ప్యారిస్: సుందర కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్‌ప్యారిస్‌లో ఉన్న ఈ టవర్‌కు శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలో దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు అమర్చామంటూ బెదిరించారు.
దీంతో హుటాహుటినా టవర్లలోని ఫ్లోర్‌లన్నింటిని ఖాళీ చేయించారు అధికారులు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించగా.. కిందటి ఏడాది 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు.
FRANCE 🇫🇷 The Eiffel Tower has been evacuated due to a bomb threat. This is developing.
— Forever Trumper (@FanaTeresafana) August 12, 2023
They don’t seem to be in much of a hurry evacuating. Hmmmm pic.twitter.com/Iabb9SqdXY
Comments
Please login to add a commentAdd a comment