ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చారు.మరో సారి ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్స్ తర్వాత పనిచేసే ఉద్యోగులకు అందించే ప్రోత్సహాకాలపై కోత విధించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ది వెర్జ్ కథనం ప్రకారం..ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ ఉద్యోగులకు ఇంట్రర్నల్ మెమో పంపించినట్లు తెలుస్తోంది. ఆ నోటీసుల్లో ఉద్యోగుల పనితీరు గమనించేందుకు వారం వారం వర్క్ రిపోర్ట్ అందించాలని తెలిపారు.టెక్నికల్ టీం ఉద్యోగులు వారి చేసిన శాంపిల్ వర్క్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు విధులకు సంబంధించిన సమ్మరీని అందించాలని మస్క్ ఆదేశించినట్లు ది వెర్జ్ డిప్యూటీ ఎడిటర్ అలెక్స్ హీత్‌కు అందిన మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రోత్సాహకాలపై కత్తెర
ఇక అదే నోటీసుల్లో మస్క్ మరో అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. సంస్థ ఉద్యోగులకు అందించే అవుట్ స్కూల్,డేకేర్, క్వార్టల్లీ టీం యాక్టివిటీస్,వెల్‌నెస్, ఇంట్లో ఇంటర్నెట్‌లను తొలగించనున్నట్లు మస్క్ చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment