తాము చేస్తున్న పనికి తగ్గ జీతం తీసుకుంటున్నట్లు కేవలం 32 శాతం ఉద్యోగులు మాత్రమే అభిప్రాయపడుతున్నారట. కన్సల్టింగ్ సంస్థ గార్ట్‌నర్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల దాదాపు 3500 మందికిపైగా ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. అందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పని, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడం, వర్కింగ్ కల్చర్ సరిగా లేకపోవడం, ఆఫీస్‌లో ఉద్యోగులకు ఎదురయ్యే పలు అనుభవాలే దీనికి ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు.
గతంలో రాజీనామాల పర్వం ఎక్కువగా ఉండడంతో కంపెనీలు కొత్త సిబ్బందిని తీసుకునేవి. ముఖ్యంగా ఈ తరహా ఐటీ రంగంలో ఇలాంటివి చూడవచ్చు. అయితే ఇక్కడ సంస్థలు ఎంతో కాలంగా పని చేస్తున్న సిబ్బంది వేతనం కంటే కొత్తవారికి ఎక్కువ వేతనాలు చెల్లించి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి.
ఇది అక్కడ ఉంటున్న ఉద్యోగుల్లో కాస్త అసహనాన్ని రగిలిస్తోందట. వీటితో పాటు ప్రతి ఏటా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ల విషయంలో కొందరికి తక్కువగా చెల్లించడం వంటి కారణాలతో సంస్థపై వారికున్న నమ్మకం సన్నగిల్లుతోంది. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, ఆర్థిక సంక్షోభం ఎదురుకానున్న నేపథ్యంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి.
అందుకే మెటా, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ సిబ్బంది ఇంటికి పంపుతున్నాయి. ఇదే దారిలో ప్రస్తుతం చాలా కంపెనీలు పాటిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కంపెనీలపై ఉండే నమ్మకం క్రమక్రమంగా దెబ్బతింటున్నట్లు సర్వే పేర్కొంది.
చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!
Comments
Please login to add a commentAdd a comment