ట్విటర్ కొనుగోలు తర్వాత అందులో భారీ మార్పులకు పూనుకున్నాడు ఎలాన్ మస్క్. కంపెనీ నష్టాలను తగ్గించుకోవడం కోసం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడం అప్పట్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల తొలగింపు మొదలుపెట్టిన మస్క్ భవిష్యత్తులో వాటి వల్ల ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ప్రస్తుత పరిణామలు చూస్తుంటే ఈ టెస్లా అధినేత తాజాగా మరో చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది.
మా పరిస్థితి ఏంటి.. ఉద్యోగుల అసహనం
నవంబర్ 4న, 2022 కంపెనీ ఎలాన్ మస్క్ నియంత్రణలోకి వచ్చిన వారం తర్వాత, ట్విటర్‌లో పని చేస్తున్న 7వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఉద్యోగుల నోటీస్ పీరియడ్ ముగిసింది.
సంస్థలో తొలగించిన కొందరి ఉద్యోగుల ప్రకారం.. నోటీస్ పీరియడ్ ముగింపు అనంతరం మాకు రావాల్సిన ప్యాకేజీలపై కంపెనీ ఇంత వరకు స్పందించలేదని తెలిపారు. ఈ అంశంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్విటర్ కొత్త యాజమాన్యానికి చట్టపరంగా మరింత చిక్కులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
కాగా.. ‘ తొలగిస్తున్న ఉద్యోగులకు 3 నెలల జీతం అందిస్తామని’ మస్క్ గతంలో ట్వీట్ చేశాడు. అయితే మస్క్ నుంచి కూడా దీని గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. మరో వైపు ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు, సాఫ్ట్‌వేర్ సేవలు, శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయాలలో అద్దెతో సహా చెల్లించని బిల్లులపై ఇప్పటికే ట్విటర్ అనేక దావాలను ఎదుర్కొంటుంది.
చదవండి ట్రైన్ జర్నీ వాయిదా, తేదీని మార్చుకోవాలా?.. ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు!
Comments
Please login to add a commentAdd a comment