Yearly Numerology Predictions 2023 In Telugu - Sakshi
Sakshi News home page

న్యూమరాలజీ: 2023 సంవత్సర ఫలాలు

Published Sun, Jan 1 2023 12:54 AM | Last Updated on Sun, Jan 1 2023 12:09 PM

Yearly Numerology Predictions 2023 - Sakshi

2023. ఈ సంవత్సరం అంకెలు మొత్తం కూడితే 2+0+2+3=7, వస్తుంది. 7 అంకె కేతుగ్రహానికి సంకేతం. దీని ప్రభావం వలన వైద్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, పురాతన గ్రంథాలు, మరుగున పడిన తాంత్రిక విద్యలు, ఆయుర్వేదం, జ్యోతిషం వంటి విద్యలలో సృజనాత్మక మార్పులు, అభివృద్ధి జరుగుతాయి. వైద్య విద్య, వైద్య పరిశోధనలపై ప్రజలకు, ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఫైనాన్స్, మేనేజ్‌మెంట్‌ రంగంపై విద్యార్థులలో ఆసక్తి ఎక్కువ అవుతుంది. స్టాక్‌ మార్కెట్‌పై కూడా ఆసక్తి పెరుగుతుంది. స్టాక్‌ మార్కెట్‌ ఫిబ్రవరి వరకు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఫిబ్రవరి 2023 తరువాత లాభదాయకంగా ఉంటుంది.

ఈ 2023 సంవత్సరం మొత్తం అంకెలు కలపగా 7 వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కేతు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా జ్యోతిషపరంగా చూసినా  2023 సంవత్సరం ఆదివారం, అశ్విని నక్షత్రం (01–01–2023)తో ప్రారంభం అయ్యి, ఆదివారం, మఖ నక్షత్రం (31–12–2023)తో ముగుస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కేతు నక్షత్రం (అశ్విని)తో మొదయ్యి, కేతు నక్షత్రం (మఖ)తో ముగుస్తుంది. అందువలన కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ 2023 శోభకృత్‌ నామ సంవత్సరంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి కలిగి ఆత్మజ్ఞానం, తాత్విక జ్ఞానం, ఆత్మాభిమానం కలిగి మంచి పాజిటివ్‌ ఆలోచనలు కలిగి ప్రజలు అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తారు.



1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి 2023 సంవత్సరంలో సూర్య, చంద్ర, కేతు గురు గ్రహాల ప్రభావం ఉంటుంది. గురు ప్రభావం వలన ఆకస్మిక ధన్రపాప్తి కలుగుతుంది. పరిశోధన, మైనింగ్‌ రాజకీయ రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు. బాధ్యతలు పెరుగుతాయి. దీనితోపాటు ఆర్థికవృద్ధి, అదృష్టం కలిసి వస్తాయి. కొత్త పథకాలు, వ్యాపారాల ద్వారా లాభాలు గడిస్తారు. విదేశాలలో విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది మంచి సమయం.

సంఘంలో గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగం. వైవాహిక జీవితంలో ఉన్నవారికి స్పర్థలు, అ΄ోహలు తొలగి మంచి వైవాహిక జీవితం గడుపుతారు. భార్య/భర్త ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నైతికత, విలువలు పాటించాలి. లేక΄ోతే సన్నిహితులు మిత్రులు దూరం అయ్యే అవకాశం ఉంది. అహంభావం విడిచిపెట్టి గొప్పవారి సాయం తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరంతో ΄ోల్చితే ఈ సంవత్సరంలో సామాజికంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి ఆలోచనలు కలిగి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ్రపాప్తి, విద్యలో పూర్తి చేయని కోర్స్‌లు ఉంటే అవి పూర్తి చేస్తారు. డిగ్రీ చేతికి వస్తుంది. పరిశోధనా రంగం వైద్య రంగం జ్యోతిషం తాంత్రిక విద్యలు మొదలైన రంగాలలో ఉన్నవారికి 2023 సంవత్సరం చాలా మంచి సంవత్సరం. అధిక ఒత్తిడి తీసుకోకుండా శాంతంగా ఉంటూ అహంభావాన్ని విడిచి పెట్టి ప్రయత్నిస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది అని చెప్పవచ్చు.

దుర్గా సప్తసతి పారాయణ వలన మంచి ఫలితాలు ΄ఫందుతారు.

2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారికి న్యూమరాలజీ ప్రకారం 2,7 చంద్రునికి సంబంధించిన అంకెలు. ఈ సంవత్సరంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహయోగం. సృజనాత్మకత పెరుగుతుంది. రచయితలకు,నటులకు, కళాకారులకు ఇది మంచి సమయం. నటులకు, కళాకారుకి మంచి అవకాశాలు దొరికి, చిత్ర రంగంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.  విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో సమాచార రంగం బాగుంటుంది. ఈ సంవత్సరం 23 సంఖ్య ( 2+3) కాబట్టి 5 బుధుడి సంఖ్య. దీనివలన స్టాక్‌ మార్కెట్‌లో అభివృద్ధి ఉంటుంది.

సంవత్సర సంఖ్య లోని 3 గురుడుకి సంబంధించి సంఖ్య కావటం వలన పుట్టిన తేదీ (2,11,20,29) చంద్రుడికి సంబంధించినది కావటం వలన చంద్ర గురువుల కలయిక వలన రాజయోగం కలుగుతుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పాత మిత్రులను కలుస్తారు. కార్యాలయంలో గుర్తింపు వస్తుంది. గమ్యాలను చేరుకోగలుగుతారు. చాలా కాలంగా విదేశాలలో ఉన్నవారు స్వదేశం వస్తారు. అప్పు కోసం ప్రయత్నించేవారికి అప్పు దొరుకుతుంది. ఆకర్షణ శక్తి పెరిగి స్నేహితులు ఎక్కువ అవుతారు. గృహోపకరణ, విలాస వస్తువులు కొంటారు. నగదు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువలన జాగ్రత్తగా ఖర్చు చెయ్యాలి. హీలింగ్‌ చేసేవారికి, వక్తలకు ఇది మంచి సమయం.

విష్ణు సహస్ర నామం పారాయణం, శ్రవణం చేయటం, రుద్రాభిషేకం, హనుమాన్‌ చాలీసా పారాయణ వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆదాయంలో 2 నుంచి 10 శాతం వికలాంగులకు దానం చేయటం వలన మీ వృత్తిలో ఆదాయ వృద్ధి కలుగుతుంది.

3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారికి గురు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు నిరంతరం శక్తి సంపన్నులుగా, ఆశావాదులుగా ఉండి తమ ప్రతిభ ద్వారా ఇతరుల కంటే ఎక్కువగా రాణిస్తారు. వీరిపై బుధ, గురు, కేతు ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏ వయసు వారైనా కొత్త పరిజ్ఞానాన్ని ΄ఫందుతారు. వృత్తివిద్యలు, నూతన సాంకేతిక విద్యలు నేర్చుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య కోరిక నెరవేరుతుంది. వీరికి ఈ సంవత్సరం నూతన ఉత్సాహంతో నిర్మాణాత్మకంగా ఉంటుంది. మధ్యలో చదువు ఆపినవారు కొత్త కోర్సులు చేయాలనే కోరిక కలిగి ముందుకు వెళతారు.

ఈ సంవత్సరంలో గౌరవ పట్టాలు ΄ఫందుతారు. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. వేరుసెనగలు, కందులు, పసుపు పండించేవారికి లాభదాయకం. కొత్తకొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారి పిల్లలు ఉద్యోగం వచ్చి సెటిల్‌ అవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. షేర్‌మార్కెట్‌లో లాభాలు వస్తాయి. తండ్రికి మంచి సమయం. విదేశీ పర్యటన, పుణ్యక్షేత్రాల దర్శనం జరుగుతాయి. ఈ సంవత్సరంలో తీసుకొనే నిర్ణయాల వలన వచ్చే సంవత్సరంలో లాభాలు వస్తాయి. నైతికంగా ఉండాల్సిన అవసరం ఉంది. మే నుండి పిల్లల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

దక్షిణామూర్తిని కొలవటం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో 2 నుంచి 10 శాతం పేద విద్యార్థులకు గురువులకు, ఇంటి పురోహితులకు దానం చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి.

4, 13, 22, 31 తేదీలలో జన్మించినవారిపై రాహు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహు గ్రహం మీద చాలా మందికి వ్యతిరేకత, అ΄ోహలు ఉంటాయి. కానీ రాహు సంఖ్య 4 చాలా మంచి సంఖ్య. వీరు నిర్మాణాత్మక వైఖరి, వాస్తవిక పంథా, స్థిరత్వం, నైపుణ్యం, ప్రశాంతత శాస్త్రీయమైన బాధ్యతాయుతమైన ఆలోచన, కష్టించే గుణం నిజాయితీ, విశ్వాస పాత్రత, పట్టుదల కలిగి ఉంటారు.
బుధ రాహుల కలయిక వీరిని గొప్ప నిపుణులుగా చేస్తుంది. రాహు అంటే కొత్త సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండటం. ఏ వయసులోవారైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం, ఆ రంగంలో ఉన్నవారు నూతన ఆవిష్కరణలు చేయటం, దాని వలన పేరు ప్రఖ్యాతులు, సంపద ΄ఫందటం జరుగుతుంది. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. వివాహం కానివారికి వివాహం జరుగుతుంది.

వివాదాలలో ఉన్న వీరి స్థలం వీరికి లభిస్తుంది. కొత్త ఇల్లు కట్టుకుంటారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. రెండో పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి ద్వితీయ వివాహం జరుగుతుంది. సంవత్సర సంఖ్యలో 3,  జన్మ తేదీ రాహు సంఖ్య అవ్వటం వలన గురు ఛండాల యోగం పడుతుంది. కాబట్టి వీరు ఏ నిర్ణయమైనా తీసుకొనే ముందు ఆలోచించి విజ్ఞుల సలహాలు తీసుకొని చేస్తే మంచిది. గురు ఛండాల యోగం ఉన్నందున ప్రేమ వ్యవహారాలు, రిలేషన్‌ షిప్‌లో ఉండటం మంచిది కాదు. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. ఎంతటి క్లిష్టమైన ఎన్నికలోనైనా గెలుస్తారు.

సర్పదోష నివారణ పూజ, దక్షిణామూర్తి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన మంచి జరుగుతుంది. పేదలకు, అనాథలకు, వికలాంగులకు అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

5, 14, 23 తేదీలలో జన్మించినవారు బుధ గ్రహ ప్రభావం  వల్ల వీరు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఉంటారు. క్రియాశీలత, సేచ్ఛా ప్రియత్వం, వినోదం, ఉల్లాసం, మంచి, ఆలోచనలు, తెలివి తేటలు, కార్య దక్షత కలిగి ఉంటారు. 2023 సంవత్సరం లో వీరిపై కేతుప్రభావం ఉంటుంది. సంవత్సరం 23(5) కాబట్టి బుధ ప్రభావం ఉంటుంది. వీరి జన్మతేదీ, సంవత్సర సంఖ్య రెండూ 5 కావడం వల్ల బుధ ప్రభావతో వీరి తెలివి తేటలకు, కార్య నిర్వహణకు గుర్తింపు వస్తుంది. పబ్లిక్‌ రిలేషన్స్, సేల్స్, పర్యాటక రంగం టీవీ, సినిమా పత్రికా రంగాలలో ఉన్నవారైతే మంచి గుర్తింపు వస్తుంది.

వ్యవసాయదారులకు కూరగాయలు చెరుకు, పెసలు, మినుములు పండించేవారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు కొత్త భూములు, ΄ఫలాలు కొనే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ్రపారంభిస్తారు. వ్యాపార లావాదేవీలలో డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఇది మంచి సంవత్సరం. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నిరుద్యోగులు ΄ోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు వేరే మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోక΄ోతే అవమానాలు జరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించి పంటి, కంటి పరీక్షలు చేయించుకోవాలి.

గణపతి ఆరాధన, రుద్రాభిషేకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో రెండు నుంచి 10 శాతం దానం చేయటం మంచిది.

6, 15, 24 తేదీలలో జన్మించినవారు శుక్ర గ్రహ ప్రభావం వల్ల వీరికి కళాభిరుచి, సృజనాత్మకత, మానవ సేవ, విశ్వాస పాత్రత వంటి లక్షణాలు ఉంటాయి. త్యాగబుద్ధి, సేవాభావం కలిగి ఉంటారు. శుక్ర, బుధ సంబంధం వలన  ఈ సంవత్సరం వైద్యం, జ్యోతిషం, తాంత్రిక సంబంధిత వృత్తుల వారికి చాలా మంచి కాలం. వైద్యులు నూతన వైద్యశాలలు ్రపారంభించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా ఆయా రంగాలలో పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తారు. అవివాహితులకు వివాహయోగం.

ఈ సంవత్సరంలో వీరు ఎంతో ఆత్మతృప్తిని ΄ఫందుతారు. సంవత్సరమంతా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విదేశాలలో ఉన్నవారు స్వదేశం వచ్చి ఆనందంగా గడుపుతారు. విలాస వస్తువులు కొంటారు. ఊహించని ఆస్తి ్రపాప్తిస్తుంది. నటులు, సంగీతకారులకు, మీడియావారికి, నగల వ్యాపారులకు అనుకూలం. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్‌షిప్స్‌లో ఉండటం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

వీథి కుక్కలకు ఆహారం పెట్టడం, బీదవారికి దుప్పట్లు దానం చేయటం మంచిది. భృగు పాశుపత హోమం లేదా సుదర్శన హోమం చేయించుకోవటం మంచిది.

7, 16, 25 తేదీలలో జన్మించినవారిపై కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి తాత్విక చింతన, మానవాతీత శక్తులు ఉంటాయి. ఆధ్యాత్మికత మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర సంఖ్య కూడా 2023(7) కేతు సంఖ్య. ఎవరికైనా జన్మ తేదీ, సంవత్సర సంఖ్య ఒక్కటిగా ఉన్నప్పుడు , వారిపై ఆ గ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. వారు వారి రంగాలలో చక్కగా రాణిస్తారు. మంచి గుర్తింపు వస్తుంది. ఈ తేదీలలో పుట్టినవారు నర్సులు, వైద్యులు, డ్రగ్గిస్టులు, పురోహితులు, జ్యోతిషులు గా ఉంటారు. ఈ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అత్యంత లాభదాయకం అని చెప్పవచ్చు.

విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకొనేవారి కోరిక నెరవేరుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది. వీరికి యోగా, ధ్యానం వంటి విషయాలపై మక్కువ ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం వీరు వ్యాపారంలో రిస్క్‌ తీసుకోవటం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో తల దూర్చకుండా ఉంటే మంచిది. కోర్టులకి, ΄ోలీస్‌ స్టేషన్స్‌కి వెళ్ళకుండా, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవటం మంచిది. ఈ సంవత్సరం షేర్‌ మార్కెట్, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. వీరిలో అసాధారణ స్ఫురణ అధికంగా ఉండి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటిస్తారు. వీరు వీరి రంగాలలో ప్రత్యేకమైన నైపుణ్యం సంపాదించి అందులో ్రపావీణ్యత సాధిస్తారు.

ఆంజనేయస్వామి ఆరాధన, గణపతి ఆరాధన వలన మెరుగైన ఫలితాలు పొందుదుతారు. దాన ధర్మాల వల్ల ఉపశమనం లభిస్తుంది.

8, 17, 26 తేదీలలో జన్మించినవారిపై శని ప్రభావం ఉంటుంది. ఇతరులకు సహాయ పడటం, అన్యాయాన్ని ఎదిరించడం వీరి లక్షణాలు. వీరిపై ఈ సంవత్సరం కేతు, బుధ, గురు గ్రహాల ప్రభావం ఉంటుంది. శని బుధ గ్రహాలు మిత్ర గ్రహాలు. అదే విధంగా శని, గురు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు. అందువలన వీరికి ఈ సంవత్సరం భౌతిక సంపదలు, అభీష్టసిద్ధి, విజయం ్రపాప్తిస్తాయి. నూతన ఉత్సాహం, శక్తి, మంచి గుర్తింపు, సంపద, కీర్తి లభిస్తాయి. 

ఇన్సూరెన్స్‌ నుంచి ధనం రావటం, ఇన్సూరెన్స్‌ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం రావటం జరుగుతుంది. విద్యార్థులు ΄ోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు కొంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. గొప్పవారి పరిచయాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు చాలా క్లిష్టమైన ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారు.
 
ఈ సంవత్సరంలో వీరిపై శని, కేతు, గురు, బుధ గ్రహాల ప్రభావం ఉండటం వలన వీరు రుద్రాభిషేకం, గణపతి, ఆంజనేయ, దక్షిణామూర్తి ఆరాధన వల్ల సత్ఫలితాలను ΄ఫందవచ్చు.

9, 18, 27 తేదీలలో జన్మించినవారిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. 2023 సంవత్సర సంఖ్య 7, కేతు సంఖ్య. జ్యోతిష శాస్త్ర ప్రకారం కేతువు, కుజుడు రెండూ ఒకే విధమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన ఈ సంవత్సరం వీరికి మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సర సంఖ్యలో ఉన్న 2,0,3 సంఖ్యలు చంద్ర, కేతు,బుధ, గురు గ్రహ ప్రభావాలను కలుగజేస్తాయి. కుజ గురు గ్రహ ప్రభావం వలన గురు మంగళ యోగం కలుగుతుంది. దీని వల్ల రియల్‌ ఎస్టేట్, మైనింగ్, మిలటరీ, ΄ోలీస్‌ రంగాలలో ఉన్నవారికి మంచి సంవత్సరం. నిర్మాణం మధ్యలో ఆగి΄ోయినవి మరల మొదలయ్యి, పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పెండింగ్‌ పనులు అన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. పైకి ధైర్యంగా కనిపించినా, లోలోపల పిరికిగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారికి అంత బాగోదు. మనీ మేనేజ్‌మెంట్‌లో జాగ్రత్త అవసరం. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉండాలి.

హనుమాన్, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అంగారక పాశుపత హోమం చేయించుకుంటే మంచిది. రక్తదానం చేస్తే మంచిది.

గ్రహగతులు, వాటి ప్రభావాన్ని పరిశీలించి చూస్తే, ఈ సంవత్సరంలో అందరూ తగు ప్రయత్నంతో అభివృద్ధి పథంలో పయనిస్తారు. శుభకృత్‌ నామ సంవత్సరం తరువాత 2023లో వచ్చే శోభకృత్‌ నామ సంవత్సరం, సార్థక నామధేయంతో అందరికీ కొత్త శోభను తెచ్చి పెడుతుంది.

– మహమ్మద్‌ దావూద్‌
ఆస్ట్రో–న్యూమరో–గ్రాఫాలజిస్ట్‌
హైదరాబాద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement