ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ! | Yoga festival at Eiffel Tower perks up Paris | Sakshi
Sakshi News home page

ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ!

Published Thu, Jun 23 2016 6:06 PM | Last Updated on Thu, Jul 11 2019 6:20 PM

ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ! - Sakshi

ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ!

పారిస్ః ఈఫిల్ టవర్ ప్రాంతం ధ్యానసాధకులతో నిండిపోయింది. రెండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొని ధ్యానంలో మునిగిపోయారు. ఇండియన్ ఎంబసీ నిర్వహించిన యోగా కార్యక్రమం ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది.

ప్రపంచ వ్యాప్త పండుగగా జరుపుకుంటున్న యోగా దినోత్సవం నాడు పారిస్ లోని ఈఫిల్ టవర్ ప్రాంతం యోగ సాధకులతో సందడి చేసింది. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఆదివారం పారిస్ లో నిర్వహించిన వేడుకలో  సుమారు 300 కు పైగా యోగా ప్రియులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకలో పాల్గొన్న వారితో పారిస్ లోని శివానంద యోగా సెంటర్ కు చెందిన అధ్యాపకులు... ప్రత్యేక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement