కొత్త ఏడాదీ కోతలేనా? | IT sector: Nearly 2 40 lakh tech workers have lost jobs in 2023 | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదీ కోతలేనా?

Published Fri, Dec 29 2023 2:23 AM | Last Updated on Fri, Dec 29 2023 2:23 AM

IT sector: Nearly 2 40 lakh tech workers have lost jobs in 2023 - Sakshi

ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన.. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు మరోవైపు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏఐ వైపు మొగ్గు.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
కొత్త సంవత్సరంలోనూ ఐటీ రంగానికి గడ్డు పరిస్థితేనా? ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదా?  అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2023లో దాదాపు 2.40 లక్షల మంది లే ఆఫ్‌ల పేరుతో, తొలగింపు పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక వచ్చే సంవత్సరంలోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదని, ఆర్థిక మాంద్యం ప్రభా వం ఈ రంగంపై ఎక్కువగా కనిపిస్తుందని, కోతలు తప్ప వని అంటున్నారు.

మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగం ఎక్కువ ఉద్యోగా లను కల్పిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాల తొలగింపునకు కారణం అవుతుందా అన్నది కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. తాజాగా మ్యూజిక్‌ స్పాటిఫై ఏకంగా 1,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఏఐని ఉపయోగించనుంది.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయా లను సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో  భాగంగా ఉన్న ఉద్యో గాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్ప నకు మొగ్గు చూపకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు కన్పించడం లేదు. గతంలో ప్రతి యేటా 40 నుంచి 80 శాతం వరకు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి సంస్థలు ముందుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాలి..
వివిధ కంపెనీల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ, 4.1 బిలియన్‌ డాలర్ల విలువగల డేటామిర్‌ సంస్థ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తన సంస్థలోని 20 శాతం ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. సంఖ్యాపరంగా పెద్దగా కనిపించక పోయినా పలు స్టార్టప్‌ కంపెనీలు క్యాష్‌ఫ్లో ఇబ్బందులను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో.. మానవ వనరుల తగ్గింపునకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

క్లార్నా సీఈవో సెబాస్టియన్‌ సిమి యాకోవిస్కీ.. ‘డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించుకునే కంటే ఒక ఏఐతో పని కానియ్యొచ్చు’ అన్నారంటే దాని ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లార్నా సంస్థ ‘పర్సనల్‌ ఫైనాన్స్‌ అసిస్టెంటెన్స్‌’ కార్యకలాపాలను అందిస్తోంది. తాజాగా వచ్చిన ‘రాన్‌స్టడ్‌ రైజ్‌స్మార్ట్‌ గ్లోబల్‌ సెవరెన్స్‌’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో 96 శాతం సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉద్యోగులను తగ్గించే కార్యక్రమాలు చేట్టాయి. ఏఐతో నిర్వహణప్రమాణాలు పెరిగా యని, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతున్నదని నివేదిక వెల్లడించింది.

అయితే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఏఐ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారి ఉద్యోగాలకు ఢోకా ఉండదని తేల్చి చెప్పింది. 2023లో ఉద్యోగాలకు కోత పడగా, అదే సమయంలో ఏఐపై పెట్టుబడులు పెరిగాయని తెలిపింది. ‘ఐటీ కంపెనీలు ప్రధానంగా స్టాక్‌ మార్కెట్‌లపై, రుణాలపై ఆధారపడి ఉంటాయి. తెచ్చుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే భారం పెరుగుతుంది. అలాగే స్టాక్‌ మార్కెట్‌లో ఆ సంస్థ స్టాక్‌ పడిపోయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. తద్వారా లే ఆఫ్‌లు అనివార్యం అవుతున్నాయి..’ అని రోమి గ్రూప్‌ ఎల్‌ఎల్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిక్‌ గౌస్లింగ్‌ చెబుతున్నారు.

భారతీయ కంపెనీలకు పురోగమనావకాశాలు
ప్రస్తుతం ఐటీ రంగంలో ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వారు పెట్టుబడులు పెట్టే ముందు ప్రధానంగా టెక్నాలజీ కొనడమో, అప్‌గ్రేడ్‌ చేయడమో చేస్తుంటారు. యూఎస్, ఐరోపాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్‌ను పరిశీలిస్తే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్‌ సుయిజ్‌ బ్యాంక్‌ వంటివి క్షీణతకు గురయ్యాయి. ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్‌ కంపెనీలపై ఇన్వెస్ట్‌ చేసింది. ఐతే పెట్టుబడు లకు తగ్గట్టుగా ఈ కంపెనీల నుంచి రిటర్న్‌లు రాకపోవడంతో సంస్థ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సెకండ్, థర్డ్‌ స్టేజ్‌ పెట్టుబడులు ఆగిపోయి స్టార్టప్‌లపై తీవ్ర ప్రభావం పడింది.

తదుపరి కార్యాచరణలు, ముందుకెళ్లడాలు నిలిచిపోయాయి. ఫండింగ్‌ నెమ్మదించి ఆయా స్టార్టప్‌లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఔట్‌సోర్సింగ్‌లో సపోర్టింగ్‌ ఉన్న యూఎస్‌లోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్‌ వంటి సంస్థలపై కూడా ప్రభావం పడింది. ఇక ఏఐ, చాట్‌ జీపీటీ వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ కంపెనీలు రాబోయే మూడు, నాలుగు నెలల్లో పరిస్థితులు మారి పురోగమనం వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ (జీసీసీ) ద్వారా టార్గెటెడ్‌ టెక్నాలజీ వైపు మొగ్గు పెరుగుతోంది. వీటి విషయానికొస్తే మన దేశంలోని నగరాలు మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ ఈ సెంటర్లకు హబ్‌గా మారనుంది.   – వెంకారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ హెచ్‌ఆర్‌ లీడర్, కోఫోర్జ్‌

ఏడాది చివర్లో స్లో డౌన్‌ సహజం
ఏడాది చివర్లో ఐటీ రంగం కొంత స్లోడౌన్‌ కావడం సహజమే. వచ్చే ఏడాది కూడా ఐటీ పరిశ్రమ ఔట్‌ సోర్సింగ్‌పైనే అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం అనే కంటే.. మారుతున్న అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమనేదే సమస్య. జనరేటివ్‌ ఏఐ, ఆటోమేషన్,  క్లౌడ్‌ల ద్వారా వర్క్‌ఫోర్స్‌ తమ నైపుణ్యాలను మార్చు కునేలా చేయగలగడం ఐటీ సంస్థలకు పెద్దసవాల్‌.

వీటి ద్వారా సంస్థలకు ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్‌పై, ఏఐ వంటి సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌పై, ఐటీ సర్వీసెస్‌పై పెట్టుబడులు పెరుగుతాయి. 2024లో ఐటీ మార్కెట్‌ వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం, భారత్‌లో 10 శాతం ఉంటుందని ప్రతిష్టాత్మక గార్ట్‌నర్‌ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్‌ చైర్మన్, ఎడ్‌టెక్‌ కంపెనీ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement