ప్రముఖ మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి ఉద్యోగాల కోతలు ఉంటాయన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇది వరకే భారీగా తమ సిబ్బందిని తొలగించిన ట్విటర్.. మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మిగులు కార్యాలయ వస్తువులను కూడా వేలం వేస్తోందట. మరోవైపు అనేక ట్విట్టర్ కార్యాలయాల యజమానులకు మస్క్ అద్దె చెల్లించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో మస్క్ యాజమాన్యంలోని ట్విటర్ తమ సిబ్బందిపై వేటు వేసి ఖర్చ తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌కు సీఈఓగా బాధత్యలు చేపట్టినప్పటినుంచి అందులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన సంస్థను చేజిక్కించుకున్న మొదట్లో నష్టాలను తగ్గించుకోవడానికై 7,500 మంది ఉద్యోగులు ఉండగా సగానికిపైగా మందిని తొలగించారు. తాజాగా మరోసారి సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ సంఖ్యను 2000 దిగువకు కుదించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అధికారులకు మస్క్ ఆదేశాలు జారీ చేశారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. కేవలం ట్విట్టర్ మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు ఆర్థికపరమైన నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి.
చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్!
Comments
Please login to add a commentAdd a comment