perks
-
‘మాకు ఓ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే చూడరా’.. వీడియో వైరల్!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వాళ్లకి ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని నిలిపివేస్తున్నాయి (గూగుల్ ఆపని ఎప్పుడో చేసింది). ఈ తరుణంలో ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులతో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుంది? తమకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే విషయాల్ని వెల్లడించారు. ఆ వీడియోలో ఆహ్లదకరమైన క్యాంపస్, ఫ్రీ స్నాక్స్, ఎన్ఏపీ రూమ్, పని చేసేందుకు అనువైన వాతావరణం ఉన్నాయంటూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు చెప్పారు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్‌లో సిబ్బంది కోసం సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన క్యాంపస్‌లో హైటెక్ భద్రతా వ్యవస్థలతో మూడు భవనాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by twosisterslivingtheirlife (@twosisterslivingtheirlife) ఆఫీస్‌లోని ప్రతి ఫ్లోర్లో కాఫీ, టీ, పండ్లు, డ్రింక్స్‌తో పాటు ఇతర వంటలను ఆరగించేందుకు భారీ కిచెన్ రూములు, రెస్ట్ తీసుకునేందుకు గదులు సైతం ఉన్నాయంటూ ఉద్యోగులు వర్క్ ప్లేస్ గురించి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రీల్‌కు మైక్రోసాఫ్ట్ స్పందించింది. ఉద్యోగులు వీడియో సంపూర్ణంగా ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ని షేర్ చేసింది. అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్లు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయగా ఉంది. మాకు కూడా మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్ ఉన్నాయా? మేం చేరుతాం అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సిబ్బంది మాత్రం మేం క్యాంపస్ వాతావరణాన్ని కోల్పోతున్నామని నిట్టూర్చుతున్నారు. -
ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఫిట్నెస్ క్లాసుల్ని రద్దు చేసింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ కాఫీలను సగానికి పైగా తగ్గించింది. ఇలా ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ఆయా కంపెనీలు కాస్ట్ కటింగ్‌కు పదును పెడుతున్నాయి. ఈ కాస్ట్ కటింగ్ ఒక్క గూగుల్, గోల్డ్ మన్ సాచ్చ్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు సైతం ప్రొత్సహాకాల్ని తగ్గించే పనిలో పడ్డాయి. తాజాగా గ్రేప్‌వైన్ అనే స్టార్టప్ సంస్థ ఉద్యోగులకు అందించే సౌకర్యాల్ని సగానికి పైగా తగ్గిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సిబ్బంది సంస్థ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Cost cutting measures by companies thread is incredibly funny A few top replies: - Handwash in washrooms diluted with water - Oreos in cafeteria replaced with Parle G - Plastic water bottles were given as year end gift - Employees had to pay Rs 2500 fine for lost Dell Mouse pic.twitter.com/xDARBMC7pI — Grapevine - Corporate Chat India (@anonCorpChatInd) April 14, 2023 మార్కెటింగ్ కంపెనీ మోఎంగేజ్ భోజన సమయంలో వడ్డించే ప్లేట్ల సంఖ్య, బీర్ బాటిళ్లపై పెట్టే ఖర్చును ఆదా చేసేందుకు బెంగళూరులో జరిగే సంస్థ ఈవెంట్‌కు హాజరుకావద్దని తన ఉద్యోగులను కోరుతున్నట్లు ఓ యూజర్ కంపెనీల్లో కాస్ట్ కటింగ్స్‌పై చర్చించారు. దీంతో మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కాస్ట్ కటింగ్ గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిలో అమెజాన్ ఇండియాలో పనిచేసే ఓ ఉద్యోగి మాట్లాడుతూ..డబ్బుల్ని పొదుపు చేసేందుకు ఉద్యోగులందరికీ అందించే పర్సనల్ డస్ట్బిన్లను తొలగించి వాటి స్థానంలో అందరూ వినియోగించేందుకు ఒక పెద్ద డస్ట్ బిన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంస్థ దీపావళి రోజున ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదంటూ పూణేకి చెందిన ఓ ఫిట్నెస్ స్టార్టప్ లో పనిచేసే ఓ ఉద్యోగి మొరపెట్టుకున్నాడు. స్వీట్ బాక్స్ కాదు కదా.. తమ కంపెనీలు దీపావళి బహుమతులు లేదా బోనస్‌లు ఇవ్వడం మానేశాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి తమ సంస్థ దీపావళి లేదా ఇతర పండుగల సెలబ్రేషన్ల కోసం మా వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. తాను 7.5 ఏళ్ల క్రితం ఆర్గనైజేషన్‌లో చేరినప్పుడు కంపెనీ ఓ మౌస్ ఇచ్చింది. ఆ మౌస్ పోగొట్టానని రూ.2,500 చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మరో ఉద్యోగి మాట్లాడుతూ తమ సంస్థ హ్యాండ్‌వాష్ కోసం ట్యాప్ వినియోగించవద్దని, మగ్ నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. మరో సంస్థ ఓరియో బిస్కెట్ స్థానంలో బ్రిటానియా 50-50 మస్కా చస్కాతో భర్తీ చేసింది అని ఒక ఉద్యోగి చెప్పగా.. మా ఆఫీస్‌లో టిష్యూ పేపర్లు లేవు. చేతి రూమాలు ఉపయోగించుకోవాలని చెప్పినట్లు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. -
గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్, లంచ్, మసాజ్, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్‌ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్‌ట్యాప్‌లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్‌లో కనిపించే ట్రెండ్ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మైక్రో కిచెన్ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక హైలెట్ చేసింది. కొన్ని సర్ధుబాట్లు తప్పవ్ ఇక తాజా గూగుల్ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్మోడోకి చెప్పారు. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ మరో భారీ షాక్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చారు.మరో సారి ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్స్ తర్వాత పనిచేసే ఉద్యోగులకు అందించే ప్రోత్సహాకాలపై కోత విధించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ది వెర్జ్ కథనం ప్రకారం..ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ ఉద్యోగులకు ఇంట్రర్నల్ మెమో పంపించినట్లు తెలుస్తోంది. ఆ నోటీసుల్లో ఉద్యోగుల పనితీరు గమనించేందుకు వారం వారం వర్క్ రిపోర్ట్ అందించాలని తెలిపారు.టెక్నికల్ టీం ఉద్యోగులు వారి చేసిన శాంపిల్ వర్క్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు విధులకు సంబంధించిన సమ్మరీని అందించాలని మస్క్ ఆదేశించినట్లు ది వెర్జ్ డిప్యూటీ ఎడిటర్ అలెక్స్ హీత్‌కు అందిన మెమోలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రోత్సాహకాలపై కత్తెర ఇక అదే నోటీసుల్లో మస్క్ మరో అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. సంస్థ ఉద్యోగులకు అందించే అవుట్ స్కూల్,డేకేర్, క్వార్టల్లీ టీం యాక్టివిటీస్,వెల్నెస్, ఇంట్లో ఇంటర్నెట్లను తొలగించనున్నట్లు మస్క్ చెప్పినట్లు తెలుస్తోంది. -
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ( డిఎంఆర్సి ) నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలనుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్లు మంగళవారం డిఎంఆర్సి ఒక ఉత్తర్వులో పేర్కొంది. మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినందున ఉద్యోగుల జీతంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో డిఎంఆర్సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు ఐదు నెలలుగా మెట్రో సేవలు నిలిచిపోయినందున తీవ్ర ఆర్థిక భారం నేపథ్యంలో ఉత్యోగుల జీతభత్యాలను 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. (రూ.3,756 కోట్లు ప్లీజ్) ఢిల్లీ మెట్రో రైలు ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను తదుపరి ఉత్తర్వుల వరకు నిషేధించారు. అయితే ఇప్పటికే అనుమతి పొందిన వారికి మాత్రమే అడ్వాన్సులు ఇస్తారు. అయితే మెట్రో ఉద్యోగులు వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలను ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు. దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో మినహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో మెట్రో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో గతంలో రైల్వే కార్పేరేషన్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి తీసుకున్న 35,198 కోట్ల రుణాన్ని ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి చెల్లించడం సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే ఏడాది వరకు రుణాన్ని వాయిదా వేయాలని డిఎంఆర్సి గత నెలలోనే లేఖ రాసింది. ఈ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1242.83 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించాల్సి ఉందని డిఎంఆర్సి అధికారి ఒకరు వెల్లడించారు. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్ ) -
ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ!
పారిస్ః ఈఫిల్ టవర్ ప్రాంతం ధ్యానసాధకులతో నిండిపోయింది. రెండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొని ధ్యానంలో మునిగిపోయారు. ఇండియన్ ఎంబసీ నిర్వహించిన యోగా కార్యక్రమం ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్త పండుగగా జరుపుకుంటున్న యోగా దినోత్సవం నాడు పారిస్ లోని ఈఫిల్ టవర్ ప్రాంతం యోగ సాధకులతో సందడి చేసింది. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఆదివారం పారిస్ లో నిర్వహించిన వేడుకలో సుమారు 300 కు పైగా యోగా ప్రియులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకలో పాల్గొన్న వారితో పారిస్ లోని శివానంద యోగా సెంటర్ కు చెందిన అధ్యాపకులు... ప్రత్యేక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు.