాశకు మధ్య సమతూక సంకేతంగా పరిగణించారు. న్యూఇయర్ రాత్రి దిండ్ల కింద పెట్టిన మూడు ఆలుగడ్డల్లోంచి ఒకదాన్ని కళ్లు మూసుకొని తీశారు. ఒక్కో వ్యక్తి తీసుకొనే ఆలుగడ్డ ఆ సంవత్సరమంతా అతని లేదా ఆమె తలరాతను సూచిస్తుందని భావిస్తున్నారు. ఉల్లి చేసే మేలు.. గ్రీస్‌లో న్యూఇయర్‌ను పురస్కరించుకొని ప్రజలు ‘వసిలోపిటా’ అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కేక్‌ను శిలువ ఆకారంలో మూడుసార్లు కోసి సెయింట్ బేసిల్ అనే తొలినాళ్లకు చెందిన బిషప్కు అంకితమిచ్చారు. అలాగే ఏడాదంతా తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని ఇళ్ల తలుపులకు కొన్ని ఉల్లిగడ్డలను వేలాడదీశారు. ఉల్లిని నిరంతర వృద్ధి, ఎదుగుదలకు చిహ్నంగా భావిస్తూ ఇలా చేశారు. 108 సార్లు వాయిస్తే.. కొత్త ఏడాది నూతన ప్రారంభానికి సూచికగా జపనీయులు గుళ్లలో 108సార్లు గంటలను మోగించారు. మనిషిలోని కోరికలు, ఆందోళనలను పరిశుద్ధం చేసుకొనేందుకు సంకేతంగా 108సార్లు గంటలు వాయిస్తారు. ఉప్పుతో స్వాగతం... టర్కీవాసులు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి తలుపులపై ఉప్పును చల్లుతూ కొత్త ఏడాదంతా తమకు శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకున్నారు. గోడకేసి కొట్టేద్దాం.. ఐర్లాండ్‌లో కొందరు ప్రజలు దుష్టశక్తులు, దురదృష్టాన్ని పారద్రోలేందుకు క్రిస్మస్ బ్రెడ్‌ను తమ ఇళ్ల గోడలపై విసిరి కొట్టారు. తద్వారా వారు కొత్త ఏడాదిని స్వచ్ఛంగా ప్రారంభిస్తున్నట్లు భావిస్తారు. గిన్నెలు, గ్లాసులు బద్దలుకొట్టి... డెన్మార్క్ ప్రజలు న్యూఇయర్‌ను పురస్కరించుకొని తమ పాత ప్లేట్లు, గ్లాసులను ఇరుగుపొరుగు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్ల తలుపులకేసి పగలగొట్టారు. తలుపుల వద్ద ఎన్ని పగిలిన ముక్కలు పడితే కొత్త ఏడాదంతా తమకు అంత బాగుంటుందని వారు విశ్వసిస్తారు. రంగురంగులతో కొత్త కళ... మెక్సికోవాసులు కొత్త ఏడాది రాక సందర్భంగా తమ ఇళ్లను సరికొత్త రంగులతో తీర్చిదిద్దారు. ప్రేమ కోసం పరితపించే వారికి ఎరుపు, కొత్త ఉద్యోగాన్వేషణ చేసే వారికి పసుపు.. ఇలా వివిధ రంగులు ప్రత్యేక సందేశాలను చాటుతాయని వారు భావిస్తారు. -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ జమ చేస్తాయని మీకు తెలుసా?
2022 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు .. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు మీ బ్యాంకు ఖాతాలను ముందుగా అప్డేట్ చేయించండి. అన్ని బ్యాంకుల్లో మీకున్న అన్ని అకౌంట్లు, అలాగే మీకున్న జాయింట్ బ్యాంకు ఖాతాలు, మీరు .. మీ కుటుంబ సభ్యులు.. రెసిడెంటు కావచ్చు లేదా నాన్ రెసిడెంటు కావచ్చు .. అందరివి అన్ని ఖాతాలను అప్డేట్ చేసి విశ్లేషణ మొదలుపెట్టండి. ముందు జమలను పరిశీలించండి. ప్రతి జమకి వివరాలు వేరే లాంగ్ నోట్‌బుక్‌లో రాయండి. మీ సేవింగ్స్ అకౌంటు ఖాతాలో బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకోసారి..లేదా కొన్ని బ్యాంకులు ఆరు నెలలకోసారి వడ్డీని జమ చేస్తుంటాయి. అలాంటి పద్దుల్ని గుర్తించి అవన్నీ ఒక చోట రాయండి. సాధారణంగా ఎక్కువ మంది ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ’లైట్’గా తీసుకోకండి. ఇక మిగిలినవి మీరు నిర్వహించిన జమలు. వీటిలో .. 1. నగదు జమలు: ఈ డిపాజిట్లు ఎందుకు చేశారో తెలుసుకోండి. మొదట్లో డ్రా చేయగా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవా? లేదా అద్దెనా? పారితోషికమా? ఆదాయమా? అప్పుగా వచ్చినదా? ఎవరిచ్చారు? కుటుంబ సభ్యులా? ఇతరులా? దేని నిమిత్తం ఇచ్చారు? వందలు అయితే ఫర్వాలేదు. ఏదో కథ చెప్పొచ్చు. వేలల్లో ఉంటే సంతృప్తికరమైన జవాబు ఇవ్వండి. అమ్మకాలా? ట్యూషన్ ఫీజులా? ఆదాయమే కాదా? తగిన జాగ్రత్త వహించాలి. 2. నగదు కాని జమలు: ఇవి చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఫోన్‌పే, గూగుల్‌పే, బదిలీలు కావచ్చు. మీరే ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకు బదిలీ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. విదేశాల నుండి మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. మీ నికర జీతం కావచ్చు.. ఇంటద్దె కావచ్చు .. వడ్డీ కావచ్చు.. వ్యవసాయం మీద ఆదాయం కావచ్చు .. జీవిత బీమా .. ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తం కావచ్చు. బ్యాంకు లోన్ కావచ్చు.. అప్పు ఇచ్చి ఉండవచ్చు.. లేదా గతంలో మీరు ఇచ్చిన అప్పును వారు వెనక్కి ఇచ్చి ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కావచ్చు .. ఏదైనా స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన బాపతు కావచ్చు. ఇందులో మళ్లీ అడ్వాన్సు ఉండొచ్చు.. వాయిదాలు .. ఫైనల్ సెటిల్మెంట్ ఉండొచ్చు. సేల్స్ కావచ్చు .. ఫీజులు కావచ్చు టీడీఎస్ పోనూ మిగిలిన మొత్తమే జమవుతుంది. అప్పుడు టీడీఎస్‌తో కలిపి లెక్కలోకి తీసుకోవాలి. ఇలా ప్రతి జమని విశ్లేషించండి. ప్రత్యేకంగా ఆదాయాలు ఒక పక్కన రాయండి. ఆదాయాలు కానివి మరో పక్కన వివరంగా రాయండి. ఇక చెప్పేదేముంది. మీ ముందే ఉంది చిట్టా. పరీక్షించండి. పరికించి చూడండి ప్రతీ జమని. -
ఎలక్షన్ ఇయర్ 2023
-
ఈ ఏడాదైనా భారత్‌కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే?
భారత జట్టుకు 2022 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. గతేడాది జరిగిన ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశ పరిచింది. ఇక 2023 కొత్త సంసంవత్సరంలో క్రికెట్ ప్రపంచంలో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో ఈ ఏడాదిని టీమిండియా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం. శ్రీలంకతో మొదలు.. టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ల జరగనుంది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న మొదటి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టీ20 జనవరి 5న పుణేలో, మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. అదే విధంగా వన్డే సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో పోరు శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ ముగిసిన అనంతరం సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 21, 24 తేదీల్లో రాయ్‌పూర్, ఇండోర్లలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా జనవరి 27, 29, ఫిబ్రవరి 1న రాంచీ, లక్నో, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లక్ష్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపనుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్లో టీమిండియాకు ఇదే ఆఖరి సిరీస్. భారత్ ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఖారారు చేసుకుంటుంది. ఇక టెస్టు సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9-13 వరకు నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్ ఢిల్లీలో, మార్చి 1-5 వరకు ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఇక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆసీస్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికలగా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్‌లో జరగనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఫైనల్లో అడుగు పెడుతోంది. విండీస్ పర్యటనకు.. జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఆసియా కప్ 2023.. 2023 ఆసియా కప్ సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే. ఒకవేళ తటస్థ వేదికపై ఆసియా కప్‌ను నిర్వహిస్తేనే భారత జట్టు ఆడుతోంది అని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. స్వదేశంలో మళ్లీ ఆసీస్‌తో.. వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌లో భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇంకా షెడ్యూల్ ఖారారు కాలేదు. సొంత గడ్డపై ప్రపంచకప్.. ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. తొలి సారిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు పూర్తి స్థాయిలో భారత్ అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 1987, 1996, 2011లలోనూ భారత్ అతిథ్యం ఇచ్చినప్పటకీ.. పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలతో సంయుక్తంగా నిర్వహించింది. ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూలు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ నవంబర్ ఆఖరిలో జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు ఏడాది చివర్లో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. -
2023లో సమస్యలతో సావాసమే: సునాక్
లండన్: బ్రిటన్‌వాసులకు ప్రధాని రిషి సునాక్ తన న్యూ ఇయర్ సందేశంలో చేదు వార్త విన్పించారు. దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. ‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్‌తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.